reopen
-
రవీంద్ర నాట్య మందిర్ పునఃప్రారంభం
ముంబై: కళాకారులు, రంగస్థలనటులకు ప్రీతిపాత్రమైన రవీంద్ర నాట్య మందిర్ ఆడిటోరియం, పీఎల్ దేశ్‌పాండే మహారాష్ట్ర కళా అకాడమీ తిరిగి ప్రారంభం కానున్నాయి. పునరుద్ధరణ పనులు పూర్తైన నేపథ్యంలో ఫిబ్రవరి 28న జరిగే పునఃప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ శిందే, అజిత్ పవార్లు హాజరుకానున్నారని ఈ సందర్భంగా అకాడమీ కొత్త చిహ్నం ఆవిష్కరణ కూడా జరుగుతుందని ఓ అధికారి తెలిపారు. ‘రీఓపెన్’ఆర్ట్స్’ కమ్యూనిటీకి కొత్త ఉదయం– మంత్రి ఆశిష్ షెలార్ ఈ సందర్భంగా సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఆశిష్ షెలార్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో అభివృద్ధి చెందుతున్న థియేటర్, ఆర్ట్స్ కమ్యూనిటీకి ఈ కార్యక్రమం ‘కొత్త ఉదయాన్ని‘ తెస్తుందని అన్నారు. అకాడమీతో తరతరాలుగా కళాకారులను, వారిలోని ప్రతిభకు మెరుగులద్దుతూనే ఉన్నామని , దీన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తామని స్పష్టంచేశారు. పునరుద్ధరించిన రవీంద్ర నాట్య మందిర్‌లో అధునాతన సౌండ్ సిస్టమ్స్, రిఫైన్డ్ ఇంటీరియర్స్, రెండు చిన్న థియేటర్లు, ఐదు ఎగ్జిబిషన్ హాళ్లు, ఆరి్టస్టుల కోసం 15 రిహార్సల్ రూమ్‌లు, గ్రాండ్ ఓపెన్–ఎయిర్ స్టేజ్, వర్చువల్ చిత్రీకరణ, సౌండ్ రికార్డింగ్, డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్ కోసం స్టూడియోలు ఏర్పాటు చేశామని ఉన్నాయని మంత్రి తెలిపారు. అకాడమీలో త్వరలో వివిధ కళారూపాలకు సంబంధించి 20 సరి్టఫికెట్, డిప్లొమా కోర్సులను కూడా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. -
అగ్నికి ఆహుతై.. ఐదేళ్ల తర్వాత తెరుచుకున్న అందమైన చర్చి
నోట్రే డామ్ క్యాథలిక్ చర్చి.. ఇది ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లోగల ఒక ప్రధాన క్యాథలిక్ చర్చి. దీనిని నోట్రే డామ్ కేథడ్రల్ అని కూడా పిలుస్తారు. ఐదేళ్ల క్రితం ఈ చర్చిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎగసిపడిన మంటల కారణంగా చర్చి తీవ్రంగా దెబ్బతింది.నోట్రే డామ్ క్యాథలిక్ చర్చి ప్రత్యేక నిర్మాణశైలి, మతపరమైన ప్రాముఖ్యత, చారిత్రక సంఘటనల పరంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ చర్చిని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు పారిస్‌కు తరలి వస్తుంటారు.నోట్రే డామ్ నిర్మాణం 12వ శతాబ్దంలో ప్రారంభమై, 14వ శతాబ్దంలో పూర్తయింది. చర్చి గోపురం గోతిక్ శైలిలో నిర్మితమయ్యింది. ఇది ఆకాశం అంత ఎత్తుకు ఉన్నట్లు కనిపిస్తుంది.ఈ చర్చి నిర్మాణాన్ని 1163లో బిషప్ మారిస్ డి సుల్లీ చేపట్టారు. 1345లో ఈ చర్చిని ప్రారంభించారు. చర్చి వెలుపలి భాగంలో ఉన్న గార్గోయిల్లు ప్రత్యేకమైన శిల్పశైలిలో కనిపిస్తాయి.నోట్రే డామ్ కాథలిక్ చర్చి క్యాథలిక్ మతాన్ని అనుసరించేవారికి ఒక ముఖ్యమైన మతపరమైన ప్రదేశం. ఇక్కడ తరచూ మతపరమైన వేడుకలు జరుగుతుంటాయి.ఈ చర్చి కేవలం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు. చరిత్ర, కళ, సంస్కృతికి చిహ్నంగానూ నిలిచాయి. ఈ చర్చి నెపోలియన్ పట్టాభిషేకం, జోన్ ఆఫ్ ఆర్క్ పునరుద్ధరణలాంటి పలు చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచింది.2029, ఏప్రిల్ 15న నోట్రే డామ్ చర్చిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో చర్చి ప్రధాన గోపురం, పైకప్పు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తదనంతరం చర్చికి మరమ్మతులు చేపట్టారు. అదే రీతిలో పునర్నిర్మించడానికి సమయం పట్టింది.ఈ చర్చి విశిష్ట వాస్తుశిల్పం, చారిత్రక ప్రాముఖ్యత రీత్యా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారింది. అగ్ని ప్రమాదం తర్వాత పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాక చర్చి ఇప్పుడు తిరిగి అద్భుతమైన రూపంలో కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: అత్యంత ప్రజాదరణపొందిన వెడ్డింగ్ డెస్టినేషన్స్ -
శతాబ్దాల ఖ్యాతి.. సమున్నతం
ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో 861 సంవత్సరాల చరిత్ర కలిగిన నోట్రే డామ్ చర్చి మళ్లీ పునరుజ్జీవనం చెందింది. ఐదేళ్ల క్రితం భారీ అగ్నిప్రమాదంలో పాక్షిక్షంగా ధ్వంసమై కోట్లాది క్రైస్తవ భక్తుల్లో ఆవేదన మిగిల్చిన ఈ చర్చి మళ్లీ ప్రార్థనలకు సిద్ధమైంది. అప్పట్లో దీని పూర్తి నిర్మాణానికి ఏకంగా 200 ఏళ్లు పట్టిందని చెబుతారు. విభిన్నమైన డిజైన్, విశిష్ట నిర్మాణ శైలికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ చర్చికి మళ్లీ ఆ రూపం తేవడం చాలా కష్టమని నిర్మాణ రంగ నిపుణులే పెదవి విరిచారు. అయినా ఫ్రాన్స్ ప్రభుత్వం వెరవకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన చర్చికి ప్రాణప్రతిష్ట చేసింది. కేవలం ఐదేళ్లలో ఏకంగా రూ.6,350 కోట్ల భారీ వ్యయంతో నాణ్యతో రాజీ పడకుండా అదే స్థాయిలో పునరుద్ధరించింది. శనివారం చర్చి పునఃప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, బ్రిటన్ యువరాజు విలియంసహా దాదాపు 50 దేశాలకు చెందిన అధి పతులు, రాజులు, సెలబ్రిటీలు, వివిధ దేశాల నుంచి 170 మంది బిషప్‌లు, ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. రికార్డు సమయంలో చర్చిని అందుబాటులోకి తేవడంలో కార్మికుల అంకితభావం దాగుందని మేక్రాన్ జాతి నుద్దేశించి ప్రసంగంలో చెప్పారు. కోర్సియా పర్యటనలో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఈ కార్యక్రమంలో పాల్గొన లేదు. 2,000 మంది నిపుణులతో.. 2019 ఏప్రిల్ 15న ఘోర అగ్నిప్రమాదంలో చర్చి పై కప్పు, శిఖరం, అంతర్గత దారు నిర్మాణాలన్నీ కాలి బూడిదయ్యాయి. షాట్ సర్క్యూటో, కాల్చేసిన సిగరెట్ పీకో ఇందుకు కారణమంటారు. చర్చి పునఃనిర్మాణ వ్యయాన్ని భరిస్తామంటూ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ముందుకొచ్చారు. వేలాది కోట్ల విరాళాలిచ్చారు. చర్చి నిర్మాణ ఖర్చంతా ఇలా సమకూరిందే! పునర్నిర్మాణ క్రతువులో ఏకంగా 2,000 మంది నిపుణులు భాగస్వాములయ్యారు. అత్యంత నాణ్యమైన కలపను ఇచ్చే 2,000 ఓక్ చెట్ల నుంచి సేకరించిన కలపను ఈ నిర్మాణంలో వాడారు. భారీ సంగీత విభావరితో.. చర్చి ప్రారంభోత్సవంలో భాగంగా ప్రముఖ సంగీతకళాకారులతో భారీ సంగీత విభావరి నిర్వహించారు. ఒపెరా గాయకులు ప్రెటీ యేండీ, జూలీ ఫచ్, పియానిస్ట్ లాంగ్ లాంగ్ తదితరుల ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది. పారిస్‌లోని సీన్ నదీ తీరం వెంట ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ తెరల్లో కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారంచేశారు. ప్రత్యక్షంగా 40,000 మంది, పరోక్షంగా కోట్లాది మంది వాటిని వీక్షించనున్నారు. ఆరుబయట కార్యక్రమం నిర్వహిద్దామనుకున్నా భారీ ఈదురుగాలుల వల్ల లోనికి మార్చారు. ఆదివారం నుంచి చర్చిలో ప్రార్థనలను అనుమతిస్తారు.సామ్యవాదంతో సంబంధం మతసంబంధ ప్రదేశంగా మాత్రమే గాక ఫ్రాన్స్ రాజకీయాలతోనూ నోట్రేడామ్ చర్చి ముడిపడి ఉంది. ఫ్రెంచ్ విప్లవానికి, రెండు ప్రపంచయుద్ధాలకు ఇది సజీవ సాక్షి. 1302లో రాజు నాలుగో ఫిలిప్ ఎస్టేట్ చట్టాన్ని ఈ చర్చిలోనే చర్చించి ఖరారు చేశారు. పన్నులు, రాజ్య పరిపాలనపై ఇక్కడే నిర్ణయాలు జరిగాయి. రోడ్లన్నీ రోమ్‌కే దారి తీస్తాయి (ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్) అనే సామెతకూ ఈ చర్చే మూలం. రోమన్ సామ్రాజ్యంలో రోడ్లన్నీ ఈ చర్చి సమీపంగా వెళ్లాలని చక్రవర్తి అగస్టస్ ఆదేశించారు. ప్రత్యేకతలెన్నో..→ పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల్లో నోట్రేడామ్ చర్చి ఒకటి. → ఫ్రాన్స్ చరిత్ర, సాంస్కృతిక వైభవంలో ఈ చర్చిది కీలక పాత్ర. → దీన్ని ఏటా ఏకంగా 1.3 కోట్ల మంది విదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు. → ఈఫిల్ టవర్ కంటే ఈ చర్చిని చూడ్డానికి పారిస్‌లో అడుగుపెట్టేవాళ్లే ఎక్కువ. → సీన్ నదిలో అత్యంత చిన్న ద్వీపమైన ‘ ది లే డీ లా సిట్’లో ఈ అద్భుత చర్చి నిర్మాణాన్ని నాటి బిషప్ మారీస్ డి సలీ ఆదేశాల మేరకు 1163లో పూర్తి చేశారు. → 64 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ చర్చి 12వ శతాబ్దం దాకా యూరప్ ఖండంలో అతి పెద్ద మానవ నిర్మాణం. → మేరోవియన్, కారోవియన్, రోమన్ల, గోథిక్ నిర్మాణ శైలిలో దీనిని కట్టారు. → మన తల కంటే ముంజేయి పొడవు సరిగ్గా 1.61803399 రెట్లు పెద్దగా ఉంటుందని గణిత సూత్రం. దీన్నే గోల్డెన్ రేషియో అంటారు. → చర్చి నిర్మాణంలో ఈ గణిత సూత్రాన్ని అణువణువునా వాడారు. చర్చిలో అంతర్నిర్మాణాల మధ్య కూడా ఇవే కొలతలను పాటించడంతో ఏ వైపు నుంచి చూసినా చర్చి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెరుచుకున్న జార్ఖండ్- బెంగాల్ సరిహద్దు
కోల్‌కతా/రాంచీ: పశ్చిమ బెంగాల్-జార్ఖండ్ సరిహద్దు దాదాపు 24 గంటల తరువాత తెరుచుకుంది. అంతర్రాష్ట్ర వాణిజ్యం కోసం ట్రక్కుల తరలింపును ఉద్దేశిస్తూ సరిహద్దును తిరిగి తెరిచారు. పశ్చిమ బెంగాల్లో వరదలకు జార్ఖండ్‌లోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కారణమని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఆ దరిమిలా పశ్చిమ బెంగాల్- జార్ఖండ్ సరిహద్దును మూడు రోజుల పాటు మూసివేయాలంటూ మమత అధికారులను ఆదేశించారు. దీంతో గురువారం సాయంత్రం ఈ రెండు రాష్ట్రాల సరిహద్దును మూసివేశారు.జార్ఖండ్ ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా మీడియాతో మాట్లాడుతూ అంతర్ రాష్ట్ర సరిహద్దు తెరుచుకుందని, ఎన్‌హెచ్ -2, ఎన్‌హెచ్-5 వేలాది ట్రక్కులు పశ్చిమ బెంగాల్‌కు బయలుదేరాయని తెలిపారు. అయితే అయితే సరిహద్దు వద్ద 20 నుంచి 25 కిలోమీటర్ల పొడవైన క్యూలో ట్రక్కులు ఉన్నాయని, ఇవి ముందుకు కదిలేందుకు కొంత సమయం పడుతుందన్నారు.జార్ఖండ్‌ను సురక్షితంగా ఉంచేందుకు డీవీసీ తన డ్యామ్‌ల నుండి నీటిని విడుదల చేయడం వల్లే తమ రాష్ట్రంలో వరద పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే జార్ఖండ్ నుండి పశ్చిమ బెంగాల్‌కు వచ్చే భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు. కాగా న్యూఢిల్లీకి చెందిన సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యుపీ) సూచనల మేరకు నీటిని విడుదల చేశామని, అయితే ఇప్పుడు దానిని నిలిపివేసినట్లు డీవీసీ అధికారి ఒకరు తెలిపారు.ఇది కూడా చదవండి: హర్యానా కాంగ్రెస్‌లో అంతర్గత పోరు -
నెల తర్వాత తెరుచుకున్న బంగ్లా బడులు
ఢాకా: బంగ్లాదేశ్‌లో నెల రోజులకు పైగా మూతబడిన విద్యాసంస్థలు ఆదివారం మళ్లీ తెరుచుకున్నాయి. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడం, ప్రధాని హసీనా గద్దె దిగడం వంటి పరిణామాల మధ్య దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు సహా అన్ని విద్యాసంస్థలు జూలై 17వ తేదీ నుంచి మూతబడ్డాయి. ప్రధాన సలహాదారు మహ్మద్ యూనుస్ సారథ్యంలో ఇటీవల తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెల్సిందే. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో..‘ప్రధాన సలహాదారు యూనుస్ ఆదేశాల మేరకు ఆగస్ట్ 18వ తేదీ నుంచి అన్ని విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించాలని సంబంధిత వర్గాలను కోరుతున్నాం’అంటూ 15వ తేదీన విద్యాశాఖ డిప్యూటీ కార్యదర్శి మొసమ్మత్ రహీమా అక్తర్ పేరిట ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆదివారం ఉదయం యూనిఫాం ధరించిన స్కూలు విద్యార్థులు విద్యాసంస్థలకు చేరుకోవడం కనిపించింది. రాజధాని ఢాకాలోని చాలా ప్రాంతాల్లో ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగిపోయింది. బంగ్లాదేశ్‌లో పాఠశాలలు ఆదివారం నుంచి గురువారం వరకు పనిచేస్తాయి. -
30 ఏళ్లకు తెరుచుకున్న ఉమా భగవతి ఆలయం
జమ్ముకశ్మీర్‌లోని ఉమా భగవతి దేవి ఆలయాన్ని 30 ఏళ్ల తరువాత తెరిచారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమక్షంలో ఆలయాన్ని తెరవడంతో పాటు పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో గల షాంగస్ ప్రాంతంలో ఈ పురాతన ఆలయం ఉంది.మూడు దశాబ్దాల తర్వాత ఆలయంలోకి భక్తులు ప్రవేశించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన ఉమా దేవి విగ్రహాన్ని వేదమంత్రాల నడుమ గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఆలయ పునరుద్ధరణపై స్థానిక కశ్మీరీ పండిట్లు, ముస్లింలు సంతోషం వ్యక్తం చేశారు. స్థానికుడు గుల్జార్ అహ్మద్ మాట్లాడుతూ ‘మా పండిట్ సోదరులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. ఇన్నాళ్ల తర్వాత ఆలయంలో పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు.కశ్మీరీ పండిట్లు తెలిపిన వివరాల ప్రకారం 1990లో ఈ ఆలయం ధ్వంసమైంది. దీని వెనుక పలు కారణాలున్నాయి. 1990లలో ఉగ్రవాదులు అలజడి కారణంగా కశ్మీరీ పండిట్లు ఈ ప్రాంతం నుండి పారిపోయారు. 2019 తర్వాత కశ్మీర్లో ఉగ్రవాదుల అలజడులు తగ్గాయి. ఈ నేపధ్యంలో గతంలో తీత్వాల్ వద్దనున్న మాతా శారదా ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు. యూటీ అడ్మినిస్ట్రేషన్ స్మార్ట్ సిటీ మిషన్ కింద శ్రీనగర్‌లోని పలు దేవాలయాలతో సహా మతపరమైన ప్రదేశాలను ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. -
ఏపీలో పాఠశాలలు పునః ప్రారంభం
-
తెలంగాణలో మోగిన బడిగంట
-
తెలంగాణలో మోగిన బడి గంట.. ఆర్టీఏ అలర్ట్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో బడి గంట మోగింది. వేసవి సెలవుల అనంతరం గవర్నమెంట్, ప్రైవేట్ బడులన్నీ తెరుచుకున్నాయి. మరోవైపు విద్యాసంస్థల ప్రారంభం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ ఉదయం నుంచి అన్ని స్కూల్స్, కాలేజీల బస్సుల ఫిట్నెస్లను పరిశీలిస్తున్నారు. ఫిట్‌గా లేని బస్సులు, వ్యాన్లను సీజ్ చేస్తున్నారు. మరోవైపు.. ఇవాళ్టి నుంచి బడులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. నిన్ననే స్పెషల్ డ్రైవ్ పేరిట చెకప్ లిస్ట్ పంపించారు అధికారులు. అయినా కొన్ని విద్యా సంస్థలు బస్సులు, వ్యాన్లను ఆర్టీఏ కార్యాలయాలకు ఫిట్నెస్ టెస్టులకు పంపలేదు. దీంతో అధికారులే రంగంలోకి దిగి దాడులు నిర్వహిస్తున్నారు. ఇక.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బడిబాట ప్రారంభమైంది. జూన్ 19వ తేదీ వరకు కొనసాగనున్న బడిబాటలో భాగంగా.. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివితే వచ్చే విద్యా, అవకాశాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించనున్నారు. -
ఏపీలో స్కూల్స్ రీ-ఓపెన్ తేదీ పొడిగింపు ఉత్తర్వులు జారీ
అమరావతి, సాక్షి: వేసవి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పాఠశాలల పునఃప్రారంభ తేదీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో రేపు కాకుండా.. ఎల్లుండి(జూన్13న) పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఏటా జూన్ 12 వ తేదీన పాఠశాలలు తెరుచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో ఒక్కరోజు సెలవును పొడిగించింది విద్యాశాఖ. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉండగా.. ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమం మళ్లీ ప్రారంభం
-
రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. 2016 జనవరి 17వ తేదీన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి రోహిత్‌వేముల ఆత్మహత్యపై గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి శుక్రవారం పలు ఎల్రక్టానిక్, సోషల్ మీడియా చానళ్లలో రకరకాల వార్తలు, కథనాలు ప్రస్తారమయ్యాయి. దీనిపై స్పందించిన డీజీపీ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ‘ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా మాదాపూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన తుది నివేదిక గత సంవత్సరం అంటే నవంబర్ 2023 కన్నా ముందే నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా తయారు చేశారు. ఆ తుది నివేదికనే అధికారికంగా 21.03.2024న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంబంధిత కోర్టులో దాఖలు చేశారు. అయితే విచారణ, విచారణ జరిగిన విధానంపై రోహిత్ వేముల తల్లితోపాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో కేసు విషయంలో మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించామని, తదుపరి దర్యాప్తును అనుమతించాలని మేజి్రస్టేట్‌ను అభ్యర్థిస్తూ సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం’అని డీజీపీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
పటిష్ట భద్రత మధ్య తెరుచుకున్న రామేశ్వరం కేఫ్
కర్నాటకలోని బెంగళూరులో గల రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగి వారం రోజులు దాటింది. తాజాగా కట్టుదిట్టమైన భద్రత మధ్య రామేశ్వరం కేఫ్‌ను తిరిగి తెరిచారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కేఫ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేఫ్‌లో జరిగిన పేలుడులో 10 మంది గాయపడ్డారు. కేఫ్‌ను శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు తెరిచారు. అయితే శనివారం నుంచి వినియోగదారులకు సేవలు అందించనున్నారు. కస్టమర్లను తనిఖీ చేయడానికి కేఫ్ ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. వినియోగదారుల అనుమానాస్పద కార్యకలాపాలపై కేఫ్ సిబ్బంది దృష్టి సారించనున్నారు. రామేశ్వరం కేఫ్ సహ వ్యవస్థాపకులు రాఘవేంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ‘ఏదైతే జరగకూడదని భావించామో అదే జరిగింది. మరింత భద్రతతో ఉండేందుకు ఇదొక పాఠం. శివుని ఆశీస్సులతో మహాశివరాత్రి సందర్భంగా మా కేఫ్‌ను తిరిగి ప్రారంభించాం. శనివారం జాతీయ గీతం ప్లే చేస్తూ రెస్టారెంట్‌ను కస్టమర్ల కోసం తెరుస్తాం’ అని తెలిపారు. కాగా కేఫ్‌ను పూలతో అలంకరించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. #WATCH | Bengaluru, Karnataka: Checking of the customers being done at the Rameshwaram cafe. The cafe has reopened for people, 8 days after the blast. pic.twitter.com/kwclTU4ksE — ANI (@ANI) March 9, 2024 -
ఢిల్లీ సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు
రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను దృష్టిలో ఉంచుకుని దాదాపు రెండు వారాల పాటు ఢిల్లీ-హరియాణా సరిహద్దుల్లోని సింఘు, తిక్రీ సరిహద్దు క్రాసింగ్లను మూసివేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు కుదుటపడటంతో అధికారులు వాటిని పాక్షికంగా తెరిచే ప్రక్రియను ప్రారంభించారు. వాహనాల రాకపోకలకు వీలుగా సింఘు సరిహద్దు రహదారి ‘సర్వీస్ లేన్’, తిక్రీ సరిహద్దు రహదారికి చెందిన ఒక లేన్ తెరుస్తున్నామని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ నిర్ణయంతో ఢిల్లీ నుండి హరియాణాకు వెళ్లే ప్రయాణికులకు గొప్ప ఉపశమనం లభించింది. పంటలకు కనీస మద్దతు ధర హామీతో పాటు వ్యవసాయ రుణాల మాఫీ తదితర డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను ప్రారంభించారు. దీంతో ఈ రెండు సరిహద్దు మార్గాలను ఫిబ్రవరి 13న మూసివేశారు. ఈ నెలాఖరు వరకు తమ పాదయాత్రను నిలిపివేస్తామని నిరసన తెలుపుతున్న రైతులు ప్రకటించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని ఆ పోలీసు అధికారి తెలిపారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటామని, అవసరమైతే సరిహద్దులను మళ్లీ మూసివేస్తామని ఆయన అన్నారు. కాగా కుండ్లీ సరిహద్దు రహదారిలో సర్వీస్ లేన్ తెరిచారు. దీంతో ఢిల్లీ వెళ్లే వాహనదారులకు ఉపశమనం లభించింది. -
ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు
దేశరాజధాని ఢిల్లీలో ‘ప్రమాదకర స్థాయి’ వాయుకాలుష్యం కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు నేడు (సోమవారం) తెరుచుకున్నాయి. అయితే విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పేలవమైన వాయునాణ్యత కారణంగా ప్రభుత్వం నవంబర్ 9 నుండి 18 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చింది. ఇప్పుడు గాలి నాణ్యత కాస్త మెరుగుపడిన నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం విద్యాసంస్థలను తెరవాలని నిర్ణయించింది. దీంతో నేటి నుంచి ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అన్ని తరగతులను ఇకపై ఫిజికల్ మోడ్‌లో నిర్వహిస్తారు. అయితే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నర్సరీ నుండి ఐదో తరగతి వరకు తరగతులను నిర్వహించడం లేదని తెలిపాయి. కాలుష్యం ఇంకా బ్యాడ్ కేటగిరీలోనే ఉందని అందుకే చిన్న పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయా ప్రైవేట్ పాఠశాలలు చెబుతున్నాయి. కాగా పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలు, బహిరంగ కార్యక్రమాలపై వారం రోజుల పాటు నిషేధం ఉంటుందని విద్యాశాఖ డైరెక్టరేట్ సర్క్యులర్ జారీ చేసింది. క్రీడలు, ప్రార్థన సమావేశాలు వంటి బహిరంగ కార్యకలాపాలను నిలిపివేయాలని, విద్యార్థుల చేత మాస్క్‌లు ధరింపజేయాలని ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు వెళ్లే సమయంలో పిల్లలు కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సూచించారు. ఇది కూడా చదవండి: రికార్డు ధరకు నెపోలియన్ టోపీ -
శ్రేయాస్ షిప్పింగ్ @ రూ. 400
ముంబై: డీలిస్టింగ్‌కు శ్రేయాస్ షిప్పింగ్.. షేరుకి రూ. 400 చొప్పున కౌంటర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆఫర్ ఈ నెల 17న ముగియనుంది. వెరసి కంపెనీ రెండోసారి డీలిస్టింగ్ ప్రయత్నాలను చేపట్టింది. గత నెలలో తొలుత ప్రకటించిన రూ. 338 ధరను రూ. 375కు సవరించినప్పటికీ వాటాదారులు షేరుకి రూ. 890 ధరలో షేర్లను టెండర్ చేయడంతో ఆఫర్ ధరను మరోసారి పెంచింది. తద్వారా కౌంటర్ ఆఫర్‌కు తెరతీసింది. డీలిస్టింగ్ ప్రాసెస్‌లో భాగంగా ఆఫర్ ఈ నెల 11న ప్రారంభమై 17న ముగియనున్నట్లు మాతృ సంస్థ ట్రాన్స్‌వరల్డ్ హోల్డింగ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. డీలిస్టింగ్ ప్రకటనకు ముందు మే 19న షేరు ధర రూ. 262 వద్ద నిలిచింది. ఈ ధరతో పోలిస్తే కౌంటర్ ఆఫర్ దాదాపు 53 శాతం ప్రీమియంకావడం గమనార్హం! కాగా.. 60 రోజుల సగటు ధర రూ. 292 కావడంతో ఫ్లోర్ ధరకు 37 శాతం ప్రీమియంతో కౌంటర్ ఆఫర్‌ను నిర్ణయించింది. ఇక మంగళవారం(10న) ముగింపు ధర రూ. 374తో పోలిస్తే ఇది దాదాపు 7 శాతం అధికం. ఈ ఏడాది మే 21న శ్రేయాస్ షిప్పింగ్ డీలిస్టింగ్‌ను స్వచ్చందంగా చేపట్టనున్నట్లు ట్రాన్స్‌వరల్డ్ వెల్లడించిన విషయం విదితమే. ప్రస్తుతం కంపెనీలో ట్రాన్స్‌వరల్డ్‌కు 70.44 శాతం వాటా ఉంది. -
ఏపీ, తెలంగాణల్లో నేటి నుంచే పాఠశాలలు ప్రారంభం
-
ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
-
నేడు జగిత్యాల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను తెరవనున్న అధికారులు
-
లాలూ ఫ్యామిలీకి షాక్.. ఆ కేసు మళ్లీ తిరగదోడుతున్న సీబీఐ
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రాసాద్ యాదవ్‌కు సీబీఐ షాక్ ఇచ్చింది. రైల్వే ప్రాజెక్టుల అవినీతి కేసును మళ్లీ రీఓపెన్ చేసింది. ఈ కేసులో లాలూతో పాటు ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్, కుమార్తెలు చందా యాదవ్, రాగిణి యాదవ్‌లపై ఆరోపణలు ఉన్నాయి. అయితే సీబీఐ నిర్ణయం చూస్తుంటే ఇది కచ్చితంగా బీజేపీ రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయంలాగే కన్పిస్తోందని ఆర్జేడీ నేతలు భావిస్తున్నారు. యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రేల్వై ప్రాజెక్టుల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. 2018లో ఈకేసులో ప్రాథమిక విచారణ మొదలైంది. అయితే 2021 మేలో ఈ కేసును సీబీఐ క్లోజ్ చేసింది. లూలూపై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు దొరకకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ కొన్ని నెలల క్రితమే బిహార్‌లో బీజేపీకి షాక్ ఇస్తూ ఆర్జేడీతో కలిశారు సీఎం నితీశ్ కుమార్. తన పాతమిత్రుడి చెంతకు మళ్లీ చేరారు. ఈ కారణంగానే లాలూ కేసును బీజేపీ మళ్లీ రీఓపెన్ చేయిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. చదవండి: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత -
కొత్త హంగులతో ఏషియన్ తారకరామ థియేటర్ రీఓపెనింగ్ (ఫొటోలు)
-
ఎలాన్ మస్క్ రూటే సపరేటు.. 22 నెలల తర్వాత ట్రంప్ ఖాతాకు గ్రీన్‌సిగ్నల్
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్.. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత పలు సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో ఆసక్తికర పరిణామం జరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునురుద్ధరణ విషయంలో ఎలాన్ మస్క్ ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ అనంతరం.. ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై బ్యాన్‌ను తొలగించినట్టు స్పష్టం చేశారు. వివరాల ప్రకారం.. ట్విట్టర్లోకి డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ ఇచ్చారు. జీవితకాల నిషేధానికి గురైన ట్రంప్ ఖాతాను ఎట్టకేలకు ట్విట్టర్ పునరుద్ధరించింది. అయితే, 2021 జనవరిలో జరిగిన క్యాపిటల్ హిల్ దాడి తర్వాత ట్రంప్ అకౌంట్‌ను మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. దీంతో, ఆయన ఖాతా పునరుద్ధరణపై ఎలాన్ మస్క్ నిర్వహించిన ఓటింగ్‌లో 51.8 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఓటువేశారు. Reinstate former President Trump — Elon Musk (@elonmusk) November 19, 2022 అయితే.. ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌పై మస్క్ పోల్ నిర్వహించారు. ట్విట్టర్ వేదికగా ఎలాన్ మస్క్.. ట్రంప్ అకౌంట్‌కు Yes OR No చెప్పాలని సోషల్ మీడియాలో శనివారం పోల్ పెట్టారు. 24 గంటల పాటు పోల్ కొనసాగగా.. పోలింగ్‌లో ట్రంప్‌కు అనుకూలంగా 51.8 శాతం, వ్యతిరేకంగా 48.2 శాతం మంది ఓటింగ్ చేశారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధించాలనే ఎక్కువ మంది కోరుకోవడంతో అకౌంట్‌పై బ్యాన్‌ను ఎత్తివేశారు. The people have spoken. Trump will be reinstated. Vox Populi, Vox Dei. https://t.co/jmkhFuyfkv — Elon Musk (@elonmusk) November 20, 2022 ఈ నేపథ్యంలో ట్రంప్ ట్విట్టర్‌పై బ్యాన్ ఎత్తివేస్తున్నట్టు ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రజల స్వరమే.. దేవుడి స్వరమంటూ మస్క్ కామెంట్స్ చేయడం విశేషం. ఇక, 22 నెలల తర్వాత ట్రంప్ అకౌంట్ ట్విట్టర్లో మళ్లీ ప్రత్యక్షమైంది. దీంతో, ట్రంప్ మద్దతుదారులు ఆనందంలో కామెంట్స్ చేస్తున్నారు. -
Banjarahills: డీఏవీ స్కూల్ రీ ఓపెన్.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో హర్షం
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని బాదం సరోజా దేవి డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు భారీ ఊరట లభించింది. పాఠశాలను తెరిచేందుకు అనుమతులు జారీ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారిణి రోహిణి మంగళవారం ఉత్తర్వులిచ్చారు. దీంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్ ఏమవతుందోనని గత పది రోజులుగా ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు విద్యాశాఖ అధికారులు రిలీఫ్‌నిచ్చారు. గత నెల 18వ తేదీన స్కూల్ డ్రైవర్ రజనీకుమార్ ఇదే పాఠశాలలో చదువుతున్న నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడగా నిందితుడిని, ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పాఠశాలలో నిర్లక్ష్యం తాండవం చేస్తోందంటూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గత నెల 22వ తేదీన స్కూల్ అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో స్కూల్‌ను బంజారాహిల్స్‌లోని పాత భవనంలోనే కొనసాగించాలంటూ గత నెల 23వ తేదీన 650 మంది విద్యార్థుల తల్లిదండ్రులు బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద సమావేశమై భారీ ఆందోళన చేపట్టారు. ఆ రోజు నుంచే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు డీఈఓ రోహిణిని కలుస్తూ ఇక్కడే పాఠశాలను రీ ఓపెన్ చేయాల్సిందిగా డిమాండ్ చేయసాగారు. బ్యాలెట్‌తో అభిప్రాయ సేకరణ.. మొత్తం తల్లిదండ్రులంతా ఒక్కతాటిపైకి వచ్చి తమ పిల్లలను ఇదే స్కూల్లో చదివించేందుకు అనుమతించాలంటూ ఇక్కడే స్కూల్ ఓపెన్ చేయాలని అభిప్రాయ సేకరణకు బ్యాలెట్ పద్ధతిని నిర్వహించారు. ఇందుకు 95 శాతం మంది తల్లిదండ్రులు మద్దతిచ్చారు. తల్లిదండ్రులంతా వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే తల్లిదండ్రులతో కూడిన ఓ కోర్ కమిటీ కూడా ఏర్పడింది. వీరు ప్రతిరోజూ సంబంధిత అధికారులను కలుస్తూ స్కూల్‌ను తెరవాలంటూ డిమాండ్ చేయసాగారు. ఇటీవలే ఢిల్లీ నుంచి స్కూల్ డైరెక్టర్ నిషా కూడా ఇక్కడికి వచ్చి తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. డీఈఓ కూడా తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఎట్టకేలకు స్కూల్ రీఓపెన్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేయగా గురువారం నుంచి బంజారాహిల్స్‌లోనే స్కూల్ తెరవనున్నారు. దీంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ ఆందోళనకు ప్రభుత్వం స్పందించిందని కోర్ కమిటీ ప్రతినిధి పెద్దల అంజిబాబు వెల్లడించారు. -
చర్చలు సఫలం.. వారంలో డీఏవీ స్కూల్ రీఓపెన్..!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ వారం రోజుల్లో తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాఠశాలను తిరిగి తెరిచే విషయంపై.. విద్యాశాఖ కమిషనర్‌తో డీఏవీ స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రుల చర్చలు సఫలమయ్యాయి. కమిషనర్‌తో భేటీ అనంతరం పలు వివరాలు వెల్లడించారు పేరెంట్స్. ‘కమిషనర్‌కు అన్ని విషయాలు తెలియజేశాం. కమిషనర్ సానుకూలంగా స్పందించారు. స్కూల్ అనుమతులపై పునరాలోచించేందుకు అంగీకరించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తాము ఇచ్చిన సూచనలు కమిషనర్ పరిగణనలోకి తీసుకున్నారు’ అని పేర్కొన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. స్కూల్ మేనేజర్ శేషాద్రి ఏం చెప్పారంటే.. ‘కమిషనర్ దేవసేనను మా డీఏవీ డైరెక్టర్ నిషాతో పాటు ముగ్గురు ప్రతినిధులు వచ్చి కలిశారు. కమిషనర్ దేవసేన లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చాం. ఘటనపై విచారం వ్యక్తం చేసి లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పాం. పేరెంట్స్ స్టేట్ మెంట్స్‌తో కలిపి మా వినతిని కూడా అందించాం. గుర్తింపు రద్దు తొలగించాలని కోరాం. ప్రభుత్వానికి ఈ రిక్వెస్ట్‌లను తీసుకెళ్తామని కమిషనర్ చెప్పారు. సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం.’ అని కమిషనర్ భేటీ అనంతరం వెల్లడించారు డీఏవీ స్కూల్ మేనేజర్. ఇదీ సమస్య.. హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ క్రమంలో పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అయితే, విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాల గుర్తింపు రద్దు చేయడంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచారు. దీంతో పాఠశాలను తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: Hyderabad: డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దుపై గందరగోళం.. నిర్ణయమెటో? -
సీఎం జగన్ నిర్ణయంతో చిగురుకుంట బంగారు గనులకు మహర్దశ
సీఎం జగన్ మాట బంగారు బాట కానుంది. చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలో దాగిన బంగారు ఖనిజాన్ని వెలికి తీయాలన్న ముఖ్యమంత్రి నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరో ఏడాదిలో చిగురుకుంట బంగారు గనులకు మోక్షం లభించనుంది. 1,500 మంది కార్మికులకు ఉపాధి కల్పనతోపాటు పంచాయతీలకు రాబడి పెరగనుంది. 20 ఏళ్ల పాటు సొంత నియోజకవర్గంలోని బంగారు గనులను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం బంగారాన్ని వెలికి తీయడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్ఎండీసీ సంస్థ రూ.450 కోట్లతో టెండర్ దక్కించుకుంది. కుప్పం రూరల్/ గుడుపల్లె: దేశంలోనే పేరుగాంచిన చిగురుకుంట బంగారు గనులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో మహర్దశ రానుంది. మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన బంగారు గనులు మూతపడడంతో వెయ్యి మంది కార్మిక కుటుంబాలు వీధిన పడినా అప్పటి సీఎం చంద్రబాబు స్పందించలేదు. ఫలితంగా కార్మికుల గోడు అరణ్యరోదనగా మారింది. ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గమైనా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గనులను తెరిపించే దిశగా అడుగులు వేశారు. ఈ నెల 4న కుప్పం ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఏడాదిలోపు చిగురుకుంట బంగారు గనులను పునః ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ఈ ప్రాంతానికి మహర్దశ రానుంది. ఈ నిర్ణయంతో కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. బంగారు గనుల ప్రస్థానం గుడుపల్లె మండలం బిసానత్తం గనిని 1968లో, దశాబ్దం తరువాత చిగురుకుంట గనిని 1978లో ఎంఈసీఎల్ సంస్థ ప్రారంభించింది. ఈ సంస్థ పదేళ్లపాటు క్వార్జ్ (బంగారు ముడి పదార్థం) వెలికి తీసి కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్)లోని బీజీఎంఎల్ (భారత్ గోల్డ్ మైనింగ్ లిమిటెడ్)కు అందజేస్తూ వచ్చింది. కాలక్రమేణా ఎంఈసీఎల్ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడంతో గనులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీజీఎంఎల్ 1982లో కొనుగోలు చేసింది. అప్పటి నుంచి 19 సంవత్సరాల పాటు 2001 జనవరి 15 వరకు బంగారు ముడి ఖనిజం వెలికి తీసే పనిని చేపట్టింది. దీంతో గనులు లాభాల బాట పట్టాయి. కేజీఎఫ్‌లోని బీజీఎంఎల్ నిర్వహిస్తున్న చాంపియన్ గని నష్టాల్లో పడింది. కొంత మంది స్వార్థపరులు చిగురుకుంట, బిసానత్తం గనులు నష్టాల్లో సాగుతు న్నట్లు తప్పుడు లెక్కలు చూపించడంతో లాక్అవుట్ అయ్యాయి. ఇంత పెద్ద నష్టం తన సొంత నియోజకవర్గంలో జరుగుతున్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులుముడుచుకుని కూర్చున్నారు. దీంతో గనులు మూతపడ్డాయి. మరో ఏడాదిలో ప్రారంభం మూతపడ్డ గనులను కేంద్ర ప్రభుత్వం పదేళ్ల తరువాత ఇక్కడ బంగారు కోసం అన్వేషించాలని మైసూరుకు చెందిన జియో సంస్థను 2011లో ఆదేశించింది. జియో సంస్థ మల్లప్పకొండ, బిసానత్తం, చిగురుకుంటలోని 19 కి.మీ. మేర పరిశోధనలు చేసి 263 హెక్టార్లను ఎంపిక చేసింది. 150 బోర్లు డ్రిల్ చేసి బంగారం లభ్యతపై అన్వేషణ చేపట్టింది. ఇక్కడ దొరికిన సల్ఫేట్ మట్టిని బెంగళూరుకు తరలించి ల్యాబ్‌లో పరీక్షించారు. పరీక్షల్లో చిగురుకుంట, బిసానత్తం ప్రాంతాల్లో ఇంకా బంగారం ఉన్నట్లు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చి, ఆ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. నివేధికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం బిడ్లను పిలిచింది. ఈ బిడ్లకు ఆదాని, వేదాంత వంటి బడా కంపెనీలు పోటీ పడ్డాయి. ఈ కంపెనీలను తోసిపుచ్చుతూ ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ టెండర్లను దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మరో సంవత్సరంలో గనులు ప్రారంభిస్తామని చెప్పడం శుభపరిణామం. స్థానికులకు ఉపాధి గనులు ప్రారంభిస్తే స్థానికులకు ఉపాధితో పాటు పంచాయతీలకు ఆదాయం రానుంది. గనులు లాక్ అవుట్ చేసే నాటికి 1500 మంది పని చేసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిగురుకుంట, బిసానత్తం ప్రాంతాల్లో గనులు సాగాలంటే 3 వేల మంది సిబ్బంది అవసరమవుతుంది. వీరిలో 1500 గని కార్మికులు మరో 1500 నిపుణులు, ఉద్యోగులు కావాల్సి ఉంటుంది. దీంతో స్థానికులకు ఉద్యోగాలు భారీగా వచ్చే అవకాశం ఉంది. ఓఎన్ కొత్తూరు పంచాయతీకి నెలకు లక్షల్లో ఆదాయం వచ్చేదని కార్మికులు తెలిపారు. ఇప్పటి పరిస్థితుల్లో ఆదాయం నాలుగింతలు అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు. పారదర్శకతతో నిధులు వినియోగిస్తే రెండు పంచాయతీల అభివృద్ధితో పాటు కుప్పం నియోజకవర్గానికి మహర్దశ వచ్చినట్లే. వినియోగంలోకి కోట్లాది రూపాయల సామగ్రి గనుల్లో మూలన పడిన కోట్లాది రూపాయల సామగ్రి వినియోగంలోకి రానుంది. అక్కడ ఉన్న జనరేటర్లు, లిఫ్టులు, ట్యాంకర్లు, మోటార్లు తుప్పుపట్టిపోయాయి. గనులు ప్రారంభిస్తే పరికరాలు వినియోగంలోకి వచ్చి కోట్ల రూపాయలు ఆదా కానుంది. ఈ రెండు గనుల ప్రాంతాల్లో 8 సొరంగ మార్గాలు ఉండగా, ఇందులో రెండు మార్గాలు బంగారు ముడి ఖనిజం బయటికి తీయడానికి, మిగతా 6 కార్మికుల రాకపోకలు, వ్యర్థాలు బయటికి తీయడానికి వినియోగించనున్నారు. సొరంగాలకు వినియోగించే భారీ టవర్లు వినియోగంలోకి రానున్నాయి. 8.5 టన్నుల బంగారం ఉత్పత్తే లక్ష్యం 263 హెక్టార్లలో విస్తరించిన చిగురుకుంట, బిసానత్తం గనుల్లో ఇప్పటికీ 18 లక్షల టన్నుల బంగారం ముడి ఖనిజం ఉండవచ్చని ఎన్ఎండీసీ అధికారుల అంచనా. ఒక టన్ను ముడి పదార్థం నుంచి 5.5 గ్రాముల బంగారం లభిస్తుంది. మొత్తం 8.5 టన్నుల బంగారం ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించుకుని, రూ.450 కోట్ల వరకు సంస్థ ఖర్చు పెట్టనుంది. గనుల ప్రదేశంలోనే బంగారుశుద్ధి ప్లాంటుకు ఎన్ఎండీసీ సంస్థ సన్నాహాలు ప్రారంభించింది. (క్లిక్: పర్యాటక నిధి.. హార్సిలీహిల్స్) యువతకు ఉపాధి ఇప్పటికే కుప్పం నియోజక వర్గం నుంచి పది వేల మంది యువకులు ఉపాధి కోసం నిత్యం బెంగళూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి దయతో గనులు ప్రారంభమైతే మాలాంటి వారికి స్థానికంగానే ఉపాధి లభించనుంది. అంతే కాకుండా మా ప్రాంతం అభివృద్ధి చెందనుంది. కుప్పంకు రాష్ట్రంలో గుర్తింపు వస్తుంది. చంద్రబాబు చేయలేని పని జగగన్న చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. – సంపంగి, సంగనపల్లి పంచాయతీలకు ఆదాయం గనులు ప్రారంభమైతే చుట్టు పక్కల 20 గ్రామాల ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. పరోక్షంగా వేలాది మందికి లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా సంగనపల్లి, ఓఎన్ కొత్తూరు పంచాయతీలకు సెస్సుల రూపంలో రాబడి పెరిగే అవకాశం ఉంది. సుమారు 20 సంవత్సరాల తరువాత ఈ గనులకు మోక్షం లభించడం ఆనందకరమే. ఇప్పటికైనా మా ప్రాంత గనులను గుర్తించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. – అమర్నాథ్, సర్పంచ్, సంగనపల్లి -
బడికి పోదాం చలో చలో.. (ఫోటోలు)
-
AP: జూలై 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం జూలై 5వ తేదీ నుంచి పునః ప్రారంభంకాను న్నాయి. పాఠశాలలను జూలై 4 నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ఇంతకు ముందు ఉత్తర్వులు జారీచేసింది. అయితే ప్రధాని మోదీ జూలై 4న రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్నారు. ప్రధాని పర్యటనలో సీఎం వైఎస్ జగన్ కూడా పాల్గొంటున్నందున పాఠశాలల పునః ప్రారంభాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. పాఠశాలల ప్రారంభం రోజున జగనన్న విద్యా కానుకను సీఎం విద్యార్థులకు అందించనున్నారని, అందుకను గుణంగా స్కూళ్లను 5వ తేదీ నుంచి ప్రారంభించనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ తెలిపారు. (క్లిక్: పేదల చదువుకు చంద్రబాబే అడ్డంకి) -
తెలంగాణలో తిరిగి ప్రారంభం కానున్న పాఠశాలలు
-
McDonald's: మూతపడ్డ 2 నెలలకు రీ ఓపెన్. అయితే కొత్త పేరు, లోగో!
రష్యాలో మార్చిలో మూతబడ్డ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్ చెయిన్ మెక్‌డొనాల్డ్స్ రెణ్నెల్ల తర్వాత మళ్లీ తెరుచుకుంది. అయితే, ‘కుస్నో ఈ టొచ్కా (రుచికరమైన సమయం)’ అనే కొత్త పేరుతో, సరికొత్త లోగోతో! రష్యా కుబేరుడు అలెగ్జాండర్ గొవోర్ దాన్ని కొనుగోలు చేశారు. ఆదివారం నుంచి మాస్కో సహా పలుచోట్ల ఔట్లెట్లు తెరుచుకున్నాయి. దాంతో వాటిలోకి జనం విరగబడ్డారు. మూతబడ్డ 800పై చిలుకు ఔట్లెట్లలో 200 దాకా నెలాఖరుకల్లా తెరుచుకుంటాయని యాజమాన్యం చెప్తోంది. -
తెలంగాణలో మోగిన బడిగంట.. ఉత్సాహంగా విద్యార్థుల బడిబాట
సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి.కొత్త ఆశలు, క్రొంగొత్త ఆలోచనలతో నూతన విద్యా సంవత్సరంలోకి విద్యార్థులు అడుగుపెట్టారు. అందంగా ముస్తాబైన పాఠశాలలు పిల్లలకు స్వాగతం పలికాయి. తొలిరోజు ఉత్సాహంగా విద్యార్థులు బడిబాట పట్టారు. సెలవులకు స్వస్తి పలికిన విద్యార్థులు పేరెంట్స్‌కు టాటా చెబుతూ స్కూల్లో అడుగుపెట్టారు. కాగా సుమారు 60 లక్షల మంది విద్యార్థులు బడి బాట పట్టనున్నారు. కోవిడ్ కేసుల పెరుగుదల, పుస్తకాల పంపిణీ పూర్తవకపోవడం, వేసవి తీవ్రత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగిస్తారన్న ప్రచారం జరిగినా.. ఆ ఊహాగానాలకు విద్యాశాఖ తెరదించింది. 13వ తేదీ నుంచే యథావిధిగా పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని స్పష్టం చేసిన విషయం తెలిసిందే కోవిడ్ తర్వాత సకాలంలో..: రాష్ట్రవ్యాప్తంగా 26,065 ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో 26లక్షల మంది విద్యార్థులు చదువు తున్నారు. రెసిడెన్షియల్, కస్తూరిబా బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్స్‌లో మరో 2.5 లక్షల మంది విద్యార్థులున్నారు. ఇక 10,800 ప్రైవేటు స్కూళ్లలో 32 లక్షల మంది విద్యార్థులు న్నారు. మొత్తంగా 60 లక్షల మంది విద్యార్థులు పాఠశాలల బాట పట్టనున్నారు. కరోనా ప్రభావం కారణంగా రెండేళ్ల తర్వాత ఈ విద్యా సంవత్సరం లోనే సకాలంలో స్కూళ్లు ప్రారంభమవుతుండటం గమనార్హం. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమం కింద పాఠశాలల్లో సమస్యలను తీర్చేందుకు చర్యలు చేపట్టింది. ఆంగ్ల మీడియంతో ప్రవేశాలు పెరిగే అవకాశం ఈ విద్యా సంవత్సరం నుంచే సర్కారీ బడుల్లో 1–8 తరగతులకు ఆంగ్ల బోధన మొదలవనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు 80 వేల మంది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సిద్ధం చేసింది. వారు ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయనున్నారు. విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠ్య పుస్తకాలను తెలుగు, ఇంగ్లిష్ రెండు మాధ్యమాల్లోనూ ఉండేలా సిద్ధం చేశారు. పుస్తకం బరువు పెరగకుండా.. సమ్మేటివ్ అసెస్మెంట్–1 వరకూ ఒక భాగం, ఎస్ఏ–2 వరకు మరో భాగంగా విభజించారు. ఇంగ్లిష్ మీడియం నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో ఈసారి ప్రవేశాలు పెరుగుతాయని భావిస్తున్నారు. పలు సమస్యలతో ఇబ్బందులు! పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న తరుణంలో ఇప్పటికీ పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. కొత్తగా ఇంగ్లిష్ మీడియం కోసం రెండు భాషల్లో ముద్రించిన పుస్తకాలు స్కూళ్లకు సరిపడా చేరలేదు. 2.10 కోట్ల పుస్తకాలు అవసరంకాగా.. ఇప్పటికీ 20 లక్షల పుస్తకాలే ముద్రించినట్టు సమాచారం. కాంట్రాక్టర్లు ఎక్కువ ధర కోట్ చేయడంతో టెండర్ల ప్రక్రియ తిరిగి మొదలుపెట్టడం, కాగితం కొరత ఆలస్యానికి కారణమని అధికారులు చెప్తున్నారు. ఈ నెలాఖరు నాటికి పుస్తకాలు అందుతాయని అంటున్నా.. మరో నెల వరకూ వచ్చే అవకాశం కన్పించడం లేదు. ►ఇక గత ఏడాది సర్కారీ స్కూళ్లలో యూనిఫారాలు ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా ఈ సమస్య కన్పిస్తోంది. 1.5 కోట్ల మీటర్ల వస్త్రం అవసరంకాగా.. ఇప్పటివరకు 60 లక్షల మీటర్లే కొనుగోలు చేశారు. మిగతాది కొని, కుట్టించి, పంపిణీ చేయాలంటే సమయం పట్టొచ్చని అధికారులు అంటున్నారు. ►ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత సమస్యగానే ఉంది. బోధనేతర సిబ్బందీ సరిగా లేరు. 2019–20 విద్యా సంవత్సరంలో 21 వేల మంది విద్యా వలంటీర్ల సేవలు తీసుకున్నారు. కోవిడ్‌తో గత ఏడాది వీరి సేవలు నిలిపివేశారు. మళ్లీ వారిని తీసుకుంటే కొంతవరకు సమస్య తీరుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. ►కొద్దిరోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. ఈ ఏడాది కూడా విద్యా రంగం పరిస్థితి ఏమిటన్న ఆందోళనలూ వెంటాడుతున్నాయి. -
విజయవాడ ప్యాసింజర్ లేనట్టేనా?
అనంతపురం సిటీ: కరోనా సాకుతో మూడేళ్ల క్రితం రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్లలో ‘అనంతపురం–విజయవాడ’ ఒకటి. అయితే, కోవిడ్ మహమ్మారి ఉధృతి తగ్గినా నేటికీ ఈ రైలును పునఃప్రారంభించలేదు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. రెండేళ్ల తరువాత దశల వారీగా రైళ్లను పునఃప్రారంభిస్తున్నా.. ఈ ప్యాసింజర్ రైలు విషయంలో రైల్వే శాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేద,మధ్య తరగతికి పెద్దదిక్కు విజయవాడకు వెళ్లే (ట్రైన్ నంబర్:56503/04) ఈ ప్యాసింజర్ రోజూ ఉదయం 7.20 గంటలకు బెంగళూరు (యశ్వంతపుర)లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం చేరేది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు విజయవాడ చేరుకునేది. మొత్తం 13 బోగీలతో 700 మంది ప్యాసింజర్ల కెపాసిటీతో 75 స్టేషన్లలో ఆగుతూ ప్రయాణించి ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేది. రైలు ద్వారా రోజూ 2 వేల నుంచి 3 వేల మంది దాకా ప్రయాణికులు రాకపోకలు సాగించే వారు. వీరిలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే అధికం. రాష్ట్ర విభజన తరువాత విజయవాడకు పెరిగిన రద్దీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్నత చదువులు గానీ, మెరుగైన వైద్యసేవల కోసం గానీ మరే ఇతర అవసరాల కోసమైనా ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్‌కు రాకపోకలు సాగించేవారు. అయితే రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్‌తో సత్సంబంధాలు తగ్గిపోయాయి. పిల్లల చదువులు, ఇతర పనులపై ఇప్పుడు ఎక్కువగా విజయవాడకు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులు ఎక్కువగా విజయవాడకు తిరగడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్ల సంఖ్యను పెంచాల్సిందిపోయి, ఉన్న రైళ్లను రద్దు చేయడం ఏమిటో అంతుబట్టడం లేదు. (చదవండి: కోర్టు ప్రాంగణంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం) -
బాలికలను స్కూళ్లకు అనుమతించండి...తాలిబన్లను ఆదేశించిన యూఎన్
Taliban on allowing girls in high schools: గతేడాది అఫ్గనిస్తాన్‌ని స్వాధీనం చేసుకుని తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలికలను పాఠశాలలకు వెళ్లకుండా నిషేధిస్తూ తాలిబాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ విషయమై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు యూఎన్ఎస్సీ సభ్యుల ఈ విషయమై అఫ్గనిస్తాన్‌కి సంబంధించిన సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి డెబోరా లియోనన్స్తో చర్చించారు. ఆ సమావేశలో బాలికలతో సహా అఫ్గాన్లందరి విద్యా హక్కు గురించి పునరుద్ఘాటించారు. విద్యా హక్కును గౌరవించడమే కాకుండా విద్యార్థులందరూ పాఠశాలకు వెళ్లేలా స్కూళ్లు తెరవాలని తాలిబన్లకు పిలుపునిచ్చారు. అఫ్గనిస్తాన్ ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్ (యూఎన్ఏఎంఏ) , ఈ సమస్యపై సంబంధిత అఫ్గాన్ వాటాదారులందరితో పరస్పర చర్చ కొనసాగించాలని సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిని ఆదేశించింది. అంతేగాదు ఈ అంశం పురోగతిపై భద్రతా మండలికి తెలియజేయాలని కూడా కోరింది. విద్యతో సహా అన్ని అంశాల్లో అఫ్గనిస్తాన్‌కు మద్దతు ఇవ్వడానికి అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాల ప్రాముఖ్యతను భద్రతా మండలి సభ్యులు నొక్కి చెప్పారు. అయితే గతేడాది అఫ్గనిస్తాన్‌లోని వేలాది మంది సెకండరీ పాఠశాల బాలికలు ఆగస్టు 2021 తర్వాత మొదటిసారి తరగతులకు హాజరు కావడానికి ఆసక్తి కనబర్చారు. కానీ కొన్ని గంటల్లోనే పాఠశాలలను మూసివేయాలని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాదు తాలిబాన్ ప్రభుత్వం తన తదుపరి నిర్ణయాన్ని ప్రకటించే వరకు బాలికలు ఇంట్లోనే ఉండాలని సూచించారు కూడా. ఒక వారంలోగా బాలికల మాధ్యమిక పాఠశాలలను తిరిగి తెరవడంలో తాలిబాన్ విఫలమైతే దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని అప్గాన్‌లోని మహిళా హక్కుల కార్యకర్తలు హెచ్చరించారు. ఇదిలా ఉండగా రాజధాని నగరం కాబూల్‌లో విద్యార్థినిలు విద్య మన సంపూర్ణ హక్కు అని నినాదాలు చేశారు. అయితే ఈ విషయమై తాలిబానీ విద్యా మంత్రిత్వ శాఖ పూర్తి వివరణ ఇవ్వలేదు. కానీ ఇస్లామిక్ ఎమిరేట్ సీనియర్ నాయకుడు మాత్రం పాఠశాలలను తిరిగి తెరవడానికి ముందు కొన్ని ఆచరణాత్మక సమస్యలను ఇంకా పరిష్కరించాల్సి ఉందని చెప్పారు. (చదవండి: రష్యా బలగాల ఉపసంహరణ దిశగా వ్యూహం.. భయాందోళనలో ఉక్రెయిన్) -
తర‘గది’కి ఇరవై మంది..! అమలు సాధ్యమేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు మంగళవారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. కరోనా దృష్ట్యా ఇప్పటికే స్కూళ్ళు, కాలేజీల్లో పెద్ద ఎత్తున శానిటైజేషన్ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు రెండు రోజులుగా గదులు, పరిసరాలను దగ్గరుండి శుభ్రం చేయిస్తున్నారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేందుకు స్కూల్ పరిధిలో కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. గతంలో విడుదల చేసిన కోవిడ్ నిబంధనలే ఇప్పుడూ అమలులో ఉంటాయని వారు చెప్పారు. అయితే తరగతి గదిలో పరిమిత సంఖ్యలో విద్యార్థులను కూర్చోబెట్టడం కష్టమని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా బెంచ్‌కు ఒకరు చొప్పున, గదికి 20 మందిని మాత్రమే అనుమతించాలనే నిబంధన అమలు కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదట్లో విద్యార్థులు పెద్దగా రాకపోవచ్చనే అభిప్రాయం ఉన్నప్పటికీ కొన్ని స్కూళ్ళల్లో తక్కువ మంది వచ్చినా సామాజిక దూరం పాటించడానికి అవసరమైన మౌలిక వసతులు లేవని చెబుతున్నారు. వారం వరకు కష్టమే ప్రభుత్వ విద్యాసంస్థలు తెరిచినా వారం వరకు పెద్దగా క్లాసులు నిర్వహించలేమని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. టీచర్లలో చాలామంది ఇప్పటికీ జలుబు, జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, వారిని ఇప్పటికిప్పుడు స్కూలుకు రమ్మనడం సరికాదని ఓ టీచర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేలో కూడా ప్రతి ఇంట్లో ఒకరిద్దరికి అనారోగ్య సమస్యలున్నట్టు గుర్తించారని, దీనిని బట్టి చూస్తూ మొదటి వారం రోజుల వరకు విద్యార్థుల హాజరు పెద్దగా ఉండకపోవచ్చని ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. అయితే టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఏప్రిల్‌లో పరీక్షలుంటాయి. వారికి సకాలంలో సిలబస్ పూర్తి చేయాల్సి ఉంది. అందువల్ల వీరి హాజరు మాత్రం పెరిగే వీలుందని చెబుతున్నారు. వర్సిటీల్లో ఆన్లైనే విశ్వవిద్యాలయాల పరిధిలో మరో వారం పాటు ఆన్లైన్ బోధనే నిర్వహించాలని ఉస్మానియా, జేఎన్టీయూ యూనివర్సిటీలు నిర్ణయించాయి. ఉన్నత విద్యా సంస్థల్లో చదివే వాళ్ళంతా 20 ఏళ్లు పైబడిన యువతే. వీరిలో చాలామందికి కరోనా లక్షణాలున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా వర్సిటీ క్యాంపస్‌లలోని హాస్టళ్ళకు వీరిని అనుమతిస్తే ఇతరులకు వేగంగా కరోనా వ్యాప్తి జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వారంపాటు ఆన్లైన్ క్లాసులు తీసుకోవాలని నిర్ణయించినట్టు ఓయూ వీసీ రవీందర్ తెలిపారు. ఎక్కువ బెంచీలు వేయడానికి గదులు సరిపోవు పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలనే ఆదేశాలొచ్చాయి. అయితే విద్యార్థుల హాజరు పెరిగితే నిబంధనల ప్రకారం క్లాసుకు 20 మందినే ఉంచడం సాధ్యం కాదు. ఎక్కువ బెంచీలు కావాల్సి ఉంటుంది. ఒకవేళ అవి ఉన్నా వేయడానికి తరగతి గదులు సరిపోవు. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక తప్పదు. – అరుణ శ్రీ, ప్రధానోపాధ్యాయురాలు, నల్లగొండ -
24 రోజుల తర్వాత తెరుచుకోనున్న విద్యాసంస్థలు
సాక్షి, హైదరాబాద్: పాఠశాలలు, కళాశాలలను మంగళవారం నుంచి తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో.. విద్యాసంస్థలన్నీ ఏర్పాట్లు మొదలుపెట్టాయి. ఇప్పటికే ప్రైవేటు సంస్థలు చాలా వరకు ప్రత్యక్ష తరగతులకు సన్నద్ధమయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలన్నింటా ఆది, సోమవారాల్లో వేగంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటికీ తొలుత ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వగా.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 31వ తేదీ వరకు కూడా తెరవొద్దని ఆదేశించింది. తాజాగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తిరిగి తెరిచేందుకు అనుమతించింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా.. రాష్ట్రవ్యాప్తంగా 42,575 పాఠశాలలు ఉన్నాయి. అందులో 20,752 ప్రై మరీ, 7,471 అప్పర్ ప్రై మరీ, 11,921 సెకండరీ, 2,431 హయ్యర్ సెకండరీ పాఠశాలలు. మొత్తం స్కూళ్లలో దాదాపు 26 వేల వరకు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. వీటన్నింటిలో పరిశుభ్రత, జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. కోవిడ్ విస్తృతిని దృష్టిలో పెట్టుకుని శానిటైజేషన్‌కు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని, మండల స్థాయి కమిటీలు కూడా పనిచేస్తాయని చెప్పారు. స్థానిక పంచాయతీల సహకారంతో స్కూళ్లలో పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు. గదులను పరిశుభ్రంగా ఉంచడం, శానిటైజర్లను అందుబాటులో ఉంచడం ప్రధానోపాధ్యాయుల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి మాస్క్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలుచేస్తామని తెలిపారు. వ్యక్తిగత శానిటైజర్లను అనుమతిస్తామని.. విద్యాసంస్థల్లోనూ ప్రత్యేకంగా ఈ సదుపాయం ఉంటుందని పాఠశాల విద్యశాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి మొదట ఓ వారం రోజుల వరకు 5వ తరగతిలోపు విద్యార్థుల హాజరు పెద్దగా ఉండకపోవచ్చని.. పై తరగతుల వారు యధావిధిగా హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. హాస్టళ్లలో ఆలస్యంగా.. హాస్టళ్లలో సమగ్ర పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అప్పటివరకు హాస్టళ్లు తెరిచినా.. విద్యార్థుల శాతం పరిమితంగానే ఉంచే వీలుందని అంటున్నారు. దగ్గర్లోని విద్యార్థులను వారం రోజుల పాటు ఇళ్ల నుంచే స్కూలుకు వెళ్లాలని మౌఖిక ఆదేశాలివ్వాలని నిర్ణయించినట్టు చెప్తున్నారు. అర్హత ఉన్న విద్యార్థులకు వ్యాక్సిన్ సెలవు రోజుల్లో అర్హత ఉన్న విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేపట్టినట్టు అధికార వర్గాలు చెప్పాయి. దీనివల్ల టెన్త్ పరీక్షల నాటికి విద్యార్థుల్లో చాలావరకూ వ్యాధి నిరోధక శక్తి ఉండే వీలుందని పేర్కొన్నాయి. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు సంక్రాంతి సెలవులకు ముందే వ్యాక్సినేషన్ చేపట్టామని.. వారికి పరీక్షల నాటికి ఇబ్బందులు ఉండవని అంచనా వేస్తున్నామని వెల్లడించాయి. ఏదేమైనా ఇక నుంచి మిగిలిన విద్యా సంవత్సరమంతా బోధన ముమ్మరంగా సాగుతుందని అధ్యాపకవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
కాలేజీలు మూసి.. స్కూళ్లు తెరుస్తారా?: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఒకపక్క యూనివర్సిటీలు, కాలేజీలు మూసేస్తూ మరోవైపు ఈనెల 30 తర్వాత పాఠశాలలు తెరుస్తామని పేర్కొనడం ఏంటని హైకోర్టు ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వ అభిప్రాయం ఏంటో తెలిజేయాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను శుక్రవారం మరోసారి విచారించింది. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది మంది హాజరయ్యే నేపథ్యంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేంటో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే జంటనగరాల్లో జరుగుతున్న వారాంతపు సంతల్లో ప్రజలు గుమిగూడకుండా, భౌతిక దూరం పాటించేలా ఎటువం టి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని అడిగింది. 3.45 లక్షల కిట్లు పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా 77.33 లక్షల ఇళ్లల్లో జ్వర సర్వే నిర్వహించి స్వల్ప లక్షణాలున్నవారికి 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామని ప్రజా ఆరోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్‌లో ధర్మాసనానికి తెలిపారు. చిన్న పిల్లల వైద్యానికి సంబంధించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌పడకల సంఖ్య బాగా పెంచామని వివరించారు. లక్షణాలున్న వారికి పంపిణీ చేస్తున్న మందుల కిట్లలో చిన్న పిల్లలకు అవసరమైన మందులు లేవని, వారికి ప్రత్యేకంగా కిట్లు ఇచ్చేలా ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కౌటూరి పవన్‌కుమార్ నివేదించారు. చిన్నారుల వైద్యానికి ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని మరో పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది రవిచందర్ నివేదించారు. వారాంతపు సంతల్లో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారని, వీరి ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఉందని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది మయూర్‌రెడ్డి పేర్కొన్నారు. జాతరలో కోటిమంది పాల్గొనే అవకాశం గోదావరి నది తీరంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలో ఐదు రాష్ట్రాల నుంచి 75 లక్షల నుంచి కోటి మంది పాల్గొనే అవకాశం ఉందని, కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున కరోనా వ్యాపించే అవకాశముందని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ నివేదించారు. కుంభమేళా సందర్భంగా పెద్ద ఎత్తున కరోనా వ్యాపించడాన్ని ఆయన గుర్తు చేశారు. చిరు వ్యాపారులను రోడ్డు మీద పడేయలేం వారాంతపు సంతలకు వెళ్లే వారి ద్వారా పెద్ద ఎత్తున కరోనా వ్యాపించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో వాటిని నిర్వహించకుండా ఆదేశించాలన్న వాదనను ధర్మాసనం సున్ని తంగా తిరస్కరించింది. ‘రోడ్ల మీద కూరగాయలు అమ్ముకొని, చిరు వ్యాపారాలు చేసుకొనేవారు వారి కొచ్చే రూ.100తో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారాంతపు సంతలను మూసేసి వాళ్ల నోటి దగ్గర ముద్ద లాక్కోమంటారా? ఉపాధి లేకుం డా చేసి రోడ్ల మీద పడేయాలా? ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూనే ఉంది..’ అని ధర్మాసనం పేర్కొంది. మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని తెలిపింది. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని డాక్టర్ శ్రీనివాసరావును ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేసింది. -
తెరచుకున్న శబరిమల ఆలయం
-
తెరచుకున్న శబరిమల ఆలయం
పత్తనంతిట్ట: భక్తుల దర్శనార్థం రెండు నెలల సీజనల్ యాత్రలో భాగంగా ప్రఖ్యాత శబరిమల అ య్యప్పస్వామి ఆలయం సోమవారం తెరచుకుంది. ప్రధాన పూజారి(తంత్రి) కందరారు మహేశ్ మోహనరారు సమక్షంలో ఆలయ గర్భగుడి తలుపులను తెరిచారు. 16 తేదీ నుంచే భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. భారీ వర్షాల కారణంగా తొలి 3,4 రోజులపాటు తక్కువ సంఖ్యలో భక్తులనే లోపలికి అనుమతిస్తారు. వర్చువల్ క్యూ పద్ధతిలో రోజుకు 30వేల మంది దర్శనానికి అవకాశం కల్పించారు. కోవిడ్ సర్టిఫికెట్ లేదా 72 గంటల్లోపు తీసుకున్న ఆర్టీ–పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్లను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. 41 రోజుల మండల పూజ డిసెంబర్ 26న పూర్తికానుంది. -
రాజ్‌భవన్ పాఠశాలను సందర్శించిన గవర్నర్ తమిళిసై
-
తెలంగాణలో మోగిన బడి గంట..
-
Telangana: భయం లేకుంటేనే బడికి పంపండి
సాక్షి, హైదరాబాద్: పిల్లల్ని స్కూళ్లకు పంపాలా? లేదా? అనేది తల్లిదండ్రుల ఇష్టానికే ప్రభుత్వం వదిలేసింది. ఎలాంటి భయం లేకుంటేనే విద్యార్థుల్ని పాఠశాలలకు పంపాలని స్పష్టం చేసింది. గురుకుల పాఠశాలలు మినహా అన్ని విద్యాసంస్థ లను బుధవారం నుంచి తిరిగి ప్రారం భించాలని ఆదేశించింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండూ ఉంటా యని స్పష్టం చేసింది. అయితే గురుకులాలతో పాటు సంక్షేమ హాస్టళ్ల ప్రారంభాన్నీ నిలిపి వేసింది. విద్యా సంస్థల పునఃప్రారంభంపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో.. విద్యాశాఖ మంగళవారం ఈ మేరకు సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్ నిబం ధనల అమలు, స్కూళ్ళలో శానిటైజేషన్ ప్రక్రి యపై గతంలో ఇచ్చిన మార్గదర్శకాల్లో ఎటువంటి మార్పులూ చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇప్పటికే దూరదర్శన్, టీశాట్ ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ప్రభుత్వ తాజా మార్గదర్శకాలతో ప్రైవేటు పాఠశాలలు టీచర్ల ద్వారా ఆన్లైన్లో బోధన కొనసాగించేందుకు అవకాశం ఏర్పడింది 6 లక్షల మంది విద్యార్థులకు ఆన్‌లైనేనా రాష్ట్రంలో స్కూలు విద్యార్థులు 60 లక్షల మంది వరకూ ఉంటారు. వీరిలో 29 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నారు. 1,200 గురుకుల పాఠశాలల్లో 4 లక్షల మంది విద్యార్థులుండగా, మొత్తం 1,700 సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ 2 లక్షల మంది చదువుకుంటున్నారు. ప్రభుత్వం ఈ రెండింటినీ ప్రారంభించడానికి అనుమతించలేదు. దీంతో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు వెళ్లే అవకాశం లేదు. సంక్షేమ హాస్టళ్లలో ఉండేవారు 50 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వసతి గృహాల్లో ఉంటున్నారు. వీరితో పాటు గురుకుల విద్యార్థులు కొంతకాలం దూరదర్శన్, టీశాట్ ద్వారా జరిగే ఆన్లైన్ తరగతులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఆన్లైన్ వైపే ‘ప్రైవేటు’ మొగ్గు! ఇక ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలతో పాటు విద్యార్థులు చాలావరకు ఆన్లైన్ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ధర్డ్‌వేవ్ భయం ఉండటం వల్ల కొంతకాలం వేచి చూసిన తర్వాతే ప్రత్యక్ష బోధనకు పిల్లలను పంపుతామని తల్లిదండ్రులు అంటున్నారు. కార్పొరేట్ స్కూళ్ళ యాజమాన్యాల్లో ఈ తరహా ఆలోచనే ఎక్కువగా కన్పిస్తుండగా.. బడ్జెట్ స్కూళ్లు మాత్రం ప్రత్యక్ష బోధనకు ప్రాధాన్యతనిస్తున్నాయి. అయితే తల్లిదండ్రుల్లో ఏ మేరకు సానుకూలత ఉందనేది తెలియడం లేదని ఓ స్కూలు నిర్వాహకుడు తెలిపారు. చిన్న తరగతుల నిర్వహణ కష్టమే! స్కూళ్ళ ప్రారంభంపై విద్యాశాఖ నెల రోజుల క్రితమే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గత అనుభవాలను ఇందులో పొందుపరిచింది. అప్పట్లో తొలుత 9, 10 తరగతుల విద్యార్థులకు, ఆ తర్వాత ఆరు నుంచి 8 తరగతుల విద్యార్థులను అనుమతించిన విషయం గుర్తుచేసింది. దీనివల్ల పెద్దగా సమస్య రాలేదని పేర్కొంది. ఇప్పుడు కూడా తొలుత 9, 10 తరగతులను ప్రారంభించి, క్రమంగా అన్ని తరగతులు మొదలు పెడితే బాగుంటుందని నివేదించింది. అయితే ప్రభుత్వం తమ సూచనను పట్టించుకోలేదని, ఇప్పుడదే గందరగోళానికి దారి తీసిందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. చిన్న తరగతుల నిర్వహణ కష్టమేనని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో చిన్న తరగతులను ప్రారంభించకూడదని అనధికారికంగా నిర్ణయించినట్టు కూడా తెలిసింది. హాజరు తప్పనిసరి కాదు: మంత్రి సబిత గురుకులాలు మినహా అన్ని విద్యా సంస్థలు బుధవారం నుంచి ప్రారంభిస్తున్నా.. విద్యార్థుల హాజరు తప్పనిసరికాదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. ఈ విషయంలో యాజమాన్యాలు ఎలాంటి ఒత్తిడి చేయవద్దని ప్రైవేటు స్కూళ్ళకు సూచించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో తరగతులు నిర్వహించుకోవచ్చన్నారు. ఇప్పటికే జారీ చేసిన కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని శాఖల సమన్వయంతో పాఠశాలల నిర్వాహణ సాఫీగా జరిగేలా చూడాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. విద్యార్థులు ప్రత్యక్షంగా తరగతులకు హాజరయ్యేలా ఎలాంటి ఒత్తిడీ చేయవద్దని ఆదేశించింది. స్కూళ్లకు హాజరయ్యే పిల్లల ఆరోగ్యంతో తమకు సంబంధం లేదనే షరతు విధించొద్దని, ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రైవేటు యాజమాన్యాలు ఎలాంటి అంగీకారపత్రాలూ తీసుకోవద్దని సూచించింది. -
TS: రేపటి నుంచి పాఠశాలల ప్రారంభం యాథాతథం
-
TS: రేపటి నుంచి పాఠశాలల ప్రారంభం యథాతథం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేపటి(బుధవారం)నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గురుకులాలు, రెసిడెన్సియల్ స్కూళ్లు మినహా మిగతా పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలల ప్రారంభం యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం మంగళవారం ప్రకటన జారీచేసింది. గురుకులాలు, రెసిడెన్సియల్ స్కూళ్లు మినహా మిగతా వాటికి అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆఫ్‌లైన్‌తో పాటు అన్‌లైన్‌లోనూ స్కూళ్లు కొనసాగుతాయని తెలిపింది. హైకోర్టు ఆదేశాలు వచ్చే వరకు రెసిడెన్షియల్, గురుకులాలను మూసివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. చదవండి: తెలంగాణలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు -
తెలంగాణాలో సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభం
-
ఢిల్లీ:సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రలో దశలవారీగా సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు, కళాశాలలు పున: ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 9-12వ తరగతి విద్యార్ధులకు సెప్టెంబర్ 1 నుంచి ఆఫ్‌లైన్‌లో పాఠశాలలు, కళాశాలు ప్రారంభం కాగా, 6-8వ తరగతి విద్యార్థులకు వారం రోజుల తర్వాత ప్రారంభం కానున్నాయి. చదవండి: Work From Home: షుగర్, బీపీ, ఒబెసిటి కంటే.. ఈ సమస్యే ఎక్కువ! తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి అదే విధంగా విద్యాసంస్థల వద్ద క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 50 శాతం సామర్థ్యంతో విద్యాసంస్థలు పున: ప్రారంభిస్తామని పేర్కొంది. అన్ని పాఠశాలల్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు, రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతుందని పేర్కొంది. సెప్టెంబర్1 నుంచి పాఠశాలలు, కళాశాలలు పున: ప్రారంభించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. చదవండి: Maharashtra: 10 రోజుల్లో ఆలయాలు తెరవండి.. లేదంటే.. -
మోగనున్న బడిగంట: ప్రత్యక్ష బోధనకు సర్వం సిద్ధం!
శేరిలింగంపల్లి: కరోనా వ్యాప్తితో మూతపడ్డ పాఠశాలలను సెప్టెంబర్ 1 నుంచి తెరిచి తరగతి గదుల్లో ప్రత్యక్ష బోధన నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. శేరిలింగంపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో జీహెచ్ఎంసీ అధికారులు, ఎంఈఓ ఆధ్వర్యంలో శానిటేషన్, ఎంటమాలజీ విభాగం సిబ్బంది పారిశుద్ధ్య, శానిటైజేషన్ పనులను నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ రెండు రోజులుగా పరిశుభ్రతా పనులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇక ఆన్లైన్ తరగతులకు స్వస్తి పలకాలని నిర్ణయించడంతో విద్యార్థులంతా పాఠశాలలకు తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణలో.. ► ప్రభుత్వ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఆవరణను శుభ్రం చేయించే బాధ్యత జీహెచ్ఎంసీ అధికారులు తీసుకున్నారు. ► తరగతి గదులను శుభ్రం చేయడంతో పాటు శానిటైజ్ చేస్తున్నారు. ► వెస్ట్‌జోన్ జోనల్ కమిషనర్ రవికిరణ్, జంట సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు వెంకన్న, సుధాంషుల పర్యవేక్షణలో ఇంజినీరింగ్, శానిటేషన్ అధికారులు ఈ పనులను సమన్వయం చేస్తున్నారు. శేరిలింగంపల్లిలోని ప్రభుత్వపాఠశాలల వివరాలు: ►శేరిలింగంపల్లి ప్రాంతంలో మొత్తం 60 ప్రభుత్వ పాఠశాలలుండగా అందులో 14,332 మంది విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ►మొత్తం 13 జెడ్పీహెచ్ఎస్లలో 6,232 మంది విద్యార్థులు, నాలుగు యూపీఎస్ స్కూళ్లలో 908 మంది విద్యార్థులు, 43 ప్రాథమిక పాఠశాలల్లో 7,192 మంది విద్యార్థులు చదువుతున్నారు. ► శేరిలింగంపల్లి మండలంలో ప్రైవేటు పాఠశాలలు 261 ఉండగా, వాటిల్లో 90 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. సురభికాలనీ పాఠశాలలో పరిశుభ్రత పనులు, పాపిరెడ్డికాలనీలోని గ్రౌండ్‌ను చదును చేస్తున్న దృశ్యం పిల్లలను మానసికంగా సిద్ధం చేయాలి కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి ఆందోళన పెట్టుకోకుండా చిన్నారులు పాఠశాలలకు వెళ్లేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని మానసికంగా సిద్ధం చేయాలి. పాఠశాలలన్నింటినీ జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో పరిశుభ్రం చేసి శానిటైజ్, చేయిస్తున్నాం. ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం కోవిడ్ నిబంధనలను విధిగా అందరూ పాటించాల్సిందే. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి స్కూళ్లు తెరిచేలా శానిటైజ్ చేయించి సిద్ధం చేస్తున్నాం. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూస్తాం. -కె.వెంకటయ్య, మండల విద్యాధికారి శేరిలింగంపల్లి ఉపాధ్యాయులు పాటించాల్సిన అంశాలివీ... ♦ జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకొని పాఠ శాల ఆవరణ అంతా పరిశుభ్రంగా మార్చాలి. ♦ పాఠశాలలోని తరగతి గదులు శుభ్రం చేయించాలి. ♦ పాఠశాలను పూర్తిగా శానిటైజ్ చేయించాలి. ♦ పాఠశాల ఆవరణలో ఓవర్ హెడ్ ట్యాంక్‌లు, సంపులను క్లీనింగ్ చేయించాలి. ♦ విద్యార్థులు మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించేలా చూడాలి. ♦ ప్రభుత్వం ఆదేశించిన కోవిడ్ నిబంధనలన్నీ విధిగా అందరూ పాటించాలి. ♦ పరిశుభ్రమైన వాతావరణంలో మధ్యాహ్న భోజనం తయారీ, భౌతిక దూరం పాటిస్తూ వారు భుజించేలా చూడాలి. విద్యార్థులు పాటించాల్సిన అంశాలు: ♦ ప్రతి విద్యార్థి మాస్కు ధరించాలి. ♦ పాఠశాలలో భౌతిక దూరం పాటించాలి. ♦ చేతులు శానిటైజ్ చేసుకోవాలి. ♦ కోవిడ్ నిబంధనలన్నీ తప్పక పాటించాలి. -
సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ లో విద్యాసంస్థలు ప్రారంభం
-
Telangana: అయ్యో..మూత ‘బడి’
ఇది నల్లగొండ పట్టణం శివాజీనగర్లోనిసెయింట్ ఆంథోనీస్ స్కూల్.. అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని టులెట్ బోర్డు పెట్టారు. ఇదే పట్టణంలోని క్రాంతినగర్‌లో మమత స్కూల్ నిర్వాహకులు భవనం అద్దె చెల్లించలేక చేతులెత్తేశారు. దాని యజమాని.. స్కూళ్లకు భవనాన్ని అద్దెకిస్తే లాభం లేదని ఏకంగా భవనాన్నే అమ్మకానికి పెట్టారు. సాక్షి, నెట్వర్క్: కరోనా దెబ్బకు ప్రైవేటు రంగంలోని చిన్నాచితకా బడ్జెట్ స్కూళ్లు చతికిలబడ్డా యి. పల్లెలు, మాదిరి పట్టణాల్లోని సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండి పిల్లలకు కాన్వెంట్ తరహా విద్యాబుద్ధులు నేర్పిన ఇలాంటి స్కూళ్లు రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో మూతపడ్డాయి. రెండు, మూడు దశాబ్దాలుగా నడుస్తున్నవీ కనిపించకుండాపోతున్నాయి. కొన్ని స్కూళ్లు ఫంక్షన్‌హాళ్లుగా మారి పోగా, మరికొన్ని ‘కార్పొరేట్’చేతుల్లోకి వెళ్లిపోయాయి. మరికొన్నింటిని యాజమాన్యాలు అమ్మకానికి పెట్టాయి. ఫలితంగా వీటిపై ఆధారపడిన వేలసంఖ్యలోని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. యాజమాన్యాలతో పాటు ఇన్నాళ్లూ వీటిపై ఆధారపడి, గౌరవప్రదంగా బతికిన టీచర్లు జీవనోపాధికి చిన్నాచితకా పనులు, ఇతర వృత్తులు చేపడుతున్నారు. ఫీజులు రాక.. చెల్లింపులు భారమై కరోనా, లాక్డౌన్ పరిణామాలతో పల్లెల్లోని ప్రభుత్వ పాఠశాలలకు సమాంతరంగా నడిచిన చిన్నపాటి ప్రైవేట్ స్కూళ్లలో ఆన్లైన్లో బోధించేంత సాంకేతికత లేకపోయింది. మరోపక్క కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయి ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న మధ్యతరగతి వర్గాలు పిల్లల స్కూలు ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలామంది తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలో మాన్పించి ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించారు. ఈ పరిణామాలతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాయి. స్కూళ్లు నడవకున్నా సిబ్బంది జీతాలు, భవనాల అద్దెలు, విద్యుత్ బిల్లులు, ఆస్తిపన్నులు, స్కూల్ బస్సులపై ఈఎంఐలు చెల్లించక తప్పని పరిస్థితి.. గత విద్యా సంవత్సరం ఏదోలా నెట్టుకొచ్చినా.. ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలో కరోనా సెకండ్‌వేవ్ విజృంభణతో పాఠశాలలు మళ్లీ మూతపడ్డాయి. బోధన చాలావరకు ఆన్లైన్లోనే సాగటంతో పూర్తిస్థాయిలో ఫీజలు రాబట్టుకోలేక, అద్దెలు, పన్నులు, వాయిదాలు చెల్లించలేక, అప్పులు తీర్చలేక, సిబ్బందికి జీతాలివ్వలేక చిన్న పాఠశాలల యాజమాన్యాలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. అద్దె చెల్లించాలని లేదా ఖాళీచేయాలని భవన యజమానులు ఒత్తిడి చేస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో కొన్ని యాజమాన్యాలు స్కూళ్లను మూసేశాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ప్రైవేటు స్కూళ్లు 10,912 ఉంటే, వీటిలో 960 వరకు బడ్జెట్ స్కూళ్లు మూతపడ్డాయి. మరికొన్నిటిని యాజమాన్యాలు అమ్మకానికి పెడుతున్నాయి. ఇంకొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల్లో విలీనమవుతున్నాయి. సొంతంగా భవనాలున్న యాజమాన్యాలు.. స్కూలు మూసేసి భవనాన్ని ఇతర వ్యాపారాలకు లీజుకిస్తున్నాయి. ఫలితంగా ఆయా స్కూళ్లలోని బోధన, బోధనేతర సిబ్బంది రోడ్డునపడ్డారు. వీటిల్లో చదివే విద్యార్థులు చెల్లాచెదురైపోయారు. అయితే అమ్మకం.. లేదంటే అద్దెకు – కరోనా దెబ్బకు కుదేలైన కామారెడ్డి జిల్లాలోని 9 ప్రైవేటు పాఠశాలల్ని వాటి యాజమాన్యాలు అమ్మకానికి పెట్టాయి. కామారెడ్డిలోని ఓ కార్పొరేట్ స్కూలు.. ఏదోలా నెట్టుకొచ్చే యత్నంలో స్కూలు నడవక అద్దె చెల్లించలేని పరిస్థితి నెలకొందని, దీనిపై ఆలోచించాలంటూ కోర్టుకెళ్లింది. దీంతో స్కూళ్లు తెరిచేదాకా అద్దె అడగొద్దని భవన యజమానికి కోర్టు సూచించింది. – భద్రాద్రి జిల్లా పాతకొత్తగూడెంలోని అరుణాచలేశ్వర ప్రైవేటు పాఠశాల యాజమాన్యం స్కూలును మూసేసి భవనాన్ని గిరిజన సంక్షేమ శాఖకు లీజుకిచ్చింది. విద్యార్థుల నుంచి రూ.12 లక్షల వరకు ఫీజుల రూపేణా రావాల్సి ఉందని యాజమాన్యం వాపోయింది. – బాన్సువాడలోని అక్షర స్కూలులో 280 మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులున్నారు. వీరి నుంచి ఫీజులు వసూలు కాకపోవడంతో నెలనెలా బస్సుపై వాయిదా రూ.15 వేలు. భవనం అద్దె నెలకు రూ.30 వేలు చెల్లించడం గగనమైంది. దీంతో స్కూలు యజమాని ఫణీంద్ర కులకర్ణి 80 శాతం వాటాను అమ్మేశారు. – పాల్వంచలోని కేఎల్ఆర్ కిడ్స్ పాఠశాల యాజమాన్యం.. కరోనా పరిస్థితుల్లో నిర్వహణ భారమై ఓ కార్పొరేట్ విద్యాసంస్థతో కలిసి స్కూలు నడపడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇవీ ప్రైవేటు యాజమాన్యాల విన్నపాలు – ఈ రెండేళ్ల ఆస్తిపన్నును పూర్తిగా రద్దుచేయాలి – ఆస్తిపన్నును వాణిజ్య కేటగిరీ నుండి శాశ్వతంగా సేవా కేటగిరీలోకి మార్చాలి. – విద్యుత్ బిల్లును వాణిజ్య కేటగిరీ నుండి సాధారణ కేటగిరీకి మార్చాలి – పాఠశాల బస్సుల రవాణా పన్నును రద్దుచేయాలి. – ఏప్రిల్, మే, జూ¯న్ నెలల్లో ఇచ్చినట్లుగా ఉపాధ్యాయులకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం ఈ విద్యా సంవత్సరమంతా ఇవ్వాలి. ఇది 35 ఏళ్ల చరిత్ర కలిగిన గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని ఎస్వీవీ పాఠశాల. వేలాదిమందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఈ స్కూలు మొన్నటివరకు 1,500 మంది విద్యార్థులు, 20 మంది ఉపాధ్యాయులతో కళకళలాడింది. కరోనా దెబ్బకు విద్యార్థుల సంఖ్య 120కి పడిపోయింది. ఫీజులు వసూలుకాక, జీతాలివ్వలేక స్కూలు భవనాన్ని ఫంక్షన్‌హాలుగా మార్చేసినట్టు కరస్పాండెంట్ సర్వోత్తమరెడ్డి చెప్పారు. ‘టులెట్’బోర్డు కనిపిస్తున్న ఈ భవనంలో శ్రీవాణి ప్రైవేటు పాఠశాల (సంగారెడ్డి) 18 ఏళ్లుగా నడిచింది. కరోనాతో రెండేళ్లుగా బోధన లేదు. ఫీజులూ వసూలుకాలేదు. విధిలేని పరిస్థితుల్లో యాజమాన్యం అద్దె భవనాన్ని ఖాళీచేసింది. దీంతో భవనం యజమాని టులెట్ బోర్డు పెట్టారు. అద్దె ఇవ్వలేం.. ఫర్నిచర్ అమ్ముకోండి ఇది నల్లగొండలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. తరగతులు నడవక, ఫీజులు కట్టలేక 200 మంది విద్యార్థులు మానేశారు. దీంతో ఆదాయంలేక గతేడాది మార్చి నుంచి స్కూలు యాజమాన్యం భవన యజమానికి రూ.8 లక్షల అద్దె బకాయిపడింది. చేసేదిలేక అద్దె కింద సరిపెట్టుకోవాలంటూ ఫర్నిచర్‌ను వదిలేసింది. మూతపడిన స్కూలు కార్పొరేట్ వశం ఐరిష్ ఎడ్యూవ్యాలీ వరల్డ్ స్కూల్.. యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్పూర్లో మూడేళ్ల క్రితం అట్టహాసంగా ప్రారంభమైంది. కరోనా తదనంతర పరిణామాలతో గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు పిల్లల్లేక, ఫీజులురాక మూతపడింది. దీంతో యాజమాన్యం.. ఈసీఐఎల్‌లోని కాల్ పబ్లిక్ స్కూల్ అనే కార్పొరేట్ సంస్థకు అమ్మేసింది. అపార్ట్మెంట్లోవాచ్మన్గా టీచర్ ఈయన పేరు బాల్‌రాజు (మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్). పీజీ, బీఈడీ చేసిన ఈయన స్థానిక ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేసేవాడు. భార్య సైతం పీజీ, బీఈడీ పూర్తిచేసి అదే స్కూల్లో పాఠాలు చెప్పేవారు. కరోనా పరిస్థితుల్లో స్కూలు మూతపడింది. ఇద్దరి ఉద్యోగాలూపోయాయి. దీంతో బాల్‌రాజు మహబూబ్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా చేరాడు. కులవృత్తి అయిన లాండ్రీ పని కూడా చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. -
తెలంగాణలో విద్యాసంస్థల రీఓపెన్: ఆన్లైన్ కాదు.. అందరూ రావాల్సిందే
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభంపై విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో పాఠశాలల పునఃప్రారంభంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆన్లైన్ క్లాసుల నిర్వహణ లేదని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాఠశాలకు రావాల్సిందేని చెప్పారు. పారిశుద్ధ్యం బాధ్యత సర్పంచ్, కార్పొరేటర్, మేయర్‌లదేనని తేల్చి చెప్పారు. సంక్షేమ వసతిగృహాల్లో ఐసోలేషన్ గది ఏర్పాటుకు నిర్ణయించారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు చేసి ఇంటికి పంపే ఏర్పాట్లపై చర్చించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఉన్నారు. -
