
పత్తనంతిట్ట: భక్తుల దర్శనార్థం రెండు నెలల సీజనల్ యాత్రలో భాగంగా ప్రఖ్యాత శబరిమల అ య్యప్పస్వామి ఆలయం సోమవారం తెరచుకుంది. ప్రధాన పూజారి(తంత్రి) కందరారు మహేశ్ మోహనరారు సమక్షంలో ఆలయ గర్భగుడి తలుపులను తెరిచారు. 16 తేదీ నుంచే భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. భారీ వర్షాల కారణంగా తొలి 3,4 రోజులపాటు తక్కువ సంఖ్యలో భక్తులనే లోపలికి అనుమతిస్తారు. వర్చువల్ క్యూ పద్ధతిలో రోజుకు 30వేల మంది దర్శనానికి అవకాశం కల్పించారు. కోవిడ్ సర్టిఫికెట్ లేదా 72 గంటల్లోపు తీసుకున్న ఆర్‌టీ–పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్‌లను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. 41 రోజుల మండల పూజ డిసెంబర్ 26న పూర్తికానుంది.
Comments
Please login to add a commentAdd a comment