
కర్నాటకలోని బెంగళూరులో గల రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగి వారం రోజులు దాటింది. తాజాగా కట్టుదిట్టమైన భద్రత మధ్య రామేశ్వరం కేఫ్‌ను తిరిగి తెరిచారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కేఫ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
కేఫ్‌లో జరిగిన పేలుడులో 10 మంది గాయపడ్డారు. కేఫ్‌ను శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు తెరిచారు. అయితే శనివారం నుంచి వినియోగదారులకు సేవలు అందించనున్నారు. కస్టమర్లను తనిఖీ చేయడానికి కేఫ్ ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. వినియోగదారుల అనుమానాస్పద కార్యకలాపాలపై కేఫ్ సిబ్బంది దృష్టి సారించనున్నారు.
రామేశ్వరం కేఫ్ సహ వ్యవస్థాపకులు రాఘవేంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ‘ఏదైతే జరగకూడదని భావించామో అదే జరిగింది. మరింత భద్రతతో ఉండేందుకు ఇదొక పాఠం. శివుని ఆశీస్సులతో మహాశివరాత్రి సందర్భంగా మా కేఫ్‌ను తిరిగి ప్రారంభించాం. శనివారం జాతీయ గీతం ప్లే చేస్తూ రెస్టారెంట్‌ను కస్టమర్ల కోసం తెరుస్తాం’ అని తెలిపారు. కాగా కేఫ్‌ను పూలతో అలంకరించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
#WATCH | Bengaluru, Karnataka: Checking of the customers being done at the Rameshwaram cafe.
— ANI (@ANI) March 9, 2024
The cafe has reopened for people, 8 days after the blast. pic.twitter.com/kwclTU4ksE