Bank employees
-
బ్యాంక్ టైమింగ్స్ మారుతాయా?
బ్యాంకులకు వారంలో 5 రోజులే పనిదినాలు ఉండాలని, రెండు రోజులు సెలవు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఒప్పుకొంటుందా లేదా అన్నది అన్నది శనివారం (ఫిబ్రవరి 1) తేలనుంది. ఎందుకంటే ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్ 2025-26ను (Union Budget 2025-26) ప్రవేశపెట్టనున్నారు.రానున్న బడ్జెట్లో బ్యాంకు ఉద్యోగుల 5 రోజుల పనిదినాల డిమాండ్‌కు సంబంధించిన ప్రకటన ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఒకవేళ బ్యాంకు ఉద్యోగుల డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరిస్తే బ్యాంకులు వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేస్తాయి. రెండు రోజులు మూసిఉంటాయి. దీంతో బ్యాంకుల రోజువారీ పనివేళలు (Bank timings) కూడా మారుతాయి.రోజూ 40 నిమిషాలు అదనంగా..వారానికి ఐదు రోజులే పని దినాలు ఉండేలా చూడాలని బ్యాంకు ఉద్యోగులు, సంఘాలు చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఒక ప్రభుత్వం ఇలా చేస్తే బ్యాంకులు ప్రతిరోజూ 40 నిమిషాలు అదనంగా పని చేయాల్సి ఉంటుంది. ప్రతి శనివారం, ఆదివారం బ్యాంకు శాఖలు మూసిఉంటాయి. ఇప్పటి వరకు బ్యాంకులు మొదటి, మూడో శనివారాల్లో పనిచేస్తున్నాయి. రెండవ, నాల్గవ శనివారాలు సెలవు పాటిస్తున్నారు. 5 రోజుల పనిదినాలపై బ్యాంకు ఉద్యోగుల సంఘం, ఆర్బీఐ, ప్రభుత్వ అధికారుల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఆర్బీఐ, ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది.నెలలో 8 సెలవులుబ్యాంకులకు ప్రస్తుతం నెలలో 6 సెలవులు ఉండగా 8 సెలవులు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం బ్యాంకు ఉద్యోగుల సంఘాలు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వం, ఆర్బీఐ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది.ఖాతాదారులకు ఇబ్బందులు!బ్యాంకుల్లో వారానికి 5 రోజుల పని దినాలు అమలైతే ఖాతాదారులకు కాస్త ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా శనివారాల్లో బ్యాంకు పనులు పూర్తి చేసుకునేవారు అసౌకర్యం ఎదుర్కోవాల్సి ఉంటుంది.వారు తమ పనిని బ్యాంకులు పనిచేసే 5 రోజుల విండోలోనే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు బ్యాంకులు రోజూ 40 నిమిషాలు అదనంగా తెరవాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాంకు శాఖలు ఉదయం 9:45 గంటల నుంచి తెరుచుకుంటాయి. సాయంత్రం 5:30 గంటలకు పనివేళలు ముగుస్తాయి. బ్యాంకులను ప్రస్తుతం ఉదయం 10 గంటలకు తెరిచి సాయంత్రం 5 గంటలకు మూసివేస్తున్నారు. -
వారానికి ఐదు రోజులే పని దినాలు!.. నిజమైతే వారికి పండగే
కొన్ని ప్రైవేట్ కంపెనీలలో ఇప్పుడు వారానికి కేవలం ఐదు రోజులే పని దినాలు. ఈ విధానం కోసం ఒకప్పటి నుంచి బ్యాంక్ ఉద్యోగులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ విధానం త్వరలోనే అమలు అయ్యే సూచనలు ఉన్నట్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), ఎంప్లాయీ యూనియన్లు చెబుతున్నాయి.ఇప్పటికే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), ఎంప్లాయీ యూనియన్ల మధ్య జరిగిన ఒక ఒప్పందం ప్రకారం.. ఈ విధానం ఈ ఏడాది చివరి నాటికి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. కేవలం ప్రభుత్వ ఆమోదం పొందిన వెంటనే బ్యాంకు ఉద్యోగులకు కూడా వారానికి కేవలం ఐదు రోజులే వర్కింగ్ డేస్.యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వంటి బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు, కొంతకాలంగా శనివారాలు సెలవులు కావాలని.. దీని వల్ల కస్టమర్ సర్వీస్ వంటి వాటికి ఎటువంటి ఆటంకాలు ఉండవని వారు హామీ ఇచ్చారు. ఇదే జరిగితే బ్యాంక్ పని వేళల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: 22ఏళ్ళ క్రితం నిర్మించారు.. ఇప్పటికీ అక్కడ టోల్ ట్యాక్స్ ఎక్కువే!ఇప్పటికే బ్యాంకులకు ఆదివారం సెలవు, ప్రతి నెలలోనూ రెండవ, నాల్గవ శనివారాలు సెలవు. ఇక మిగిలింది మరో రెండు శనివారాలు. వీటిని కూడా సెలవు దినాలుగా ప్రకటిస్తే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెగోషయెబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం సెక్షన్ 25 ప్రకారం నెలలోని అన్ని శనివారాలు అధికారిక సెలవు దినాలే అవుతాయి. కాబట్టి బ్యాంక్ పనివేళలు ఉదయం 9:45 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. -
బ్యాంకు ఉద్యోగులకు షాక్.. వాటిపై పన్ను కట్టాల్సిందే..!
బ్యాంకులు తమ ఉద్యోగులకు ఇచ్చే వడ్డీ రహిత లేదా రాయితీ రుణాలు "అంచు ప్రయోజనాలు" (ఫ్రింజ్ బెనిఫెట్స్) అని, వాటిపై పన్ను వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.బ్యాంకు సిబ్బంది అనుభవిస్తున్న రుణ ప్రయోజనం వారికి ప్రత్యేకమైనదని, అది జీతంతోపాటు అదనపు ప్రయోజనమని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించినట్లుగా ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఈ ప్రయోజనంపై పన్ను వర్తిస్తుందని మే 7న ధర్మాసనం పేర్కొంది.ఆదాయపు పన్ను నియమాన్ని కోర్టు సమర్థించడంతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును బెంచ్‌మార్క్‌గా నిర్ణయించడం కూడా ఏకపక్ష లేదా అసమాన అధికార వినియోగం కాదని అభిప్రాయపడింది. ఫ్రింజ్ బెనిఫిట్ గణన కోసం ఒకే స్పష్టమైన బెంచ్‌మార్క్‌ను నిర్ణయించడం ద్వారా కస్టమర్ల నుండి వివిధ బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లను నిర్ధారించే చిక్కుముడి ఉండదని బెంచ్ పేర్కొంది.బ్యాంకులు తమ ఉద్యోగులకు అందించే వడ్డీ రహిత లేదా రాయితీతో కూడిన రుణ ప్రయోజనాలపై ఎస్బీఐ ప్రైమ్ లెండింగ్ రేటు ప్రకారం వసూలు చేసే వడ్డీ కంటే బ్యాంకు వసూలు చేసే వడ్డీ తక్కువగా ఉన్నట్లయితే వీటిని ఫ్రింజ్ బెనిఫిట్స్‌గా భావించి పన్ను విధించే ఆస్కారం ఉందని ఆదాయపు పన్ను నియమాలు చెబుతున్నాయి. -
బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై వారానికి 5 రోజులే పని!
ఉద్యోగులకు శుభవార్త. త్వరలో బ్యాంకుల్లో వారానికి ఐదురోజు పనిదినాలు ప్రారంభం కానున్నాయి. కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కొత్త పనిదినాలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం, బ్యాంకులు నెలలో మొదటి, మూడవ శనివారాలు పని చేస్తాయి. రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలు. అయితే కేంద్రం నోటిఫికేషన్ విడుదలతో బ్యాంక్ ఉద్యోగులు త్వరలో వారానికి ఐదురోజుల మాత్రమే పనిచేసే వెసలు బాటు కలగనుంది. అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు బ్యాంకులు పనిచేయగా.. శని, ఆదివారాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ తరుణంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఓ పత్రికా ప్రకటనలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ మధ్య చర్చలు విజయవంతంగా ముగిశాయని, జాయింట్ నోట్‌పై సంతకం చేయడంతో చర్చలు సఫలమైనట్లు పేర్కొంది. ప్రభుత్వ నోటిఫికేషన్ పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం నోటిఫికేషన్ తర్వాత సవరించిన పని గంటలు అమలులోకి రానున్నాయి. కొత్త బ్యాంక్ పనివేళలు ఎలా ఉండబోతున్నాయ్ ఐదురోజుల పనిదినాల్లో అమల్లోకి వచ్చిన వెంటనే బ్యాంక్ పనివేళలు ఎలా ఉండనున్నాయనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంటుంది. పలు నివేదికల ప్రకారం ఉద్యోగులు ఉదయం 9:45 బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమై సాయంత్రం 5:30 వరకు కొనసాగనున్నాయి. తద్వారా బ్యాంక్ ఉద్యోగులు రోజుకు 40 నిమిషాలు అదనంగా పనిచేయనున్నారు. -
బ్యాంక్ ఉద్యోగులకు తొందరలోనే రెండు శుభవార్తలు!
బ్యాంక్ ఉద్యోగులకు 2024 సంవత్సరం సంతోషకరమైన సంవత్సరం కావచ్చు. తొందరలోనే రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ తన సమ్మతిస్తే జూన్ నాటికి బ్యాంకు ఉద్యోగులకు 5 పని దినాల విధానం అమల్లోకి రావచ్చు. అలాగే జీతాల పెంపును కూడా పొందవచ్చు. బ్యాంక్ ఉద్యోగుల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, బ్యాంకింగ్ రంగానికి వారానికి ఐదు రోజుల పనిని సిఫార్సు చేస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. ప్రస్తుతం ఆదివారాలు, షెడ్యూల్డ్ సెలవులు అదనంగా ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులకు సెలవులు ఇస్తున్నారు. ఐదు రోజుల పని విధానం మొత్తం బ్యాంకింగ్ ఖర్చులను తగ్గించదని, కస్టమర్లకు బ్యాంకింగ్ అవర్స్‌లోగానీ, ఉద్యోగులకు మొత్తం పని గంటలలో గానీ తగ్గింపు ఉండదని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తన ప్రతిపాదనలో హామీ ఇచ్చింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో కుదిరిన ఒప్పందం ద్వారా ఈ ప్రతిపాదన చేసింది. ఈ విషయాన్ని సానుకూలంగా సమీక్షించాలని, తదనుగుణంగా ముందుకు సాగేలా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ను ఆదేశించాలని అసోసియేషన్ ఆర్థిక మంత్రిని అభ్యర్థించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్‌ఐసీలలో ఐదు రోజుల పని విధానం ఇప్పటికే ఆచరణలో ఉందని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ గుర్తు చేసింది. జీతాల పెంపు గత సంవత్సరం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీ యూనియన్ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MOU) ఫలితంగా దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 17 శాతం వేతనాల పెంపుదలకు రూ. 12,449 కోట్లకు ఒప్పందం కుదిరింది. ఈ పథకానికి ఆమోదం లభిస్తే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోని 3.8 లక్షల మంది అధికారులతో సహా దాదాపు తొమ్మిది లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి కలుగుతుంది. -
ఎస్బీఐ గుడ్‌న్యూస్: భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు!
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ (SBI ) తమ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. జీతాలు, పెన్షన్ల పెంపునకు సంబంధించి ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా కీలక విషయం వెల్లడించారు. ఇందుకోసం నిధులను సైతం కేటాయించినట్లు చెప్పారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ పెంపుదల కోసం కేటాయింపులు పెరగడం బ్యాంక్ రెండవ త్రైమాసిక నికర లాభంపై ప్రభావం చూపిందని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. ఉద్యోగుల జీతాలు 14 శాతం మేర పెంచాలని భావించిన ఎస్బీఐ అందుకు అనుగుణంగా నిధులను సైతం పక్కనపెట్టి ఉంచింది. 2022 నవంబర్ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉన్న వేతన సవరణ కోసం ఇప్పటివరకు రూ. 8,900 కోట్లను కేటాయించినట్లు ముంబైలో ఎస్బీఐ రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో దినేష్ ఖారా వెల్లడించారు. "ఈ కేటాయింపుల వల్ల రెండో త్రైమాసికంలో ఎస్బీఐ లాభాలు కొంచెం తగ్గాయి. ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఊపందుకుని 16 శాతం నుంచి 17 శాతం వరకు కొనసాగుతుందని భావిస్తున్నాం. దేశీయ డిమాండ్ బలంగా ఉంది. పండుగ వ్యయాల నేపథ్యంలో ఇది మరింత పెరుగుతుంది" అని ఖారా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి ఎస్బీఐ నికర లాభం 8 శాతం పెరిగి రూ.14,330 కోట్లకు చేరుకుంది. 16 శాతంతో రిటైల్ రుణాల వృద్ధి.. 7 శాతంగా ఉన్న కార్పొరేట్ రుణ వృద్ధిని అధిగమించింది. అయితే కంపెనీలు నెమ్మదిగా రుణాలను పొందుతున్నాయని, రూ. 4.77 లక్షల కోట్ల రుణాలు వివిధ దశల్లో ఉన్నాయని దినేష్ ఖారా వివరించారు. "బ్యాంకుకు రూ. 3.20 లక్షల కోట్ల అన్సెక్యూర్డ్ రుణాలు ఉన్నాయి. వీటిలో 86 శాతం సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్న కస్టమర్లకే ఇచ్చాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని ఆయన చెప్పారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవలి ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీల అసురక్షిత రుణ వృద్ధి పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. -
ఖాతాదారులకు అలెర్ట్ : బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్కాం కలకలం!
ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా’(bob)లో స్కాం కలకలం రేపింది. పలు బ్రాంచీలలో పనిచేస్తున్న ఉద్యోగులే కస్టమర్ల బ్యాంక్ అకౌంట్లకు సంబంధం లేని మొబైల్ నంబర్లతో లింక్ చేసి, వాటి సాయంతో బ్యాంక్ ఆఫ్ బరోడా మొబైల్ యాప్ ‘బాబ్ వరల్డ్’ లో లాగిన్ అయ్యారు. అనంతరం, ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈ ఏడాది జులైలో అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరా పలు నివేదికల్ని వెలుగులోకి తెచ్చింది. తాజాగా, జరిపిన బ్యాంక్ ఇంట్రర్నల్ ఆడిట్లో కుంభకోణం జరిగింది నిజమేనని తేలింది. ఆర్బీఐ సైతం చర్యలకు ఉపక్రమించింది. అసలేం జరిగింది? బ్యాంక్ ఆఫ్ బరోడా మొబైల్ యాప్ ఇతర బ్యాంకింగ్ యాప్‌ల మాదిరిగానే, కస్టమర్లకు లోన్ సదుపాయం, సేవింగ్స్, పెట్టుబడులు, పేమెంట్స్, బస్, హోటళ్ల బుకింగ్ వంటి వివిధ డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని అందిస్తుంది. దీన్ని ఆసరగా చేసుకుని బ్యాంక్ ఉద్యోగులే తిన్నింటి వాసాలు లెక్కబెట్టారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన బ్యాంక్ ఉద్యోగులు నివేదిక ప్రకారం, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులే కస్టమర్లకు తెలియకుండా ఫోన్ నెంబర్లు లేని అకౌంట్లను గుర్తించారు. కస్టమర్ల ఫోన్ నెంబర్ల స్థానంలో బ్యాంక్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, భద్రతా సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల నెంబర్లను జత చేశారు. దీంతో బ్యాంక్ అసలైన ఖాతాదారులకు తెలియకుండా వారి మొబైల్ యాప్స్‌లలో లాగిన్ అయ్యారు. అకౌంట్లలో ఉన్న నిధుల్ని కాజేశారు. ఈ వ్యవహారంలో కస్టమర్లు భారీ ఎత్తున నష్టపోయారంటూ వెలుగులోకి వచ్చిన నివేదికల్ని బ్యాంక్ ఆఫ్ బరోడా ఖండించింది. ఆ తర్వాత వరుస ఫిర్యాదులతో ఆర్బీఐ సైతం అప్రమత్తమైంది. బీవోబీలో అంతర్గత విచారణ చేపట్టడంతో తీగ లాగడంతో డొంకంతా కదలడంతో స్కాం జరిగినట్లు తేలింది. ఉద్యోగుల సస్పెండ్ ఈ స్కామ్‌లో సంబంధం ఉన్న 60 మంది ఉద్యోగులకు సస్పెన్షన్ విధించింది. దీంట్లో గుజరాత్ వడోదరా, భోపాల్, బరోడా, రాజస్థాన్ నుంచి విధులు నిర్వహిస్తున్న 11 మంది అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు ఉన్నారు. వీరందరిని ఆర్బీఐ సస్పెండ్ చేసింది. పూర్తిస్థాయిలో నిజాలు వెలుగులోకి వస్తే వారి శాశ్వతంగా విధుల నుంచి తొలగించే అవకాశం ఉందని సమాచారం. రంగంలోకి ఆర్బీఐ బ్యాంక్ ఉద్యోగులు చేసిన మోసంతో ఆర్బీఐ యాప్‌లోని లోపాల్ని సరిదిద్దుతుంది. కొత్త కస్టమర్లు యాప్‌లో లాగిన్ అవ్వకుండా నిషేధించింది. యాప్‌లోని సమస్యల్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంది. ఆ తర్వాతనే కొత్తగా బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు నెట్ బ్యాంక్‌లో లాగిన్ అయ్యే అవకాశం కలగనుంది. చదవండి👉 మెక్రోసాఫ్ట్ శాలరీ లీక్, ఏడాది జీతం కోసం..మనమైతే జీవితాంతం కష్టపడాల్సిందే! -
ఆ బ్యాంకు ఉద్యోగులు ఇక ఇంటికే..!
సంక్షోభంలో చిక్కుకున్న క్రెడిట్ సూసీ బ్యాంక్ ఉద్యోగులకు త్వరలో ఉద్వాసన తప్పదని స్విస్ వారపత్రిక ‘హ్యాండెల్స్ జూటింగ్’ తాజాగా తెలిపింది. ఈ క్రెడిట్ సూసీ బ్యాంకును స్విట్జర్లాండ్ దిగ్గజ బ్యాంక్ యూబీఎస్ టేకోవర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు బ్యాంకుల విలీనాన్ని యూబీఎస్ ప్రారంభించిందని, క్రెడిట్ సూసీలోని వేలాది మంది ఉద్యోగులు త్వరలో తొలగింపు నోటీసులు అందుకోనున్నారని ఆ పత్రిక పేర్కొంది. క్రెడిట్ సూసీ బ్యాంకును 3.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి గత మార్చి నెలలో యూబీఎస్ అంగీకరించింది. ఇక అప్పటి నుంచి దీని ప్రభావం ఉద్యోగాలపై కచ్చితంగా ఉంటుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. విలీనం అనంతరం క్రెడిట్సూసీలోని చాలామంది ఉద్యోగులను తొలగించే యోచనలో యూబీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్గియో ఎర్మోట్టి ఉన్నట్లు సదరు స్విస్ పత్రిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా క్రెడిట్ సూసీకి చెందిన 30,000 నుంచి 35,000 ఉద్యోగాల కోత ఉంటుందని స్విస్ మీడియా ఊహాగానాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. ఇదీ చదవండి: Credit Suisse Layoffs 2023: 35,000 ఉద్యోగాలు కట్! సంక్షోభంలో చిక్కుకున్న స్విస్ బ్యాంకులో సగానికిపైగా కోతలు.. గత సంవత్సరం చివరి నాటికి యూబీఎస్, క్రెడిట్ సూసీ బ్యాంకుల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 37,000 మంది స్విట్జర్లాండ్‌లోనే పనిచేస్తున్నారు. కాగా దీనిపై వ్యాఖ్యానించడానికి యూబీఎస్ నిరాకరించింది. -
బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త! వారానికి రెండు రోజులు...
బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త ఇది. వారంలో ఐదు రోజులే పనిదినాలు ఉండాలన్న బ్యాంకు యూనియన్ల డిమాండ్‌ను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) పరిశీలిస్తోందని, ఇది అమలయితే వారికి త్వరలో రెండు రోజుల వీక్లీ ఆఫ్‌లు లభిస్తాయని న్యూస్ 18 కథనం పేర్కొంది. అయితే వారంలో ఐదు రోజుల పనిదినాల విధానం అమలైతే రోజువారీ పని గంటలను రోజుకు 50 నిమిషాలు పెంచవచ్చని తెలిపింది. ఈ విషయంలో ఐబీఏ, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (యూఎఫ్బీఈఎస్) మధ్య చర్చలు జరుగుతున్నాయి. అసోసియేషన్ ఐదు రోజుల పనిదినాల విధానానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. (ఇదీ చదవండి: ఆ నగరాల్లో చుక్కలనంటిన రియల్ ఎస్టేట్ ధరలు! రూ. 8 కోట్లకు ఎంత వస్తుందంటే..) నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం ప్రభుత్వం అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించాల్సి ఉంటుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్ నాగరాజన్ చెప్పినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులు రెండు, నాలుగో శనివారాల్లో మాత్రమే పని చేస్తున్నారు. కొత్త విధానంలో ఉద్యోగులు రోజూ ఉదయం 9.45 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అదనంగా 40 నిమిషాలు పని చేయాల్సి ఉండొచ్చని భావిస్తోంది. మార్చిలో 12 రోజులు బ్యాంకులు బంద్! మార్చి నెలలో రెండవ, నాలుగో శనివారాలు, ఆదివారాలతో సహా 12 రోజుల వరకు బ్యాంకులు మూత పడనున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని బ్యాంకులకు సాధారణ సెలవులు ఉండగా మరికొన్నింటికి స్థానిక సెలవులు ఉన్నాయి. (ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!) -
ప్రధాని దృష్టికి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు
సైదాబాద్ (హైదరాబాద్): రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల పెన్షన్ పెంపు.. తదితర అపరిష్కృత సమస్యలను ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి హామీ ఇచ్చారు. గురువారం ఆయన సైదాబాద్‌లోని ఎస్బీహెచ్ ఏ కాలనీ కమ్యూనిటీహాల్లో నిర్వహించిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.రోహిణిరావు, అసోసియేషన్ సభ్యులతో కలసి కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించారు. గత మూడు దశాబ్దాలుగా బ్యాంక్ ఉద్యోగుల ప్రాథమిక పెన్షన్‌ను సవరించలేదని ఆయన పేర్కొన్నారు. 2002కు ముందు పదవీ విరమణ పొందిన సీనియర్ మేనేజర్లు, టాప్ మేనేజర్లలో చాలామంది రూ. 35 వేల కంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారని వివరించారు. పెరిగిన ఖర్చులతో పెద్ద హోదాలోనివారి పరిస్థితే ఇలా ఉంటే తక్కువ క్యాడర్ పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని తెలిపారు. కాగా, పెన్షన్ రివిజన్, 100 శాతం డీఏ న్యూట్రలైజేషన్ సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని వారు కోరారు. అసోసియేషన్ వినతులకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! వచ్చే 6 రోజుల్లో 4 రోజులు బంద్..!
మీకేమైనా బ్యాంకులో పనులు ఉంటే వెంటనే చేసి పెట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే వచ్చే ఆరు రోజుల్లో 4 రోజులకు బ్యాంకులు పనిచేయవు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 3 మధ్య బ్యాంకులు నాలుగు రోజుల పాటే పనిచేయనున్నాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మె..! ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. మార్చి 28, 29 (సోమ, మంగళ ) వారాల్లో రెండు రోజుల సమ్మెను ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు ప్రకటించాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. కాగా సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కావచ్చని ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఎస్బీఐ తమ శాఖలు, కార్యాలయాల్లో పనులను సాధారణీకరించేందుకు ప్రయత్నిస్తామని, సమ్మె కారణంగా ఇక్కడి పనులపై కొంత మేర ప్రభావం ఉండవచ్చునని పేర్కొంది. బ్యాంకులు సమ్మెలో ఉన్నప్పుడు ఖాతాదారులకు బ్యాంకు బ్రాంచ్‌లో లభించే సేవలకు అంతరాయం కలుగుతుంది. మిగతా రోజుల్లో..! బ్యాంకు ఉద్యోగుల సమ్మె తరువాత కేవలం రెండు రోజుల పాటు మాత్రమే బ్యాంకులు నడవనున్నాయి. మార్చి 30, 31 రోజున బ్యాంకులు యథావిధిగా తమ కార్యకలాపాలను జరపనున్నాయి.ఏప్రిల్ 1 న అన్యువల్ క్లోజింగ్ కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఏప్రిల్ 2 న తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సందర్భంగా బ్యాంకులకు సెలవు. దీంతో ఆయా రోజుల్లో బ్యాంకు కార్యకలాపాలపై ప్రభావం పడనుంది. బ్యాంకులతో నేరుగా సంబంధం లేని లావాదేవీలను డిజిటల్ పద్ధతిలో చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాకింగ్, యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్ లాంటి ట్రాన్సాక్షన్స్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. చదవండి: క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా..! అయితే మీకో షాకింగ్ న్యూస్..! -
నిజాయితీపరులైన బ్యాంకు ఉద్యోగులకు భరోసా
న్యూఢిల్లీ: నిజాయితీగా పనిచేసే బ్యాంకు ఉద్యోగులకు రుణాలపరమైన మోసాల కేసుల్లో చర్యల నుంచి రక్షణ కల్పించే విధంగా కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది. సిబ్బంది జవాబుదారీతనానికి సంబంధించి నిబంధనలు సూచించింది. రూ. 50 కోట్ల దాకా విలువ చేసే రుణాల మంజూరు విషయంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు తారుమారైనా సదరు ఉద్యోగినే బాధ్యుడిగా చేసి, చర్యలు తీసుకోకుండా వీటిని రూపొందించింది. కేవలం నిజాయితీగా తీసుకున్న నిర్ణయాలకు మాత్రమే ఇవి వర్తిస్తాయని, దురుద్దేశంతో తీసుకున్న వాటికి వర్తించబోవని ఆర్థిక శాఖ తెలిపింది. ఇలాంటి కేసుల్లో విచారణ జరిపేందుకు పాటించాల్సిన విధానాలను వివరించింది. రుణాన్ని మొండిబాకీగా వర్గీకరించిన ఆరు నెలల్లోగా జవాబుదారీగా వ్యవహరించాల్సిన వారిని గుర్తించే ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. ఓవైపు నిజాయితీగా నిర్ణయాలు తీసుకున్న ఉద్యోగులకు రక్షణ కల్పిస్తూనే మరోవైపు సిబ్బంది జవాబుదారీతనంతో వ్యవహరించే విధంగా ఈ మార్గదర్శకాలు ప్రోత్సహించగలవని ఆర్థిక శాఖ పేర్కొంది. ఓ సంస్థ రుణ ఎగవేత కేసుకు సంబంధించి ఎస్బీఐ మాజీ చైర్మన్ ప్రతీప్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో కూడా పలువురు బ్యాంకర్లు రుణ డిఫాల్ట్ కేసుల్లో అరెస్ట్ అవ్వడం గమనార్హం. సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) విచారణలకు భయపడి, కొన్ని రకాల రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లు వెనుకంజ వేస్తున్నారు. ఈ భయాలను పోగొట్టి, రుణ వితరణను మెరుగుపర్చేలా బ్యాంకర్లను ప్రోత్సహించేందుకు తాజా మార్గదర్శకాలు ఉపయోగపడగలవని పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ఎండీ ఎస్ కృష్ణన్ తెలిపారు. -
స్వయం సహాయక సంఘాల నిధుల గోల్మాల్
కలికిరి: చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడాలో చోటుచేసుకున్న నగదు అక్రమాల కేసులో గురువారం పోలీసులు 16 మందిని అరెస్టు చేశారు. వీరిలో 11 మంది బీవోబీ ఉద్యోగులు, మెసెంజరు సయ్యద్ అలీఖాన్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు ఐదుగురున్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) మహేష్ మీడియాకు వివరాలు వెల్లడించారు. బీవోబీలో స్వయం సహాయక సంఘాల నిధులు దుర్వినియోగమయ్యాయని సంఘమిత్ర ప్రసన్నలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో బ్యాంక్ అధికారులు, సిబ్బంది ప్రమేయంతో మెసెంజరు రూ.1.6కోట్ల (ఎస్‌హెచ్‌జీ) నిధులను పక్కదారి పట్టించినట్లు విచారణలో వెల్లడైంది. ఫిక్స్డ్ డిపాజిట్లు కొల్లగొట్టడం, నకిలీ పత్రాలు, పాస్వర్డ్లు వినియోగించి అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. అక్రమాలకు పాల్పడ్డారని తేలిన 16 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.20లక్షలు, మెసెంజరు అలీఖాన్‌కు చెందిన రూ.48.16లక్షలు విలువ చేసే 1.12 కిలోల తాకట్టు బంగారు నగల పత్రాలు, ఎనిమిది ఖాతాలను ఫ్రీజ్ చేసి, మూడు ద్విచక్రవాహనాలు, 12 సెల్ఫోన్లు మొత్తం రూ.70.20లక్షల విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను వాల్మీకిపురం కోర్టులో హాజరుపరిచారు. కాగా మదనపల్లి డీఎస్పీ రవిమనోహరాచారి ఆధ్వర్యంలో వాల్మీకిపురం సీఐ నాగార్జునరెడ్డి, కలికిరి ఎస్ఐ లోకేష్ రెడ్డి కేసు దర్యాప్తు చేశారు. -
నలుగురు కలికిరి బ్యాంకు ఉద్యోగుల సస్పెన్షన్
కలికిరి: చిత్తూరు జిల్లా కలికిరిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో పలువురు సిబ్బంది కుమ్మక్కై రూ.2 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ముంబైలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం నుంచి మంగళవారం కలికిరి బ్రాంచికి వచ్చిన అధికారులు పలు రికార్డులను పరిశీలించారు. ఈ అక్రమాల నేపథ్యంలో నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం కలికిరిలో విధులు నిర్వర్తిస్తున్న జాయింట్ మేనేజరు రామచంద్రడు, క్లర్క్ ఈలు, ఇటీవలే ఇక్కడి నుంచి శ్రీకాళహస్తి బ్రాంచ్‌కు బదిలీపై వెళ్లిన జాయింట్ మేనేజరు కరణం జయకృష్ణ, గుంతకల్లు బ్రాంచ్‌కు బదిలీ అయిన ఫీల్డ్ ఆఫీసర్ ఈశ్వరన్‌లను బ్యాంకు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బ్యాంకు మెసెంజర్ అలీ నకిలీ రసీదులు ఇచ్చి అవకతవకలకు పాల్పడినట్లు ఒక పొదుపు సంఘం ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమాల డొంక కదిలింది. బ్యాంకు అంతర్గత దర్యాప్తులో ఇప్పుడు సస్పెండైన నలుగురు మెసెంజర్ అలీతో కుమ్మక్కయ్యారని ప్రాథమికంగా నిర్ధారించారు. -
Harish Rao Birthday: వినూత్న బహుమతి
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావును ఎస్బీఐ అధికారులు వినూత్న రీతిలో సన్మానించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన హరీశ్‌రావుకు బ్యాంకు అధికారులు.. ఆయన పుట్టిన రోజు అంకెలైన 030672.. సీరియల్ నంబర్‌తో ఉన్న మూడు కరెన్సీ నోట్లను మెమెంటోగా అమర్చి బహూకరించారు. రూ.100, రూ.50, రూ.20 నోట్లు ఇందులో ఉన్నాయి. అలాగే మంత్రి గురువారం పుట్టిన రోజు జరుపుకున్న నేపథ్యంలో ఆయన ఫొటోతో కూడిన పోస్టల్ స్టాంపులను కూడా అందించి సత్కరించారు. చదవండి: కరోనాతో ప్రాణం పోయింది.. అప్పు మిగిలింది -
భారత్ బంద్‌కు విపక్షాల మద్దతు
న్యూఢిల్లీ/ముంబై: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రైతు సంఘాలు ప్రకటించిన రేపటి ‘భారత్ బంద్’కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ దేశవ్యాప్త బంద్‌కు ఆదివారం కాంగ్రెస్, శివసేన, డీఎంకే, ఆప్ పార్టీలు తమ మద్దతు తెలిపాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, 10 కార్మిక సంఘాల ఐక్య కమిటీ బంద్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. సత్వరం పరిష్కారం చూపనట్లయితే.. ఈ ఉద్యమం ఢిల్లీ నుంచి దేశం నలుమూలలకు విస్తరిస్తుందని ఎన్సీపీ నేత శరద్ పవార్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డిసెంబర్ 9న పవార్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి రైతు ఉద్యమ తీవ్రతను వివరించి, జోక్యం చేసుకోవాలని కోరుతారని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ వెల్లడించారు. పవార్‌తో పాటు రాష్ట్రపతిని కలిసే ప్రతినిధి బృందంలో సీతారాం ఏచూరి (సీపీఎం), డీ రాజా (సీపీఐ), టీఆర్ బాలు(డీఎంకే) ఉంటారన్నారు. రైతు ఆందోళనలపై కేంద్రం తీవ్రంగా యోచిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించే విషయం కూడా పరిగణిస్తోందని తెలిపాయి. మరోవైపు, రేపటి(డిసెంబర్ 8, మంగళవారం) బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి 250 మందికి పైగా రైతులు ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వస్తున్నారని తెలిపాయి. ‘ఇది కేవలం పంజాబ్ రైతుల నిరసన కాదు. ఇది దేశవ్యాప్త నిరసన. కేంద్రం త్వరగా స్పందించనట్లయితే.. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాం. మేం భారత్ బంద్‌కు పిలుపునివ్వడంపై నిన్నటి(శనివారం) చర్చల సందర్భంగా మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు’ అని రైతు నేత బల్దేవ్ సింగ్ యాదవ్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. బంద్ నుంచి అంబులెన్స్‌లకు, అత్యవసర విభాగాలకు మినహాయింపు ఇచ్చామన్నారు. బంద్‌లో అంతా శాంతియుతంగా పాల్గొనాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ హింసాత్మక చర్యలకు దిగవద్దని విజ్ఞప్తి చేశారు. భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. బంద్‌కు మద్దతుగా అన్ని రాష్ట్రాలు, జిల్లాల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపింది. నటుడు కమల్‌హాసన్ పార్టీ ‘ఎంఎన్ఎం’ కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ..తదితర 10 కార్మిక సంఘాలు కూడా బంద్‌కు మద్దతు తెలిపాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సహా పలు బ్యాంక్ యూనియన్లు భారత్ బంద్‌కు మద్దతు తెలిపాయి. ఎన్ఆర్ఐ కుటుంబాల మద్దతు ఈ ఉద్యమంలో అన్ని విధాలుగా సాయం చేసేందుకు విదేశాల్లోని తమ కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారని కొందరు రైతులు వెల్లడించారు. దీర్ఘకాలం ఉద్యమం సాగించేందుకు వీలుగా రైతులు సిద్ధమై వచ్చిన విషయం తెలిసిందే. పళ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను వారు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఢిల్లీ శివార్లకు భారీగా చేరుకున్న రైతులకు స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక గురుద్వారా సభ్యులు కూడా ఇతోధిక సాయం అందిస్తున్నారు. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ సహా పలు యూరోప్ దేశాల్లో పంజాబ్ మూలాలున్న ప్రవాస భారతీయులున్నారు. వారు వివిధ మాధ్యమాల ద్వారా ఇప్పటికే రైతు ఉద్యమానికి మద్దతు తెలిపారు. విపక్ష నేతల ఉమ్మడి ప్రకటన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ప్రకటించిన భారత్ బంద్‌కు మద్దతుగా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, పీఏజీడీ చైర్మన్ ఫరూఖ్ అబ్దుల్లా తదితరులు ఆదివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రైతుల న్యాయబద్ధ డిమాండ్లను కేంద్రం అంగీకరించాలని అందులో వారు కోరారు. ఈ ప్రకటనపై తేజస్వీ యాదవ్(ఆర్జేడీ), అఖిలేశ్‌యాదవ్(ఎస్పీ), డీ రాజా(ఆర్జేడీ), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐఎంఎల్) తదతరులు సంతకాలు చేశారు. లండన్‌లోని భారత దౌత్య కార్యాలయం ఎదుట ప్లకార్డులతో ఎన్ఆర్ఐల నిరసన -
ఉద్యోగులకు తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు ఉద్యోగులు, భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ) మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపును వర్తింపచేయనున్నారు. బ్యాంకు ఉద్యోగులకు వేతన పెంపుతో బ్యాంక్‌లపై ఏటా 7900 కోట్ల రూపాయల భారం పడనుంది. వేతన పెంపును బకాయిలతో సహా నవంబర్ జీతంతో ఉద్యోగులు అందుకోనున్నారు. వేతనాల పెరుగుదలతో దాదాపు 5 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.ఇంక్రిమెంట్ బకాయిలను ఈనెల 1 నుంచి విడుదల చేస్తారని బ్యాంకు అధికారుల యూనియన్ ఓ ప్రకటనలో పేర్కొంది. బ్యాంకు ఉద్యోగుల్లో పోటీతత్వాన్ని పెంచడంతో పాటు సామర్ధ్యం కనబరిచినవారిని ప్రోత్సహించే లక్ష్యంతో సామర్ధ్య ఆధారిత వేతనాల పద్ధతిని తొలిసారిగా ప్రవేశపెట్టామని ఐబీఏ ఓ ప్రకటనలో తెలిపింది. వేతన పెంపు సంప్రదింపుల్లో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 10 ప్రైవేట్ బ్యాంకులు, 6 విదేశీ బ్యాంకుల ప్రతినిధులు, బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇక కేంద్ర వేతన సంఘ సిఫార్సులను వర్తింపచేయాలని, వారానికి ఐదు రోజుల పని, కుటుంబ పెన్షన్ తాజాపరచడం వంటి మూడు ప్రధాన డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. అయితే తొలి రెండు డిమాండ్లపై ఆశించిన ఫలితాలు చేకూరలేదు. కుటుంబ పెన్షన్ పథకం డిమాండ్‌ను ప్రభుత్వానికి ప్రతిపాదించేందుకు ఐబీఏ అంగీకరించింది. ఇక ఈ పథకాన్ని బ్యాంకు ఉద్యోగులకు వర్తింపచేయడంపై కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. చదవండి : గుడ్‌న్యూస్ : టెకీలకు వేతన పెంపు -
10 మంది బ్యాంక్ ఉద్యోగులు క్షేమం
సాక్షి, చిత్తూరు: జిల్లాలో బ్యాంక్ ఉద్యోగుల అదృశ్యం కలకలం రేపింది.. ఆదివారం 10 మంది బ్యాంక్ ఉద్యోగుల బృందం సదాశివకోనకు వెళ్లారు. అప్పటి నుంచి ఉద్యోగుల ఫోన్లు స్విచాఫ్‌లో ఉన్నాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో బ్యాంకు ఉద్యోగుల కోసం అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి సోమవారం వారి ఆచూకీ కనుగొన్నారు.ఉద్యోగుల ఫోన్లలో సిగ్నల్ లేకపోవడం వల్లే ఎవ్వరికీ అందుబాటులోకి రాలేక పోయినట్లు పోలీసులు తెలిపారు. కాసేపటి క్రితమే వారిని వడమాలపేట పీఎస్‌కు తీసుకొచ్చారు. కాగా.. బ్యాంకు ఉద్యోగులంతా కూడా నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. -
ఎమ్మెల్యే దానంపై పోలీసులకు ఫిర్యాదు
-
వైరల్: ‘బెదిరింపులకు దిగిన ఎమ్మెల్యే దానం’
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్‌కు చెందిన ఓ స్థల వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బ్యాంక్ అధికారులతో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే తమను బెదిరించారంటూ బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. 10 ఏళ్ల క్రితం ఖైరతాబాద్‌లోని ఓ స్థలంపై ఓ వ్యక్తి లోన్ తీసుకున్నాడు. డబ్బులు తిరిగి కట్టకపోవడంతో ఆ స్థలాన్ని బ్యాంక్ బహిరంగ వేలానికి పెట్టారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న దానం నాగేందర్ బ్యాంక్ అధికారుల విధులకు అడ్డుతగిలారు. ఎమ్మెల్యే తన అనరుచరులతో కలిసి వేలాన్ని అడ్డుకున్నారని బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తమపై దౌర్జన్యం చేశారని, బెదిరింపులకు దిగారని తెలిపారు. ఆయన అనుచరులు దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. (‘సాఫ్ట్వేర్ శారద’ కథనంపై స్పందించిన ఎంపీ) -
బ్యాంకు ఉద్యోగుల్లో కరోనా భయం
సాక్షి, హైదరాబాద్: బ్యాంకుల్లో పనిచేసేందుకు ఉద్యోగులు భయపడే పరిస్థితి నెలకొందని ఆల్ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాంబాబు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజు రోజుకు బ్యాంకు ఉద్యోగుల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో చాలా మంది సెలవులపై వెళుతున్న పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1000 మంది బ్యాంక్ ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో కొంత మంది చనిపోయారని ఆయన వాపోయారు. బ్యాంకు యాజమాన్యాలు ఉద్యోగులు చనిపోతున్నా శానిటైజేషన్ పనులపై దృష్టి పెట్టడం లేదని సంఘం ఆరోపించింది. పనిగంటల్లో వెసులు బాటు కల్పించడంతోపాటు ఆల్టర్నేటివ్ రోజులలో పనిచేసే వెసులు బాటు కల్పించాలని సంఘం తరపున ఆయన కోరారు. అత్యవసర పరిస్ధితుల్లో పనిచేసే ఉద్యోగులతో సమానంగా తాము పనిచేస్తున్న కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాంబాబు ఆరోపించారు. -
హలో.. మీ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా!
సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి... కార్డుల వివరాలతో పాటు ఓటీపీలు సైతం సంగ్రహించి... అందినకాడికి దండుకునే జమ్‌తార ముఠాలు స్థానిక భాషలను సైతం నేర్చుకున్నాయి. ఇటీవల కాలంలో నగరంలోని పలువురికి ఈ ముఠాల నుంచి తెలుగులో ఫోన్లు వచ్చినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఒకప్పుడు హిందీ, ఇంగ్లీషుల్లో మాత్రమే మాట్లాడే ఈ నేరగాళ్లు .. ఆ పంథాలో అందరినీ బురిడీ కొట్టించడం సాధ్యం కావట్లేదనే స్థానిక భాషలపై దృష్టి పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి ఫోన్‌కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆ ప్రాంతమంతా అంతే... జార్ఖండ్ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ వెళ్లే మార్గంలో ఉన్న ప్రాంతం జమ్‌తార. ల్యాప్టాప్స్, సెల్ఫోన్లతో కూర్చునే యువత దేశ వ్యాప్తంగా అనేక మందికి ‘గాలం’ వేస్తుంటాడు. నగరంలో నమోదవుతున్న ఈ ‘కార్డ్ క్రైమ్’లో 98 శాతం ఈ ప్రాంతానికి చెందిన వారే నిందితులు. ఆయా బ్యాంకుల్లో కింది స్థాయి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు అనేక మార్గాల ద్వారా డెబిట్/క్రెడిట్ కార్డుల డేటా సేకరిస్తున్న జమ్‌తార మోసగాళ్లు వాటి ఆధారంగా అసలు అంకానికి తెరలేపుతున్నారు. బోగస్ పేర్లు, చిరునామాలతో సిమ్కార్డ్స్ తీసుకునే జమ్‌తార యువకులు వీటినే వినియోగించి కార్డుల డేటాలోని ఫోన్ నంబర్లకు కాల్ చేస్తుంటారు. ఒకప్పుడు కేవలం హిందీ, ఇంగ్లీషు భాషల్లో సంభాషిస్తూ తాము బ్యాంకు మేనేజర్లమని పరిచయం చేసుకుని, కార్డు వివరాలతో పాటు ఓటీపీలు సంగ్రహించే వారు. అయితే ఈ భాషల్లో మాట్లాడితే టార్గెట్ చేసిన వారిలో కొందరికి అర్థం కావట్లేదనే ఉద్దేశంతో స్థానిక భాషలపై దృష్టి పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ మార్గాల్లో నేర్చుకుంటూ... ఈ జమ్‌తార ముఠాలు తెలుగుతో పాటు వివిధ స్థానిక భాషలను ఇంటర్నెట్తో పాటు కొన్ని పుస్తకాల ద్వారా నేర్చుకుంటున్నారని, వారు వినియోగిస్తున్న పదాలు, ఉచ్ఛారణ శైలిని పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతోందని పోలీసులంటున్నారు. అయితే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతికి చెందిన వారికి వీరు ఫోన్లు చేసి స్థానిక భాషలో మాట్లాడటంతో నిజమే అని ఉచ్చులో పడుతున్నారని అంటున్నారు. మరోపక్క ఇటీవల కా>లంలో అందరి ఫోన్లలోనూ ‘ట్రూకాలర్’ తరహా యాప్స్ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బోగస్ సిమ్‌కార్డుల్ని వినియోగిస్తున్న జమ్‌తార యువత ముందుగానే ఆ నంబర్లను సదరు యాప్‌లో ‘బ్యాంక్ హెడ్–ఆఫీస్’ పేరుతో రిజిస్టర్ చేయించేస్తున్నారు. ఫలితంగా ఈ నంబర్ నుంచి వచ్చిన కాల్‌ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులకు అవి బ్యాంకుల నుంచి వస్తున్న భావన కలుగి తేలిగ్గా బుట్టలో పడుతున్నారు. అప్డేట్, లింకేజ్ పేర్లతో వల... క్రెడిట్, డెబిట్ కార్డులు కలిగిన వారికి ఫోన్లు చేసే జమ్‌తార నేరగాళ్లు ముందుగా ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి పేరు, ఓ బ్యాంకు కార్డు వినియోగిస్తున్నారో చెప్పి,... బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటారు. డెబిట్ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చెయ్యాలనో చెప్తుంటారు. సాధారణంగా ఆయా బ్యాంకులు జారీ చేసే కార్డులకు చెందిన నంబర్లలో మొదటి నాలుగైదు అంకెలూ ఒకే సిరీస్‌వి ఉంటాయి. వీటిని ముందుగా చెప్పే మాయగాళ్లు మిగతా అంకెలు అడుగుతారు. ఆపై సీవీవీ కోడ్ కూడా తెలుసుకుని... కొద్దిసేపట్లో మీకో వన్ టైమ్ పాస్వర్డ్ వస్తుందని, అది కూడా చెప్తేనే లింకేజ్, అప్‌గ్రెడేషన్ పూర్తవుతుందని నమ్మిస్తారు. ఇలా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత వారి ఖాతాలోని నగదును తమ ఖాతాల్లోకి మార్చుకోవడం, ఆన్లైన్లో కొనుగోళ్లు చేయడం చేస్తూ టోకరా వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ డేటా ఆధారంగా క్లోన్డ్ క్రెడిట్, డెబిట్ కార్డులను తయారు చేసి డ్రా చేస్తునట్టు వెలుగులోకి వచ్చింది. వీరు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలన్నీ తప్పుడు వివరాలతో ఉంటున్నాయని సైబర్ క్రైమ్ అధికారులు చెప్తున్నారు. వారి ఉచ్ఛారణ స్పష్టంగా ఉండదు జమ్‌తార నేరగాళ్లు మాట్లాడే తెలుగు ఉచ్ఛారణ స్పష్టంగా ఉండదు. ఏ బ్యాంకు ఖాతాదారుడికి ఫోన్ చేసినా తాము ఎస్బీఐ మేనేజర్స్ అంటూ పరిచయం చేసుకుంటారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ఎంత తొందరలో ఉన్నా మీ వ్యక్తిగత వివరాలైన బ్యాంకు కార్డు నంబర్, సీవీవీ కోడ్, ఓటీపీ తదితరాలు చెప్పకూడదు. మరోపక్క ఏ బ్యాంకు అధికారులు ఫోన్లో వ్యక్తిగత వివరాలు, ఓటీపీ వంటివి అడగరు. కార్డుల అప్డేట్, లింకేజ్ ఏదైనా సరే బ్యాంకునకు నేరుగా వెళ్లో, వారి ఏటీఎం కేంద్రం ద్వారానో, అధికారిక వెబ్సైట్ నుంచో మాత్రమే సాధ్యమవుతుంది. అంతేకానీ ఇలా వచ్చే ఫోన్లను నమ్మకూడదు. – సైబర్ క్రైమ్ పోలీసులు -
పురుషులు లేని సమయంలో ఇంట్లో చొరబడి
తాడేపల్లిరూరల్: మండల పరిధిలోని కుంచనపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పురుషులు లేని సమయంలో ఇంట్లో చొరబడి మహిళలపై దౌర్జన్యం చేసి సామాను బయట పడేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. విజయవాడలో పనిచేసే ఏఆర్ కానిస్టేబుల్ గోపిశెట్టి క్రాంతి, ఆయన సోదరి కుంచనపల్లిలోని డోర్ నం 1–37 ఇంటిని 2017వ సంవత్సరంలో గవర్నర్ పేట ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ ఆక్షన్‌లో పాడుకున్నారు. అనంతరం ఆ ఇంటిని బ్యాంకు వారి దగ్గర నుంచి మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే బ్యాంకులో ఇంటిని తాకట్టు పెట్టిన కొండా శంకరరెడ్డి, కొండా మోహన్‌రెడ్డి బ్యాంకులో ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి బ్యాంకును మోసం చేసి, తనను కూడా మోసం చేసారంటూ మోహన్‌రెడ్డి, శంకరరెడ్డి బావమరిది అయిన నాగిరెడ్డి బ్యాంకు అధికారులపైనా, బావలపైనా కోర్టును ఆశ్రయించారు. కోర్టు నాగిరెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది కానీ, ఇల్లు కొనుగోలు చేసిన కానిస్టేబుల్ గోపిశెట్టి క్రాంతిని ఖాళీ చేయించమని చెప్పలేదు. అయిన ప్పటికీ నాగిరెడ్డి, అతని బావలైన శంకరరెడ్డి, మోహన్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడి ఇంట్లోకి వెళ్లి సామన్లన్నీ బయట పడవేసి, మహిళలనే కనికరం లేకుండా బయటకు నెట్టివేశారు. ఘటనపై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏఆర్ కానిస్టేబుల్ క్రాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఫైట్ ఫర్ రైట్స్
బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లసాధనకు వారు శుక్రవారం ఆందోళన బాటపట్టారు. హిమాయత్‌నగర్‌లో ఇలా ప్లకార్డులు చేతబూనినిరసన తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్ : వేతన సవరణతో పాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం బ్యాంకు ఉద్యోగసంఘాలు చేపట్టిన సమ్మెతో ఎక్కడిక్కడ బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోజువారి వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం బ్యాంకులపైన ఆధారపడిన వ్యాపారవర్గాలు సైతం ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. బ్యాంకు ఉద్యోగుల సమ్మె సమాచారం తెలియకపోవడంతో చాలామంది ఖాతాదారులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులకు వచ్చి నిస్సహాయంగా తిరిగి వెళ్లారు. మరోవైపు ప్రైవేట్ బ్యాంకులు, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలుగు రాష్ట్రాల విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల సమ్మెకు పిలుపున్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి రోజు బ్యాంకు ఉద్యోగులు అబిడ్స్, కోఠి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. అబిడ్స్, బ్యాంక్ స్ట్రీట్‌లో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నిరసన సభలో మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ లాభాలు లేవనే నెపంతో ఉద్యోగులకు వేతన సవరణ చేయకపోవడం అన్యాయమన్నారు. కార్పొరేట్ సంస్థలు ఎగవేసిన వేల కోట్ల రూపాయలను తిరిగి వసూలు చేయకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ మొండి బాకీల జోలికి వెళ్లకుండా చిన్నచిన్న రుణాలు పొందిన పేద మధ్యతరగతి ప్రజలను మాత్రం ప్రభుత్వం తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఉద్యోగులకు వేతన సవరణ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉందన్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బ్యాంకు ఉద్యోగుల 12 డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫెడరేషన్ బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ కన్వీనర్ ఆర్. శ్రీరామ్, యూఎఫ్‌బీఎ రాష్ట్ర కన్వీనర్ బీఎస్. రాంబాబులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలలో బ్యాంకు యూనియన్ల నాయకులతోఉద్యోగుల వేతన సవరణ 12.25 శాతం నుంచి 15 శాతం పెంచిదని తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగిరాకపోవడంతో రెండు రోజుల సమ్మె అనివార్యం అయ్యిందని అన్నారు,. మొండి బాకీల వల్ల తీవ్ర నష్టం వచ్చిందన్నారు. వచ్చిన లాభాలలో ఉద్యోగులకు వేతన సవరణ చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదన్నారు. తమ సమ్మెతో తెలంగాణ రాష్ట్రంలో సుమారు రూ. 30వేల కోట్ల లావాదేవిలు స్తంభించినట్లు పేర్కొన్నారు.బ్యాంకుల బంద్ వల్ల శుక్రవారం జంటనగరాల్లోని సుమారు 6వేల బ్యాంకుల వరకు మూతపడ్డాయి. సుమారు 70 వేలమంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమ్మెలోపాల్గొన్నారు. శనివారం కూడా ఈ సమ్మె కొనసాగనుంది.ఏఐబీవోసీ ప్రధాన కార్యదర్శి ఎం. చుక్కయ్య, సిఐటీయు నాయకులు వీరయ్య, నాబార్డ్ ఎంప్లాయీస్ యూనియాన్ నాయకులు కైలాశ్‌పతి, అసిస్టెంట్ జీఎస్ ఎం.శ్రీనివాస్, ఎఐబీఈవో నాయకులు రవీంద్రనాథ్, ఉదయ్‌భాస్కర్, కుమార్, రమణతో పాటు వందలాది ఉద్యోగులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఈ నెల 26, 27న సమ్మెచేస్తాం
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో విలీనాలను వ్యతిరేకిస్తూ సెపె్టంబర్ 26, 27 తేదీల్లో రెండు రోజులు సమ్మె చేస్తామని నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫీసర్ల యూనియన్లు హెచ్చరించాయి. పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగుగా మార్చుతూ విలీన పర్వానికి ఆగస్టు 30వ తేదీన కేంద్రం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో తాజా సమ్మె హెచ్చరిక వెలువడింది. ఇండియన్ బ్యాంక్ ఆఫీసర్ల యూనియన్లు ఒక సంయుక్త సమ్మె నోటీసు ఇస్తూ విలీనాలకు నిరసనగా సమ్మె ప్రతిపాదన తలపెట్టినట్లు పేర్కొన్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ, నవంబర్ రెండవ వారం నుంచి నిరవధిక సమ్మెనూ నిర్వహించడం జరుగుతుందని ఒక యూనియన్ నాయకుడు పేర్కొన్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్‌బీఓసీ), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (ఎన్ఓబీఓ) సంయుక్త సమ్మె నోటీసు ఇచి్చన వాటిలో ఉన్నాయి. ఐదు రోజుల పనిదినాలను పూర్తి స్థాయిలో అమలు, నగదు లావాదేవీల సమయం తగ్గించడం, పనిగంటల హేతుబద్ధీకరణ వంటి పలు డిమాండ్లనూ యూనియన్లు చేస్తున్నాయి. విలీన ప్రక్రియలో బ్యాంకులు బిజీబిజీ... ఇదిలావుండగా, విలీన ప్రక్రియ వేగవంతం దిశలో సంబంధిత బ్యాంకులు క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. ఇండియన్ బ్యాంక్‌తో తన విలీన అంశాలను పరిశీలించడానికి సెపె్టంబర్ 13న తమ డైరెక్టర్ల బోర్డ్ సమావేశం కానుందని అలహాబాద్ బ్యాంక్ తెలిపింది. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి సెపె్టంబర్ 13న ఆంధ్రాబ్యాంక్ బోర్డ్ సమావేశం కానుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఆంధ్రాబ్యాంక్‌తో పాటు కార్పొరేషన్ బ్యాంక్ విలీనానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వీటితోపాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా; కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్ విలీనానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులకు కుదించడంతో దేశంలో మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు పరిమితం కానుంది. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక ప్రకటన చేస్తూ తాజా విలీనానికి సంబంధించి అంశాల పరిశీలనకు విలీన రెండు బ్యాంకులతో కలిసి (యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓబీసీ) 23 కార్యాచరణ గ్రూప్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. విలీనం మంచిదే: ఇన్ఫోసిస్ ఫినాకిల్ కేంద్రం ప్రకటించిన బ్యాంకింగ్ విలీనాల ప్రక్రియ పూర్తి సానుకూల అంశమని ఇన్ఫోసిస్ ఫినాకిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ చీఫ్ (విక్రయాలు) వెంకటరమణ గోసావి పేర్కొన్నారు. బ్యాంకింగ్ బిజినెస్ వృద్ధికి కూడా ఈ చర్య దోహదపడుతుందని బ్యాంకింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన ఇన్ఫోసిస్ ఫినాకిల్ పేర్కొంది. -
ఆంధ్రాబ్యాంక్ ఇక కనపడదు
మచిలీపట్నం: తొంభై ఆరేళ్ల చరిత్ర కాలగర్భంలో కలసిపోతోంది. శత వసంతాల సంబరాలకు సిద్ధమవుతున్న ఆంధ్రాబ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో విలీనం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బందరులో పురుడు పోసుకున్న తెలుగోళ్ల బ్యాంక్ కనుమరుగు కాబోతుందనే విషయాన్ని ఈ ప్రాంత వాసులు జీజీర్ణించుకోలేకపోతున్నారు. ఇది అనాలోచిత నిర్ణయమని బ్యాంక్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తుండగా.. కేంద్రం తీరుపై ప్రజాసంఘాలు విరుచుకుపడుతున్నాయి. ఇదీ ప్రస్థానం బందరులో ఇద్దరు అన్నదమ్ముల మధ్య వచ్చిన ఆర్థిక తగాదాను పరిష్కరించే క్రమంలో స్వాతంత్య్ర సమరయోథుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రాబ్యాంక్ స్థాపనకు పూనుకున్నారు. స్వాతంత్రోద్యమ కాలంలో ఆర్థిక పటిష్టత అవసరమని గుర్తించిన ఇంకొంతమంది పట్టాభికి వెన్నుదన్నుగా నిలిచారు. అలా 1923 నవంబర్ 20న రూ.లక్ష మూలనిధితో భోగరాజు ఇంట్లోనే ఆంధ్రాబ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభయ్యాయి. పొదుపుతో మూలధనం పోగుచేయడం ద్వారా రైతుల ఆర్థిక అవసరాల్ని తీర్చటానికి భోగరాజు రచించిన ప్రణాళికలు ప్రభుత్వాలకు మార్గదర్శకంగా నిలిచాయి. 1980లో రెండో దఫాగా చేపట్టిన బ్యాంకుల జాతీయకరణతో ఆంధ్రాబ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా అవతరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు లీడ్ బ్యాంక్‌గా వ్యవహరిస్తూ వ్యవసాయ రంగానికి ఇతోధిక సేవలందిస్తూ వస్తోంది. 1981లో క్రెడిట్ కార్డులను మన దేశానికి పరిచయం చేసిన బ్యాంక్‌గా ఇది పేరొందింది. పెట్టుబడులను రాబట్టడంలో ఆసియాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పట్టాభి జ్ఞాపకాలు పదిలం బ్యాంక్ ఆర్థిక పటిష్టతకు పునాదులు వేసిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకాలు మచిలీపట్నంలో నేటికీ పదిలంగానే ఉన్నాయి. బ్యాంక్‌లో డబ్బు దాచేందుకు ఉపయోగించిన ఇనుప బీరువా పట్టాభి రోడ్‌లోని వ్యవస్థాపక బ్యాంక్‌లో నేటికీ ఉంది. భోగరాజు నివసించిన ఇంట్లో గాంధీ కస్తూర్బా సేవా సమితి పేరుతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆంధ్రాబ్యాంక్ ఆర్థిక సహకారంతో పట్టాభి సీతారామయ్య ట్రస్ట్ ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనలో శిక్షణ ఇస్తున్నారు. ఆంధ్రాబ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కానుండటంతో పట్టాభి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు, ఆంధ్రాబ్యాంక్ గ్రామీణాభివృద్ధి, ఉపాధి, ఉద్యోగ కల్పన శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతాయా లేదా అనేది చర్చనీ యాంశమైంది. తెలుగోడి బ్యాంక్ లేకుండా చేస్తారా? తెలుగోడు స్థాపించిన బ్యాంక్‌ను లేకుండా చేయటం బాధాకరం. స్వాతంత్రోద్యమ కాలంలో ఆర్థిక భరోసా కలి్పంచేందుకు ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్‌కు ఎంతో చరిత్ర ఉంది. – గుడివాడ వెంకట గున్నయ్యశెట్టి, వ్యవస్థాపక డైరెక్టర్ -
బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగుల నిరసన
-
అనంతపురంలో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య
-
తెలుగు రాష్ట్రాల్లో మూతపడ్డ బ్యాంకులు
-
నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
-
బ్యాంకు సేవలకు అంతరాయం
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇవ్వడంతో బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి. వారం రోజుల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టడం ఇది రెండవ సారి కావడం గమనార్హం. ఈనెల 21 బ్యాంకు ఆఫీసర్ల యూనియన్ వేతన పరిష్కారం కోరుతూ విలీన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే సమ్మెకు సంబంధించి కస్టమర్లకు సమాచారం చేరవేశాయి. ఇక ప్రైవేట్ బ్యాంకులు యథాతథంగా పనిచేయనున్నాయి. కాగా బ్యాంకు ఆఫీసర్లు, ఉద్యోగుల సంఘాలతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ సమ్మెకు పిలుపు ఇచ్చింది. అదనపు చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో తాజా సమ్మెకు పిలుపు ఇచ్చామని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం వెల్లడించారు. ఈ భేటీలో విలీన ప్రక్రియపై ముందుకు వెళ్లమని ప్రభుత్వం లేదా సంబంధిత బ్యాంకులు ఎలాంటి వివరణ ఇవ్వలేదని చెప్పారు. -
6% వేతనాల పెంపు
ముంబై: వేతనాల పెంపు ప్రతిపాదనలపై బ్యాంకు ఉద్యోగులు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా 13వ రౌండు చర్చల్లో ఐబీఏ ఆరు శాతం పెంపును ప్రతిపాదించింది. కానీ బ్యాంకు ఉద్యోగుల యూనియన్ల సమాఖ్య యూఎఫ్‌బీయూ దీన్ని తిరస్కరించింది. చర్చలు కొనసాగించడానికి సిద్ధమని మాత్రం ప్రకటించింది. ‘ఐబీఏ గతంలో ప్రతిపాదించిన 2% ఆఫర్‌ను సవరించి 6%కి పెంచింది. అయితే యూఎఫ్‌బీయూ దీన్ని తిరస్కరించింది. కానీ చర్చల కొనసాగింపునకు అంగీకరించింది’ అని యూఎఫ్‌బీయూ కన్వీనర్ (మహారాష్ట్ర) దేవీదాస్ తుల్జాపూర్కర్ తెలిపారు. బ్యాంకు యూనియన్లు 25 శాతం పెంపును డిమాండ్ చేస్తున్నాయని, ఆగస్టు నెలాఖరులోగా దీనిపై మళ్లీ చర్చించేందుకు ఐబీఏ అంగీకరించిందని ఆయన వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో 37 బ్యాంకుల యాజమాన్యాల తరఫున ఉద్యోగుల వేతన సవరణపై ఐబీఏ చర్చలు జరుపుతోంది. మే 5న జరిగిన చర్చల్లో ఐబీఏ కేవలం రెండు శాతమే ఆఫర్ చేసింది. దీన్ని తిరస్కరించిన ఉద్యోగుల యూనియన్లు మే నెలలో 2 రోజుల సమ్మెకు కూడా దిగాయి. -
అర్ధరాత్రి అలజడి
నెల్లూరు (క్రైమ్): బ్యాంక్‌లో దొంగలు పడ్డారని అర్ధరాత్రి ఆటోమెటిక్ మెసేజ్‌లు బ్యాంక్ ఉన్నతాధికారులకు వెళ్లింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అలాంటిదేమి లేదని తెలియడంతో వెనుదిరిగారు. ఈ ఘటన కేవీఆర్పెట్రోల్ బంకు సమీపంలోని ఎస్బీఐ పర్సనల్ బ్యాంకింగ్ బ్రాంచ్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. కేవీఆర్ పెట్రోల్‌బంకు సమీపంలో స్టేట్బ్యాంక్ఆఫ్ ఇండియా పర్సనల్ బ్యాంకింగ్ బ్రాంచ్ ఉంది. బ్యాంకు అధికారులు దొంగతనాలు నియంత్రణకు బ్యాంక్ లోపల క్యాష్చెస్ట్ల వద్ద అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు, ఆటోమెటిక్ మెసేజ్ (వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్), కాల్ సెండింగ్ పరికరాన్ని ఏర్పాటు చేశారు. క్యాష్‌చెస్ట్ వద్దకు ఎవరైనా వెళ్లినా, దొంగతనానికి యత్నించినా, లేదా దాని ముందుగా ఏదైనా (గాలికి పేపర్లు పడినా, ఎలుకలు తదితరాలు వెళ్లినా) కదలికలు జరిగినా వెంటనే బ్యాంక్ ఉన్నతాధికారుల సెల్‌ఫోన్‌కు సమాచారం వెళుతుంది. ఫోను సైతం మోగుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో బ్యాంక్‌లో దొంగలు ఉన్నారన బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ అకౌంట్స్ సుజాతకు, చీఫ్ మేనేజర్ వివేకానందకు మెసేజ్‌లు వెళ్లాయి. దీంతో వారు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. రాత్రి జనరల్ చెకింగ్ విధులు నిర్వహిస్తున్న కె. శ్రీనివాసాచారికి డయల్ 100 సిబ్బంది సమాచారం అందజేయడంతో వెంటనే ఆయన రాత్రి విధుల్లో ఉన్న నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వేమారెడ్డితో పాటు నగరంలోని సిబ్బందిని, అన్నీ పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లను అప్రమత్తం చేశారు. వేమారెడ్డిని, దర్గామిట్ట పోలీస్‌స్టేషన్ సిబ్బందిని హుటాహుటిన బ్యాంక్ వద్దకు రమ్మని ఆదేశించి విషయాన్ని జిల్లా ఎస్పీ పీహె చ్‌డీ రామకృష్ణ, క్రైం ఓఎస్డీ టీపీ విఠలేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని బ్యాంక్ ఉద్యోగులతో కలిసి బ్యాంకు తాళాలను తెరిపించారు. బ్యాంక్‌లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. లోపల ఎవరూ లేకపోవడం, క్యాష్ చెస్ట్ వద్ద ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకపోవడాన్ని గుర్తించారు. ఎలుకలు అటుగా వెళ్లడం ద్వారా మెసేజ్ వచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అప్పటికే నగరంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న సిబ్బంది అందరూ అనుమానాస్పదంగా తారసపడిన వ్యక్తులను ఆపి వారి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. బ్యాంక్ వద్ద సెక్యూరిటీ గార్డ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులు డీఎస్పీ కె. శ్రీనివాసాచారి సూచించారు. -
దేశవ్యాప్తంగా మూతపడిన బ్యాంకులు
-
30, 31 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్: బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసి యేషన్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 30, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ఏపీ, తెలంగాణ శాఖలు వెల్లడించాయి. సమ్మె కారణంగా దేశంలోని బ్యాంక్‌లు మూతపడనున్నాయని, ఖాతాదారులు పరిస్థితిని అర్థం చేసుకొని ఉద్యోగులకు సహకరించాలని బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూఎఫ్‌బీయూ కన్వీనర్ వీవీఎస్ఆర్ శర్మ కోరారు. వేతన సవరణ త్వరితగతిన అమలు చేయాలని, అధికారులకు వేతన సవరణతోపాటు పాక్షిక ఆదేశాలను అమలు చేయాలని దేశంలో 10 లక్షలమంది బ్యాంకు ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 5 ఉద్యోగుల, 4 అధికారుల సంఘాల సంయుక్త వేదిక, యూఎఫ్బీయూలు సమ్మె బాటపట్టాయని చెప్పారు. బ్యాంకు ఉద్యోగులకు 2017 నవంబర్ నుంచి వేతన సవరణ జరపాల్సి ఉండగా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదన్నారు. ఇప్పటివరకు 12సార్లు పలు దఫాలుగా చర్చలు జరిపినా వేతన సవరణ ఒప్పందం అసంపూర్తిగానే మిగిలిపోయిందన్నారు. ప్రతియేటా ప్రభుత్వరంగ బ్యాంకులు నికరలాభం సంపాదిస్తున్నా, లాభాల్లో వస్తున్న తరుగుదలను కుంటిసాకుగా చూపి కేవలం 2 శాతం వేతన పెంపును ప్రతిపాదించడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో పి.వెంకటరామయ్య (బీఈఎఫ్ఐ), అనిల్‌కుమార్, గిరిశ్రీనివాస్ (ఏఐబీవోఏ), బి.సుక్కయ్య (ఏఐబీఓసీ), టి.వెంకటస్వామి (ఐఎన్‌బీఈఎఫ్)లు పాల్గొన్నారు. -
ఈ నెల ఆఖరున బ్యాంకు ఉద్యోగుల సమ్మె
-
రెండు రోజులు బ్యాంకు ఉద్యోగుల బంద్
ముంబై : బ్యాంకు ఉద్యోగులు మరోసారి బంద్‌కు దిగబోతున్నారు. ప్రైవేట్, పబ్లిక్ రంగ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది బ్యాంకర్లు ఈ నెల ఆఖరున 48 గంటల పాటు బంద్‌కు దిగనున్నట్టు పిలుపునిచ్చారు. వేతనాల సమీక్ష విషయంలో శనివారం యునిటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్లు(యూఎఫ్‌బీయూ)కి, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)కి మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో బ్యాంకు ఉద్యోగులు ఈ బంద్ చేపట్టబోతున్నారు. యూఎఫ్‌బీయూలో తొమ్మి బ్యాంకు యూనియన్లు ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగులకు అందించే వేతన పెంపు చాలా తక్కువ మొత్తంలో ఉందని బ్యాంకర్లు ఆరోపిస్తున్నారు. కేవలం రెండు శాతం పెంపు చేపట్టడం చాలా దారుణమన్నారు. బ్యాంకు ఉద్యోగుల వేతన చర్చలను, వేతన సమీక్షను 2017 నవంబర్ 1వరకు పూర్తి చేయాలని బ్యాంకు మేనేజ్మెంట్లను, ఐబీఏను ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పలు సార్లు ఇండియన్ బ్యాంకు అసోసియేషన్, బ్యాంకు యూనియన్లకు మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై 2018 మార్చి 15న యూనియన్లు బంద్‌కు పిలుపునిచ్చాయి. మరోసారి ఐబీఐ చర్చలకు పిలవడంతో, యూనియన్లు ఆ బంద్‌ను వాయిదా వేశాయి. శనివారం ముంబైలో బ్యాంకు యూనియన్లకు, ఐబీఏకు మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఈ నెల ఆఖరున రెండు రోజులు బంద్‌చేపట్టాలని యూనియన్లు నిర్ణయించాయి. 2012 నవంబర్ 1న 10వ బిపర్‌టైట్ వేతన ఒప్పందంలో భాగంగా మొత్తం వేతన బిల్లులో 15 శాతానికి పైగా పెంపుదలను ఐబీఏ ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. కానీ ఈ పెంపును 2 శాతం మాత్రమే చేపట్టనున్నట్టు ఐబీఏ 2017 మార్చి 3న ప్రకటించింది. ప్రస్తుతం ఐబీఏ ఆఫర్‌చేసే మొత్తం చాలా తక్కువగా ఉందని, ఈ ఆఫర్‌ను యూనియన్లు తిరస్కరిస్తున్నట్టు టాప్ యూనియన్ నాయకుడు చెప్పారు. ఈ విషయంలో వెంటనే ఆర్థిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని యూనియన్లు కోరుతున్నాయి. వేతన పెంపును పెంచేలా ఐబీఏకి సూచించాలని, ఒకవేళ ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయంలో విఫలమైతే ఈ నెల చివరిన 48 గంటల పాటు బంద్ చేయనున్నామని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటచలం తెలిపారు. -
రూ.2,450 కోట్లు లూఠీ : బ్యాంకు స్టాఫర్లే..
బెంగళూరు : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పీఎన్బీ స్కాం మాదిరిగానే బ్యాంకుల్లో మోసాలు భారీగానే జరుగుతున్నాయని వెల్లడైంది. ఈ మోసాల్లో బ్యాంకు ఉద్యోగుల ప్రమేయమే ఎక్కువగానే ఉంటుందని తెలిసింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా డేటాలో ఈ విషయం తెల్లతేటమైంది. 2013 ఏప్రిల్ నుంచి 2016 జూన్ వరకున్న డేటాలో బ్యాంకుల్లో రూ.2,450 కోట్ల మేర అక్రమాలు జరిగాయని, ఇవి ఎక్కువగా ఉద్యోగుల సహకారంతోనే జరిగినట్టు తెలిసింది. వీటిల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి 49 శాతం కేసులు నమోదయ్యాయని, కానీ మొత్తం రూ.462 కోట్ల నగదునే కోల్పోయినట్టు ఆర్బీఐ డేటా పేర్కొంది. అయితే మొత్తం కేసుల్లో చాలా తక్కువగా 3 శాతం మాత్రమే నమోదైన రాజస్తాన్‌లో, భారీగా రూ.1,096 కోట్ల నగదును బ్యాంకులు పోగొట్టుకున్నట్టు తెలిపింది. బ్యాంకు ఉద్యోగుల ప్రమేయముండే ఇలాంటి మోసపూరిత కేసులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రల్లో ఎక్కువగా నమోదవుతున్నాయని, అదేవిధంగా రాజస్తాన్, ఛండీగర్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా బాగానే నగదు లూటీ అవుతుందని తెలిసింది. లక్ష, ఆపై మొత్తాల మోసాల కేసుల్లో బయట వ్యక్తులు, బ్యాంకు అధికారులు, ఉద్యోగుల సాయంతో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆర్బీఐ డేటా పేర్కొంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఇలాంటి కేసులు నమోదవడానికి కారణం, ఆ రాష్ట్రాల్లో బ్యాంకు బ్రాంచులు అధికంగా ఉన్నాయని ఓ బ్యాంకు మేనేజర్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా బ్యాంకు బ్రాంచులున్నట్టు పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగులు ప్రమేయముండే ఈ మోసాలను అసలు ఉపేక్షించేది లేదని కూడా తేల్చి చెప్పారు. బ్యాంకు మోసాలు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో 170 కేసులతో తమిళనాడు తొలి స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ 157 కేసులతో రెండో స్థానంలో ఉంది. అనంతరం కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, రాజస్తాన్, ఛండీగర్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లు ఉన్నాయి. -
18వేల మంది బ్యాంకు ఉద్యోగులు బదిలీ
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగుచూసిన భారీ కుంభకోణంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగుల బదిలీకి తెరలేసింది. వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న దాదాపు 18వేల మంది బ్యాంకు అధికారులు బదిలీ అయ్యారు. సోమవారమే అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ బదిలీ విషయంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఓ ప్రకటన జారీచేసింది. 2017 డిసెంబర్ 31 నాటికి మూడేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులను బదిలీ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. అదేవిధంగా క్లరికల్ స్టాఫ్ ఎవరైతే 2017 డిసెంబర్ 31 నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకుంటారో వారిని కూడా బదిలీ చేయాలని తెలిపింది. వెంటనే ఈ బదిలీ ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాల మేరకు దాదాపు 18 వేల మంది బ్యాంకు అధికారులు బదిలీ అయినట్టు తెలిసింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాల మేరకు, ప్రతి మూడేళ్లకు ప్రతి అధికారిని బదిలీ చేస్తుంటామని ఓ బ్యాంకు చెప్పింది. మూడేళ్ల కంటే ఎక్కువగా ఒకే పోస్టులో ఆఫీసర్ ఉంచమని పేర్కొంది. క్లరికల్ స్టాఫ్ విషయంలోనూ ఇదే అమలు చేస్తామని తెలిపింది. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్‌మోదీకి, ఆయన కుటుంబ సభ్యులు, గీతాంజలి జెమ్స్ అధికారి మెహుల్ చౌక్సికి ఐదేళ్ల కంటే ఎక్కువగా ఆ బ్యాంకులో పనిచేస్తున్న అధికారులే సాయం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఈ ఆదేశాలు జారీచేసింది. 2011లోనే ఈ స్కాం ప్రారంభమైందని, అప్పటి నుంచి బ్యాంకు అధికారులు నీరవ్ మోదీకి సాయం చేసినట్టు వెల్లడైంది. నీరవ్ సాయం చేసిన ఇద్దరు పీఎన్బీ అధికారులు గత ఐదారేళ్లుగా ఒకే విభాగంలో పనిచేస్తున్నారు. నిజానికి ఇలా జరగకూడదు, ఈ హోదాలో పని చేసే ఉద్యోగులను ఎప్పటికప్పుడు మారుస్తుండాలి. కానీ ఆ విధమైన మార్పు పీఎన్బీలో జరుగలేదు. ఈ క్రమంలో బ్యాంకు అధికారుల బదిలీలు చేపట్టాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశించింది. -
‘బ్యాంకు ఉద్యోగులను పెళ్లి చేసుకోకండి’
లక్నో : బ్యాంకు ఉద్యోగులను పెళ్లి చేసుకోవద్దంటూ ఇస్లామిక్ మత సంస్థ దారుల్ ఉలూమ్ ధియోబంద్ ఫత్వాను జారీ చేసింది. బ్యాంకుల్లో పని చేస్తున్న చాలా మంది అక్రమ మార్గాల్లో సంపాదిస్తున్నారని పేర్కొంది. అక్రమ ధనార్జన చేస్తూ ఉన్నత కుటుంబాలకు చెందిన(వరుడు లేదా వధువు) వారిని వివాహం చేసుకోవాలనుకోవడం కన్నా దారుణం మరొకటి లేదని చెప్పింది. వివాహ సంబంధాలు వెతుకుతున్న ఓ యువకుడికి ఓ మ్యాచ్ వచ్చిందని పేర్కొన్న దారుల్ సంస్థ.. యువతి తండ్రి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారని చెప్పింది. ఉద్యోగం ద్వారా అక్రమంగా అర్జించిన మొత్తాన్ని వారు వరుడికి ఇస్తానని ఆఫర్ చేశారని వెల్లడించింది. అలాంటి కుటుంబంలోని అమ్మాయిని తాను చేసుకోవచ్చా? అని సదరు యువకుడు సంస్థను ఆశ్రయించినట్లు తెలిపింది. ఆ కుటుంబంలోని వ్యక్తిని వివాహం చేసుకోవద్దని యువకుడికి చెప్పినట్లు వెల్లడించింది. అక్రమ ధనార్జనతో ఎదిగిన వ్యక్తికి మంచి లక్షణాలు ఉండవని, మోరల్స్‌ను పాటించరని పేర్కొంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకోవాలని సూచింనట్లు వివరించింది. ఈ నిబంధనలు ఎక్కడివి? - ఇస్లామిక్ చట్టం ప్రకారం వడ్డీకి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. దీన్ని ఇస్లామిక్ చట్టంలో ‘రిబా’ అని పిలుస్తారు. - వ్యాపారంలో పెట్టుబడి పెట్టి సంపాదించిన మొత్తాన్ని కూడా ఇస్లామిక్ చట్టం అక్రమ ధనం(హరామ్)గా భావిస్తుంది. ఈ రెండు సూత్రాలను ఖురాన్ నుంచి ఇస్లామిక్ చట్టంలోకి తీసుకున్నారు. అప్పటినుంచి వీటిని కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఇస్లామిక్ బ్యాంకులు సైతం ‘వడ్డీ లేని బ్యాంకింగ్’ సూత్రం మీద ఆధారపడి పని చేస్తాయి. రుణ దారుల నుంచి బ్యాంకులు తిరిగి తీసుకున్న మొత్తాన్ని ఎందులోనైనా పెట్టుబడి పెట్టి లాభాలు అర్జిస్తే దాన్ని సరైన ఆదాయం(షరియత్)గానే భావిస్తారు. ప్రపంచంలోని అన్ని ఇస్లామిక్ దేశాల్లో ఇస్లామిక్ బ్యాంకులు ఉన్నాయి. చైనా, యూకే, అమెరికా, జర్మనీ దేశాల్లో కూడా ఈ తరహా బ్యాంకులు ఉన్నాయి. -
హెచ్డీఎఫ్సీ ఉద్యోగులకు బిగ్ బొనాంజ
న్యూఢిల్లీ : ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన ఉద్యోగులకు బిగ్ బొనాంజ ప్రకటించింది. తన ఉద్యోగులకు 20 లక్షలకు పైగా ఈక్విటీ షేర్లను జారీ చేస్తున్నట్టు బ్యాంకు స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్ స్కీమ్స్(ఈఎస్ఓఎస్) కింద ఉద్యోగులకు 20,56,400 ఈక్విటీ షేర్లను గురువారం జారీచేస్తున్నట్టు బ్యాంకు తన ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో బ్యాంకు పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ రూ.516,79,93,234 నుంచి రూ.517,21,06,034 పెరిగినట్టు వెల్లడించింది. ఒక్కో షేరు విలువ రెండు రూపాయలు. నేటి మార్కెట్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు 0.63 శాతం పైకి ట్రేడవుతున్నాయి. మొత్తంగా ఉద్యోగులకు అందించిన షేర్ల విలువ రూ.370 కోట్లకు పైగా ఉంది. తాజాగా ప్రకటించిన సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ అంచనాలను తాకింది. బ్యాంకు వడ్డీ ఆదాయాలు 15 శాతం పెరిగి రూ.19,670 కోట్లకు పెరిగినట్టు రిపోర్టు చేసింది. -
బ్యాంకు ఉద్యోగుల మార్చ్ టు పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్బీ) విలీనం, ఉద్యోగుల కొరత తదితర అంశాలపై బ్యాంకు ఉద్యోగులు మరోసారి నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు ఢిల్లీ వేదికగా బ్యాంకు ఉద్యోగులు తమ పోరుకు దిగనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 15 న ‘పార్లమెంట్ మార్చ్’ నిర్వహించనున్నట్టు బ్యాంకుల సంఘాలు ప్రకటించాయి. సెప్టెంబరు 15న వివిధ అంశాలపై ప్రభుత్వం దృష్టిని ఆకర్షించేందుకు బ్యాంక్ ఉద్యోగులు 'పార్లమెంటుకు మార్చ్' నిర్వహించనున్నట్లు ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దీపక్ కుమార్ శర్మ (చండీగఢ్ సర్కిల్) చెప్పారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి సిబ్బంది కొరత, దీర్ఘకాలిక నిధుల రికవరీ, ఎఫ్ఆర్డీఐ బిల్లు ఉపసంహరణ, ప్రజలపై భారం మోపుతున్న సర్వీస్ చార్జీల తగ్గింపు, డీమానిటైజేషన్ కాలానికి తమకు రావాల్సిన పరిహారం తదితర అంశాలపై ఈ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 22 న విజయవంతమైన అఖిల భారత సమ్మె తర్వాత, ఇండస్ట్రీ అధికారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో ' పార్లమెంట్ మార్చ్'కు పిలుపునిచ్చారని తెలిపారు. ఎస్బీఐ బ్యాంకుల విలీనం తదితరాలపై రాబోయే రెండు మూడు నెలల్లో దీనిపై తమ తీవ్ర నిరసనను తెలయజేయనున్నామని చెప్పారు. కార్పొరేట్ రంగం సృష్టించిన భారీ ఎన్పీఏలపై ఆయన మండిపడ్డారు. బలమైన రాజకీయ సంకల్పం, కఠినమైన చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ లేకపోవడంతో రుణాలను తిరిగి పొందడంలో బ్యాంకర్లు విఫలమవుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో ఆందోళనకర స్థాయికి చేరుకున్న మొండి బకాయిల సమస్యను సరిదిద్దే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేయట్లేదని ఆయన విమర్శించారు. పెరుగుతున్న ఎన్పీఎలను హైలైట్ చేయడం ద్వారా బ్యాంకుల పనితీరును ప్రభుత్వం నిరంతరం విమర్శిస్తోందని, తద్వారా బ్యాంకులను ప్రైవేటీకరించే యోచనలో వేగంగా కదులుతోందని ఆయన వ్యాఖ్యానించారు. నవంబర్ 1, 2017 నాటికి కొత్త వేతన రివిజన్ చేయాల్సి ఉందనీ, దీనిపై భారతీయ బ్యాంకుల అసోసియేషన్ (ఐబిఎ) స్పందించనుందని తెలిపారు. -
సహకార వ్యవస్థను నాశనం చేసే చర్య
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) వ్యవహారాలపై సెక్షన్ 51 ప్రకారం విచారణ చేయాలని రిజిస్ర్టార్ ఆదేశించడం సహకార వ్యవస్థను నాశనం చేసేదిగా ఉందని బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం అధ్యక్షుడు డి.రుష్యేంద్రబాబు విమర్శించారు. విచారణను నిలిపివేయాలనే డిమాండ్‌తో నాలుగు రోజులుగా డీసీసీబీ ఎదుట ఉద్యోగ సంఘాలు చేస్తున్న నిరసన కార్యక్రమం ఐదో రోజు మంగళవారం కూడా కొనసాగింది. ఇలాంటి ఏకపక్ష విచారణను తక్షణం ఉపసంహరించుకోవాలని ఉద్యోగులంతా డిమాండ్ చేశారు. ఆందోళనలో భాగంగా గురువారం స్థానిక జిల్లా సహకార అధికారి (డీసీఓ) కార్యాలయం ఎదుట మహాధర్నా తలపెట్టామన్నారు. సహకార బ్యాంకు ఉద్యోగులు, సొసైటీ ఉద్యోగులు, రైతులు, ఖాతాదారులు గురువారం ఉదయం 9.30 గంటలకు డీసీఓ కార్యాయానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. నిరసన కార్యక్రమంలో ఉద్యోగుల యూనియన్ నాయకులు సుఖదేవబాబు, జానకీరామ్‌రెడ్డి, అనంతపద్మనాభం పాల్గొన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె సక్సెస్
అనంతపురం సెంట్రల్ : ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేసే కుట్రను వ్యతిరేకిస్తూ యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ పిలుపు మేరకు జిల్లాలో చేపట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడ్డాయి. దాదాపు మూడు వేల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. సాయినగర్‌లోని ఎస్బీఐ వద్ద మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో బ్యాంకు ఎంప్లాయీస్ కో ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు రుషేంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా, బ్యాంకు ఉద్యోగుల వ్యతిరేకమైన సంస్కరణలు చేపడుతోందని ఆరోపించారు. రూ.90 లక్షల కోట్లు ప్రజాధనం స్వదేశీ, విదేశీ కంపెనీల పరం చేయడానికి కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. బ్యాకింగ్ రంగం ప్రైవేటు దిశగా సాగుతోందని, పారిశ్రామిక తమకు అనుకూలంగా సవరించుకుంటోందని హెచ్చరించారు. కోట్లాది మంది బ్యాంకు ఉద్యోగులు, ప్రజల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. బ్యాంకు ఉద్యోగులు ఐక్యమత్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెద్దనోట్ల రద్దు ద్వారా బ్యాంకులకు ఏర్పడిన లోటును భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బ్యాంకు ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని, బ్యాంకుల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగుల సంఘాల నాయకులు మున్వర్‌బాషా, ఖాధర్‌బాషా, వీరభద్రారెడ్డి, శివకృష్ణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్బీఐ ఎదుట బ్యాంకర్ల ఆందోళన
కర్నూలు(అగ్రికల్చర్): వివిధ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బుధవారం కర్నూలు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదుట భోజన విరామ సమయంలో బ్యాంక్ సిబ్బంది నిరసన ప్రదర్శన చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆప్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా ఏఐబీఈఏ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ అన్ని బ్యాంకులకు తగిన నగదు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు సమయంలో ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్ నుంచే కొంతమంది పెద్దలకు కరెన్సీ వెళ్లిపోయిందని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈనెల 28న చేపట్టే బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్బీఐ ఉద్యోగ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, మోహన్, ఎల్లయ్య, ఇతర బ్యాంకుల నాయకులు పాల్గొన్నారు, -
బీ అలర్ట్: ఈ నెలాఖరున బ్యాంకు ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఫిబ్రవరి 28వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆంధ్రప్రదేశ్-తెలంగాణా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి వీవీఎస్ఆర్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 28న జాతీయ స్థాయిలో సమ్మె జరుపనున్నామని, ఇందులో నాలుగు ఆఫీసర్ల అసోషియేషన్లతోపాటు మరో అయిదు ఉద్యోగుల సంఘాల ఏకగ్రీవ ఆమోదంతో ఈ సమ్మె చేపట్టనున్నట్టు తెలిపారు. గత రెండు దశాబ్దాలుగాపైగా సామాన్య ప్రజానీకానికి వ్యతిరేకంగా చేపడుతున్న సంస్కరణలపై తాము పోరాడుతున్నామన్నారు. వివిధ పబ్లిక్ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, విదేశీ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు పది లక్షల మందికి పైగా పాల్గొననున్నట్లు తెలిపారు . కొత్త ఆర్థిక విధానాల పేరిట బ్యాంకులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ బడ్జెట్లోనూ బ్యాంకులకు అవసరమైన మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేయలేదని, దీంతో బ్యాంకులు ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. సుమారు రూ.110 లక్షల కోట్ల చలామణి కలిగిన బ్యాంకింగ్ రంగాన్ని పరిరక్షించే ఉద్దేశంతో ఈ ఆందోళన జరుపనున్నట్లు తెలిపారు. 500, వెయ్యి రూపాయల నోట్ల రద్దు తర్వాత ప్రజల్లో భారీ స్థాయిలో నగదు కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. తమ ఒకరోజు సందర్భంగా గౌరవనీయులైన ఖాతాదారులు, సామాన్య ప్రజానీకానికి జరుగనున్న అసౌకర్యంపై చింతిస్తున్నామనీ, తమ పోరాటానికి నైతిక మద్దతును అందించాల్సిందిగా శర్మ విజ్ఞప్తి చేశారు. -
28న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
తిరుచ్చి: కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఈనెల 28వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరుపనున్నారు. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటాచలం తిరుచ్చిలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 28న జాతీయ స్థాయిలో సమ్మె జరుపనున్నామని, ఇందులో పబ్లిక్ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, విదేశీ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు పది లక్షల మందికి పైగా పాల్గొననున్నట్లు తెలిపారు. తొమ్మిది కార్మిక సంఘాలు ఈ పోరాటంలో స్వచ్ఛందగా పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఆర్థిక విధానాల పేరిట బ్యాంకులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ బడ్జెట్లోనూ బ్యాంకులకు అవసరమైన మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేయలేదని, దీంతో బ్యాంకులు ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. సుమారు రూ.110 లక్షల కోట్ల చలామణి కలిగిన బ్యాంకింగ్ రంగాన్ని పరిరక్షించే ఉద్దేశంతో ఈ ఆందోళన జరుపనున్నట్లు తెలిపారు. 500, వెయ్యి రూపాయల నోట్ల రద్దు తర్వాత ప్రజల్లో భారీ స్థాయిలో నగదు కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. -
సమ్మెకు దిగనున్న బ్యాంకు సిబ్బంది
-
సమ్మెకు దిగనున్న బ్యాంకు సిబ్బంది
చెన్నై: ఎగవేత దారుల నుంచి రుణాల వసూలు, ఐచ్చిక బకాయిదారులపై చర్యలు.. తదితర డిమాండ్లతో బ్యాంకు సిబ్బంది ఫిబ్రవరి 28వ తేదీన సమ్మెకు దిగనున్నారు. ముందుగా మూడు సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయని, అయితే మొత్తం 9 యూనియన్లు కూడా ఆందోళనలో పాలుపంచుకోనున్నాయని ఆలిండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం తెలిపారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7వ తేదీన తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 28వ తేదీన తలపెట్టిన సమ్మెలో దేశవ్యాప్తంగా పది లక్షల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటారని వివరించారు. -
7న బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరన్!
న్యూఢిల్లీ: కొన్ని బ్యాంక్ ట్రేడ్ యూనియన్లు ఫిబ్రవరి 7న ఒకరోజు దేశవ్యాప్త సమ్మె చేస్తామని హెచ్చరించాయి. డీమోనిటైజేషన్ సమయంలో విధించిన అన్ని నియంత్రణలను ఎత్తివేసి, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ‘నోట్ల రద్దు వల్ల బ్యాంకులు, ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారానికి కేంద్రం, రిజర్వు బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటాయని భావించాం. కానీ ఇప్పటికీ బ్యాంకులకు సరిపడా నగదు సరఫరా జరగడం లేదు. దీంతో అవి కస్టమర్లకు నిర్దేశించిన విత్‌డ్రాయల్స్‌ను సక్రమంగా ఇవ్వలేకపోతున్నాయి’ అని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సి.హెచ్.వెంకటాచలం తెలిపారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ)తోపాటు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ), బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వంటి యూనియన్లు కూడా సమ్మెలో పాల్గొంటాయని పేర్కొన్నారు. రూ.కోటి, ఆపై తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించని వారి పేర్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రుణాల రికవరీకి కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తికి సంబంధించిన క్యాష్ మేనేజ్మెంట్ అంశంలో ఎవరి జోక్యం ఉండకూడదని చెప్పారు. డీమోనిటైజేషన్ వల్ల ప్రాణాలు కోల్పోయిన ప్రజలు/బ్యాంకు ఉద్యోగులు/కస్టమర్లకు పరిహారమివ్వాలని, 50 రోజుల డీమోనిటైజేషన్ సమయంలో అదనపు పని చేసినందుకు బ్యాంకు ఉద్యోగులకు పేమెంట్ చెల్లించాలని కోరారు. కాగా కొత్త గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి ఆర్బీఐ స్వయం ప్రతిపత్తికి బీటలు వారుతున్నాయనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమౌతుండటం గమనార్హం. -
నోట్ల రద్దు...బ్యాంకర్లపై ఒత్తిడి
విజయవాడ: పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకర్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు ఆర్బీఐ నుంచి తమకు ఒత్తిడి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకర్లతో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా.. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. నోట్ల రద్దు నిర్ణయంతో పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అంతా ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన బ్యాంకర్లు.. పది రోజుల నుంచి డిపాజిట్లను స్వీకరించడం తప్ప తాము ఏ పనిచేయలేకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వం, ఆర్బీఐల నుంచి తమకు తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుందని బ్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
తెర పడేదెప్పుడో?
తీరని పాత నోట్ల మార్పిడి కష్టాలు సెలవు రోజైనా బ్యాంకుల ముందు బారులు ఆదివారం మరింతగా పెరిగిన రద్దీ ఉదయం ఏడు గంటల నుంచే క్యూలు పని ఒత్తిడితో బ్యాంకు సిబ్బంది సతమతం పేదలతో నల్లధనం మార్పించుకుంటున్న పెద్దలు రూ.2 వేల నోటుకు చిల్లర దొరకక ప్రజల అవస్థలు సాక్షి, రాజమహేంద్రవరం : కరెన్సీ కష్టాలకు ఇప్పట్లో తెర పడే పరిస్థితి కనిపించడంలేదు. సెలవు రోజైన ఆదివారం కూడా రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లు మార్చుకునేందుకు బ్యాంకుల ముందు ఉదయం ఏడు గంటల నుంచే ప్రజలు క్యూలు కట్టారు. గత మూడు రోజులతో పోల్చుకుంటే ఆదివారం రద్దీ పెరిగిందని బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. పాత నోట్లు మార్చుకునేందుకు మహిళలు, కూలీలు, మధ్యతరగతి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో తగినన్ని బ్యాంకులు లేకపోవడంతో ప్రజలు పట్టణాల బాట పడుతున్నారు. తీవ్ర ఒత్తిడికి గురవుతున్న బ్యాంకు సిబ్బంది ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతున్న బ్యాంకులు రాత్రి 8 గంటల వరకూ సేవలందిస్తున్నాయి. పాత నోట్ల మార్పిడి, జమ చేయడం కోసం వచ్చేవారితో సిబ్బంది క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. రాత్రి 8 తర్వాత లావాదేవీలు నిలిచినా.. తరువాత అంతర్గతంగా జరిగే పనులు రాత్రి 2 వరకూ సాగుతున్నాయి. 4 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతూండడంతో సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. రూ.100 నోట్లకు కొరత పాతనోట్లు మార్చుకుని రూ.2 వేల నోట్లు తీసుకున్న సంతోషంలో ఉన్న సామాన్యులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. రూ.2 వేల నోటుకు చిల్లర లేకపోవడంతో చేతిలో నగదు ఉన్నా అవసరానికి ఉపయోగపడని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు కూడా తమ ఖాతాదారులకే రూ.2 వేల నోట్లతోపాటు రూ.100 నోట్లు ఇస్తున్నాయి. బ్యాంకులో ఖాతా లేకుండా నగదు మార్చుకునేందుకు వస్తున్నవారికి రూ.2 వేల నోట్లు ఇస్తున్నారు. ఏటీఎంలలో పెడుతున్న రూ.100 నోట్లు రెండు మూడు గంటల్లోనే ఖాళీ అయిపోతోంది. డిమాండుకు తగినట్టుగా రూ.100 నోట్ల సరఫరా లేకపోవడంతో బ్యాంకు అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. వ్యాపారం కోసం పెద్ద నోట్ల స్వీకరణ తాజా పరిస్థితుల్లో వ్యాపారులు పెద్ద నోట్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఈ నోట్లను డిసెంబర్ 31 వరకూ మార్చుకోవచ్చని అవగతమైన తర్వాత కొంతమంది రూ.500 నోట్లు స్వీకరిస్తున్నారు. నాలుగు రోజులుగా వ్యాపారం తగ్గిపోవడంతో గత్యంతరం లేక ఆదివారం మార్కెట్లో కొందరు చిరు వ్యాపారులు రూ.500 నోట్లు తీసుకుంటున్నారు. జోరుగా కమీషన్ల వ్యాపారం పేదలు, సామాన్యుల ద్వారా నల్లధనం మార్చుకునే ప్రణాళికలు పెద్దలు ఆచరణలో పెడుతున్నారు. అలాగే డ్వాక్రా సంఘాల మహిళలను కూడా పాత నోట్ల మార్పిడికి ఉపయోగిస్తున్నారు. ఒక్కొక్కరు గరిష్టంగా రూ.4 వేలు మార్చుకోవచ్చు. ఇదే అదునుగా నల్ల కుబేరులు వారితో తమ డబ్బు మార్చుకునే పనిలో పడ్డారు. ఇందుకుగాను వారికి 10 శాతం కమీష¯ŒS ఇస్తున్నారు. డ్వాక్రా సంఘాల అధ్యక్షుల సహాయంతో కొందరు రాజకీయ నేతలు పెద్ద మొత్తంలో నల్లధనం మార్చుకుంటున్నట్లు సమాచారం. అందుకే నాలుగు రోజులైనా బ్యాంకుల వద్ద రద్దీ తగ్గకపోగా పెరుగుతోందని అంటున్నారు. -
బ్యాంకులో 329 కాసుల బంగారం మాయం
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని కార్పొరేషన్ బ్యాంక్ బ్రాంచిలో ఖాతాదారులు తాకట్టు పెట్టిన 329 కాసుల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. రూ.70 లక్షల విలువైన నగలను ఇంటిదొంగలే కాజేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖాతాదారులు పెద్దఎత్తున బ్యాంక్‌కు చేరుకుని తమ నగలు ఏమయ్యాయో చెప్పాలని నిలదీశారు. కార్పొరేషన్ బ్యాంకులో బంగారు ఆభరణాల మాయం వ్యవహారం సంచలనం సృష్టించింది. స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచిన సుమారు 329 కాసుల ఆభరణాలున్న సంచులు మాయం కావడంతో అందరిలోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకు సిబ్బంది పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ దిశగా పోలీసులూ దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం.. తనఖా పెట్టిన బంగారు ఆభరణాలను విడిపించుకునేందుకు శనివారం స్థానిక రైస్‌మిల్లర్ చుండూరి వెంకట సత్యనారాయణ బ్యాంకుకు వచ్చారు. ఆ సమయంలో నగల కోసం బ్యాంకు స్ట్రాంగ్లోకి వెళ్లిన సిబ్బందికి సత్యనారాయణ ఆభరణాలు కనిపించలేదు. దీంతో విషయాన్ని బ్యాంకు మేనేజర్ ఎం.ఎన్.వి.ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సోమవారం రావాలని సత్యనారాయణకు సూచించారు. ఆ తర్వాత బ్యాంకు స్ట్రాంగ్ రూంను పరిశీలించారు. మొత్తం 1433 మంది తనఖా పెట్టిన సుమారు 329 కాసుల బంగారు ఆభరణాలు ఉన్న 19 సంచులు మాయమైనట్టు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.70లక్షలు ఉంటుందని సమాచారం. ఈ విషయం బయటకు పొక్కడంతో రుణగ్రస్తులు భారీగా సోమవారం బ్యాంకు వద్దకు చేరుకున్నారు. తమ ఆభరణాల గురించి వాకబు చేశారు. ఆభరణాల మాయంపై బ్యాంకు డిప్యూటీ జోనల్ మేనేజర్ వారణాసి బాలాజీరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ అశోక్‌కుమార్ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఆభరణాల మాయంపై ఆరా తీశారు. బ్యాంకు మేనేజర్ ప్రసాద్‌తోపాటు మరో నలుగురు సిబ్బందిని, అప్రైజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలు కనబడని ఖాతాల జాబితాను బ్యాంకు వద్ద ప్రదర్శించారు. రుణగ్రస్తులు ఆ జాబితాలు చూసుకున్నారు. బ్యాంకు సిబ్బందే తమ ఆభరణాలను మాయం చేసి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఎస్ఐ రుణగ్రస్తులతో మాట్లాడారు. సమగ్ర దర్యాప్తు జరిపి రుణగ్రస్తులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
యూకో బ్యాంక్‌లో సైకో హల్చల్
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని యూకో బ్యాంక్‌లో గురువారం మధ్యాహ్నం ఓ సైకో హల్చల్ చేశాడు. రాళ్లు, రాడ్‌తో బ్యాంక్ లోపలికి చొచ్చుకు వెళ్లి దాడికి దిగారు. ఈ ఘటనలో ఆరుగురు బ్యాంక్ సిబ్బంది గాయపడ్డారు. బ్యాంక్ సిబ్బంది అతి కష్టం మీద అతడిని అదుపులోకి తీసుకుని చితకబాదారు. అనంతరం కట్టేసి, పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు బ్యాంక్ ఉద్యోగుల దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా అతడిని సురేష్‌గా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బ్యాంక్ అధికారుల మౌన ప్రదర్శన
-
నేడు బ్యాంకు, బీమా ఉద్యోగుల సమ్మె
ముంబై: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందంటూ కార్మిక సంఘాలు బుధవారం (నేడు) తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో బీమా కంపెనీల సిబ్బంది... ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకుల ఉద్యోగులు కూడా పాల్గొంటున్నారు. దీంతో ఆర్థిక సేవలు అంతరాయం కలగనుంది. 25 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 11 ప్రైవేట్, తొమ్మిది విదేశీ బ్యాంకులకు చెందిన సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు సమ్మె చేస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) వెల్లడించింది. వీటితో పాటు 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 650 సహకార బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్, నాబార్డ్, సిడ్బి సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొంటున్నారని పేర్కొంది. మొత్తం మీద బ్యాంకు ఉద్యోగులు, అధికారులకు ప్రాతి నిధ్యం వహించే 14 యూని యన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. ప్రభు త్వ రంగ బ్యాంకులను దొడ్డిదారిన కార్పొరేట్ల చేతికి అప్పజెప్పేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దీన్ని వ్యతిరేకిస్తూ తాము సమ్మెలో పాల్గొంటున్నట్లు బ్యాంక్ యూనియన్లు పేర్కొన్నాయి. కాగా, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్‌కు అనుబంధ సంస్థ అయిన ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ హైదరాబాద్ డివిజన్ కూడా ఈ సమ్మెలో పాల్గొంటుంది. -
బ్యాంక్ ఉద్యోగులకు బొనాంజా
- 15 శాతం వేతనం పెంపు - 2012 నవంబర్ నుంచి వర్తింపు - ఇక నెలలో 2వ,4వ శనివారాలు సెలవు - సంఘాల సమ్మె ప్రతిపాదన విరమణ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు ఎట్టకేలకు తమ దీర్ఘకాలిక డిమాండ్లను సాధించుకున్నారు. దీని ప్రకారం 2012 నవంబర్ నుంచీ 15 శాతం వేతన పెంపు అమలు కానుంది. దీనితోపాటు నెలలో రెండు శనివారాలుత సెలవు ఇవ్వాలన్న డిమాండ్ కూడా పరిష్కారమైంది. ఈ మేరకు సోమవారం ఉద్యోగ యూనియన్లకు, యాజమాన్యానికి మధ్య ఒప్పందం కుదిరింది. దీనితో తమ డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 25 నుంచీ నాలుగురోజుల పాటు జరపతలపెట్టిన సమ్మెను యూనియన్లు విరమించాయి. బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక (యూఎఫ్‌బీయూ) కన్వీనర్ ఎంవీ మురళీ సోమవారమిక్కడ ఈ విషయాన్ని ప్రకటించారు. నెలలో రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలుగా ప్రకటించాలన్నది బ్యాంక్ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండని, ఈ విషయంలో కూడా సానుకూల ఫలితం రావడం హర్షణీయమని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. మధ్యేమార్గం... నిజానికి 19 శాతం వేతన పెంపునకు యూనియన్లు డిమాండ్ చేశాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తొలుత 12.5 శాతం పెంపునకు సరే అంది. దీనికి యూనియన్లు ససేమిరా అన్నాయి. చివరకు చర్చల్లో మధ్యేమార్గంగా 15 శాతంగా నిర్ణయించుకున్నారు. ఈ చర్చల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగ సంఘాలు, బ్యాంక్ యాజమాన్య, ఐబీఏ ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలో మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయి. వీటికి దేశ వ్యాప్తంగా 50,000 బ్రాంచీలుండగా, వాటిలో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. -
రూ.43 కోట్ల కుంభకోణం...బ్యాంకు ఉద్యోగులు అరెస్ట్
ప్రకాశం(ఇంకొల్లు): రుణాల కుంభకోణానికి సంబంధించి రామ్మోహన రావు, రామకోటేశ్వర రావు అనే ఇద్దరు బ్యాంకు అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 2012లో బాండ్లు తాకట్టు పెట్టుకుని కోల్డ్ స్టోరేజీలకు రుణాలను మంజూరు చేశారు. సరుకులు లేకపోవడంతో యాజమాన్యాలు వాటిని ఇతరులకు అమ్మేశారు. సరుకులు లేకపోయినా వాటికి రుణాలు మంజూరు చేశారనే అభియోగాలపై వీరిని ప్రశ్నిస్తున్నారు. దాదాపు ఇది రూ.43 కోట్ల కుంభకోణం. -
సమ్మె యోచన వద్దు...
బ్యాంకు ఉద్యోగులకు జైట్లీ విజ్ఞప్తి న్యూఢిల్లీ: ప్రతిపాదిత సమ్మె యోచనను విరమించాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బ్యాంక్ ఉద్యోగులకు శనివారం విజ్ఞప్తి చేశారు. వేతన సవరణ డిమాండ్ పరిష్కారం కోసం ఈ నెల 25 నుంచీ 4 రోజుల పాటు సమ్మె బాట పట్టనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. సమస్యలపై చర్చల ప్రక్రియ నేపథ్యంలో సమ్మె యోచన సరికాదని జైట్లీ పేర్కొన్నట్లు ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆర్థికమంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నెల 23వ తేదీన ముంబైలో సమస్య పరిష్కారం దిశలో సంబంధిత వర్గాలు చర్చలు జరుగుతున్న విషయాన్ని జైట్లీ ప్రస్తావిస్తూ, సమస్య పరిష్కారానికి చర్చలే సరైన మార్గమని పేర్కొన్నట్లు ప్రకటన తెలిపింది. ‘సేవల్లో’ సంస్కరణలు అవసరం: నిర్మలా సీతారామన్ కాగా, సేవల రంగంలో సంస్కరణలు అవసరమని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ రంగంలో ఉన్న పలు అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్లమెంటు సంప్రదింపుల కమిటీ సమావేశంలో నిర్మలా సీతారామన్ చేసిన సూచనలపై శనివారం ఇక్కడ వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. దేశంలో సేవల రంగం ఎగుమతులు మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సీతారామన్ అన్నారు. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిందనీ, వీటి పరిష్కారంపై దృష్టి సారించనున్నదని పేర్కొన్నారు. -
21 నుంచి బ్యాంకు ఉద్యోగుల సమ్మె
శ్రీకాకుళం అర్బన్: దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. ఈ నెల 21 నుంచి పోరుబాట పట్టాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలోని జాతీయ బ్యాంకులు సుమారు ఆరురోజుల పాటు మూతపడే అవకాశం ఉంది. బ్యాంకు సిబ్బందికి, యాజమాన్యంకు మధ్య ఉన్నతస్థాయిలో చర్చలు మంగళవారం జరగనున్నాయి. ఈ చర్చల ఫలితాలపై సమ్మె ఆధారపడి ఉంటుందని బ్యాంకు యూనియన్ల ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే దాదాపుగా సమ్మెకు సమాయత్తం అయినట్టు సంకేతాలిచ్చారు. ఈ సమ్మె తప్పనిసరిగా మారితే బ్యాంకు సేవలు పూర్తిగా స్తంభించిపోతాయి. ఆర్థిక లావాదేవీలు నిలిచిపోతాయి. చివరికి ఏటీఎంలు కూడా పనిచేయని పరిస్థితి నెలకొంటుంది. యాజమాన్యంకు, బ్యాంకు ఉద్యోగులకు మధ్య జీతాల పెంపు విషయమై కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే పరిష్కారం కావడంలేదు. ఉద్యోగులు పలుమార్లు ఆందోళనలకు దిగారు. 19.5 శాతం పెంచుతూ వేతన సవరణ చేయాలని ఉద్యోగులు పట్టుపడుతున్నారు. ఇదే పరిస్థితుల్లో యాజమాన్యం 12.5 శాతంకు మించి పెంచేది లేదని తెగేసి చెబుతోంది. దీంతో కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ప్రస్తుతం ఈ సమస్యను ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయికి తీసుకువెళ్లాయి. దీంతో సమ్మె అనివార్యంగా మారింది. జిల్లాలో 23 జాతీయ బ్యాంకులకు సంబంధించి 260 బ్రాంచీలు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ సాధారణ, ఏటీఎంల ద్వారా రూ.800 కోట్ల వరకూ లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ సేవలన్నీ సమ్మె వలన నిలిచిపోయే అవకాశం ఉంది. ఆరురోజులపాటు సమ్మె జరిగితే సుమారుగా రూ.5వేల కోట్లు ఆర్థిక లావాదేవీలు ఆగిపోనున్నాయి. సమ్మె విషయమై పూర్తి సమాచారం మంగళవారం సాయంత్రంకు రానుందని ఆ సంఘాలకు చెందిన ప్రతినిధులు ఆర్.నరేంద్ర, ఎం.రమేష్, బి.శ్రీనివాసు చెబుతున్నారు. సమ్మె అనివార్యమైతే ఈనెల 21వ తేదీ నుంచి 24 వరకూ సమ్మెలో ఉంటామని తెలిపారు. తరువాత వచ్చే శని, ఆదివారాలు కూడా సెలువులు వస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో ఆరు రోజుల పాటు బ్యాంకు సేవలు నిలిచిపోతాయన్నారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె సక్సెస్
ఖమ్మం గాంధీచౌక్ : జాతీయ బ్యాంకుల ఉద్యోగులు మంగళవారం చేపట్టిన సమ్మె జిల్లాలో విజయవంతమైంది. వేతన సవరణ డిమాండ్‌తో యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులు ఈ మేరకు నిరసన తెలిపారు. 2012 నవంబర్ నుంచి కొత్త వేతన విధానాన్ని అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల సమ్మెతో జిల్లాలో సుమారు రూ.200 కోట్లకు పైగా లావాదేవీలు స్తంభించాయి. సమ్మె కారణంగా జిల్లాలోని ప్రధాన సంస్థలైన సింగరేణి, భద్రాచలం పేపర్ బోర్డు, హెవీ వాటర్ ప్లాంట్, కేటీపీఎస్ తదితర పరిశ్రమలతో పాటు జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లోని గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యాలు, వ్యాపార సంస్థలు కొంత మేరకు ఇబ్బందులు పడ్డాయి. తొమ్మిది యూనియన్లతో కూడిన యూఎఫ్‌బియూ వేతన సవరణపై ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. 25 శాతం వేతనాలు పెంచాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం 10 నుంచి 11 శాతం మాత్రమే పెంచేందుకు ముందుకొచ్చింది. దీంతో యూఎఫ్‌బీయూ పిలుపు మేరకు బ్యాంక్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. జిల్లాలోని సుమారు 50 జాతీయ బ్యాంకుల్లో పని చేసే 300 మందికి పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉన్న ఎస్బీహెచ్ ఎదుట ఉద్యోగులు మంగళవారం ఉదయం ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బ్యాంకుల ఉద్యోగులు విధులు బహిష్కరించి ధర్నాలో పాల్గొన్నారు. కార్యక్రమంలో యూఎఫ్‌బీయూ జిల్లా నాయకులు నందన్, చంద్రశేఖర్, నర్సింగరావు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణ రెండేళ్లుగా అపరిష్కృతంగా ఉందన్నారు. బ్యాంకులు లక్షల, కోట్ల రూపాయల లాభాలను అర్జిస్తున్నా ఉద్యోగుల వేతనాలు విషయంలో ప్రభుత్వం అనుకూలంగా లేకపోవటం దురదృష్టకరమని అన్నారు. కార్పొరేట్ రంగాలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను రాయితీలుగా ఇస్తోందని, ఆయా సంస్థలు బాకీలు కూడా సక్రమంగా చెల్లించటం లేదని అన్నారు. 25 శాతం వేతనాల పెంపు ద్వారా ప్రభుత్వానికి రూ.7 వేల కోట్లు మాత్రమే భారమవుతుందన్నారు. ఈ సమ్మెకు సీపీఎం అనుబంధ సీఐటీయూ. సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ కార్మిక సంఘాలు మద్దతు తెలిపి సమ్మెలో పాల్గొన్నారు. సీఐటీయూ నాయకులు కె.నర్సింహరావు, ఏఐటియూసీ నాయకులు సింగు నర్సింగరావులు ఉద్యోగుల సమ్మెలో పాల్గొని తమ సంపూర్ణ మద్దతును తెలిపారు. -
స్తంభించిన బ్యాంకింగ్
రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించిన బ్యాంకు ఉద్యోగులు బెంగళూరు : చాలా కాలంగా అపరిృ్కతంగా ఉన్న వేతనాల పెంపు అంశంతో పాటు వివిధ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు మంగళవారం విధులను బహిష్కరించి సమ్మెకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించాయి. ఇక బెంగళూరులోని వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు సైతం విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెలో పాల్గొన్న వందలాది మంది బ్యాంకు ఉద్యోగులు ఉదయం టౌన్‌హాల్ నుంచి మైసూరు బ్యాంకు సర్కిల్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సంయుక్త వేదిక ప్రతినిధి ఏఎన్ కృష్ణమూర్తి మాట్లాడుతూ...2012 నవంబర్ తర్వాత వేతన సవరణ జరగలేదని తెలిపారు. 25 శాతం మేర వేతనాలను పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుంటే ఇండియన్ బ్యాంక్స్ అసోషియేషన్ (ఐబీఏ) మాత్రం 11 శాతం మాత్రమే వేతనాలను పెంచుతామని చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఐబీఏ నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. -
బ్యాంకింగ్.. బ్రేక్!
ఒక రోజు సమ్మెలో ఐదు వేల మంది ఉద్యోగులు ఎక్కడికక్కడ స్తంభించిన కార్యకలాపాలు జిల్లాలో మూతపడిన 525 శాఖలు నిలిచిపోయిన రూ.600 కోట్ల లావాదేవీలు కాకినాడ :బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన ఒక రోజు సమ్మెతో జిల్లాలో మంగళవారం బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. పదో ద్వైపాక్షిక వేతన ఒప్పందం చేయాలన్న డిమాండ్‌తో, యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్స్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ, పలు ప్రైవేటురంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. మేనేజర్ నుంచి స్వీపర్ వరకూ అన్ని తరగతుల ఉద్యోగులూ విధులు బహిష్కరించారు. దీంతో జిల్లాలో వివిధ బ్యాంకులకు చెందిన 525 పైగా బ్రాంచిలు మూతపడ్డాయి. సుమారు రూ.600 కోట్ల మేర లావాదేవీలు స్తంభించిపోయాయి. న్యూ జనరేషన్ ప్రైవేటు బ్యాంకులైన ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్ర మినహా దాదాపు అన్ని బ్యాంకుల ఉద్యోగులూ సమ్మెబాట పట్టారు. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ప్రాంతాల్లో బ్యాంకు ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజమండ్రి ఇన్నిస్పేట ఆంధ్రాబ్యాంక్ వద్ద, అమలాపురం ఆంధ్రాబ్యాంక్ ప్రధాన కార్యాలయంవద్ద నిరసన తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్డులోని ఆంధ్రాబ్యాంక్ జోనల్ కార్యాలయం వద్ద ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగులనుద్దేశించి యుటైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్స్ కన్వీనర్ కె.ఆదినారాయణమూర్తి మాట్లాడారు. వేతన ఒప్పందం కోసం బ్యాంకు ఉద్యోగులు రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారన్నారు. రోజురోజుకూ ధరలు పెరుగుతున్నా ఎదుగుదల లేని జీతాలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పదో ద్వైపాక్షిక వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి యూనియన్ నేతలు పీవీ రమణమూర్తి, దేవదాసు, రాజేంద్రనాథ్, వీఎస్ఎన్ మూర్తి, త్రిమూర్తులు, శ్రీనివాసరావు, నరసింగరావు, పాండురంగారావు, ఆర్ఎస్ ప్రసాద్, శ్యామ్మోహన్, దుర్గాప్రసాద్, గణేష్, వెంకట్రావు, నరసింహమూర్తి, సుధ, సమీర, అరుణ, అరుణ్‌కాంత్ తదితరులు నాయకత్వం వహించారు. -
నిరవధిక సమ్మె బాటలో బ్యాంకు ఉద్యోగులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దక్షిణాది రాష్ట్రాల్లో మంగళవారం నిర్వహించిన ఒక రోజు సమ్మె విజయవంతం కావడంతో కొత్త ఏడాది ప్రారంభంలో నిరవధిక సమ్మెకు ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగ సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. వేతన సవరణపై ప్రభుత్వం ఒక మెట్టు కూడా దిగిరాకపోవడంతో నిరవధిక సమ్మె లేక వరుసగా ఆరు రోజులు సమ్మె జరిపే యోచనలో బ్యాంకు ఉద్యోగ సంఘాలున్నాయి. తదుపరి కార్యాచరణపై డిసెంబర్ రెండో వారంలో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. ఇంత వరకూ ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక రోజు సమ్మెల ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలియచేస్తూ వచ్చామని, అయినా ప్రభుత్వం తన మొండి పట్టుదల వీడకపోవడంతో ఖాతాదారులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందన్నారు. గత నెలరోజుల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగడం ఇది రెండవసారి. నవంబర్ 12న ఒక రోజు సమ్మె జరిగింది. దీర్ఘకాలిక సమ్మెపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ నేషనల్ కన్వీనర్ మురళి తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు కనీసం 23 శాతం పెంచాలని డిమాండ్ చేస్తుంటే..ప్రభుత్వం 11 శాతం మించి పెంచడానికి ముందుకు రావడం లేదు. కనీసం రెండు శాతం పెంపుతో ముందుకు వస్తే సమ్మె ఆపి చర్చలకు వస్తామని తాము ముందుకొచ్చినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని రాంబాబు ఆరోపించారు. గతేడాది ప్రభుత్వ బ్యాంకుల నిర్వహణ లాభం రూ. 1.10 లక్షల కోట్లుగా ఉందని, ఈ లాభాలకు కారణమైన తమకు ఇందులో రూ. 7,000 కోట్లు ఇవ్వడానికి కూడా కేంద్రం ముందుకు రాకపోవడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి బాగా పెరుగుతోంది. సమ్మె దిగ్విజయం: యూనియన్లు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక రోజు సమ్మె విజయవంతం అయినట్లు బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి. చెన్నైలోని చెక్ క్లియరెన్స్ గ్రిడ్ పనిచేయకపోవడంతో సమ్మె ప్రభావం ఇతర ప్రాంతాలపై కూడా కనిపించిందని యూనియన్ వర్గాలు తెలిపాయి. రూ. 1.75,000 కోట్ల విలువైన 2.50 కోట్ల చెక్కులు క్లియరెన్స్ నిలిచిపోయిందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 80,000 మందికిపైగా ఉద్యోగులు పాల్గొనగా, దక్షిణాది రాష్ట్రాల్లో రెండు లక్షలమందికిపైగా ఉద్యోగులు పాల్గొన్నట్లు అంచనా. బుధవారం నుంచి మిగిలిన మూడు జోన్లలో జరిగే సమ్మె ప్రభావం దక్షిణాది రాష్ట్రాల చెక్ క్లియరెన్స్‌లపై ఉంటుందంటున్నారు. మంగళవారంనాటి ప్రభుత్వ బ్యాంకు సిబ్బంది సమ్మె సందర్భంగా దక్షిణాదిన ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రైవేటు బ్యాంకులు మాత్రం యథాతథంగా పనిచేశాయి. వేతన సవరణపై సోమవారం ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్‌తో (ఐబీఏ) చర్చలు విఫలం కావడంతో యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ఈ సమ్మె కు పిలుపునిచ్చింది. దీని ప్రకారం ఉద్యోగులు జోన్లవారీగా మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు రిలే సమ్మె చేయాలని నిర్ణయించారు. మంగళవారం దక్షిణాదిన సమ్మె జరగ్గా, ఉత్తరాది జోన్లో 3న, తూర్పు జోన్లో 4న, పశ్చిమ జోన్లో 5న స్ట్రయిక్ చేస్తున్నారు. -
బ్యాంకుల సమ్మె
* స్తంభించిన లావాదేవీలు * ఏటీఎంలే దిక్కు * డిసెంబరులో మళ్లీ సమ్మె చెన్నై, సాక్షి ప్రతినిధి: ఐదేళ్లకోసారి పెంచాల్సిన జీతాలు పెంచకపోవడంతో బుధవారం ఉదయం రాష్ట్రంలోని అన్ని బ్యాంకు ఉద్యోగులు సమ్మె పాటించాయి. బ్యాంకు ఉద్యోగ సంఘాల జాతీయ సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులందరూ తమ విధులను బహిష్కరించారు. ఉద్యోగ, అధికార సంఘాలతో బ్యాంకు యాజమాన్యం గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐదేళ్లకు ఒకసారి జీతాలను పెంచాల్సి ఉంది. ఈ మేరకు 2007లో 17.5 శాతం జీతాన్ని పెంచారు. అయితే ఆ తరువాత ఐదేళ్ల (2012)లో జీతాలను పెంచలేదు. ఈ దఫా 25 శాతం జీతాన్ని పెంచాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌పై ఇప్పటికి 13 సార్లు యాజమాన్యాలతో చర్చలు జరిపాయి. ఇందులో భాగంగా ఈనెల 10న ఢిల్లీలో జరిగిన చర్చలు విఫలం కావడంతో దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. జాతీయ సంఘాల పిలుపు మేరకు రాష్ట్రంలోని 8400 బ్యాంకులు మూతపడ్డాయి. సుమారు 60 వేల మంది అధికారులు, ఉద్యోగులు విధులను బహిష్కరించారు. అన్ని లావాదేవీలు నిలిచిపోయాయి. ఆన్లైన్, ఏటీఎంల సేవలను సైతం స్తంభింప జేస్తున్నట్లు ప్రకటించినా ఏటీఎంలు పనిచేశాయి. చెన్నై వళ్లువర్ కోట్టం వద్ద బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేశారు. బ్యాంకు యాజమాన్యాలు దిగిరాని పక్షంలో డిసెంబరు 2న తమిళనాడు, కర్నాటక, కేరళ, పుదుచ్చేరీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, డిసెంబరు 3,4,5 తేదీల్లో మిగిలిన రాష్ట్రాల్లో విధులను బహిష్కరించాలని బుధవారం నాటి సమ్మెలో నిర్ణయం తీసుకున్నారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె
వినియోగదారులకు తప్పని తిప్పలు వేతన సవరణలను అమలు చేయడంతో పాటు వివిధ డిమాండ్ల పరిష్కారానికి గాను బ్యాంకు ఉద్యోగులు బుధవారం సమ్మెకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులన్నింటి లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. ఇండియన్ నేషనల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఇక ఇందులో భాగంగా కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ బ్యాంకు లావాదేవీలు స్తంభించాయి. దీంతో నగరంలోని పలు ఏటీఎంల వద్ద బుధవారం ఉదయం నుంచే నగర వాసులు బారులు తీరి కనిపించారు. మరికొన్ని చోట్ల బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో ఉన్న కారణంగా ఏటీఎంలలో డబ్బులు నింపకపోవడంతో అనేక మంది వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఇక నగరంలో నిర్వహించిన సమ్మెలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు బుధవారం ఉదయం టౌన్‌హాల్ నుంచి మైసూరు బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే ధర్నా చేపట్టారు. -
బ్యాంకుల సమ్మె విజయవంతం
కదం తొక్కిన బ్యాంకు సిబ్బంది జిల్లా వ్యాప్తంగామూతపడిన బ్యాంకులు విజయవాడ : వేతన సవరణ కోసం దశలవారీ పోరాటం చేస్తున్న బ్యాంకు ఉద్యోగులు, అధికారులు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఒకరోజు సమ్మె విజయవంతమైంది. వేతన సవరణ చే యాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఆందోళన చేపట్టారు. బుధవారం విజయవాడ సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా బెంజి సర్కిల్ కార్యాలయం వద్ద వందలాది మంది బ్యాంకు సిబ్బంది ఆందోళనలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అన్ని బ్యాంకుల్లో అధికారులు, సిబ్బంది విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. జిల్లాలో వివిధ బ్యాంకులకు చెందిన దాదాపు 600 బ్రాంచిలు మూతపడ్డాయి. ఫలితంగా కోట్లాది రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. తమ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రధాన యూనియన్లు సంఘటిత పోరాటం చేస్తున్నాయి. ఈ ఆందోళనకు నాయకత్వం వహించిన విజయవాడ బ్యాంకు ఉద్యోగులు సమన్వయ కమిటీ కార్యదర్శి కె.నగేష్ కుమార్ మాట్లాడుతూ వేతన సవరణను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎంతోకాలంగా 11 శాతం కంటే అధికంగా వేతనాలు సవరించేదిలేదని మొండిపట్టు పడుతోందన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో తాము డిమాండ్ చేస్తున్న విధంగా వేతనాలు 23 శాతం పెంచాలని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే భవిష్యత్‌లో నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఆయన బ్యాంకు అధికారులు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు సీహెచ్ హనుమంతరావు, కేఎస్ రావు, వివిధ బ్యాంకు అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
బ్యాంకులు బంద్
సాక్షి, రాజమండ్రి : వేతన సవరణకోసం బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెతో బుధవారం జిల్లాలోని 20 ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 450కి పైగా శాఖలు మూత పడ్డాయి. సుమారు రూ.800 కోట్ల లావాదేవీలు స్తంభించాయి. బ్యాంకు ఉద్యోగులకు పదో వేతన సవరణ 2012 నవంబరు నుంచి వర్తించ వలసి ఉండగా ఇప్పటి వరకూ ప్రభుత్వం అమలు చేయక పోవడాన్ని నిరసిస్తూ యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో ఈ సమ్మె జరిగింది. వేతనాలను 33 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు రోజులు సమ్మె చేశారు. తర్వాత ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కాగా వేతనాల పెంపును 25 శాతానికి, తర్వాత 23 శాతానికి తగ్గించి అమలు చేయాలని ఉద్యోగులు కోరారు. అయినా కేంద్రం పట్టించుకోక పోవడంతో వారం రోజులుగా విధి నిర్వహణ అనంతరం నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు బుధవారం ఒకరోజు సమ్మె చేశారు. జిల్లాలో అత్యధికంగా సేవలు అందిస్తున్నవి ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంకు గ్రూపు శాఖలే. రాజమండ్రి, కాకినాడ, అమలాపురంతో పాటు మొత్తం 110 ఆంధ్రాబ్యాంకు, 113 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 40 స్టేట్ బ్యాక్ ఆఫ్ హైదరాబాద్ శాఖల్లో సమ్మె జరిగింది. ఇవి కాక ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన 187 శాఖలు మూతపడ్డాయి. ఆయా బ్యాంకులకు అనుబంధంగా ఉండే ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, ఆల్ ఇండియా స్టేట్ బ్యాంకు ఆఫీసర్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా ఎస్బీఐ స్టాఫ్ ఫెడరేషన్లతో పాటు పలు యూనియన్లు సమ్మెలో పాల్గొన్నాయి. 5,000 మందికి పైగా ఉద్యోగులు, అధికారులు విధులను బహిష్కరించారు. పరిష్కారం కాకుంటే వచ్చే నెల రెండున మళ్లీ సమ్మె రాజమండ్రి, కాకినాడ, అమలాపురంలలో బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ బ్యాంకుల ముందు సమావేశమై డిమాండ్లతో కూడిన నినాదాలు చేశారు.వేతన సవరణ అమలులో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. రాజమండ్రి కంబాలచెరువు మెయిన్ బ్రాంచి వద్ద రీజియన్ పరిధిలోని అధికారులు, ఉద్యోగులు నిర సన వ్యక్తం చేశారు. ఐఎఫ్‌బీయూ రాజమండ్రి విభాగం కన్వీనర్ ఎన్.లక్ష్మీపతిరావు మాట్లాడుతూ తాము దిగి వచ్చినా కేంద్రం దిగి రావడం లేదన్నారు. ఇదే వైఖరి కొనసాగితే జోనల్ స్థాయిల్లో సమ్మెకు దిగుతామన్నారు. డిమాండ్లు పరిష్కారం కాకపోతే సౌత్ జోన్ రాష్ట్రాల సమ్మెలో భాగంగా డిసెంబరు రెండున మరోసారి జిల్లాస్థాయిలో సమ్మె చేస్తామన్నారు. సమ్మెతో రాజమండ్రిలో రూ.200 కోట్లు, కాకినాడలో రూ.250 కోట్ల లావాదేవీలు స్తంభించినట్టుఅంచనా. -
నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె బాట
సాక్షి, బెంగళూరు : వేతన సవరణను అమలు చేయడంతో పాటు వివిధ డిమాండ్ల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగులు బుధవారం సమ్మెకు దిగనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులతో పాటు దేశ వ్యాప్తంగా కూడా ఈ సమ్మె కొనసాగనుంది. బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో బ్యాంకు లావాదేవీలన్నీ పూర్తిగా స్తంభించిపోనున్నాయి. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగానే కాక దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. 2012 నవంబర్ నుంచి తమకు అందాల్సిన వేతన సవరణను అమలు చేసేందుకు ప్రభుత్వం, ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ అంగీకరించని పక్షంలో దేశవ్యాప్తంగా మరోసారి విడతల వారీ పోరాటానికి సన్నద్ధమవుతామని ఇండియన్ నేషనల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మంగళవారమిక్కడ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
ఉపాధి హామీ పథకంలో గోల్మాల్
ఖమ్మం : ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పట్టాయి. ఖమ్మం జిల్లా చండ్రుగొండలో ఉపాధి హామీ పథకంలోగోల్మాల్ జరిగింది. చెక్కు ఫోర్జరీ చేసి కొత్తగూడెం ఎస్బీహెచ్లో రూ.4.50 లక్షలు డ్రా చేశారు. ఉపాధి హామీ ఉద్యోగుల ఫిర్యాదుతో బ్యాంక్ అధికారులు విచారణ చేపట్టారు. కాగా ఈ కుంభకోణంలో బ్యాంక్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జీరో ఖాతాలు తెరిచేందుకు బ్యాంకర్ల నిరాసక్తత
సాక్షి, కడప : భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జన్‌ధన్ యోజనకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరూ ఖాతా ప్రారంభించాలని చర్యలు ప్రారంభిస్తుంటే... మరోవైపు స్వచ్ఛందంగా వస్తున్న ప్రజలను బ్యాంకు అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో ఖాతాలు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. జిల్లాలోని అనేక బ్యాంకులు జీరో ఖాతాలు తెరిచేందుకు నిరాసక్తత చూపుతున్నాయి. జన్‌ధన్ యోజన ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని ప్రచారం జరగటంతో ఖాతాలు తెరిచేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. అంతేగాక జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మెప్మా ఆర్పీలు, అంగన్వాడీలు, యానిమేటర్లు ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేస్తున్నారు. జన్‌ధన్ యోజన ఖాతాను ప్రారంభించాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా కొంతమంది ఆర్పీలు బ్యాంక్ అకౌంట్ చేసుకుంటే రూ.5వేలు ఖాతాలో పడుతుందని చెబుతున్నారు. అయితే వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే జీరో అకౌంటుతో ఖాతా ఓపెన్ చేసిన తర్వాత 45 రోజులకు ఒకసారైనా లావాదేవీలు జరుపుతూ రావాలి. అలా ఆరు నెలల అయిన తర్వాత రూ.5వేలను బ్యాంకు ఖాతాలోకి కేంద్రప్రభుత్వం జమ చేస్తుంది. తగిన అవసరాలకు వనియోగించుకుని 11 శాతంతో దీనిని తిరిగి బ్యాంకుకు కట్టవలసి ఉంటుంది. అయితే ఉచితంగా రూ.5వేలు మీ ఖాతాలో జమ అవుతుందని ఆర్పీలు ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. సహకరించని బ్యాంకర్లు: జిల్లాలోని కడపతోపాటు ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, కోడూరు, జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు, తదితర ప్రాంతాల్లో జీరో అకౌంట్లు ఓపెన్ చేయడానికి కొందరు బ్యాంకర్లు సహకరించడం లేదు. రూ.500తో అకౌంట్ చేయడానికైతే ఉత్సాహం చూపిస్తున్నారని, జీరో అకౌంటు అనగానే చూద్దాంలే.. చేద్దాంలే అంటూ కాలయాపన చేస్తున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు క్రాప్ రుణాలు రెన్యువల్ చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో బ్యాంకర్లకు జీరో ఖాతాలు తెరవడం సమస్యగా మారింది. కడపలో గందరగోళం : కడప నగర విషయానికొస్తే ఎవరు ఎక్కడ ఖాతా తెరవాలో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. నగరంలో 50 డివిజన్లుండగా ఏ బ్యాంక్‌కు వెళ్లి ఖాతా తెరవాలో తెలియడం లేదు. ఈ విషయంలో బ్యాంక్ అధికారులు కొంత స్పష్టత ఇచ్చినా చాలామందికి తెలియక గురువారం కూడా గంటల తరబడి క్యూలో నిలబడి తీరా వేరే డివిజన్‌లోకి వెళ్లాలని బ్యాంక్ అధికారులు చెబుతుండటంతో ఇంటిదారి పడుతున్నారు. లీడ్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రఘునాథరెడ్డి ఏమంటున్నారంటే.... : జీఓ ఖాతాల విషయంలో జిల్లాలో అన్ని బ్యాంకులు ఆదేశాలు ఇచ్చాం. ఈనెల 15వరకు ఆధార్ కార్డు సీడింగ్ చేయాల్సిన పనిలో బిజీగా ఉండడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆగస్టు 16 నుంచి ఇప్పటివరకు 85వేల అకౌంట్లను పూర్తి చేశాం. ఎలాంటి సమస్య లేకుండా ప్రతి ఒక్కరూ ఖాతాలను తెరిచే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. -
బ్యాంకులమూత
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం జాతీయ బ్యాంకులు తలపెట్టిన అఖిల భారత సమ్మె మంగళవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. బ్యాంకుల సమ్మెతో రాష్ట్రంలోని ఆర్థిక లావాదేవీల్లో భారీ స్తంభన ఏర్పడింది. పనిభారానికి తగిన జీతాలు అందడం లేదని, విధులకు తగిన జీతాలు ఇవ్వాలని, ప్రైవేటీకరణ దిశగా సాగుతున్న ప్రయత్నాలను నిలిపివేయాలని తదితర డిమాండ్లతో దేశంలోని అన్ని జాతీయ బ్యాం కులు ఈనెల 10వ తేదీ నుంచి సమ్మె ప్రారంభించాయి. దేశంలో ముంబై, ఢిల్లీ తరువాత అతిపెద్ద వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక కేంద్రమైన తమిళనాడుపై సమ్మె ప్రభావం భారీగానే పడింది. రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది బ్యాంకు సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. బ్యాంకుల ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధి, పింఛన్‌పై ఆధారపడి ఉన్నవారంతా సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమ్మె ముగిసి ఉంటుందన్న ఆశతో వందలాది మంది ఖాతాదారులు బ్యాంకుల వద్దకు వచ్చి నిరాశతో వెనుదిరిగిపోయారు. అన్ని రంగాలకు సంబంధించి కోట్లాదిరూపాయల చెక్కులు నిలిచిపోయాయి. ఏటీఎంలు ఖాళీ బ్యాంకు సిబ్బంది సమ్మె ఎపుడు విరమిస్తారో తెలియక ఆందోళనకు గురైన ఖాతాదారులు ముందు జాగ్రత్తగా ఏటీఎంలకు పరుగులెట్టారు. రాష్ట్రం మొత్తం మీద 7,500 ఏటీఎంలు ఉండగా, చెన్నైలో మాత్రమే 600 ఉన్నాయి. సమ్మె ప్రభావంతో రెండు రోజుల్లోనే దాదాపు అన్ని ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. బ్యాంకులు మూసివేసి, ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసే అవకాశంలేక పోవడం ఖాతాదారులను బాధిస్తోంది. ఇదిలా ఉండగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వార్షికోత్సవంలో ఇటీవల ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సమ్మెకు ఆజ్యం పోసింది. బ్యాంకుల ద్వారా లభిస్తున్న ఆదాయాన్నంతా ఉద్యోగుల జీతాలకే వెచ్చించాలని కోరుకోవడం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. -
కొనసాగిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ : పదవ వేతన ఒప్పందం అమలు చేయాలని, ఇతర డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జాతీయ, గ్రామీణ బ్యాం కుల ఉద్యోగులు చేపట్టిన రెండు రోజుల సమ్మె మంగళవారం కూడా కొనసాగింది. దీంతో జిల్లాలోని 26 బ్యాంకులకు చెందిన 232 బ్రాంచిల్లో లావాదేవీలు స్తంభించిపోయాయి. జిల్లా వ్యాప్తం గా బ్యాంకుల శాఖల ముందు ఉద్యోగులు ధర్నాలు నిర్వహించారు. శ్రీకాకుళంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్రాంచి ఎదుట యూఎఫ్‌బీయూ(యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్) జిల్లా నాయకుల ఆధ్వర్యంలో వివిధ బ్యాంకుల ఉద్యోగులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐబీవోసీ నాయకుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ వేతనాల విషయంలో ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నిరవధిక సమ్మె కు వెనుకాడబోమని హెచ్చరించారు. ఎన్సీబీఈ యూనియన్ నాయకుడు నరేంద్ర మాట్లాడుతూ గత సంవత్సరంలో బ్యాంకులు ఆర్జించిన లక్షా 62 వేల కోట్ల రూపాయల్లో ల క్షా 40 వేల కోట్ల రూపాయలను రుణఎగవేతదారులకు ప్రభుత్వం దోచిపెట్టిందని విమర్శించారు. మెరుగైన వేతన సవరణ చేయాలని అడిగితే మొండిచేయి చూపడం అన్యాయమన్నారు. ఏఐబీఈఏ నాయకుడు జగన్మోహనరావు మాట్లాడుతూ ప్రభుత్వ బ్యాంకులను నిర్వీర్యం చేసే బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, బ్యాంకుల జాతీయీకరణ సవరణ చట్టాలను విరమించుకోవాలని డిమాండ్ చేశా రు. ఎస్బీఐ సంఘ నేతలు రమేష్, గౌరీశంకర్, ఏఐబీఈఏ నాయకులు శంకరరావు, బి.శ్రీనివాసులు, ఏపీజీవీబీ నాయకులు ఎం.వి.టి.నాగేశ్వరరావు, శర్మ, ఎన్సీబీఈ నాయకులు జగన్నా థం, గిరిప్రసాద్, మోహనరావు పాల్గొన్నారు. -
చిదంబరం వాక్యలపై మండిపడ్డ బ్యాంకు ఉద్యోగులు
-
ఆగిన సేవలు
సాక్షి, చెన్నై: వేతనాలు పెంచాలని, బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 11,252 బ్యాంకుల్లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగులు సోమవారం విధుల్ని బహిష్కరించారు. దీంతో బ్యాంకుల్లో సేవలు స్తంభించాయి. లావాదేవీలు నిలిచి పోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమ్మె బుధవారం వరకు కొనసాగనుంది. మూతపడిన బ్యాంకులు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ మినహా మిగిలిన అన్ని బ్యాంకు లు మూతపడ్డాయి. నగదు బట్వాడా, చెక్కుల మార్పిడి తదితర అన్ని రకాల సేవలు ఆగిపోవడంతో ఖాతాదారులకు ఇబ్బందులు తప్పలేదు. ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో నగదు కోసం నానా తంటాలు పడాల్సిన పరిస్థితి. నిత్యం ఖాతాదారులతో కిటకిటాలాడే బ్యాంకులు బోసిపోయాయి. నగదు కోసం ఏటీఎంలకు వెళ్లినా క్యూలో బారులు తీరాల్సిన పరిస్థితి. కొన్ని ఏటీఎంలలో నగదు ఖాళీ అయింది. అనేక ఏటీఎంల ముందు ‘నో మని’ బోర్డులు తగిలించారు. ఆన్లైన్ సేవలు సైతం ఆగిపోయూయి. మంగళవారం కూడా సమ్మె కొనసాగుతుండడంతో మరెన్ని ఇబ్బందులు పడాలోనని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగుల ఆందోళన బాట విధుల్ని బహిష్కరించిన ఉద్యోగులు తమ కార్యాలయాల వద్ద నిరసనలు తెలియజేశారు. చెన్నైలోని ఉద్యోగులు భారీ ఎత్తున కదం తొక్కారు. ప్యారిస్‌లోని యూనియన్ బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఇందులో అఖిల భారత ఉద్యోగుల సమాఖ్య కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం మాట్లాడుతూ ఇటీవల జరిగిన చర్చల మేరకు పది శాతం మాత్రమే వేతన పెంపునకు నిర్ణయించారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఈ పెంపు ఏ మూలకూ సరిపోదన్నారు. ఐదేళ్లకొకసారి వేతన పెంపు నిర్ణయం తీసుకుంటున్నారని, ఈ క్రమంలో తమ డిమాండ్‌కు తగ్గట్టుగా పెంచి తీరాల్సిందేనని పట్టుబట్టారు. బ్యాంకుల ద్వారా పలు ప్రభుత్వ పథకాలు అమల్లో ఉన్నాయని, ఈ పథకాల అమల్లో తమ పాత్ర ఉందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని చెప్పారు. తమ సమ్మెలో ఒక్క రోజు రాష్ట్రంలో రూ.90 లక్షల చెక్కులు పెండింగ్‌లో పడ్డాయని, తాము ఆందోళనలు ఉద్ధృతం చేస్తే పరిస్థితి దారుణం అవుతుందన్న విషయాన్ని గ్రహించాలని కేంద్రాన్ని హెచ్చరించారు. -
ఆగ్రహించిన బ్యాంకు ఉద్యోగులు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ పిలుపు మేరకు బుధవారం బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. అధికారులు కూడా సంఘీభావం తెలుపడంతో జిల్లాలో సుమారు 300 బ్యాంకు శాఖలు మూతబడ్డాయి. దీంతో వేల కోట్ల రూపాయల నగదు లావాదేవీలు నిలిచిపోయాయి. ఏటీఎంలలో కూడా నగదు నిల్వలు లేక పోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. ఒంగోలు నగరంలోని బ్యాంకు ఉద్యోగులు స్థానిక భాగ్యనగర్‌లోని ఆంధ్రాబ్యాంకు జోనల్ కార్యాలయం నుంచి నెల్లూరు బస్టాండ్ వద్ద గల, సిండికేట్ బ్యాంకు వరకు ప్రదర్శనగా వచ్చి సభ నిర్వహించారు. ఏఐబీఈఏ నాయకుడు వి.పార్థసారధి మాట్లాడుతూ 10వ వేతన సవరణ ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని, ఎఫ్‌డీఐలను వ్యతిరేకించాలని, బ్యాంకింగ్ సెక్టార్లో వస్తున్న నూతన సవరణలను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. మెడికల్ ఇన్సూరెన్సు ఖర్చులన్నీ బ్యాంకులే భరించాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సర్దార్ మాట్లాడుతూ ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్న నూతన ఆర్థిక విధానాలను ఆపివేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. నగర కో-ఆర్డినేషన్ సమితి ప్రధాన కార్యదర్శి వి.రామచంద్రరావు (రాము) నాయకులను ఆహ్వానించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ యూపీఏ-2 ప్రభుత్వం ఎల్ఐసీ, బ్యాంకుల్లో ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ ప్రభుత్వ వాటాలను తగ్గిస్తూ, బ్యాంకులను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. కార్పొరేషన్ సంస్థలకు బ్యాంకింగ్ లెసైన్సులివ్వడాన్ని వ్యతిరేకించారు. ధరలు విపరీతంగా పెంచుతూ, ద్రవ్యోల్బణానికి లెక్కలు కల్పించిన ప్రభుత్వం, వేతన సవరణలో 5 శాతం మాత్రమే వేతనం పెంచుతామనడం దారుణమన్నారు. 10వ వేతన సవరణ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే కారుణ్య నియామకాలు జరపాలని కోరారు. ఉద్యోగులు పోరాటాల ద్వారా బ్యాంకింగ్ రంగాన్ని కాపాడుకోవాలని కోరారు. బ్యాంకుల విలీనాలను వ్యతిరేకించాలని కోరారు. నగరంలోని 50 పైగా బ్యాంకు శాఖలన్నీ మూతబడ్డాయని.. ఎస్బీఐలోని క్లియరింగ్ హౌస్ పని చేయలేదని, 2000 కోట్లపై చిలుకు నగదు లావాదేవీలు నిలిచిపోయాయని నిర్వాహకులు తెలిపారు. జిల్లాలోని మార్కాపురం, చీరాల, కందుకూరు, కనిగిరి, గిద్దలూరు, కొండపి, పర్చూరు తదితర అన్ని ప్రధానమైన ప్రాంతాల్లో స్వీపర్ మొదలుకొని, మేనేజర్ల స్థాయి వరకు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారన్నారు. కార్యక్రమంలో లక్ష్మయ్య, యు.ప్రకాశరావు, సీహెచ్ శ్రీనివాసరావు, ఎ.సుధాకరరావు, యు.వేణుగోపాల్, కె.రాజేశ్వరరావు, వి.ఆంజనేయులు, మల్లికార్జునరావు, సీహెచ్ శోభన్‌బాబు, పి.నరసింహ, కె.జానకిరామయ్య, ఎ.వేణుగోపాలరావు, డి. కోటేశ్వరరావు, ఎం.నరేంద్రబాబు, పి.బ్రహ్మయ్య, వి.వి.రమణమూర్తి, టీఎల్ ప్రసాద్, వంశీకృష్ణ, బి.వెంకటేశ్వర్లు, పి.వెంకటేశ్వర్లు, ఉమాపతి, కె.వి.రమణయ్య, డి.శశిధర్, కె.హనుమంతరావు నాయక్, బి.సురేంద్రబాబు, జిలానీ, చైతన్య, ఆర్.డేవిడ్‌కింగ్,లక్ష్మీమాధవి, ఇందు, జి. శ్రీనివాసులు, రమణకుమార్ పాల్గొన్నారు. -
సమ్మెతో స్తంభించిన బ్యాంకులు
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: వేతన సవరణ అమలుచేయాలని కోరుతూ, సంస్కరణల పేరుతో ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు దేశవ్యాప్త ఒక రోజు సమ్మెలో భాగంగా బుధవారం జిల్లాలో బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేశారు. జిల్లావ్యాప్తంగా 300 ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ బ్యాంకుల్లో లావాదేవీలు పూర్తిగా స్థంభించాయి. ఖమ్మం నగరంలోని 38 ప్రభుత్వరంగ బ్యాంకులు పనిచేయలేదు. యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో ఖమ్మంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ జిల్లాపరిషత్ శాఖ ఎదుట ఉద్యోగులు సభ నిర్వహించారు. కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి సామినేని సుధాకర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ ఎం.చంద్రశేఖర్, ఎస్బీహెచ్ స్టాఫ్ అసోసియేషన్ నాయకుడు నర్సింగరావు మాట్లాడుతూ.. 2012 నవంబర్‌లో జరిగిన వేతన సవరణను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వ బ్యాంకులను ప్రభుత్వం ప్రయివేటీకరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు బ్యాంకులు.. విదేశీ బ్యాంకులు శాఖ లను తెరిచేందుకు అనుమతి ఇవ్వవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, శింగు నర్సింహారావు మాట్లాడుతూ.. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, విదేశీ పెట్టుబడిదారులకు ఉపయోగపడేలా పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ ఉద్యోగులను, కార్మికులను ఇబ్బందులపాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నాయని, ఈ విధానంలో ఉద్యోగ భద్రత ఉండదని అన్నారు. బ్యాంక్ ఉద్యోగులకు వేతన సవరణ వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు, బ్యాంకింగ్ ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో బుధవారం రూ.200కోట్ల మేరకు లావాదేవీలు నిలిచిపోయాయి. ఏటీఎంలు కూడా పనిచే యలేదు. సమ్మె విషయం తెలియక అనేకమంది వినియోగదారులు బ్యాంకుల వద్దకు వచ్చి తిరిగి వెళ్లారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : బ్యాంకింగ్ రంగంలో చేపడుతున్న సంస్కరణలను తక్షణం నిలిపివేయడంతో పాటు, వేతన సవరణ చేపట్టాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన ఒక రోజు సమ్మె విజయవంతమైంది. యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వగా బుధవారం జిల్లాలోనూ చేపట్టారు. సుమారు 3 వేలకు పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో బ్యాంకులు తెరుచుకోలేదు. ఇది బ్యాంకింగ్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది. కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. నిరసనలు జిల్లాలో ఎస్బీహెచ్, ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్‌తో పాటు పలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్(ఏఐబీవోఏ)తో పాటు పలు అసోసియేషన్లు సమ్మెలో పాల్గొని నిరసన తెలిపాయి. జిల్లా కేంద్రంలోని శివాజీచౌక్‌లో గల ఎస్బీహెచ్ ప్రధాన శాఖ ఎదుట వివిధ అసోసియేషన్లు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా ఏఐబీఈఏ సెంట్రల్ కమిటీ సభ్యులు ఎస్.అమరేందర్, ధర్మేందర్, ఏఐబీవోఏ సభ్యులు వెంకటేశం, మోతిలాల్ తదితరులు మాట్లాడారు. ప్రతి ఐదు సంవత్సరాలకోసారి వేతన సవరణ చేపట్టాల్సి ఉండగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2012 నవంబర్ తర్వాత వేతన సవరణ జరగాల్సి ఉన్నా ఇప్పటికీ చేపట్టకపోవడంపై మండిపడ్డారు. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, కార్పొరేట్‌కు లెసైన్స్ ఇవ్వడం, కొత్తగా చేపడుతున్న సంస్కరణలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌బీహెచ్‌ను ఎస్బీఐలో విలీనం చేయాలనే చర్యలను విడనాడాలని స్పష్టం చేశారు. కాగా సమ్మె విషయం తెలియక పలువురు వినియోగదారులు బ్యాంకులకు వచ్చి వెనుదిరగడం కనిపించింది. -
ప్రభుత్వరంగ బ్యాంకుల సమ్మె యోచన విరమణ
ఖాతాదారులకు శుభవార్త.. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ బుధవారం సాధారణంగానే పనిచేస్తాయి. ఈ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు తాము తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు. బ్యాంకులను విలీనం చేయాలన్న ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో వారు సమ్మె విరమించుకున్నారు. ప్రధాన లేబర్ కమిషనర్ వద్ద ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు, భారతీయ బ్యాంకుల ఉద్యోగుల సంఘం నాయకుల మధ్య జరిగిన సమావేశంలో.. సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేయాలన్న యోచన ఏదీ ప్రస్తుతానికి లేదన్న హామీని ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు ఇచ్చారని, రెండు యూనియన్ల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని ఆయన చెప్పారు. దాంతో సమ్మె యోచనను విరమించుకున్నామన్నారు.