Telangana: విద్యాసంస్థల పునఃప్రారంభం.. సీఎం కేసీఆర్ ఆదేశాలు
-
AP: పాఠశాలలు పునఃప్రారంభం: ఉత్సాహంగా విద్యార్థులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కోవిడ్ సెకండ్ వేవ్‌తో ఈ ఏడాది ఏప్రిల్ 20వతేదీ నుంచి స్కూళ్లు దీర్ఘకాలం మూతపడిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు నెలల పాటు ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు స్కూళ్లు పునఃప్రారంభంతో ఉత్సాహంగా వస్తున్నారు. ఉత్సాహంగా విద్యార్థులు.. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచనలతో రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పూర్తిస్థాయిలో తెరవాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఈమేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యాశాఖ శనివారమే అన్ని స్కూళ్లకు సవివరంగా సర్క్యులర్ పంపింది. స్థానిక పరిస్థితులను అనుసరించి స్కూళ్లవారీగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) అమలు చేసేలా కార్యాచరణ చేపట్టింది. విద్యాశాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. కడప: విద్యార్థినులకు టెంపరేచర్ పరీక్షిస్తున్న టీచర్ నాడు–నేడు కింద అభివృద్ధి చేసిన స్కూళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయమే ఉత్సాహంగా వచ్చిన విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన సదుపాయాలను చూసి సంబరంతో మురిసిపోతున్నారు. మరోపక్క ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 47 లక్షల మందికిపైగా విద్యార్థులకు తొలిరోజే జగనన్న విద్యాకానుక కింద స్టూడెంట్ కిట్ల పంపిణీ కూడా ప్రారంభం కావడం విశేషం. స్కూళ్లకు వచ్చిన విద్యార్థులందరికీ కిట్లను విద్యాశాఖ పంపిణీ చేసింది. ఈ నెల 31వ తేదీవరకు విద్యార్థులకు కిట్లను అందించనున్నారు. ఆనందడోలికల్లో... నాడు–నేడు కింద అభివృద్ధి చేసిన స్కూళ్లకు వచ్చిన చిన్నారులు తమ బడి రూపురేఖలు పూర్తిగా మారిపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఆహ్లాదకరమైన రంగులు, అందమైన చిత్రాలు, తరగతి గదుల్లో సౌకర్యంగా ఉన్న డ్యూయెల్ డెస్కులు వారిని ఆనందంలో ముంచెత్తాయి. మంచినీటి సదుపాయం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, పచ్చిక బయళ్లతో పచ్చగా మారిన పాఠశాల ఆవరణను తిలకించిన విద్యార్థుల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సెకండియర్ విద్యార్థులకు కూడా ప్రత్యక్ష తరగతులు సోమవారం నుంచే ప్రారంభమయ్యాయి. ఈ విద్యార్థులకు జూలై 1 నుంచి ఆన్లైన్ బోధన జరుగుతుండగా తాజాగా తరగతుల్లో ప్రత్యక్ష బోధనను ఆరంభించారు. తరగతులకు చాలాకాలం దూరంగా ఉండడంతో జూనియర్ కాలేజీల్లో సైతం విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. విశాఖ: మధురానగర్ పాఠశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన బెంచీలపై విద్యార్థినులు పూర్తిగా తెరుచుకోని ప్రైవేట్ విద్యాసంస్థలు... ప్రైవేట్ యాజమాన్యాల ఆధ్వర్యంలోని స్కూళ్లలో తొలిరోజు కొన్ని మాత్రమే తెరుచుకున్నాయి. కొన్ని చోట్ల వచ్చే వారం తెరుస్తామని పేర్కొనగా మరికొన్ని ప్రాంతాల్లో ఒకటి రెండురోజులు ఆగి ప్రారంభిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. జూనియర్ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రైవేట్ కాలేజీలు మాత్రం తరగతులు ప్రారంభించాయి. ప్రభుత్వ స్కూళ్లలో పెరగనున్న చేరికలు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పరిధిలో 61,208 పాఠశాలలుండగా 73 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో 45 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లు కాగా తక్కినవి ప్రైవేట్ యాజమాన్యాల ఆధ్వర్యంలో ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో 43.33 లక్షల మందికిపైగా, ఎయిడెడ్ స్కూళ్లలో 1.96 లక్షలు, ప్రైవేట్ స్కూళ్లలో 27.77 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు కొనసాగుతున్నందున ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు ఇంకా పెరుగుతాయని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: నూతన విధానంలో ఆరు రకాలుగా పాఠశాలలు -
ఆంధ్రప్రదేశ్‌లో తెరుచుకున్న బడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం అయ్యాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులు, సిబ్బంది వైరస్ బారిన పడకుండా ఉండేలా విద్యా శాఖ జాగ్రత్తలు చేపట్టింది. పాఠశాలల వారీగా కోవిడ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) అమలుకు వీలుగా మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్గదర్శకాలు ఇవి.. ప్రతి తరగతి గదిలో 20 మందికి మించకుండా పిల్లలను అనుమతిస్తున్నారు. ఇక విద్యార్థులు తమ తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే తరగతులకు హాజరు కావాలి. విద్యార్థులు, సిబ్బంది విధిగా మాస్కులు ధరించాలి. పాఠశాల లోపల, బయట పరిసరాల్లోనూ పూర్తిస్థాయిలో శానిటైజేషన్ అమలు చేస్తారు. పాఠశాలలు గతంలో నిర్దేశించిన సమయాల ప్రకారమే పని చేస్తాయి. ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రతిరోజూ స్కూళ్లకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశించింది. పిల్లల సంఖ్యకు తగినమేర వసతి లేని పక్షంలో తరగతులను రోజు విడిచి రోజు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. కోవిడ్ లక్షణాలున్న వారికోసం ఐసోలేషన్ విద్యార్థులు పాఠశాలలోకి ప్రవేశించే ముందు వారికి థర్మల్ స్కానింగ్ చేశారు. విద్యార్థులలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలుంటే వారిని ఇళ్లకు తిరిగి పంపి వైద్య పరీక్షలు చేయించనున్నారు. కోవిడ్ లక్షణాలున్న వారికోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు. ఇళ్లలో వృద్ధులు, రోగులు ఉన్న విద్యార్థులు స్కూలుకు రాకుండా ఇళ్ల వద్దనే ఉండేలా సూచించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. అనారోగ్యంతో ఉండే విద్యార్థులు కూడా స్కూళ్లకు రాకుండా హెచ్ఎంలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. విద్యార్థులకు వైద్య పరీక్షల కోసం సమీపంలోని పీహెచ్‌సీలను సంప్రదించాలి. ఇద్దరు విద్యార్థులు, సిబ్బందిలో ఒకరికి ప్రతి వారం ర్యాండమ్‌గా వైద్య పరీక్షలు చేయించాలి. వారిలో ఎవరికైనా పాజిటివ్ ఉంటే కనుక మొత్తం తరగతిలోని విద్యార్థులందరికీ పరీక్షలు జరిపేలా విద్యాశాఖ అన్ని స్కూళ్లకు ఆదేశాలు పంపింది. భౌతిక దూరం తప్పనిసరి తరగతి గదిలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు చేయించారు. మరోవైపు మధ్యాహ్న భోజనం అందించే సమయంలో అందరికీ ఒకేసారి కాకుండా వేర్వేరు తరగతులకు వేర్వేరు సమయాల్లో అందించనున్నారు. స్కూలు వదిలిన సమయంలో అందరినీ ఒకేసారి కాకుండా 10 నిమిషాల వ్యవధి ఇచ్చి తరగతుల వారీగా బయటకు పంపనున్నారు. స్కూలుకు వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు భౌతిక దూరం ఉండేలా విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తప్పనిసరిగా స్నానం చేయడమో లేదా చేతులు కడుక్కొని మాత్రమే ఇళ్లలోకి ప్రవేశించాలని సూచిస్తున్నారు. స్కూలులో కూడా కోవిడ్ జాగ్రత్తలపై ఒక పీరియడ్‌లో అవగాహన కల్పిస్తారు. స్కూలు అసెంబ్లీ, బృంద చర్చలు, గేమ్స్, స్పోర్ట్సు వంటివి పూర్తిగా రద్దు చేశారు. -
రేపటి నుంచే స్కూళ్లు.. పిల్లల ఆరోగ్యానికే ప్రథమ ప్రాధాన్యం
►రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గినప్పటికీ, విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. తరగతి గదుల్లో, బయట పూర్తిగా శానిటైజ్ చేయడంతో పాటు మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి చేసింది. పిల్లల ఆరోగ్యంలో ఏమాత్రం తేడా కనిపించినా వెంటనే వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేసింది. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు తొలి ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంది. కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం స్కూళ్ల వారీగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ప్రతి స్కూల్‌కు ప్రత్యేకంగా ఎస్ఓపీ) రూపొందించి, అమలు చేస్తోంది. సోమవారం నుంచి అన్ని తరగతులు ప్రారంభం కానున్నాయి. కోవిడ్ నేపథ్యంలో ఇప్పటికే టీచర్లకు వ్యాక్సినేషన్ దాదాపు పూర్తి చేశారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినందున ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. అయినప్పటికీ పిల్లల ఆరోగ్య భద్రత ముఖ్యమైన అంశం కాబట్టి, ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా సెక్షన్‌కు 20 మంది ఉండేలా చర్యలు తీసుకుంది. ఇందుకు గదులు సరిపోకపోతే 6, 7, 8 తరగతులకు ఒక రోజు, 9, 10 తరగతులకు మరుసటి రోజు (రోజు విడిచి రోజు) తరగతులు నిర్వహిస్తారు. ప్రాథమికంగా అంటే 1, 2, 3 తరగతులకు ఒక రోజు, 4, 5 తరగతులకు మరుసటి రోజు తరగతులు ఏర్పాటు చేస్తారు. తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితో విద్యార్థులు స్కూళ్లకు రావాల్సి ఉంటుంది. పాఠశాల తరగతి గదుల్లోనే కాకుండా ఆవరణలో, బయట పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా శానిటైజ్ చేయిస్తున్నారు. పిల్లల్లో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వారిని వేరుగా ఉంచేందుకు ఐసోలేషన్ రూమును ఏర్పాటు చేస్తున్నారు. ఆ వెంటనే సమీపంలోని పీహెచ్సీ, ఆసుపత్రికి తెలియచేసి, వారికి వైద్యం అందేలా చూడాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఫౌండేషన్ విద్యతో అందలం బాల్య దశలోనే విద్యార్థులకు బలమైన పునాది వేయాలన్న లక్ష్యంలో భాగంగానే ప్రభుత్వం ఫౌండేషన్ స్కూళ్ల విధానాన్ని ప్రారంభిస్తోంది. సీఎం వైఎస్ జగన్ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. జాతీయ నూతన విద్యా విధానంలో పొందుపర్చకముందే రాష్ట్రంలో దీనిపై చర్యలు చేపట్టారు. ఫౌండేషన్ విద్య ద్వారా భవిష్యత్తులో మన విద్యార్థులు అంతర్జాతీయ అవకాశాలను సులువుగా అందుకోగలిగే స్థాయికి చేరుకుంటారు. ఇప్పటివరకు ఉన్న వ్యవస్థలో ఆ మేరకు ప్రమాణాలు నెలకొల్పే అవకాశం లేనందునే కొత్త విధానం తీసుకొస్తున్నారు. 5+3+3+4 విధానంలో శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీహైస్కూల్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్ విధానంలో స్కూళ్లు ఉంటాయి. ఇందుకు సంబంధించి మ్యాపింగ్ పూర్తయింది. తొలుత అంగన్వాడీ సెంటర్లు, ప్రైమరీ, హైస్కూళ్లు ఒకే ఆవరణలో లేదా పక్కపక్కనే ఉన్న చోట్ల ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తారు. మిగిలిన చోట్ల అంచెలంచెలుగా రెండేళ్లలో కొత్త విధానం అమల్లోకి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. నాడు–నేడుతో మౌలిక సదుపాయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా మనబడి నాడు–నేడు పథకం కింద రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, ఎంఆర్సీ, భవిత కేంద్రాల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తోంది. తొలి విడతలో 15,715 స్కూళ్లలో రూ.3,600 కోట్లకు పైగా నిధులతో వివిధ సదుపాయాలు కల్పించింది. ఇదంతా సమాజం ఆస్తి కనుక, వీటిని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంటుంది. అందుకే తల్లిదండ్రుల కమిటీలను ఈ పనుల పర్యవేక్షణలో భాగస్వామ్యం చేసింది. హెడ్మాస్టర్లు, టీచర్లు, తల్లిదండ్రుల కమిటీలు అభివృద్ధి చేసిన స్కూళ్లను జాగ్రత్తగా నిర్వహించుకునే విధంగా ప్రభుత్వం పలు సూచనలు చేసింది. మరుగుదొడ్ల నిర్వహణకు ఆయాలను ఏర్పాటు చేయడంతో పాటు మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు వేతనాన్ని పెంచింది. రెండో విడతలో రూ.4,800 కోట్లతో 16 వేల పాఠశాలల అభివృద్ధి పనులకు ఈనెల 16న శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ చర్యలతో పెరిగిన చేరికలు విద్యారంగంలో సీఎం జగన్ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇంటర్మీడియెట్, డిగ్రీ ప్రవేశాలను ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. తద్వారా పారదర్శకత ఏర్పడడంతో పాటు రిజర్వేషన్లు తప్పక అమలవుతాయి. ఆయా వర్గాలకు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వ చర్యల కారణంగా స్కూళ్లలో విద్యార్థులు గతంలో కంటే 6 లక్షల మందికి పైగా పెరిగారు. కొత్తగా 2.5 లక్షల మంది స్కూళ్లలో చేరారు. డ్రాపవుట్ల శాతం బాగా తగ్గింది. బోధనా సామర్థ్యం పెంపుపై దృష్టి బోధనలో నాణ్యతా ప్రమాణాలను పెంచడం అత్యంత ఆవశ్యకం. ఇందుకు ఉపాధ్యాయులు ముఖ్యపాత్ర పోషించాలి. ఇందుకోసం ప్రభుత్వం వారికి శిక్షణ ఇప్పిస్తోంది. ఇందుకోసం ఒంగోలులో ఏర్పాటు చేస్తున్న ఆంధ్రకేసరి ప్రకాశం యూనివర్సిటీ ద్వారా టీచర్ ఎడ్యుకేషన్‌పై మరింతగా దృష్టి సారించనుంది. స్కూళ్లు తెరిచేందుకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు ఇలా.. ►10% కన్నా తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లోనే స్కూళ్లు తెరవాలని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసినందున వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతి వారం కోవిడ్ కేసులను గుర్తిస్తుండాలి. ►బోధన, బోధనేతర సిబ్బంది ప్రతిరోజూ హాజరు కావాలి. రెగ్యులర్ సమయం ప్రకారమే తరగతులు కొనసాగాలి. ►అన్ని విద్యా సంస్థల్లో కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలి. ►పోర్టబుల్ థర్మల్ స్కానర్‌తో ప్రవేశద్వారం వద్దే విద్యార్థులను పరిశీలించాలి. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఇంటికి పంపి, పరీక్షలు చేయించుకోమని చెప్పాలి. ►శానిటైజర్ ఏర్పాటు చేసి, తరచూ చేతులు శుభ్రం చేసుకోమని చెప్పాలి. స్కూలు అసెంబ్లీ, గ్రూప్ వర్కులు, గేమ్స్ వంటివి నిర్వహించరాదు. ►తరగతి గదుల్లో 6 అడుగుల భౌతిక దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు చేయాలి. టాయిలెట్ల వద్ద, భోజనాల సమయంలోనూ ఇది పాటించాలి. తరగతి గదులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. ►ఇళ్లలో వృద్ధులైన తాత, అమ్మమ్మ, నాన్నమ్మలు ఉంటే పరిస్థితులు చక్కబడే వరకు ఇళ్ల వద్దనే ఉండాలి. ►రోగగ్రస్థులుగా ఉన్న విద్యార్థులను స్కూళ్లకు అనుమతించరాదు. ►మధ్యాహ్న భోజన పదార్థాలను వేర్వేరు సమయాల్లో వేర్వేరు తరగతుల విద్యార్థులకు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలి. పాఠశాల వదిలినప్పుడు గుంపుగా బయటకు పంపకూడదు. ►ప్రతి వారం ప్రతి స్కూలులో ఇద్దరు విద్యార్థులు, సిబ్బంది నుంచి ఒకరికి ర్యాండమ్ టెస్టులు చేయాలి. ఎవరికైనా పాజిటివ్ లక్షణాలుంటే అందరికీ పరీక్షలు చేయించాలి. ►కోవిడ్‌పై తీసుకోవలసిన జాగ్రత్తలకు పీరియడ్‌ను కేటాయించాలి. స్కూలు నుంచి ఇంటికి వెళ్లిన వెంటనే ప్రతి విద్యార్థి స్నానం చేసేలా అవగాహన కల్పించాలి. ►పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, పుస్తకాలు, వాటర్ బాటిళ్లు, గ్లాసులు ఇచ్చిపుచ్చుకోవడం నిషేధం. ►టాయిలెట్లను రోజూ శుభ్రం చేయించాలి. స్కూలు బస్సుల్లేని పిల్లలను తల్లిదండ్రులే స్కూళ్ల వద్ద దింపాలి. ►ప్రతి స్కూలులో కోవిడ్ జాగ్రత్తల అమలుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి. మిగిలిపోయిన టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి. కట్టుదిట్టంగా విద్యా కానుక జగనన్న విద్యాకానుక కిట్లను రూ.800 కోట్లతో ఈనెల 16 నుంచి 31వ తేదీలోగా రాష్ట్రంలోని దాదాపు 48 లక్షల మంది విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పంపిణీలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఇప్పటికే తగిన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి బ్యాగుపై విద్యార్థి పేరు, తరగతి, కిట్లలోని వస్తువులను పొందుపరుస్తున్నారు. 3 జతల యూనిఫాం క్లాత్, షూ, 2 జతల సాక్సులు, బెల్టు, బ్యాగు, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్కులు, నోట్ బుక్కులు తదితరాలను కిట్ రూపంలో అందిస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టినందున పక్కపక్క పేజీల్లో ఇంగ్లిష్, తెలుగులో మిర్రర్ ఇమేజ్‌లో ఉండే బైలింగ్యువల్ పాఠ్యపుస్తకాలను అందిస్తున్నారు. దీనికి తోడు విద్యార్థులకు సులభంగా ఆయా పదాలు అర్థం చేసుకోవడానికి 1–5వ తరగతి వరకు బొమ్మలతో ఉన్న డిక్షనరీలు, 6–10 తరగతుల విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు అందిస్తున్నారు. యూనిఫాం వస్త్రం, షూ కొలత సరిగా లేకున్నా, బ్యాగు నాణ్యత బాగోలేకున్నా వెనక్కు పంపి, మంచివి తెప్పించుకోవాలని చెప్పింది. లోపాలున్న వాటిని సెప్టెంబర్ 15 కల్లా తిరిగి పంపి ఆ విషయాన్ని రాష్ట్ర కార్యాలయానికి తెలియచేయాలి. టోల్ ఫ్రీ నంబర్ 9154296169కు ఫిర్యాదు చేయొచ్చు. జగనన్న విద్యాకానుకపై యాప్‌ను కూడా రూపొందించారు. విద్యా రంగానికి వైఎస్ జగన్ పెద్దపీట మంత్రి ఆదిమూలపు సురేష్ పి.గన్నవరం : విద్య మీద పెట్టే వ్యయం విద్యార్థుల భవిష్యత్‌కు పెట్టుబడి.. అనే మహోన్నత ఆలోచనతో సీఎం వైఎస్ జగన్ ఏటా విద్యా రంగానికి బడ్జెట్లో రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నాడు–నేడు కింద రాష్ట్రంలో మొదటి విడతలో ఆధునీకరించిన ప్రభుత్వ పాఠశాలలను సీఎం ఈ నెల 16న ప్రజలకు అంకితం చేస్తున్న తరుణంలో ఇక్కడ తలపెట్టిన సభ ఏర్పాట్లను మంత్రి పినిపే విశ్వరూప్, స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేస్తూ సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. -
AP: ఎల్లుండి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లుండి సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు తెరవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 61 వేల ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెట్ పాఠశాలల్లో 70 లక్షల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యాలయాలు ప్రత్యేక జాగ్రత్తలతో తెరచుకోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. తరగతుల నిర్వహణకు ప్రత్యేక ఎస్వోపీ ప్రతి సెక్షన్‌కు 20 మంది విద్యార్థులు మించకుండా తరగతుల నిర్వహణ ప్రతి విద్యార్థి మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడం తప్పనిసరి ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఎప్పటికప్పుడు కోవిడ్ టెస్ట్‌లు చేసేలా చర్యలు రెగ్యులర్ టైమింగ్‌లోనే తరగతులు నిర్వహించాలి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది ఉపాధ్యాయులు వంద శాతం వ్యాక్సినేషన్ -
మ్యాగజైన్ స్టోరీ 13 August 2021
-
బడికెళదాం... రండి!
పసిహృదయాల అమాయకపు మాటలు... ఆటలు... పాటలు... ఎవరికైనా ఓ సుందర దృశ్యం. ఆ చిన్నారి దైవాలు కొలువైన బడులు మూతబడి, ఆ అందమైన దృశ్యాలు అరుదైపోయి చాలా కాలమైంది. దేశంలోని ప్రతి చిన్నారీ ఏణ్ణర్ధంగా ఇంటికే పరిమితమైన స్థితి. ఇవాళ్టికీ అందరికీ అందుబాటులో లేని ఆన్లైన్ చదువులతో... అవకాశం ఉన్న కొద్దిమంది కుస్తీలు పడుతున్న పరిస్థితి. ప్రత్యక్ష తరగతులు లేక, మాట్లాడుకొనే తోటి వయసు పిల్లలు లేక, శారీరక – మానసిక – పరిశీలనా వికాసానికి దూరమైన దుఃస్థితి. ఇది లేత వయసులో సామాజికంగా జరగాల్సిన సర్వతోముఖ అధ్యయనాన్ని కోల్పోయిన అనూహ్య విషాదం. నిపుణులు అన్నట్టు... ఒక రకంగా ‘విద్యారంగంలో ఎమర్జెన్సీ’. బడుల మూత వల్ల పిల్లల మానసిక ఆరోగ్యంపై పడుతున్న ప్రభావం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరిస్తోంది. అందుకే, ప్రపంచంలో అనేక దేశాలు స్కూళ్ళు తెరుస్తున్నాయి. మన దేశంలో ఆంధ్రప్రదేశ్‌తో సహా దాదాపు 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా వేళ కొంత సాహసించి, అనేక జాగ్రత్తలతో విద్యాలయాలు తెరవాలని నిర్ణయం తీసుకున్నాయి. గడచిన 16 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మంది పిల్లలు విలువైన బడి సమయాన్ని కోల్పోయారు. జీవితంలో ఎంతో విలువైన అనుభూతులకు దూరమయ్యారు. మన దేశంలో 15 లక్షలకు పైగా స్కూళ్ళు మూతబడ్డాయి. ఏకంగా 24.7 కోట్ల పైచిలుకు పిల్లలపై ప్రభావం పడింది. దాని దుష్పరిణామాలు తెలుసు కాబట్టే, ‘కరోనా అనంతర కొత్త జీవితానికి’ తగ్గట్టుగానే, అమెరికా సహా అనేక దేశాలు బడులు తెరిచాయి. మన దేశంలో అయితే, గత ఏణ్ణర్ధకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో బడి వయసు ఆడపిల్లల్లో బాల్య వివాహాలు పెరిగాయి. మైనర్లయిన మగపిల్లలను చదువు మాన్పించి, పనుల్లో పెడుతున్నారు. పశ్చిమ బెంగాల్లో వెల్లడైన తాజా అధ్యయన ఫలితాలు అందుకు ఓ చిన్న ఉదాహరణ. విద్యారంగంపై ఏర్పాటైన మన పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా కరోనాతో దీర్ఘకాలం బడులు మూసివేయడం వల్ల విపరిణామాలు తీవ్రంగా ఉన్నాయనీ, వాటినీ విస్మరించలేమనీ ఇటీవలే తేల్చింది. ఇలాంటి మానసిక, సామాజిక దుష్పరిణామాల నేపథ్యంలో... ఆరోగ్య, పరిశుభ్రతా ప్రమాణాలు పాటిస్తూ పాఠశాలలను తెరవడం కీలకమన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ అభిప్రాయం సైతం ఎంతో విలువైనది. కరోనాతో సహజీవనం తప్పని పరిస్థితుల్లో, అన్ని వ్యాపారాలూ, విద్యాలయాలు తెరవడానికి ఫలానాది సరైన సమయమని ఎప్పటికీ చెప్పలేని పరిస్థితి. ఏళ్ళ తరబడి విద్యాలయాలు మూసేసి, లక్షల మందిని చదువుకు దూరం చేయడం ఏ రకంగా చూసినా సమంజసం కాదు. ఇటు బడిపిల్లలే కాదు.. అధ్యాపకులూ అవస్థలు పాలయ్యారు. పిల్లలు ఫీజులు కట్టని స్థితిలో, దేశంలో ప్రైవేటు రంగ బడ్జెట్ స్కూళ్ళు వేల కొద్దీ మూతబడ్డాయి. ఎందరో ఉపాధి పోయి, వీధిన పడ్డారు. తక్షణ చర్యలు చేపట్టకపోతే, ఇది విద్యారంగంలో పెను సంక్షోభానికి దారి తీస్తుంది. అందుకే, స్కూళ్ళు తెరవడం ఇప్పుడు కీలకం. జూలైలోనే హరియాణా, నాగాలాండ్ బడి గంట మోగించాయి. ఈ నెలలో ఇప్పటికే పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లు పిల్లలకు ప్రత్యక్ష తరగతులకు సై అన్నాయి. ఏపీ ప్రభుత్వం పిల్లల చదువులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ, ఈ ఆగస్టు 16 నుంచి అన్ని రకాల ముందు జాగ్రత్తలతో స్కూళ్ళు తెరుస్తోంది. కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశాలు ఇదే బాటలో నడుస్తున్నాయి. తెలంగాణ సర్కార్ సైతం అదే యోచన చేస్తున్నట్టు వార్త. కరోనా మూడోవేవ్ మాటల నేపథ్యంలో ఆన్లైన్ బోధనతోనే సరిపెట్టవచ్చుగా అని వాదిస్తున్నవారూ లేకపోలేదు. కానీ, మన దేశంలో గ్రామీణ, నగర ప్రాంతాల మధ్య తేడాను గుర్తుంచుకోవాలి. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వసతి లేని కరవైన కోట్లాది జనం... చెట్లూ, గుట్టలు ఎక్కితే కానీ ఆన్లైన్ క్లాసులు చూడలేని గ్రామీణ విద్యార్థులు ఉన్న దేశంలో పూర్తిగా ఆన్లైన్ విద్యాబోధన ఆచరణ సాధ్యం కాదు. దాని వల్ల అర్ధంతరంగా చదువు మానేస్తున్నవారి సంఖ్యా లక్షల్లో ఉన్నట్టు గణాంకాలే సాక్ష్యం. అందుకే, మన దగ్గర ప్రత్యక్ష తరగతుల ప్రాధాన్యం మరీ ఎక్కువ. అదే సమయంలో ప్రత్యక్ష తరగతుల కోసం తగు జాగ్రత్తలూ తప్పనిసరి. అమెరికాలో 50 శాతానికి పైగా, బ్రిటన్‌లో 80 శాతానికి పైగా కరోనా టీకాలు వేయడం పూర్తయింది. కానీ, మన దేశంలో ఆ సంఖ్య దాదాపు 12 శాతమే అని ఓ లెక్క. ఈ పరిస్థితుల్లో ముందుగా మన అధ్యాపకులందరికీ టీకాలు వేయడం పూర్తి చేయాలి. స్కూలు పిల్లలున్న తల్లితండ్రులకూ టీకాలు వేయడం కీలకం. అతి తొందర చూపకుండా ఒక్కో అడుగు వేస్తూ, ముందుకు పోవాల్సిన సమయమిది. ముందుగా బడిసమయాన్ని కొన్ని గంటలకే పరిమితం చేయవచ్చు. కొన్ని తరగతుల పిల్లలతోనే స్కూళ్ళు తెరిచి, క్రమంగా విస్తరించవచ్చు అని నిపుణుల సూచన. అలాగే, కొంత ఆన్లైన్, మరికొంత ప్రత్యక్ష తరగతులతో సమ్మిళిత విద్యాబోధన విధానాన్ని కొంతకాలం అనుసరించవచ్చు. ఇలాంటి ఆచరణాత్మక ప్రణాళికలతో దేశవ్యాప్తంగా బడి చదువులు మళ్ళీ పట్టాలెక్కాలి. బయట వ్యక్తమవుతున్న భయాలతో సంబంధం లేకుండా, పిల్లలు బడి బాట పట్టేందుకు తహతహలాడుతున్నారు. కరోనా కష్టం పేరుతో విద్యారంగాన్ని అనాథలా వదిలేయరాదని పాలకులూ గుర్తించారు. నిర్దిష్ట వ్యూహంతో, చిన్నారుల్లో చిరునవ్వులు వెలిగించవచ్చు. అవును... బడి గంటలు మోగే వేళయింది. చదువుల తల్లి ఒడి చేరే వేళయింది. రండి... అన్ని ఆరోగ్య జాగ్రత్తలతో, బడికెళదాం! -
AP: 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
-
AP: 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
సాక్షి, అమరావతి: ఈనెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్నారు. 95శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని తెలిపారు. మిగిలిన వారికి కూడా త్వరితగతిన టీకాలు వేయాలని ఆదేశించామని మంత్రి సురేష్ తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల్లో నేటినుంచి సినిమా థియేటర్లు రీఓపెన్
-
ఆగస్ట్ 16న స్కూళ్లు పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు: మంత్రి సురేష్
సాక్షి, అమరావతి: ఆగస్ట్ 16న స్కూళ్లు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. అదే రోజు జగనన్న విద్యాకానుక ఇస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విద్యాకానుకలో ఈసారి డిక్షనరీ కూడా ఇస్తున్నామన్నారు. 15వేల స్కూళ్లను నాడు-నేడు కింద అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. మొదటి దశ నాడు-నేడును ప్రజలకు అంకితం చేస్తామన్నారు. అదే రోజు రెండో విడత నాడు-నేడు పనులను కూడా ప్రారంభిస్తామన్నారు. ఈలోపు టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని మంత్రి సురేష్ పేర్కొన్నారు. -
16 నుంచి స్కూళ్లు.. ఆ రోజే నూతన విద్యావిధానంపై ప్రకటన
రూ.16 వేల కోట్లతో చేపట్టిన నాడు – నేడు, నూతన విద్యా విధానంతో సాధించబోయే లక్ష్యాలను స్పష్టంగా చెప్పాలి. సమూల మార్పుల ద్వారా విద్యా వ్యవస్థ పునరుజ్జీవానికి ఏం చేయబోతున్నామో తెలియజేయాలి. తల్లిదండ్రులకూ అవగాహన కలిగించాలి. నూతన విధానంలో ఏరకంగా ఉద్యోగ తృప్తి ఉంటుందో టీచర్లకు వివరించాలి. – సీఎం జగన్ 16న జరిగే మరిన్ని కార్యక్రమాలు ►తొలి విడత నాడు–నేడు కింద రూపురేఖలు మారిన స్కూళ్లు ప్రజలకు అంకితం ►రెండో విడత నాడు నేడు పనులకు శ్రీకారం ►విద్యార్థులకు విద్యా కానుక కిట్లు పంపిణీ కొత్త విధానంలో 6 రకాల స్కూల్స్ 1.శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2) 2.ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు) 3.ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5 తరగతులు) 4.ప్రీ హైస్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5, 6, 7 తరగతులు) 5.హైస్కూల్స్ (3 నుంచి 10వ తరగతి వరకు) 6.హైస్కూల్ ప్లస్ (3 నుంచి 12వ తరగతి వరకు) సాక్షి, అమరావతి: వచ్చే నెల 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా శాఖను ఆదేశించారు. అదే రోజు తొలి విడతలో నాడు–నేడు కింద రూపురేఖలు మారిన స్కూళ్లను ప్రజలకు అంకితం చేస్తూ.. రెండో విడత స్కూళ్లలో నాడు–నేడు కింద పనులకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. అదే రోజే విద్యా కానుకను ప్రారంభించి, నూతన విద్యా విధానం విధి, విధానాలను ప్రకటిస్తామని చెప్పారు. విద్యా శాఖ, అంగన్వాడీ కేంద్రాల్లో నాడు–నేడు పనులు, నూతన విద్యా విధానం, విద్యా కానుక అంశాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానంపై గత సమావేశాల్లో ఆలోచనలు, వాటిని ఖరారు చేయడంపై చేసిన కసరత్తును అధికారులు సీఎంకు వివరించారు. నూతన విద్యా విధానాన్ని అనుసరించి స్కూళ్ల వర్గీకరణ ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. ఏమైనా మెరుగులు దిద్దాల్సి ఉంటే త్వరితగతిన ఆ ప్రక్రియ పూర్తి చేసి, వచ్చే నెల 16న నూతన విద్యా విధానం విధివిధానాలను వెల్లడించాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. నాడు–నేడులో భాగంగా స్కూళ్ల ప్రహరీలపై గీసిన ఆకర్షణీయమైన పెయింటింగ్స్ వద్ద ఆడుకుంటున్న పిల్లలు అంగన్వాడీల నుంచే ఇంగ్లిష్ మీడియం ►ఫౌండేషన్ స్కూళ్లలో భాగంగా అంగన్వాడీల నుంచే ఇంగ్లిష్ మీడియం ప్రారంభం అవుతుంది. శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్‌గా అంగన్వాడీలు రూపాంతరం చెందుతాయి. శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్‌కు ఫౌండేషన్ స్కూల్స్ మార్గ నిర్దేశం చేస్తాయి. ఇక్కడ కూడా ఎస్జీటీ టీచర్లు పర్యవేక్షిస్తూ ఉత్తమ బోధన అందేలా చూస్తారు. ►శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ ప్రతి ఆవాసంలో ఉంటుంది. కిలోమీటరు లోపలే ఫౌండేషన్ స్కూల్ ఏర్పాటవుతుంది. మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూల్ ఉంటుంది. మూడు కిలోమీటర్ల పరిధి దాటి ఒక్క స్కూలూ ఉండదు. వీటన్నింటినీ పక్కాగా ఏర్పాటు చేస్తూ నూతన విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నాం. అవగాహన కల్పించాలి ►ఎందుకు నూతన విద్యా విధానం పట్ల మొగ్గు చూపుతున్నామనేదానిపై మరింత జాగ్రత్తగా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. ఫౌండేషన్ స్కూల్స్, నూతన విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు జరిగాయా? లేదా? (విస్తృతంగా చర్చించామని అధికారులు చెప్పారు) ►ఇందులో ఎటువంటి సందేహాలకు తావుండరాదు. తల్లిదండ్రులకు కూడా ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలి. నూతన విద్యా విధానం వల్ల కలిగే ప్రయోజనాలు వారికీ తెలియాలి. ఆ మేరకు విస్తృతంగా అవగాహన కలిగించాలి. ►అంగన్వాడీలకు మరింత ప్రోత్సాహం కలిగించేందుకు వారికి ప్రమోషన్ చానల్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా హేతుబద్ధీకరణ, జాతీయ ప్రమాణాలను అనుసరించి విద్యా వ్యవస్థ ఉంటుంది. ఏ స్కూలునూ మూసేయం, ఎవ్వరినీ తొలగించం. పారదర్శకతతో పనులు ముందుకు సాగాలి ►మొదటి విడత నాడు–నేడులో అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలి. పిల్లల భవిష్యత్తు కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం. ఎక్కడా అవినీతికి, వివక్షకు తావుండరాదు. పిల్లల చదువుల కోసం ఇంత ఖర్చు చేసిన ప్రభుత్వం గతంలో లేదు. ►పారదర్శకతతో పనులు ముందుకు సాగాలి. అవినీతి ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదు. ఈ విషయం పై స్థాయి హెడ్ మాస్టర్ నుంచి కింద స్థాయి వారి వరకు వర్తిస్తుంది. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా చెబుతున్నా. ►పాఠ్య పుస్తకాలు, డిక్షనరీ, జగనన్న విద్యా కానుక.. తదితరాలన్నీ ఆగస్టు 16 నాటికి సిద్ధంగా ఉండాలి. మార్కుల ఆధారంగా గ్రేడ్లు ►తొలిదశలో నాడు–నేడు కింద చేపట్టిన స్కూల్స్‌లో పనులు దాదాపు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. అమ్మఒడి, నాడు–నేడు, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లిష్ మీడియం వంటి సంస్కరణలు విద్యా వ్యవస్ధలో మంచి ఫలితాలు అందించబోతున్నాయన్నారు. ►వరుసగా రెండేళ్లు పరీక్షలు నిర్వహించకుండానే టెన్త్ విద్యార్థులను పాస్ చేశామని, కొన్ని రిక్రూట్మెంట్లలో మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నందున 2020 టెన్త్ విద్యార్థులకూ అంతర్గత పరీక్షల ఆధారంగా మార్కులు ఇస్తామని తెలిపారు. ►ఇలాగే 2021 టెన్త్ విద్యార్థులకూ మార్కులు ఇవ్వనున్నామని వివరించారు. స్లిప్ టెస్టుల్లో మార్కుల ఆధారంగా 70% మార్కులు, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆధారంగా మిగిలిన 30% మార్కులు ఇస్తామన్నారు. మొత్తం మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇస్తామని వెల్లడించారు. ►విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నైపుణ్య బోధనే నూతన విద్యా విధానం లక్ష్యం ►ఉపాధ్యాయులను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకోవడమే నూతన విద్యా విధానం ప్రధాన లక్ష్యం. పిల్లలకు ప్రతి సబ్జెక్టుపై నైపుణ్యం, ఆ సబ్జెక్టులో చక్కటి పరిజ్ఞానం ఉన్న టీచర్లతో బోధన ఉంటుంది. ప్రస్తుతం 5వ తరగతి వరకు ప్రతి టీచర్ 18 రకాల సబ్జెక్టులు బోధిస్తున్నారు. ►ఇంటర్ తర్వాత డిప్లమో ఇన్ ఎడ్యుకేషన్ చేసి సెకండరీ గ్రేడ్ టీచర్లుగా పని చేస్తున్నారు. కొన్ని చోట్ల సుమారు 200 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సి వస్తోంది. మరికొన్ని చోట్ల నలుగురికి ఒకే టీచర్ బోధిస్తున్న పరిస్థితి ఉంది. నూతన విద్యా విధానం ద్వారా ఈ రకమైన పరిస్థితుల్లో మార్పు తెస్తున్నాం. ►5వ తరగతి వరకు 18 సబ్జెక్టులను బీఈడీ, పీజీ చేసిన ఉపాధ్యాయులతో సబ్జెక్టుల వారీగా పిల్లలకు బోధన అందించబోతున్నాం. తద్వారా పిల్లలకు ఫోకస్డ్ ట్రైనింగ్ వస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి శాస్త్రీయంగా ఉండేలా రూపొందిస్తున్నాం. ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ రాబోతున్నారు. -
ఆగస్టు 16న పండుగలా కార్యక్రమాలు: మంత్రి సురేష్
సాక్షి, అమరావతి: ఆగస్టు 16న స్కూళ్లు పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విద్యాశాఖకు సంబంధించిన నాడు-నేడు కార్యక్రమంపై సీఎం జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 16న పండుగలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. తొలి విడత నాడు-నేడు కింద 15 వేలకు పైగా స్కూళ్లను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. రెండో దశ కింద 16వేల స్కూళ్ల పనులను ప్రారంభిస్తామని, విద్యాకానుక కిట్లు కూడా అందించబోతున్నామని తెలిపారు. ప్రీ ప్రైమరీ నుంచి ప్లస్ టూ వరకు మంచి విద్యావ్యవస్థను తీసుకొస్తున్నామన్నారు. ఆగస్టు 16న నూతన విద్యా విధానంపై సమగ్రంగా వివరిస్తామని పేర్కొన్నారు. చర్లందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. -
కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను పున: ప్రారంభించండి: డీఎస్‌జీఎంసీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను పున: ప్రారంభించాలని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనెజ్మెంట్ కమిటీ(డీఎస్‌జీఎంసీ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గత ఏడాది మార్చి నెలలో కోవిడ్ నియంత్రణలో భాగంగా ఈ కారిడార్‌ను మూసివేశారు. అయితే తాజాగా దేశంలో కరోనా నియంత్రణలోకి వస్తున్న సమయంలో మళ్లీ తిరిగి కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను ప్రారంభించాలని కోరారు. దేశంలోని పలు రాష్ట్రాలు కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్ నిబంధనలు తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్తార్‌పూర్ కారిడార్‌ను తిరిగి ప్రారంభించాలని కోరుతున్నట్లు డీఎస్‌జీఎంసీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. ఇక ఈ కారిడార్‌ను నవంబర్, 2019న గురునానాక్ దేవ్ 550 జయంతి సందర్భంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే కరోనా మహామ్మరి కారణంగా గత ఏడాది మార్చి నుంచి మూసివేశారు. ఈ కారిడార్ పార్రంభానికి ముందు భారత్‌లోని సిక్కు భక్తులు పంజాబ్‌లోని డేరాబాబా నానక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద గురుద్వారా కార్తాపూర్ సాహిబ్‌ను బైనాక్యులర్ల ద్వారా దర్శించుకునేవారు. అయితే ప్రస్తుతం బైనాక్యులర్లు సదుపాయం కూడా లేదని మంజింద్ సింగ్ తెలిపారు. సిక్కు మత వ్యవస్థాకులు గురు నానక్ దేవ్ ఆయన జీవితంలో చివరి18 ఏళ్లు పాకిస్తాన్ నారోవల్ జిల్లాలోని గురుద్వారాలో గడిపారు. ఈ కారిడార్ ద్వారా సిక్కు మత భక్తులు వీసా లేకుండానే పాకిస్తాన్‌లోని గురుద్వారాను సందర్శించుకుంటున్న విషయం తెలిసిందే. -
పిల్లలకు టీకా వస్తే స్కూళ్లు తెరుచుకోవచ్చు
న్యూఢిల్లీ: చిన్నారులకు సైతం కోవిడ్–19 వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అదొక గొప్ప ఘనత అవుతుందని, పాఠశాలలు మళ్లీ తెరవడానికి మార్గం సుగమమవుతుందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. పిల్లల కోసం టీకా వస్తే వారికి సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకా కోవాగ్జిన్‌ను 2–18 ఏళ్లలోపు వారిపై పరీక్షించారని, రెండో, మూడో దశ ట్రయల్స్ ఫలితాలు సెప్టెంబర్ నాటికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి రాగానే దేశంలో పిల్లలకు కరోనా టీకా అందుబాటులోకి వస్తుందన్నారు. అంతకంటే ముందే ఫైజర్ టీకాకు అనుమతి లభిస్తే పిల్లలకు అదికూడా ఒక ఆప్షన్ అవుతుందన్నారు. జైడస్ క్యాడిలా సంస్థ జైకోవ్–డి పేరుతో కరోనా టీకాను అభివృద్ధి చేసిందని, భారత్‌లో ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం త్వరలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. జైకోవ్–డి టీకాను పెద్దలతోపాటు 12–18 ఏళ్లలోపు పిల్లలు సైతం తీసుకోవచ్చని గులేరియా తెలిపారు. చిన్నారులకు కరోనా వైరస్ సోకినప్పటికీ చాలామందిలో లక్షణాలు కనిపించడం లేదని, కొందరిలో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇలాంటివారు కరోనా వాహకులుగా (క్యారియర్లు) మారుతున్నారని అన్నారు. దేశంలో 12 నుంచి 18 ఏళ్లలోపు వారు 13 కోట్ల నుంచి 14 కోట్ల మంది ఉంటారని, వీరందరికీ కరోనా టీకా ఇవ్వడానికి 25 కోట్ల నుంచి 26 కోట్ల డోసులు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
మేడారం వనదేవతల దర్శనం పునఃప్రారంభం
-
ఇప్పుడే బడులెందుకు? తెలంగాణ హైకోర్టు విస్మయం
ఇంత అనాలోచిత నిర్ణయమా? మార్గదర్శకాలు రూపొందించకుండా జూలై 1 నుంచి బడులు ప్రారంభించాలంటూ జీవో ఎలా ఇస్తారు? ఇంత అనాలోచిత నిర్ణయం ఎలా తీసుకుంటారు? పెద్దలే కరోనా నిబంధనలు పాటించట్లేదు. పిల్లలు నిబంధనలు పాటిస్తారనే నమ్మకం ఉందా? వారికి ప్రమాదం కలగకుండా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. - హైకోర్టు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్.. భౌతిక తరగతులకు విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదు. తల్లిదండ్రులు అంగీకరిస్తేనే పిల్లలు తరగతులకు హాజరుకావొచ్చు. భౌతిక తరగతులతోపాటు ఆన్లైన్ క్లాసులను కూడా నిర్వహిస్తారు. విద్యార్థులు వారి ఇష్టానికి అనుగుణంగా ఆన్లైన్, ఆఫ్‌లైన్ తరగతుల్లో వేటికైనా హాజరు కావచ్చు. - విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: కరోనా మూడో వేవ్ ముప్పుపై ఆందోళన నెలకొన్న సమయంలో రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభించాలని ప్రభు త్వం నిర్ణయించడం ఏమిటని హైకోర్టు విస్మ యం వ్యక్తం చేసింది. కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న తరుణంలో అనాలోచిత, సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని వ్యాఖ్యానించింది. మెజారిటీ స్కూళ్లు చిన్న సముదా యాల్లో నడుస్తాయని.. విద్యార్థులు భౌతిక దూరం, ఇతర కోవిడ్ నిబంధనలు పాటించడం సాధ్యమేనా అని నిలదీసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మార్గదర్శకాలు, విధి విధానాలు రూపొందించాలని.. వారం రోజుల్లో నివేదిక రూపంలో తమకు సమర్పించాలని విద్యాశాఖను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1 నుంచి భౌతిక తరగతులు ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది తిరుమలరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆందోళనలో తల్లిదండ్రులు 96 శాతం విద్యార్థుల తల్లిదండ్రులు భౌతిక తరగతులను వ్యతిరేకిస్తున్నారని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ ధర్మాసనానికి విన్నవించారు. కరోనా మూడోవేవ్ వల్ల పిల్లలకు ముప్పు పొంచి ఉందన్న అంచనాల నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని వివరించారు. చాలా పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేవని, తరగతి గదులు ఇరుకుగా ఉంటాయని, భౌతికదూరం పాటించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు ఇంకా వ్యాక్సినేషన్ చేయలేదని, ఇలాంటి పరిస్థితుల్లో భౌతిక తరగతులు ప్రారంభిస్తే.. కరోనా విజృంభించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక భౌతిక తరగతులు ప్రారంభించాలన్న నిర్ణయమంటే.. విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడమేనని మరో న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ధర్మాసనానికి విన్నవించారు. విద్యార్థుల హాజరు తప్పనిసరా? విచారణకు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హజరయ్యారు. ‘జూలై 1 నుంచి ప్రారంభించనున్న భౌతిక తరగతులకు విద్యార్థుల హాజరు తప్పనిసరా?’ అని ఈ సందర్భంగా ధర్మాసనం ఆయనను ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో తమకు పలు సందేహాలు ఉన్నాయని, 15 నిమిషాలు సమయం ఇస్తామని, ఆలోపు విద్యా శాఖ కార్యదర్శి హాజరయ్యేలా చూడాలని ఆదేశించింది. కాసేపటి తర్వాత విచారణ మళ్లీ మొదలుకాగా.. విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. భౌతిక తరగతులకు విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదని, తల్లిదండ్రులు అంగీకరిస్తేనే వారి పిల్లలు తరగతులకు హాజరుకావొచ్చని ఆయన ధర్మాసనానికి వివరించారు. ఫిబ్రవరి, మార్చిలో భౌతిక తరగతులను ప్రారంభించినప్పుడు కూడా తల్లిదండ్రుల అనుమతి తీసుకొనే తరగతులకు అనుమతించాలని ఆదేశించామని.. ఇప్పుడూ అదే తరహాలో ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. ఆన్లైన్ తరగతులను కూడా నిర్వహిస్తారని, విద్యార్థులు వారి ఇష్టానికి అనుగుణంగా ఆన్లైన్, ఆఫ్‌లైన్ తరగతులు వేటికైనా హాజరు కావచ్చని తెలిపారు. అయితే.. ఈ మేరకు ఏమైనా మార్గదర్శకాలు, విధివిధానాలు రూపొందించారా? అని ధర్మాసనం ప్రశ్నించగా.. ఒకట్రెండు రోజుల్లో ఇస్తామని సుల్తానియా చెప్పారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతుంటే.. విద్యాశాఖ అధికారులు ఇంత అనాలోచితంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని నిలదీసింది. మార్గదర్శకాలు, విధివిధానాలు రూపొందించకుండా అంత హడావుడిగా జూలై 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. తల్లిదండ్రుల భయాలు, ఆందోళనను అర్థం చేసుకోవాలని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది. విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. -
‘ తెలంగాణ స్కూళ్లు, కాలేజీల ప్రారంభంపై పునరాలోచన’
హైదరాబాద్: తెలంగాణలో స్కూళ్ల ప్రారంభంపై విద్యాశాఖ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత తెలంగాణ కేబినేట్ జులై 1 నుంచి విద్యాసంస్థలు తెరవాలని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తీసుకున్న నిర్ణయం మేరకు.. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ తరగతులను మాత్రం నేరుగా క్లాసులను నిర్వహించనున్నారు. అదే విధంగా, స్కూళ్లు, జూనియర్ కాలేజీల అంశంపై మాత్రం విద్యాశాఖ కాస్త మల్లగుల్లాలు పడుతోంది. దీనిపై నేడో, రేపో కీలక నిర్ణయం తీసుకుంటామని టీఎస్ సర్కారు ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: తెలంగాణలో దళితుల ప్రాణాలకు విలువ లేదా? -
పిల్లలూ సిద్ధంకాండ్రి: 1 నుంచి 8, 9, 10 తరగతులు
విద్యాశాఖ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయి సమావేశంలో చర్చ.. నాలుగైదు రోజుల్లో తుది నిర్ణయం. వారంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు రోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు బోధనను కొనసాగించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనతోపాటు బడులకు హాజరుకాని విద్యార్థుల కోసం ఆన్లైన్ బోధనను కూడా చేపడతారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లోని టీచర్లు ఈనెల 25 నుంచి బడులకు రావాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఆదేశాలు జారీచేశారు. ప్రైవేటు పాఠశాలల ఫీజుల విషయంలో గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను అమలు చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. 30 శాతం ఫీజులను తగ్గించాలన్న తల్లిదండ్రుల విజ్ఞప్తులపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో చర్చిస్తామన్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలల్లో విద్యాబోధనను దశలవారీగా చేపట్టేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జూలై 1 నుంచి బడులను ప్రారంభించాలని ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో 8, 9, 10 తరగతులకు జూలై 1 నుంచి విద్యా బోధనను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపినట్లు తెలిసింది. 6, 7 తరగతు లకు జూలై 20 నుంచి బోధనను చేపట్టాలని, 3, 4, 5 తరగతులకు ఆగస్టు 16 నుంచి ప్రత్యక్ష బోధనను ప్రారంభించేలా ప్రతిపాదించింది. ఒకటి, రెండో తరగతుల అం శాన్ని ప్రస్తావించలేదు. పాఠశాలల్లో విద్యా బోధనకు అవసరమైన మార్గదర్శకాల కోసం విద్యాశాఖ చేసిన ఈ ప్రతిపాదనలపై సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించారు. దాదాపు ఆ షెడ్యూలు ప్రకారమే ముందుకు సాగాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. ప్రభుత్వ పాఠశాలలు, విద్యాశాఖ గురుకులాలతోపాటు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాలు, విద్యాశాఖ పరిధిలోని గురుకులాలను కూడా ప్రారంభించాల్సి ఉన్నందున సన్నద్ధతపై ఆయా శాఖల మంత్రులతోనూ చర్చించాకే ముందుకు సాగాలన్న నిర్ణయానికి వచ్చారు. రెండు మూడు రోజుల్లో వారితో సమావేశం నిర్వహించి, విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. కాగా, ఈనెల 25 నుంచి బడులకు హాజరయ్యే ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మోడల్‌స్కూళ్లు, కేజీబీవీలు, విద్యా శాఖ గురుకులాలు, ఎయిడెడ్ స్కూళ్ల టీచర్లు, జిల్లా విద్యా శిక్షణ సంస్థ లెక్చరర్లు అంతా ఆయా విద్యా సంస్థల్లో రిపోర్టు చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఆదేశించారు. అందుకు అనుగుణంగా డీఈవోలు, ఆర్జేడీలు చర్యలు చేపట్టాలని సూచించారు. వచ్చే వారం సెకండియర్ ఫలితాలు వచ్చే వారంలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఫలితాలను ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జూలై 1 నుంచి డిగ్రీ, పీజీ తరగతులు (ప్రత్యక్ష బోధన) ప్రారంభమవుతాయని చెప్పారు. గతంలో జారీ చేసిన జీవో 46 ప్రకారమే యాజమాన్యాలు ఫీజులను తీసుకోవాలని స్పష్టంచేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోవిడ్ మూలాన భయపడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు, డిగ్రీ, పీజీ విద్యార్థులకు వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరుతామన్నారు. ఈ విషయంలో మరోసారి మంత్రులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. -
లాక్డౌన్, బడులు, కర్ఫ్యూనే మంత్రివర్గ అజెండా
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసరంగా భేటీ కానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను కొనసాగించాలా, ఎత్తివేయాలా, మరిన్ని సడలింపులు ఇవ్వాలా? అన్న దానితోపాటు రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్రంలో మే 12వ తేదీ నుంచి లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సడలింపుతోపాటు.. ప్రజలు ఇళ్లకు చేరుకోవడానికి మరో గంట అదనంగా మినహాయింపు ఉంది. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు, కరోనా కేసుల నమోదు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేసి.. రాత్రి 9 గంటల నుంచి మరునాడు ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను రాత్రి తొమ్మిదింటికే మూసేసి, ఇళ్లకు చేరుకోవడానికి ఒక గంట సమయం ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నట్టు తెలిసింది. సినిమా హాళ్లు, షూటింగ్‌లు, థీమ్ పార్క్‌లు, జిమ్‌లు వంటి వాటికి అనుమతి ఇస్తారా, మరికొంత కాలం మూసే ఉంచుతారా అన్నది కూడా కేబినెట్ సమావేశంలో తేలనుంది. ఇక ఈ నెల 21వ తేదీ నుంచి విద్యా సంస్థల ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. దీనిపై కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విద్యా సంస్థలు తెరుచుకున్నా కొంతకాలం పాటు ఆన్లైన్ తరగతులే కొనసాగించనున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. వ్యవసాయ అంశాలపైనా.. వానాకాలం మొదలైన నేపథ్యంలో.. సాగు, నకిలీ విత్తనాల బెడద ఎక్కువైన నేపథ్యంలో మరింత కఠిన చర్యలు తీసుకునే దిశగా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. రైతుబంధు పథకం కింద రైతాంగానికి అందిస్తున్న ఆర్థిక సాయం, విత్తనాలు, ఎరువుల లభ్యత అంశాలను చర్చిస్తారని చెబుతున్నారు. కాళేశ్వరం నుంచి ఇప్పటికే ఎత్తిపోతలు ప్రారంభమైన నేపథ్యం మరింత సమర్థవంతంగా గోదావరి నీటిని వినియోగించుకోవడంపై కూడా కేబినెట్ దృష్టి సారించనుంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశంతోపాటు కరోనా మూడో వేవ్ రావొచ్చనే ఆందోళన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించనుంది. నిధుల సమీకరణకు సంబంధించి కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. -
రాష్ట్రపతి భవన్ తెరచుకునేది ఎప్పుడంటే..?
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్–19 కారణంగా గత 11 నెలలుగా మూసివేతకు గురైన రాష్ట్రపతి భవన్ ఈ నెల 6 నుంచి తెరచుకోనుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ సెలవుదినాలు కాకుండా శనివారం, ఆదివారం రోజుల్లో రాష్టపతి భవన్ తెరచే ఉంటుందని స్టేట్మెంట్ ద్వారా చెప్పారు. భౌతిక దూరాన్ని పాటించేందుకుగానూ గరిష్టంగా స్లాట్‌కు 25 మంది చొప్పున మూడు స్లాట్లలో (ఉదయం 10:30, మధ్యాహ్నం 12:30, 2:30) పర్యాటకులను అనుమతించనున్నట్లు చెప్పింది. లోపలికి అనుమతించేందుకు ఒక్కొక్కరికి రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. 8 నుంచి తెరచుకోనున్న జేఎన్‌యూ కరోనా కారణంగా మూతబడిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఈ నెల 8 నుంచి తెరచుకోనుందని జేఎన్‌యూ సోమవారం ప్రకటించింది. 4వ సెమిస్టర్ చదువుతున్న ఎంఫిల్, ఎంటెక్ విద్యార్థులు, ఎంబీఏ చివరి సెమిస్టర్‌విద్యార్థులు ఈ నెల 8 నుంచి కాలేజీకి, హాస్టల్‌కు రావచ్చని ప్రకటించింది. జూన్ 30లోగా థీసిస్‌ను సమర్పించాలని చెప్పింది. చదవండి: వింత సంఘటన: దానికదే కదలిన వాహనం ‘డీజిల్‌కి డబ్బులివ్వు.. బిడ్డను వెతుకుతాం’ -
స్కూల్ బెల్ నేటి నుంచే..
పాఠశాలల వేళలు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు ప్రత్యక్ష బోధన. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో మాత్రం ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యక్ష బోధన. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత బడులు, కాలేజీలు సోమవారం(నేడు) నుంచి తెరచుకోనున్నాయి. కోవిడ్–19 కారణంగా గత ఏడాది మార్చి 16 నుంచి ప్రత్యక్ష విద్యా బోధనకు దూరమైన విద్యార్థుల్లో.. 9, ఆపై తరగతులకు చెందిన విద్యార్థులకు మళ్లీ తరగతి గదుల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం అవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, కోవిడ్ నిబంధనలతో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష బోధనను ప్రారంభించేందుకు పాఠశాల, ఇంటర్మీడియట్, కళాశాల, సాంకేతిక విద్యాశాఖలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. పాఠశాలల్లో 9, 10 తరగతులకు, ఇంటర్మీడియెట్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు, డిగ్రీలో మూడు సంవత్సరాల వారికి, పీజీలో సెకండియర్ విద్యార్థులకు బోధన ప్రారంభించేలా చర్యలు చేపట్టాయి. వృత్తి సాంకేతిక విద్యా సంస్థల్లో మొదట నాలుగో సంవత్సరం, మూడో సంవత్సరం వారికి బోధన ప్రారంభిం చేందుకు, అదీ ల్యాబ్ తరగతులను మాత్రమే కొనసాగించేలా జేఎన్టీయూ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో అన్ని విద్యా సంస్థల్లో విద్యార్థులతో పాటు టీచర్లు, లెక్చరర్లు, ఇతర సిబ్బంది అంతా మాస్క్ ధరించాల్సిందేనని, నో మాస్క్.. నో ఎంట్రీ విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. రెండు వారాలు చూసి... రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క ప్రాథమిక పాఠశాలల టీచర్లు మినహా ప్రాథమికోన్నత, ఉన్నత తరగతులకు బోధించే టీచర్లంతా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలకు హాజరయ్యేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు 50 శాతం టీచర్ల హాజరును అమలు చేసిన విద్యాశాఖ తాజాగా అందరూ హాజరయ్యేలా నిర్ణయం తీసుకుంది. రెండు వారాలు పరిస్థితిని గమనించి, పెద్దగా ఇబ్బందులు రాకపోతే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులను ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే మార్చి ఒకటో తేదీ నుంచి మిగతా తరగతులను ప్రారంభించాలనే ఆలోచనలో విద్యాశాఖ ఉంది. శానిటైజేషన్ సమస్య తప్పదా? ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు విద్యార్థులు వచ్చాక శానిటైజేషన్ సమస్యలు తప్పేలా లేవు. రోజువారీ శానిటేషన్ బాధ్యతలను స్థానిక సంస్థలకు అప్పగించినా వాటిని పూర్తి స్థాయిలో చేపట్టేందుకు అవి ససేమిరా అంటున్నాయి. పాఠశాలలు, కాలేజీల ఆవరణలను మాత్రమే క్లీన్ చేయిస్తామంటున్న స్థానిక సంస్థలు.. ప్రభుత్వ విద్యా సంస్థల్లో టాయిలెట్లు ఇతరత్రా పరిసరాలను క్లీన్ చేయించేందుకు ఒప్పుకోవడం లేదని ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ గతంలో ఇచ్చి, లాక్డౌన్ సమయంలో తొలగించిన స్కావెంజర్లను ఇస్తేనే పాఠశాలల్లో కోవిడ్ నిబంధనల ప్రకారం శానిటైజేషన్ సాధ్యం అవుతుందని ఓ సీనియర్ ప్రధానోపాధ్యాయుడు పేర్కొన్నారు. గందరగోళంగా ఇంటర్ ప్రత్యక్ష బోధన ఇంటర్మీడియట్లో ప్రత్యక్ష బోధన గందరగోళంగా మారింది. ఒకరోజు ప్రథమ సంవత్సరం వారికి, మరొక రోజు ద్వితీయ సంవత్సరం వారికి పాఠ్యాంశాల బోధన చేపట్టేలా ఏర్పాట్లు చేయడం లెక్చరర్లలో ఆందోళనకు కారణమైంది. ఈ లెక్కన ఫిబ్రవరి ఒకటో తేదీనుంచి పరీక్షల సమయం వరకు వచ్చే 76 రోజుల పని దినాల్లో ప్రథమ సంవత్సరం వారికి 38 రోజులు, ద్వితీయ సంవత్సరం వారికి 38 రోజుల సమయమే ఉంటోంది. ఈ కొన్ని రోజుల్లోనే ద్వితీయ సంవత్సర విద్యార్థులను ప్రవేశ పరీక్షలకు సిద్ధం చేయడం కష్టమేనని లెక్చరర్లు అంటున్నారు. ఎక్కువమంది విద్యార్థులున్న చోట మాత్రమే షిఫ్ట్ విధానం అమలు చేయాలని, మిగతా కాలేజీల్లో డే బై డే విధానం కొనసాగించాలని పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందరికీ షిప్ట్ విధానంలో బోధన చేపడితే మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. అయిన బోధనెంత.. విన్న వారెందరు? సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించిన ఆన్లైన్, డిజిటల్ (టీవీ) పాఠాల విషయంలో అస్పష్టత కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు పూర్తయిన పాఠ్యాంశాలు ఎన్ని? వాటిని ఎంత మంది విద్యార్థులు విన్నారన్న విషయంలో ఉపాధ్యాయులకే స్పష్టత లేకుండా పోయింది. ఆన్లైన్ సమస్యలతో విద్యార్థులు అనేక మంది వాటికి దూరం అయ్యారని, ఇప్పుడు ఎక్కడి నుంచి బోధన ప్రారంభించాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని అంటున్నారు. డిగ్రీ, పీజీ విషయంలో కూడా.. డిగ్రీ, పీజీ తరగతుల విషయంలోనూ గందరగోళం నెలకొంది. మొదట షిప్ట్ విధానంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల అన్ని తరగతులను ప్రారంభిస్తామంటే ఉన్నత విద్యాశాఖ ఒప్పుకోలేదు. పోనీ తృతీయ సంవత్సర విద్యార్థులకే ప్రత్యక్ష బోధనను ప్రారంభిస్తామని చెప్పినా అంగీకరించలేదు. ఇప్పుడు అన్ని తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయగా, ప్రతి తరగతిలో 50 శాతం మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగతా వారి పరిస్థితి ఏంటన్న గందరగోళం నెలకొంది. ల్యాబ్ క్లాసులకే పరిమితం వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో ల్యాబ్ క్లాసులే నిర్వహించాలని, హాస్టళ్లలో గదికి ఒక్కరే ఉండాలని జేఎన్టీయూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి బీటెక్, బీఫార్మసీ 3, 4 సంవత్సరాల విద్యార్థులకు ల్యాబ్ క్లాసులు నిర్వహించనున్నారు. 15వ తేదీ నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు ల్యాబ్ తరగతులు నిర్వహించాలని జేఎన్టీయూ పేర్కొంది. మొదటి 15 రోజులు కాలేజీకి వచ్చే విద్యార్థులు తర్వాత 15 రోజులు ఆన్లైన్లో థియరీ క్లాసులు వినేలా, తరువాత 15 రోజులు కాలేజీకి వచ్చేవారు ఇప్పుడు ఆన్లైన్లో క్లాసులు వినేలా ఏర్పాట్లు చేయాలని, మిగతా కోర్సులకూ ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది. హాస్టల్ ఫీజుల పేరిట అడ్డగోలు వసూళ్లు కాలేజీల హాస్టళ్ల విషయంలో ఒక్క జేఎన్టీయూ మినహా మిగతా వర్సిటీలేవీ స్పష్టత ఇవ్వలేదు. ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు హాస్టల్ ఫీజుల పేరిట అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నాయి. మూడు నాలుగు నెలల కోసం ఒక్కో విద్యార్థి రూ.55 వేల నుంచి రూ.65 వేల వరకు చెల్లించాలని ఆదేశించాయి. ఇప్పుడు చెల్లిస్తేనే హాస్టల్ వసతి ఉంటుందని బెదిరింపులకు దిగుతున్నట్టు తెలిసింది. -
భౌతికదూరం పాటిస్తూ బడికెళ్లేదెలా..
సాక్షి, హైదరాబాద్: పిల్లలు స్కూల్‌కు ఎలా వెళ్లాలి? తిరిగి ఇంటికి చేరేదెలా? ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్నలు ఇవి. స్కూళ్లలో భౌతిక దూరంపాటించడం, తరగతి గదులను తరచుగా శానిటైజ్ చేయడం వంటి నిబంధనలు అమలు చేయవచ్చు. అలాగే పిల్లలకు మాస్కులు ధరించేవిధంగా జాగ్రత్తలు పాటించవచ్చు. సాధారణ రోజుల్లో అయితే స్కూల్ బస్సులు, ఆటోల్లో వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా వాహనాల్లో ఎక్కువ మంది ప్రయాణం చేయడం సాధ్యం కాదు. పైగా కోవిడ్ నిబంధనలకు విరుద్ధం కూడా. దీంతో పిల్లలను చేరవేయడం అనేది ప్రస్తుతం అతి పెద్ద సమస్య. ప్రస్తుతం 9, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ స్థాయి విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ దశలవారీగా అన్ని తరగతులను అనుమతించే అవకాశం ఉంది. ఈ క్రమంలో భౌతిక దూరం పాటిస్తూ కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేయడం సాధ్యం కాకపోవచ్చుననే అభిప్రాయం ఉంది. అప్పుడు అలా... గ్రేటర్లో సుమారు 3500కు పైగా స్కూళ్లలో 20 లక్షల మందికి పైగా పిల్లలు చదువుకుంటున్నారు. ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్ధులు ఇందుకు అదనం. 11500 స్కూల్ బస్సులు, మరో 50 వేలకు పైగా ఆటోలు, 10 వేల వ్యాన్లు, టాటా ఏస్ వంటి వాహనాల్లో పిల్లలకు రవాణా సదుపాయం కల్పిస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఆటోల్లో పంపిస్తారు. ఒక్కో ఆటోలో 8 మంది విద్యార్థులను మాత్రమే తీసుకెళ్లవలసి ఉండగా చాలామంది ఆటోడ్రైవర్లు 15 మంది పిల్లలను ఆటోల్లో బంధించి తీసుకెళ్తారు. ఇవి కాకుండా నగర శివార్లలోని కళాశాలలకు వెళ్లే విద్యార్ధులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్ధుల రద్దీకనుగుణంగా ఆర్టీసీ రోజుకు 3 వేలకు పైగా ట్రిప్పులు నడుపుతుంది. కోవిడ్ కారణంగా అన్ని విద్యాసంస్థలు మూతపడడంతో స్టూడెంట్ ట్రాన్స్‌పోర్టు కూడా స్తంభించింది. లాక్డౌన్ దృష్ట్యా రవాణాశాఖ అన్ని రకాల వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలను నిలిపివేసింది. ఈ ఫిబ్రవరి వరకు అనుమతులను పొడిగించింది. దీంతో సంవత్సరానికి ఒకసారి స్కూల్ బస్సులకు నిర్వహించే ఫిట్నెస్ ధృవీకరణ కూడా ఆగింది. మరోవైపు చాలా బస్సులు ఎలాంటి నిర్వహణ లేకుండా పార్కింగ్ అడ్డాలకే పరిమితమయ్యాయి. ఇప్పటికిప్పుడు ఈ బస్సుల్లో రవాణా సదుపాయం కల్పించాలంటే ఫిట్నెస్ పరీక్షలు చేసి వాటి సామర్థ్యాన్ని ధృవీకరించవలసి ఉంటుంది. ఇప్పుడు ఎలా... ⇔ ప్రస్తుతం 9,10 తరగతుల పిల్లలను మాత్రమే అనుమతించాలని భావిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్ధులకు కూడా కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ⇔ ఈ స్టూడెంట్స్ అంతా స్కూల్‌కు వెళ్లడం ఇప్పుడు సవాల్‌గానే మారింది. ఆటోలు, బస్సుల్లో పంపించేందుకు చాలా మంది తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. ⇔ మరోవైపు పిల్లలను స్కూల్‌కు పంపించడం, తిరిగి తీసుకెళ్లడం తల్లిదండ్రుల బాధ్యత అని విద్యాసంస్థల యాజమాన్యాలు సూచిస్తున్నాయి. ⇔ ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలు చేసుకొనే తల్లిదండ్రులకు ఇది భారంగానే మారనుంది. -
బడుల నిర్వహణకు ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత పాఠశాలల్లో బోధన మొదలు కాబోతోంది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చి రెండో వారం నుంచే విద్యా సంస్థలు మూతపడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో కాస్త ఆలస్యంగా విద్యా సంవత్సరాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ఆన్లైన్ బోధనకు అనుమతిచ్చింది. ఈక్రమంలో ఆన్లైన్, వీడియో పాఠాలు, ఇతర నెట్వర్కింగ్ యాప్‌ల ద్వారా తరగతులను విద్యాశాఖ నిర్వహిస్తోంది. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టగా.. వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం ప్రారంభం కాబోతుండటంతో పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మాన్యువల్ తరగతులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. అయితే తొలుత 9, 10 తరగతుల విద్యార్థులకు మాన్యువల్ పాఠాలు బోధించాలని సూచిస్తూ వారి హాజరుకు సుముఖత తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరగనుంది. ఇందులో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో పాటు వైద్య, ఆరోగ్య నిపుణులు సైతం పాల్గొననున్నారు. జిల్లాల్లో హడావుడి.. పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జిల్లాల్లో హడావుడి మొదలైంది. స్కూళ్ల మూసివేతతో వాటి ఆవరణలో పేరుకుపోయిన చెత్త, తుప్పలను తొలగించాలని, తరగతి గదులను శానిటైజేషన్ చేయాలని సూచిస్తూ సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి మహ్మద్ అబ్దుల్ ఉత్తర్వులు జారీ చేశారు. స్కూళ్లలో తీసుకుంటున్న జాగ్రత్త చర్యలకు సంబంధించిన అప్డేట్స్ను విద్యాశాఖ వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలతో అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. నిర్దేశించిన ఆదేశాలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ అందులో పేర్కొన్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకే స్కూళ్లలో బోధనకు అనుమతినిచ్చిన నేపథ్యంలో మిగతా తరగతులకు ఆన్లైన్ బోధన, వీడియో పాఠాలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు డిజిటల్ తరగతులకు సంబంధించిన షెడ్యూల్‌ను స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (సైట్) డైరెక్టర్ ఏ.క్రిష్ణారావు సోమవారం విడుదల చేశారు. -
పై తరగతులకే : ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19తో మూతపడ్డ బడులు... 2020–21 విద్యా సంవత్సరం ప్రారంభమైన 8 నెలల తర్వాత తెరుచుకోనున్నాయి. ఉన్నత పాఠశాలలు, కాలేజీలను ఫిబ్రవరి 1 నుంచి తెరిచేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తొమ్మిది, ఆపై తరగతులను ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించాలి. ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సులకూ అప్పటినుంచే ప్రత్యక్ష విద్యా బోధన మొదలుపెట్టాలి. ఈలోగా అన్ని విద్యా సంస్థలను, హాస్టళ్లను, రెసిడెన్షియల్ స్కూళ్లను, వాటిలోని టాయిలెట్లను సిద్ధం చేయాలి. అవన్నీ పరిశుభ్రంగా ఉండే విధంగా కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర హాస్టళ్లను మంత్రులు సందర్శించి, విద్యార్థుల వసతికి అనుగుణంగా తీర్చిదిద్దాలి. విద్యా సంస్థలు పనిచేయక చాలా రోజులు అవుతోంది కాబట్టి అందులోని సామగ్రినంతటినీ శుభ్రపర చాలి. అప్పుడు నిల్వ చేసిన బియ్యం, పప్పు, ఇతర వంట సరుకులు పురుగుపట్టే అవకాశం ఉంటుంది కాబట్టి స్టాకును సరిచూసుకోవాలి. మొత్తంగా ఈనెల 25లోగా విద్యా సంస్థలను తరగతులు నిర్వహించడానికి అనుగుణంగా సిద్ధం చేయాలి’అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లతో సోమవారం ప్రగతిభవన్‌లో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వెంటనే పదోన్నతులు... ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పదోన్నతులు ఇచ్చిన తర్వాతనే ఆయా శాఖల్లో ఏర్పడే ఖాళీలపై స్పష్టత వస్తుందన్నారు. అప్పుడు జిల్లాల వారీగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలను ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను కోరారు. ఖాళీలన్నీ ఒకేసారి భర్తీ చేయాలని ఆదేశించారు. కారుణ్య నియామకాలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని చెప్పారు. దేశానికే ఆదర్శ పల్లెలు ‘పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు సమకూరుతున్నాయి. ఇది దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగలేదు. ఈ ప్రగతి రాష్ట్రానికి గర్వకారణం’అని ముఖ్యమంత్రి అన్నారు. ‘రాష్ట్రం ఏర్పడిన నాడు 84 గ్రామ పంచాయతీలకే సొంత ట్రాక్టర్లు ఉండేవి. నేడు 12,765 గ్రామ పంచాయతీలకు గాను 12,681 గ్రామాల్లో ట్యాంకర్లు, ట్రాలీలతో కూడిన ట్రాక్టర్లు ఉన్నాయి. 19,470 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు గాను... ఇప్పటికే 19,027 చోట్ల స్థలాలను గుర్తించాం. 15,646 చోట్ల మొక్కలు నాటడం పూర్తయింది. 2,601 రైతు వేదికలకు గాను... ఇప్పటికే 2,580 నిర్మాణం పూర్తయింది. 12,736 గ్రామాల్లో డంప్ యార్డుల నిర్మాణం 91 శాతం పూర్తయింది. 9,023 చోట్ల డంపింగ్ యార్డుల్లో కంపోస్ట్ తయారీ జరుగుతున్నది. 12,742 గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం జరుగుతున్నది. మొదటివిడతగా 93,875 చోట్ల కల్లాల నిర్మాణం ప్రారంభమైంది. ప్రతినెలా రూ.308 కోట్లు ‘ప్రతినెలా రూ.308 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా విడుదల చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇన్నిరకాల సౌకర్యాలు, వెసులుబాట్లు, పచ్చదనం, పరిశుభ్రత, పారదర్శక పద్ధతులు కలిగిన రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదు. పెరిగిన పరిశుభ్రత వల్ల ఈసారి డెంగ్యూ వ్యాధి రాకపోవడాన్ని మనం గమనించవచ్చు’అని సీఎం హర్షం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి అమలు తీరు పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, ఇతర అధికారులను ముఖ్యమంత్రి ప్రశంసించారు. అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణాన్ని నూటికి నూరుశాతం పూర్తి చేసిన సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావును కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అన్ని గ్రామాల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో చెరువుల రక్షణ కమిటీలను నియమించాలని చెప్పారు. అన్ని పట్టణాల్లో పబ్లిక్ టాయిలెట్లు పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖలు మారిపోతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పచ్చదనం–పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పన ప్రయత్నాలు ఫలిస్తున్నాయని అన్నారు. ‘ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరించి డంప్ యార్డుకు తరలించే ఏర్పాటు జరుగుతున్నది. పట్టణాల్లో 2,802 సానిటేషన్ వెహికిల్స్ ఉన్నాయి. మరో 2,004 సానిటేషన్ వెహికిల్స్‌ను సమకూరుస్తున్నాం. అన్ని పట్టణాల్లో డంప్ యార్డుల నిర్మాణం జరుగుతున్నది. పట్టణాల్లో లక్ష జనాభాకు ఒకటి చొప్పున వైకుంఠధామాలు నిర్మించాలి. అవసరమైతే మున్సిపాలిటీల నిధులతో స్థలాలను కొనుగోలు చేయాలి. 116 పట్టణాల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నాం. జనాభా ఎక్కువ కలిగిన పట్టణాల్లో అదనంగా మార్కెట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమీకృత మార్కెట్ల నిర్మాణానికి ఈ ఏడాది బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాం. అన్ని పట్టణాల్లో పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలి. ఇందుకోసం ప్రభుత్వ స్థలాలను, ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను వినియోగించాలి’అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. బర్డ్‌ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలి బర్డ్ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వలస పక్షులతోనే ఈ వ్యాధి వ్యాపిస్తున్నదన్నారు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాధి లేదని, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం సంబంధిత మంత్రులు, అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. మొదటి విడతలో మిగిలిపోయిన 28 వేల మంది లబ్దిదారులకు వెంటనే గొర్రెల పంపిణీ చేయాలని కోరారు. 3.67 శాతం పెరిగిన పచ్చదనం హరితహారంతో తెలంగాణలో మూడేళ్లలో పచ్చదనం 3.67 శాతం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిందని సీఎం తెలిపారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీఎఫ్ శోభ, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. కలప స్మగ్లింగ్‌ను పూర్తిగా అరికట్టాలని, స్మగ్లర్లపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 90 చోట్ల అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్ధి జరుగుతున్నదని, ఇంకా పట్టణ ప్రాంతాలకు సమీపంలోని అటవీ ప్రాంతాలను గుర్తించి అర్బన్ పార్కులుగా అభివృద్ధి చేయాలని కోరారు. 127 శాతం మొక్కలు నాటడం ద్వారా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఆ జిల్లా కలెక్టర్ శరత్‌ను ప్రశంసించారు. 1.06 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలో అత్యధిక మొక్కలు నాటిన జిల్లాగా భద్రాద్రి– కొత్తగూడెం నిలిచిందని, ఆ జిల్లా కలెక్టర్ ఎం.వి. రెడ్డిని అభినందించారు. చదవండి: జీతాలివ్వండి మహాప్రభో.. ‘రేట్లు’ పెంచేశారు.. అంతా వారి ఇష్టారాజ్యమే..! -
సినిమా హాళ్లలో పెరుగుతున్న సందడి
సాక్షి, నెట్వర్క్: కోవిడ్ కారణంగా దాదాపు ఎనిమిది నెలలకు పైగా ఇంటర్వెల్ ప్రకటించిన సినిమా హాళ్లు మెల్లగా తెరుచుకుంటున్నాయి. రాష్ట్రంలోని మూడు నాలుగు జిల్లాల్లో సగానికి పైగా థియేటర్లు తెరవగా... మిగిలిన జిల్లాల్లో కూడా ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ రావటంతో... నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది. దీంతో యాజమాన్యాలు ఎప్పటికప్పుడు శానిటైజేషన్ ఏర్పాటు చేస్లూ, భౌతికదూరం, మాస్కుల వంటి నిబంధనలు పాటిస్తూ థియేటర్లను తెరుస్తున్నారు. మొదట పాత సినిమాలతో వీటిని తెరవగా... తాజాగా కొత్త సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ప్రేక్షకుల సంఖ్య కూడా ఏరోజుకారోజు పెరుగుతూనే వస్తోంది. కొత్త సినిమా ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్లు హౌస్‌ఫుల్ కూడా కావడం గమనార్హం. సంక్రాంతికి మరిన్ని కొత్త సినిమాలు వస్తే ప్రేక్షకులు థియేటర్లకు పూర్తిస్థాయిలో వస్తారని, అప్పటికి థియేటర్లన్నీ తెరుచుకుంటాయని యజమానులు చెబుతున్నారు. కృష్ణా, నెల్లూరుల్లో సగానికి పైగానే.. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, విశాఖ, వైఎస్సార్ జిల్లాలో పెద్ద సంఖ్యలో థియేటర్లు తెరుచుకున్నాయి. మిగతా జిల్లాల్లో ఇలా తెరచుకున్న థియేటర్ల సంఖ్య తక్కువే అయినప్పటికీ ఇది రోజూ పెరుగుతూ ఉండటం సినీ రంగానికి ఊరటనిస్తోంది. కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో సగానికిపైగానే థియేటర్లు తెరుచుకున్నాయి. కృష్ణాలో మొత్తం 126 థియేటర్లకు గాను 65, నెల్లూరులో 75కి గాను 38 తెరుచుకున్నాయి. ఇక గుంటూరులో 160 థియేటర్లకు గాను 60, వైఎస్సార్ జిల్లాలో 53కు గాను 24, విశాఖలో 82కు గాను 36 థియేటర్లలో సినిమా ప్రదర్శన మొదలైంది. కోవిడ్ నిబంధనల అమలు ఇలా... ► థియేటర్లతో పాటు, పరిసరాలనూ శుభ్రంగా ఉండేలా చూస్తున్నారు. ► టికెట్ల జారీలో ఆఫ్‌లైన్ కన్నా ఆన్లైన్ బుకింగ్‌కే ప్రాధాన్యమిస్తున్నారు. ► మాస్క్‌ను తప్పనిసరి చేశారు. లేనివారిని టిక్కెట్టున్నా అనుమతించడం లేదు. ► ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ చేసి.. టెంపరేచర్ ఎక్కువుంటే వెనక్కి పంపేస్తున్నారు. ► ఎక్కడికక్కడ శానిటైజర్లు అందుబాటులో ఉంచుతూ ప్రేక్షకులు వాడేలా చూస్తున్నారు. ► మధ్య సీటును వదిలేసి భౌతిక దూరం పాటిస్తున్నారు. బ్లాక్ చేసిన సీట్లకు స్టిక్కరింగ్ చేశారు. ► షోల మధ్య విరామంలో అన్ని సీట్లను శానిటైజ్ చేయటంతో పాటు వాష్‌రూమ్‌లు, క్యాంటీన్ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ►ప్రేక్షకులు విధిగా సెల్ఫోన్లో ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, టిక్కెట్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఫోన్ నంబర్ ఇవ్వాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పేర్కొంటూ థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తున్నారు గుంటూరులోని పల్లవి థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్లా. థియేటర్లోకి వెళ్లే ముందే మాస్క్ ఉందా లేదా అనేది చూశారు. అనంతరం వారే శానిటైజర్‌ను చేతులపై వేస్తున్నారు. లోపల సీటు తరువాత సీటును కేటాయించారు. కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తున్నారు. –– సీహెచ్ వంశీ, ప్రేక్షకుడు, గుంటూరు నగరం ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసుకున్నా. మాస్క్ లేకపోతే లోనికి అనుమతించడం లేదు. కొందరికి థియేటర్ నిర్వాహకులే మాస్క్‌లు పంపిణీ చేశారు. చాన్నాళ్ల తర్వాత థియేటర్లో సినిమా చూశా. థియేటర్లో చూస్తే ఆ ఎక్స్‌పీరియెన్స్ వేరు. టీవీలో అది రాదు. – – హరినా«థ్, ప్రేక్షకుడు, కృష్ణనగర్, గుంటూరు థియేటర్లో ఏర్పాట్లు బాగున్నాయి చాలా రోజుల తర్వాత థియేటర్లు ప్రారంభించడంతో కొత్త సినిమా కాబటిట సోలో బతుకే సో బెటర్ సినిమాకు వెళ్లా. థియేటర్లో కోవిడ్ నిబంధనలు పాటించారు. సీట్ల మధ్య గ్యాప్ ఏర్పాటు చేశారు. థియేటర్ అవరణలో శానిటైజ్ చేస్తున్నారు. ఏర్పాట్లు బాగా ఉన్నాయి. –– తాడి శివ, ప్రేక్షకుడు, విజయవాడ ఆ ఉల్లాసమే వేరు చాలా కాలం తరువాత థియేటర్‌కు వెళ్లి ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చూశా. ఓటీటీల్లో కొత్త సినిమాలు వచ్చినా, స్నేహితులతో కలసి థియేటర్‌కు వెళ్లి చూడటం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. థియేటర్ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంది. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడొచ్చు. – ధనబాబు, ప్రేక్షకుడు, మచిలీపట్నం కొత్త సినిమాలు వస్తే ఊపిరి పీల్చుకుంటాం ఇప్పుడిప్పుడే థియేటర్లు ఓపెన్ చేస్తున్నాం. సాధారణ పరిస్థితి రావాలంటే కొంత టైమ్ పడుతుంది. సంక్రాంతికి కొత్త సినిమాలు వచ్చాయంటే మేము కాస్త ఊపిరి పీల్చుకుంటాం. – బాబు, థియేటర్ మేనేజర్, మదనపల్లె. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నాం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్డౌన్ నిబంధనల ప్రకారం పట్టణంలో సినిమా థియేటర్లు ఇటీవలే ప్రారంభించాం. ప్రతి సీటు, ప్రతి షోకు శానిటైజ్ చేయటంతో పాటు థర్మల్ స్క్రీనింగ్ చేసి మాస్క్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నాం. – సీహెచ్.పెద్దబాబు, సినిమా థియేటర్ నిర్వాహకుడు, మార్కాపురం, ప్రకాశం జిల్లా కరోనా భయమైతే ఉంది చాలా రోజుల తర్వాత థియేటర్లో సినిమా చూశా. ఒకవైపు సంతోషం, మరోవైపు కరోనా భయం కూడా ఉంది. థియేటర్లు, సీట్లను ఎప్పటికప్పుడు శానిటైజర్లతో శుభ్రం చేయిస్తే ప్రేక్షకులకు భయం తగ్గుతుంది. –ఇమ్రాన్, హిందూపురం, అనంతపురం జిల్లా ప్రేక్షకులు రావడం సంతోషంగా ఉంది దాదాపు తొమ్మిది నెలల విరామం తర్వాత థియేటర్లు క్రమంగా తెరుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రధానంగా కార్మికులకు మళ్లీ ఉపాధి దొరుకుతోంది. ఉత్సాహంగా థియేటర్‌కు వస్తున్న ప్రేక్షకులు కూడా మాకు సహకరిస్తున్నారు. – దేవళ్ల సూర్యనారాయణ (బుజ్జి), మారుతి థియేటర్ కా>ంట్రాక్టర్ శ్రీకాకుళం జిల్లా పాలకొండ వెంకటగౌరి థియేటర్ వద్ద ప్రేక్షకులకు థర్మల్‌స్కాన్ చేస్తున్న సిబ్బంది సినిమా థియేటర్ పరిసరాల్లో కోవిడ్–19 నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని సూచిస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ. -
మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసుల కలల మెట్రో సేవలు గురువారం నుంచి ఉదయం 6.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మార్గాల్లో మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్, అమీర్‌పేట్, మియాపూర్, ఎంజీబీఎస్ టర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 9.30 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందన్నారు. ఇక కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్న ముషీరాబాద్, గాంధీ ఆస్పత్రి, భరత్‌నగర్ మెట్రో స్టేషన్లు సైతం గురువారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. కాగా ప్రస్తుతం మూడు మెట్రో మార్గాల్లో నిత్యం సుమారు 1.5 లక్షల మంది మెట్రో రైళ్లలో జర్నీ చేస్తున్న విషయం విదితమే. (చదవండి: త్వరలో సిటీలో డబుల్ డెక్కర్ సర్వీసులు) -
తెలంగాణలో ‘బొమ్మ’ పడుద్ది..
సాక్షి, హైదరాబాద్ : కంటైన్మెంట్ జోన్ల వెలుపలి ప్రాంతాల్లో సినిమా థియేటర్లు, మల్టీ ప్లెక్స్‌లను 50% సీటింగ్ సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతిస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని తెరిచేందుకు కేంద్రం గత అక్టోబర్ 30నే అనుమతి ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం తెరవాల్సిన తేదీలను తర్వాత ప్రకటిస్తామని అప్పట్లో పేర్కొంది. తాజాగా వీటికి అనుమతిచ్చింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయి. పాటించాల్సిన నిబంధనలు ఇవే... ►ప్రేక్షకులు, సిబ్బంది సహా అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ►ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. ►భౌతిక దూరం పాటించాలి ►ప్రతి ఆట తర్వాత శానిటైజ్ చేయాలి. ►24 నుంచి 30 డిగ్రీ సెల్సియస్ మధ్య ఏసీలను సెట్ చేయాలి. గాలి లోపలికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలి. ►వేర్వేరు ఆటలకు సంబంధించిన విరామాలు ఒకే సమయంలో ఉండకుండా ఆటల వేళలను నిర్ణయించాలి. ప్రముఖుల హర్షం.. థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకునేందుకు సీఎం కేసీఆర్ అనుమతి ఇవ్వడంపై ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున తదితరులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి బాలగోవింద్ తాండ్ర ‘సాక్షి’తో మాట్లాడుతూ.. మూడునాలుగు రోజుల్లో థియేటర్లు ప్రారంభిస్తామని చెప్పారు. -
స్కూళ్ల రీఓపెనింగ్‌పై వెనక్కి తగ్గిన సర్కార్
చెన్నై : రాష్ట్రంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కరోనా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని పేర్కొంది. ఇంతకుముందు ఈనెల 16నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతాయని, 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు హాజరుకావాల్సిందిగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై చాలామంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న పరిస్థిత్లుల్లో స్కూళ్లకు అనుమతిస్తే కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరారు. స్కూళ్లు తిరిగి ప్రారంభించాలా వద్దా అన్నఅంశంపై దాదాపు 12వేల పాఠశాలలు సమావేశం అయినట్లు అధికారులు వెల్లడించారు. (భారత్‌లో కొత్తగా 47,905 కరోనా కేసులు) -
దీపావళి తర్వాతే పాఠశాలలు ప్రారంభం
ముంబై: కరోనా మహమ్మారి కారణంగా మార్చి నుంచి మూసివేయబడిన దేవాలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలు త్వరలో తిరిగి ప్రారంభమవుతాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ దీపావళి తర్వాత స్కూళ్లు (9 నుండి 12 తరగతులకు) తిరిగి ప్రారంభమవుతాయని ఆయన అన్నారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. (బీజేపీకి సవాల్.. దమ్ముంటే తీసుకెళ్లండి!) నవంబర్ 17 నుంచి 22 మధ్య రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. పాఠశాలలను ఈనెల 23న తెరుస్తామని, విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తామన్నారు. ఒక్కో బెంచికి ఒక్క విద్యార్థిని మాత్రమే కూర్చోనిస్తామని తెలిపారు. తరగతులను రోజు విడిచి రోజు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు తిరిగి ప్రారంభంపై సీఎం స్పందిస్తూ త్వరలోనే కోవిడ్ నిబంధనలను రూపొందించి దేవాలయాలను తిరిగి ప్రారంభిస్తామని అన్నారు. దేవాలయాలు ప్రారంభించడం వల్ల వృద్ధులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పండుగల సీజన్లో దేవాలయాలకు వచ్చే భక్తుల రద్దీని కూడా నివారించాల్సిన అవసరం ఉంది. అందువల్ల దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. -
ఏపీలో స్కూళ్లు ఓపెన్ ...
-
అన్‌లాక్ థియేటర్స్
థియేటర్లు రీ ఓపెన్ చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నెల ప్రారంభంలోనే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో చాలా చోట్ల థియేటర్స్‌ను ఓపెన్ చేశారు. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం థియేటర్స్ తెరవడానికి అనుమతి ఇవ్వలేదు. తాజాగా నవంబర్ 10 నుంచి మల్టీప్లెక్స్‌లు, థియేటర్స్ అన్నింటినీ అన్‌లాక్ చేయొచ్చని ప్రకటించింది. ఈ ప్రకటనతో థియేటర్స్ యజమానులు తాళాలు తీయడానికి రెడీ అవుతున్నారు. 50 శాతం సీటింగ్‌తో అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.