![5 day work week for banks approved by IBA - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/03/9/banks2.jpg.webp?itok=5Rp918Wl)
ఉద్యోగులకు శుభవార్త. త్వరలో బ్యాంకుల్లో వారానికి ఐదురోజు పనిదినాలు ప్రారంభం కానున్నాయి. కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కొత్త పనిదినాలు అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం, బ్యాంకులు నెలలో మొదటి, మూడవ శనివారాలు పని చేస్తాయి. రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలు. అయితే కేంద్రం నోటిఫికేషన్ విడుదలతో బ్యాంక్ ఉద్యోగులు త్వరలో వారానికి ఐదురోజుల మాత్రమే పనిచేసే వెసలు బాటు కలగనుంది. అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు బ్యాంకులు పనిచేయగా.. శని, ఆదివారాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.
ఈ తరుణంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఓ పత్రికా ప్రకటనలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ మధ్య చర్చలు విజయవంతంగా ముగిశాయని, జాయింట్ నోట్‌పై సంతకం చేయడంతో చర్చలు సఫలమైనట్లు పేర్కొంది. ప్రభుత్వ నోటిఫికేషన్ పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం నోటిఫికేషన్ తర్వాత సవరించిన పని గంటలు అమలులోకి రానున్నాయి.
కొత్త బ్యాంక్ పనివేళలు ఎలా ఉండబోతున్నాయ్
ఐదురోజుల పనిదినాల్లో అమల్లోకి వచ్చిన వెంటనే బ్యాంక్ పనివేళలు ఎలా ఉండనున్నాయనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంటుంది. పలు నివేదికల ప్రకారం ఉద్యోగులు ఉదయం 9:45 బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమై సాయంత్రం 5:30 వరకు కొనసాగనున్నాయి. తద్వారా బ్యాంక్ ఉద్యోగులు రోజుకు 40 నిమిషాలు అదనంగా పనిచేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment