ఆశా వర్కర్ల జీతం రూ.6వేలుకు పెంపు | Salary hike to Telangana asha workers | Sakshi
Sakshi News home page

ఆశా వర్కర్ల జీతం రూ.6వేలుకు పెంపు

Published Fri, May 5 2017 4:39 PM | Last Updated on Sat, Aug 11 2018 7:06 PM

ఆశా వర్కర్ల జీతం రూ.6వేలుకు  పెంపు - Sakshi

ఆశా వర్కర్ల జీతం రూ.6వేలుకు పెంపు

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఏఎన్‌ఎమ్‌, ఆశా వర్కర్లతో సమావేశం అయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఆయన ఆశా వర్కర్ల జీతం నెలకు రూ.6వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే మరోసారి కూడా జీతం పెంచనున్నామని, వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో ఆశా వర్కర్ల జీతాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని తెలిపారు. అలాగే ఖాళీగా ఉన్న 1200 ఏఎన్‌ఎమ్‌ పోస్టుల భర్తీలో ఆశా వర్కర్లకు తొలి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

అంతేకాకుండా అంగన్‌వాడి వర్కర్లతో సమానంగా ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏడాదికి ఆరున్నర లక్షల ప్రసవాలు జరిగితే, అందులో కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఆస్పత్రిలో జరుగుతున్నాయన్నారు. గ్రామ ఆరోగ్య పరిరక్షణ బాధ్యత ఆశా వర్కర్లదేనని, వారి పని ఏంటనేది త్వరలోనే కార్యచరణ రూపొందిస్తామన్నారు. ప్రజలు కూడా ఆశా వర్కర్లను వెటకారం చేసే పరిస్థితి మారాలని సీఎం సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement