salary hike
-
తెలంగాణలో హోంగార్డుల జీతాల పెంపు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోంగార్డుల జీతాలను పెంచుతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్) లోగోని, సంబంధిత వాహనాలను, బోట్లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘డిసెంబర్ 6 హోంగార్డ్స్ రైజింగ్ డే. ఈ సందర్బంగా వారికి ఒక శుభ వార్త చెబుతున్నాం. హోమ్ గార్డుల రోజు వేతనాన్ని రూ.921 నుంచి రూ.1000కి, వీక్లీ పరేడ్ అలవెన్స్‌ను నెలకు రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నాం. హోమ్ గార్డ్స్ దురదృష్టవశాత్తు సహజమరణం పొందినా, ప్రమాదంలో మరణించినా రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తూ నిర్ణయం తీసుకుంటున్నాం’ అని అన్నారు. కాగా, హెంగార్డులకు పెంచిన జీతాలు, ఇతర సదుపాయాలు జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. -
ఐటీ కంపెనీల కంటే 20 శాతం అధిక వేతనం
దేశీయ సాంకేతిక రంగాన్ని ప్రభావితం చేస్తున్న గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీ) టైర్-2 నగరాలకు విస్తరిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో పనిచేయాలనుకునే ప్రతిభ ఉన్న అభ్యర్థులకు భారీ వేతనాలు ఇస్తున్నట్లు టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక తెలిపింది. జీసీసీలు సంప్రదాయ ఐటీ, నాన్-టెక్ కంపెనీలతో పోలిస్తే 12 నుంచి 20 శాతం ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నట్లు పేర్కొంది.టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం.. దేశంలో 1,600 జీసీసీలున్నాయి. వీటిలో 16.6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలు ప్రధానంగా జనరేటివ్ ఏఐ, ఏఐ/ ఎంఎల్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్.. వంటి టెక్నాలజీలపై దృష్టి సారిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వల్ల 2025 నాటికి జీసీసీల సంఖ్య 1,900కు చేరనుంది. దాంతో 20 లక్షల మంది ఈ విభాగంలో ఉపాధి పొందుతారు. వచ్చే ఏడాది నాటికి భారతీయ టెక్ పరిశ్రమలో ఏఐ, ఎంఎల్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీల్లో సుమారు రూ.29 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో దీని వాటా రూ.21 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: విభిన్న రంగాల్లో ఏఐ ఆధారిత స్టార్టప్లుఈ సందర్భంగా టీమ్‌లీజ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ విజ్ మాట్లాడుతూ..‘సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్, సైబర్‌సెక్యూరిటీ, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, డేటా మేనేజ్మెంట్, అనలిటిక్స్, క్లౌడ్ సొల్యూషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్.. వంటి కీలకమైన ఫంక్షనల్ రంగాల్లో 15,000 ఉద్యోగాలు కల్పనకు అవకాశం ఉంది. బెంగళూరు, గుర్గావ్, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాల్లో టెక్ ఉద్యోగాలకు అధిక వేతనాలు అందిస్తున్నారు. జైపూర్, ఇందోర్, కోయంబత్తూర్ వంటి టైర్-2 నగరాలు రాబోయే రోజుల్లో జీసీసీలు, డేటా సెంటర్లకు హబ్‌లుగా మారబోతున్నాయి. ఈ కేంద్రాల్లోని ఉద్యోగులకు సంప్రదాయ ఐటీ జీతాల కంటే 12% నుంచి 20% వరకు ఎక్కువ వేతనం చెల్లిస్తారు’ అని తెలిపారు. -
అవాక్కయ్యేలా ఐటీ కంపెనీ శాలరీ హైక్!
ఫ్రెషర్లకు అతి తక్కువ జీతాల ప్యాకేజీలను అందించినందుకు విమర్శలు ఎదుర్కొంటున్న ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ వేతనాల పెంపులోనూ అలాంటి ధోరణినే అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ఉద్యోగులకు వార్షిక జీతాల పెంపును అత్యల్పంగా కేవలం 1% మాత్రమే అందించినట్లు నివేదికలు వెల్లడించాయి.ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ నాలుగు నెలల ఆలస్యంగా జీతాల పెంపును ప్రారంభించింది. జీతాల పెంపు 1% నుంచి 5% వరకు ఉంటుంది. "3 రేటింగ్ ఉన్నవారు 1-3%, 4 రేటింగ్ ఉన్న ఉద్యోగులు 4%, 5 రేటింగ్ పొందిన వారు 4.5% నుంచి 5% వేతన పెంపు అందుకున్నారు" అని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఈ అమెరికన్ ఐటీ కంపెనీ గత సంవత్సరం ఏప్రిల్‌లో ఉద్యోగులకు 7 శాతం నుంచి 11 శాతం వరకు వేతనాలు పెంచింది. భారత్‌లో ఈ కంపెనీకి సుమారుగా 254,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇది దాని మొత్తం శ్రామికశక్తిలో 70 శాతం. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 8,100 క్షీణించింది. దీనితో ఉద్యోగుల సంఖ్య 336,300కి తగ్గింది. -
కోటీశ్వరుల్ని చేస్తున్న కంపెనీ!.. భారీగా పెరిగిన వేతనాలు
ఇండియా టొబాకో లిమిటెడ్ కంపెనీ (ITC) తన ఉద్యోగులను కోటీశ్వరులను చేస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు కోట్లలో వేతనాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మరో 62 మంది ఉద్యోగులు ఈ జాబితాలోకి చేరారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 24 శాతం ఎక్కువని తెలుస్తోంది.ప్రస్తుతం కంపెనీలో 350 కంటే ఎక్కువ మంది కోటి రూపాయల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నారు. 2022-23లో రూ. కోటి కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నవారి సంఖ్య 282 మంది మాత్రమే. కంపెనీలో రూ. కోటి కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నవారు నెలకు రూ.9 లక్షల కంటే ఎక్కువ శాలరీ తీసుకుంటున్నట్లు సమాచారం.ఐటీసీ కంపెనీలో చైర్మన్ అండ్ ఎండీ సంజీవ్ వేతనం 49.6 శాతం పెరిగింది. దీంతో ఈయన జీతము రూ. 28.62 కోట్లకు చేరింది. శాలరీ పెరుగుదలకు ముందు (గత ఏడాది) ఈయన వేతనం రూ. 19.12 కోట్లుగా ఉండేది.ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీ సుమంత్ వేతనం 52.4 శాతం పెరిగింది. దీంతో ఈయన వేతనం రూ. 13.6 కోట్లకు చేరింది. ఈడీలు సుప్రతిమ్ దత్తా, హేమంత్ మాలిక్ జీతాలు కూడా వరుసగా 59 శాతం, 30 శాతం పెరిగాయి. 2024 మార్చి 31 నాటికి కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 24,567గా ఉంది. -
ప్రముఖ కంపెనీలో మొదటిసారి కార్మికుల సమ్మె
ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రానిక్ కంపెనీ, దక్షిణ కొరియా ప్రధాన కేంద్రంగా ఉన్న శామ్సంగ్లో ఉద్యోగులు మునుపెన్నడూ లేనివిధంగా నిరసనకు దిగారు. కార్మికులు మొదటిసారి శుక్రవారం సమ్మె ప్రారంభించారు. సౌత్కొరియాలోని సియోల్‌లో ఉన్న శామ్సంగ్ ప్రధాన కార్యాలయం ముందు కంపెనీ చిప్ డివిజన్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు లౌడ్ స్పీకర్లలో నిరసన పాటలు ప్లే చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.శామ్సంగ్ కంపెనీలో గతంలో ఎప్పుడూ ఇలాంటి సమ్మెలు సాగలేదు. ఇదే మొదటిసారి. వేతనాల పెంపు, బోనస్‌లపై పలుసార్లు కంపెనీ యాజమాన్యంతో చర్చించామని సమ్మె నిర్వాహకులు చెప్పారు. కార్మికుల డిమాండ్లపై కంపెనీ స్పందించకపోవడంతో ఆందోళన ప్రారంభించినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు.ఈ సందర్భంగా సౌత్‌కొరియా నేషన్వైడ్ శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ లీ హ్యూన్ కుక్ మాట్లాడుతూ..‘కార్మికులు, కంపెనీకి మధ్య సంధానకర్తగా ఉన్న యూనియన్‌కు యాజమాన్యం విలువ ఇవ్వట్లేదు. కంపెనీలో ఉన్న ఐదు లేబర్ గ్రూపుల్లో యూనియన్ అతిపెద్దది. ఇందులో 28,000 మంది సభ్యులున్నారు. శామ్సంగ్ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో ఐదో వంతుకు యూనియన్ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇందులోని దాదాపు 75 శాతం మంది ఏప్రిల్‌లో సమ్మెకు అనుకూలంగా ఓటు వేశారు. వేతనాల పెంపు, బోనస్‌లపై కంపెనీ యాజమాన్యంతో పలుమార్లు చర్చించాం. కానీ ఆ చర్చలు విఫలమయ్యాయి. యూనియన్ డిమాండ్లను అధికారులు వెంటనే పరిష్కరించాలి’ అన్నారు.ఇదీ చదవండి: డబ్ల్యూఈఎఫ్ జాబితాలో భారత కంపెనీలకు చోటుయూనియన్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధి ఒకరు న్యూయార్క్ టైమ్స్‌తో తెలిపారు. చిప్ తయారీ మార్కెట్లో కంపెనీ ఏటా తన లక్ష్యాలను చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. నిత్యం పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే కంపెనీలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం ఆందోళన కలిగించే విషయమంటున్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో చిప్ విభాగం నుంచి కంపెనీకి సుమారు 1.4 బిలియన్ డాలర్ల(రూ.11వేలకోట్లు) లాభం చేకూరినట్లు నివేదికల ద్వారా తెలిసింది. -
ఆ ఉద్యోగులకు శుభవార్త.. జీతాల పెంపు, రూ.1.8 లక్షల బోనస్ కూడా
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఇటీవల పెద్ద ఎత్తున విమానాలను రద్దు చేసి వివాదాస్పదంగా మారింది. ఎక్కువ సంఖ్య విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదురుకున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి చెక్కబడింది. సంస్థ తమ ఉద్యోగులకు భారీ మొత్తంలో జీతాలు పెంచడమే కాకుండా బోనస్ కూడా ప్రకటించింది.2024 మే 23న పైలెట్ల జీతాలు రూ. 15000 పెంచారు. దీంతో పాటు బోనస్ రూ.1.8 లక్షల వరకు ఇస్తున్నట్లు ప్రకటించారు. సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం.. ఫస్ట్ ఆఫీసర్ నుంచి సీనియర్ కమాండర్ వరకు నెల జీతాలను రూ. 5000 నుంచి రూ. 15000 వరకు పెంచినట్లు వెల్లడించారు. అయితే జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు జీతాల పెంపు లేదు. అయితే వీరికి బోనస్ కింద రూ. 42000 నుంచి రూ. 1.8 లక్షల వరకు ఇవ్వనున్నట్లు సమాచారం.ఫస్ట్ ఆఫీసర్, కెప్టెన్ రూ. 60000 బోనస్ అందుకోగా, కమాండర్, సీనియర్ కమాండర్లు వరుసగా 1.32 లక్షలు & 1.80 లక్షల బోనస్‌లను పొందనున్నారు. అంతే కాకుండా గ్రౌండ్ అండ్ సిమ్యులేటర్ శిక్షణలో జరిగిన ఆలస్యానికి పరిహారం కూడా అందించనున్నట్లు సంస్థ పేర్కొంది. సాలరీ హైక్, బోనస్ వంటివి జూన్ నెల జీతంతో కలిపి ఇచ్చే అవకాశం ఉంది. -
జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. ఉక్కిరి బిక్కిరవుతున్న ఉద్యోగులు
ప్రపంచ జాబ్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ధోరణులు పుట్టుకు రావడం సర్వసాధారణంగా మారింది. కోవిడ్-19 సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆ తర్వాత మూన్‌లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ పేరుతో జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండే నడిచింది. అవేవి చాలవన్నట్లు తాజాగా ‘డ్రై ప్రమోషన్’ అనే కొత్త పదం తెరపైకి వచ్చింది. కోవిడ్-19 తర్వాత జాబ్ మార్కెట్లు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి బడా బడా టెక్ కంపెనీల వరకు ప్రాజెక్ట్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఖర్చు విషయంలో కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. లేఆఫ్స్, రిమోట్ వర్క్, కృత్తిమ మేధ వినియోగం పేరుతో పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. డ్రై ప్రమోషన్ పేరుతో ఇప్పుడు ఉద్యోగుల జీతాల విషయంలో డ్రై ప్రమోషన్ విధానాన్ని అవలంభిస్తున్నాయి. కంపెనీలు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తాయి. అందుకు తగ్గట్లుగా జీతాల్ని పెంచవు. బరువు, బాధ్యతల్ని పెంచుతాయి. ఇప్పుడు దీన్ని డ్రై ప్రమోషన్ అని పిలుస్తున్నారు. 900 కంపెనీల్లో జరిపిన సర్వేలో ప్రముఖ కాంపన్సేషన్ కన్సల్టెన్సీ సంస్థ పర్ల్ మేయర్ డ్రై ప్రమోషన్‌పై ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. దాదాపు 13 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు వేతన పెంపులేని ప్రమోషన్లు ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. 2018లో ఈ సంఖ్య 8శాతం మాత్రమే అని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. మరో కన్సల్టెన్సీ సంస్థ మెర్సెర్ అనే సంస్థ 900 కంపెనీలపై జరిపిన సర్వేలో 2023తో పోలిస్తే 2024లో ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగులకు జీతం పెంచకుండా ప్రమోషన్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. లేఆఫ్స్ ఆపై ప్రమోషన్లు అంతకుముందు, ఉద్యోగుల కొరతను ఎదుర్కొన్న కంపెనీలు వారిని నిలుపుకునేందుకు భారీగా వేతనాలు పెంచింది. అదే సమయంలో ఉద్యోగాల్ని తొలగించింది. వారి స్థానంలో కొత్త ఉద్యోగుల్ని తీసుకోకుండా.. ఉన్న వారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రమోషన్ పేరుతో కొత్త ట్రెండ్‌కు తెరతీశాయి ఆయా సంస్థలు కంపెనీలకు వరమేనా? ఈ విధానంపై ఉద్యోగులు డైలామాలో ఉన్నారు. ఓ వర్గం ఉద్యోగులు ప్రమోషన్ తీసుకుని మరో సంస్థలో చేరితే అధిక వేతనం, ప్రమోషన్లో మరో అడుగు ముందుకు పడుతుందని భావిస్తుండగా.. రేయింబవుళ్లు ఆఫీస్‌కే పరిమితమై కష్టపడ్డ తమకు తగిన ప్రతిఫలం లేకపోవడం ఏంటని మరో వర్గం ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. మొత్తానికి డ్రై ప్రమోషన్ విధానం కంపెనీలకు ఓ వరంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నవారు లేకపోలేదు. -
ఉద్యోగులకు భారీగా వేతనపెంపు.. ఎంతంటే..
కంపెనీల్లో ఉన్నతస్థాయి ఉద్యోగులకు 2024-25 ఏడాదికిగాను భారీగా వేతనాలు పెంపు ఉండనుందని మైఖేల్ పేజ్ ఇండియా శాలరీ గైడ్ 2024 నివేదిక ద్వారా తెలిసింది. సగటున దాదాపు 20 శాతం మేర వార్షిక వేతనాలు పెరుగుతాయని నివేదికలో తెలిపారు. ఫైనాన్స్-అకౌంటింగ్, ఆరోగ్య సంరక్షణ లైఫ్‌సైన్సెస్, బీఎఫ్ఎస్ఐ, ఇంజినీరింగ్ తయారీ, మానవ వనరులు, లీగల్, టెక్నాలజీ తదితర రంగాల్లోని కంపెనీలు, ఉద్యోగులపై చేసిన సర్వే ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. నివేదికలో ప్రధాన అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. తయారీ రంగాల్లోని పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మరింత డిమాండ్ పెరిగింది. టెక్నాలజీ ఆధారిత కంపెనీల్లో నైపుణ్యాలు పెంచుకుంటే ఉన్నత ఉద్యోగాలు అందుతున్నాయి. డేటా అనలిటిక్స్, జనరేటివ్ ఏఐ, మెషీన్ లెర్నింగ్, ఎల్ఎల్ఎం వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న వృత్తినిపుణులకు మరింత డిమాండ్ ఉండనుంది. ఆర్బీఐతోపాటు ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు భారత వృద్ధిరేటుపై సానుకూలంగా స్పందిస్తున్నాయి. అందులో భాగంగా భారత జీడీపీ వృద్ధి స్థిరంగా 6 శాతంపైనే నమోదవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. దాంతో ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితులను తట్టుకుని భారత్ వృద్ధిబాట పడుతుందని నివేదికలో తెలిపారు. ఐటీ కంపెనీలు ఉద్యోగుల శాలరీ పెంపు విషయాన్ని సమీక్షిస్తున్నాయి. టెకీలకు సరాసరి 8-10 శాతం వేతనపెంపు ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఐటీ రంగంలో జూనియర్ ఉద్యోగులకు 35-45 శాతం, వారిపై ఉద్యోగులకు 30-40 శాతం, మేనేజ్మెంట్ స్థాయిలోని సీనియర్లకు 20-30 శాతం వేతన పెంపు ఉండొచ్చని నివేదిక ద్వారా తెలిసింది. -
ఉద్యోగుల జీతాల పెంపునకు టీసీఎస్ ఎస్?
-
ఉద్యోగుల జీతాల పెంపునకు టీసీఎస్ ఎస్?
టెక్ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నా..నిబంధనల ప్రకారం ఉన్నవారికి మాత్రం వేతనాలు పెంచేపనిలో పడ్డాయి. మార్చితో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని కంపెనీలు వేతనపెంపునకు సంబంధించి నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల వేతనాలు పెంచనున్నట్లు తెలిసింది. టీసీఎస్ తన ఆఫ్‌సైట్ ఉద్యోగులకు సగటున 7 నుంచి 8 శాతం.. ఆన్సైట్ ఉద్యోగులకు 2-4 శాతం పెంచే యోచనలో ఉందని మీడియా కథనాల ద్వారా తెలిసింది. నైపుణ్యాలను మెరుగుపరుచుకొని పనితీరు కనబరిచిన వారికి ఏకంగా 12-15 శాతం వరకు జీతం పెంచనున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: ప్రాజెక్టుల ఏర్పాటుకు లంచం.. స్పందించిన అదానీ గ్రూప్ త్వరలో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో టీసీఎస్ ఉద్యోగుల వేతన పెంపు ప్రక్రియ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుందని తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి వేతన పెంపు అమల్లోకి వస్తుందని సమాచారం. ఇదిలా ఉండగా, భారీ వేతనాలు తీసుకుంటున్న వారి ఖర్చులు, పదోన్నతుల అంశాన్ని ఇంకా కంపెనీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నైపుణ్యాలను మెరుగుపర్చుకున్న ఉద్యోగులకు గతేడాదే టీసీఎస్ 12-15 శాతం వరకు సగటు ఇంక్రిమెంట్‌ను ఇచ్చింది. దాంతోపాటు ప్రమోషన్లను అందించింది. మరోవైపు ఉద్యోగుల సంఖ్యను మాత్రం తగ్గించుకుంది. -
ఉద్యోగులకు బంపరాఫర్, జీతం ఎంత పెరగనుందంటే?
ఆర్ధిక మాంద్యం భయాలు. ప్రాజెక్ట్‌ల కొరత, అవధుల్లేని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం, వరుస లేఆఫ్స్, వేతనాల కోతల వంటి సంస్థలు వరుస నిర్ణయాలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ‘డెలాయిట్ ఇండియా టాలెంట్ ఔట్లుక్ 2024’ నివేదిక ప్రకారం..ఆయా కంపెనీల్లో పని చేస్తున్న కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లకు 9 శాతం శాలరీ పెరుగుతుందని అంచనా వేసింది. ఐటీ, బీపీఓలు మినహా అన్ని రంగాలలో కోవిడ్‌కు ముందు స్థాయిల కంటే మెరుగుగానే జీతాల పెంపు ఉంటుందని తెలిపింది. అయితే, ఈ అంచనా 2023లో వేసిన 9.2శాతం కంటే కొంచెం తక్కువగా ఉంది. కంపెనీలు జూనియర్ మేనేజ్మెంట్కు గణనీయమైన ఇంక్రిమెంట్లను అందించే అవకాశం ఉండగా.. ఉద్యోగుల పనితీరు ఆధారంగా వేతనాల చెల్లింపు ఉండనుంది. ఇంక్రిమెంట్లు డెలాయిట్ ఇండియా శాలరీ నివేదిక ప్రకారం.. టాప్ పెర్ఫార్మర్లు సగటు రేటెడ్ ఉద్యోగులకు చెల్లించే ఇంక్రిమెంట్ల కంటే 1.8 రెట్లు ఎక్కువ పొందే అవకాశం ఉంది. 2023లో 0.6 రెట్లుతో పోలిస్తే ఈ సంవత్సరం తక్కువ రేటింగ్ ఉన్న ఉద్యోగులు 0.4 రెట్లు పెరగనున్నారు. బోనస్‌లు 2024లో దాదాపు సగం కంపెనీలు తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలకు మించి అదనంగా బోనస్‌లు ఇవ్వనున్నట్లు డెలాయిట్ ఇండియా నివేదిక హైలెట్చేస్తోంది. ప్రతిభ గల ఉద్యోగుల్ని నిలుపుకునేందుకు సంస్థలు 7.5శాతంతో ప్రమోషన్ల పెంపును కొనసాగించాలని కూడా భావిస్తున్నట్లు వెల్లడించింది. పదోన్నతులు నివేదిక ప్రకారం, పదోన్నతులు పొందగలరని అంచనా వేసిన ఉద్యోగుల శాతం 2023లో 12.3శాతం నుండి తగ్గింది. -
ఎల్ఐసీ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా వేతన పెంపు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 2022 నుంచి ప్రాథమిక వేతనాలను 16 శాతం పెంచనున్నట్లు ప్రభుత్వం ఆమోదించింది. ఈ తాజా నిర్ణయంతో ఎల్ఐసీ ఉద్యోగులు గత రెండేళ్లుగా ఉన్న బకాయిలు పొందనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆమోదం తెలిపిన ప్రాథమిక వేతనం పెంపుతోపాటు అలవెన్సులతో కలిపి మొత్తం 22 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ వేతన పెంపుతో 1.10 లక్షల మందికి పైగా ఉద్యోగులు, 30,000 మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఇదీ చదవండి: 180 ఉద్యోగాలను తొలగించిన ప్రముఖ విమానయాన సంస్థ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎల్ఐసీకి వార్షికంగా రూ.4,000 కోట్లకు పైగా ఆర్థిక భారం పడనున్నట్లు అంచనా. పెంపు తర్వాత ఎల్ఐసీ వేతన బిల్లు రూ.29,000 కోట్లకు చేరుతుందని తెలిసింది. 2010 ఏప్రిల్ తర్వాత సంస్థలో చేరిన దాదాపు 24,000 మంది ఉద్యోగుల ఎన్పీఎస్ వాటాను 10% నుంచి 14 శాతానికి పెంచారు. -
బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై వారానికి 5 రోజులే పని!
ఉద్యోగులకు శుభవార్త. త్వరలో బ్యాంకుల్లో వారానికి ఐదురోజు పనిదినాలు ప్రారంభం కానున్నాయి. కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కొత్త పనిదినాలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం, బ్యాంకులు నెలలో మొదటి, మూడవ శనివారాలు పని చేస్తాయి. రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలు. అయితే కేంద్రం నోటిఫికేషన్ విడుదలతో బ్యాంక్ ఉద్యోగులు త్వరలో వారానికి ఐదురోజుల మాత్రమే పనిచేసే వెసలు బాటు కలగనుంది. అంటే సోమవారం నుండి శుక్రవారం వరకు బ్యాంకులు పనిచేయగా.. శని, ఆదివారాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ తరుణంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఓ పత్రికా ప్రకటనలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ మధ్య చర్చలు విజయవంతంగా ముగిశాయని, జాయింట్ నోట్‌పై సంతకం చేయడంతో చర్చలు సఫలమైనట్లు పేర్కొంది. ప్రభుత్వ నోటిఫికేషన్ పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం నోటిఫికేషన్ తర్వాత సవరించిన పని గంటలు అమలులోకి రానున్నాయి. కొత్త బ్యాంక్ పనివేళలు ఎలా ఉండబోతున్నాయ్ ఐదురోజుల పనిదినాల్లో అమల్లోకి వచ్చిన వెంటనే బ్యాంక్ పనివేళలు ఎలా ఉండనున్నాయనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంటుంది. పలు నివేదికల ప్రకారం ఉద్యోగులు ఉదయం 9:45 బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమై సాయంత్రం 5:30 వరకు కొనసాగనున్నాయి. తద్వారా బ్యాంక్ ఉద్యోగులు రోజుకు 40 నిమిషాలు అదనంగా పనిచేయనున్నారు. -
విప్రో ఈ ఏడాది వేరియబుల్ పే ఎంతంటే...??
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం విప్రో ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.రెండు త్రైమాసికంలో (క్యూ1,క్యూ2) సిబ్బందికి 80 శాతం వేరియబుల్ పే చెల్లించగా.. మూడో త్రైమాసికంలో (క్యూ3) సమయానికి ఆ మొత్తాన్ని పెంచి 85 శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఆర్ధిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికంలో విప్రో సంస్థ ఉద్యోగులకు వేరియబుల్పే 80 శాతం, 81 శాతం చెల్లించింది. అదే సంస్థకు చెందిన క్లౌడ్ విభాగం ‘విప్రో ఫుల్ స్ట్రైడ్ క్లౌడ్’ నివేదిక ఆధారంగా.. విప్రో క్యూ3లో గడించిన ఆదాయం ప్రాతిపదికన 80వేల మంది ఉద్యోగులకు సగటున ఒక్కొక్కరికి వేరియబుల్ పే 100శాతం అందిచగా..డిసెంబర్ క్యూ4లో 89.74శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు విప్రో మెయిల్ వేరియబుల్ పే చెల్లింపులు ఎలా ఉంటాయనే అంశంపై విప్రో సంస్థ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్ పంపింది. అందులో రెవెన్యూ (40శాతం), గ్రాస్ మార్జిన్ (30శాతం), మొత్తం కాంట్రాక్ట్ వ్యాల్యూ (30శాతం) ఆధారంగా ఉంటుందని స్పష్టం చేసింది. శాలరీ పెంచింది విప్రోలో కాస్ట్, ఖర్చులను తీసివేయగా వచ్చే ఆదాయం పరంగా ఉద్యోగులకు శాలరీ చెల్లింపులు ఉంటాయి.అయితే ఈ ఆదాయాలు క్యూ2, క్యూ3లో ఆశించిన మేర లేకపోవడంతో విప్రో యాజమాన్యం ఉద్యోగుల జీతాల పెంపును తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత మార్కెట్లో డిమాండ్, పెరిగిన ఆదాయంతో కొద్ది నెలల తర్వాత విప్రో ఉద్యోగుల వేతనాన్ని ఏడాదికి 6-8 శాతం పెంచింది. ఈ పెరిగిన జీతం డిసెంబర్1,2023 నుంచి అమల్లోకి వచ్చింది. వేరియబుల్ పే అంటే ఏమిటి? అభివృద్ధి, సాధించిన విజయాలకు అనుగుణంగా ఆయా సంస్థలు ఉద్యోగులకు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి వేరియబుల్ పేని చెల్లిస్తుంటాయి. వేరియబుల్ పే ‘పెర్ఫార్మెన్స్-లింక్డ్ పే’గా ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణంగా కాంట్రిబ్యూషన్, బోనస్ లేదా కమీషన్ రూపంలో చెల్లిస్తాయి సంస్థలు -
బ్యాంక్ ఉద్యోగులకు తొందరలోనే రెండు శుభవార్తలు!
బ్యాంక్ ఉద్యోగులకు 2024 సంవత్సరం సంతోషకరమైన సంవత్సరం కావచ్చు. తొందరలోనే రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ తన సమ్మతిస్తే జూన్ నాటికి బ్యాంకు ఉద్యోగులకు 5 పని దినాల విధానం అమల్లోకి రావచ్చు. అలాగే జీతాల పెంపును కూడా పొందవచ్చు. బ్యాంక్ ఉద్యోగుల సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, బ్యాంకింగ్ రంగానికి వారానికి ఐదు రోజుల పనిని సిఫార్సు చేస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. ప్రస్తుతం ఆదివారాలు, షెడ్యూల్డ్ సెలవులు అదనంగా ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకులకు సెలవులు ఇస్తున్నారు. ఐదు రోజుల పని విధానం మొత్తం బ్యాంకింగ్ ఖర్చులను తగ్గించదని, కస్టమర్లకు బ్యాంకింగ్ అవర్స్‌లోగానీ, ఉద్యోగులకు మొత్తం పని గంటలలో గానీ తగ్గింపు ఉండదని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తన ప్రతిపాదనలో హామీ ఇచ్చింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో కుదిరిన ఒప్పందం ద్వారా ఈ ప్రతిపాదన చేసింది. ఈ విషయాన్ని సానుకూలంగా సమీక్షించాలని, తదనుగుణంగా ముందుకు సాగేలా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ను ఆదేశించాలని అసోసియేషన్ ఆర్థిక మంత్రిని అభ్యర్థించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్‌ఐసీలలో ఐదు రోజుల పని విధానం ఇప్పటికే ఆచరణలో ఉందని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ గుర్తు చేసింది. జీతాల పెంపు గత సంవత్సరం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీ యూనియన్ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MOU) ఫలితంగా దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 17 శాతం వేతనాల పెంపుదలకు రూ. 12,449 కోట్లకు ఒప్పందం కుదిరింది. ఈ పథకానికి ఆమోదం లభిస్తే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోని 3.8 లక్షల మంది అధికారులతో సహా దాదాపు తొమ్మిది లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి కలుగుతుంది. -
ఈ ఏడాది శాలరీ హైక్.. వారికే ఎక్కువ!.. సర్వే
2024 ప్రారంభమైనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవా సంస్థ 'ఎయాన్' (Aon) సర్వే మాత్రం ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ ఓ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భారతీయ ఉద్యోగుల సగటు జీతం 9.5 శాతం పెరిగే అవకాశం ఉందని సర్వే ద్వారా ఎయాన్ వెల్లడించింది. ఇది 2023 కంపెనీలు అందించిన జీతాల పెంపు కంటే (2023 జీతాల పెంపు 9.7 శాతం) కొంత తక్కువగా ఉందని స్పష్టం చేసింది. ఈ సర్వే కోసం ఎయాన్ సుమారు 45 రంగాలకు చెందిన 1414 కంపెనీల డేటా విశ్లేషించింది. ఇందులో తయారీ రంగం 10.1 శాతం జీతాల పెంపుతో ముందు వరుసలో ఉన్నట్లు, ఆర్థిక సంస్థలు, లైఫ్ సైన్సెస్ రంగాలు 9.9 శాతం జీతాల పెంపుతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు అంచనా వేసింది. ఈ కామర్స్ సంస్థలు సగటున 9.2 శాతం పెంపును ఇచ్చే అవకాశం ఉంది. ఇక FMCG, కన్స్యూమర్ డ్యూరబుల్ ప్లేయర్స్ జీతాలను 9.6 శాతం, రిటైల్ రంగంలో 8.4 శాతం పెంచే అవకాశం ఉందని సమాచారం. ప్రొఫెషనల్ సర్వీసెస్ అండ్ కెమికల్స్ రంగాల జీతాల పెంపు 9.7 శాతంగా అంచనా. టెక్నాలజీ ప్లాట్‌ఫామ్, ఉత్పత్తుల రంగం జీతాలను 9.5 శాతం పెంచే అవకాశం ఉంది. ఈ సమయంలో టెక్ కన్సల్టింగ్ విభాగంలో ఉద్యోగుల వేతనాలు 8.2 శాతం మాత్రమే పెరిగే అవకాశం ఉంది. భారతదేశంలో మొత్తం అట్రిషన్ రేట్లు 2022లో 21.4 శాతం నుంచి 2023లో 18.7 శాతానికి పడిపోయినట్లు సర్వేలో తెలిసింది. 2023లో కొన్ని సంస్థలు కొంత అనిశ్చితి వాతావరణం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్ర్రాభం నుంచి కంపెనీల పురోగతి కొత్త కొత్త వ్యూహాలను రచిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల జీతాలు గత ఏడాది కంటే మెరుగ్గా ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. ఇదీ చదవండి: నేనింకా అప్డేట్ కాలేదేమో! ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్.. జీతాల పెంపు విషయంలో భారత్ అగ్రగామిగా నిలువగా.. బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది బంగ్లాదేశ్, ఇండోనేషియా దేశాల్లో జీతాలు పెంపు 7.3 శాతం, 6.5 శాతంగా ఉండనున్నట్లు సమాచారం. -
ఎస్బీఐ గుడ్‌న్యూస్: భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు!
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ (SBI ) తమ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. జీతాలు, పెన్షన్ల పెంపునకు సంబంధించి ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా కీలక విషయం వెల్లడించారు. ఇందుకోసం నిధులను సైతం కేటాయించినట్లు చెప్పారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ పెంపుదల కోసం కేటాయింపులు పెరగడం బ్యాంక్ రెండవ త్రైమాసిక నికర లాభంపై ప్రభావం చూపిందని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. ఉద్యోగుల జీతాలు 14 శాతం మేర పెంచాలని భావించిన ఎస్బీఐ అందుకు అనుగుణంగా నిధులను సైతం పక్కనపెట్టి ఉంచింది. 2022 నవంబర్ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉన్న వేతన సవరణ కోసం ఇప్పటివరకు రూ. 8,900 కోట్లను కేటాయించినట్లు ముంబైలో ఎస్బీఐ రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో దినేష్ ఖారా వెల్లడించారు. "ఈ కేటాయింపుల వల్ల రెండో త్రైమాసికంలో ఎస్బీఐ లాభాలు కొంచెం తగ్గాయి. ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఊపందుకుని 16 శాతం నుంచి 17 శాతం వరకు కొనసాగుతుందని భావిస్తున్నాం. దేశీయ డిమాండ్ బలంగా ఉంది. పండుగ వ్యయాల నేపథ్యంలో ఇది మరింత పెరుగుతుంది" అని ఖారా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి ఎస్బీఐ నికర లాభం 8 శాతం పెరిగి రూ.14,330 కోట్లకు చేరుకుంది. 16 శాతంతో రిటైల్ రుణాల వృద్ధి.. 7 శాతంగా ఉన్న కార్పొరేట్ రుణ వృద్ధిని అధిగమించింది. అయితే కంపెనీలు నెమ్మదిగా రుణాలను పొందుతున్నాయని, రూ. 4.77 లక్షల కోట్ల రుణాలు వివిధ దశల్లో ఉన్నాయని దినేష్ ఖారా వివరించారు. "బ్యాంకుకు రూ. 3.20 లక్షల కోట్ల అన్సెక్యూర్డ్ రుణాలు ఉన్నాయి. వీటిలో 86 శాతం సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్న కస్టమర్లకే ఇచ్చాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని ఆయన చెప్పారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవలి ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీల అసురక్షిత రుణ వృద్ధి పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. -
వచ్చే ఏడాది ఈ రంగాల్లో 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్..
2024లో భారతీయ ఉద్యోగుల జీతాలు పెరగనున్నట్లు 'డబ్ల్యుటీడబ్ల్యు శాలరీ బడ్జెట్ ప్లానింగ్ రిపోర్ట్' (WTW Salary Budget Planning Report) వెల్లడించింది. వచ్చే ఏడాది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అధికంగా జీతాల పెంపు భారతదేశంలోనే జరగబోతోందని కూడా నివేదికలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ ఉద్యోగుల జీతం 2024లో 9.8 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ 2024లో భారతీయ కంపెనీలు ఉద్యోగుల జీతాలను పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. భారతీయ సంస్థలు టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తున్న క్రమంలో, ఉద్యోగుల ప్రతిభకు తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది, తద్వారా జీతాల పెరుగుదల జరుగుతుంది. 2024లో ఉద్యోగుల జీతం వియత్నాంలో 8%, చైనా 6%, ఫిలిప్పీన్స్ 5.7%, థాయిలాండ్ 5% వరకు పెరగనుంది. ఈ దేశాలతో పోల్చితే భారత్ (9.8%) ముందు వరుసలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్! రాబోయే రోజుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (61%), ఇంజనీరింగ్ (59.8%), సేల్స్ (42.9%), టెక్నికల్ స్కిల్స్ ట్రేడ్ (38.6%), ఫైనాన్స్ (11.8%) ), మార్కెటింగ్ (10.6%), హ్యూమన్ రీసోర్స్ (3.1%) విభాగాల్లో ఉద్యోగాలు, జీతాలు పెరగనున్నాయి. అంతే కాకుండా టెక్నాలజీ, మీడియా, గేమింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్ రంగాల్లో కూడా జీతాలు పెరుగుదల ఉంటుంది. -
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త!
టెక్కీలకు ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ శుభవార్త చెప్పింది. సంస్థ గత ఆరు నెలలుగా జీతాల పెంపు ప్రకటనన వాయిదా వేస్తూ వచ్చింది. అయితే, తాజాగా ఇన్ఫోసిస్ ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో నవంబర్ 1న ఉద్యోగుల వార్షిక వేతనాల్ని పెంచుతున్నట్లు కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ షాజీ మాథ్యూ తెలిపారు. ఇన్ఫోసిస్ సాధారణంగా శాలరీలను ఏప్రిల్ నెలలో సీనియర్ మేనేజ్మెంట్ కంటే తక్కువ ఉన్న ఉద్యోగులందరికీ వార్షిక పెంపును అమలు చేస్తుంది. మిగిలిన ఉద్యోగులకు జూలైలో అందిస్తుంది. అయితే ఐటీ విభాగంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఉద్యోగుల పనితీరు ఆధారంగా చెల్లించే వేతనాలు, ఇతర బెన్ఫిట్స్ను వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా ఇదే అంశంపై క్లారిటీ ఇవ్వడంతో సంస్థ తీసుకున్న నిర్ణయంపై లక్షల మంది ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ రంగంలో అనిశ్చితే కారణం ఇతర రంగాలతో పాటు టెక్నాలజీ రంగంలో నెలకొన్ని అనిశ్చితి కారణంగా వేతనాల పెంపును వాయిదా వేసినట్లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలాంజన్ రాయ్ పేర్కొన్నారు. కాగా, ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ.38,994 కోట్ల ఆదాయంపై రూ.6,215 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభం ఆర్జించింది -
ప్చ్.. విప్రో ఉద్యోగులకు తప్పని నిరాశ!
Wipro salary hike: ప్రముఖ దేశీయ టెక్నాలజీ దిగ్గజం విప్రో (Wipro).. తమ ఉద్యోగులకు నిరాశ కలిగించే వార్త చెప్పింది. జీతాల పెంపుదలను వచ్చే డిసెంబర్ నెలకు వాయిదా వేసింది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఉద్యోగులకు వేతన పెంపు డిసెంబర్ 1 నుంచి అమలు చేయనుంది. ఉద్యోగులకు ఈ-మెయిల్ ఈ మేరకు కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ నుంచి ఉద్యోగులకు ఈ-మెయిల్ అందినట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఉదహరించింది. "ప్రస్తుతం సవాళ్లతో కూడిన, అనిశ్చిత ప్రపంచ మార్కెట్ పరిస్థితులు ఉన్నప్పటికీ, మా మెరిట్ జీతాల పెంపుదల (MSI) 2023 డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. రాబోయే వారాల్లో, ప్రస్తుత పరిహారం, నైపుణ్యాలు, పనితీరు ఆధారంగా అర్హత ఉన్న ఉద్యోగులకు మెరిట్ జీతం పెంపును నిర్ణయిస్తాం" అని ఆ ఈ-మెయిల్లో పేర్కొన్నారు. (మాజీ టెలికాం మంత్రికే బురిడీ! ఒక్క ఫోన్ కాల్‌తో రూ.లక్ష మాయం..) స్థూల ఆర్థిక ఎదురుగాలి, మార్జిన్ ఒత్తిళ్ల కారణంగా జీతాల పెంపు ప్రకటనను విప్రో ఈ సంవత్సరం మూడు నెలలు వాయిదా వేసింది. దీంతోపాటు ఈ సంవత్సరం అనేక ప్రముఖ ఐటీ కంపెనీలు జీతాల పెంపును జాప్యం చేస్తున్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగంలో పరిశ్రమ మందగమనం ఇందుకు ముఖ్య కారణంగా చెబుతున్నారు. లాభదాయకతను పెంపొందించుకోడానికి, ఐటీ రంగంలో తన స్థితిని మెరుగుపరచడానికి విప్రో.. గత జులైలో వ్యూహాత్మక మార్పులను చేపట్టింది. కంపెనీ తన క్లయింట్ బేస్‌ను తగ్గించుకుని అధిక మార్జిన్లు, ఎక్కువ ఆదాయం వచ్చే ఒప్పందాలపై దృష్టి పెట్టింది. జూన్ త్రైమాసికంలో విప్రో ఆదాయంలో 2.8 శాతం సీక్వెన్షియల్ క్షీణతను నమోదు చేసిన కొన్నాళ్లకే ఈ వ్యూహం అమలు చేసింది. అదనంగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో, సంస్థ ప్రారంభ ఆఫర్లతో పోలిస్తే కొత్త రిక్రూట్మెంట్ల పే ప్యాకేజీలను దాదాపు 50 శాతం తగ్గించింది. -
ఇండిగో ఉద్యోగులకు అక్టోబర్ 1 నుంచి పండగే..!
అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)ను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ తమ పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి వేతనాలను పెంచినట్లు ఒక నివేదిక తెలిపింది. వేతనాల పెంపుదల అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. గత ఏడాది ఇండిగో తమ సిబ్బందికి రెండు విడతల్లో 10 శాతానికిపైగా జీతాలను పెంచింది. ఈ విమానయాన సంస్థ పైలట్లకు నెలకు 70 గంటల చొప్పున స్థిరమైన వేతనాన్ని కూడా కొనసాగిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 2023-24 మొదటి త్రైమాసికంలో ఇండిగో రికార్డు స్థాయిలో రూ. 3,090 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. భారతీయ విమానయాన సంస్థలు అంతర్జాతీయంగా, దేశీయంగా విస్తరించడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఉన్న పైలట్లు వెళ్లిపోకుండా చూసుకోవడంతోపాటు కొత్త పైలట్లను నియమించుకోవడానికి గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఇండిగో కార్యకలాపాలు ప్రారంభించి 17 ఏళ్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సంస్థ 320కు పైగా విమానాలతో 1,900 రోజువారీ సర్వీసులు నిర్వహిస్తోంది. దేశీ విమానయాన మార్కెట్లో ఈ సంస్థకు 63 శాతం వాటా ఉంది. 32 అంతర్జాతీయ, 81 దేశీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. అయితే ఇటీవల పీఅండ్‌డబ్ల్యూ ఇంజన్లలో సమస్యల కారణంగా కొన్ని ఏ320 విమానాలను నిలిపివేయాల్సి వచ్చింది. దీన్ని అధిగమించేందుకు సంస్థ కొన్ని విమానాలను వెట్‌లీజ్ తీసుకుంది. -
మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాల పెంపు ఈనెల నుంచే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను ఈనెల నుంచి ఇవ్వనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వేతనాలను పెంచడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న 54,201 మంది కుక్–కమ్ హెల్పర్లకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. తద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.108.40 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. శనివారం తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పాఠశాల విద్యలో ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో చోటు చేసుకున్న అభ్యాసన సంక్షోభాన్ని నివారించి తరగతి వారీగా భాషా, గణితాల సామర్థ్యాలను సాధించేందుకు తొలి మెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో ఉన్న కనీస సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ సంవత్సరం నుంచి ప్రతీ ఏటా స్టేట్ లెవెల్ అచీవ్ మెంట్ సర్వే నిర్వహించనున్నామని మంత్రి వెల్లడించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం.... పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రూ.కోటి కన్నా ఎక్కువ వ్యయమయ్యే పనులను పాఠశాల నిర్వహణ కమిటీలకు (ఎస్.ఎం.సి) అప్పగించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పలు జిల్లాల్లో విద్యార్థులకు అందజేయాల్సిన ఏకరూప దుస్తులు అందలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, మరో వారం రోజుల్లోగా అందజేయకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు. -
విప్రో ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: జీతాల పెంపు ఇప్పుడే కాదు..
Bad News for Wipro employees: జీతాల పెంపునకు సంబంధించి ఉద్యోగులకు నిరాశ కలిగించే వార్తను చెప్పింది ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో. గతేడాది సెప్టెంబర్‌లో వేతన పెంపును అమలు చేసిన విప్రో కంపెనీ ఈ ఏడాది వేతన పెంపును మూడో త్రైమాసికానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాజాగా మీడియా సమావేశంలో వెల్లడించింది. వేరియబుల్ పే 80 శాతం ఇంతకు ముందు వేతన పెంపును గత సంవత్సరం సెప్టెంబర్‌లో అమలు చేశామని, ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో వేతన పెంపును అమలు చేయనున్నట్లు విప్రో చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ తెలిపారు. విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ మాట్లాడుతూ.. మొదటి త్రైమాసికంలో చేసిన విధంగానే క్యూ2 లోనూ కంపెనీ త్రైమాసిక ప్రమోషన్ సైకిల్స్‌ను కొనసాగిస్తుందని చెప్పారు. అయితే 2023 క్యూ1 కు సంబంధించి వేరియబుల్ పే అవుట్ 80 శాతం ఉంటుందని పేర్కొన్నారు. విప్రో గత సంవత్సరం రిక్రూట్ చేసిన ఫ్రెషర్లందరినీ ఇంకా ఆన్‌బోర్డ్ చేయకపోవడానికి వ్యాపార అవసరాలు కూడా కారణంగా తెలుస్తోంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేపట్టలేదని, క్యూ1లో ఎవరినీ ఆన్‌బోర్డ్ చేయలేదని కంపెనీ తెలిపింది. మరోవైపు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ కంపెనీలు కూడా వేతన పెంపులను వాయిదా వేశాయి. ఇన్ఫోసిస్ జూనియర్ ఉద్యోగులకు సాధారణ ఏప్రిల్ సైకిల్ ప్రకారం వేతనపెంపును చేపట్టకుండా వాయిదా వేసింది. జూనియర్, మిడ్ లెవెల్ ఉద్యోగులకు వేతన పెంపును మరో త్రైమాసికానికి వాయిదా వేసిన హెచ్‌సీఎల్ కంపెనీ మేనేజర్ స్థాయి ఉద్యోగుల వేతన సమీక్షను దాటవేసింది. ఇదీ చదవండి: లేఆఫ్స్ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి.. మరి భారత్‌లో ఎంత మంది? -
గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్ - ఆనందంలో ఉద్యోగులు..
TCS Salary Hike: ఇప్పటికే చాలా కంపెనీలు శాలరీ హైక్స్ విషయంలో వెనుకడుగులు వేస్తుంటే 'టీసీఎస్' (TCS) మాత్రం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్ఫోసిస్ కంపెనీ వేతన పెరుగుదలను వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తూ ఉన్న తరుణంలో.. టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురించి చేసింది. ఆపరేటింగ్ మార్జిన్ మీద 200 బేసిస్ పాయింట్స్ ప్రభావం చూపుతున్నప్పటికీ వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. నివేదికల ప్రకారం, కంపెనీలో అత్యుత్తమ పనితీరుని కనపరచిన ఉద్యోగులకు 12 నుంచి 15 శాతం జీతాలను పెంచినట్లు తెలిసింది. దీనితో పాటు ప్రమోషన్లను కూడా ప్రారంభించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన సమాచారాన్ని టీసీఎస్ సీఎఫ్ఓ సమీర్ సెక్సరియా వెల్లడించారు. రానున్న రోజుల్లో కంపెనీ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోల్చి చూస్తే.. ఈ మొదటి త్రైమాసికంలో ఐటీ సేవల క్షీణత తగ్గి 17.8 శాతానికి చేరినట్లు తెలిసింది. కాగా జూన్ 30 నాటికి కంపెనీ పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 6,15,318 మంది. గత మూడు నెలల్లో ఉద్యోగులు 523 మంది పెరిగారు. కాగా ఈ వర్క్ ఫోర్స్‌లో మహిళలు 35.8 శాతం ఉండటం గమనార్హం. (ఇదీ చదవండి: షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు - కారణం ఇదే!) కంపెనీ అత్యుత్తమ ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది. అలాంటి వారిని గుర్తించి రివార్డులను సైతం అందిస్తోంది. గత కొన్ని రోజుల్లో ఉద్యోగాల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి మూడు వారాలకు ఒకసారి 55 శాతం మంది వస్తున్నట్లు కంపెనీ చీఫ్ హెచ్ఆర్ మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. -
షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు!
దేశంలోని చాలా కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులకు శాలరీ హైక్ చేస్తుంటే.. ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosis) మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయింది. ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో జరగాల్సిన వేతనాల పెంపు ఇప్పటికీ జారకగా పోవడంతో ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు, ప్రాజెక్టుల రద్దు.. తగ్గుతున్న ఆదాయం, పెరుగుతున్న ఖర్చులు ఇవన్నీ దేశీయ ఐటీ కంపెనీల మీద తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ పరిస్థితుల కారణంగా ఇప్పటికే చాలా కంపెనీ లెక్కకు మించిన ఉద్యోగులను తొలగించింది. కాగా ఇప్పుడు శాలరీ హైక్ విషయంలో కూడా వెనుకడుగు వేస్తున్నాయి. ఇన్ఫోసిస్ ఆర్ధిక పరిస్థితి కారణంగానే ఉద్యోగులకు శాలరీలు పెంచలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (ఇదీ చదవండి: అలా చేస్తేనే విజయం వరిస్తుంది.. సక్సెస్ సీక్రెట్ చెప్పిన ఆనంద్ మహీంద్రా) ప్రతి సంవత్సరం అప్రైజర్స్ వుంటాయని... ఈ సారి మాత్రం ఆ విషయం మీద ఎటువంటి క్లారిటీ రాలేదని ఉద్యోగులు చెబుతున్నట్లు సమాచారం. సాధారణ ఉద్యోగులు మాత్రమే కాకుండా, ఉన్నత స్థాయి ఉద్యోగులకు సైతం ఇంకా వేతన పెంపు జరగకపోవడం గమనార్హం. కరోనా మహమ్మారి సమయంలో మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా శాలరీ హైక్ జరగక పోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.