week
-
'ఇది మామూలు డ్రామా కాదు రా రామా'
నవరసాలను నిరంతరం పండించగలిగే సత్తా ఈ మధ్యకాలంలో ఒక్క బిగ్ బాస్ కార్యక్రమానికి మాత్రం వుందంటే అతిశయోక్తి కాదేమో. బిగ్ బాస్ మిగతా భాషలలో ఏమో కాని తెలుగు లో మాత్రం తమ ప్రేక్షకులు జారిపోకుండా షోని రసవత్తరమైన ఘట్టాలతో ఎప్పటికప్పుడు రక్తి కట్టిస్తూ ఆడియన్స్ ని కట్టిపడేందుకు ప్రయత్నిస్తున్నాడు సదరు బిగ్ బాస్. దీనికి ప్రత్యేక నిదర్శనం ఈ వారం బిగ్ బాస్ కార్యక్రమం. ముఖ్యంగా చఫ్ కంటెండర్ పోటీ కోసం కంటెస్టెంట్లను నాలుగు రంగులతో విభజించి నాలుగాటలు ఆడించి వాళ్ళలో నాలుగు ఎమోషన్స్ తెప్పించి నలుగురు పార్టిసిపెంట్స్ కొట్టుకునేలా చేసి ప్రేక్షకులకు నిత్యం వివాదం తో వినోదాన్ని పంచాలని ప్రయత్నించడం నభూతో నభవిష్యతి అని చెప్పవచ్చు.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ కంటెస్టంట్ల ఎమోషన్లతో రెచ్చగొట్టడమొకటే కాదు వాళ్ళ ఆరోగ్యాలపై కూడా హైప్ క్రియేట్ చేసి క్యాష్ చేసుకోవడం. పోయిన వారం అవినాష్ కు ఆరోగ్యం బాలేదని, హౌస్ నుండి వెళ్ళిపోతున్నాడని ప్రోగ్రాం చివరలో చూపించి మరుసటిరోజు నామినేషన్స్ నాడు తన ఆరోగ్యం బాగుందని బిగ్ బాస్ డాక్టర్లు ప్రోగ్రాం లో కంటిన్యూ చేయమన్నారని చూపించడం విడ్డూరం. రేపెవ్వరైనా కంటెసెస్టంట్ కు మళ్ళీ హెల్త్ బాగోలేదని చెబితే ప్రేక్షకులు నమ్మాలా లేదా. ఇక ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ నయని పావని. ఈ అమ్మాయిని కదిపినా కదపకపోయినా కన్నీళ్ళు వచ్చేస్తూనే వుంటాయి. అందుకే కాబోలు బిగ్ బాస్ ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేశాడు. బిగ్ బాస్ కార్యక్రమం అనేది ఒక్క హౌస్ లో వున్న కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తోనే కాదు బయట చూసే ప్రేక్షకుల ఎమోషన్స్ తో కూడా ఆడుకుంటున్నాడనేది అక్షర సత్యం. ఎందుకంటే బిగ్ బాస్ అనేది మామూలు డ్రామా కాదు రా రామా!!!--ఇంటూరి హరికృష్ణ -
National Nutrition Week 2024 : స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌గా మారాలంటే..
భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నుండి ఏడు వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తారు. సరైన పోషకాహారం, ఆరోగ్యం మధ్య విడదీయరాని సంబంధం ఉంది. ఆటగాళ్లకు ఆరోగ్యంతో కూడిన ఫిట్నెస్ ఎంతో ముఖ్యం. ప్రస్తుతం దేశంలో స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్లకు అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి.క్రీడా మైదానంలో ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలంటే ఏ క్రీడా జట్టుకైనా స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ ఎంతో అవసరం. అథ్లెట్లు, వారి కోచ్‌లకు అనుసంధానంగా క్రీడా పోషకాహార నిపుణులు పని చేస్తుంటారు. అథ్లెట్ లేదా ఆటగాడి పనితీరు వారు తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఈ దిశగా సూచనలు, సలహాలు అందించే ఆరోగ్య నిపుణులు రాష్ట్రానికి లేదా దేశానికి పతకాలు తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ కావడానికి బీఎస్సీ (ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్) కోర్సు చేయాల్సి ఉంటుంది. 12వ తరగతి ఉత్తీర్ణులయ్యాక మెడికల్ స్ట్రీమ్‌లోకి వెళ్లేవారు లేదా న్యూట్రిషన్ లేదా డైటెటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగిన ఈ వృత్తిని ఎంచుకోవచ్చు. అలాగే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లేదా డైటెటిక్స్ లేదా న్యూట్రిషన్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు చేయడం ద్వారా స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌గా ఉపాధి లేదా ఉద్యోగం పొందవచ్చు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎంఎస్సీ (స్పోర్ట్స్ న్యూట్రిషన్) కోర్సును ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) అందిస్తోంది. డైటెటిక్స్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సును అన్నామలై యూనివర్సిటీ అందిస్తోంది. డైటెటిక్స్‌లో ఎంఎస్సీని కేరళ విశ్వవిద్యాలయం అందిస్తోంది.స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్‌గా కెరీర్ ప్రారంభించడానికి, అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ లాంటి ప్రఖ్యాత సంస్థ నుండి సర్టిఫికేట్ పొందడం అవసరం. క్రీడా పోషకాహార నిపుణులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉపాధి, ఉద్యోగ మార్గాలను అందుకోవచ్చు. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈవారం ఏకంగా 22 చిత్రాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ వారంలో ఇండిపెండెన్స్ ఉండడంతో పెద్ద సినిమాలన్నీ ఆ రోజే వచ్చేస్తున్నాయి. టాలీవుడ్లో డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ లాంటి చిత్రాలు ఆగస్టు 15న విడుదలకు సిద్ధమైపోయాయి. వీటితో పాటు కోలీవుడ్ నుంచి తంగలాన్ లాంటి భారీ యాక్షన్ చిత్రం కూడా వస్తోంది. అంతేకాకుండా ఆయ్ సినిమాలాంటి ఒకటి, రెండు చిన్నచిత్రాలు వచ్చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ సందడి చిత్రాలు రెడీ అయిపోయాయి. వీటిలో టాలీవుడ్ మూవీ డార్లింగ్‌తో పాటు కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్ ప్రధానపాత్రల్లో నటించిన మనోరతంగల్ స్ట్రీమింగ్కు రానుంది. ఈ రెండు చిత్రాలు మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. వీటితో పాటు పలు హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్మాట్ రిఫే: లూసిడ్ - ఏ క్రౌడ్ వర్క్ స్పెషల్- ఆగస్టు 13డాటర్స్ (డాకుమెంటరీ)- ఆగస్టు 14రెన్‌ఫీల్డ్ (హాలీవుడ్)- ఆగస్టు 14వరస్ట్ ఎక్స్ ఎవర్(క్రైమ్ డాకుమెంటరీ సిరీస్)-ఆగస్టు 15యావరేజ్ జో సీజన్ -1- ఆగస్టు 15బ్యాక్యార్ట్ వైల్డర్నెస్- ఆగస్టు 15ఎమిలీ ఇన్ పారిస్ సీజన్-4- పార్ట్ 1- ఆగస్టు 15కెంగన్ అసుర సీజన్ 2- పార్ట్ 2- ఆగస్టు 16ఐ కెనాట్ లైవ్ వితౌట్ యూ- ఆగస్టు 16పెరల్- ఆగస్టు 16షాజమ్- ఫ్యూరీ ఆఫ్ గాడ్స్- ఆగస్టు 17ది గార్ఫీల్డ్ మూవీ(యానిమేషన్ చిత్రం)- ఆగస్టు 17జీ5మనోరతంగల్(తమిళ సిరీస్)- 15 ఆగస్టుకంటాయే కంటాయే(హిందీ సినిమా)- ఆగస్టు 15 డిస్నీ ప్లస్ హాట్స్టార్స్టార్ వార్స్: యంగ్ జేడి అడ్వెంచర్స్(యానిమేషన్)- సీజన్ 2- ఆగస్టు 14డార్లింగ్ -టాలీవుడ్ మూవీ- ఆగస్టు 13మై ఫర్ఫెక్ట్ హస్బెండ్- ఆగస్టు 16 జియో సినిమాఇండస్ట్రీ సీజన్-3(వెబ్ సిరీస్)- ఆగస్టు12శేఖర్ హోమ్(బెంగాలీ వెబ్ సిరీస్) - ఆగస్టు 14బెల్ ఎయిర్ సీజన్-2 - ఆగస్టు 15సోనీలివ్చమక్: ది కంక్లూజన్(హిందీ సినిమా) - ఆగస్టు 16హోయ్చోయ్పరిణీత- ఆగస్టు 15 -
తల్లిపాల వారోత్సవాలు : బాధ్యత మనందరిదీ!
నవమాసాలు మోసి బిడ్డను కనిపెంచడంలో తల్లి పాత్ర చాలా కీలకమైంది. అలాగే తల్లి పాలల్లో మహత్తర శక్తి ఉంది. పుట్టిన వెంటనే బిడ్డకు స్తన్యమివ్వడం చాలా అవసరం. దీనిపై అవగాహన కల్పించేందుకే ఆగస్టు 1 నుండి ఆగస్టు 7 వరకు 120కి పైగా దేశాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవం జరుపుకుంటారు. పిల్లల సక్రమమైన అభివృద్ధికి తల్లిపాలు చాలా అవసరం. బిడ్డకు పోషకాహారాన్ని ఇవ్వడం మాత్రమేకాదు, తల్లీబిడ్డల బాంధవ్యాన్ని పెంచుతుంది. పసివయస్సులో తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా భద్రతనిస్తుంది. మొదటి టీకాగా పనిచేస్తాయి తల్లిపాలు. 1992లో మొట్టమొదటిసారిగా ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ప్రతిపాదను ఆమోదం లభించింది.1990లో ఆగస్టులో ప్రభుత్వ అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ , ఇతర సంస్థలచే తల్లిపాలను రక్షించడానికి, ప్రోత్సహించడానికి , మద్దతు ఇచ్చేలా ఇన్నోసెంటి డిక్లరేషన్‌పై సంతకాలు జరిగాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడం, దానికి మద్దతు ఇవ్వడం , ప్రోత్సహించడంతో పాటు ప్రతిచోటా తల్లులు శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యాలు.World Breastfeeding Week...1st to 7th August 2024@OfficeOfLGJandK @SyedAbidShah @DrRakesh183 pic.twitter.com/QmgPtjLWWh— DIRECTORATE OF HEALTH SERVICES JAMMU (@dhs_jammu) August 1, 2024ప్రతీ ఏడాది, ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ డేని వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ (WABA) ఎంపిక చేసిన కొత్త థీమ్‌తో జరుపుకోవడం ఆనవాయితీ. “అంతరాలు లేకుండా అందరికీ తల్లిపాల మద్దతు” (Closing the gap: Breastfeeding support for all) అనే థీమ్‌తో ఈ ఏడాది ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తల్లిపాలు ప్రాముఖ్యత , ప్రయోజనాలునవజాత శిశువులకు తల్లి పాలు బలవర్ధకమైన పోషకాహారం. అనేక రకాల సాధారణ వ్యాధులనుంచి రక్షించే రోగనిరోధక శక్తిని అందించడంలో తల్లిపాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. తల్లిపాలలోని పోషకాలు, యాంటీబాడీస్,ఎంజైమ్‌లు పిల్లల్ని అనారోగ్యాలు ,ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి.తల్లి-పిల్లల బంధాన్ని బలోపేతం చేయడం, ప్రసవానంతరం బాలింతలు వేగంగా కోలుకోవడానికి, రొమ్ము, అండాశయ కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో తల్లి పాలు ఏంతో మేలు చేస్తాయి. ఒక కొత్త జీవిని ఈ సమాజంలోకి తీసుకొచ్చే ఈ ప్రయాణంలో అమ్మకు మనం అందరంఅండగా నిలబడాల్సిన అవసరం ఎంతో ఉంది. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి మానసిక, శారీరక స్థితిని అర్థం చేసుకొని అటు భర్త, ఇటు ఇరు కుటుంబ సభ్యులు ఆమె తోడుగా నిలవాలి. అలాగే కమ్యూనిటీ స్థాయిలో రాష్ట్ర, జిల్లా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ఆరోగ్య సంస్థలు అధికారులు ఇందుకు మద్దతుగా నిలబడాలి. ఈ అవగాహన పెంచేందుకు,తల్లులు ఎదుర్కొంటున్ ఇబ్బందులను పరిష్కరించడానికి, ప్రపంచవ్యాప్తంగా ఈవెంట్లు, సెమినార్లు, వర్క్‌షాప్‌ల ద్వారా కృషి చేస్తారు. -
వారానికి ఐదు రోజులే పని దినాలు!.. నిజమైతే వారికి పండగే
కొన్ని ప్రైవేట్ కంపెనీలలో ఇప్పుడు వారానికి కేవలం ఐదు రోజులే పని దినాలు. ఈ విధానం కోసం ఒకప్పటి నుంచి బ్యాంక్ ఉద్యోగులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ విధానం త్వరలోనే అమలు అయ్యే సూచనలు ఉన్నట్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), ఎంప్లాయీ యూనియన్లు చెబుతున్నాయి.ఇప్పటికే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), ఎంప్లాయీ యూనియన్ల మధ్య జరిగిన ఒక ఒప్పందం ప్రకారం.. ఈ విధానం ఈ ఏడాది చివరి నాటికి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. కేవలం ప్రభుత్వ ఆమోదం పొందిన వెంటనే బ్యాంకు ఉద్యోగులకు కూడా వారానికి కేవలం ఐదు రోజులే వర్కింగ్ డేస్.యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వంటి బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు, కొంతకాలంగా శనివారాలు సెలవులు కావాలని.. దీని వల్ల కస్టమర్ సర్వీస్ వంటి వాటికి ఎటువంటి ఆటంకాలు ఉండవని వారు హామీ ఇచ్చారు. ఇదే జరిగితే బ్యాంక్ పని వేళల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: 22ఏళ్ళ క్రితం నిర్మించారు.. ఇప్పటికీ అక్కడ టోల్ ట్యాక్స్ ఎక్కువే!ఇప్పటికే బ్యాంకులకు ఆదివారం సెలవు, ప్రతి నెలలోనూ రెండవ, నాల్గవ శనివారాలు సెలవు. ఇక మిగిలింది మరో రెండు శనివారాలు. వీటిని కూడా సెలవు దినాలుగా ప్రకటిస్తే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెగోషయెబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం సెక్షన్ 25 ప్రకారం నెలలోని అన్ని శనివారాలు అధికారిక సెలవు దినాలే అవుతాయి. కాబట్టి బ్యాంక్ పనివేళలు ఉదయం 9:45 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. -
ఫండే: ఈ వారం కథ - 'డీల్ ఓకే!'
అర్ధరాత్రి నిద్రలో మెలకువ వచ్చి కళ్లు తెరిచి తుళ్ళి పడ్డాను. చిమ్మచీకటి. పక్కనే ఉన్న ఓ మొహం. కేవలం దాని మీదనే వెల్తురు. విరబోసిన జుత్తు. చింతనిప్పుల్లా కళ్ళు. వికటాట్టహాసం. మళ్లీ కళ్లుమూసి ఆంజనేయ దండకం అందుకున్నాను. మత్తు కొంచెం వదిలాక కొంచెం నిదానం వచ్చాక ఒక కన్ను సగం తెరిచి చూశాను. అది మా ఆవిడే. దయ్యం కాదు. ఇపుడు భయం ఇంకా ఎక్కువైంది. ధైర్యం కూడదీసుకుని అడిగాను ‘ఏమిటిది’ అని. ‘యూ ట్యూబ్‌లో ఇది ఇంటరెస్టింగ్‌గా వుంది. చూస్తారా?’ ‘అర్ధరాత్రి ఈ అంకాలమ్మ శివాలెందుకు? అంతగా అయితే పొద్దున్న చూసుకోవచ్చు కదా!’ ‘భలేవారే. అప్పుడు వేరేవి చూడొచ్చు’ సిన్సియర్‌గా చెప్పింది. ఆవులించి, అటువైపు తిరిగి తలగడని కావలించి పడుకున్నాను. ఇది జరిగి రెండు నెలలయింది. అంటే ఆ తర్వాత అలా అవ్వలేదని కాదు. రోజూ అయ్యీ, అయ్యీ నాకలవాటయి పోయింది. ఇప్పుడు నేను తుళ్ళి పడటం లేదు. ఇలా జరగడానికి కారణం నేనే. మాది అన్యోన్య దాంపత్యం. నన్నొదిలి మా ఆవిడ ఒక్క క్షణం ఉండేది కాదు. ఎల్లవేళలా అంటిపెట్టుకునే వుండేది. అనుమానం తో కాదు. అభిమానంతో. నాకు కవిత్వం రాయడం ఇష్టం. అయితే ఎదురుగా ఎవరున్నా రాయలేను. పెన్ను కదలదు. ఆవిడ 24 గంటల నిరంతర వార్తా స్రవంతి చానెల్లాగా నాతోనే ఉండడం వల్ల ఈ మధ్య రాయడం అవ్వడం లేదు. ఆ మాట అనలేక ఒకసారి చెప్పి చూశాను ‘బంగారం.. ఏమైనా పుస్తకం తీసి చదువుకోవచ్చు కదా, మంచి వ్యాపకం కదా!’ ‘పుస్తకాన్ని చిన్నప్పటి నుంచీ చూసీ, చూసీ బోరు కొట్టేసింది. తాకితే చాలు.. చూడండి స్కిన్ ఎలర్జీలాగా ఒళ్లంతా బొబ్బలు వచ్చేస్తున్నాయి. వద్దు బాబోయ్.’ ‘పోనీ టీవీ చూడొచ్చు కదా!’ ‘అది కుదరదు. నేను టె¯Œ ్తలో ఉన్నప్పుడు ఒకసారి టీవీలో జీడిపాకం సీరియల్ చూస్తుండగా నాన్న వచ్చారు. చదువుకోకుండా అలా చూడడం ఆయనకు నచ్చక నన్ను కాణిపాకం తీసుకువెళ్ళి, ఒట్టేయించుకున్నారు, ఈ సీరియల్ అయిపోయేవరకూ టీవీ చూడకూడదని. ఆ సీరియల్ ఈ జన్మకి అయ్యేట్టు లేదు.’ ‘పోనీ నా కవితలు నోట్సుల నిండా కోకొల్లలుగా ఉన్నాయి. అవి చదివి ఎలా ఉన్నాయో చెప్పొచ్చు కదా!’ ‘కబుర్లు చెప్పండి. ఎన్నయినా వింటాను. కవితలంటే మాత్రం చెవులు కోసుకుంటాను. నిజంగానే. అస్సలిష్టం ఉండవు.’ ‘మా తల్లే, పెళ్లికి ముందు మీ నాన్న నేను కవిని అని తెలిసి.. మా అమ్మాయి కవితలంటే చెవి కోసుకొంటుంది అంటే ఈ అర్థంలో అనుకోలేదు’ గొణిగాను. అప్పుడు వచ్చిందో ఐడియా. యూ ట్యూబ్‌ని మెల్లగా తనకి అలవాటు చేసెయ్యాలి. అందులో ‘ఇది బాగుంది చూడు, అది బాగుంది చూడు’ అంటూ అడ్డమైనవీ చూపించడం చెయ్యాలి. అలా అలా మొదట కలిసి చూడడం అలవాటు చేశాను. చూస్తూ, చూస్తూ నేను మానేశాను. తను కంటిన్యూ చేస్తోంది. ఆ గ్యాప్‌లో నేను కవిత్వం రాసుకొంటున్నాను. అయితే తన అలవాటు ఇలా వెర్రితలలు వేసి నిద్రలు చెడగొడుతుందనుకోలేదు. ‘నీకో సర్ప్రైజ్ బంగారం.. నా కవిత్వం అంతా ఒక పుస్తకంగా పబ్లిష్ చేశాను. త్వరలో ఆవిష్కరణ. నువ్వు రావాలి.’ ‘ఓహ్. కంగ్రాట్స్. నేను రాకుండా ఎలా ఉంటాను, నచ్చకపోయినా? నాకేగదా అంకితం ఇచ్చారు?’ గుండెలో రాయి పడింది. ‘నీక్కాదోయ్. యూ ట్యూబ్‌కి’ గొణిగాను. ఓ చూపు చూసింది. అలాంటి చూపు ఇంతకు ముందు ఒకసారే అనుభవం. కాలేజీలో అడిగిన ప్రశ్నకి తిక్క జవాబు చెప్పినపుడు మాస్టారు చూసిన చూపు. పుస్తక ఆవిష్కరణ సభకి ఇద్దరం వెళ్ళాం. నా కవి మిత్రుల్ని, అభిమానుల సందోహాన్ని, పటాటోపాన్ని, నా పుస్తకాలకు ఎగబడే సాహితీ ప్రియుల్ని గర్వంగా మా ఆవిడకి చూపాలని గొప్ప ఆశగా ఉంది. సభ చూసి ఉస్సురన్నాను. గంట గడిచినా కుర్చీలు ఖాళీ. చూస్తే పట్టుమని పదిమంది లేరు. కవిగాయక కళాకారులు, బంధుమిత్రులు అంతా బందు. బొత్తిగా మొహమాటం లేదు వీళ్ళకి. వచ్చిన వాళ్లలో ఎవరైనా పుస్తకం పొరపాటున అడిగితే ఒట్టు. సభానంతరం కొంచెం గిల్టీగా అన్నాను.. ‘బంగారం.. అనవసరంగా పుస్తకం ప్రచురించి వేలకు వేలు తగలెట్టానేమో కదా!’ ‘మీరే అలా అనుకుంటే ఎలా అండీ? అమ్ముకుని సొమ్ము చేసుకుందామని కాదు కదా మీరు పబ్లిష్ చేసింది. ఇంటికి పదండి ముందు. మీకో సర్ర్పైజ్ న్యూస్ చెప్తాను.’ ‘ఏంటబ్బా’ అనుకుంటూ ఇంటికి చేరక ముందే ఉగ్గబట్టలేక, గేటు బయటే అడిగేశాను విషయమేంటని! గేటులోంచి నన్ను ఇంట్లోకి గిరవాటేసి సుడిగాలిలా వచ్చింది. నన్ను కుర్చీలో కూలదోసి తన సెల్లో యూ ట్యూబ్ ఓపెన్ చేసి చూడమంది. అందులో ‘తొక్క తీస్తా’ అన్న టైటిల్‌తో ఉన్న వీడియో. దాంట్లో అంతా చిక్కుడుకాయలకు, చింతకాయలకు తొక్క తీసే విధానం చూపుతూ వాయిస్ ఓవర్. పావుగంట సేపు సాగుతుంది. పరమ బోరు. కాకపోతే మిలియన్ల కొద్దీ సబ్స్క్రైబర్లు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే అని చూస్తే అది మా ఆవిడ చానెల్. ‘ఈ వీడియోలు చూసీ చూసీ నేనేం తక్కువ అని చానెల్ పెట్టానండీ. సక్సెస్ అయ్యింది. ఇక మరి చూసేదే లేదు. అప్లోడ్ చెయ్యడమే తప్ప!’ కొంచెంసేపటికి కోలుకున్నాను మెంటల్ షాక్ నుండి కాదు, ఆశ్చర్యం నుండి. ‘హమ్మయ్య, ఏమైతేనేం. మరి పిచ్చిగా యూ ట్యూబ్ చూడదన్నమాట.. పిచ్చి పిచ్చిగా అప్లోడ్ చెయ్యడం తప్పించి. థాంక్ గాడ్ ’ అనుకుంటూ ‘మంచి సర్ర్పైజ్’ అన్నాను. ‘అంతే కాదు మీ పుస్తకం ప్రచురణకయిన ఖర్చు నేనే భరిస్తాను. ముందు ముందు కావాలంటే మరిన్ని పుస్తకాలు ప్రచురించుకోండి. యూ ట్యూబ్ వల్ల నాకు వచ్చిన ఆదాయం అంతా మీకే. ఓకేనా?’ ఓ.. వీక్షకులను టార్చర్ పెడితే డబ్బులు కూడా ఇస్తారన్న మాట. అయితే నేను యూ ట్యూబ్‌కి అంకితం ఇవ్వడం అన్నది అతికినట్టు సరిపోయిందే. ‘థాంక్యూ బంగారం. అయితే ఒక షరతు. నీ చానెల్ నేను చచ్చినా చూడను, నా కవితలు నువ్వూ చూడొద్దులే. సరేనా?’ ‘అంతకన్నానా! నేనూ అదే అందామనుకున్నాను. మీ కవిత్వం చచ్చినా చూడను. నా చానెల్ మీరు చూడొద్దులే.’ ఆవిడ వీడియో సరంజామా వెతుక్కుంటూ వెళ్ళింది. నేను పెన్ను, పేపర్ అందుకున్నాను. — డాక్టర్ డీవీజీ శంకరరావు -
పటిష్ట భద్రత మధ్య తెరుచుకున్న రామేశ్వరం కేఫ్
కర్నాటకలోని బెంగళూరులో గల రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగి వారం రోజులు దాటింది. తాజాగా కట్టుదిట్టమైన భద్రత మధ్య రామేశ్వరం కేఫ్‌ను తిరిగి తెరిచారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కేఫ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేఫ్‌లో జరిగిన పేలుడులో 10 మంది గాయపడ్డారు. కేఫ్‌ను శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు తెరిచారు. అయితే శనివారం నుంచి వినియోగదారులకు సేవలు అందించనున్నారు. కస్టమర్లను తనిఖీ చేయడానికి కేఫ్ ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. వినియోగదారుల అనుమానాస్పద కార్యకలాపాలపై కేఫ్ సిబ్బంది దృష్టి సారించనున్నారు. రామేశ్వరం కేఫ్ సహ వ్యవస్థాపకులు రాఘవేంద్రరావు మీడియాతో మాట్లాడుతూ ‘ఏదైతే జరగకూడదని భావించామో అదే జరిగింది. మరింత భద్రతతో ఉండేందుకు ఇదొక పాఠం. శివుని ఆశీస్సులతో మహాశివరాత్రి సందర్భంగా మా కేఫ్‌ను తిరిగి ప్రారంభించాం. శనివారం జాతీయ గీతం ప్లే చేస్తూ రెస్టారెంట్‌ను కస్టమర్ల కోసం తెరుస్తాం’ అని తెలిపారు. కాగా కేఫ్‌ను పూలతో అలంకరించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. #WATCH | Bengaluru, Karnataka: Checking of the customers being done at the Rameshwaram cafe. The cafe has reopened for people, 8 days after the blast. pic.twitter.com/kwclTU4ksE — ANI (@ANI) March 9, 2024 -
‘కిస్ డే’ ఎలా పుట్టిందో.. ప్రాధాన్యత ఏంటో తెలుసా?
వాలెంటైన్ వీక్‌లో ప్రేమికుల రోజుకు ముందుగా వచ్చే రోజును ‘కిస్ డే’ అని అంటారు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రేమికులు పరస్పరం ముద్దులు ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటారు. వాలెంటైన్ వీక్‌లో ఫిబ్రవరి 13న ‘కిస్ డే’గా సెలబ్రేట్ చేస్తారు. ప్రేమించిన వారికి ముద్దు పెట్టి తమ ప్రేమను వారి ఎదుట వ్యక్తం చేస్తారు. ఇంతకీ ఈ వాలెంటైన్ వీక్‌లోకి ‘కిస్ డే’ ఎలా వచ్చింది? దీని ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమికుల వారోత్సవంలో ఈ వారమంతా కలిసి సమయాన్ని వెచ్చించేందుకు ప్రేమికులంతా ప్లాన్ చేసుకుంటారు. తమకు ఇష్టమైర రీతిలో గడిపేందుకు ఈ వారాన్ని ప్రత్యేకంగా కేటాయిస్తారు. అయితే వాలంటైన్ వీక్‌లో వచ్చే ‘కిస్ డే’ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందినప్పటికీ, దీని చరిత్రకు సంబంధించిన వివరాలు చాలామందికి తెలియదు. నిజానికి ‘కిస్ డే’ అనేది ప్రేమ జంటల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. జంటల మధ్యనున్న రిలేషన్‌ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. చాలామంది ప్రేమికులు ప్రేమలో తమ కొత్త ప్రయాణానికి ముద్దుతో శ్రీకారం చుడతారు. ‘కిస్ డే’.. వాలెంటైన్స్ డేని మరింత రొమాంటిక్‌గా మారుస్తుంది. ప్రేమికులు తమలోని ప్రేమ, ఆప్యాయతలను వ్యక్తపరచడానికి ఇదొక అర్థవంతమైన మార్గమని చెబుతుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఉండే ముద్దులో పరస్పర ఆప్యాయత తొణికిసలాడుతుంది. ఈ కిస్ డే అనేది 19వ శతాబ్ధం నాటి విక్టోరియన్ శకంలో అత్యంత ప్రజాదరణ పొందిందని చెబుతుంటారు. ఆ సమయంలో బహిరంగంగా ముద్దు పెట్టుకోవడాన్ని తప్పుగా చూసేవారట. అందుకే కిస్డేని సీక్రెట్‌గా చేసుకునేవారని చెబుతారు. ప్రపంచంలోని వివిధ దేశాలలో కిస్ డేను జరుపుకుంటారు. తమ సన్నిహితులపై తమకు ఉండే అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు ఈ రోజును సద్వినియోగం చేసుకుంటారు. కొన్ని దేశాల్లో ప్రేమికులు అక్కడ నిర్వహించే రొమాంటిక్ ఈవెంట్లలో పాల్గొని ముద్దులు పెట్టుకుంటారు. ఇళ్లలోనూ దీనిని ఘనంగా సెలబ్రేట్ చేసుకునేవారు ఉన్నారు. ముద్దు అనేది ప్రేమ, అభిరుచితో పాటు ఓదార్పు, ఆనందంతో సహా పలు భావాలను వ్యక్త పరుస్తుంది. నిజానికి ముద్దు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య సాన్నిహిత్యాన్ని మరింతగా పెంచుతుంది. వారి సంబంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. మాట కన్నా ముద్దుతో ప్రేమను సంపూర్ణంగా వ్యక్తం చేయవచ్చని చాలామంది చెబుతుంటారు. కిస్ డే సందర్భంగా ప్రేమికులు తమ ప్రైవేట్ క్షణాలను ఆనందంగా గడుపుతారు. చాక్లెట్లు, పూలు లేదా ప్రేమ లేఖలు ఇచ్చి, ఈ డేని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కిస్ డే అనేది పాశ్చాత్య పోకడలు కలిగిన రోజు కావడంతో భారత్‌లో దీనికి అంత ప్రాధాన్యత లేదు. అందుకే ప్రేమికులు ఈ రోజును ప్రైవేట్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. -
'70 గంటలు పని'.. వ్యాఖ్యలపై వైద్యులు ఏమంటున్నారంటే..!
ప్రముఖ టెక్ కంపెనీ ఫౌండర్ ఓ కార్యక్రమంలో 'యువత 70 గంటలు పనిచేస్తే'.. ఎన్నో విజయాలు సాధించొచ్చు అన్న వ్యాఖ్యలు పెద్ద ప్రకంపనం సృష్టించాయి. ఆయనతో కొన్ని కంపెనీ సీఈవోలు ఏకీభవించగా, ఐటీ ఉద్యోగులు మాత్రం ఘాటుగా స్పందించారు. ఏదీఏమైనా ఇది అందరికీ సాధ్యమా? ఏ మనిషి అయినా అన్ని గంటలు పనికే కేటాయిస్తే ఆరోగ్య పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కుటుంబ సంబంధాలు దెబ్బతినవా? అది అసలు బ్యాలెన్స్ అవుతుందా? దీని గురించి వైద్యలు ఏం చెబుతున్నారు తదితరాల గురించే ఈ కథనం!. దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి యువత పని విషయమై ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. భారత యువత వారంలో 70 గంటలు పనిచేస్తే భారత ఆర్థిక రంగంలో ఊహించని విజయాలు సాధించవచ్చు అని నారాయణ మూర్తి ఓ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేశారు. దీంతో నెట్టింట ప్రముఖ ఐటి ఉద్యోగులంతా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పనికి తగ్గట్టుగా వేతనం ఇస్తే కచ్చితంగా అన్ని గంటలు చేస్తామంటూ మూర్తి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఐతే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా సీఈవో భవిష్ అగర్వాల్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్పర్సన్ సజ్జన్ జిందాల్ వంటి ప్రముఖులు మాత్రం నారాయణ మూర్తి వ్యాఖ్యలపై ఏకభవించడం విశేషం. ఇదిలా ఉండగా, నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై వైద్యులు సైతం విభేదించారు. ఈ మేరకు బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి మాట్లాడుతు..అసమంజసమైన పని గంటలు వల్ల దీర్ఘకాలికా ఆరోగ్యంపై తీవ్ర దుష్పరిణామాలు చూపిస్తాయన్నారు. ఇన్ని గంటలు పనిచేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆయన చెప్పినట్లు వారానికి 70 గంటలు అంటే..రోజుకు 24 గంటల షెడ్యుల్ ప్రకారం..వారానికి ఆరో రోజులు పనిచేస్తే..రోజుకు 12 గంటలు చొప్పున పనిచేయగా మిగిలిని 12 గంటల్లో ఓ ఎనిమిది గంటలు నిద్రకుపోగా మిగిలిని 4 గంటలు మీ వ్యక్తిగత విషయాలు, ఆఫీస్‌కు చేరుకునే జర్నీకి పోతాయి. అదే బెంగళూరు వంటి మహానగరాల్లో అయితే రెండు గంటలు రోడ్డుపైనే గడిచిపోతాయి. అంటే ప్రశాంతంగా తినడానికి, కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి, వ్యాయామానికి, కనీసం వినోదానికి సమయం ఉండదు. ఇలా ఓ యంత్రంలా మనిషి చేసుకుంటూ పోతే కెరియర్ పరంగా ఎదుగుదల ఉంటుందేమో గానీ తనకు తెలియకుండాననే వివిధ మానసిక రుగ్మతల బారిన పడి లేని అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అదీగాక ఇటీవల యువత చిన్న వయసులోనే గుండెపోటుకి గురై చనిపోతున్న ఉదంతాలను ఎన్నో చూస్తున్నాం. యువకులకే ఈ గుండెపోటులు ఎందుకొస్తున్నాయో? ప్రముఖులు కాస్త ఆలోచించాలని చెబుతున్నారు. తెలియని పని స్ట్రెస్ ఉద్యోగంలో అనుకున్న గోల్ రీచ్ కాలేకపోతున్నామన్న భయం మరోవైపు ఉద్యోగంలో ఎదుగుదల కోసం నానాపాట్లు ఇవన్నీ వెరసి గుండెపై ప్రభావం చూపి కార్డియాక్ అరెస్టులు లేదా గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. వైద్యులు మాత్రం ముందు ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేసి నిరుద్యోగ సమస్యకు కళ్లెం వేయండి. యువత పని జీవితం బ్యాలెన్స్డ్గా ఉంటేనే మంచి లక్ష్యాలను వృద్ధిని సాధించగలరని వైద్యుడు దీపక్ నొక్కి చెబుతున్నారు. సదరు వైద్యుడి వ్యాఖ్యలపై నెటిజన్లు ఏకీభవించడమే గాక ఇన్ని గంటలు పని కారణంగా వ్యక్తిగత సంబంధాలు సైతం దెబ్బతింటాయని ఒకరు, లేనిపోని అనారోగ్య సమస్యలు బారినపడి భారంగా జీవనం గడపాల్సి వస్తుందంటూ రకరకాలు కామెంట్లు చేస్తూ ట్వీట్లు చేశారు. 24 hours per day (as far as I know) If you work 6 days a week - 12h per day Remaining 12h 8 hours sleep 4 hours remain In a city like Bengaluru 2 hours on road 2 hours remain - Brush, poop, bathe, eat No time to socialise No time to talk to family No time to exercise… https://t.co/dDTKAPfJf8 — Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) October 27, 2023 (చదవండి: పిల్లలను మంచిగా పెంచడం ఎలా? సైకాలజిస్ట్‌లు ఏం చెబుతున్నారంటే..) -
వారాలను వాడేస్తున్న డైరెక్టర్స్.. టాలీవుడ్లో ఈ టైటిలే ట్రెండింగ్!
ఒకప్పుడు సినిమా టైటిల్ చూడగానే దాని కథ ఏంటి? ఏ జానర్ ఫిల్మ్? అనేది ఈజీగా తెలిసిపోయేది. కానీ ఇప్పటి సినిమాలకు మాత్రం విచిత్రమైన టైటిల్స్ పెట్టేస్తున్నారు. కొన్ని టైటిల్స్‌కి కథతో సంబంధం ఉంటే.. మరికొన్నింటికి మాత్రం మీనింగే ఉండడం లేదు. కొత్తగా, ట్రెడింగ్లో ఉన్న పదం కనిపిస్తే చాలు అదే సినిమా టైటిల్ అవుతుంది. ఇక టాలీవుడ్లో అయితే ఇటీవల వారాల పేర్లనే సినిమా టైటిల్స్‌గా వాడేస్తున్నారు దర్శకులు. ఆదివారం నుంచి శనివారం వరకు వారాల పేర్లతో వచ్చిన సినిమాలపై ఓ లుక్కేద్దాం. ‘శనివారం’వాడేసిన నాని ‘అంటే సుందరానికీ.. ’తర్వాత నాని, వివేక్ ఆత్రే కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది.డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్. ఈ చిత్రానికి ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. దసరా సందర్భంగా సోమవారం టైటిల్‌ని ప్రకటిస్తూ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో నాని మాస్ లుక్‌లో కనిపించాడు. ‘యాక్షన్ మాస్ ఎంటర్టైనర్’గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ‘మంగళవారం’కోసం పాయల్ ఎదురుచూపులు ‘మంగళవారం’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పాయల్ రాజ్‌పుత్. ‘ఆర్ఎక్స్ 100'ఫేమ్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఒక ఊర్లో ప్రతి మంగళవారం జరిగే వరుస హత్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తిర్చిదిద్దినట్లు ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. రెండేళ్ల క్రితమే ‘గురువారం’ వాడేసిన శ్రీసింహా రెండేళ్ల క్రితమే గురువారాన్ని తన టైటిల్‌గా వాడేశాడు కీరవాణి కొడుకు శ్రీసింహా. ఆయన హీరోగా మణికాంత్ గెల్ల దర్శకత్వంలో శ్రీసింహా హీరోగా నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. 2021లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. చిన్న చిన్న విషయాల్లో అనుమానించి విడిపోవడానికి సిద్దమయ్యే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తే.. అతను పడే ఇబ్బందులు ఎలా ఉంటాయనే విషయాన్ని మంచి కామెడితో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మణికాంత్ జెల్లీ. కానీ ఆ కామెడినీ ప్రేక్షకులు పూర్తిగా ఆస్వాదించలేకపోయారు. ఆడవాళ్ల కోసం ఆదివారం ఇక ఆదివారాన్ని సైతం తమ సినిమా టైటిల్‌గా వాడేసుకున్నారు మన తెలుగు దర్శకుడు. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వం వహించిన ‘ఆదివారం ఆడవాళ్లకు సెలవు’అనే చిత్రం 2007లో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో శివాజీ, సుహాసిని, కోవై సరళ, బ్రహ్మానందం, వేణుమాధవ్, కృష్ణభగవాన్, కొండవలస, తెలంగాణా శకుంతల, అభినయశ్రీ, గీతాసింగ్, సురేఖావాణి ముఖ్యపాత్రలు పోషించారు. ఇవే కాదు.. సోమ, బుధ, శుక్రవారం పేర్లతో కూడా సినిమాలు వచ్చాయి. ఏ వెన్నెస్ డే(బుధవారం) పేరుతో నసీరుద్దీన్ షా ప్రేక్షకుల ముందుకు రాగా.. అది సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ‘ఈనాడు’తో కమల్ సినిమా వచ్చింది. శుక్రవారం, సోమవారం పేరుతో కూడా గతంలోనే సినిమాలు వచ్చాయి. మొత్తానికి మన దర్శక నిర్మాతలు అన్ని వారాలను వాడేశారు...ఇక మిగిలింది నెలల పేర్లే.. రానున్న రోజుల్లో జనవరి.. ఫిబ్రవరి.. అంటూ నెలల పేర్లు కూడా టైటిల్స్‌గా వస్తాయేమో చూడాలి. -
పుట్టుకతో ఎవరూ మోసగాళ్లు కాదు! కానీ ఆ మోసం విలువ..!
జోరున వర్షం కురుస్తోంది.. ఆకాశానికి చిల్లు పడిందాన్నట్టుంది. దట్టంగా మేఘాలు అలుముకోవడంతో పగలే చీకటి ఆవరించింది. సాయంత్రం నాలుగింటికే అర్ధరాత్రిని తలపిస్తోంది. అచ్చం నా మనఃస్థితిలానే ఉంది వాతావరణం కూడా! ఆ వర్షానికి తడిచిన చీర.. కాళ్ళకడ్డం పడుతున్నా అలానే నడుస్తున్నాను. చినుకులు సూదంటు రాళ్ళలా గుచ్చుతున్నాయి. అవి నా మనసుకు తగులుతున్నాయి. రోడ్డుకి అడ్డంగా నడుస్తున్న నా ముందు, కార్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. ‘ఏమ్మా.. చావాలనుకుంటున్నావా? పక్కనే సముద్రముంది, వెళ్ళి అందులో దూకు. మమ్మల్నెందుకు చంపుతావ్?’ విసుగ్గా అని వెళ్ళిపోయాడు. కార్ డ్రైవర్ మాటలకి పక్కకు తిరిగి చూశాను. వర్షానికి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. గమ్యం లేని నా నడకకు, అదే చివరి మజిలీ అనిపించిందా క్షణం. నా అడుగులు అటువైపు పడ్డాయి. వర్షంలో సముద్రాన్ని చూడాలనేది ఒకప్పటి నా కోరిక. ప్రళయకాల రుద్రుడిలా విరుచుకుపడుతున్న అలలు.. నన్నేం భయపెట్టడం లేదు. నిన్నటి వరకు చిన్న బొద్దింక కనబడినా భయపడే ఆ మహిత ఇప్పుడు లేదు. చేతిలో ఫోన్ రింగ్ అవుతుండటంతో తీసి చూశాను. 143వ కాల్ కట్ అయ్యి, మిస్డ్ కాల్‌గా మారిపోయింది. ∙∙ ఒకప్పుడు ఆ నంబరంటే విపరీతమైన క్రేజ్. ఆ నంబర్ వెనుకున్న శౌర్య అంటే ఇష్టం. శౌర్యతో జీవితం, ఇదిగో ఇక్కడే మొదలైంది. నాలుగేళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలో కలసి చదువుకున్న క్లాస్మేట్. ఈ అనంతసాగరం ఒడ్డున ఫైనలియర్లో చుట్టూ స్నేహితుల సాక్షిగా.. మోకాళ్ళపై కూర్చుని ప్రపోజ్ చేశాడు. అందరూ చెయ్యడం వేరు.. శౌర్య ప్రపోజ్ చెయ్యడం వేరు అనిపించింది నాకు. అందగాడు.. చదువుల బిడ్డ.. అమ్మాయిలు కోరుకునే లక్షణాలన్నీ శౌర్యలో పుష్కలంగా ఉన్నాయి. అలాంటి శౌర్య.. నాకు ప్రపోజ్ చెయ్యడమనేది నేను ఉహించనిది కావడంతో వెంటనే ఎగిరి గంతేసి కౌగిలించుకుని మరీ ఒప్పుకున్నాను. ఆ తరువాత ఐస్‌క్రీమ్ పార్లర్ నుంచి బీచ్, కొత్త సినిమా ఇలా ప్రతిచోటా తిరిగి, ప్రేమికులుగా మా ముద్ర వేశాం. నాకు అందంగా కనిపించిన ప్రేమ.. నా తల్లిదండ్రులకు కనిపించలేదు. కులం నుంచి అంతస్తుల వరకు ఎత్తి చూపించారు. ఏడు తరాలు చూడాలన్నారు. అరే..మనిషి ఎదురుగా తన గుణం కనిపిస్తుంటే, కనబడని ఏడు తరాలు గురించి మీకెందుకన్నాను. వాళ్ళు మెట్టు దిగలేదు. నేను మాత్రం ఆ ఇంటి మెట్లు దిగి, శౌర్య భార్యగా మెట్టినింట అడుగుపెట్టాను తల్లిదండ్రులను వద్దనుకుని! నేనంటే ఎంతో ప్రేమ చూపించే అత్తగారు, ప్రాణంలా చూసుకునే శౌర్య. నా అంత అదృష్టవంతురాలు లేదనుకున్నాను. నా ఆనందాన్ని కాలదన్నబోయిన తల్లిదండ్రులపై ద్వేషం పెంచుకుని, కనీసం ఫోనైనా చెయ్యలేదు. ఈనాడు శౌర్య కాకుండా నాకు మరో కుటుంబం, స్నేహం ఏదీ లేదు. నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నానేమో, ఇప్పుడిక కన్నీళ్ళు రావడం లేదు. మనిషికి ఎక్స్పైరీ డేట్ ముందే తెలిస్తే అది ఇంత బరువుగా ఉంటుందని నాకిప్పుడే తెలిసింది. అవును!! నేను చనిపోబోతున్నాను. నాకున్నది కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఎన్ని కోరికలు, ఆశలు, ఆశయాలుండేవో వాటన్నిటికీ తెర పడింది. ఇంత బాధను అనుభవిస్తూ పోయేకన్నా ఇప్పుడే పోతే? నా ఆలోచనలానే విశాలమైన సంద్రం, రెండు చేతులు చాచి.. ‘నా గర్భంలో నీకు చోటుంది మహితా’ అని చెబుతున్నట్టుంది. వర్షం తగ్గి, మనుషులు తిరగడం ఎప్పుడు మొదలుపెట్టారో గమనించలేదు. సాగర గర్భంలోకి వెళుతున్న నా చేతిని పట్టుకుందో చిట్టి చెయ్యి. బోడిగుండుతో ముద్దుగా, బుజ్జి వామనుడిలా ఉన్నాడు. కిందికి వంగి కళ్ళెగరేశాను. వర్షానికి తడవకుండా, తన చొక్కాలో దాచుకున్న డిబ్బీ తీసి చూపించాడు వాడు. ‘కల్పతరువు’ దాని మీద ఉన్న పేరు అదే! ‘అనాథాశ్రమమా?’ మాట జారి బాధపడ్డాను. బుజ్జి వామనుడు తలూపాడు. మెడలో వేలాడుతున్న మంగళ సూత్రాలతాడు తీసి, డిబ్బీలో వేసేశాను. వాడు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూశాడు. నవ్వి తల నిమిరాను. చేతికి కుట్లు తాలుకు గోతులు తగిలాయి. వామనుడ్ని వెనక్కి తిప్పి చూసి, ‘ఏంటివి?’ అడిగాను. ‘ఇంకొద్ది క్షణాల్లో చనిపోయే నీకెందుకు?’ అంటూ అంతరాత్మ ప్రశ్నించింది. ‘వాడికి బ్రెయిన్లో కణితి ఉందంట అక్కా! ఆపరేషన్ చేసి తీశారు. కానీ మళ్ళీ ఇంకొకటి వచ్చిందట. ఈసారి ఆపరేషన్ అనవసరమంటా’ అంది.. వాడి కూడా వచ్చిన అమ్మాయి వాడిని ఎత్తుకుని వెళుతూ. ఎక్స్పైరీ డేట్ మెడలో వేసుకుని కూడా నవ్వుతూ తిరుగుతున్న బుజ్జి వామనుడు.. తనవంకే చూస్తుండిపోయాను. ‘నిన్ను వ్యాన్ దిగొద్దని చెప్పాను కదా? ఈ సారి ఇలా చేశావంటే బయటకు తీసుకురాను చెబ్తున్నా’ అంది ఆ అమ్మాయి వాడిని బెదిరిస్తూ. బుజ్జి వామనుడు నవ్వుతున్నాడు. ఎక్స్పైరీ డేట్ పూర్తయ్యేవరకు కూడా నవ్వుతూ బతకచ్చని చెప్పిన వాడి పరిచయంతో నా గమ్యం మారింది.వాళ్ళ వెనకే వెళ్ళాను. వాళ్ళందరినీ జాగ్రత్తగా వ్యాన్ ఎక్కిస్తున్న వాలంటీర్ ‘ఏమ్మా, ఆశ్రమానికి వస్తావా?’ అడిగింది. ఆమెకది అలవాటనుకుంటా.. బహుశా విధివంచితలెందర్నో చూసిన అనుభవమయ్యుంటుంది. అప్రయత్నంగానే తలూపాను. ∙∙ వ్యాన్ పెద్ద ఆశ్రమంలోకడుగుపెట్టింది. కల్ప తరువు పేరు మెరుస్తోంది. ఊరికి దూరంగా, విశాలంగా ఉంది. చాలా బిల్డింగ్స్ తరువు శాఖల్లా విస్తరించాయి.‘పేరేంటమ్మా?’ నా కన్నా చిన్నదే రిసెప్షనిస్ట్.. ఆత్మీయంగా అడిగింది. నా పేరు చెప్పాను.ఒక గదిలోకి తీసుకెళ్ళి.. ‘ఇక్కడే కూర్చోండి! మేడమ్‌గారు వచ్చి మీతో మాట్లాడతారు’ అని వెళ్ళిపోయింది. మళ్ళీ మొదలైన వర్షాన్ని, కిటికీలోంచి చూస్తున్నాను. నాలానే వర్షం కూడా ఆగి ఆగి తన బాధను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నట్టుంది. ‘నీ మజిలీ ఈ అనాథాశ్రమమా!’ అంతరాత్మ ప్రశ్నిస్తోంది. ‘హాయ్ మహితా! ఐయాం గౌరీ’ చక్కటి కాటన్ చీరలో పొందికగా ఉంది వచ్చినామె. నా కన్నా ఐదేళ్ళు పెద్దదేమో బహుశా! నా చూపులో నిర్లిప్తత చూసి.. నా పక్కకొచ్చి నుంచుంది గౌరీ.‘నేను.. నీలానే ఈ కల్పతరువుకి వచ్చాను. వర్షం చూస్తూ ఇదే గదిలో బెరుగ్గా, భయంగా నుంచున్నాను. ఇప్పుడిక్కడే పని చేస్తున్నాను. ఇక్కడ మనలా చాలా మంది ఉంటారు మహితా! అదిగో ఆ బ్లాక్‌లో అనాథపిల్లలు ఉంటారు.. దాంట్లో వృద్ధులు.. ఇదిగో ఇందులో మోసపోయిన ఆడవాళ్ళుంటారు. అందులోనేమో హెచ్ఐవీ బాధితులు ఉంటారు.’ఉలిక్కిపడ్డాను ఆమాటకు! ‘నువ్వు ఏ బ్లాక్‌లో ఉంటావ్ మహితా?’ మాట సౌమ్యంగా ఉన్నా..‘ నువ్వు ఏ జాతి పక్షివి’ అని నన్ను ప్రశ్నిస్తున్నట్టే ఉంది. భయంగా చివర్లో చెప్పిన బ్లాక్ వైపు చూపించాను. ఓదార్పుగా నా చుట్టూ చెయ్యి వేసి ‘ఎప్పటినుంచి?’ అడిగింది గౌరీ. ‘నిన్నటి నుంచి’ నా ప్రమేయం లేకుండానే బుగ్గలను కన్నీళ్ళు తడిపాయి.‘చూడు మహితా.. నువ్వు బాధపడుతుంటే ఓదార్చగలను. కానీ పరిష్కారం చూపించలేను. జరిగింది చెప్పు. చెప్పలేనంటవా అదిగో అక్కడ చాలా మంది ఉన్నారు. నీలానే వాళ్ళకూ కథలున్నాయి. వెళ్ళు.. కలువు, మాట్లాడు. నీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు సరేనా!’ అనునయించింది గౌరీ. తలూపాను కానీ వెళ్ళలేదు. ఏం చెప్పాలి? నాలాంటి కథ ఇంకొకరికి ఉంటుందా? ఈ లోకంలో నా అంత చెత్త కథ ఎవరికీ ఉండదేమో..!? ∙∙ మూడు వారాల ముందు ఆఫీసులో, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అందరిలానే నేనూ ఇచ్చాను. కానీ వచ్చిన రిజల్ట్స్ నన్ను షాక్ చేశాయి. ఆ విషయం శౌర్యకి ఎలా చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోతూ, ఏడుపును దిగమింగుకుంటూ నాకసలు హెచ్ఐవీ ఎలా అంటుకుందో అర్థంకాక ప్రతీ సందర్భాన్ని గుర్తుచేసుకుంటుంటే.. రెండు నెలల క్రితం నేను బ్లడ్ డొనేట్ చెయ్యబోతే అడ్డుకున్న శౌర్య గుర్తొచ్చాడు. ‘ఆడవాళ్ళకు పీరియడ్స్ సమయంలోనే బోలెడంత బ్లడ్ పోతుంది. మళ్ళీ నువ్వేం ఇవ్వక్కర్లేదు’ అని అందరిముందు నుంచి నన్ను లాక్కొచ్చాడు. శౌర్యకి నా మీదున్న ప్రేమకి మురిసిపోయాను ఆ క్షణం. కాని సన్నగా మొదలైన అనుమానం.. నన్ను గదంతా వెతికేలా చేసింది. నా అనుమానం నిజమయ్యే సాక్ష్యాలు కనబడటంతో శౌర్య మీదకు విసిరికొట్టి అడిగాను అవేంటని!‘మహా.. సారీ మహా! కావాలని చేసిందికాదు’ కోపంగా మూసేసిన తలుపులు బాదుతూ, బతిమాలడం మొదలుపెట్టాడు. ‘నీకెప్పుడు తెలుసు శౌర్యా?’ ఇంకా ఎక్కడో మిణుకుమంటూ ఆశ.. కన్నీళ్ళను తుడుచుకుని, కిటికీ దగ్గరకొచ్చి అడిగాను.‘మన పెళ్ళికి రెండు రోజుల ముందు. కానీ, నేను తప్పు చెయ్యలేదు మహా! ఇదిగో ఈ టాటూ వలన వచ్చింది. ప్రామిస్! నా జీవితంలో ఉన్న అమ్మాయివి నువ్వొక్కదానివే. ప్లీజ్ మహా, తలుపు తీయ్యి’ కిటికీ దగ్గర నుంచుని అడిగాడు. మరి నన్నెలా పెళ్ళి చేసుకోవాలనిపించింది శౌర్యా? నిన్నట్నుంచి నేనెంత బాధపడుతున్నానో తెలుసా! నీకెక్కడ నా వలన వస్తుందో, ఇప్పటికే వచ్చిందో తెలియక.. నరకం అనుభవిస్తున్నాను. నాకు హెచ్ఐవీ అని తెలిసినప్పటి నుంచి నాకన్నా నీకోసమే ఎక్కువ ఆలోచించాను. నన్నెలా మోసం చెయ్యాలనిపించిందిరా?’ ఏడుస్తూ చేరగిలపడ్డాను.‘చెప్పాలనే అనుకున్నాను మహా..! ధైర్యం సరిపోలేదు. అప్పటికే నువ్వు నా కోసం ఇంటి నుంచి వచ్చేశావ్. నిన్ను వదిలి నేనుండలేను. అందుకే పెళ్ళి చేసుకున్నాను. కానీ నీకు గుర్తుందా మహా..! రెండు నెలల వరకు నిన్ను కనీసం ముట్టుకోలేదు. ఆ తరువాత డాక్టర్ని అడిగి సేఫ్టీ వాడాను. కానీ నా దురదృష్టం.. నీకు వచ్చేసింది’ తల బాదుకుని ఏడుస్తూ చెప్పాడు శౌర్య. ఎంత సులువుగా చెప్పేశాడో..!? నిన్నటి నుంచి ఎన్నో ఆలోచనలు! శౌర్యకి టెస్ట్ చేయించి నెగెటివ్ వస్తే.. ఇక అతని జీవితంలో నుంచి తప్పుకోవాలనుకున్నాను. ఆ నిర్ణయం ఎంత బాధ కలిగించినా సరే.. పాజిటివ్ మాత్రం రాకూడదని ఎంతమంది దేవుళ్ళను మొక్కుకున్నాను!? ఇదే మాటా పెళ్ళికి ముందు చెప్పినా నేను ఒప్పుకునేదాన్ని. శౌర్య అంటే నాకంత ఇష్టం. ‘మోసం చేశావ్ శౌర్యా.. దారుణంగా మోసం చేశావ్!’ గోడకానుకుని ఏడుస్తుండగా.. అత్తయ్య వచ్చినట్టుంది. శౌర్య ఏవేవో చెబుతున్నాడు కానీ నాకేం వినిపించడం లేదు. సగం సగం మాటలు.. ఏవో చెబుతుంటే.. అనుమానంగా తలుపు దగ్గర నుంచి విన్నాను. పలుచటి మంచు పొర కరిగిపోయింది. అత్తయ్య కిటికీ దగ్గరకు వచ్చి ‘అమ్మా మహితా! వాడి మాటలు విను. నిన్ను మోసం చెయ్యాలని కాదు, నిన్ను వదులుకుని బతకలేక అలా చేశాడు.’ శౌర్య కన్నా ఆవిడ మాటలే నాకెక్కువ గుచ్చుకున్నాయి. ఆమెకూ ముందే తెలుసు. ఎంత మోసం! ‘హు..! నేను కోడల్ని కదా?’ చాలా నిస్పృహగా ఉంది. ఇక అక్కడ ఉండబుద్ధవ్వలేదు. బట్టలు, సర్టిఫికెట్స్ అన్నీ సర్దుకుని వెనుక గుమ్మం తలుపు తీసుకుని.. బయటకొచ్చేశాను. ‘మహితక్క అంటే నువ్వేనా?’ చిన్న పాప వచ్చి అడిగింది. తలూపాను. ‘గౌరీ అక్క నిన్ను మా దగ్గరికి తీసుకెళ్ళమంది. దా.. బ్యాగ్ ఎక్కడుంది?’ చెయ్యి పట్టుకుని లాక్కెళుతూ అడిగింది. ఆ అమ్మాయి వెనుకే అప్రయత్నంగా కదిలాను. చిన్న గది, మూడు మంచాలున్నాయి ఆ గదిలో. ‘అదేమో నాది, ఇదేమో మా తమ్ముడిది. నువ్వు ఈ మంచం తీసుకో!’ ముద్దుగా పంపకాల లెక్కలు చెప్పింది పాప. అవేం పట్టనట్టు పరధ్యానంగా నాకు చూపించిన మంచంపై వాలాను. మనుషుల్ని ఎలా మోసం చేస్తారు? అంత సులువుగా ఎలా మోసపోయాను? ‘నువ్వు నీ తల్లిదండ్రులను చేసింది మోసం కాదా?’ అంతరాత్మ ప్రశ్నించింది. ప్రేమంటేనే మోసమా? సమాధానం లేని ప్రశ్న. ఒక్క రోజులో మారిపోయిన నా జీవితం.. నాకే విచిత్రంగా అనిపిస్తోంది. మర్నాడు యోగా హాల్ అని.. అక్కడకు తీసుకెళ్ళింది పాప. అందరూ ఆసనాలు వేస్తున్నారు. నేను బయటికొచ్చి బెంచ్‌పై కూర్చున్నాను. మొహం మీద సూర్య కిరణాలు పడుతున్నాయి. ‘హాయ్ ఐయాం కిరణ్’ నా మీద కాస్తా పెద్దవాడేమో.. నవ్వుతూ చెయ్యిచ్చాడు.‘మహిత’ దూరంగా ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ చెప్పాను. కవలలు.. ముద్దుగా ఉన్నారు. ‘వాళ్ళకి అమ్మ, నాన్న లేరా?’ కిరణ్‌ని అడిగాను. ‘ఇద్దరూ చదువుకుని జాబ్ చేస్తున్న వాళ్ళే. డెలివరీ టైమ్‌లో హెచ్ఐవీ అని తెలిసింది. ఆమె ఆ దిగులుతో చనిపోతే, అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు.’‘అంటే ఆ పసిపిల్లలకు..?’ లేదని చెప్పాలి అని మనసులోనే వేడుకుంటూ అడిగాను. ‘ఇంచుమించు ఇక్కడున్న ప్రతి పిల్లలవీ ఇలాంటి కథలే మహితా! వాళ్ళకు ఏ మాత్రం సంబంధం లేకుండానే చావును మోస్తూ తిరుగుతున్నారు. కొందరిది అమాయకత్వం, కొందరిది మూర్ఖత్వం. ఇంకొందరు డబ్బు కోసం ఒళ్ళమ్ముకుని ఇప్పుడు ఆ దారి కూడా లేక వీథిపాలైన వాళ్ళు. విచిత్రం ఏమిటంటే చదువుకోని వాళ్ళ కన్నా చదువుకుని మోసపోయిన వాళ్ళే ఎక్కువిక్కడ’ అన్నాడు. ‘నువ్వెందుకున్నావ్ కిరణ్?’ ఆ చిన్న పరిచయం ఇచ్చిన చనువుతో ఏకవచనంలోనే ప్రశ్నించాను. ‘మీరా.. తన పేరు! ప్రేమించుకున్నాం. ఒక మైకంలో హద్దులు దాటాం. తనకి నేనే అంటించానని నా మీద తోసేసి పారిపోయింది. తల్లిదండ్రులు అసహ్యించుకున్నారు. ఇంతమంది వద్దనుకున్న బతుకు నాకు మాత్రం ఎందుకనిపించింది. హెచ్ఐవీ అనేది జస్ట్ ఒక చిన్న ఇన్ఫెక్షన్ అంతే మహిత. మందులు వాడితే కొన్ని ఇన్ఫెక్షన్లు వెంటనే తగ్గిపోతాయి, కొన్నింటికి సమయం పడుతుంది. దీని వ్యవధి మాత్రం జీవితకాలం అంతే! మన కోరికలు, ఆశలు ఏవీ నాశనమయిపోవు. హ్యాపీగా మన లైఫ్ మనం లీడ్ చెయ్యొచ్చు. ఇదే నేను తెలుసుకున్నాను. చాలామందికి ఇప్పుడు అవగాహన కల్పిస్తున్నాను’ అన్నాడు కిరణ్. కిరణ్ సమాధానం.. నిన్నటి నుంచి భయపడుతున్న నా ప్రశ్నలన్నింటికీ సమాధానమైంది. ఇంచుమించు ఇద్దరం ఒకే సిట్యుయేషన్లో ఉన్నామనిపించింది. ‘మీరా మోసం నీకు బాధ కలిగించలేదా?’ అడిగి.. కిరణ్ జవాబు కోసం ఎదురుచూడసాగాను. ‘పుట్టుకతోనే ఎవరూ మోసగాళ్ళు కాదు. పరిస్థితుల దృష్ట్యా కొన్ని జరిగాకనే.. వారు లోకం ముందు మొసగాళ్ళలా నుంచుంటారు’ అంటూ లేచి నిలబడి చేతులు విశాలంగా చాపి ఆ బిల్డింగ్ ఆవరణను చూపిస్తూ ‘మీరా మోసం విలువ ఈ ఫాండేషన్’ అని చెప్పి.. ‘ఐయాం వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ కల్పతరువు.. వెల్కమ్ మహితా!’ అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నాకు కర్తవ్య బోధచేస్తున్నట్టుగా అనిపించింది. 420వసారి మోగుతున్న ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి కిరణ్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చాను. -నార్కిడిమిల్లి జ్యోతి శ్రీ (చదవండి: వంద గుడిసెలకు ఇదే పెద్ద చదువా!) -
యావత్తు సృష్టిని ఒక్క గంటలో సృష్టించి..'స్త్రీ మూర్తి'ని మాత్రం ఏకంగా..
యావత్తు సృష్టిని ఒక్క గంటలో తయారుచేయగలిగిన దేవుడు "స్త్రీ మూర్తిని" తయారుచేయడానికి మాత్రం వారం రోజులు కష్ట పడ్డడట ఎందుకో తెలుసా!.. మగాడితో సహా సర్వ జీవులను పుట్టించేసిన దేవుడు చివరగా ఒక "స్త్రీ"ని సృష్టించడం మొదలు పెట్టాడు. ఒక రోజూ రెండు రోజులూ కాదు. ఏకంగా వారం రోజులు తీసుకున్నాడు. "స్త్రీ" సృష్టి కోసం మిగిలిన పనులన్నీ మానుకుని తన నాథుడు ఇంతగా తలమునకలై పోవడం చూసిన దేవత అడిగింది. "స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని?". అప్పుడు దేవుడు "ఏం చెయ్యను మరి ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా అంటూ 'ఆమె శక్తి' గురించి చెప్పుకొచ్చాడు ఇలా.. శారీరీకంగా కోమలమైంది మానసికంగా.. ఇష్టాయీష్టాలకు అతీతంగా ఉండాలి. సృష్టి వివక్ష తగదు. మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి. చిన్న చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసుల వరకూ ఎన్నెన్ని సంఘటనలను ఈజీవి ఎదుర్కోవాలో తెలుసా. ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పని చేయాలో తెలుసా. ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. అడిగేవారు ఉండరూ ఉండకపోవచ్చు. రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి. ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే" అన్నాడు. "ఏంటీ? ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా?" అని ఆశ్చర్యపోతూ దేవత ఆమెను మెల్లగా తాకింది. "ఇదేంటీ ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం" అని ప్రశ్నించింది. ఆప్పుడు దేవుడు"ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు. కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు, ఆమె అన్ని భారాలనూ తట్టుకోగలదు. ఇష్టం, కష్టం, ప్రేమ, కోపం, తాపం అంటూ అన్ని భావోద్వేగాలనూ ఆమె చవిచూడాలి. అవసరమైతే దిగమింగాలి. కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి. తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడమూ తెలుసు. ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమ, అనురాగాలను." అన్నాడు. "ఓహో ఈమె ఆలోచించగలదా" అని దేవత అడిగింది. అప్పుడు దేవుడు"ఎందుకాలోచించదు అన్ని విషయాలూ ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు." అన్నాడు. దేవత ఆమె చెక్కిళ్ళను తాకి "ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటీ? కన్నీరు కారుస్తోందిగా ఏంటిది? " అని అడిగింది. ఆమె కన్నీటికి ఉన్న శక్తి అనంతం.. అప్పుడు దేవుడు "అదా కన్నీరది. ఆ కన్నీటిలో ఆనందమూ ఆవేదనా దుఃఖమూ దిగులూ ఆశ్చర్యమూ భయమూ అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి. ఆ కన్నీటికున్న శక్తి అనంతం. పైగా మరో జీవీకి ప్రాణం పోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది" చెప్పాడు. దేవత ఆశ్చర్యపోతూ "మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే." అని చెప్పింది. అయితే దేవుడు "అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. అప్పటి వరకూ తెలియనట్టే ఉంటుంది." అవసరమైనప్పుడు ఆ శక్తి ముందూ ఎవరూ నిలబడలేరు అని చెప్పి భూమ్మీదకు పంపాడు స్త్రీని. అందుకనే ఏమో} స్త్రీని పుడమితల్లితో పోల్చారు. (చదవండి: 'రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా'.. ఊపిరి సలపని పనుల్లో మహిళా శాస్త్రవేత్తలు) -
మెటా కీలక నిర్ణయం వర్క్ ఫర్మ్ హోమ్..!
-
అమెజాన్ ఉద్యోగులకు అలర్ట్: మే 1 నుంచి..!
సాక్షి,ముంబై: ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని కార్పొరేట్ ఉద్యోగులను కోరింది. ఈ మేరకు అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ ఫిబ్రవరి 17న సిబ్బందికి మెమో ద్వారా సమాచారం అందించారు. ఈ విధనం మే 1 నుంచి అమల్లోకి రానుంది. ఎక్కువ సమయం ఆఫీసులో, సహోద్యోగులతో కలిసి ఉన్నప్పుడు నేర్చుకోవడానికి, సంస్కృతిన బలోపేతం కావడానికి ఎక్కువ దోహదపడుతుందని జెస్సీ తెలిపారు. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు సహకారంతో కొత్త ఆవిష్కారాలుసులభమవుతాయనీ, వ్యక్తిగతంగా ఒకరి నుండి మరొకరు నేర్చుకోవడం ఈజీ అని పేర్కొన్నారు. అలాగే తమ ఉద్యోగులు ప్రధాన నగరాల్లోని కార్యాలయాలకు వస్తే వ్యాపారానికి, ఆర్థిక వ్యవస్థలకు ఊతమిస్తుందని ఆండీ జెస్సీ బ్లాగ్ పోస్ట్ సందేశంలో పేర్కొన్నారు. కాగా గ్లోబల్‌గా కరోనా పరిస్థితి చక్కబడుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. గత నెలలో, స్టార్‌బక్స్ తన కార్పొరేట్ ఉద్యోగులకు వారానికి మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాలని కోరింది.డిన్నీ కూడా వారానికి నాలుగు రోజులు ఆఫీసు నుంచి పని విధానం మార్చినుంచి ప్లాన్ చేసుకోవాలని డిస్నీ ఉద్యోగులను కోరుతోంది. వాల్‌మార్ట్ రెగ్యులర్ ఇన్-ఆఫీస్ పని దినాలను ప్లాన్ చేసు కోవాలని ఇటీవల తన టెక్ టీంలకు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
ఒక్క రోజే ఆఫీసుకు: మీషో మరోసారి బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: ఆన్లైన్ రిటైల్ స్టార్టప్ మీషో మరోసారి తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుతున్న నేపథ్యంలో దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. రోజూ ఆఫీస్‌కు రావాల్సిందేనని ఆదేశిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మీషో వారానికి ఒక రోజు ఆఫీసుకు వస్తే సరిపోతుందని ప్రకటించింది. వారంలో ఒకరోజు ఆఫీసుకు రండి అంటూ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది మీషో. వారంలో మిగతా రోజులు ఇంటినుంచే పని చేసు కోవచ్చని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది(2023) జూన్ నుంచి ఈ విధానం అమల్లో ఉంటుందని తెలిపింది. అప్పటివరకు మీషో ఉద్యోగులు ఎక్కడినుంచైనా పనిచేసుకోవచ్చు. మెజారిటీ ఉద్యోగుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో మీషో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ ఆశిష్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఫ్లెక్సీ-ఆఫీస్ అనేది వారానికి ఒకసారి ఆఫీసుకు, మిగతా రోజులు రిమోట్‌గా పనిచేస్తారని ఇది ఒక టీంగా ఉద్యోగులకు మధ్య సాన్నిహిత్యం పెరగడానికి తోడ్పడుతుందని చెప్పారు. ఇటీవలి సర్వేలో, మెజారిటీ ఉద్యోగులు తమ మధ్య వ్యక్తిగత కనెక్షన్ల అవసరం గురించి మాట్లాడారని అందుకే ఫ్లెక్సీ-ఆఫీస్ మోడల్‌ను అవలంబిస్తున్నట్లు తెలిపారు. కాగా మీషోలో మొత్తం1850 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 50 శాతం మంది బెంగళూరులో ఉన్నారు. మిగిలిన సిబ్బంది దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. తాజా నిర్ణయంతో ఇపుడు వారు బెంగళూరుకు మకాం మార్చాలి లేదా వారానికి ఒకసారి ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. -
అట్టుడుకుతున్న అడవి పల్లెలు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ పల్లెలు అట్టుడుకుతున్నాయి. మావోయిస్టులు, పోలీసుల పోటా పోటీ సభలు, ప్రచారం, కూంబింగ్‌లతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మావోయిస్టు పార్టీ ఈ నెల 21 నుంచి 27 వరకు 18వ అమరవీరుల వారోత్సవాలను నిర్వహించనున్నట్టు మూడు రాష్ట్రాల సరిహద్దులో వారం ముందు నుంచే విస్తృత ప్రచారం చేసింది. గోదావరి పరీవాహక అటవీ ప్రాంతంలో నక్సల్స్ కదలికలున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులను అప్రమత్తం చేశారు. దీనితో పోలీసు ఉన్నతాధికారులు గ్రేహౌండ్స్‌తోపాటు ప్రత్యేక సాయుధ పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. మూడు రాష్ట్రాల సరిహద్దులోని కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అడవులను సాయుధ బలగాలు జల్లెడ పడుతున్నాయి. క్షణక్షణం భయం భయం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సాయుధ బలగాలతో కలిసి తెలంగాణ సరిహద్దులో ఓవైపు పోలీసులు అడవులను జల్లెడ పడుతుండగా.. మరోవైపు మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను చేపట్టింది. జన చేతన నాట్య మండలి నిర్వహించిన ఈ కార్యక్రమానికి మావోయిస్టు నాయకులతోపాటు 10, 12 గ్రామాల ప్రజలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పోలీసులు కూడా విడుదల చేశారు. ఇదే సమయంలో పోలీసులు వాల్ పోస్టర్లు, కరపత్రాల ద్వారా మావోయిస్టుల తలలకు వెల ప్రకటించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండటంతో అడవుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మావోయిస్టు స్థావరాలపై కన్ను కొంతకాలం నుంచి కూంబింగ్ ముమ్మరం చేసిన పోలీసులు.. మావోయిస్టు స్థావరాల సమాచారం సేకరించి దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ తాల్మెంద్రి అటవీ ప్రాంతంలో ఇటీవల నేషనల్ పార్క్ ఏరియా కమిటీ డీసీఎం దిలీప్ ఆధ్వర్యంలో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారం అందింది. డీఆర్జీ పోలీస్ ఫోర్స్ దాడి చేయగా.. ఇరువురి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కానీ మావోయిస్టులు తప్పించుకున్నారు. -
వారం రోజులపాటు కారులోనే దాగి ఉన్న కోబ్రా... బిత్తరపోయిన యజమాని
తిరువనంతపురం: కేరళలోని ఆర్పూకర నివాసి సుజిత్ ఆగస్టు 2న మలప్పురం వెళ్లారు. అక్కడ వజికడవు చెక్‌పోస్ట్ వద్ద తన కారు ఆగింది. ఆ సయమంలోనే ఒక విషసర్పం కారు వద్దకు వచ్చి అందులో దాగి ఉంది. ఈ విషయం తెలియని కారు యజమాని సుజిత్ ఆర్పూకర్లో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. సుజిత్ ఒక రోజు కారులో వేలాడుతున్న కుబుసం చూసి ఒక్కసారిగా హడలిపోతాడు. దీంతో ఈ విషసర్పం ఇక్కడే ఎక్కడే సంచరిస్తుందని సుజిత్ తన ఇంటి కాంపౌండ్‌ని, కారుని మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేస్తాడు. అయినా ప్రయోజం ఉండదు. దీంతో సుజిత్ కుటుంబం ఒకింత భయబ్రాంతులకు గురైంది. ఈ విషయాన్ని తన చుట్టుపక్కల వాళ్లకు తెలియజేశాడు. ఐతే అక్కడ ఉన్న కొంతమంది స్థానికు పాము కారు వద్ద ఉండటం చూశామని చెప్పడంతో వన్యప్రాణుల సిబ్బందిని పిలిపించారు. వారు వచ్చినప్పుడూ గానీ తెలియలేదు పాము ఎక్కడ ఉందనేది. ఆ విషసర్పం ఏకంగా కారు ఇంజన్ బేస్‌లో ఉంది. బహుశా వజికడుపు చెక్ పోస్ట్ వద్ద ఆగినప్పుడే ఈ పాము వచ్చి ఉంటుందని భావించారు అంతా. అంతేకాదు ఈ పాము ఏకంగా కారు ఇంజన్ బేలోనే వారం రోజులపాటు ఉంది. అలాంటి విషసర్పం సంచరించని ప్రదేశంలోకి వస్తే ఎవరైన కలవరపాటుకి గురవ్వడం సహజమే. (చదవండి: బస్సులో నుంచుని వెళ్లడం ఇష్టం లేక...ఏం చేశాడంటే...) -
మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు.. ఏవోబీలో రెడ్ అలర్ట్
సాక్షి, పాడేరు/ముంచంగిపుట్టు/కొయ్యూరు: ఏజెన్సీలో మావోయిస్టులు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు 50వ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏవోబీ వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్ది రోజుల కిందట ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ పేరిట విడుదలైన లేఖలో వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాలతో పాటు అల్లూరి జిల్లాలోని పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, చింతూరు పోలీసు సబ్ డివిజన్ల పరిధిలోని పోలీసు బలగాలు వారం రోజుల నుంచి కూంబింగ్ చేపడుతున్నాయి. చింతూరుకు సరిహద్దులో ఉన్న చత్తీస్‌గఢ్ ప్రాంతంలో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మావోయిస్టుల వారోత్సవాలను భగ్నం చేసేలా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సీఆర్పీఎఫ్తో పాటు ఇతర పోలీసు బలగాలు అటవీ ప్రాంతాల్లో మకాం వేశాయి. మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లలో ఆయా పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో కూడా తనిఖీలు జరిపారు. ముంచంగిపుట్టులో ఎస్ఐ కె.రవీంద్ర ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్ పోలీసులు ముంచంగిపుట్టు నుంచి రాముల గ్రామం వరకు కల్వర్టులు, వంతెనలను బాంబు స్క్వాడ్‌తో పరిశీలించారు. జోలాపుట్టు, మాచ్‌ఖండ్, ఒనకఢిల్లీల్లో బీఎస్ఎఫ్ బలగాలు నిఘా పెంచాయి. నాయకులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఎక్కడికి వెళ్లినా తమకు సమాచారం అందించాలని పోలీసులు నోటీసులను జారీ చేశారు. కొయ్యూరు మండలంలోనూ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఏడాది కాలంలో ఏవోబీ పరిధిలో 12 మంది మావోయిస్టులు మరణించారు. అలా మరణించిన వారికి వారోత్సవాల్లో మావోయిస్టులు నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా యాక్షన్టీంలను రంగంలోకి దించే అవకాశం ఉండడంతో పోలీసులు నిఘా పెంచారు. పాడేరు, చింతలవీధి, గబ్బంగి, కరకపుట్టు తదితర ప్రాంతాల్లో ఎస్ఐలు లక్ష్మణ్‌రావు, రంజిత్‌లు తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులలో రాకపోకలు సాగిస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. (క్లిక్: ఆంధ్రాలోనే ఉంటాం.. భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాలి) -
AP: వారానికి ఐదు రోజుల పని.. మరో ఏడాది పొడిగింపు
సాక్షి, అమరావతి: సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వ పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ గురువారం ఉత్తర్వులిచ్చారు. చదవండి: మీకు తెలుసా?.. చెప్పింది చేస్తే.. నష్టపోవాల్సిందే! వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో వారానికి ఐదురోజుల పని విధానాన్ని ఈ ఏడాది జూన్ 27వ తేదీ నుంచి ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదురోజుల పని విధానంలో ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలకు వరకు పని చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజులు పని చేసే విధానాన్ని మరో ఏడాది పాటు పొడిగించిన సీఎం వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. -
ఏపీలో మరో వారంపాటు నైట్ కర్ఫ్యూ పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరో వారం పాటు నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్ సూపర్ కేర్ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. ‘‘పోలీస్ బెటాలియన్స్‌లో కూడా కోవిడ్ కేర్ ఎక్విప్మెంట్ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించాలి. కమ్యూనిటీ ఆస్పత్రులు స్ధాయివరకు ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. పీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలి. సబ్‌సెంటర్ల వరకు టెలీమెడిసిన్ సేవలు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండాలి. అప్పుడే వారితో పీహెచ్‌సీల వైద్యులు కూడా వీసీ ద్వారా అందుబాటులోకి వస్తారు. కోవిడ్ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్ కర్ఫ్యూ కొనసాగించాలి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగించాలి. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని’’ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. -
ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ పొడిగింపు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు. ఈ నెల 17 వరకు మరో వారం పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. రేపటి (సోమవారం) నుంచి ఢిల్లీలో వారం పాటు మెట్రో సర్వీసులు రద్దు చేసున్నట్లు ఆయన ప్రకటించారు. లాక్డౌన్ సత్ఫలితాలు ఇస్తోందని కేజ్రీవాల్ అన్నారు. పాజిటివ్ రేటు 35 నుంచి 23 శాతానికి తగ్గిందని సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. దేశంలో కరోనా వైరస్ రెండో వేవ్ తీవ్రరూపంలో వ్యాపిస్తోంది. కరోనా కట్టడి చర్యలు తీసుకుంటున్నా ఏమాత్రం ఫలితం ఉండడం లేదు. దీంతో విధిలేక చివరి అస్త్రంగా రాష్ట్రాలు లాక్డౌన్ విధిస్తున్నాయి. కరోనా గొలుసు తెంపేందుకు లాక్‌డౌనే పరిష్కారమని రాష్ట్రాలు భావిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఏకంగా 14 రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉంది. మొదట మహారాష్ట్రతో మొదలైన లాక్డౌన్ అనంతరం ఢిల్లీ, కర్ణాటక విధించగా తాజాగా తమిళనాడు కూడా విధించింది. కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 4,03,738 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. చదవండి: దేశంలో పంజా విసురుతున్న మ్యూకోర్మైకోసిస్ కరోనా సంక్షోభంపై టాస్క్‌ఫోర్స్ -
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడిగింపు
-
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడిగింపు
ఢిల్లీ: కరోనా కేసులు పెరగడంతో ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ పొడిగించారు. మే 3 ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుంది. సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఢిల్లీలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదన్నారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో నిన్న రికార్డుస్థాయిలో 357 కరోనా మరణాలు సంభవించాయని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో మృత్యుఘోష ఆగడం లేదు. ఆస్పత్రుల్లో ప్రాణవాయువు నిండుకుంది. దీంతో ఆస్పత్రుల్లో అత్యవసర విభాగాల్లో కృత్రిమ ఆక్సిజన్‌తో చికిత్స పొందుతున్న రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. శుక్రవారం గంగారాం ఆస్పత్రిలో 25 మంది రోగులు ఆక్సిజన్ అందక మరణించిన ఘటన మరవకముందే ఢిల్లీలో శనివారం మరో ఘోరం జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 20 మంది రోగులు ఆక్సిజన్ అందక కన్నుమూశారు. చదవండి: దేశంలో కొత్తగా 3,49,691 కరోనా కేసులు ఢిల్లీలో ఆగని మృత్యుఘోష -
ఆర్బీఐ ఎఫెక్ట్: రుపీ వీక్
సాక్షి,ముంబై: ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలు బహిర్గతమైన నేపథ్యంలో దేశీయ కరెన్సీ నష్టాలతో ప్రారంభమైంది. మంగళవారం నాటి 73.67 రాటి ముగింపుతో పోలిస్తే నేడు మరింత దిగజారింది. డాలరు మారకంలో రూపాయి 73.92 వద్ద ప్రారంభమైంది. 35పైసలు క్షీణించి మళ్లీ 74.03 వద్ద కొనసాగుతోంది. దేశీ బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించే అధికారిక సంస్థ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)కు తగిన స్వేచ్చలేదంటూ సాక్షాత్తూ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య అసంతృప్తి, దీనికి ప్రతిగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర వ్యాఖ్యలు ప్రతికూల సంకేతాలందించినట్టు ఎనలిస్టులు చెబుతున్నారు. -
ఈవారం పుస్తకాలు
ఇలా రువ్వుదామా రంగులు (కవిత్వం) కవి: విజయ్ కోగంటి; పేజీలు: 96; వెల: 100; ప్రతులకు: డాక్టర్ కోగంటి విజయబాబు, 26–38–143, కావ్య హౌజ్, మూడో లైను, శ్రీరామ్‌నగర్, ఎ.టి.అగ్రహారం, గుంటూరు–522004. ఫోన్: 8801823244 ముఖామి (ముస్లింవాద కవిత్వం) సంపాదకులు: స్కైబాబ, డాక్టర్ షాజహానా; పేజీలు: 114; వెల:75; ప్రతులకు: షాజహానా, 402, ఝాన్సీ రెసిడెన్సీ, ప్లాట్ నం.30, తానాషానగర్, హుడా కాలనీ, మణికొండ, హైదరాబాద్–89. ఫోన్: 9885420027 రాత్రినదిలో ఒంటరిగా... (కవిత్వం) కవి: ముకుంద రామారావు; పేజీలు: 112; వెల: 80; ప్రచురణ: పాలపిట్ట బుక్స్; ప్రతులకు: కవి, 1–7–23/1, హబ్సిగూడ, వీధి నం. 8, ఐఎస్ఐ దగ్గర, హైదరాబాద్–7. ఫోన్: 9908347273 బోల్డన్ని కబుర్లు రచన: లలిత; పేజీలు: 384; వెల: 150; రచయిత్రి చిరునామా: 3–6–18, జయ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నం. 103, హిమాయత్‌నగర్, హైదరాబాద్–29. ప్రతులకు: జ్యోతి వలబోజు; ఫోన్: 8096310140 సరికొత్త వేకువ (కథలు) రచన: కోసూరి ఉమాభారతి; పేజీలు: 176; వెల: 100; ప్రచురణ: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా. ప్రతులకు: జె.వి.పబ్లికేషన్స్; ఫోన్: 8096310140 ద ఇండియా ఐ నో అండ్ ఆఫ్ హిందూయిజం (ఇంగ్లిష్) రచన: ఇందిర జి. పేజీలు: 258; వెల: 499; ప్రతులకు: Partridge India 000 800 10062 62