ఏపీలో స్కూల్స్‌ రీ-ఓపెన్‌ తేదీ పొడిగింపు ఉత్తర్వులు జారీ | AP Schools Reopen Date Extended For One Day, Know Reason Inside | Sakshi
Sakshi News home page

AP Schools ReOpen Date: ఏపీలో స్కూల్స్‌ రీ-ఓపెన్‌ తేదీ పొడిగింపు ఉత్తర్వులు జారీ

Published Tue, Jun 11 2024 7:29 AM | Last Updated on Tue, Jun 11 2024 10:50 AM

AP Schools Reopen Date Extension For One Day Orders

అమరావతి, సాక్షి: వేసవి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పాఠశాలల పునఃప్రారంభ తేదీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో రేపు కాకుండా.. ఎల్లుండి(జూన్‌13న) పాఠశాలలు తెరుచుకోనున్నాయి. 

ఏటా జూన్ 12 వ తేదీన పాఠశాలలు తెరుచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో ఒక్కరోజు సెలవును పొడిగించింది విద్యాశాఖ. 

సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 12న పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉండగా..  ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement