కొన్ని ప్రైవేట్ కంపెనీలలో ఇప్పుడు వారానికి కేవలం ఐదు రోజులే పని దినాలు. ఈ విధానం కోసం ఒకప్పటి నుంచి బ్యాంక్ ఉద్యోగులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ విధానం త్వరలోనే అమలు అయ్యే సూచనలు ఉన్నట్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), ఎంప్లాయీ యూనియన్‌లు చెబుతున్నాయి.
ఇప్పటికే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), ఎంప్లాయీ యూనియన్‌ల మధ్య జరిగిన ఒక ఒప్పందం ప్రకారం.. ఈ విధానం ఈ ఏడాది చివరి నాటికి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. కేవలం ప్రభుత్వ ఆమోదం పొందిన వెంటనే బ్యాంకు ఉద్యోగులకు కూడా వారానికి కేవలం ఐదు రోజులే వర్కింగ్ డేస్.
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వంటి బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు, కొంతకాలంగా శనివారాలు సెలవులు కావాలని.. దీని వల్ల కస్టమర్ సర్వీస్ వంటి వాటికి ఎటువంటి ఆటంకాలు ఉండవని వారు హామీ ఇచ్చారు. ఇదే జరిగితే బ్యాంక్ పని వేళల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: 22ఏళ్ళ క్రితం నిర్మించారు.. ఇప్పటికీ అక్కడ టోల్ ట్యాక్స్ ఎక్కువే!
ఇప్పటికే బ్యాంకులకు ఆదివారం సెలవు, ప్రతి నెలలోనూ రెండవ, నాల్గవ శనివారాలు సెలవు. ఇక మిగిలింది మరో రెండు శనివారాలు. వీటిని కూడా సెలవు దినాలుగా ప్రకటిస్తే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెగోషయెబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం సెక్షన్ 25 ప్రకారం నెలలోని అన్ని శనివారాలు అధికారిక సెలవు దినాలే అవుతాయి. కాబట్టి బ్యాంక్ పనివేళలు ఉదయం 9:45 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment