asha workers
-
చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: ఆశావర్కర్లు
-
రెండే నెలలు గడువు.. లేకపోతే సమ్మె
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైనా హామీలు అమలు చేయకపోవడంపై ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా రెండు నెలల్లో జీవోలు జారీ చేయాలని, లేకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు గురువారం విజయవాడలో భారీ ధర్నా నిర్వహించారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ ధర్నాకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆశాలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోశమ్మ, ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు, కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా అశా వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. పని ఒత్తిడితో ఆశా వర్కర్లు అనారోగ్యం పాలవుతున్నా సెలవులు ఇవ్వడం లేదన్నారు. మెటర్నిటీ లీవులు కూడా ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పని ఒత్తిడి, వెట్టిచాకిరీ వల్ల ఆనారోగ్యం బారినపడి ఇటీవల కాలంలో అనేక మంది ఆశా వర్కర్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. బీమా కంపెనీలకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో క్లెయిమ్‌లు నిలిచిపోయాయని, బాధిత కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక సాయం అందక రోడ్డునపడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక్క పైసా కూడా ఇప్పటివరకు చెల్లించడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర నాయకులు ఎ.కమల, ఎ.వెంకటేశ్వరరావు, పద్మ, రాఘవమ్మ, ధనశ్రీ, లక్ష్మి, సౌభాగ్య, సుభాషిణి, అమర, సుధారాణి, పార్వతి, రమణకుమారి, గంగా, జ్యోతి, వెంకటలక్ష్మి, వెంకటేశ్వరమ్మ, వాణిశ్రీ, తదితరులు మాట్లాడారు. -
విజయవాడలోని ధర్నా చౌక్ కు భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు
-
తాడో పేడో తేల్చుకుంటాం.. విజయవాడకు భారీగా చేరుకున్న ఆశావర్కర్లు
సాక్షి, విజయవాడ: ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకొనేందుకు ఆశావర్కర్లు సిద్ధమవుతున్నారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. గత సమ్మె కాలంలో ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలపై జీవోలు విడుదల చేయాలని ఆశావర్కర్లు కోరుతున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.గురువారం.. అన్ని జిల్లాల నుంచి ధర్నా చౌక్‌కు భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు.. రోడ్లపై సైతం కార్పెట్లు వేసుకుని ఎండలో ధర్నాకు దిగారు. ఆశా వర్కర్ల కదలికలపై డ్రోన్లు, ఇంటిలిజెన్స్ బృందాల ద్వారా పోలీసులు నిఘా పెట్టారు. ధర్నాచౌక్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.దాదాపు 10 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంటుందని యూనియన్ నాయకులు అంటున్నారు. ఆర్ముడ్ రిజర్వ్, సివిల్, ర్యాపిడ్ యాక్షన్ టీంలను పోలీసులు సిద్ధం చేశారు. ఏడీసీపీ, ఏఎస్పీ, ముగ్గురు డిఎస్పీలు, నలుగురు సీఐలు, ఇతర సిబ్బందితో భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్వష్టమైన ప్రకటన చేస్తే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆశా వర్కర్లు చెబుతున్నారు. -
‘ఆశా’.. నిరాశే!
సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి అంకితభావంతో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్న ‘ఆశా’ సిబ్బందికి కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి, ప్రసూతి సెలవులు, ఉద్యోగ విరమణ ప్రోత్సాహంతో సరిపెట్టింది. ఆశాలను ఉద్ధరించింది తామేనని, దేశంలోనే అత్యధికంగా వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రం ఏపీ అని చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. వాస్తవానికి వేతనాలు పెంచి ఆశా కార్యకర్తలను ఆదుకున్నది వైఎస్ జగన్ ప్రభుత్వం. 2019కి ముందు వరకు చాలీచాలని వేతనాలతో ఆశాలు అగచాట్లు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం వారి కష్టాలను విన్నది కూడా లేదు. ఈ నేపథ్యంలో తమ వేతనాలు పెంచి ఆదుకోవాలని పాదయాత్రలో వైఎస్ జగన్‌ను ఆశా సిబ్బంది కోరారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 2019 ఆగస్టులో ఆశాల వేతనాలను రూ.10 వేలకు పెంచారు. అయితే, పెరిగిన జీవన వ్యయాలు, కుటుంబ అవసరాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని గత ఏడాది డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా ఆశా సిబ్బంది ధర్నాకు దిగారు. మరోపక్క కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక నాయకులు వీరిపై దాడులు మొదలుపెట్టారు. గ్రామాల్లో పనిచేస్తున్న ఆశాలను రాజకీయ కారణాలతో తొలగించి, వారి పొట్టగొట్టే పన్నాగానికి తెర తీశారు. ఏళ్లుగా సేవలందిస్తున్న వారిని సైతం ఉన్నతాధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేసి బలవంతంగా తొలగించారు. ఈ క్రమంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించి రూ.20 వేల వేతనం ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌తో ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేసింది. కానీ, ఈ ప్రధాన డిమాండ్‌తో పాటు ఉద్యోగ భద్రత, ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వారికి పదోన్నతి కల్పనను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంపు, 180 రోజుల ప్రసూతి సెలవులు, 30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన వారికి గ్రాట్యుటీ కింద రూ.1.50 లక్షల చెల్లింపునకు అంగీకరించారు.30 ఏళ్ల సర్వీసు ఉంటేనే గ్రాట్యుటీ! ‘ఆశా’లను ఆదేకునేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. వారి ప్రయోజనాలను అమలు చేసేందుకు సీఎం ఆమోదం తెలిపారన్నారు. ఆశాల ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంపు, 30 ఏళ్ల సర్వీసు ఉన్నవారికి రూ.1.50 లక్షల గ్రాట్యుటీ, 180 రోజుల ప్రసూతి సెలవులు అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనిద్వారా రాష్ట్రంలో 42,752 మంది ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. -
ఆదివారం ఆశవర్కర్లకు సెలవు
సుల్తాన్‌బజార్/అఫ్జల్‌గంజ్: ఆశవర్కర్లకు ఆదివారం సెలవుగా పరిగణించడంతోపాటు పండుగ సెలవులను సైతం మంజూరు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య–కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్ ప్రకటించారు. ఈ నిర్ణయా న్ని తక్షణమే అమలు చేస్తామన్నారు. ఆశవర్కర్లకు విధించే టా ర్గెట్లతోపాటు స్పూటమ్ డబ్బాలు మోసే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు చె ప్పారు. కుష్టు వ్యాధి నివారణ, పల్స్‌పోలియోకు సంబంధించిన పెండింగ్ డబ్బులను వారికి త్వరలోనే చెల్లిస్తామన్నారు. ఈ మేరకు తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జయలక్ష్మి సహా ఇతర ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. ఫిక్స్డ్ వేతనం రూ. 18 వేలు, రూ. 50 లక్షల బీమా, రిటైర్మెంట్ ప్రయోజనాలు, పెన్షన్, ప్రమోషన్, హెల్త్‌కార్డు లు, ఏటా 20 రోజుల క్యాజువల్ సెలవులు తదితర సమస్యలపై ప్రతిపాదనలతో ఫైళ్లను ప్రభుత్వానికి సమర్పిస్తామని హామీ ఇచ్చారు. రెండోరోజూ ధర్నా.. నచ్చజెప్పిన పోలీసులు అంతకుముందు జీతాల పెంపు సహా తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆశవర్కర్లు మంగళవారం కూడా ఆందోళన కొనసాగించారు. హైదరాబాద్ కోఠిలోని డీఎంహెచ్ఎస్ చౌరస్తాలో తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో వందలాది మంది ఆశ వర్కర్లు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రస్తు త అసెంబ్లీ సమావేశాల్లోనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు రోడ్డుపై బైఠాయించడంతో తీవ్ర ట్రాఫిక్‌జాం ఏర్పడింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే అక్కడికి చేరుకొని నిరసనకారులతో మాట్లాడారు. కావాలంటే డీఎంహెచ్ఎస్ ప్రాంగణంలో నిరసన తెలుపుకోవాలని నచ్చజెప్పారు. దీంతో ఆశవర్కర్లు డీఎంహెచ్ఎస్లో ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో స్పందించిన వైద్య, ఆరోగ్య–కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్ యూనియన్ ప్రతినిధులను చర్చలకు పిలిచారు. చర్చల అనంతరం జాయింట్ డైరెక్టర్ రాజేశం, మరికొందరు అధికారులు నిరసనకారుల వద్దకు వెళ్లి ప్రభుత్వ హామీలను వివరించారు. ఆ పోలీసులను డిస్మిస్ చేయాలి: కేటీఆర్ ఆశవర్కర్లు సోమవారం చేపట్టిన నిరసన సందర్భంగా వారితో అనుచితంగా ప్రవర్తించిన పోలీసులను ప్రభుత్వం వెంటనే డిస్మిస్ చేయాలని బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు డిమాండ్ చేశారు. పో లీసులతో తోపులాటలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రహీంబీ అనే ఆశ వర్కర్‌ను మంగళవారం ఆయన పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్సీలు మహ్మద్ అలీ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మా జీ మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. -
ఉస్మానియా ఆస్పత్రిలో ఆశా వర్కర్లను పరామర్శించిన కేటీఆర్
-
వేతనం అడిగితే దాడి చేస్తారా?: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ఆశా వర్కర్లపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని,ఈ దాడిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశావర్కర్లను మంగళవారం(డిసెంబర్10)మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,మహమూద్ అలీ,జగదీష్ రెడ్డి,ఇతర బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ పరారమర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆశావర్కర్ల మీద జరిగిన దాడిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. అవసరం అయితే జాతీయ మానవహక్కుల కమిషన్‌ను కలుస్తాం. ఆశా వర్కర్లు ఉద్యోగ భద్రత, వేతనాలు పెంచాలని అడిగారు.కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీనే నెరవేర్చాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తూన్నారు.నిరసనలు చేస్తే ఆశా వర్కర్లపై దాడులు చేస్తారా. లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో పూర్తిగా ఫెయిల్ అయింది. ఆశావర్కర్లపై నిన్న జరిగిన దాడి దుశ్శాసన పర్వం. అధికారంలోకి వస్తే ఆశావర్కర్లకు గౌరవ వేతనం ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం దానిని వెంటనే ఇవ్వాలి. ఆశా వర్కర్ల డిమాండ్లపై అసెంబ్లీలో కొట్లాడుతాం.ఉస్మానియాలో సరైన వైద్యం అందకపోతే గాయపడ్డ ఆశా వర్కర్లకు బీఆర్ఎస్ పార్టీ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తాం’అని కేటీఆర్ అన్నారు. -
బేగం బజార్ సీఐపై చేయిచేసుకున్న ఆశా వర్కర్స్
-
చంద్రబాబు సర్కార్ మోసం రోడ్డెక్కిన ఆశ వర్కర్లు
-
ఏపీలో సమస్యల పరిష్కరం కోసం కార్మికుల ఆందోళన
-
కదంతొక్కిన ఆశా వర్కర్లు
సాక్షి నెట్వర్క్: తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం అన్ని జిల్లాల్లో వారు పెద్దఎత్తున ధర్నాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ కదంతొక్కారు. ఎక్కడికక్కడ అధికారులకు వినతిపత్రాలిచ్చారు. పేదలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న తమను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని.. ఖాళీ పోస్టులను రాజకీయ జోక్యం లేకుండా ప్రభుత్వమే భర్తీచేయాలని విజయవాడలో నేతలు డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, రూ.60 వేలు పదవీ విరమణ బెనిఫిట్స్ ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని, చనిపోయిన ఆశాలకు మట్టి ఖర్చుల కింద రూ.20 వేలు చెల్లించాలని నరసరావుపేటలో డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం గతంలో చేసుకున్న ఒప్పందాలను వెంటనే అమలుచేయాలని ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తలు కోరారు. ఈ ఒప్పందాలకు సంబంధించి జీఓలు ఇవ్వమంటే కూటమి ప్రభుత్వం తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం సరైనది కాదని ఏలూరు, భీమవరంలో నేతలు అన్నారు. గత ఆరునెలల్లో సీఎంను, ఆరోగ్యశాఖా మంత్రిని, అధికారులను అనేకసార్లు కలిసి తమ సమస్యలు వివరించి వినతిపత్రాలు ఇచ్చామని.. అయినా ఎలాంటి స్పందనాలేకపోవడంతో రోడ్డు మీదకు రావాల్సి వచ్చిందన్నారు. సకాలంలో జీతాలు ఇవ్వకుండా.. జీతాలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇక ఉదయం నుంచీ ఆందోళన చేసినా డీఎంహెచ్ఓ కలెక్టరేట్ నుంచి బయటకు రాకపోవడంతో అమలాపురంలో ఆశా కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి దూసుకువెళ్లారు. దీంతో పోలీసులతో తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. తమపై విధించిన ఆంక్షలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, తమను అసభ్యపదజాలంతో పిలుస్తున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని శ్రీకాకుళంలో ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు కనీస వేతనాలు అమలుచేస్తామన్న చంద్రబాబు పట్టించుకోకపోవడం అన్యాయమని విశాఖలో నాయకులు మండిపడ్డారు. ఐదు నెలలైనా అమలుచేయకపోవడం బాధాకరం..ఇక తమ ప్రభుత్వం వస్తే ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని టీడీపీ, జనసేన నాయకులు తమ శిబిరాల వద్దకొచ్చి హామీలు ఇచ్చినందున వారికి అధికారం కల్పించారని.. అధికారం పొంది ఐదు నెలలు పూర్తవుతున్నా హామీలు అమలుచేయకపోవడం బాధాకరమని కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వారు ఆవేదన వ్యక్తంచేశారు. కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారంలోకి వచ్చాక ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని వారు విమర్శించారు. తమతో అదనపు పనులు చేయించడం అన్యాయమని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆశా వర్కర్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. మిషన్ ఇంధ్రధనస్సు, హౌస్‌హోల్డ్ సర్వే, సంబంధిత ఫార్మెట్లు ఇవ్వకుండా ఆశాలతోనే జిరాక్స్ కాపీల ఖర్చు పెట్టిస్తున్నారని అన్నమయ్య జిల్లా రాయచోటిలో నినాదాలు చేశారు. -
సర్కారు తీరుపై చిరుద్యోగుల కన్నెర్ర
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చిరుద్యోగులు కన్నెర్ర చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన స్కీమ్ వర్కర్లు, కారి్మకులు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కదం తొక్కారు. చిరుద్యోగులపై అధికార పార్టీ నాయకుల వేధింపులను తక్షణమే మానుకోవాలని, బలవంతంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలనే నినాదాలు ఎక్కడికక్కడ మార్మోగాయి. వారి ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికింది.సాక్షి నెట్వర్క్: బలవంతపు తొలగింపులు, రాజకీయ వేధింపులకు నిరసనగా ఐకేపీ, వీఓఏలు, మధ్యాహ్న భోజన పథకం, పారిశుధ్య కార్మికులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ, ఆశా వర్కర్లతోపాటు వివిధ రంగాలకు చెందిన చిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ధర్నాలు నిర్వహించారు. చిరుద్యోగులపై అధికార పార్టీ నాయకుల వేధింపులను తక్షణమే మానుకోవాలని, బలవంతంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. ఎనీ్టఆర్ జిల్లాలో చిరుద్యోగుల తొలగింపు, రాజకీయ వేధింపులు నిలిపివేయాలని కోరుతూ విజయవాడలో సోమవారం ధర్నా జరిగింది. ప్రభుత్వ విభాగాలకు చెందిన చిరుద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చారు.చిరుద్యోగుల తొలగింపు, రాజకీయ వేధింపులు ఆపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్వోకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. బాపట్ల కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ శాఖల్లోని చిరుద్యోగులు ధర్నా చేపట్టారు. స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన చిరుద్యోగులంతా పుట్టపర్తి చేరుకుని అధికార పార్టీ నాయకుల వేధింపులకు నిరసనగా కదం తొక్కారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఓడీచెరువు మండలం వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త నాగమణి ఆత్మహత్యాయత్నం, మరో కార్యకర్త సుహాసినిపై దాడికి కారణమైన టీడీపీ కార్యకర్త ఆంజనేయులు కుటుంబంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని నినదించారు. ఖాళీ ప్లేట్లతో నిరసన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వివిధ సంఘాల ఆధ్వర్యంలో చిరుద్యోగులు ధర్నాలు నిర్వహించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపును నిరసిస్తూ.. చేసిన పనులకు వేతనాలు చెల్లించాలంటూ ఖాళీ ప్లేట్లతో ఉపాధి కూలీలు అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. విధుల నుంచి తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు.స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు తక్షణం నిలుపుదల చేయాలని, ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించరాదని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. కాకినాడలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన వర్కర్లు, యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లపై కూటమి నేతల రాజకీయ వేధింపులను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పార్వతీపురంలోని కలెక్టరేట్ ఎదుట చిరుద్యోగులు ధర్నా చేపట్టారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలంటూ నినాదాలు చేశారు. మా ఉద్యోగం మమ్మల్ని చేసుకోనివ్వండి ‘మా ఉద్యోగం మమ్మల్ని చేసుకోనివ్వండి.. మాకు రాజకీయ మరకలు పూయకండి’ అంటూ చిరుద్యోగులు తిరుపతి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ పొట్టగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చిరుద్యోగులను తొలగిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, వీఓఏలు, అంగన్వాడీ హెల్పర్లు ఒంగోలులో కదం తొక్కారు. లేనిపోని కారణాలు చూపుతూ చిరుద్యోగులను బలవంతంగా తొలగించడం, స్థానిక నాయకులు జోక్యం చేసుకుని వేధింపులకు గురిచేయడం ఆపకపోతే నిరవధిక ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సీఐటీయూ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. -
కదం తొక్కిన ఆశ వర్కర్లు
సుల్తాన్‌బజార్ (హైదరాబా ద్): వైద్య ఆరోగ్యశాఖలో ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ మంగళవారం ఆశ వర్కర్లు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేలాది మంది ఒక్కసారిగా కోఠి మహిళా కళాశాల చౌరస్తాలో బైఠాయించడంతో రోడ్లన్నీ ట్రాఫిక్‌తో స్తంభించిపోయాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఈ ఆందోళనలో పోలీసులకు, ఆశ వర్కర్లకు తీవ్ర వాగ్వివాదం, తోపులాటలు జరిగాయి. ఆశ వర్కర్లు గేట్లు ఎక్కి డీఎంహెచ్ఎస్ క్యాంపస్‌లోకి దూసుకుపోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. క్యాంపస్‌లోకి దూసుకుపోయిన వారు కార్యాలయాన్ని ముట్టడించి బైఠాయించారు.అక్కడ కూడా నినాదాల హోరు కొనసాగింది. దీంతో కమిషనర్ బయటకు వచ్చి ఆశ వర్కర్ల నాయకురాలితో చర్చలు జరిపారు. వారి సమస్యలన్నీ తమ దృష్టిలో ఉన్నాయని, అన్ని సమస్యలను విడతల వారీగా పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడంతో ఆశాలు తమ ఆందోళన విరమించుకున్నారు. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి మాట్లాడుతూ, ఆశ వర్కర్లకు 15 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు, ఫిబ్రవరి 9న ఆరోగ్యశాఖ కమిషనర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలు పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం 20 రోజుల వేతనంతో కూడా సాధారణ సెలవులు ఇవ్వాలన్నారు. డిమాండ్లపై కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు జయలక్ష్మి తెలిపారు. -
హైదరాబాద్‌లో ఆశా వర్కర్ల భారీ నిరసన (ఫొటోలు)
-
రేవంత్ సారు మీ హామీ ఎక్కడ?
-
ఆశా వర్కర్ల జీతాలు పెంచాలంటూ బీజేపీ మహిళా మోర్చ నిరసన
-
కోఠిలోని డీఎంఈ కార్యలయాన్ని ముట్టడించిన ఆశా వర్కర్లు
-
ఎవరో వచ్చి రెచ్చగొడితే మీరు ధర్నాలు చేయకండి: మంత్రి కేటీఆర్
-
శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, నిర్మల్ జిల్లా: రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నిర్మల్ జిల్లాలో పర్యటించారు. దిలావర్పూర్ మండలంలోని గుండంపెల్లిల వద్ద శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్‌తో నిర్మించిన కాళేశ్వర ప్రజెక్టు ప్యాకేజీ-27ను (శ్రీలక్ష్మీ నరసింహాస్వామి లిఫ్ట్ ఇరిగేషన్) మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. స్థానిక మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ఎత్తిపోతల పథకానికి స్విచ్ ఆన్ చేసి కాలువలకు నీటిని విడుదల చేసి రైతులకు అంకితం ఇచ్చారు. తరువాత దిలావర్పూర్ శివారులోని డెలివరీ సిస్టర్న్‌ను పరిశీలించి పూజ నిర్వహించారు. అదే విధంగా సోన్ మండలం మాదాపూర్ వద్ద రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆశా కార్యకర్తల ఆందోళన.. గుండంపెల్లిలో ఉద్రిక్తత గుండంపెల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లక్ష్మీ నరసింహస్వామి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ప్రారంభానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను అడ్డుకునేందుకు ఆశా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో ఆశా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆశా వర్కర్లకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో ఓ ఆశా కార్యకర్త సొమ్మసిల్లి కిందపడిపోయారు. పోలీసుల తీరుపై ఆశా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం అందోళన చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. చివరికి ప్యాకేజీ 28 కాళేశ్వర పనులు ప్రారంభించిన తర్వాత మంత్రికి ఆశా కార్యకర్తలు వినతి పత్రాన్ని అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యలను పరిష్కరిస్తామని కేటీఆర్ భరోసానిచ్చారు. -
కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటి వద్ద ఉద్రిక్తత
-
18.81 లక్షల గృహాల్లో వ్యక్తుల ఆరోగ్య వివరాల సేకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ సర్వే ముమ్మరంగా కొనసాగుతోంది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో), ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తున్నారు. వైద్య రంగంలో ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ వంటి విప్లవాత్మక సంస్కరణలతో ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, వాటిని పరిష్కరించడానికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 30వ తేదీ నుంచి స్పెషలిస్ట్ వైద్యులతో హెల్త్ క్యాంపులను వైద్యశాఖ ప్రారంభించనుంది. హెల్త్ క్యాంప్‌ల నిర్వహణ షెడ్యూల్‌కు అనుగుణంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేపడుతున్నారు. 18.81 లక్షల గృహాల్లో సర్వే ఈనెల 16 నుంచి ఆరోగ్య సురక్ష సర్వేను మొదలు పెట్టారు. సీహెచ్‌వోలు, ఏఎన్ఎంలు నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఇప్పటి వరకూ 18.81 లక్షల గృహాలను సందర్శించాయి. జ్వరం, బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధి బాధితుల వివరాలు సేకరిస్తున్నారు. జ్వరం, బీపీ, షుగర్ లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఏడు రకాల పరీక్షలను ఇంటి వద్దే చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ జరిగిన సర్వేలో 20 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించారు. 45 రోజుల పాటు హెల్త్ క్యాంపులు ఈనెల 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ క్యాంప్‌లు ప్రారంభించనున్నారు. 45 రోజుల పాటు 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, 500కు పైగా పట్టణ ఆరోగ్య కేంద్రాలను కవర్ చేసేలా క్యాంప్‌లు నిర్వహిస్తారు. ప్రతీ క్యాంప్‌లో నలుగురు వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారిని దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. టోకెన్ల అందజేత సర్వేలో భాగంగా వివిధ ఆరోగ్యపరమైన సమస్యలపై ఆరా తీసి, అవసరం మేరకు బీపీ, షుగర్, ఇతర పరీక్షలు నిర్వహించిన అనంతరం టోకెన్ స్లిప్‌లు ఇస్తున్నారు. ఆ టోకెన్‌లో గ్రామం/పట్టణంలో హెల్త్ క్యాంప్ నిర్వహించే రోజు, స్థలం వంటి వివరాలు ఉంటాయి. అదే విధంగా సేకరించిన ప్రజల ఆరోగ్య వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్య సురక్ష యాప్‌లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నారు. ఈ వివరాల ఆధారంగా హెల్త్ క్యాంప్ నిర్వహించే రోజున ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా కేస్ షీట్లను తయారు చేస్తారు. ఆ కేస్ షీట్లో సంబంధిత వ్యక్తికి క్యాంప్‌లో అందజేసే వైద్యం, పరీక్షలు, వైద్యుడు సూచించే మందుల ప్రిస్క్రిప్షన్, ఇతర వివరాలన్నింటినీ నమోదు చేస్తారు. -
ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలి
సుల్తాన్ బజార్: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కోఠిలోని డీఎంహెచ్ఎస్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాదిగా ఆశవర్కర్లు తరలివచ్చారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ తామంతా సుశిక్షితులమని, ఎప్పటి కప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజాసేవ చేస్తున్నామని చెప్పారు. రోగుల సర్వే చేయడం, బీపీ, షుగర్, థైరాయిడ్, అన్ని రకాల జబ్బులు గుర్తించి మందులను రోగులకు సరఫరా చేస్తున్నామన్నారు. కరోనా నియంత్రించడంలో ఆశావర్కర్లు కీలక పాత్ర పోషించారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశావర్కర్లకు హెల్త్ గ్లోబల్ లీడర్స్ అవార్డును కూడా ప్రకటించిందని గుర్తు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సబ్ సెంటర్స్, దవాఖానాల్లో పనిచేయాలని ప్రభుత్వం చెబుతోందని, అయినా తమకు కేవలం రూ.9.750 వేలు మాత్రమే పారితోషకమే ఇస్తోందన్నారు. ఒకవైపు పనిభారంతో, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వేతనం రూ.18 వేలకు పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశావర్కర్లకు హెల్త్ కార్డులు, ప్రమాద బీమా రూ.5 లక్షలు ఇవ్వాలని, ఏఎన్ఎం, జీఎన్ఎం పోస్టుల్లో ఆశావర్కర్లకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.నీలాదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలోనే ఆశా వర్కర్లకు ఎక్కువ వేతనాలు.. కేంద్ర వెల్లడి
సాక్షి,అమరావతి: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఆశా వర్కర్లకు అత్యధిక ఆర్థిక ప్రోత్సాహకాలు అందుతున్నాయి. ఏపీ ఇస్తున్నట్లుగా ఇతర ఏ రాష్ట్రాల్లోనూ ఆశా వర్కర్లకు నెలకు రూ. పది వేల ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వడం లేదని ఇటీవల పార్లమెంట్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వివిధ రాష్ట్రాల్లో ఆశా వర్కర్లకు అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహక మొత్తాలను ఆ మంత్రిత్వ శాఖ వివరించింది. ఆంధ్రప్రదేశ్ తరువాత తెలంగాణలో నెలకు రూ. 7,500లు ప్రోత్సాహకం అందుతోందని, ఆ తరువాత కేరళ, సిక్కిం రాష్ట్రాల్లో రూ.6 వేలు చొప్పున ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నారని కేంద్రం పేర్కొంది. కమ్యూనిటీ హెల్త్ వలంటీర్లుగా భావించే ఆశా వర్కర్లకు నెలకు రూ. 2 వేలు చొప్పున కేంద్రం ప్రోత్సాహకంగా ఇస్తోందని, అలాగే జాతీయ స్థాయి ఆరోగ్య కార్యకలాపాలు పనితీరు ఆధారంగా కూడా కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తుందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల ప్రణాళికలు అమలు ఆధారంగా ద్రవ్య ప్రోత్సాహకాలు అందించే సౌలభ్యం కల్పించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం ఇచ్చే రూ. 2 వేలకు అదనంగా మరో రూ. 2 వేలు కలిపి నెలకు రూ. 4 వేలు ఇచ్చేది. అది కూడా ఆరు నెలలైనా ఇవ్వని పరిస్థితులు ఉండేవి. వైఎస్ జగన్ పాదయాత్ర చేసిన సందర్భంలో ఆశా వర్కర్ల వినతులను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 2019, ఆగస్టు 17న ఆశా వర్కర్ల వేతనాలను నెలకు రూ. 10,000లకు పెంచుతూ జీవో ఎంఎస్ నం.87 జారీ చేయించారు. దీంతో రాష్ట్రంలోని 43,767 మంది ఆశా వర్కర్లు లబ్ధి పొందుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఆశా వర్కర్లకు నెలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు ఇలా.. -
1500 ఆశ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో 1,500 ఆశ పోస్టుల భర్తీకి ఈ నెలలో నోటిఫికేషన్ జారీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. బస్తీ దవాఖానాల్లో ఇప్పటివరకు కోటి మంది ప్రజలు వైద్య సేవలు పొందినట్లు తెలిపారు. 1.48 లక్షల మందికి రూ.800 విలువ చేసే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ (ఎల్పీటీ)తో పాటు థైరాయిడ్ పరీక్షలు ఉచితంగా చేసినట్లు చెప్పారు. బస్తీ దవాఖానాల్లో ప్రస్తుతం 57 రకాల పరీక్షలు చేస్తున్నామని, త్వరలో వాటిని 134కు పెంచుతామని వివరించారు.158 రకాల మందులు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. ఆదివారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వివేకానంద, గణేష్ కోరుకంటి చందర్, జాఫర్ హుస్సేన్, అబ్రహం, భూపాల్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. పెద్ద ఆస్పత్రులపై తగ్గిన ఒత్తిడి బస్తీ దవాఖానాలు స్థానికంగా సేవలందిస్తుండడం వల్ల పెద్ద ఆస్పత్రుల్లో ఓపీ తగ్గినట్లు హరీశ్‌రావు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో 2019లో 12 లక్షల మంది ఓపీకి రాగా, 2022 నుంచి ఇప్పటివరకు 5 లక్షల మంది (60 శాతం తగ్గుదల) మాత్రమే వచ్చారన్నారు. గాం«దీలో 2019లో 6.5 లక్షల మంది ఓపీకి రాగా, 2022 నుంచి ఇప్పటివరకు 3.7 లక్షల మంది (56 శాతం తగ్గుదల) మాత్రమే వచ్చినట్లు తెలిపారు. నీలోఫర్‌లో 2019లో 8 లక్షల మంది ఓపీకి రాగా, 2022 నుంచి ఇప్పటివరకు 5.3 లక్షల మంది వచి్చనట్లు చెప్పారు. అలాగే ఫీవర్ ఆసుపత్రిలో 2019లో 4 లక్షల ఓపీ ఉంటే, 2022 నుంచి ఇప్పటివరకు 1.12 లక్షలు మాత్రమే ఉందని వివరించారు. అదే సమయంలో పెద్దాసుపత్రుల్లో శస్త్ర చికిత్సల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి చెప్పారు. కొత్తగా 496 బస్తీ దవాఖానాలు బస్తీ దవాఖానాల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వచ్చే ఏప్రిల్‌లో అన్ని జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ పథకం ప్రారంభం అవుతుందని తెలిపారు. కొత్తగా 496 బస్తీ దవాఖానాలు మంజూరయ్యాయని, వాటిలో కొన్ని నిర్మాణంలో ఉన్నాయన్నారు. త్వరలో మేడ్చల్ హెచ్ఎంటీ ప్రాంతంలో మెడికల్ కాలేజీ వస్తుందన్నారు. -
కరోనా బాధిత కుటుంబాలే టార్గెట్: డబ్బులు ఆశచూపి.. ఖాతా ఖాళీ చేస్తున్నారు!
చక్రాయపేట మండలానికి చెందిన కరోనా బాధిత కుటుంబానికి ఫలానా వారు ఫోన్ చేస్తారని ఆశా వర్కర్ తెలియజేశారు. కొద్దిసేపటిలోనే సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేసి వివరాలన్నీ తీసుకున్నారు. అయితే బా«ధిత కుటుంబీకుల ఖాతాలో సొమ్ములు లేకపోవడంతో మీ సంబంధీకులతో మాట్లాడించాలని సూచించారు. దీంతో వీరబల్లి మండలానికి చెందిన బంధువుతో మాట్లాడించగా, వారి వివరాలు కనుగొని ఖాతా నుంచి సుమారు రూ. లక్ష వరకు సులువుగా దోచేశారు. సాక్షి రాయచోటి : అవకాశం దొరికితే ఎవరినైనా బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. ఇంతకుమునుపు ఇంగ్లీషులోనో...హిందీలోనో మాట్లాడుతూ మనుషులను ఏదో ఒక రకంగా మాయ చేసి సొమ్ము కాజేసేవారు. ఈజీగా మనీ సంపాదించడానికి ఎప్పటికప్పుడు కొత్తగా అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఒకసారి ఈకేవైసీ, మరోసారి బ్యాంకులో సాంకేతిక సమస్య ఇలా చెబుతూ పోతే అనేక సమస్యలు వెతికి బా«ధితులను బుట్టలో వేసుకుంటున్న మాయదారి మోసగాళ్లు కొత్త తరహా మోసానికి తెర తీశారు. బాధితులు నమ్మరన్న సాకుతో ఆశా వర్కర్లతోనే ఫలానా వారు ఫోన్‌చేస్తారని చెప్పించి.. తర్వాత వీడియో కాల్ చేసి తెలుగులో మాట్లాడుతూ సొమ్ములు వేస్తున్నామని చెప్పి వివరాలు రాబట్టి అకౌంటులో ఉన్న మొత్తాలను కాజేస్తున్నారు. ఈ తరహా మోసాలు ఇటీవల అధికమయ్యాయి. కరోనా సొమ్ము పేరుతో టోకరా నాలుగైదు రోజులుగా అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో కలెక్టరేట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ముందుగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎం లేదా వలంటీర్లకు ఫోన్ చేసి కరోనాతో మృతి చెందిన వారికి సంబంధించి పరిహారం (ఇన్‌స్రూెన్స్) వచ్చిందని నమ్మబలుకుతున్నారు. అయితే సైబర్ నేరస్తులు కలెక్టరేట్ పేరు చెప్పడంతో నిజంగా నమ్మి బాధిత కుటుంబాలకు పరిహారం సొమ్ము వచ్చిందని భావించి వివరాలు అందిస్తున్నారు. అంతేకాకుండా సైబర్ నేరగాళ్లు సంబంధిత ఏఎన్ఎం, ఆశా వర్కర్, వలంటీర్లతోనే బాధితులకు ఫోన్ చేయించి ఫలానా వారు ఫోన్ చేసి వివరాలు అడుగతారని, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు నేరుగా బాధితులకు ఫోన్ చేసి వివరాలు అడగడంతోపాటు వీడియో కాల్ చేసి తెలుగులో మాట్లాడుతూ మేము చెప్పిన విధంగా అప్లోడ్ చేయాలని బాధితులను పక్కదారి పట్టిస్తున్నారు. అందులోనూ మీ అకౌంటులో కొంత మొత్తం ఉంటేనే ఈ పరిహారం సొమ్ము పడుతుందని చెప్పి.. వీడియో కాల్‌లోనే ఓటీపీ అడిగి తీసుకుని సొమ్మును కాజేస్తున్నారు. ఈ తరహా మోసాలు వైఎస్సార్ జిల్లాలో కనిపించాయి. దీంతో పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. రోజుకో మోసం ప్రజలకు సంబంధించి ఏదో ఒక సమస్యపై సైబర్ నేరగాళ్లు ఏదో ఒక రకంగా మోసం చేస్తున్నారు. అప్పటికప్పుడు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. చివరకు కరోనాతో కుటుంబీకులను కోల్పోయిన బాధితులను కూడా పరిహారం డబ్బుల ఆశ పేరుతో మోసం చేస్తున్నారు. వివరాలు, ఇతరత్రా చెప్పకపోతే సొమ్ములు రావేమోనన్న భయంతో అప్పటికప్పుడు బాధితులు వారు అడిగివన్నీ తెలియజేస్తూ దారుణంగా మోసపోతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసుశాఖ కూడా సీరియస్‌గా దృష్టి సారించింది. వీడియో కాల్లో తెలుగులో మాట్లాడుతూ మోసం చేస్తున్న వైనంపై ఇప్పటికే గ్రామీణ స్థాయిలో మహిళా పోలీసులతోపాటు పోలీసుస్టేషన్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మనల్ని మనం కాపాడుకునే ఆయుధం పెట్టుకోవాలి మనం ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇంటికి తాళం వేస్తాం. ఒకటి, రెండుసార్లు సరిగా వేశామో, లేదో తనిఖీ చేసి బయటికి వెళతాం. అలాగే సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ (ఫోన్ పే, గుగూల్ పే, పేటీఎం) ఫోన్ పాస్‌వర్డ్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తేలికైన పాస్వర్డ్ పెట్టుకుంటే సైబర్ నేరగాళ్ల చేతికి తాళాలు మనమే ఇచ్చినట్లుగా భావించాలి. పుట్టిన తేదీ, పెళ్లిరోజు, పిల్లలు, భాగస్వామి పేరు లాంటివి పాస్‌వర్డ్‌గా పెట్టుకోవద్దు. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినప్పుడు వెంటనే చెక్ చేయడం ద్వారా ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. పాస్వర్డ్ ఎనిమిది అంకెలకు తక్కువ లేకుండా అక్షరాలతోపాటు నంబర్లు, గుర్తులను పెట్టుకోవాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి పాస్వర్డ్ మార్చుకుంటే మంచిది. కరోనా ఆర్థికసాయం పేరుతో కాల్స్ వస్తే నమ్మరాదు కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోందని నైబర్ నేరగాళ్లు ఫోన్‌కాల్స్ చేస్తున్నారు. అలాంటి ఫేక్ కాల్స్ నమ్మరాదు. ఈ విధంగా కరోనా పేరుతో సైబర్ నేరగాళ్ల బారిన పడి పలువురు మోసపోయినట్లు మా దృష్టికి వచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కరోనా బారినపడి మృతి చెందిన కుటుంబాలకు ఆర్థికసాయం అందించే యాప్‌లుగానీ, లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దు. బ్యాంకు ఖాతాలో కనీసం రూ. 50 వేలు ఉండాలని చెబుతూ సదరు బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ చెబితే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్పి మోసగిస్తున్నారు. ఎవరైనా ఫోన్ చేసినా మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేయరాదు. -
నా కూతుళ్లకే వ్యాక్సిన్ వేస్తారా! అంటూ గొడవ చేసిన తండ్రి...
Girl vaccinated after her mother’s consent: హర్యానాలోని ఒక వ్యక్తి తన కూతుళ్లుకు వ్యాక్సిన్ వేసినందుకు పెద్ద హంగామ సృష్టించాడు. వ్యాక్సిన్ వేసిన ఆరోగ్యకర్తలను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...హర్యానాలోని నిహల్‌గర్ గ్రామంలో ఒక ఆరోగ్యం కేంద్రంలో అంగన్వాడి, ఆశా వర్కర్లు పిల్లలకు వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఈ మేరకు ఓ ఇద్దరు బాలికలు తమ తల్లి అనుమతితో ఆరోగ్యం కేంద్రం వద్ద యాంటీ మీజిల్స్ వ్యాక్సిన్లు వేయించుకున్నారు. వాస్తవానికి ఆ వ్యాక్సిన్ తట్టు లేదా పొంగు వంటి వ్యాధుల రాకుండా వేసే వ్యాక్సిన్. ఐతే ఇంతలో ఆ బాలికల తండ్రి హరుణ్ ఆరోగ్య కేంద్రం వద్దకు వచ్చి తన కూతుళ్లకు వ్యాక్సిన్ ఎందుకు వేశారంటూ పెద్ద రగడ చేశాడు. అంతేకాదు వ్యాక్సిన్లు వేసే అంగన్వాడి, ఆశా వర్కరులను దుర్భాషలాడుతూ...చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో నిర్మలా యాదవ్ అనే ఆరోగ్య కార్యకర్త పోలీసులుకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు హరుణ్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని పేర్కొన్నారు. అతను విచారణలో తన నేరాన్ని ఒప్పుకున్నాడని, కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: అక్క వెంటే చిట్టితల్లి.. హృదయాన్ని కదిలించిన దృశ్యం) -
రక్తం నోటితో పీల్చాలా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షు’ అన్న చందంగా మారింది.. ఆశ (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్–ఏఎస్హెచ్ఏ) కార్యకర్తల పరిస్థితి. చాలీచాలని వేతనాలతో గ్రామస్థాయిలో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకుని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమందించే ఆరోగ్య వారధులు.. ఆశా కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం అయ్యేలా చూడటం, పిల్లలకు టీకాలు వేయించడం తద్వారా మాతాశిశు మరణాలు తగ్గించడం వీరి ప్రధాన విధులు. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ ఆశ వర్కర్ల సంక్షేమంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. కరోనా వంటి ప్రాణాంతక వ్యాధుల గుర్తింపులోనూ వీరి సేవలు వినియోగించుకుంటున్న ప్రభుత్వం వారికి కనీస భద్రతా సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతోంది. ప్రస్తుతం హిమోగ్లోబిన్ పరీక్ష, క్షయ (టీబీ) వ్యాధిగ్రస్తుల నుంచి శాంపిల్స్ సేకరించే క్రమంలో తామెక్కడ వ్యాధుల బారిన పడతామోనని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఇవి ల్యాబ్ టెక్నీషియన్ వంటి నిపుణులతో చేయించాలి్సన పనులను తూతూ మంత్రంగా శిక్షణ ఇప్పించి.. తమతో చేయించడం అన్యాయమని వాపోతున్నారు. 20 తెమడ శాంపిళ్లు మోసుకురావాలా? ఇదే క్రమంలో వీరికి అప్పగించిన మరో పని టీబీ నిర్ధారణ. గతంలో రెండువారాల పాటు రాత్రిళ్లు జ్వరంతో బాధపడుతూ.. నిర్విరామంగా దగ్గుతూ, బరువు తగ్గిన వారికి మాత్రమే ఉదయంపూట ఆశ కార్యకర్తలు తెమడ సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపేవారు. ► ఈ క్రమంలో వీరిలో నూటికి 99 శాతం పాజిటివ్ రేటు ఉండేది. కానీ, ప్రస్తుతం జిల్లా వైద్యాధికారులు టీబీ పరీక్షల శాంపిల్స్ సేకరణలో టార్గెట్ విధించారు. ప్రతీ సబ్సెంటర్కు ముగ్గురు లేదా నలుగురు (వెయ్యిమందికి ఒక ఆశ) కార్యకర్తలు ఉంటారు. ► వీరు తలా 20 తెమడ పరీక్షలు తేవాలని లక్ష్యం విధించారు. ఆ స్థాయిలో అనుమానిత కేసులు లేవని ఆశ కార్యకర్తలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా.. అధికారులు మాత్రం ససేమీరా అంటున్నారు. నెలనెలా నిర్వహించే రివ్యూ మీటింగుల్లో ఆశ కార్యకర్తలపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. ► ఈ క్రమంలో తెమడ శాంపిల్స్ ఉన్న డబ్బాలను తాము చేతులతో మోసుకుపోతున్నామని, వీటిని పట్టుకుని బస్సు, ఆటో ఏది ఎక్కినా.. భయంతో తోటి ప్రయాణికులు కిందకు దించేస్తున్నారని వాపోతున్నారు. ► వాస్తవానికి హిమోగ్లోబిన్, తెమడ పరీక్షలు రెండూ ఆశలకు కేటాయించిన విధులు కావు. వీటికి ప్రత్యేకంగా టీఏ, డీఏలు ఏమీ రావు. అయినా, వీరు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఈ పనులు చేస్తున్నారు. ► క్షయ అంటువ్యాధి అని, సరైన రక్షణ లేకుండా రోగి వద్దకు వెళ్లినా, ఏమరుపాటుగా ఉన్నా.. తాము రోగాల బారిన పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులతో భోజనం చేయలేకపోతున్నామని, తమతో కుటుంబ స భ్యులు ఏం వ్యాధులు సంక్రమిస్తాయో అని నిత్యం భయపడుతున్నారని అంటున్నారు. రక్తం నోటితో పీల్చాలా? ► ఫీవర్ సర్వే కోసం ఆశ కార్యకర్తలు ఇల్లిళ్లూ తిరిగి హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాలి. ఇందుకోసం ప్రతీ ఆశకు వైద్యాధికారులు ఒక కిట్ ఇచ్చారు. దానిసాయంతో జ్వరంతో బాధపడుతున్న వారికి హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాలి. ► కిట్‌లో డీఅయోనైజ్డ్ వాటర్, హైడ్రో క్లోరిక్ యాసిడ్ (హెచ్‌సీఎల్), పరీక్షనాళిక, హి మోగ్లోబినో మీటర్, పిప్పెట్, సూదులు, కాటన్ తదితరాలు ఉంటాయి. ఇందులో సూది సాయంతో రోగి వేలిపై పొడిచి ఆ రక్తాన్ని నేరుగా పిప్పిట్లోకి 20 మైక్రోలీటర్ మార్కు వచ్చేంత వరకు నోటితో పీల్చాలి. ► తరువాత ఈ రక్తాన్ని అంతే ఓపికతో హెచ్‌సీఎల్ కలిపిన ట్యూబ్‌లో నోటితో ఊదుతూ వదలాలి. దానికి డీ అయోనైజ్డ్ వాటర్ కలుపుతూ హిమోగ్లోబిన్ పరీక్ష నిర్వహిస్తారు. అయితే, ఇక్కడే ఆశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ► రోగి రక్తాన్ని పిప్పెట్లోకి ఎక్కించే క్రమంలో ఆ రక్తం నోటిలోకి వెళితే? అన్న ఆందోళన వీరిని వెంటాడుతోంది. ఎవరికి ఏ వ్యాధులు ఉన్నాయో? అవి తమకు ఎక్కడ సంక్రమిస్తాయో అని భయపడుతున్నారు. రెక్కాడితే గానీ, డొక్కాడని పేద బతుకులు తమవని, అలాంటి తమకు ఇలాంటి పనులు చెప్పడం తగదని అంటున్నారు. మా బతుకులకు రక్షణ ఏది వాస్తవానికి టీబీ, హిమోగ్లోబిన్ పరీక్షలు చేసే క్రమంలో ఎలాంటి రక్షణను వైద్యాధికారులు కల్పించడం లేదు. కనీసం అవసరాలైన మా స్కు, శానిటైజర్, గ్లోవ్స్, కళ్లద్దాలు లాంటి కనీస సదుపాయాలు లేవు. దీంతో ఎప్పుడు ఏ వ్యాధి బారిన పడతామోనని భయంభయంగా విధులు నిర్వహిస్తున్నాం. రక్తం నోట్లోకి వెళితే ఎలా? టీబీ అనుమానితుడి తెమడ ద్వారా వ్యాధి సంక్రమిస్తే ఎలా? అన్న భయంతో.. బిక్కుబిక్కుమంటూ విధులు ని ర్వహిస్తున్నాం. మా బతుకులకు రక్షణ లేదు. – మారెళ్ల శ్రీలత, ఆశా యూనియన్ కరీంనగర్ జిల్లా ప్రధానకార్యదర్శి -
అరక దున్నిన అత్త.. విత్తనాలు వేసిన కోడళ్లు!
వ్యవసాయంలో మహిళల శ్రమే అధికమైనా... రైతు అనగానే నెత్తిన తలపాగ, చేతిలో అరకతో ఓ పురుష రూపం గుర్తుకొస్తుంది. దాన్ని బ్రేక్ చేశారు నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీశైలమ్మ. చింతపల్లి మండలం కుర్రంపల్లిలో గురువారం ఆమె అరక దున్నుతుండగా, తన ఇద్దరు కోడళ్లు విత్తనాలు వేస్తూ కనిపించారు. శ్రీశైలమ్మ భర్త రామచంద్రం సామాజిక కార్యకర్త. వారికి ఆరుగురు కుమారులు. ఇద్దరు ఆర్మీలో ఉన్నారు. నలుగురు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా శ్రీశైలమ్మ భర్తతోపాటు వ్యవసాయ పనులు చేస్తూ స్ఫూర్తినిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, చింతపల్లి (దేవరకొండ) ‘ఆశ’క్తిగా ఖోఖో ఆదిలాబాద్ డైట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్‌లతో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న గురువారం ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన క్రీడా వస్తువులు, మైదానాన్ని పరిశీలించి వెళ్లిపోయారు. అనంతరం విధి నిర్వహణలో భాగంగా అక్కడే ఉన్న ఆశ వర్కర్లు ఖోఖో ఆడారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శైలజ వారితో కలిసి ఉత్సాహంగా ఖోఖో ఆడుతూ కనిపించారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ పిల్లల్ని పలకరించి.. కలిసి భోజనం.. గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి హైస్కూల్లో కలెక్టర్ కె.శశాంక విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం తీగలవేణికి హాజరైన కలెక్టర్ ‘మన ఊరు – మన బడి’లో ఎంపికైన జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో పిల్లలు ప్లేట్లు పట్టుకొని బారులు తీరారు. కలెక్టర్ శశాంక వారితో మాట్లాడిన అనంతరం వంటకాలను పరిశీలించారు. ‘రోజూ రుచికరంగా వండి పెడుతున్నారా? నేను మీతో కలిసి భోజనం చేయొచ్చా’.. అని కలెక్టర్ కోరగా.. సార్... రండి అంటూ పిల్లలు ఆనందంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ వారితో కూర్చుని భోజనం చేశారు. ‘వంటలు బాగానే ఉన్నాయి. ఇలాగే చేయండి’.. అని అన్నారు. (క్లిక్: గోళీ అంత గుడ్డు.. వావ్.. మూన్!) -
ASHA Workers: ఆశా వర్కర్లకు డబ్ల్యూహెచ్‌వో పురస్కారం
జెనీవా: భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలందిస్తోన్న ఆశా వర్కర్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గ్లోబల్ హెల్త్ లీడర్స్ పురస్కారం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య సేవలందించడంతో వీరు కీలకంగా ఉన్నారని, కరోనా మహమ్మారి సమయంలో అలుపెరగని విధంగా శ్రమించారని కొనియాడింది. ఆరోగ్యవంతమైన సమాజం కోసం, స్థానిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ముందుండి నిబద్ధతతో పనిచేసిన ఆరు సంస్థలు, వ్యక్తులకు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ పురస్కారాలు ప్రకటించారు. ఈ సంస్థల్లో భారత ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న 10 లక్షల మంది ఆశా(అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్)లు కూడా ఉన్నారు. ఆశా వర్కర్లతో పాటు మరో ఐదింటికి అవార్డులు అందించింది డబ్ల్యూహెచ్‌వో. ఆశా కార్యకర్తలందరికీ అభినందనలు. ఆరోగ్యవంతమైన భారతదేశానికి భరోసా ఇవ్వడంలో వారు ముందున్నారు. వారి అంకితభావం, సంకల్పం ప్రశంసనీయం అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. Delighted that the entire team of ASHA workers have been conferred the @WHO Director-General’s Global Health Leaders’ Award. Congratulations to all ASHA workers. They are at the forefront of ensuring a healthy India. Their dedication and determination is admirable. https://t.co/o8VO283JQL — Narendra Modi (@narendramodi) May 23, 2022 -
నవమాసాలు మోసి... పుట్టగానే వదిలేసి..
బయ్యారం: నవమాసాలు మోసి కన్న శిశువును మానవత్వం లేకుండా వదిలించుకున్నారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. బచ్చలిబజార్లో నివసించే ఆశ వర్కర్ లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఓ ఆడశిశువును లక్ష్మి ఇంటి సమీపంలో వదిలివెళ్లారు. చిన్నారి ఏడుపు వినిపించడంతో స్థానికులు పరిశీలించగా పసికందు కనిపించింది. వెంటనే ఆశ వర్కర్‌తో పాటు స్థానికులు చిన్నారిని బయ్యారం పీహెచ్‌సీకి తీసుకెళ్లి చైల్డ్‌హెల్ప్‌లైన్, పోలీస్, బాలసంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. ఎస్సై జగదీశ్, బాలల సంరక్షణ అధికారి నరేష్, చైల్డ్‌హెల్ప్‌లైన్ టీమ్ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శిశువును మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పసికందును వదిలిపెట్టి వెళ్లిన వారిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలల సంరక్షణ, చైల్డ్ హెల్ప్‌లైన్ టీం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిశువు ఆకలి తీర్చిన మరో అమ్మ పేగుబంధాన్ని ఓ అమ్మ వద్దనుకొని వదిలిపెడితే.. మరో అమ్మ ప్రేమతో ఆ బిడ్డ ఆకలితీర్చింది. బచ్చలిబజార్లో వదిలిపెట్టిన ఆ పసికందును స్థానిక పీహెచ్‌సీకి తరలించిన సమయంలో ముçస్తఫానగర్కు చెందిన సోని ఆ శిశువును చూసేందుకు పీహెచ్సీ వద్దకు వచ్చింది. ఆ సమయంలో శిశువు ఆకలితో ఏడుస్తుండటంతో సోని తన ఒడిలోకి తీసుకొని పాలిచ్చి అమ్మప్రేమను ప్రదర్శించింది. దీంతో స్థానికులు సోనిపై ప్రశంసలు గుప్పించారు. -
ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
కవాడిగూడ: ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లు అందించడం గర్వకారణమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శుక్రవారం కవాడిగూడ డివిజన్ దోమలగూడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 19 మంది ఆశావర్కర్లకు ఎమ్మెల్యే స్మాట్‌ఫోన్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెల్ఫోన్లు అందించడంతో ప్రతి వ్యక్తి ఆరోగ్యం గురించి ఆశావర్కర్లు అందులో ఎంటర్ చేస్తారన్నారు. టీకాలు, జ్వర పరీక్షలు, మందుల పంపిణీ వంటి సమాచారం ఎంట్రీ అవుతుందన్నారు. కరోనా సమయంలో ఆశావర్కర్లు ఇంటింటికి తిరిగి సమగ్ర విచారణ చేపట్టి కరోనా సోకిన వ్యక్తులను గుర్తించి మందుల కిట్లను పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఈ నెల 27న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
వైద్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
కాప్రా: ఆరోగ్య కార్యక్రమాలు విజయవంతం కావడంలో ఆశ వర్కర్లది కీలక పాత్ర అని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కొనియాడారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ జమ్మిగడ్డలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐదుగురు ఆవ వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి అధిక నిధులు కేటాయిస్తున్నారన్నారు. ఆశవర్కర్లు టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రజలకు మరిన్ని మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు. గత ప్రభుత్వాల హయాంలో వేతనాలు సరిగా అందక, ఎప్పుడు వస్తుందో తెలియక ఆశ వర్కర్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వారి వేతనాలు పెంచి ప్రతి నెల సమయానికి అందేలా చొరవ చూపుతోందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆశ వర్కర్లకు వేతనాలు అందిస్తున్న ఘనత ఒక్క కేసీఆర్‌దే అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషరెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కాసం మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ ఉప్పల్ నియోజకవర్గం నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి వైద్యులు సంపత్‌కుమార్, స్వప్న పాల్గొన్నారు. దుప్పట్ల పంపిణీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం జమ్మిగడ్డలో టీఆర్ఎస్ పార్టీ సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఏఎస్‌రావునగర్ డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి హాజరై వృద్ధులు, పేదలకు దుప్పట్లు, దుస్తులు, పండ్లు అందించారు. -
సేవల్లో వేగం.. తగ్గనున్న పనిభారం
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య రంగంలో ఆశా వర్కర్లు అత్యంత కీలకం. పట్టణాలు, గ్రామాల్లో నిర్దిష్ట జనాభా పరిధిలో వారు సేవలు అందిస్తున్నారు. ఫీవర్ సర్వేలు, టీబీ సర్వేలు మొదలుకొని, గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు, ఇతర ప్రజానీకం ఆరోగ్య వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయడం వరకు ఆశా వర్కర్లదే బాధ్యత. వీరి సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వారి వేతనాలను రూ. 3వేల నుంచి ఏకంగా రూ. 10వేలకు పెంచారు. బకాయిలు లేకుండా ప్రతి నెలా వారి ఖాతాల్లో వేతనాలు జమ అవుతున్నాయి. తాజాగా కోవిడ్ సమయంలోనూ వారు సమర్థంగా సేవలు అందించారు. ఈ నేపథ్యంలో వారి పనిని సులభతరం చేసేందుకు ప్రభుత్వం ‘స్మార్ట్’గా ఆలోచించింది. ఇప్పటివరకు ఆశా వర్కర్లు సర్వేల సమయంలో మాన్యువల్ విధానంలో అంటే.. ప్రశ్నావళిని అడిగి పేపర్లలో రాసుకునేవారు. దీనికోసం ఒక్కో ఇంటివద్దే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చేది. సేకరించిన సమాచారం కంప్యూటర్లో నమోదు చేసి ఉన్నతాధికారులకు పంపడం మరో జాప్యం. ఇకపై ఇవన్నీ ఉండవు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40వేల మంది ఆశా వర్కర్లకు సర్కారు త్వరలోనే స్మార్ట్ ఫోన్లు ఇవ్వనుంది. దీనిద్వారా వారిని డిజిటల్ సేవలవైవు నడిపిస్తున్నారు. సేవల్లో వేగం పెరగడంతో పాటు ఆశావర్కర్లకు పనిభారమూ తగ్గనుంది. తెలుగులోనే యాప్.. ఆశా వర్కర్లకు మొబైల్ కొనుగోళ్లకు సుమారు రూ. 25 కోట్లకు పైనే వ్యయం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ ఆరోగ్యమిషన్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే టెండరు పూర్తయి, కొనుగోళ్లకు ఆర్డర్లు ఇచ్చారు. జూలైలో ఇవి అందరికీ సరఫరా చేయాలన్నది లక్ష్యం. ఆశా వర్కర్లు పదవ తరగతి, అంతకంటే తక్కువ చదివిన వారు చాలామంది ఉన్నారు కాబట్టి తెలుగులోనే యాప్‌ను తయారు చేశారు. అలాగే పిక్టోరియల్ (చిత్రాలతో కూడిన) యాప్ కూడా ఉంటుంది. జనం సమస్యలు తెలుసుకుని ఆశా వర్కర్లు యాప్‌లో నమోదు చేయగానే.. ఆ సమాచారాన్ని జిల్లా అధికారుల నుంచి రాష్ట్ర అధికారుల వరకూ ఎవరైనా చూసుకునే వీలుంటుంది. ఉదాహరణకు ఒక హైరిస్క్ ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి వివరాలు నమోదు చేసినప్పుడు సంబంధిత విభాగాధికారికి సమాచారం వేగంగా వెళ్తుంది. వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికోసం ఆశా వర్కర్లకు స్మార్ట్‌ఫోన్, యాప్‌ల వాడకంపై శిక్షణ ఇవ్వనున్నారు. సేకరణ సులువవుతుంది ఆశాలకు ఇచ్చే స్మార్ట్‌ఫోన్‌లో తెలుగులోనే యాప్ ఉంటుంది. బొమ్మలు ఉంటాయి. దీంతో సులభంగా వివరాల నమోదుకు అవకాశం ఉంటుంది. గతంలోలాగా ఆశా వర్కర్లు ప్రశ్నావళితో కుస్తీపట్టాల్సిన అవసరం ఉండదు. జూలై నెలాఖరుకు ఫోన్లు అందజేసి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ -
మరింత పక్కాగా వ్యాక్సినేషన్
సాక్షి, అమరావతి: కోవిడ్ అదుపునకు వ్యాక్సిన్ ఎంత అవసరమో.. వేయించుకునే క్రమంలో జాగ్రత్తగా ఉండటం అంతే అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ వేయించుకునే క్రమంలో పెద్ద ఎత్తున గుమిగూడే జనాల వల్ల కరోనా వ్యాప్తి తేలికగా జరుగుతోందని చెబుతున్నారు. వ్యాక్సిన్ మొదలైన తర్వాత పలు సంస్థలు కరోనా వ్యాప్తిపై అధ్యయనాలు చేశాయి. ఇందులో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటి ప్రముఖ సంస్థలూ ఉన్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మూడు రకాల అధ్యయనాలు జరిగాయి. తొలి దశలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌ను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఎక్కువగా వేశారు. శాఖాపరంగా ఎక్కడికక్కడే వేయడం వల్ల పెద్దగా సమస్య రాలేదు. రెండో దశలో అన్ని కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ జన సమూహాల మధ్యే జరుగుతోంది. ప్రభుత్వమే వ్యాక్సిన్ వేస్తుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో కోవిడ్ నిబంధనలు పాటించేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. వేసవి తీవ్రతకు మధ్య మధ్యలో మాస్‌్కలు తీస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇరుకుగా ఉన్న ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగింది. మూడో అధ్యయనంలో మొదటి, రెండో డోస్ కోసం వచ్చే వారి సంఖ్య బాగా పెరిగింది. ఎవరికి వారు తమ పనవ్వాలనే ఆతృతతో వ్యవహరించారు. ఫలితంగా కోవిడ్ వ్యాప్తికి వ్యాక్సినేషన్ కేంద్రాలే కారణమవుతున్నాయని అధ్యయన సంస్థలు అంటున్నాయి. ఇకపై ఇలా.. ప్రస్తుతం అనుకున్న రీతిలో కేంద్రం నుంచి వ్యాక్సిన్ సరఫరా కావడం లేదు. అందువల్ల 45 ఏళ్లు పైబడిన వారికి రెండవ డోసు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఎవరెవరికి అవసరమో ఆశా వర్కర్లు ముందుగానే గుర్తించి వారికి సమాచారం ఇస్తారు. ఆ మేరకు వ్యాక్సిన్ కేంద్రాల వద్దకు వచ్చిన వారిని వలంటీర్లు అక్కడ కూర్చోబెట్టి.. ఒక్కొక్కరిని లోపలకు పంపి వ్యాక్సిన్ వేయిస్తారు. వ్యాక్సిన్ లభ్యత పెరిగే వరకు మొదటి డోసు వేయించుకునే వారు కేంద్రాల వద్దకు వచ్చే అవకాశం లేనందున తొక్కిసలాటకు, గుమిగూడటానికి అవకాశం ఉండదు. అందువల్ల ఒకరి మీద ఒకరు పడకుండా, వ్యాక్సిన్ వేసే సిబ్బందికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కరోనా వ్యాప్తిని చాలా వరకు కట్టడి చేయొచ్చు. -
వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద డాక్టర్ హంగామా.. ఎందుకంటే..
సాక్షి, యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగిరి మండలం ముస్త్యాల ప్రభుత్వం పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద అదే గ్రామానికి చెందిన డాక్టర్ విజయ్‌కుమార్ హంగామా చేసినట్లు సర్పంచ్ లావణ్య తెలిపారు. సెంటర్ ఇక్కడ ఎందుకు పెట్టారు అంటూ ఏఎన్ఎం, ఆశ వర్కర్లను, మెడికల్ ఆఫీసర్‌ను, కార్యదర్శితో గొడవకు దిగినట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ సెంటర్‌కు ప్రజలు రాకుండా ఇబ్బంది కలిగేలా తన బైక్‌ను అడ్డుగా పెట్టడంతో, బైక్ తీయాలని అడిగిన నాగరాజుపై చేయిచేసుకున్నట్లు తెలిపారు. దీనిపై గోదావరిఖని టూటౌన్ పోలీసులకు సమాచారం అందించగా కానిస్టేబుల్ రావడంతో గొడవ సద్దుమణిగినట్లు తెలిపారు. ఈ విషయంపై పెద్దపల్లి డీఎంహెచ్ఓ దృషికి తీసుకెళ్తామని తెలిపారు. కాగా విజయ్‌కుమార్ యైటింక్లయిన్‌కాలనీ అల్లూరు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలో మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. -
మూడో రోజు 14,606 మందికి వ్యాక్సిన్
సాక్షి, అమరావతి/ భీమడోలు: హెల్త్‌కేర్ వర్కర్లకు నిరంతరాయంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్ ప్రక్రియలో భాగంగా మూడో రోజు రాష్ట్రంలో 14,606 మందికి వేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మూడో రోజు ప్రక్రియ ముగిసింది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 1,847 మందికి వ్యాక్సిన్ వేశారు. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 459 మందికి వ్యాక్సిన్ వేశారు. 3.87 లక్షల మందికి ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని కుటుంబ సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. తొలిరోజు 19,108 మందికి రెండో రోజు 13,036 మందికి వ్యాక్సిన్ వేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 16వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 29 మంది ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది.. వైద్యుల పర్యవేక్షణలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆ తర్వాత రోజు ఆగడాలలంక గ్రామానికి చెందిన కురమా షారోన్‌రాణి, చిగురుపాటి సుశీలకు తల, ఒళ్లు నొప్పులు ప్రారంభమయ్యాయి. సోమవారం వాంతులు కూడా కావడంతో ఏలూరు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచించారు. జిల్లాల వారీగా సోమవారం వ్యాక్సిన్ వేయించుకున్న వారి వివరాలు ఇలా.. -
ఆశా జీవులు
సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ముందు వరుసలో ఉండి కరోనా వ్యాప్తి నిరోధానికి పాటు పడినన్నాళ్లూ ఆశా వర్కర్లను పిలిచి కిరీటం పెట్టని ఢిల్లీ ప్రభుత్వం.. ఇప్పుడు వాళ్లు తమ గౌరవ వేతనాన్ని కనీసం పదివేల రూపాయలకైనా పెంచాలని కోరుతూ నిరసనకు కూర్చుంటే.. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేస్తోంది! ఢిల్లీలో ఆశా వర్కర్లు జూలై 21 నుంచి ధర్నాలో ఉన్నారు. వారిలో కొందరు బుధవారం జంతర్ మంతర్ దగ్గర భైఠాయించినప్పుడు సుమారు 100 మంది ‘ఆశా’ జీవులపై పార్లమెంట్ స్ట్రీట్ స్టేషన్ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్, ఎపిడమిక్ డీసీజ్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌ల కింద కేసులు పెట్టారు! ఆశా వర్కర్లు ప్రస్తుతం 4 వేల రూపాయల వేతనానికి మోయలేని సేవలే అందిస్తున్నారు. ఇంకో ఆరువేలు పెంచాలని, పి.పి.ఇ. కిట్లు ఇవ్వాలని వారి డిమాండ్. విజ్ఞప్తిని డిమాండ్ వరకు ప్రభుత్వమే తెచ్చుకుంది. తిరిగి ప్రభత్వమే ఇప్పుడు వారిపై కేసులు పెడుతోంది. ఆశావర్కర్ల ఢిల్లీ కో ఆర్డినేటర్ కవితా యాదవ్ మాత్రం ఈ కేసుల గురించి కన్నా పెరుగుతున్న కరోనా కేసుల గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీని కరోనాకు వదిలి పెట్టామే అని అపరాధ భావన వాళ్లను నిలువనిచ్చేలాను, కూర్చోనిచ్చేలానూ లేదు.‘ప్రభుత్వానికి లేకుంటే మాకు ఉంటుంది కదా’ అని సేవలకు పునరంకితం అయేందుకు తన సేనను సమాయత్తం చేసున్నారు కవిత. -
అమ్మా.. మీ సేవలు భేష్
సాక్షి, సిద్దిపేట: ‘అమ్మా.. నేను హరీశ్‌రావును మాట్లాడుతున్నా.. కరోనా కష్టకాలంలో మీరు చేస్తున్న సేవలు అభినందనీయం.. మీ చేతుల్లోనే ప్రజల ఆరోగ్యం ఉంది.. ఇప్పటి వరకు బాగానే పనిచేస్తున్నారు.. ఇక ముందు కూడా మెరుగైన సేవలు అందించాలి’.. అని జిల్లాలోని ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లకు ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అభినందించారు. హైదరాబాద్ నుంచి మంత్రి సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని డంప్ యార్డులు, వైకుంఠధామాలు, హరితహారం మొదలైన కార్యక్రమాల అమలు తీరును తెలుసుకున్నారు. జిల్లాలోని బక్రిచెప్యాల గ్రామం ఆశవర్కర్ శకుంతల, మిట్టపల్లి గ్రామ ఏఎన్ఎం శోభ, తడ్కపల్లి గ్రామం అంగన్వాడీ టీచర్ తిరుమలకు మంత్రి ఫోన్ చేసి మాట్లాడారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలంటే మహిళల్లో చైతన్యం రావాలని చెప్పారు. కరోనా వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి మీరు సర్వే చేయడంతోనే కొంతమేరకు కరోనాను నివారించగలిగామని తెలిపారు. ఆహారానికి గంట ముందు, తిన్న తర్వాత తప్పనిసరిగా వేడి నీళ్లు తాగాలనే విషయం చెప్పాలని కోరారు. అలాగే.. ఆవిరి పట్టడం, వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కాగా, మంత్రి నేరుగా ఫోన్ చేసి అభినందించడం పట్ల ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు సంతోషం వ్యక్తం చేశారు. -
అమ్మా.. బాగున్నారా!
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో ఆశా వర్కర్లతో కలసి పర్యటిస్తున్న మంత్రి పేర్ని నాని. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న మంత్రి ఎవరూ భయపడవద్దని, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోందని ధైర్యం చెప్పారు. సాక్షి, అమరావతి: విదేశాలకు వెళ్లి వచ్చిన వారు.. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వాళ్లు.. వీరితో సన్నిహితంగా మెలిగిన వాళ్లు.. కరోనా వైరస్ అనుమానితులు.. ఇలా గత కొన్ని రోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, పీహెచ్సీ వైద్యులు ఎంతో ఊరట కల్పిస్తున్నారు. వారికి నిత్యం ధైర్యం చెబుతూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ప్రతిరోజూ వారి ఇంటికే వెళ్లి పలకరిస్తున్న తీరు బాధితులకు కొండంత భరోసానిస్తోంది. వీరు ఇంటింటికీ వెళ్లి ఏం చేస్తున్నారంటే.. ► ఉదయం 8 గంటల నుంచి ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు హోం ఐసొలేషన్‌లో ఉన్న వారి ఇంటి వద్దకు వెళ్లి భౌతిక దూరం పాటిస్తూ వారిని పేరుపేరునా పలకరిస్తారు. ► అమ్మా బాగున్నారా.. అయ్యా బాగున్నారా.. దగ్గు జలుబు ఏమైనా ఉన్నాయా అంటూ వివరాలు సేకరిస్తున్నారు. ► దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలు ఉంటే తెలుసుకోవడం, ఆ లక్షణాలున్న వారి పేర్లు నమోదు చేసుకుని పీహెచ్సీ డాక్టరుకు సమాచారమిస్తారు. ► చిన్నచిన్న వ్యాధులకైతే ఏఎన్ఎంలే మందులు అందజేస్తారు. ► విదేశీ ప్రయాణీకులకు సంబంధించి రోజూ 29 వేల ఇళ్లకు వెళ్లి వాకబు చేస్తున్నారు. ► మరో 2500 ఇళ్లకు పైగా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి తరఫు బంధువుల ఇళ్లకు వెళ్లి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ► ఇలా రాష్ట్రవ్యాప్తంగా 40వేల మంది ఆశా కార్యకర్తలు, మరో 15వేల మంది ఏఎన్ఎంలు పనిచేస్తున్నారు. ► వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది వీరికి అదనం. నేటి సాయంత్రానికి గణన పూర్తి రాష్ట్రంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి గణన నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రానికల్లా వయసుల వారీగా అందరి వివరాలు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు సేకరిస్తారు. మధుమేహం, రక్తపోటు తదితర దీర్ఘకాలిక రోగాలున్న వారి సమాచారం తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. అలాగే, ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా 108, 104కు ఫోన్ చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. -
కాన్పు కష్టాలు
ములకలపల్లి: రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలందడంలేదు. వాహనం సౌకర్యంలేక ఓ గొత్తికోయ మహిళ అటవీ ప్రాంతంలోనే ప్రసవించింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఆదివాసీ గొత్తికోయ గ్రామమైన పూసుగూడెం పంచాయతీ సోయం గంగులునగర్‌కు చెందిన మడకం ధూలెకు శనివారం పురిటి నొప్పులు వచ్చాయి. అయితే ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేదు. దీంతో ఆశ కార్యకర్త ధనలక్మి, అంగన్వాడీ టీచర్ దుర్గ, ఏఎన్ఎం జ్యోతిలు కలసి జోలెలో గర్భిణీని 3 కిలో మీటర్లు మోసుకుంటూ వచ్చారు. నొప్పులు ఎక్కువ కావడంతో మార్గమధ్యలోనే కాన్పు చేశారు. ధూలె మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను మంగపేట పీహెచ్‌సీకి తరలించారు. కష్టకాలంలో వెద్య సేవలందించిన ఆశ కార్యకర్త, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్‌కు ధూలె భర్త కృతజ్ఞతలు తెలిపాడు. -
‘రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోంది’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. వివిధ వర్గాలవారు అసెంబ్లీ ముట్టడికి వస్తుంటే.. రాష్ట్రంలో ఎలాంటి పాలన కొసాగుతుందో అర్థమవుతోందని అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ.. ఓ ఒక్క రంగాన్ని పట్టించుకోని ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని విమర్శించారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెబుతున్న టీఆర్ఎస్.. మహిళలు, టీచర్లు, విద్యార్థులను అరెస్ట్ చేయడమే ఫ్రెండ్లీ ప్రభుత్వమా అని ప్రశ్నించారు. (మంత్రిపై సీతక్క ఆగ్రహం) ఆశా వర్కర్లను పిలిచి భోజనాలు పెట్టి వారి జీతాలు పెంచారు.. కానీ వారికి ఇప్పటి వరకు జీతాలు అందడం లేదని మండిపడ్డారు. ఆశా వర్కర్లను ప్రభుత్వం నమ్మించి గోంతు కోసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లతో సర్వం పనులు చేయించుకుంటారు. కానీ వారి పనికి వేతనం కల్పించరని దుయ్యబట్టారు. నిన్న టీచర్లు, మొన్న ఆశా వర్కర్లు, అంతకముందు విద్యార్థులు.. ఇలా ప్రతి ఒక్కరినీ అరెస్టు చేసి వారిపై లాఠీ చార్జీ చేశారన్నారు. అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీతక్క డిమాండ్ చేశారు. (‘టీఆర్ఎస్లో ఓనర్షిప్ల కొట్లాట మొదలైంది’) -
'మా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి'
సాక్షి, చుంచుపల్లి(ఖమ్మం) : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశ కార్యకర్తలు కదం తొక్కారు. నిరంతరం శ్రమదోపిడీకి గురవుతున్నామని, ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసన బాట పట్టారు. పలు డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దశలవారీ ఆందోళనల్లో భాగంగా ఈనెల 3వ తేదీన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు. 9న తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. 12వ తేదీన జిల్లా కలెక్టర్‌కు, వైద్యశాఖాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. 19, 20 తేదీల్లో కలెక్టరేట్ ధర్నాచౌక్‌ల వద్ద, మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఇక రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం కొత్తగూడెంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా, ముట్టడి కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత స్థానిక మంచి కంటిభవన్ నుంచి భారీ ప్రదర్శనగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ధర్నాచౌక్ సమీపంలో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఛేదించుకొని కలెక్టర్ కార్యాలయం వరకు దూసుకెళ్లారు. ఒక్కసారిగా కలెక్టర్ కార్యాలయ గేట్లను తొలగించుకొని లోనికి ప్రవేశించారు. ప్రధాన ద్వారం నుంచి ఇంకా లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు పూర్తిగా అడ్డుకున్నారు. ఆ సమయంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆశ కార్యకర్తలు కార్యాలయం ముందు గంట సేపు బైఠాయించి నినాదాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా పధ్రాన కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరీ చేస్తున్న ఆశ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నట్లుగా వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని, వేతనాలు అందక పోవడంతో ఆశ వర్కర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆశ వర్కర్లకు మెరుగైన వేతనాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. రెండుసార్లు అధికారంలోకి వచ్చినా నేడు వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆశ’లకు రావాల్సిన జీతాలు తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు రూ.10 వేల వేతనం అమలు చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్లి శ్రీధర్, ఎంవీ అప్పారావు, జాటోత్ కృష్ణ, నాయకులు నల్లమల సత్యనారాయణ, ఆశ వర్కర్లు లక్ష్మి, ఈశ్వరి, ఝాన్సీ, ధనలక్ష్మి, లత, పార్వతి, అంజలి, సునిత, కమల, గంగ, పున్నమ్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ కేబినేట్ పలు కీలక నిర్ణయాలు
-
ఆశా వర్కర్లకు పూర్తి జీతం చెల్లిస్తాం
సాక్షి, అమరావతి: ఆశా వర్కర్లకు పూర్తిగా రూ.10 వేల జీతాన్ని చెల్లిస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఆశా వర్కర్ల వేతనాల చెల్లింపు విషయంలో వస్తోన్న పుకార్లపై ఆయన స్పందించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. వేతనాల చెల్లింపులో ఆశా వర్కర్లకు ఎలాంటి గ్రేడింగ్ గాని, పాయింట్ల వ్యవస్థ గాని లేదన్నారు. పెరిగిన జీతాలను ఆగస్టు మొదటి నుంచి అమలు చేస్తున్నామని.. సెప్టెంబర్ నుంచి పెంచిన జీతాలు ఇస్తామన్నారు. బకాయి పడ్డ జీతాలను కూడా వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. పాదయాత్రలో ఆశా వర్కర్ల పరిస్థితులను అర్థం చేసుకున్న జగన్ వారికి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఈ హామీని అమల్లోకి తీసుకు వచ్చారని ఆళ్ల నాని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేయలేని పనిని సీఎం జగన్ చేస్తూంటే ఓర్వలేక.. ప్రతిపక్షం, కొన్ని శక్తులు తప్పుడు ప్రచారంతో ఆశా వర్కర్లలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయని మండి పడ్డారు. సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి అని.. ఆశా అక్కచెల్లమ్మలు దీన్ని గుర్తించాలని ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఇక ప్రతివారం ‘కాఫీ టుగెదర్’) -
ఆశావర్కర్లకు జీతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు జీతం రూ. 10 వేలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెంచిన జీతం ఈ నెల నుంచే ఇవ్వాలని అందులో ఉంది. గతంలో వారికి మూడువేల రూపాయలే ఉండేది. ఇన్సెంటివ్‌గా రూ. 5600 వరకు చెల్లించే అవకాశం ఉన్నాచంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదు. కేవలం రూ.3వేలే ఇన్సెంటివ్‌గా చెల్లించేలా సీలింగ్ విధించారు. దీని వల్ల గరిష్టంగా నెలకు రూ. 6వేలు మాత్రమే ఆశ వర్కర్లు పొందారు. దీంతో పాదయాత్రలో వారి కష్టాలను స్వయంగా విని వారికి న్యాయం చేస్తానని వై.ఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే తమకిచ్చిన హామీని నెరవేర్చడం పట్ల ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
జీతాలు ఎగ్గొట్టిన టీడీపీ
పెదవాల్తేరు(విశాఖపట్నం) : గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని ఆశా వర్కర్లు కోరారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్ల యూనియన్(సిటు అనుబంధం) ఆధ్వర్యంలో సోమవారం రేసపువానిపాలెంలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పారితోషికాలు కూడా చెల్లించకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషిం చుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే తమ వేతనాలను రూ.10వేలకు పెంచడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆశా వర్కర్లకు పనిభారం తగ్గిం చాలని కోరారు. ప్రభుత్వ వెబ్సైట్లో ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగిగా నమోదు చేయడంతో వారి పిల్లలు ఉపకార వేతనాలు, సామాజిక పింఛ న్లు, తదితర ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నామని వాపోయారు. ఆశా వర్కర్లకు జాబ్‌ఛార్టు ఇవ్వాలని, పీహెచ్‌సీలకు పిలిచిన సందర్భాలలో టీఏ, డీఏలు చెల్లించాలని కోరారు. ఈ ధర్నాలో యూనియన్ అధ్యక్షురాలు వి.సత్యవతి, ప్రధాన కార్యదర్శి వి.మేరీ, జిల్లా అధ్యక్షురాలు పి.మణి, గౌరవాధ్యక్షురాలు బి.రామలక్ష్మి, సిటు శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ఎస్.అరుణ, ఐద్వా ప్రతినిధి కె.ద్రాక్షాయణి, సిటు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు కుమార్, జిల్లా నలుమూలల నుంచి 600 మంది వరకు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అనంతరం డీఎంహెచ్‌వో ఎస్.తిరుపతిరావుకు వినతిపత్రం అందజేశా రు. దీనిపై స్పందించిన ఆయన పెండింగ్ వేతనా లను త్వరలోనే చెల్లించడానికి చర్యలు తీసుకుం టున్నామన్నారు. ధర్నా సందర్భంగా ద్వారకా, ఎంవీపీ పోలీస్ స్టేషన్ల సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
హామీల అమలుకు వడివడిగా అడుగులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగానే హామీలను నెరవేర్చేందుకు కసరత్తు మొదలు పెట్టారు. తన పాలన జనరంజకంగా ఉండాలనే ఆలోచనతో మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రైతులు, మహిళలు, ఉద్యోగులు, కార్మికులను ఆకట్టుకునేలా తొలి కేబినెట్ సమావేశంలో సీఎం పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి, అమరావతి : తాము అధికారంలోకి వస్తే దశల వారీగా రూ. 3 వేలు పింఛను అందిస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లాలో 4,38,500 మంది పింఛన్లు అందుకుంటున్నారు. నెలకు సుమారు రూ. 98.66 కోట్ల వరకు పింఛనుదారులకు అందిస్తున్నారు. గత ప్రభుత్వం పింఛనుదారుడికి నెలకు రూ. 2 వేలు అందచేసింది. జగన్ ఇచ్చిన హామీ మేరకు జూన్ 1 నుంచి ప్రతి పింఛనుదారుడికి రూ. 250 అదనంగా అందించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని వల్ల జిల్లాలో రూ. 3.63 కోట్ల అదనపు భారం పడుతోంది. జూన్‌లో పెంచిన ఈ మొత్తం జులై 1 నుంచి పంపిణీ చేసే పింఛన్లతో చేరుస్తారు. ఆశ వర్కర్లకు రూ.10 వేలు పాదయాత్ర సందర్భంగా ఆశ వర్కర్లు సీఎం జగన్‌ను కలసినప్పుడు నెలకు రూ.10 వేలు వేతనం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి ఆశ వర్కర్లు నెలకు రూ. 3 వేల చొప్పున వేతనం అందుకొని పనిచేస్తూ వస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం ఆశ కార్యకర్తల వేతనాల పెంపుపై పెట్టారు. దీనివల్ల జిల్లాలో 3,347 మంది ఆశ వర్కర్లకు నెలకు రూ. 10 వేలు అందనుంది. ప్రస్తుతం ఇస్తున్న రూ. 3 వేలు కాకుండా ఇక అదనంగా రూ. 7 వేలు అందించే విధంగా కేబినెట్లో ఆమోదించారు. ప్రభుత్వంలోకి ఆర్టీసీ విలీనం.. నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఎన్నో రాయితీలను ఇస్తోంది. కానీ నష్టాల నుంచి బయటపడే పరిస్థితి లేకపోవడంతో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. జిల్లాలో 14 ఆర్టీసీ డీపోలుండగా కేవలం మూడు డిపోల నుంచి మాత్రమే ఆర్టీసీకి ఆదాయం వస్తోంది. మిగిలిన 11 డిపోలు నష్టాల్లో నడుస్తున్నాయి. ఈ డిపోల ద్వారా 6,500 మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తే ఈ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా గుర్తింపు పొందుతారు. నష్టాలు ఉన్నా ఆర్టీసీని ప్రభుత్వమే ఆదుకుంటుంది. ఆర్టీసీ కార్మికులకు ఓ భరోసా లభిస్తుంది. దీనిపై కేబినెట్లో చర్చించి సాధ్యాసాధ్యాలపై సమీక్షించారు. మున్సిపల్ కార్మికులు వేతనాల పెంపు.. మున్సిపల్ కార్మికులు ప్రస్తుతం రూ.12 వేలు వేతనం అందుకుంటున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న డిమాండ్ ఈ కార్మిక సంఘాల నుంచి వ్యక్తమవుతూ వస్తోంది. అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంపు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. జిల్లాలో మున్సిపాలిటీల్లో పనిచేసే కార్మికులు 7 వేల మంది వరకు ఉన్నారు. వీరందరికీ ఇక నెలకు రూ. 18 వేల చొప్పున వేతనం అందించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్మికులే కాకుండా పంచాయతీరాజ్, హాస్పిటల్స్ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు కూడా రూ. 18 వేలు చొప్పున వేతనం పెంచారు. జనవరి నుంచి ‘అమ్మఒడి’ పథకం.. ‘పేదింటి పిల్లలు చదువుకు ఏ తల్లి భయపడొద్దు.. పిల్లలని బడికి పంపితే చాలు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తాం’ అని నవరత్నాల పథకంలో భాగంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని జనవరి 26 నుంచి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే పిల్లలుకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం అమలు కావడం ద్వారా జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే 3.43 లక్షలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 2.61 లక్షల మంది విద్యార్థుల తల్లులకు మేలు జరుగుతుంది. ఏటా ఇచ్చే రూ.15 వేలు నేరుగా విద్యార్థుల తల్లికే అందచేస్తారు. ఇవే కాకుండా ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతిని జులై 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 38 వేల నుంచి 40 వేల మంది ఉద్యోగులకు మేలు జరుగుతోంది. అంగ్వాడీ టీచర్లకు రూ. 10,500 నుంచి రూ. 11,500లకు పెంచారు. అలాగే అంగన్వాడీ ఆయాలకు రూ. 6 వేల నుంచి రూ. 7 వేలు వేతనం పెంచారు. మెప్మా, సెర్ఫ్ కార్యాలయాల్లో పనిచేస్తున్న యానిమేట్లు, బుక్ కీపర్లకు గౌరవ వేతనం రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక ప్రతి మండలంలోనూ 104, 108 వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. ఆగస్టు 15లోగా గ్రామ వలెంటీర్లు, అక్టోబరు 2లోగా గ్రామ సచివాలయల్లో పనిచేసే ఉద్యోగుల నియామకాలను పూర్తి చేస్తారు. దీంతో జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 23,461 మంది వలంటీర్లకు ఉపాధి లభించనుంది. అలాగే 9,800 సచివాలయ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఈ గ్రామ వలెంటీర్ల ద్వారా రేషన్ సరుకులను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే చేర్చేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతులందరికీ గత ప్రభుత్వం బకాయి పడ్డ ఇన్పుట్ సబ్సిడీ చెల్లించనుంది. అలాగే రైతులందరికీ వడ్డీలేని రుణాలను అందచేయాలని నిర్ణయం తీసుకుంది. -
థాంక్యూ సీఎం సార్..
సాక్షి, సీతమ్మధార (విశాఖపట్నం) : మాట తప్పని, మడమ తిప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఆశ కార్యకర్తలు అభినందనలు తెలుపుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశ కార్యకర్తలకు రూ.3 వేలు నుంచి రూ.10 వేలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఊహించలేదని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 60 మంది ఆశ కార్యకర్తలు సోమవారం సీతమ్మధారలోని మళ్ల విజయప్రసాద్ క్యాంపు కార్యాలయంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మళ్ల మాట్లాడుతూ రాష్ట్రంలో రాజన్న రాజ్యం వచ్చిందని రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని అన్నారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఏ మేరకు హామీలు ఇచ్చారో హామీలు నేరవేరుస్తారనన్నారు. రానున్న వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్, విష జ్వరాలు సోకే అవకాశాలున్న దృష్ట్యా ఆశ వర్కర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పనిచేయాలన్నారు. -
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలపై ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షత జరుగుతున్న సమావేశంలో సామాజిక పెన్షన్లు రూ.2250కి పెంపుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే ఆశా వర్కర్ల జీతాలు రూ.3వేలు నుంచి రూ.10వేలకు పెంపుతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ పెంపుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కూడా మంత్రివర్గం సుముఖత వ్యక్తం చేసింది. వీలైనంత త్వరలో అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. అలాగే వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలుపై మంత్రివర్గంలో చర్చ కొనసాగుతోంది. అలాగే పారిశుద్ధ్య కార్మికులు, హోంగార్డుల వేతనాల పెంపునకు సంబంధించి ఏం చేయాలన్నదానిపై మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హోంగార్డుల జీతాల పెంపుపైనా సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉదయం పదిన్నరకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం ఇంకా కొనసాగుతోంది. చదవండి: కొనసాగుతున్న ఏపీ కేబినెట్ తొలి సమావేశం -
సీఎం వైఎస్ జగన్‌కు ఆశా వర్కర్ల కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం/ మెళియాపుట్టి: కనీవిని ఎరుగని రీతిలో ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆశా వర్కర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తమ వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి విశాఖ నగర పర్యటనకు వచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు అడుగడుగునా ఆశా కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠం వరకు వందలాది మంది ఆశా వర్కర్లు బారులు తీరి జేజేలు పలికారు. వారికి సీఎం వైఎస్ జగన్ నమస్కరిస్తూ అభివాదం చేశారు. తమకు గౌరవ వేతనాన్ని కనీసం ఆరు వేలకు పెంచమని ఆందోళనలు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆశా వర్కర్లు పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో ఉన్న 42 వేల మంది ఆశా వర్కర్లకు వేతనాన్ని రూ.10 వేలకు పెంచడం సీఎం వైఎస్ జగన్ తీసుకున్న గొప్ప నిర్ణయమని హంసా (హెల్త్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్) అధ్యక్షుడు ఎస్.అరవపాల్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టిలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మంగళవారం ఆశా వర్కర్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమ కష్టాలు తీరాయని.. సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటామని ఆశా వర్కర్లు పేర్కొన్నారు. -
జగన్ రాక.. ఆశల కేక!
పర్చూరు: ఎప్పటి నుంచో వేతనాల పెంపు కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఆశ కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీపి కబురు అందించారు. మూడు వేల రూపాయల వేతనంతో కుటుంబ పోషణను భారంగా నెట్టుకొస్తున్న ఆశ కార్యకర్తలు గత ప్రభుత్వ కాలంలో అనేక పోరాటాలు చేశారు. రోడ్లెక్కారు.. ధర్నాలు చేశారు.. విధులు బహిష్కరించారు. అన్ని రకాలుగా తమ నిరసనను వ్యక్త పరిచారు. చివరకు ప్రతి పక్ష నేత హోదాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కేవలం ఒక్కో సేవకు ఒక్కో రేటును నిర్ణయించి వేతనాలు లెక్కకట్టేవారు. దీంతో చాలీచాలని వేతనంతో అవస్థలు పడుతున్న ఆశ కార్యకర్తలకు జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వేతనాలను రూ. 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆయన ప్రకటించిన విధంగా అధికారం చేపట్టిన వారంలోనే వారి వేతనాలను రూ. 3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ వైద్యశాఖాధికారుల సమీక్షలో ప్రకటన చేశారు. విషయాన్ని తెలుసుకున్న ఆశ కార్యకర్తలు ఆనందోత్సహాలను జరుపుకుంటూ తమ ఆనందాన్ని తెలుపుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మేము ఊహించలేదు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే మా గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని మేము ఊహించలేదు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. – విజయలక్ష్మి, ఆశ కార్యకర్త (ఇడుపులపాడు -
ఆశ తీరింది
వారి కష్టానికి ఎట్టకేలకు ప్రతిఫలం దక్కింది. వారి జీవితాలకు కొండంత అండ లభించింది. ఇన్నాళ్లూ అష్టకష్టాలు పడ్డ ఆశా వర్కర్లకు మంచి రోజులొచ్చాయి. వారి కష్టాన్ని గుర్తించే నాయకుడొచ్చాడు. ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన మాటను వైఎస్.జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టి వారం కూడా కాకమునుపే ఆశా వర్కర్ల వేతనాలను భారీగా పెంచారు. రూ.3 వేలు ఉన్న వేతనాన్ని ఏకంగా రూ.10 వేలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆశా వర్కర్లు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్నొచ్చాడని.. ఆనందంతో స్వీట్లు తినిపించుకున్నారు. చిత్తూరు అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతున్నా.. వాటిని క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేయాల్సింది మాత్రం ఆశా వర్కర్లే. ప్రభుత్వ వైద్యసేవలకు.. ప్రజలకు మధ్య వారధిగా ఆశా వర్కర్లు పనిచేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులను చైతన్య పరచడం, టీకాలు పరిస్థితి అధికారులకు నివేదించడం, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే కొత్త ఆరోగ్య పథకాలను ప్రజలకు తెలియజేయడంతో ఆశా వర్కర్లది కీలకపాత్ర. గత ప్రభుత్వం వీరి సేవలను దోచుకుంటూ కనీస వేతనాలు ఇవ్వడంలో వివక్ష చూపిస్తూ వచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశా వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపారు. నెలకు రూ.3 వేల గౌరవ వేతనం తీసుకుంటున్న వారికి ఒక్కసారిగా రూ.10 వేల జీతాన్ని ఇవ్వనున్నట్లు సంచలనాత్మక నిర్ణయాన్ని సోమవారం ప్రకటించారు. ఆనందానికి అవధుల్లేవు పల్లెల్లో గడగడపకూ తిరుగుతూ ట్యాబ్‌లలోగర్భిణులు, బాలింతల వివరాలను నమోదు చేయాలి. ప్రతినెలా గర్భిణులను వైద్యపరీక్షల కోసం జిల్లా, ప్రాంతీయ ఆస్పత్రులకు తీసుకెళ్లాలి. కాన్పులకు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు సైతం గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను పట్టణాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంత చారికీ చేస్తున్నా గౌరవ వేతనం పేరిట ఆశా వర్కర్ల శ్రమను దోచుకున్న గత ప్రభుత్వం వారి సంక్షేమాన్ని ఏమాత్రమూ పట్టించుకోలేదు. గత టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ పలుమార్లు ఆశా వర్కర్లు ఆందోళనకు సైతం దిగారు. అయినా సరే నాటి పాలకుల్లో ఎలాంటి మార్పూ రాలేదు. తాజాగా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం.. స్వయాన ముఖ్య మంత్రే వేతనాలపెంపుపై ప్రకటన చేయడంతో ఆశా వర్కర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వేల కుటుంబాలకు లబ్ధి జిల్లా వైద్యశాఖలో 3,685 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం వీరికి నెలకు రూ.3 వేలు చొప్పున గౌరవ వేతనం ఇచ్చేది. దీన్ని కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఆశా వర్కర్లకు రూ.8 వేలు ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం వారిని మోసం చేసింది. ఓ వైపు పాత వేతనాలు ఇవ్వకుండా, మరోవైపు పారితోషికాలు విడుదల చేయకుండా ఇబ్బందులపాలు చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజా నిర్ణయంతో జిల్లాలోని మూడు వేలకు పైగా ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వానికి నెలకు రూ.36.85 లక్షల ఆర్థిక భారం పడ్డా లెక్కచేయకుండా ఆశా వర్కర్ల జీవితాలకు ముఖ్యమంత్రి భరోసా కల్పించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రికగా పేరొందిన ఆరోగ్యశ్రీకి కొత్తపేరు సైతం సీఎం ప్రతిపాదించారు. ఇక నుంచి ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’గా ఈ పథకానికి నామకరణం చేశారు. 108 అంబులెన్సులు, 104 సంచార వైద్య చికిత్స వాహనాల పనితీరు కూడా మెరుగుపడాలన్నారు. ఇక నుంచి వైద్యరంగాన్ని స్వయానా తానే పర్యవేక్షిస్తానని చెప్పి అధికారుల్లో బాధ్యతను పెంచారు. దీంతో సామాన్యుడికి ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యసేవలు అందుతాయని ప్రజలు నమ్ముతున్నారు. -
చిగురించిన ఆశా
-
చిగురించిన ‘ఆశ’లు
సాక్షి, అమరావతి: నిన్నటిదాకా వారి వేతనం రూ.3 వేలు మాత్రమే.. మరి నేడు రూ. 10 వేలు.. రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రజాసంకల్ప పాదయాత్రలో ఆశా వర్కర్ల బాధలు, ఆవేదన విని చలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను ఇచ్చిన హామీకి కట్టుబడి వారి వేతనాన్ని నెలకు రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వేల కిలోమీటర్ల పాదయాత్రలో అడుగడుగునా ఆశా వర్కర్ల ఇబ్బందులను గుర్తించిన వైఎస్ జగన్ తాము అధికారంలోకి రాగానే వారి వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన ముఖ్యమంత్రి అయిన ఐదో రోజే వారి వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించడంతో ఆశా వర్కర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. సోమవారం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈమేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేతనాల పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 42 వేల మంది ఆశా కార్యకర్తలకు లబ్ధి చేకూరనుంది. టీడీపీ అధికారంలో ఉండగా ఆశా కార్యకర్తలు గౌరవ వేతనం కోసం పలు ధర్నాలు, ఆందోళనలు చేసినా సర్కారు కనికరించలేదు. ఎన్నికల ముందు నెలకు రూ.3 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ వేతనం చాలక చాలామంది ఆశా వర్కర్లు కూలి పనులకు వెళుతున్నారు. వారి బాధలన్నీ ప్రత్యక్షంగా చూసి చలించిన వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆశావర్కర్ల వేతనాలతోపాటు ఆరోగ్యశాఖపై సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు అంశాలను చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వైద్యారోగ్య శాఖలో సమూల ప్రక్షాళన వైద్య ఆరోగ్యశాఖను సమూలంగా ప్రక్షాళన చేసి దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చి దిద్దేందుకు కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. విశాఖ మెడ్‌టెక్ జోన్ (మెడికల్ టెక్నాలజీ పార్కు)లో జరిగిన అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మెడ్‌టెక్ జోన్లో కాంట్రాక్టు పొందిన లగడపాటి రాజగోపాల్‌కు చెందిన సంస్థకు చెల్లించిన రూ.53 కోట్లు ఇప్పటివరకు ఎందుకు రికవరీ చేయలేదని అధికారులను ప్రశ్నించారు. లగడపాటి సంస్థ కొన్ని ఇంజనీరింగ్ సర్వీసులు అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. నిపుణులతో కమిటీ ఏర్పాటు ఆరోగ్యశాఖలో వివిధ పథకాల అమలు తీరుతోపాటు గత ఐదేళ్లలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు నిపుణులతో కమిటీ నియమిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కమిటీని సీనియర్ ఐఏఎస్ అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.పీవీ రమేష్ ముఖ్యమంత్రి కార్యాలయం తరఫున పర్యవేక్షిస్తారు. ఈ కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించి 45 రోజుల్లో నివేదిక సమర్పిస్తుంది. సీఎం పర్యవేక్షణలో ఆరోగ్యశాఖ కోట్లాది మంది ప్రజల ఆరోగ్యంతో ముడిపడిన ఆరోగ్యశాఖ పనితీరును ఇక నుంచి తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తక్షణమే మౌలిక వసతులు మెరుగు పరచాలని, దీనికి ఎంత వ్యయం అయినా భరిస్తామని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో సర్కారీ ఆస్పత్రుల్లో ఎలుకలు కొరికి శిశువులు మృతి చెందడం, ఆపరేషన్ థియేటర్లో కరెంటు లేక సెల్‌ఫోన్ వెలుతురులో ఆపరేషన్ నిర్వహించడం లాంటి ఘటనలు చాలా బాధ కలిగించాయన్నారు. ఐదేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేసి పలు సేవలను పీపీపీ కింద ప్రైవేట్‌కు అప్పగించారని పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సేవలన్నీ ప్రైవేట్ పరం చేయడం దారుణమన్నారు. అవసరమైతే వైద్య పరికరాలు, మందులు, మౌలిక సౌకర్యాల టెండరింగ్ విధానాలను పునఃసమీక్షిస్తామని చెప్పారు. ఉన్నతాధికారులు తమ సొంతపనిగా భావిస్తే ఆరోగ్యశాఖలో మంచి ఫలితాలు ఉంటాయని సూచించారు. వైఎస్సార్ విధానాలే ఆదర్శం వైద్య ఆరోగ్య రంగంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విధానాలే ఆదర్శమని, వాటి ఆధారంగానే ముందుకెళ్లాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104 లాంటి సేవలను ప్రారంభించి వైఎస్సార్ దేశంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు తెచ్చారని చెప్పారు. పలు రాష్ట్రాలు ఈ పథకాలను అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. 108, 104 సర్వీసులను ప్రక్షాళన చేసి వాహనాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని సూచించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవగా కొనసాగుతున్న పథకాన్ని ఇకపై ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’గా మారుస్తున్నట్లు ప్రకటించారు. మండలానికి ఒక 104 అందుబాటులోకి తెచ్చి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రస్తుతం 500 పైచిలుకు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మాత్రమే 24 గంటల ఆస్పత్రులుగా ఉన్నాయని అధికారులు పేర్కొనగా.. మిగతావి కూడా నిరంతరాయంగా పనిచేసేలా అందుబాటులోకి తేవాలని, అదనపు నిధులు ఇస్తామని, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని సీఎం సూచించారు. వైద్య సీట్లు పెరగాలి.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పెరగకుండా అడ్డంకులు ఎందుకు తలెత్తుతున్నాయని సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. సౌకర్యాలు లేవని వైద్య సీట్లకు కోతలు వేస్తుంటే దానిపై గట్టిగా చర్యలు ఎందుకు తీసుకోలేక పోతున్నారన్నారు. నిబంధనల మేరకు అధికారులు సమీక్షించి వైద్య విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. లెక్కలు డాష్బోర్డుకే పరిమితం కారాదు వైద్య ఆరోగ్యశాఖలో నివేదికలు, లెక్కలు వాస్తవాలకు దగ్గరగా ఉండాలని కేవలం కోర్‌డాష్ బోర్డుకే పరిమితం కావడం సరికాదని సీఎం పేర్కొన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ఆరోగ్యకేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి రోజూ ఫొటోలు తీసి పంపాలని ఆదేశించారు. ఉద్యోగుల ఖాళీలు, ఆర్థిక అవసరాలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని సూచించారు. నకిలీ మందులను అరికట్టాలి.. నకిలీ, నాసిరకం మందులు మార్కెట్లోకి రాకుండా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటివారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీలకు మళ్లీ ఎమ్మెల్యేలు గత ప్రభుత్వం ఆస్పత్రి అభివృద్ధి కమిటీలకు బాధ్యులుగా ఉన్న ప్రజాప్రతినిధులను (ఎమ్మెల్యేలను) తొలగించి తమకు ఇష్టమైన వారిని తీసుకుందని సీఎం పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు బాధ్యులుగా ఉంటే మరింత బాధ్యతగా పనిచేస్తారన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే ఆస్పత్రి అభివృద్ధి కమిటీల అధ్యక్షులను తొలగించి ఆ స్థానంలో తిరిగి ఎమ్మెల్యేలను నియమించాలని ఆదేశించారు. రాష్ట్రం వాటా చెల్లించకపోవడంతో.. అనంతపురం, విజయవాడలో పీఎంఎస్ఎస్వై (ప్రధాని స్వాస్థ్య సురక్ష యోజన) కింద రూ.150 కోట్ల చొప్పున వ్యయంతో నిర్మించిన ఆస్పత్రులకు సంబంధించి రాష్ట్రం తన వాటాను చెల్లించకపోవడంతో భవనాలను అప్పగించడం లేదని అధికారులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తక్షణమే రూ. 60 కోట్లు ఇస్తున్నామని, వెంటనే ఆ రెండు సూపర్ స్పెషాలిటీ బ్లాకులను అందుబాటులోకి తేవాలని సూచించారు. జాతీయ ఆరోగ్యమిషన్ నిధులను కూడా త్వరలోనే విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
వేతనాల పెంపు పట్ల ఆశా వర్కర్ల హర్షం
-
వేతనాల పెంపు పట్ల ఆశా వర్కర్ల హర్షం
సాక్షి, కాకినాడ : ఆశావర్కర్ల జీతాలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నిర్ణయం వల్ల జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న 4500 మందికి లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు సీఐటీయూ భవనంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆశా వర్కర్ల సంఘం గౌరవ అధ్యక్షురాలు బేబి రాణీ మాట్లాడుతూ.. తమ ఉద్యమాలను, పోరాటాలను గుర్తించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పారితోషికాలతో ముడి పెట్టకుండా రూ. 10 వేల గౌరవ వేతనంగా ఇవ్వాలని ఆమె కోరారు. చంద్రబాబు పాలనలో పనికి తగిన వేతనం ఇవ్వకపోగా.. తమపై రాజకీయ వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉద్యమాల సమయంలో ఆశా వర్కర్లపై చంద్రబాబు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సీఎం జగన్‌ను కోరారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : హమీ ఇచ్చారు అమలు చేశారు -
ఆశావర్కర్ల జీతాలు భారీగా పెంచిన ఏపీ సీఎం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఆశావర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీపి కబురు చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారి జీతాలను భారీగా పెంచారు. ఆశావర్కర్ల జీతాలను పదివేల రూపాయలకు పెంచుతున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖపై సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టిన వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో ఆశావర్కర్ల జీతాలు భారీగా పెరిగినట్టయింది. ప్రస్తుతం మూడు వేల రూపాయల వేతనం అందుకుంటున్న ఆశావర్కర్లు.. ఇకపై పదివేల రూపాయల వేతనం అందుకోనున్నారు. గ్రామీణ స్థాయిలో ఆశావర్కర్ల ప్రాధాన్యతను గుర్తించిన ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రజాసంకల్పయాత్ర చేస్తున్నప్పుడు వైఎస్ జగన్‌ను కలిసిన ఆశావర్కర్లు తమ సమస్యలను వైఎస్ జగన్‌కు దృష్టికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారికి ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రెండు గంటలపాటు సాగిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైద్య రంగాన్ని మెరుగుపరచి ప్రతి పేదవారికి కూడా వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతిని సహించేది లేదని, వైద్యశాఖను తానే ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అధికారులు అంతా బాధ్యతతో పనిచేసి ఇందుకు సంబంధించి 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ఆశా వర్కర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ చదవండి : వైద్య శాఖను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్న సీఎం జగన్ -
ఆశా వర్కర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్
-
విశాఖలో ఆశ వర్కర్లు ఆందోళన
-
ఆశా వర్కర్లకు సర్కారు టోకరా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వేలాది మంది ఆశా వర్కర్లకు ఇవ్వాల్సిన అలవెన్సులు ఇవ్వకుండా సర్కారు దగా చేసింది. తమతో ప్రతి రోజూ పనిచేయించుకుంటున్న ప్రభుత్వం గడిచిన మూడేళ్లుగా పైసా కూడా ఇవ్వలేదని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ‘104’ అంబులెన్సుకు ఇద్దరు చొప్పున ఆశా వర్కర్లు పనిచేస్తారు. ఆ వాహనాల వెంట పల్లెలకు వెళ్లడం, అక్కడ ఉన్న రోగులను తీసుకురావడం, గర్భిణులను గుర్తించి వాహనం దగ్గరకు తీసుకురావడం, టీబీ, మూర్ఛరోగులను తీసుకురావడం, వాహనాల్లో సిబ్బందికి సహాయకులుగా ఉండటం వంటి పనులు చేస్తారు. ఇందుకుగాను ఒక్కో వర్కరుకు రోజుకు రూ.100 ఇవ్వాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతినెలా ఠంచనుగా చెల్లింపులు జరిపేవారు. కానీ, 2016 నుంచి ఇప్పటివరకూ టీడీపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా చెల్లించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 292 ‘104’ అంబులెన్స్‌లు ఉన్నాయి. రోజుకు 584 మంది ఆశా వర్కర్లు పనిచేయాలి. అంటే రోజుకు రూ.58,400 చెల్లించాలి. ఒక నెలలో 24 రోజులు అంబులెన్స్‌లు తిరుగుతాయి. అంటే నెలకు రూ.14.01 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన గడిచిన మూడేళ్ల నుంచి ప్రభుత్వం రూ.7 కోట్లు బకాయి పడింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పని చేయించుకుంటారని, కానీ, వేతనాలు మాత్రం ఇవ్వడం లేదని ఆశా వర్కర్లు వాపోతున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా అధికారులను స్పందించడం లేదని అంటున్నారు. మీకు రూ.3 వేలు వేతనం చెల్లిస్తున్నారుగా, మళ్లీ అలవెన్సులు ఎందుకు అని అధికారులు ఈసడించుకుంటున్నారని, తమకు రావాల్సిన ఇన్సెంటివ్‌లు (ప్రోత్సాహకాలను) సైతం సరిగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే దీనిపై తాడోపేడో తేల్చుకుంటామని ఆశావర్కర్ల సంఘం ప్రతినిధి ఒకరు చెప్పారు. -
విశాఖ డీఎమ్ అండ్ హెచ్ఓ కార్యలయం వద్ద ఆశావర్కర్లు ధర్నా
-
వైఎస్ జగన్‌ను కలిసిన ఆశా వర్కర్లు
-
ఆశా కార్యకర్తల ఆందోళన పట్టదా?
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లో ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ ఆక్టివిస్ట్స్) కార్యకర్తలు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నా నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మొత్తం దేశంలో దాదాపు పది లక్షల మంది ఆశా కార్యకర్తలు ఉండగా వారిలో 93,687 మందితో దేశంలోనే రెండో స్థానంలో బిహార్ ఉంది. వీరంతా 12 డిమాండ్లతో డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు పూర్తిగా స్తంభించి పోయాయి. డిసెంబర్ 13, 14 తేదీల్లో ఆశా కార్యకర్తలు జిల్లా ఆస్పత్రులను, సివిల్ సర్జన్ కార్యాలయాలను దిగ్బంధం చేశారు. చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. రాష్ట్రంలోని మూడు ఆశా యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆశా సంయుక్త్ సంఘర్శ్ మంచ్ పిలుపు మేరకు ఆశా కార్యకర్తల సమ్మె దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్ద వారు రాత్రనక, పగలనకా భైఠాయింపు సమ్మె చేస్తున్నారు. వారికి మద్దతుగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారు. వారు ఆశా కార్యకర్తలకు అన్న పానీయాలను అందించడంతోపాటు రాత్రిపూట చలిని తట్టుకునేందుకు బ్లాంకెట్లు కూడా తెచ్చి ఇస్తున్నారు. తమకు కూడా ప్రభుత్వ హోదా కల్పించి కనీసవేతనంగా 18 వేల రూపాయలు ఇవ్వాలని, పింఛను సౌకర్యం కల్పించాలని, ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్ లాంటి సౌకర్యాలను కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వారిని ఆరోగ్య కార్యకర్తలుగా ప్రభుత్వం పరిగణస్తూ టోకున గౌరవ వేతనం చెల్లిస్తుండగా, ఇక గ్రామీణ ప్రజలేమో ఇప్పటికీ వారిని సామాజిక కార్యకర్తలుగా పరిగణిస్తున్నారు. తమ డిమాండ్లు ఇప్పుడే చేస్తున్న కొత్త డిమాండ్లేవి కావని, 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నవేనని ఆశా కార్యకర్తల నాయకులు తెలియజేస్తున్నారు. నెలవారి జీతాలను, పని పరిస్థితులను హేతుబద్ధం చేయడానికి 2015లో ఉన్నత స్థాయి కమిటీని వేశారని, ఆ కమిటీ చేసిన సిఫార్సులను కూడా నేటికి అమలు చేయడం లేదని నాయకులు విమర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని తరగతుల వారు, పట్టణ ప్రాంతాల్లో పేద వాళ్లు, దిగువ తరగతి వాళ్లు ఆశాను నమ్ముకొని బతుకుతున్నారు. ‘జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మందికి ఒకరు చొప్పున ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. సమయం, సందర్భం లేకుండా వారు ప్రతిరోజు 18 గంటలపాటు పనిచేస్తున్నారు. -
‘ఆశ’ నిరాశేనా?
ఆశ వర్కర్ల పాత్ర రోజురోజుకూ విస్తరిస్తోంది.కేవలం ఆరోగ్యపరమైన అంశాలకే కాకుండా ఎన్నికలు,మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలు, జనాభా లెక్కల వంటి వాటిల్లోనూ వారిని ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నా, వారికి పని ఒత్తిడి తప్ప ఎలాంటి ఆర్థిక ప్రయోజనం దక్కడంలేదు. కేవలం బానిసల మాదిరిగా వారితో పనిచేయించుకుంటున్నారు. – ఇండిపెండెంట్ కమిషన్ సాక్షి, హైదరాబాద్: గ్రామీణ వైద్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న ‘ఆశ’వర్కర్లకు తీరని అన్యాయం జరుగుతున్నదని పలు జాతీయ సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మినహా వారికి కేవలం ప్రోత్సాహకాలే దక్కుతున్నాయని, నికరంగా నెలనెలా వేతనం మాత్రం దక్కడం లేదని చెబుతున్నాయి. నర్సింగ్ వంటి కోర్సుల్లో వారికి వెయిటేజీ ఇచ్చి ఆదుకోవాలని, తద్వారా వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని ‘ఇండిపెండెంట్ కమిషన్ ఆన్ డెవలప్మెంట్ అండ్ హెల్త్ ఇన్ ఇండియా’సిఫార్సు చేస్తూ రోడ్ మ్యాప్ టూ ఇండియాస్ హెల్త్ అనే నివేదికను ఇటీవల కేంద్రానికి అందజేసింది. కొన్ని ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు కూడా సకాలంలో ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 9.5 లక్షలు,రాష్ట్రంలో 28,000 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు, పోలియో తదితర టీకాలు, బీపీ, షుగర్లాంటి వ్యాధుల గుర్తింపు, చెకప్‌లు వంటి కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసేది ఆశ వర్కర్లే. ఒకరకంగా చెప్పాలంటే గ్రామాల్లో ఆరోగ్య కార్యక్రమాలన్నీ కూడా వీరి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. గ్రామాల్లో ఆరోగ్య కార్యక్రమాలను జయప్రదం చేయాలన్న లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం 2006లో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద ‘ఆశ’వర్కర్ల వ్యవస్థను ప్రారంభించింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా 9.5 లక్షల మంది ఆశ వర్కర్లు ఉన్నారు. తెలంగాణలో 28 వేల మంది పనిచేస్తున్నారు. ఆశ వర్కర్ల వ్యవస్థ రాగానే దేశంలో మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. అందుకోసం నిధులను కేంద్రం సమకూర్చింది. శిక్షణ, కిట్లు తదితర అవసరాలకోసం ఒక్కో ఆశ వర్కర్కోసం రూ.10 వేల నుంచి రూ.16 వేల వరకు ఖర్చు చేస్తున్నది. వేతనం లేని జీవితం ఎన్హెచ్ఎం నిర్దేశించిన కార్యక్ర మాలకే పరిమితం చేయకుండా ఆయా రాష్ట్రాలు తమ ప్రాధాన్య అంశాల అమలుకోసం ఆశ వర్కర్లను ఉపయోగించుకుంటున్నాయి. కానీ వారికి నిర్దేశిత వేతనాలు ఇవ్వ డానికి ముందుకు రావడంలేదు. అనేక రాష్ట్రాలు కేవలం వారికి ప్రోత్సాహకాలు మాత్రమే ఇస్తున్నాయి తప్ప కనీస వేతనాలు అమలు చేయడం లేదు. సిక్కిం, కేరళ, రాజస్తాన్, హరియాణా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు. తెలంగాణలోనూ ఆశ వర్కర్లను కేవలం ప్రోత్సాహకానికే పరిమితం చేశారు. వేతనం ఇవ్వాలంటూ సమ్మె చేసినా వారి గోడు పట్టించుకోలేదు. అయితే సమ్మె ఫలితంగా ప్రోత్సాహకం నెలకు రూ.3,500 నుంచి రూ.6 వేల వరకు వస్తోందని తెలంగాణ ఆశ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సంఘం అధ్యక్షురాలు జయలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. తాము రూ.18 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇక కొన్ని రాష్ట్రాలు వారి చదువును బట్టి స్థాయిని పెంచేలా ఏర్పాట్లు చేశాయి. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, త్రిపుర వంటి రాష్ట్రాలు నర్సింగ్ కోర్సుల్లో ఆశ వర్కర్లకు వెయిటేజీ ఇస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో బీఎస్సీ నర్సింగ్‌లోనూ వెయిటేజీ కల్పించారు. ఢిల్లీలోనూ చదువులో వెయిటేజీ ఇస్తున్నారు. కేరళ, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్లో ఆశ వర్కర్లకు మెడికల్, జీవిత బీమా వంటి సౌకర్యాలు ఇస్తున్నారు. అయితే మొత్తమ్మీద ఆశ వర్కర్లకు దేశవ్యాప్తంగా తగినంత వేతనం, గౌరవం దక్కడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఆశ వర్కర్లకు షరతులు వర్తిస్తాయి!
ఎన్నో పోరాటాలు చేశారు. పోలీసు దెబ్బలు తిన్నారు. అవమానాలు చవిచూశారు. ఏమైతేనేం అనుకున్నది సాధించామని సంతోషించారు. ఇచ్చింది స్వల్పమైనా అనంతానందం పొందారు. కృతజ్ఞతతో సన్మానాలు చేశారు. చిత్రాలకు పాలాభిషేకం చేశారు. ఇంతలోనే వారి ‘ఆశ’లపై నీళ్లు చల్లుతూ కొత్త ఉత్తర్వులు వెలుడ్డాయి. ఇదీ ఆశ వర్కర్లపై సర్కారు అనుసరించిన వైఖరి. ముఖ్యమంత్రి తమ కోర్కెలు తీర్చేశారని సంబరపడితే... కొత్తగా పెట్టిన కండిషన్లతో వారంతా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. బొబ్బిలి: అరవ చాకిరీ చేయించుకుంటూ కూడా ఆశ వర్కర్లకు వేతనం పెంచామని సన్మానాలు, సత్కారాలు, పాలాభిషేకాలు చేయించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు స్వరూపం మరోసారి బహిర్గతమైంది. ఆశ వర్కర్ల వేతనం పెంపు వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని నిరూపించారు. పెంచిన వేతనం రూ.5,600 అందా లంటే ప్రతీ ఆశ వర్కర్ నెలకు నలుగురు గర్భిణులను నమోదు చేసి, నాలుగు డెలివరీలు చేయించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. వేతనాల కోసం ఏటా ఎదురు చూస్తున్న ఆశ వర్కర్లకు నెలకు రూ.3 వేలు, పారితోషకంగా మరో మూడు వేలుఇస్తామన్న రాష్ట్ర సర్కారు ఇప్పుడు రూ.5,600ను ప్రకటించింది. ఆ డబ్బులు కూడా లక్ష్యాన్ని సాధిస్తేనే ఇస్తామని చెప్పడంతో ఇప్పుడు ఆశ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా సేవలు వినియోగించుకుని ఇలా లక్ష్యాలను విధించడం అన్యాయమని వారు వాపోతున్నారు. పోరాటంతో దిగొచ్చిన సర్కారు జిల్లాలో 5,600 మంది ఆశ వర్కర్లున్నారు. వీరిని సబ్ సెంటర్ల వారీగా ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. వివిధ సర్వేలు, పల్స్‌పోలియో, చిన్నారులకు టీకాలు వంటి కార్యక్రమాలకు ఇంటింటికీ తిరుగుతూ ఒళ్లు హూనం చేసుకుంటున్నా... వారికి నెలకు ఇచ్చేది మూడు వేలే. ఈ సొమ్మును మరో మూడు వేలు పెంచి ఆరు వేలు చేస్తున్నామని కొద్ది నెలల క్రితం ప్రకటించారు. కానీ దానిని అమలు చేయలేదు. ఇక అందరి మాదిరి వారూ ఆందోళనలకు దిగారు. పోలీసులచేత ఈడ్చివేతలు... అధికారులతో ఛీత్కారాలు తిన్నారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు కాదని, రూ.5,600 ఇస్తామని ప్రకటించారు. తాజాగా పెట్టిన మెలికలు వెయ్యి జనాభా నుంచి రెండు వేల జనాభా ఉన్న సబ్ సెంటర్ల వారీగా లక్ష్యాలు విధించారు. ఒక్కొక్కరూ నలుగురు గర్భిణులను నమోదు చేయాలి, నాలుగు డెలివరీలు చేయించాలి. వీటితో పాటు నలుగురు బిడ్డలకు మీజిల్స్ వేయించాలి. మరో నాలుగు బూస్టర్ డోసులు వేయించాలి. ఇలా రోజూ వారు గర్భిణుల కోసం, బాలింతల కోసం వెతకాల్సిందే. ఒక వేళ ఆ ప్రాంతంలో గర్భిణులు లేకపోతే వీరికి వేతనం లేనట్టేనని చెబుతున్నారని ఆశా వర్కర్లు వాపోతున్నారు. బర్త్సర్టిఫికెట్లు అంగన్వాడీలకు అప్పగించాలి ఆశ వర్కర్లు తాము పనిచేస్తున్నట్టు రుజువు చేసేందుకు సవాలక్ష నిబంధనలు విధించింది ప్రభుత్వం. బిడ్డలు పుట్టినట్టు ఆస్పత్రిలో ఇచ్చే సర్టిఫికెట్లను జత చేయాల్సి ఉంది. అలాగే పుట్టిన బిడ్డ అత్తవారు, కన్నవారింటికి మారినప్పుడు అక్కడి అంగన్వాడీ సెంటర్‌కు అప్పగించే బాధ్యత కూడా ఆశ వర్కర్లదే. దీంతో తాము చేసిన పనులు ఏమన్నా తక్కువ చేస్తున్నామా? పనికి తగిన వేతనం ఇస్తున్నారా? మాకెందుకీ లక్ష్యాలని వాపోతున్నారు. వర్కర్లతో విరివిగా సమావేశాలు ఆశ వర్కర్లకు వేతనం పెంచినట్టే పెంచి లక్ష్యాలను బారెడు చేసిన ప్రభుత్వం వారి కోసం విడుదల చేసిన లక్ష్యాలు, నిబంధనలపై రిపోర్టులు తీసుకుంటోంది. ఇందుకోసం ఏఎన్ఎంల ఆధ్వర్యంలో ఆశ వర్కర్లకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాల్లో మీరు చేయాల్సిన పనులివీ అని వారికి వివరిస్తున్నారు. పెరిగిన వేతనం అందుకోవాలంటే ఈ మాత్రం చేయకతప్పదని వారికి సుద్దులు చెబుతున్నారు. దీంతో ఆశ వర్కర్లు మరింత ఆవేదన చెందుతున్నారు. బర్త్ సర్టిఫికేట్లు అప్పగిస్తేనే వేతనమట మాకు లక్ష్యాలు ఇచ్చి వాటి ప్రకారం గర్భిణులు, బాలింతలను నమోదు చేయాలంటున్నా రు. బిడ్డ పుట్టిన తరువాత వారిని అంగన్వాడీలకు అప్పగించాలని ఆదేశించారు. లేకుంటే వేతనం లేదని, కట్ అవుతుందని ముందుగానే మాకు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫారంలో అన్ని కాలమ్స్‌ను మాచేత నింపిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం. జీతం పెంపు అంటే ఇదేనా? – ఎల్ శాంతి, అధ్యక్షురాలు, ఆశ వర్కర్ల అసోసియేషన్. -
ఈ ‘అమ్మ’ల కష్టాలను తీర్చేవారు లేరా?
సాక్షి, న్యూఢిల్లీ : వారు తల్లికాని తల్లులు. ఆకలేస్తే అన్నం పెట్టే అమ్మలు. పాఠాలు చెప్పే పంతులమ్మలు. వారే అంగన్వాడి కార్యకర్తలు. పట్టణ ప్రాంతాల్లో ఏమోగానీ పల్లె ప్రాంతాల్లో వారంటే తెలియని వారు ఎవరుండరు. పిల్లలకు వేలకింత ముద్ద పడేయలేని, వారిని బడికి పంపలేని, కూలి నాలి చేసుకొని బతికే పేద ప్రజలు ఎంతో మంది తమ పిల్లలను అంగన్వాడిలో వదిలేసి వెళతారు. వారందరికి ఆపద్బంధువు అంగన్వాడి కార్యకర్తలే. సకాలంలో నిధులు అందకపోయినా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర శిశు అభివృద్ధి పథకం సజావుగా అమలవుతుందంటే అది వారి సామాజిక సేవా దృక్పథం, వృత్తి పట్ల వారికున్న అంకిత భావం కారణం. వారు నెలవారిగా అందుకునే గౌరవ వేతనం అతి తక్కువే అయినా, అదీ రెండు, మూడు నెలలకోసారి అందుతున్నా వారిలో అంకిత భావం చెక్కు చెదరడంలేదు. పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు నెలవారిగా రావాల్సిన రేషన్ సరుకులు ఆర్నెళ్లకోసారో, ఏడాదికోసారో వచ్చినా సర్దుకుపోతున్నా, చేతి నుంచి డబ్బులు ఖర్చుపెట్టి పేద పిల్లలకు పౌష్టికాహారం సకాలంలో సరఫరా చేస్తున్న సామాజిక కార్యకర్తలు వారు. ఒక్కో అంగన్వాడి కార్యకర్త 25 నుంచి 30 మంది పేద పిల్లల సంరక్షణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. వారందరికి పౌష్టికాహారం అందించడంతోపాటు వారిలో ఎవరికి జబ్బు చేసినా సమీపంలోని సర్కారు దవఖానాకు స్వయంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. వారంలో ఆరు రోజులు పనిచేయాల్సిందే. అద్దె తక్కువగా ఉండాలి కనుక చిట్టి గదిలోనో, చీకటి కొట్టులోనో, రేకుల షెడ్డులోనో అంగన్వాడి కేంద్రాలు పనిచేస్తాయి. ముంబైలోని ధారవి మురికి వాడలో కూడా 50 చదరపు మీటర్ల ఓ చిట్టి గదిలో ‘శివశక్తి చావల్ అంగన్వాడి’ని రేఖా భాగ్లే నిర్వహిస్తున్నారు. ఆమెకు హేమా కదమ్ సహాయకారి (హెల్పర్)గా పనిచేస్తోంది. ఆ గది అద్దె నెలకు 750 రూపాయలు. సమగ్ర శిశు అభివద్ధి కింద వారు అనేక విధులను నిర్వహించాల్సి ఉంటుంది. శిశువులకు, గర్భవతులకు పౌష్టికాహార పొట్లాలను పంచాలి. వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ఆదివాసీ మహిళలకు పిల్లల పోషణ గురించి వివరించి చెప్పాలి. గర్భవతి స్త్రీలతోపాటు ఆరేళ్ల లోపు పిల్లలకు వేడి వేడి అన్నం వండి వడ్డించాలి. 25 నుంచి 30 మంది పిల్లలకు ప్రాథమిక విద్యను బోధించాలి. శివశక్తి చావల్ అంగన్వాడికి ఉదయం పదింటికల్లా 25 నుంచి 30 మంది పిల్లలు వస్తారు. వారు సాయంత్రం మూడున్నర గంటలకు వెళ్లిపోతారు. ఆ తర్వాత రేఖా భాగ్లే, హేమా కదమ్‌లు బండెడు రిజిస్టర్లు రాయడానికి రోజూ రెండు, మూడు గంటల సమయం పడుతుంది. ఆ తర్వాత ఇంటికెళుతూ తమ ప్రాంతంలోని పేద గర్భవతి స్త్రీల ఆరోగ్యం గురించి వాకబు చేసి వెళతారు. అంగన్వాడి కార్యకర్తగా రేఖా భాగ్లేకు నెలకు ఏడు వేల రూపాయల గౌరవ వేతనం లభిస్తుండగా, హెల్పర్ హేమకు నెలకు మూడున్నర వేల రూపాయలు లభిస్తుంది. ఈ ఏడు వేల రూపాయల్లో కేంద్రం మూడు వేల రూపాయలను కనీస గౌరవ వేతనంగా నిర్దేశించింది. అందులో కేంద్రం 60 శాతం వేతనాన్ని భరిస్తుండగా రాష్ట్రం 40 శాతం భరిస్తోంది. కేంద్రం నిర్దేశించిన కనీస వేతనానికి మించి చెల్లించే రాష్ట్రాలు ఆ అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది. అంగన్వాడీలకు కేంద్రం నిర్దేశించిన కనీస గౌరవ వేతనం మూడు వేల రూపాయలను, నాలుగున్నర వేల రూపాయలను పెంచుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన చాలా గొప్పగా ప్రకటించారు. పెంచిన సొమ్మును కూడా అక్టోబర్ నెల నుంచే దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దష్ట్యా ప్రకటించారు. అయితే మోదీ ప్రకటన రేఖా భాగ్లే లాంటి అంగన్వాడీలను ఏమాత్రం ఆకట్టులేక పోయింది. కేంద్ర ఏడవ వేతన సంఘం నిర్ధేశించిన కనీస కార్మిక వేతనం 18 వేల రూపాయలను తమకు కూడా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రాల వారిగా అంగన్వాడీలకు భిన్న గౌరవ వేతనాలు ఉన్నాయి. హర్యానాలో నెలకు 11,400 రూపాయలు, తెలంగాణలో 10,500 రూపాయలు, కేరళ 10,000 రూపాయలు చెల్లిస్తుండగా, అన్ని రాష్ట్రాలకన్నా తక్కువగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 4,000 రూపాయలను చెల్లిస్తోంది. చిల్లర డబ్బులను పెంచడం కన్నా హర్యానా రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్న వేతనం 11,400 రూపాయలను అన్ని రాష్ట్రాలకు వర్తింపచేసి ఉండాల్సిందని అభిల భారత అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్ల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధూ వ్యాఖ్యానించారు. ఈ సంఘం సీపీఎంకు అనుబంధంగా పనిచేస్తోంది. కనీస వేతనాన్ని నెలకు 18వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ ఐదవ తేదీన ఢిల్లీలో నిర్వహించిన ‘కిసాన్ మజ్దూర్ సంఘర్శ్ ర్యాలీలో’ లక్షలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 28 లక్షల మంది అంగన్వాడి కార్యకర్తలుంటే 11 లక్షల మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. ‘అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ ఆక్టివిస్ట్ (ఏఎస్హెచ్ఏ)’ను ఆశాగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రిలో ఓ ప్రసవం చేసినందుకు 200 రూపాయలు, శిశువుకు టీకా వేయించినందుకు వంద రూపాయల చొప్పున ఆశా కార్యర్తలకు రాయితీగా చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తాలను మోదీ రెండింతలు చేశారు. -
పుట్టిన బిడ్డకూ నా గురించి చెప్పండి..
సాక్షి, అమరావతి బ్యూరో: ‘పుట్టిన బిడ్డకూ నా గురించి చెప్పండి. పెద్దయ్యాక నాకే ఓటు వేస్తారు’ అని సీఎం చంద్రబాబు ఆశా వర్కర్లకు సూచించారు. జీతాలు పెంచినందుకు ప్రతిఫ లంగా తనకు అండగా ఉండాలని కోరారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం ఆశావర్కర్ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి తనకు అనుకూలంగా ప్రచారం చేయాలని ఆశా వర్కర్లను ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీమంతాలు, అన్నప్రాసనలు చేయిస్తున్నట్లు తెలిపారు. అంటువ్యాధులను కంట్రోల్ చేస్తున్నానని, సాంకేతికతను ఉపయోగించి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. తల్లీ, బిడ్డలను ఆర్యోగంగా ఉంచాల్సిన బాధ్యత ఆశా వర్కర్లదేనని పేర్కొన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చారు. రూ.600 కోట్ల వ్యయంతో 59 ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో 1,200 పడకలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. బీజేపీ సహకరించకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నానని పేర్కొన్నారు. రాజధాని రైతులిచ్చిన భూములను అమ్మి అమరావతిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. 2019 మే నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని వ్యాఖ్యానించారు. సీఎంను నిలదీసిన ఆశా వర్కర్.. చంద్రబాబు ప్రసంగిస్తుండగానే గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఆశా వర్కర్ లేచి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ‘ఆశా వర్కర్ల జీతాలు పెంచానని.. రూ.8,600 అందుతాయని మీరు గొప్పగా చెబుతున్నారు. కానీ అందుకు కావాల్సిన జీవోను ఇప్పటి వరకు ఎందుకు విడుదల చేయలేదు’ అని ప్రశ్నించింది. ‘రూ.3 వేల కనీస వేతనంతోపాటు పనితీరును బట్టి మరో రూ.5,600 సంపాదించవచ్చని మీరు చెబుతున్నారు. కానీ పనితీరుతో సంబంధం లేకుండా మూడు వేల రూపాయలను సీలింగ్ పెట్టారు’ అని ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం ప్రకటనలతోనే కాలయాపన చేస్తున్నారు తప్ప మాకు ఎలాంటి అదనపు ప్రయోజనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పరిస్థితిని అర్థం చేసుకున్న వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మైక్ తీసేసుకున్నారు. సీలింగ్ ఎత్తివేస్తూ త్వరలోనే జీవో విడుదల చేస్తామని చెప్పారు. సీఎం ఎదుటే స్పృహ తప్పి పడిపోయిన ఆశా వర్కర్ ఆకలితో స్పృహతప్పి పడిపోయిన ఆశా వర్కర్‌కు భోజనం తినిపిస్తున్న తోటి ఆశా వర్కర్లు ఓ వైపు సీఎం ప్రసంగిస్తుండగానే ఆయన ముందు కూర్చున్న ఓ ఆశా వర్కర్ స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే వైద్యులు చేరుకొని ఆమెను పరీక్షించగా షుగర్ లెవల్స్ పడిపోయాయని తేలింది. ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని గుర్తించిన వైద్యులు వెంటనే అన్నం తెప్పించి తినిపించారు. అధికారులు భోజన వసతి కల్పించకపోవడం.. కనీసం బయటకు వెళ్లి సొంత ఖర్చుతో తిందామన్నా గేట్లు తెరవకపోవడంతో చాలా మంది ఆశా వర్కర్లు నీరసించి పడిపోయారు. సీఎం సభకు హాజరుకాకపోతే ఉద్యోగాలు తీసివేస్తామంటూ బెదిరించి తీసుకువచ్చారని ఆశా వర్కర్లు వాపోయారు. తమ అవసరాలు తీర్చలేనప్పుడు ప్రభుత్వం ఇలాంటి సభలు నిర్వహించడం ఎందుకని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడికెడు అన్నం కోసం అష్టకష్టాలు.. సీఎం సభకు వచ్చిన ఆశావర్కర్లు పిడికెడు అన్నం కోసం అష్టకష్టాలు పడ్డారు. తోపులాటల్లో గాయాలపాలయ్యారు. గుక్కెడు నీరు కూడా దొరక్క నీరసించి ఎక్కడికక్కడ పడిపోయారు. వివరాలు.. సీఎం సభ కోసం అన్ని జిల్లాల నుంచి ఆశా వర్కర్లను బలవంతంగా విజయవాడకు తరలించారు. ఉదయం ఆరు గంటలకే స్టేడియం లోపలికి తీసుకెళ్లారు. ఎవరూ బయటకు వెళ్లకుండా గేట్లకు తాళాలు వేసేశారు. ఉదయం 11 గంటలకు సభ మొదలవుతుందని చెప్పగా.. సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు గానీ వేదికపైకి చేరుకోలేదు. ఉదయం నుంచి తినడానికి తిండి కూడా పెట్టకపోవడంతో ఆశావర్కర్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సుమారు ఆరు వేల మందిని తరలించగా.. కేవలం రెండు వేల మందికి మాత్రమే సరిపడా భోజన వసతిని కల్పించడంతో మిగిలిన వారంతా ఆకలితో అలమటించిపోయారు. ఉన్న అరకొర భోజనం ప్యాకెట్లు అందుకోవటానికి చిన్నపాటి యుద్ధాలే చేశారు. ఈ తోపులాటలో ఆరుగురు ఆశా వర్కర్లకు గాయాలయ్యాయి. అన్నం తినటానికి ప్లేట్లు కూడా దొరక్కపోవడంతో చివరకు కిందపడి ఉన్న ప్లాస్టిక్ కవర్లపైనే భోజనం చేశారు. -
ఆశా, అంగన్వాడీలకు కానుక
న్యూఢిల్లీ: లక్షలాది మంది ఆశా, అంగన్వాడి కార్యకర్తలకు ప్రధాని మోదీ తీపి కబురు అందించారు. అక్టోబర్ నుంచి వారి నెలవారీ గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆశా కార్యకర్తలను పలు సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకొస్తామని, ప్రధాన్‌మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రైమ్‌మినిస్టర్ సురక్షా బీమా యోజన కింద ఉచిత బీమా కల్పిస్తామని, ఏదైనా ప్రమాదానికి గురైతే వారికి రూ.4 లక్షల వరకు బీమా పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలతో మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. రూ.3 వేల గౌరవ వేతనం పొందుతున్న వారికి తాజా పెంపుతో ఇకపై రూ.4,500 లభిస్తుంది. అలాగే, రూ.2200గా ఉన్నవారి వేతనం రూ.3,500కు పెరగనుంది. అంగన్వాడీ సహాయకుల గౌరవ వేతనాన్ని రూ.1500 నుంచి రూ.2,500కు పెంచుతున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ పెంపు అక్టోబర్ నుంచే అమల్లోకి రాబోతున్నా, నవంబర్ వేతనాల్లో ప్రతిబింబిస్తుందని, ఇది వారికి దీపావళి కానుక అని మోదీ అభివర్ణించారు. కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్(ఐసీడీఎస్–సీఏఎస్) ఉపయోగిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు అదనంగా రూ.250–రూ.500 మధ్య ప్రోత్సాహకాలిస్తామని చెప్పారు. ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించడం సాధారణమే. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేరుగా ప్రోత్సాహకాలిస్తాయి. దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఆరేళ్లలోపున్న చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు సుమారు 10 లక్షల మంది దాకా ఈ కేంద్రాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. 12,83,707 అంగన్వాడి కార్యకర్తలు, 10,50,564 సహాయకులు వారికి సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. ‘ఆయుష్మాన్ భారత్’ తొలి లబ్ధిదారు కరిష్మ.. నవజాత శిశువుల ఆరోగ్యం, పోషణ ప్రమాణాల పరిరక్షణలో ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని మోదీ కొనియాడారు. ఈ నెల 23న జార్ఖండ్‌లో ప్రారంభించబోతున్న ప్రతిష్టాత్మక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులను గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. హరియాణాలోని కర్నాల్ జిల్లాలో ఇటీవల జన్మించిన కరిష్మ అనే చిన్నారి ఈ పథకంలో తొలి లబ్ధిదారు అని వెల్లడించారు. రక్తహీనత సంబంధిత వ్యాధులను మూడు రెట్లు తగ్గించేందుకు రెట్టింపు ప్రయత్నాలు అవసరమని పిలుపునిచ్చారు. ‘పోషన్ అభియాన్’ లక్ష్యసాధన దిశగా సాంకేతికత సాయంతో వినూత్న పద్ధతుల్లో సేవలందిస్తున్న కార్యకర్తలను మోదీ ప్రశంసించారు. సెప్టెంబర్ మాసాన్ని పోషణకే అంకితం చేస్తున్నామని, గరిష్ట పోషణ ప్రయోజనాలను వివరిస్తూ ఇంటింటికీ ప్రచారం చేపట్టాలని సూచించారు. ఆశా, అంగన్వాడీ కార్యకర్తల వేతన పెంపుపై మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ హర్షం వ్యక్తం చేశారు. పని సంస్కృతిని మార్చేశాం న్యూఢిల్లీ: యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త పని సంస్కృతిని తీసుకొచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. అణగారిన వర్గాల్లో విశ్వాసం నింపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వ్యవసాయం, ఆర్థికం, సాంకేతికత సహా అన్ని రంగాల్లో దేశం పురోగమిస్తోందని చెప్పారు. షికాగోలో స్వామి వివేకానంద ప్రసంగించి 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోయంబత్తూరులోని శ్రీరామకృష్ణ మఠం మంగళవారం నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ వీడియో ద్వారా మాట్లాడారు. ‘యువత ఆకాంక్షలు, ఆశయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పని సంస్కృతిలో మార్పులు చేసింది. ఈ సంగతిని గుర్తించి నైపుణ్యాభివృద్ధికే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశాం. వినూత్న ఆలోచనలు, అంకుర పరిశ్రమలకు స్టార్టప్ ఇండియా చక్కని వేదికైంది’ అని అన్నారు. -
మీకిదే ఎక్కువ...!
సాక్షి, అమరావతి: దుర్భరంగా మారిన తమ జీవితాలను జీతాలు పెంచి ఆదుకోవాలంటూ తనను చుట్టుముట్టిన ‘ఆశా’ కార్యకర్తలపై మీకిచ్చేదే ఎక్కువంటూ సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు కోరుతున్నట్లుగా ఆశా వర్కర్లకు రూ. 6 వేల గౌరవ వేతనం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఇచ్చింది తీసుకోవాలని, అంతకుమించి ఇవ్వలేమని స్పష్టం చేశారు. మీరిచ్చే డబ్బు సరిపోదంటూ తమ ఆవేదనను చెప్పడానికి ప్రయత్నించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాను చెప్పిందే వినాలని, ఇంతకు మించి ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదన్నారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం వద్ద గ్రీవెన్స్ హాలులో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆశా వర్కర్లతో చంద్రబాబు సమావేశమయ్యారు. ‘ఆశాలకు బాసట’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం అంతా సీఎం ఆగ్రహావేశాలకు వేదిక కావటం గమనార్హం. హ్యాపీయేనా... ఏమాత్రం చాలదు ఆశా వర్కర్లకు రూ. 3 వేల గౌరవ వేతనం ఇస్తామని, పనితీరును బట్టి మరో మూడు వేలు ఇచ్చే అవకాశం కల్పిస్తానని చెబుతూ అందరూ హ్యాపీయేనా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. అయితే ఆశా వర్కర్లంతా అది న్యాయం కాదని, ఏమాత్రం చాలదంటూ ముక్తకంఠంతో చెప్పారు. తనకు సన్మానం చేస్తారని ఆశించిన చంద్రబాబు వారి సమాధానంతో అవాక్కయ్యారు. ఇలా అయితే కుదరదని హెచ్చరించారు. ఫిక్స్‌డ్‌గా కనీసం రూ.ఆరు వేల గౌరవ వేతనం ఇవ్వాలని, తమ పరిస్థితి దారుణంగా ఉందని ఆశాలు ఆవేదన వ్యక్తం చేయగా అడ్డుకున్న చంద్రబాబు ఈ మాదిరిగా అయితే కుదరదని, రాబోయే రోజుల్లో మీకు కష్టాలు వస్తాయంటూ బెదిరించారు. ‘అవన్నీ కాదమ్మా.. తెలంగాణలోనూ, ఎక్కడా లేని విధంగా రూ.మూడు వేలు ఇస్తాం. మీ లీడర్లు వచ్చి రూ. మూడు వేలకు అంగీకరించారు. ఇంకా ఏమిటి?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లు తమ గోడు చెప్పుకునేందుకు ప్రయత్నించగా అవన్నీ తాను విననన్నారు. రూ. మూడు వేలు ఇస్తామంటే లీడర్ల ద్వారా ఒప్పుకుని ఇక్కడకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కావాలనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 43 వేల మంది వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు ఇప్పిస్తానని, యాప్ ద్వారా పనుల్ని అప్లోడ్ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. చంద్రన్న బీమా, ఏటా యూనిఫామ్, ఏఎన్ఎంల నియామకంలో ప్రాధాన్యం, ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్యం పొందేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు. చంద్రబాబును చుట్టుముట్టిన ఆశా వర్కర్లు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఏమాత్రం సంతృప్తి చెందని ఆశా వర్కర్లు ఆయన లేచి వెళ్లిపోతుండగా తమ సమస్యలు చెప్పేందుకు ప్రయత్నించారు. వారిపై ఆయన పదేపదే ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒకదశలో ఆశా వర్కర్లంతా ఆయన్ను చుట్టుముట్టి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా వినని ముఖ్యమంత్రి మీకిదే ఎక్కువని వ్యాఖ్యానిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒప్పుకోవాలంటూ యూనియన్ నాయకులపై ఒత్తిడి ఆశావర్కర్లు అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యను కలవగా ఆమె కూడా ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్నే చెప్పారు. దీంతో వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రూ.6 వేల గౌరవ వేతనాన్ని ప్రకటిస్తారంటూ రాత్రికి రాత్రి తమను అమరావతికి రప్పించి తీరా రూ.మూడు వేలే ఇస్తామంటున్నారని వాపోయారు. తమకు ప్రయాణ ఖర్చులే బోలెడు అవుతున్నాయని, తమ బ్రతుకులు దుర్భరంగా ఉన్నాయని తెలిపారు. దీంతో పూనం మాలకొండయ్య మీడియాను బయటకు పంపించి మరోసారి ఆశా వర్కర్లతో సమావేశమై రూ.మూడు వేలతో సరిపెట్టుకోవాలని సూచించారు. ఆశా వర్కర్ల యూనియన్ నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడి ఇందుకు అంగీకరించాలంటూ ఒత్తిడి చేయడంతో వారు బయటకు వచ్చి రూ.మూడు వేల గౌరవ వేతానికి ఒప్పుకుంటున్నామని, మిగతా రూ.మూడు వేలు రాయితీల రూపంలో ఇవ్వడానికి అంగీకరించారని ప్రకటించారు. కానీ ఆశా వర్కర్లు మాత్రం తమను సుదూర ప్రాంతాల నుంచి పిలిపించి రూ.మూడు వేలు ఇస్తామంటున్నారని, ముఖ్యమంత్రి వద్ద చప్పట్లు కొట్టాలని చెబుతున్నారని నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రితో సమావేశానికి వర్కర్ల యూనియన్ నాయకులను లోపలకు అనుమతించకపోవడంతో రోడ్డుపై ఆందోళనకు దిగారు. పలువురు ఆశా వర్కర్లను లోపలకు పంపకపోవడంతో బయటే ఉండిపోయారు. -
ఆశ..నిరాశ
ఒక రోజు కూలికి పోయినా కనీసం రూ.200లు సంపాదిస్తారు. అంటే నెలకు రూ.6 వేలు. కానీ గ్రామాల్లో వైద్య సేవలకు సహాయకులుగా ఉండే ఆశ కార్యకర్తలకు మాత్రం కనీస వేతనాలు అమలు కావడం లేదు. ఎంత చేసినా నెలకు రూ.2 వేలకు మించని వేతనాలు. వీటితో ఎలా బతకాలి, కుటుంబాలను ఎలా పోషించుకోవాలి. తమకు కూడా కనీస వేతనాలు ఇవ్వాలని ఆశ కార్యకర్తలు ఎన్నో పోరాటాలు సాగిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. కారంచేడు : గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరికీ పూర్తి స్థాయి ఆరోగ్య సేవలను అందించాలనే సంకల్పంతో 2006వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశ కార్యకర్తలను నియమించారు. వీరు గ్రామాల్లో ఉండే ఏఎన్ఎంలకు సహాయకులుగా ఉంటూ ప్రజలకు ఆరోగ్య సేవలు, సూచనలు అందిస్తుంటారు. అంతే కాకుండా గ్రామాల్లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను గుర్తించి వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటుంటారు. ప్రభుత్వం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాలతో పాటు ప్రతి బుధ, శనివారాల్లో జరిగే ఇమ్యూనైజేషన్ కార్యక్రమాల్లోనూ సేవలందిస్తుంటారు. అయితే ఇటీవల పెరిగిన ఖర్చులు, నిత్యవసర వస్తువుల ధరలతో పోల్చుకుంటే సేవలకు తగిన ఫలితం అందడం లేదని, దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేవలు ఫుల్.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 వేల మంది ఆశ కార్యకర్తలు సేవలందిస్తున్నారు. జిల్లాలో 56 మండలాల్లో 2650 మంది నిత్యం ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. అంతే కాకుండా ఏజెన్సీ, ఆరు ఐటీడీఏల పరిధిలో 5262 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (ఏజెన్సీ ఆశాలు) పని చేస్తున్నారు. వీరంతా చిన్నారులు, గర్భిణులకు విశేష సేవలందిస్తూ భవిష్యత్తు మానవ వనరుల వికాసానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న ఆశలకు కనీస వేతన సదుపాయాలు కల్పించాలని పోరాటాలు చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు. కనీస వేతనాలు, యూనిఫాం అలవెన్స్ వంటి డిమాండ్లతో ధర్నా చేపట్టారు. గ్రామాల్లో డీఈసీ మాత్రల పంపిణీ, పలు టీకా కార్యక్రమాల్లో ఏఎన్ఎంలకు అండగా ఉంటున్నారు. ఇన్ని సేవలు అందిస్తున్నా తమకు తగిన ప్రతిఫలం దక్కడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పనికి తగిన వేతనమని కేవలం కంటి తుడుపుగా ఇచ్చే పారితోషంతో తమ కుటుంబాలు ఎలా గడుస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు. వారు ఇచ్చే పారితోషికాలు సేవలందించేందుకు ప్రయాణ ఖర్చులకు కూడా సరిపోని విధంగా ఉంటున్నాయని ఆరోపిస్తున్నారు. ఫలించని ధర్నాలు: ఆశ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనాలు అందించాలని వివిధ సంఘాల సహకారంతో చేస్తున్న ధర్నాలతో అయినా ప్రభుత్వం వేతనాలు పెంచాల్సి ఉందని వారంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కనీస వేతనం రూ.5 వేలు అందించాలని వారు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.6 వేలకు పెంచారని, ఏపీలో కూడా వేతనాలు పెంచాలని కోరుతున్నారు. ఆశల ప్రధాన డిమాండ్లివే.. సేవకు కొలత వేసి డబ్బులిచ్చే పద్ధతి తీసివేయాలి. తెలంగాణ మాదిరిగా వేతనాలు చెల్లించాలి. మూడేళ్ల నుంచి ఇవ్వాల్సిన యూనిఫాం అలవెన్స్లతో పాటు బకాయిలు కూడా చెల్లించాలి. 104లో సేవలందించినందుకు గాను రోజుకు రూ.100ల వంతున ఇవ్వాల్సిన బకాయిలు కూడా వెంటనే ఇవ్వాలి. టీబీ కేసుల రోగులకు సేవలందించినందుకు రెండు సంవత్సరాలుగా పేరుకుపోయిన బకాయిలు విడుదల చేయాలి. ఆశ డే రోజున అందించే రూ.150లు బ్యాంక్‌లో కాకుండా చేతికివ్వాలి. పాఠశాలల్లో పిల్లలకు మింగించే ఐరన్ ట్యాబ్లెట్లు వేసినందుకు, పెంటావాలెంట్, రోటా వ్యాక్సిన్లకు పారితోషికం ఇవ్వాలి. పభుత్వం ఆదుకోవాలి: ఆశ కార్యకర్తలకు కనీస వేతన చట్టం అమలు చేయాలి. వీరికి కనీస వేతనాలివ్వాలని పలుమార్లు ఆందోళనలు చేపట్టాం. కార్యకర్తల శ్రమదోపిడీ జరగకుండా వారికి కనీసం రూ.5 వేలు వేతనం అందించి వారి కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడాలని కోరుతున్నాం. – బయ్య శంకర్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఉద్యోగ భద్రత కల్పించాలి కొన్నేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశ కార్యకర్తలు ఉద్యోగ భద్రత లేకుండా పని చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి నెలా అందించే ప్రోత్సాహకాలు కూడా అందడం లేదు. కనీస వేతనాలు అమలు చేయడమే కాకుండా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. – శింగమ్మ, ఆశా కార్యకర్త, స్వర్ణ సబ్ సెంటర్ -
బ్యాంక్ ఖాతాల్లోకి ఆశావర్కర్ల వేతనాలు
హైదరాబాద్: ఆశా వర్కర్ల వేతనాలను వచ్చే నెల నుంచి వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. డీఎంహెచ్‌వో ద్వారా జీతాలు అందించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఉద్యోగుల ఖాతాల్లో నెలకు రూ.6 వేల వేతనం చొప్పున జమ చేయనున్నట్లు హామీ ఇచ్చారు. గురువారం ఇక్కడ డీఎంహెచ్ఎస్ ఆవరణలో జరిగిన తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం 3వ రాష్ట్ర మహాసభల్లో మంత్రి మాట్లాడారు. 2వ ఏఎన్ఎం, ఈసీ ఏఎన్ఎంల సమస్యలను సీఎంతో మాట్లాడి పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. టీఎస్ఎంఐడీసీ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగంలో పెనుమార్పులు తీసుకువచ్చిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులంటే ‘నేను రాను బిడ్డో.. సర్కారీ దవాఖానాకు... అనే వారని, ఇప్పుడేమో ‘పోదాం పదా బిడ్డో.. సర్కారు దవా ఖానాకు’అంటున్నారని చమత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ డీహెచ్ లలితకుమారి, డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, తెలంగాణ వైద్య, ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా పురుషోత్తం రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పారా మెడికల్, వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. -
జగన్‌కు సమస్యలు చెప్పుకున్న ఆశావర్కర్లు
-
కదం తొక్కిన ఆశ వర్కర్లు
-
నెరవేరిన ‘ఆశ’లు
⇒ ఆశ వర్కర్ల వేతనాలు రూ.6 వేలకు పెంపు ⇒ ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని క్షేత్ర స్థాయి సిబ్బందిగా పనిచేస్తున్న ఆశ వర్కర్ల వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆశ వర్కర్లకు నెలకు రూ.6 వేల చొప్పున వేతనాలు చెల్లించాలని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. 2017 మే 5 నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అమ లు చేసే జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హె చ్ఎం), రాష్ట్ర ప్రభుత్వ నిధులను కలిపి పెంచిన వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమి షనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఏడాది జూన్‌లో ఆశ వర్కర్ల జీతం పెంచుతామని ముఖ్య మంత్రి కేసీఆర్ చెప్పారు. సీఎం హామీ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆశ వర్కర్లకు వేతనాల పెంపుపై ప్రతిపాదనలు రూపొందిం చి ప్రభుత్వానికి అందించింది. రాష్ట్రంలో దాదాపు 27,845 మంది ఆశ వర్కర్లు పని చేస్తున్నారు. ఎన్హెచ్ఎం కార్యక్రమంలో భాగంగా వీరు నియమితులయ్యారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో అమ లయ్యే అన్ని పథకాలు, కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో ఆశ కార్యకర్తలే ప్రజల వద్దకు తీసు కెళ్తున్నారు. దాదాపు 28 రకాల వైద్య సేవల్లో ఆశ కార్యకర్తలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. -
‘ఆశ’లకు నిరాశేనా?
- రూ.6 వేలు వేతనమిస్తామన్న సీఎం హామీకి అధికారుల కొర్రీలు - ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆశ వర్కర్లు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్వయంగా ‘ఆశ’ కార్యకర్తలకు ఇచ్చిన హామీ అమలుకు అధికారుల కొర్రీలు అడ్డంకిగా మారుతున్నాయి. ‘ఆశ’ కార్యకర్తలకు రూ.6 వేలు గౌరవ వేతనంగా అందజేస్తామని సీఎం ప్రకటించగా... అలాకాకుండా ఇప్పుడి స్తున్న దానికి రెట్టింపు సొమ్ము ఇవ్వాలంటూ అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇదే జరిగితే అత్యధికశాతం మందికి గరిష్టంగా రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ‘ఆశ’ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అతి తక్కువ మందికి మాత్రమే రూ.6 వేలు అందుతాయని చెబుతున్నారు. అందరికీ రూ.6 వేలు గౌరవ వేతనం అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా.. రాష్ట్రంలో 27,045 మంది ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు. పదేళ్ల కింద జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) మార్గదర్శకాల ప్రకారం వారిని నియమించారు. కుటుంబ నియంత్రణ, ఆసుపత్రిలో కాన్పు, ఇమ్యునైజేషన్ వంటి వాటిని ప్రోత్సహించడంతోపాటు పలు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల అమలు బాధ్యతలను వారు నిర్వర్తిస్తున్నారు. 104, 108, ఆరోగ్యశ్రీ పథకాలకు తోడ్పాటు, హెచ్ఐవీ రోగులకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. కుష్టు, టీబీ రోగులకు మందులు పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ప్రజలకు వచ్చే వ్యాధులను గుర్తించడం, అవసరమైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)కు తీసుకెళ్లడం, అక్కడ తగిన వైద్యం అందుబాటులో లేకుంటే పైఆసుపత్రికి రిఫర్ చేయడం వంటివి చేస్తున్నారు. ఈ పనులన్నింటికీ ప్రభుత్వం నామమాత్రపు పారితోషికాలనే చెల్లిస్తోంది. పనిని బట్టి నెలకు ఒక్కో ఆశ వర్కర్‌కు రూ.400 నుంచి రూ.2 వేల వరకు మాత్రమే అందుతున్నాయి. రోజంతా పల్లెల్లో సేవలందిస్తున్నా ప్రభుత్వం తగిన పారితోషికం ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటోందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘ఆశ’ వర్కర్లకు ప్రయోజనం కలిగించేలా నెలకు రూ.6 వేల చొప్పున గౌరవ వేతనంగా అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ దీనికి అధికారులు కొర్రీలు పెడుతున్నట్లు తెలుస్తోంది. -
ఆశల ఘోష
► కనీస వేతనం కోసం ఆశా కార్యకర్తల ఆందోళన ► డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట భారీ ధర్నా ► ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు ► ఆందోళనకారులను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు సీతమ్మధార(విశాఖ ఉత్తర): కనీస వేతనం కోసం ఆశా(ఆంధ్రప్రదేశ్ వాలంటరీ హెల్త్ వర్కర్స్) కార్యకర్తలు నినదించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా తమను పట్టించుకోని టీడీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు గురువారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు బి.రామలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్స్కు కనీస వేతనంగా నెలకు రూ.6 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణా రాష్ట్రం ఆశా కార్యకర్తలకు కనీస వేతనంగా రూ.6 వేలు ప్రకటించిందని, తక్షణమే ఏపీ ప్రభుత్వం కూడా అమలు చేయాలన్నారు. మూడు నెలల బకాయి పారితోషకాలు, చంద్రన్న బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. పీహెచ్సీలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, నాలుగు సంవత్సరాల యూనిఫాంలు, అలవెన్స్‌లను వెంటనే చెల్లించాలన్నారు. పీహెచ్సీలలో ఖాళీలను భర్తీ చేయాలని, ప్రజలకు అవసర మైన మందుల్ని ప్రభుత్వం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పదేళ్లుగా గ్రామ స్థాయిలో గర్భిణులు, బాలింతలు, పిల్లల సంరక్షణతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు జరిగేలా చూస్తున్నామని చెప్పారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నామన్నారు. అయినా ప్రభుత్వం ఆశా కార్యకర్తలపై నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. నెలలు తరబడి బకాయిలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, చేసిన పనికి కూడా పారితోషకం పూర్తిగా చెల్లించకుండా కోతలు విధిస్తుందని ఆమె మండిపడ్డారు. వేతనాల కోసం ఆందోళనలు చేస్తే పోలీసులతో బెదిరించి కనీస వేతనం కాదు కదా అసలు ఎలాంటి చెల్లింపులు లేకుండా చేస్తుందని ఆరోపించారు. కేంద్రం మంజూరు చేసే యూనిఫాం అలవెన్స్ సంవత్సారానికి రూ.500ను గత నాలుగేళ్లుగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన కార్యదర్శి వి.సత్యవతి మాట్లాడుతూ ఆశా వర్కర్లపై పని భారం పెరిగిపోయిందని, వేతనాలు లేక తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడిలకు గురవుతూ అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. తక్షణమే కనీసం వేతనం ప్రకటించాలని నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి, బలవంతంగా జీపులు, ఆటోలు, బస్సులు, వ్యాన్లలోకి ఎక్కించారు. దీంతో ఆశా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదాలు జరిగాయి. ఆందోళనకారులను నగరంలోని ద్వారకా, మూడో, నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లతో పాటు పీఎంపాలెం, ఆనందపురం పోలీస్స్టేషన్లకు తరలించారు. అనంతరం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు కోటేశ్వరరావు, యూనియన్ గౌరవ అధ్యక్షురాలు ఎస్.అరుణ, అధ్యక్షులు బి.రామలక్షి, జిల్లాలోని ఆశా వర్కర్లు పాల్గొన్నారు. -
ఏపీలో ఆశా వర్కర్ల ఆందోళన
-
ఆశా వర్కర్ల జీతం రూ.6వేలుకు పెంపు
-
‘ఆశ’లు తీరాయి!
ఆశ వర్కర్లకు నెలకు రూ.6 వేల పారితోషికం: కేసీఆర్ ► ఈ నెల నుంచే అమలు.. వచ్చే బడ్జెట్లో మరోసారి పెంపు ► వైద్యారోగ్య శాఖ ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ► ఇతర సమస్యలనూ పరిష్కరిస్తామని హామీ ► ప్రజల ఆరోగ్యం బాధ్యత మీదేనంటూ వ్యాఖ్య ► ఆశ వర్కర్లతో వెట్టిచాకిరీ చేయించుకోవద్దని అధికారులకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆశ వర్కర్లకు ప్రతి నెలా అందుతున్న పారితోషికాన్ని రూ.ఆరు వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీనిని ఈ నెల నుంచే అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆశ వర్కర్లకు నెలకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు మాత్రమే పారితోషికంగా అందుతున్నాయి. ఇకపై రూ.ఆరు వేలు అందించనున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది బడ్జెట్ సందర్భంగా మరోసారి ఆశ వర్కర్ల పారితోషికం పెంచుతామని.. ఆశ వర్కర్లను అంగన్వాడీ కార్యకర్తల స్థాయికి తీసుకెళతామని సీఎం హామీ ఇచ్చారు. విద్యార్హతలుండి శిక్షణ పొందిన వారికి ఏఎన్ఎం ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తామని.. ఇతర కోర్సులు చేసినవారుంటే వైద్య ఆరోగ్య శాఖలో సంబంధిత ఉద్యోగాలిస్తామని తెలిపారు. ఆరోగ్య సంబంధ విధులు తప్ప మరో పని చెప్పకుండా అధికారులకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు. శుక్రవారం రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆశ వర్కర్లు ప్రగతి భవన్ వచ్చారు. వారందరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయించిన సీఎం కేసీఆర్.. అనంతరం జనహితలో వారితో సమావేశమయ్యారు. ఆశ వర్కర్ల సమస్యలు, విజ్ఞప్తులను విన్నారు. క్షేత్రస్థాయిలో తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు తాము అన్ని రకాల సేవలు చేస్తున్నామని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి వివరించారు. కేవలం ఆరోగ్య సంబంధమైన పనులే కాకుండా, ప్రభుత్వం నిర్వహించే ఇతర కార్యక్రమాల్లో కూడా భాగస్వాములం అవుతున్నామని చెప్పారు. అయినా తమకు నెలకు రూ.వెయ్యి– పదిహేను వందలు మాత్రమే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. వెట్టి చాకిరీ చేయించొద్దు.. ఆశ వర్కర్ల సమస్యలు తీర్చుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అధికారులు ఆశ వర్కర్లతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. ‘‘వారికో జాబ్ చార్ట్ కూడా లేదు. ఏ పని పడితే ఆ పని చేయిస్తున్నారు. వాస్తవానికి వారి పనులు చేసుకుంటూ రోజులో గంటో రెండు గంటలో మాత్రమే పనిచేయడానికి ఆశ వర్కర్లను ఏర్పాటు చేశారు. కానీ ఆచరణలో రోజంతా పనిచేయిస్తున్నారు. వారికి కేటాయించిన పని మాత్రమే కాకుండా ఇతర పనులు చేయిస్తున్నారు. వాటికి అదనపు పారితోషికం కూడా ఇవ్వడం లేదు. గత పాలకులు ఆశ వర్కర్లను పట్టించుకోలేదు. అంగన్వాడీ వర్కర్ల విషయంలోనూ ఇలాగే జరిగింది. రెండు దఫాలుగా జీతాలు పెంచి వారికి న్యాయం చేశాం. ఇప్పుడు ఆశ వర్కర్లకు కూడా సమాజంలో, కుటుంబంలో గౌరవం పెరిగే విధంగా జీతాలు పెంచుతాం. ఈ నెల నుంచే రూ.6 వేలు ఇస్తాం. వచ్చే బడ్జెట్ సందర్భంగా మరోసారి పెంచుతాం..’’అని ప్రకటించారు. ఆశ వర్కర్లు ఏం పనిచేయాలి? ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎవరెవరు ఏ పనిచేయాలనే విషయాల్లో స్పష్టత ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరు కేసీఆర్ కావాలి ఆరోగ్య అంశాలపై ప్రజలకు అవగాహన లేదని, అనేక రోగాల బారిన పడుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. పేదరికం కారణంగా నిండు గర్భిణులు కూడా కూలీ పనులకు వెళుతున్నారని, అది ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ బాధలు పోవాలనే గర్భిణులకు రూ.12 వేలు ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని.. తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కేసీఆర్ కిట్లు అందిస్తున్నామని చెప్పారు. వాటన్నింటా ఆశ వర్కర్లు భాగస్వాములు కావాలని, క్షేత్రస్థాయిలో ఆరోగ్య పరిరక్షకులుగా మారాలని సూచించారు. ప్రతి ఒక్కరు ఒక కేసీఆర్ కావాలని వ్యాఖ్యానించారు. ‘మీ అందరి కడుపునిండా జీతం ఇచ్చే బాధ్యత నాది. ప్రజల ఆరోగ్యం బాధ్యత మీది..’అని ఆశ వర్కర్లతో పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు సి.లక్ష్మారెడ్డి, టి.హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు వివేకానంద, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ సలీమ్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తదితరులు పాల్గొన్నారు. ఆశ వర్కర్ల హర్షం తమకు అందించే పారితోషికాన్ని పెంచడంపై ఆశ వర్కర్లు సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రకటన చేయగానే జనహిత జైతెలంగాణ నినాదాలతో మార్మోగింది. ఆశ వర్కర్ల వేతనాలు పెంచడంపై టీఎన్జీవోల సంఘం గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.రాజేందర్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి భవన్లో పారితోషికం పెంపు విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్న ఆశ వర్కర్లు -
ఆశా వర్కర్ల జీతం రూ.6వేలుకు పెంపు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఏఎన్ఎమ్, ఆశా వర్కర్లతో సమావేశం అయ్యారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో ఆయన ఆశా వర్కర్ల జీతం నెలకు రూ.6వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే మరోసారి కూడా జీతం పెంచనున్నామని, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్ల జీతాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని తెలిపారు. అలాగే ఖాళీగా ఉన్న 1200 ఏఎన్ఎమ్ పోస్టుల భర్తీలో ఆశా వర్కర్లకు తొలి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా అంగన్వాడి వర్కర్లతో సమానంగా ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏడాదికి ఆరున్నర లక్షల ప్రసవాలు జరిగితే, అందులో కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఆస్పత్రిలో జరుగుతున్నాయన్నారు. గ్రామ ఆరోగ్య పరిరక్షణ బాధ్యత ఆశా వర్కర్లదేనని, వారి పని ఏంటనేది త్వరలోనే కార్యచరణ రూపొందిస్తామన్నారు. ప్రజలు కూడా ఆశా వర్కర్లను వెటకారం చేసే పరిస్థితి మారాలని సీఎం సూచించారు. -
కలెక్టరేట్ ఎదుట ‘ఆశ’ల ధర్నా
ఖమ్మంమయూరిసెంటర్: మాత శిశు మరణాలు తగ్గించేందుకు కృషి చేస్తున్న తమకు ప్రభుత్వం వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఆశ వర్కర్లు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. అర్హులైన వారిని సెకండ్ ఏఎన్ఎంలుగా గుర్తించాలని, కమ్యూనిటీ వర్కర్స్కు 27 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని నినాదాలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్న తమ పట్ల.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆశ కార్యకర్తలు ఆరోపించారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఆశ వర్కర్ల సంఘ జిల్లా కార్యదర్శి సీహెచ్.కుమారి, రామారావు, వెల్లబోయిన రాధ, బి.అమల, జ్యోతి, భాగ్యమ్మ, సుభద్ర, సువర్ణ, సాయిబీ, ధనలక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నర్సింహరావు, లింగయ్య, మోహన్‌రావు పాల్గొన్నారు. -
ఆశావర్కర్ల ఆందోళన
ఏలూరు అర్బ¯ŒS : అపరిష్కృతంగా ఉన్న సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు శుక్రవారం స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జిల్లావ్యాప్తంగా డీఎంహెచ్‌వో ఆధీనంలో ఉన్న 79 పీహెచ్‌సీల్లో 2,500 మంది ఆశావర్కర్లుగా విధులు నిర్వహిస్తున్నారని, ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాల జయప్రదానికి 11 ఏళ్లుగా తాము కృషి చేస్తున్నామని కార్యకర్తలు గుర్తుచేశారు. ఇంత చేస్తున్నా.. తమకు నెలనెలా జీతాలు కూడా సరిగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తల సంఘ నాయకులు డి.మాత, సుకుమారి, విజయకుమారి, చిట్టెమ్మ పాల్గొన్నారు. -
ఆశ కార్యకర్తలు కీలకం
ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ ఉట్నూర్ ఆశ కార్యకర్తల సమ్మేళనం ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో వ్యాధులు, జ్వరాలు అరికట్టడంలో ఆశ కార్యకర్తలు నిర్వర్తించే పాత్ర కీలకమైనదని ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ అన్నారు. వర్షకాలంలో సీజన్ వ్యాధులు ప్రబలుతున్నందున్న ఎల్లప్పుడు ఆశ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం మండల కేంద్రంలోని హెచ్‌కేజీఎన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆశ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో జ్వరాలు, వ్యాధులు ప్రబలినప్పుడు వెంటనే సంబంధిత వైద్యాధికారులకు సమాచారం అందించడంతోపాటు ప్రాథమిక చికిత్స అందించాలని చెప్పారు. గిరిజన గ్రామాల్లో ఇంటింటా పర్యటిస్తూ పారిశుధ్యం లోపించకుండా తీసుకోవాల్సిన చర్యలు, దోమల నివారణకు చేపట్టాల్సిన చర్యలు వివరించాలని పేర్కొన్నారు. గర్భిణులు ఆస్పత్రుల్లో ప్రసవం అయ్యేలా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో దోమల నివారణకు కాంట్రాక్టర్ల ద్వారా కాకుండా వీటీడీఏ, ఆశ కార్యకర్తల ఆధ్వర్యంలో స్ప్రే చేయిస్తామని, అందుకు సంబంధించిన నిధులు ఆశ కార్యకర్తల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. జ్వరాలు ప్రబలితే ఆర్డీ కీట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించేలా చర్యలు చేపడితే రూ.50 ప్రోత్సాహకంగా అందిస్తామని తెలిపారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 18 మంది ఆశ కార్యకర్తలకు ప్రశంసపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆశరెడ్డి, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి, ఏఎమ్‌వో వెంకటేశ్వర్లు, వైద్యులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఉద్యోగ భద్రత కల్పించండి
కర్నూలు(న్యూసిటీ): కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.రామాంజనేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సీఐటీయూ ఆశా వర్కర్స్ యూనియన్ మహిళలు, ఏఎన్ఎంలు భారీ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో మూడు లక్షల మంది కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. ఏఎన్ఎంలకు 10వ పే రివిజన్ స్కూలు అమలు చేయాలని వివరించారు. ఏఎన్ఎంలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. సెకండ్ ఏఎన్ఎంలను తొలగింపును విరమించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జాబు వస్తుందని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి.రమీజాబీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.15 వేలు నిర్ణయించి అమలు చేయాలని కోరారు. ఆశావర్కర్లకు 4 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని తెలిపారు. అర్హులైన ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చి, రెండో ఏఎన్ఎంలుగా తీసుకోవాలని కోరారు. ఆశా వర్కర్లు కలెక్టరేట్ గేట్లు తీసుకుని లోపలికి వెళ్లటానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డగించారు. దీంతో ఆశా వర్కర్లకు, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. డీఎంహెచ్ఓ హామీ: ఆశా వర్కర్లకు నాలుగు నెలల పెండింగ్ వేతనాలను వారం రోజుల్లోపు చెల్లిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శారద హామీ ఇచ్చారు. ఈ ధర్నాలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.మహాలక్ష్మి, జిల్లా గౌర వాధ్యక్షుడు టి.చంద్రుడు, జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఏఎన్ఎం జిల్లా కార్యదర్శి రవినాజ్యోతి, జిల్లాలోని అనేకమంది ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. -
అనంతలో ఆందోళనల హోరు
పెట్రో ధరల పెంపును ఉపసంహరించుకోవాలి నగరంలో గురువారం వామపక్షాలు, వ్యాపారవర్గాలతో పాటు, ఆశావర్కర్లు ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపారు. పెట్రో ధరల పెంపును ఉపసంహరించుకోవాలని సీపీఎం, సీపీఐ నాయకులు, విధానాలపేరుతో వేధింపులు మానుకోవాలని వ్యాపారులు ప్రదర్శనలు నిర్వహించారు. తొలగింపు ఆదేశాలను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. వామపక్షాల డిమాండ్ అనంతపురం అర్బన్: పెట్రోలు, డీజిల్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్షపార్టీల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక టవర్ క్లాక్ వద్ద వేరువేరుగా సీపీఎం, సీపీఐ నాయకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సీసీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మాల్యాద్రి మాట్లాడుతూ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి కేంద్రం ప్రజలపై భారం మోపుతోందన్నారు. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రంలో నాలుగు శాతం వ్యాట్‌ను అదనంగా మోపడం వల్ల ప్రజలపై అధిక భారం పడుతోందన్నారు. నగర కమిటీ కార్యదర్శి నాగేంద్రకుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొన్నారు. పెంచిన పెట్రో ధరలను తగ్గించాలి: జగదీశ్ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ప్రజావ్యతిరేక చర్యని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ అన్నారు. పెంచిన ధరను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ధరల పెంపును నిరసిస్తూ గురువారం స్థానిక టవర్ క్లాక్ వద్ద ఆటోను తాళ్లతో లాగుతూ సీపీఐ నాయకులు నిరసన తెలిపారు. సమరశీల పోరాటాలకు సంసిద్ధులు కావాలి ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని నాయకులు సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ పిలుపునిచ్చారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో గురువారం ఆ పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. -
‘ఆశ’ల చలో బెజవాడపై పోలీసు ప్రతాపం
న్యాయమైన తమ డిమాండ్ల సాధన కోసం చలో విజయవాడ కార్యక్రమానికి విచ్చేసిన ఆశా వర్కర్లపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఏపీ వాలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్(ఆశా) (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వెయ్యిమందికి పైగా ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారికి మద్దతిచ్చిన సీఐటీయూ నాయకులను సైతం అదుపులోకి తీసుకుని నగర పరిధిలోని ఎనిమిది పోలీస్స్టేషన్లలో నిర్బంధించారు.దీనిపై ఆశా వర్కర్ల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసుల తీరును విమర్శించారు. -విజయవాడ -
300 మంది ఆశా వర్కర్లు అరెస్టు
ఇంద్రకీలాద్రి: ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చలో విజయవాడ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. భారీగా కార్యకర్తలు తరలివస్తుండటంతో.. అప్రమత్తమైన పోలీసులు వారిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. విజయవాడలోనితుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి శుక్రవారం తెల్లవారుజామున 300 మంది ఆశా వర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండటంతో.. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్బంధించారు. -
వేతనాలు పెంచాలని ఆశా వర్కర్ల ఆందోళన
పాడేరు: వేతనాలు పెంచాలని కోరుతూ విశాఖ జిల్లాలో మంగళవారం ఆశా వర్కర్లు ఆందోళన బాటపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పాడేరు మండలం మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆశా వర్కర్లతో పాటు రాష్ట్ర అధ్యక్షులు మంగమ్మ పాల్గొన్నారు. -
ఆశ వర్కర్ల సమ్మెకు తాత్కాలిక విరమణ
సాక్షి, హైదరాబాద్: గత 106 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ‘ఆశ’ వర్కర్ల సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూని యన్ తీర్మానించింది. రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డితో ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు బుధవారం జరిగిన చర్చలలో సమ్మె విరమిస్తే తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యూని యన్ నాయకులు ఇందిరాపార్కు వద్ద జరిగిన సభలో బుధవారం ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి రెండు, మూడు నెలల గడువు ఇస్తామని అప్పటికీ స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. కాగా ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన వంద కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం ఇందిరాపార్కు వద్ద సభ నిర్వహించారు. సభలో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించకపోతే ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టులో గాని, సుప్రీంకోర్టులో గాని కేసు వేసి న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. 3 నెలలుగా సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లు ఎలా బతుకుతున్నారనే సోయి ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ నాగేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చమని ఆశా వర్కర్లు సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సమస్య కేం ద్రానికి సంబంధించినదని ప్రభుత్వం తప్పిం చుకుంటోందని, ఉపాధి హామీ, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ పథకాలు కేంద్రానివి కావా? అని ప్రశ్నించారు. సీపీఐ నేత రవీంద్రకుమార్ మాట్లాడుతూ శీతాకాల, బడ్జెట్ సమావేశాల్లో అన్ని ప్రతిపక్ష పార్టీల సభ్యులను కలుపుకుని ఆశా వర్కర్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వ మెడలు వంచుతామన్నారు. సభలో తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జయలక్ష్మి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబా తదితరులు పాల్గొని మాట్లాడారు. నిరాశతో ‘ఆశ’ల సమ్మె విరమణ 106 రోజుల ‘ఆశ’ కార్యకర్తల సమ్మెకు తెరపడింది. సర్కారు ఎలాంటి హామీ ఇవ్వకపోయినా తప్పని పరిస్థితుల్లో సమ్మె విరమిం చారు. ఆశ కార్యకర్తలంతా పేదలు కావడం... ఎక్కువ రోజులు సమ్మె చేసిన కారణంగా ఆర్థికంగా చితికిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆశ కార్యకర్తలు చెబుతున్నారు. ‘సమ్మె విరమిస్తే సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినందున విరమణకు నిర్ణయం తీసుకున్నామని... ఇది తాత్కాలికమేన’ని తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి ‘సాక్షి’కి చెప్పారు. వంద రోజులుగా చేసిన విన్నపాలకు, పోరాటానికి విలువ లేకుండా పోయింది. ప్రభుత్వం మొండి వైఖరి అవలంభించిందని నేతలు మండిపడుతున్నారు. అనేకసార్లు మంత్రికి, అధికారులకు విన్నపాలు చేశారు. జిల్లాల్లో ధర్నాలు చేశారు. పాదయాత్రలు నిర్వహించారు. ఇది తమ పరిధిలోనిది కాదని... కేంద్రం పరిధిలోనిదని ప్రభుత్వం తప్పించుకుందన్న విమర్శలూ ఉన్నాయి. -
ఆశా వర్కర్ల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
ఆలేరు: ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వరంగల్ జిల్లా పాలకుర్తి నుంచి హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వరకు చేపట్టిన మహాపాదయాత్రను నల్లగొండ జిల్లా ఆలేరులో పోలీసులు అడ్డుకున్నారు. శనివారం మధ్యాహ్నం పాదయాత్ర ఆలేరుకు చేరుకుంది. భోజనాలు చేసిన అనంతరం ఆశావర్కర్లు, సీపీఎం నాయకులు సాయంత్రం సమయంలో గుండ్లగూడెం నుంచి ఆలేరు వైపునకు పాదయాత్ర ద్వారా తరలివెళ్తుండగా.. పెద్దవాగుపై పలువురు సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆశావర్కర్లు బస్టాండ్ వద్దకు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో యాదగిరిగుట్ట సీఐ రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆశావర్కర్లను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాస్తారోకోలో పోలీసులు, ఆశావర్కర్లకు మధ్యతోపులాట జరిగింది. ఈక్రమంలో ఇద్దరు ఆశాకార్యకర్తలు గాయపడితే వారి ని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. డీఐజీ అనుమతి తీసుకుని మహాపాదయాత్ర చేపట్టామని అయినా పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి ఫోన్లో విలేకరులతో మాట్లాడారు. అరెస్ట్అయినవారిలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పాలడుగు భాస్కర్‌రావు, బొట్ల చక్రపాణి, సరాంపల్లి వాసుదేవ్‌రెడ్డి, మంగ నర్సింహులు, జూకంటి పౌల్, రజిత, ఎక్బాల్ ఉన్నారు. -
‘ఆశ’ల సమస్యలు తీరేదెప్పుడు?
- వంద రోజులుగా సమ్మెలో ఆశ వర్కర్లు - అయినా వారి సమస్యలను పట్టించుకోని సర్కారు - 25 వేల మంది సమ్మెతో స్తంభించిన గ్రామీణ వైద్యం సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో వివిధ వైద్య సేవల పథకాల అమల్లో కీలకపాత్ర పోషిస్తున్న 25 వేల మంది ఆశ వర్కర్లపై సర్కారు చిన్నచూపు చూస్తోంది. కనీస వేతనం పెంపు సహా పలు సమస్యలు పరిష్కరించాలంటూ వంద రోజులుగా వారు సమ్మె చేస్తున్నా ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోంది. పల్లెల్లో వైద్య సేవలపై ఈ సమ్మె తీవ్ర ప్రభావం చూపుతోందని... డెంగీ, మలేరియా, విషజ్వరాలతో పల్లెలు విలవిల్లాడుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నా సర్కారు మాత్రం దీన్ని పరిష్కరించే ఆలోచన చేయడం లేదు. వెట్టిచాకిరీ... జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) మార్గదర్శకాల ప్రకారం పదే ళ్ల కిందట నియమితులైన ఆశ వర్కర్లు కుటుంబ నియంత్రణ, ఆసుపత్రుల్లో కాన్పులు, టీకాలు వంటి వైద్య సేవలతోపాటు కేంద్ర ప్రభుత్వ వైద్య, ఆరోగ్య కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నారు. అలాగే 104, 108, ఆరోగ్యశ్రీ పథకాలకు సహకరిస్తున్నారు. హెచ్ఐవీ రోగులకు అవసరమైన సేవలు చేస్తున్నారు. కుష్టు, టీబీ రోగులకు మందులు పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ప్రజలకు వచ్చే వ్యాధులను గుర్తిస్తున్నారు. అవసరమైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)కు తీసుకెళ్తున్నారు. అక్కడ వైద్యం లభించకుంటే పై ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఈ పనులన్నింటికీ నామమాత్రపు పారితోషికాలను ప్రభుత్వం ఇస్తోంది. పనిని బట్టి నెలకు ఒక్కో ఆశ వర్కర్‌కు రూ. 400 నుంచి రూ. 2 వేల వరకు మాత్రమే చెల్లిస్తోంది. రోజంతా పల్లెల్లో సేవలందిస్తున్నా వారికి సరైన పారితోషికం ప్రభుత్వం వారిని వెట్టిచాకిరీ చేస్తోంది. రూ.3 కోట్లు కేటాయించలేరా? రాష్ట్రంలో పనిచేసే ఆశ వర్కర్ల పారితోషికం, ఇతరత్రా ఖర్చుల కోసం ఎన్హెచ్ఎం రూ. 30 కోట్లు కేటాయిస్తోంది. అందులో 25 శాతం రాష్ట్రం వాటా... మిగిలిన 75 శాతం కేంద్రం తన వాటాగా భరిస్తోంది. వేతనాల పెంపును తాము నిర్ణయించలేమని... ఈ విషయంపై కేంద్రానికి విన్నవించామని ప్రభుత్వం చెబుతోంది. వేతనాలు పెంచకపోయినా కనీసం పారితోషికం పెంపుపైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అధికారులు ప్రభుత్వానికి ఇటీవల విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. పారితోషికం పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 కోట్లు కేటాయిస్తే చాలని వైద్య ఆరోగ్య ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నెల క్రితమే ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. కానీ సంబంధిత ఫైలు మాత్రం ముందుకు కదలడంలేదు. కేవలం రూ. 3 కోట్లు చెల్లించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవకాశం ఉంటే ఆశ కార్యకర్తలను ఎలా వదిలించుకోవాలా అన్న ధోరణిలోనే సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలి... కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్, గ్రాట్యుటీ, ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రమాద బీమా సౌకర్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ, హర్యానా రాష్ట్రాలు పారితోషకాలతోపాటు నిర్ణీత వేతనాలు ఇస్తున్నాయని తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి పేర్కొన్నారు. తమ డిమాండ్లపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఇతర అధికారులతో అనేకసార్లు జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెను ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే పాదయాత్రలు ప్రారంభించామన్నారు. -
ఆశాల ఆందోళన ఉద్రిక్తం
కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నం అడ్డుకున్న పోలీసులు నాయకుల అరెస్ట్ మచిలీపట్నం (చిలకలపూడి) : తమకు కనీస వేతనం అందించాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన ఆశావర్కర్లు కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. కొంతమంది ఆశావర్కర్లు, సీఐటీయూ నాయకులు బారికేడ్లు ఎక్కి లోపలికి వెళ్లగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నాయకులను విడుదల చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట వర్కర్లు ధర్నా చేపట్టారు. అనంతరం నాయకులను విడుదల చేయడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించారు. ఆందోళన సందర్భంగా సీఐటీయూ గౌరవాధ్యక్షుడు ఎన్సీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఆశావర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు అనేక విధులను అప్పగించి వెట్టిచాకిరీ చేయిం చుకుంటున్నారన్నారు. వారికిస్తున్న చాలీ చాలని గౌరవవేతనాన్ని కూడా మూడు నెలలుగా చెల్లించడం లేదన్నారు. కనీస వేతనం లేక అర్ధాకలితో ఆశావర్కర్లు అలమటిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీని ముట్టడిస్తాం... సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే రాబోయే సమావేశాల్లో అసెం బ్లీని ముట్టడిస్తామని ఆశావర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.కమల అన్నారు. కనీస వేతనం నిర్ణయిం చాలని డిమాండ్ చేశారు. మూడేళ్లుగా ఆశావర్కర్లకు యూనిఫాంలు ఇవ్వడం లేదన్నారు. సీఐటీయూ నాయకులు చౌటపల్లి రవి, దివి సీఐటీయూ నాయకులు శీలం నారాయణరావు, కె.శ్రీనివాసరావు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆశావర్కర్లు పాల్గొన్నారు. -
ఆశావర్కర్లపై పోలీసుల దాష్టీకం
-
తహశీల్దార్ కార్యాలయం ముట్టడి
తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన ఆశావర్కర్లు తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరిలో గురువారం చోటుచేసుకుంది. మూడు నెలలుగా ధర్నా చేస్తున్న ప్రభుత్వం తమ గోడు వినిపించుకోవడంలేదని ఆశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్టీసీ డిపో ఎదుట ఆశా వర్కర్ల దర్నా
-
ఆర్డీవో కార్యాలయం ముట్టడి
భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణ ఆర్డీవో కార్యాలయాన్ని మంగళవారం ఆశావర్కర్లు ముట్టడించారు. జీతాలు పెంచాలని ఆశా వర్కర్లు చేస్తున్న నిరసనలకు సీఐటీయూ నాయకులు తమ సంఘీభావం తెలిపిన నేపథ్యంలో ఈ రోజు ఆశావర్కర్లు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులకు ఆశావర్కర్లకు మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు గంటలకు పైగా ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు సీఐటీయూ కార్యకర్తలతో పాటు, ఆశావర్కర్లను అరెస్ట్ చేశారు. -
ఆశ వర్కర్ల ఆందోళన
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలు, మండల కేంద్రాల్లో ఆశ కార్యకర్తలు మంగళవారం ఆందోళనకు దిగారు. దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ15 వేలు చెల్లించాలని ఖమ్మం జిల్లా ఆశ్వారావు పేట మండల కేంద్రంలోని రింగురోడ్డు వద్ద రాస్తారోకో కు దిగారు. మరో వైపు ఆదిలాబాద్ జిల్లా లక్సిట్పేట్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆశ వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. -
కార్మికులను తొలగించడం ప్రజాస్వామ్యమా
నాగార్జునసాగర్: తెలంగాణలో నియంతృత్వ పాలన నడుస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆకలి వేస్తే కేకలు వేసే హక్కులు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. వేతనం పెంపు కోసం సమ్మె చేసిన 1200 మంది మున్సిపల్ కార్మికులను తొలగించడం ప్రజాస్వామ్యమా అని ఆయన ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో సీపీఎం రాష్ట్ర ప్లీనరీ సభలు మంగళవారం మూడో రోజుకు చేరుకున్నాయి. తమ్మినేనితోపాటు జిల్లా పార్టీ కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గం సభ్యుడు బి.వెంకట్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఆశా కార్యకర్తల సమ్మెకు పూర్తి మద్దతుగా నిలవాలని, కార్యకర్తలకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. విరాళాలు ఇవ్వాలని కోరగా, అక్కడున్న వారు రూ.1.02 లక్షలు అందించారు. ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలు సేకరించి ఆశా వర్కర్లకు ఇవ్వాలని తీర్మానించారు. రైతులకు రుణాలన్ని ఒకే దఫాలో మాఫీ చేయాలని, ప్రైవేటు అప్పుల నుంచి ఒత్తిడి తొలగించేందుకు ప్రభుత్వం మారటోరియం ప్రకటించాలన్నారు. -
అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ట్రాఫిక్ జామ్
వేములపల్లి: కనీస వేతనం సహా పలు డిమాండ్ల సాధనకు ఆశా వర్కర్లు మంగళవారం నల్లగొండ జిల్లా వేములపల్లి వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. సీపీఐ, సీపీఎం తదితర పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో వందల సంఖ్యలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. దీంతో ప్రధాన రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. -
‘ఆశ వర్కర్లను అవమానించడం తగదు’
సాక్షి, హైదరాబాద్: వేతనాల పెంపు, బకాయిల కోసం సమ్మె చేస్తున్న ఆశ వర్కర్లను అవమానపరిచేలా రాష్ట్ర మంత్రులు మాట్లాడటం సరికాదని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేర్కొన్నారు. మహిళల పట్ల మంత్రులు తమ అహంకారపూరిత ధోరణి మానుకోవాలని హితవు పలికారు. మూడేళ్ల నుంచి వేతన బకాయిల కోసం విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఆశ వర్కర్లను అరెస్టు చేయడాన్ని ఖండించారు. బతుకమ్మ పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఆశ వర్కర్ల పట్ల దురహంకారంతో వ్యవహరించడం తగదన్నారు. -
కదం తొక్కిన ఆశ వర్కర్లు
♦ వేలాదిగా తరలివచ్చి... డిమాండ్ల సాధనకు ఉద్యమించి ♦ అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు ♦ యుద్ధ వాతావరణాన్ని తలపించిన నగరం ♦ వెలల్లో అరెస్టులు...కొందరికి గాయాలు హైదరాబాద్: ఆశ వర్కర్లు కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినదించారు. డిమాండ్ల సాధన కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం వారు చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తతకు దారితీసింది. వేలాది మంది ఆశా వర్కర్లతో హైదరాబాద్ ఎంబీ భవన్ వద్ద ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా అడ్డుతగిలారు. ర్యాలీని ఆపి... ఆందోళనకారులను ఎక్కడికక్కడ నిర్బంధించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఎంబీ భవన్, ఎస్వీకే, సుందరయ్య విజ్ఞానకేంద్రం తదితర ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. వందలాది మంది ఆశ వర్కర్లను పోలీసులు విచక్షణారహితంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. ఈ క్రమంలో కొం దరు ఆందోళనకారుల వస్త్రాలు చినిగిపోయా యి. మరికొందరికి గాయాలయ్యాయి. దాదా పు 1400 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు జ్యోతి, ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్షురాలు జయలక్ష్మి, సీఐటీ యూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు తదితర నాయకున్నారు. కొందరు పోలీసులకూ స్వల్ప గాయాలయ్యాయి. ‘హక్కులు అడిగితే అరెస్టు చేస్తారా? ఇదెక్కడి న్యాయం? ఇది దొంగల రాజ్యం... దోపిడి రాజ్యం’ అంటూ పెద్దపెట్టున నినదించారు. బతుకమ్మ ఆడారు. కట్టలు తెగిన ఆగ్రహం... సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్న ఆశ వర్కర్లు... ‘కేసీఆర్ డౌన్ డౌన్’ అంటూ ఒక్కసారిగా బయటకు వచ్చారు. పోలీసులు వారిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అక్కడి నుంచి వారు సుందరయ్య పార్కు వైపు పరుగులు తీయడంతో ఉలిక్కిపడ్డ పోలీసులు భారీ తాళ్లతో కట్టడి చేశారు. అన్ని వైపులా బారికేడ్లు, ముళ్ల కంచెలు వేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఆశ వర్కర్లు పోలీస్ వ్యాన్‌కు అడ్డం పడ్డారు. 38 రోజులుగా ఉద్యమిస్తున్నా కనీసం వేతనం రూ.15 వేలకు పెంచాలనే తదితర న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 38 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆశ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు కావల్సివచ్చినప్పుడు కాళ్లు పట్టుకుని అడిగినవారు ఇప్పుడు తమకు సమస్య వస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తామూ తెలంగాణ ఆడబిడ్డలమేనని... పదేళ్లుగా సేవలందిస్తున్న తమకు న్యాయం జరగలేదన్నారు. కేసీఆర్ కుమార్తె, ఎంపీ కవిత ఆడే బతుకమ్మను అడ్డుకుంటామని హెచ్చరించారు. సీఐటీయూ జాతీయ నాయకులు ఆర్.సుధాభాస్కర్, సతీష్ మాట్లాడుతూ... ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉద్యమాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. ఇందుకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. 8,805 మంది అరెస్ట్: డీజీపీ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఆశ వర్కర్లు తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ని అడ్డుకున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,805 మందిని అరెస్టు చేసి, వ్యక్తిగత పూచీకత్తు కింద విడుదల చేసినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కనువిప్పు కావాలి: తమ్మినేని ఆశ వర్కర్ల ‘చలో హైదరాబాద్’ రాష్ర్ట ప్రభుత్వానికి కనువిప్పు కావాలని సీపీఎం కార్యద ర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నిర్భందాలతో ఉద్యమాలను అణచలేరని, న్యాయమైన వారి డిమాం డ్లను పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం ఏమాత్రం బేషజాలకు పోకుండా వెంటనే సమ్మె విరమణకు నిర్దిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌లో ఆశ కార్మికులంతా పాల్గొనాలని కోరారు. ఈ నిర్బంధమేమిటి? నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్న ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించడానికి బదులు నిర్బంధమేమిటని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.రోజా, కార్యదర్శి కె.సుబ్బరావమ్మ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలన్నారు. -
కదం తొక్కిన ఆశ వర్కర్లు
-
ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం ఉదయం గన్‌పార్క్ వద్దకు వెళ్లేందుకు యత్నించిన ఆశా వర్కర్లను పోలీసులు ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆశా వర్కర్లకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ నుంచి తరలించారు. తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్(ఆశా)(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వేలాదిమంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు. -
ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత
-
నల్గొండలో ఆశా వర్కర్లు అరెస్ట్
నల్గొండ : నల్గొండ జిల్లా తిరుమలగిరిలో దాదాపు 200 మంది ఆశా వర్కర్లను శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఆ క్రమంలో పోలీసులు.. ఆశా వర్కర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఆశా వర్కర్లు దీక్ష చేపట్టనున్నారు. అందుకోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ఆశా వర్కర్లు హైదరాబాద్ తరలిపోతున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఆశావర్కర్లను అడ్డుకుని... అరెస్ట్ చేస్తున్నారు. అలాగే కరీంనగర్లో కూడా భారీ సంఖ్యలో ఆశవర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. -
బెల్లంపల్లి రైల్వేస్టేషన్లో ఆశ వర్కర్ల అరెస్టు
ఆదిలాబాద్ బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో ఆశా వర్కర్లపై పోలీసులు దాడి చేశారు. తమ సమస్యల సాధనకోసం ఇచ్చిన చలో హైదరాబాద్ పిలుపు లో భాగంగా గురువారం సాయంత్రం బెల్లంపల్లి రైల్వే ష్టేషన్ నుండి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నించిన 300 మంది ఆశా కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారు. పోలీసులను చూసి బెదిరిపోయిన వర్కర్లను వెంటాడి.. పిడిగుద్దులు గుద్దుతూ.. రైలు ఎక్కకుండా అడ్డుకున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఫ్లాట్ ఫారమ్ పైకి రావడంతో.. కొంత మంది బోగీల్లోకి ఎక్కారు. ఈ గందర గోళంలో రైలు 20 నిమిషాల పాటు ఆగిపోయింది. బోగీల్లోకి ఎక్కిన వారిని సైతం బలవంతంగా రైలు దించేశారు. పోలీసుల దాడికి నిరసనగా.. ఆశ వర్కర్లు స్టేషన్ లోని ఆర్ పీ ఎఫ్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. -
తహశీల్దార్ కార్యాలయం ఎక్కి నిరసన
జగదేవ్‌పూర్ (మెదక్ జిల్లా) : ఆశావర్కర్ల నిరవధిక సమ్మె గురువారం నాటికి 37 రోజులకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఆశా వర్కర్లు తహశీల్దార్ కార్యాలయం ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 37 రోజుల నుండి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సమస్యలు తీర్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు లత, మాధవి, జ్యోతి, అనూరాధ, ప్రియాంక, సంతోష, బీబీ, కవిత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
నిలిచిన మిషన్ ఇంద్రధనస్సు
వేములపల్లి: ఆశా వర్కర్ల సమ్మెలో భాగంగా నల్గొండ జిల్లాలో బుధవారం పీహెచ్‌సీలకు తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. దీంతో ప్రభుత్వం చిన్నారులకు టీకాలు వేసేందుకు ఏర్పాటు చేసిన మిషన్ ఇంద్ర ధనస్సు(ఏడు టీకాల కార్యక్రమం) నిలిచిపోయింది. తమ డిమాండ్లను తీర్చాలంటూ ధర్నాకు దిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరసన చేస్తున్న కార్యకర్తలు మండల కేంద్రంలోని పీహెచ్‌సీతో పాటు పాములపాడు గ్రామంలో ఉన్న పీహెచ్‌సీలకు తాళాలు వేశారు. దీంతో పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమం నిలిచిపోయింది. -
ఆశా వర్కర్ల వినూత్న నిరసన
రామాయంపేట (మెదక్ జిల్లా) : ఆశా వర్కర్లు చేపట్టిన నిరవధిక సమ్మె 35వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా మంగళవారం ఆశా కార్యకర్తలు వివిధ జిల్లాల్లో వినూత్న రీతిలో తమ నిరసన తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేటలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రజాప్రతినిధులు, అధికారుల వద్దకు వెళ్లి తమకు జరుగుతున్న నష్టాన్ని వివరించి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని వారు పేర్కొన్నారు. అదేవిధంగా దుబ్బాక తహశీల్దార్ కార్యాలయం పైకి ఎక్కి నిరసన తెలిపారు. కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.ఆశా వర్కర్ల సమ్మెకు మద్దతు తెలిపిన పెద్దగండవెళ్లి ఎంపీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చందిరి సంజీవరెడ్డి మాట్లాడారు. ఆశా వర్కర్లు గత నెల రోజులుగా శాంతియుత మార్గంలో నిరసనలు తెలిపినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆశా వర్కర్ల వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయన్నారు. అలాగే నల్లగొండ జిల్లా వలిగొండ మండలకేంద్రంలో ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మెలో భాగంగా భువనగిరి, నల్లగొండ రహదారిపై కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు తుర్కపల్లి సురేందర్ మాట్లాడుతూ.. ఆశాల శ్రమను పది సంవత్సరాలుగా ప్రభుత్వం దోచుకుంటుందన్నారు. కనీస వేతనం అమలు చేయాలన్నారు. సమ్మెకు వీఆర్ఏల సంఘం మద్దతు ప్రకటించింది. -
కొనసాగుతున్న ఆశావర్కర్ల ఆందోళన
హైదరాబాద్: ఆశావర్కర్ల ఆందోళన కొనసాగుతోంది. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు నెలరోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం షాపూర్‌నగర్‌లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం నివాళులర్పించి నిరసనకు దిగారు. ప్రభుత్వం దిగివచ్చేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఆశావర్కర్లు తెలిపారు. -
పొర్లుదండాలు పెట్టారు..
కోటపల్లి మండల కేంద్రంలో బుధవారం ఆశావర్కర్లు పొర్లుదండాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. నెలరోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడంతో రోజుకొక రకంగా సమ్మె చేస్తూ నిరసన తెలుపుతున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, రూ.15 వేల కనీస వేతనం చెల్లించాలని నెలరోజులుగా ఆశావర్కర్లు సమ్మె చేస్తున్న సంగతి తెల్సిందే. -
ఎంపీ కవిత ఇంటి ముందు ధర్నా
నిజామాబాద్ ఎంపీ కవిత ఇంటి ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం ఆశావర్కర్లు ధర్నాకు దిగారు. నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని మారుతీనగర్‌లో ఉన్న ఎంపీ అత్తగారింటికి కవిత రానున్నారని తెలిసి ఆశావర్కర్లు శనివారం ఉదయమే చేరుకున్నారు. ఆమె లేకపోయేసరికి ఇంటి ముందు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవిత సాయంత్రం వస్తారని తెలిసి వెనుదిరిగారు. -
చీఫ్ విప్‌ను అడ్డుకున్న ఆశావర్కర్లు
ఆదిలాబాద్ (జైపూర్) : తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ నల్లాల ఓదేలును ఆశావర్కర్లు శుక్రవారం అడ్డుకున్నారు. జైపూర్ మండలం శెట్టిపల్లిలో రూ.కోటి 75 లక్షలతో రోడ్డు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయనను ఆశావర్కర్లు నిలదీశారు. 24 రోజులుగా తాము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా తమ జీవితాలతో ఆడుకుంటున్నదని ఆశావర్కర్లు వాపోయారు. దీనికి స్పందించిన ఆయన వారితో మాట్లాడుతూ..మీ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. -
ప్రేమతో అడిగితే 'ఆశ' నెరవేరుస్తాం: హరీశ్ రావు
కల్హేర్ (మెదక్): ఆశా వర్కర్లు ప్రేమతో సమస్యలను ఏకరువు పెడితే వాటిని నెరవేర్చడానికి ప్రయత్నిస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. గురువారం మెదక్ జిల్లా కల్హేర్ మండలంలోని వివిధ గ్రామాల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు పర్యటించారు. ఈ క్రమంలో కృష్ణాపూర్ వద్ద ఆశా వర్కర్లు మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకోవటంతో.. సమస్యలుంటే నేరుగా విన్నవించాలని మంత్రి సూచించారు. అనవసర రాద్ధాంతం చేస్తే ఉపయోగం ఉండదని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. -
కదం తొక్కిన ఆశ వర్కర్లు
- ఏపీ సాక్స్ కార్యాలయం, కలెక్టరేట్ల ముట్టడి - కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: ఆశవర్కర్లు ఆందోళనబాట పట్టారు. కనీస వేతనం కోసం కదంతొక్కారు. సమస్యల్ని పరిష్కరించాలని బుధవారం ఏపీ సాక్స్ కార్యాలయాన్ని, పలు జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్(ఆశా) యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కోఠిలోని ఏపీ సాక్స్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. తెలంగాణ నలుమూల నుంచి వందలాదిగా ఆశవర్కర్లు వచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ర్ట నాయకురాలు కె.నిర్మల మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే ఆశ వర్కర్లలకు వెట్టిచాకిరీ ఉండదని సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పి ఇప్పుడు విస్మరించారన్నారు. ఆశ వర్కర్లకు కనీస వేతనం 15 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం ఆశ నోడల్ అధికారి జనార్దన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఉదయం ఏడు గంటల నుంచే ఆశా కార్యకర్తలు కలెక్టరేట్లకు తరలివచ్చి ప్రవేశద్వారాల వద్ద బైఠాయించారు.ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌లోకి చొచ్చుకొని పోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నా రు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద జరిగిన తోపులాటలో పలువురు ఆశవర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు. నల్లగొండ కలెక్టరేట్ వద్ద ముగ్గురు వర్కర్లు కిందపడిపోయారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఆశవర్కర్ల సమస్యల్ని పరిష్కరించకపోతే వామపక్షాల ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
పలుచోట్ల ఆశా వర్కర్ల ఆందోళనలు
వరంగల్: గత 24 రోజులుగా తమ డిమాండ్లు తీర్చాలని ఆశావర్కర్లు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో.. ఆశావర్కర్లు తమ ఆందోళనను ఉధృతం చేశారు. సమ్మెలో భాగంగా బుధవారం చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడిలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన ఆశావర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆశావర్కర్లకు మద్యా తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి సమ్మెలో భాగంగా ఈరోజు చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన ఆశావర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆశావర్కర్లకు మద్యా తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్లో కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలోని ఆశా వర్కర్లు బుధవారం నాడు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ జిల్లా నలుమూలల నుంచి భారీసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కలెక్టరేట్ గేటు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆశావర్కర్లకు మధ్య స్వల్ప తోపులాట చేసుకుంది. సుమారు మూడు గంటల పాటు ధర్నా నిర్వహించటంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
కలెక్టరేట్ ముట్టడించిన ఆశావర్కర్లు
కరీంనగర్: కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలోని ఆశా వర్కర్లు బుధవారం నాడు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ జిల్లా నలుమూలల నుంచి భారీసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కలెక్టరేట్ గేటు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆశావర్కర్లకు మధ్య స్వల్ప తోపులాట చేసుకుంది. సుమారు మూడు గంటల పాటు ధర్నా నిర్వహించటంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
ఆశావర్కర్ల వినూత్న నిరసన
కామారెడ్డి (నిజామాబాద్) : కామారెడ్డి మండలంలో మంగళవారం ఆశావర్కర్లు వినూత్నంగా నిరసన తెలిపారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మెడకు ఉరితాడు బిగించుకుని నిరసన తెలియజేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉరి తాడే దిక్కని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆశావర్కర్లు 21 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే. -
భద్రాచలాన్ని జిల్లాగా ప్రకటించాలి
-
200 మంది ఆశా వర్కార్ల ధర్నా
చిత్తూరు జిల్లా తంబాలపల్లిలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. వృత్తిపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది ఆశా వర్కర్లు సోమవారం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్యకర్తలు.. కార్యాలయంలోనికి చొరబడే ప్రయత్నం చేయడంతో కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
వినాయక విగ్రహానికి వినతిపత్రం
అచ్చంపేట: తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆశా కార్యకర్తలు శనివారం అచ్చంపేటలోని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇంటి ముట్టడికి యత్నించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. మరోవైపు తమ నిరవధిక సమ్మె 18వ రోజుకు చేరుకోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఆశా కార్యకర్తలు భారీ రాస్తారోకో నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం విషయంలో సర్కారుకు చిత్తశుద్ధిని ప్రసాదించాలని కోరుతూ తాండూరులో ఆశా కార్యకర్తలు వినాయకుడి విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. -
రోడ్లను శుభ్రం చేసి నిరసన
సుల్తానాబాద్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో శనివారం ఆశావర్కర్ల సమ్మె 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆశావర్కర్లు రోడ్లను శుభ్రం చేసి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
'సమ్మె విరమిస్తేనే ఆశా వర్కర్లతో చర్చలు'
నల్లగొండ రూరల్ : నిరవధిక సమ్మె విరమిస్తేనే ఆశా వర్కర్లతో చర్చలు జరుపుతామని వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. శనివారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.10 వేల కనీస వేతనం కోసం ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేస్తుండడంతో మంత్రి ఈ విధంగా స్పందించారు. కార్పొరేట్ ఆస్పత్రులు దోపిడీకి పాల్పడకండా నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు. దీనిపై త్వరలోనే ఒక విధానాన్ని తీసుకురానున్నట్టు ఆయన చెప్పారు. -
100 మంది ఆశా వర్కర్ల అరెస్ట్
బెల్లంపల్లి (ఆదిలాబాద్) : మంత్రి రాక సందర్భంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగే వివిధ కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొనాల్సి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన ఆశా సిబ్బంది మంత్రి రాకను పురస్కరించుకుని ఆందోళన చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సాయంత్రం 5 గంటల సమయంలో సుమారు 100 మంది ఆశా వర్కర్లు మార్కెట్ కమిటీ కార్యాలయం వైపు తరలి వెళ్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఆశ వర్కర్ల రాస్తారోకో
దండేపల్లి: ఆదిలాబాద్ జిల్లాలో ఆశ కార్యకర్తలు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. కనీస వేతనాలు ఇవ్వాలంటూ ధర్నా చేపట్టారు. బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. రూ.10 వేల కనీస వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు నిరవధిక సమ్మెను విరమించబోమన్నారు. -
జడ్చర్లలో ఆశా వర్కర్ల అరెస్ట్
మహబూబ్‌నగర్: సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న ఆశ కార్యకర్తలను బుధవారం పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీక్ష శిబిరంలో కూర్చున్న ఆశ కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డెక్కి మానవహారంగా వచ్చి ధర్నా చేసేందుకు యత్నించటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తరువాత స్వంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. అయితే ఆశ కార్యకర్తలు పోలీసుస్టేషన్‌లోనూ ధర్నాను కొద్దిసేపు కొనసాగించారు. అరెస్టైన వారిలో సీఐటీయూ నాయకులు శ్రీనివాసులు, ఆశ కార్యకర్తలు శివలీల, జయలక్ష్మి, సువార్త, కళావతి, సరస్వతిలు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ఆశ కార్యకర్తల సమ్మె
జడ్చర్ల టౌన్ (మహబూబ్‌నగర్ జిల్లా) : తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న ఆశ కార్యకర్తలు సోమవారం జడ్చర్ల తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ముట్టడి సందర్భంగా సీఐటీయూ ఇండస్ట్రియల్ జిల్లా ఉపాధ్యక్షులు దీప్లానాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, ఆశ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఇచ్చే గౌరవ వేతనం ఏమాత్రం చాలటం లేదన్నారు. వెంటనే ఆశ కార్యకర్తల డిమాండ్లను తీర్చేందుకు హామీ ఇవ్వాలన్నారు. అప్పటి వరకు సమ్మె విరమించేది లేదని ప్రకటించారు. ముట్టడి అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహాశీల్దార్ జగదీశ్వర్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో మండలంలోని ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం
మోత్కూర్: సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నల్లగొండ జిల్లా తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ పై మహిళలు మండిపడ్డారు. తమ సమస్యల గురించి అవహేళనగా మాట్లాడిన ఎమ్మెల్యే కిషోర్ దిష్టిబొమ్మను ఆశావర్కర్లు దహనం చేశారు. నల్లగొండ జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలో ఆదివారం ర్యాలీ నిర్వహించిన ఆషావర్కర్లు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను తగలబెట్టారు. -
మంత్రి హరీశ్ రావు దిష్టిబొమ్మ దహనం
ఆదిలాబాద్ : భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు దిష్టిబొమ్మకు ఆశా కార్యకర్తలు ఆదివారం ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో శవయాత్ర నిర్వహించారు. అనంతరం ఆ దిష్టిబొమ్మను బస్టాండ్ సెంటర్లో దహనం చేశారు. తమ వేతానాలు పెంచాలని ఆశా కార్యకర్తలు శనివారం హరీశ్‌రావును కలసి విజ్ఞప్తి చేశారు. వేతనాలు పెంచడం కుదరదని ఆయన వారికి నిక్కచ్చిగా చెప్పారు. దాంతో ఆశా కార్యకర్తలు ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి... దహనం చేశారు. అనంతరం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. -
ఆశావర్కర్ల ఆందోళన
ఖమ్మం (ఇల్లందు) : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం ఆశావర్కర్లు ఇల్లందు మండలంలో ఆందోళనకు దిగారు. ఆశావర్కర్లకు కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని, ఇంతకుముందున్న బకాయిలు చెల్లించి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం ఇల్లందు ఎమ్మెల్యే కనకయ్యకు వినతి పత్రం సమర్పించారు. -
వేతనాల పెంపు కోరుతూ ఆశా వర్కర్ల ధర్నా
సుల్తానాబాద్: కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలో బుధవారం ఆశావర్కర్లు ధర్నాకు దిగారు. ఆశావర్కర్లకు కనీసం వేతనం రూ.15 వేలు, 39 నెలల బకాయి గౌరవవేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారిని సెకండ్ ఏఎన్ఎంలుగా తీసుకోవాలని, పెన్షన్, గ్రాట్యుటీ, ప్రసూతి సెలవులు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. పీహెచ్‌సీకి వెళ్లిన ప్రతిసారి టీఏ, డీఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు. -
జీతాల కోసం ఆశావర్కర్ల ధర్నా
పెద్దాపురం : జీతాలు వెంటనే చెల్లించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఆరు నెలల నుంచి తమకు జీతాలు చెల్లించలేదని, సుమారు రూ.8 లక్షలు బకాయిలు చెల్లించాలని ఆశావర్కర్లు తెలిపారు. ఆర్డీఓ లేకపోవడంతో కార్యాలయంలో ఉన్న ఏఓ విద్యాసాగర్‌కు వినతిపత్రం సమర్పించి వెనుదిరిగారు. కలెక్టర్‌తో మాట్లాడి జీతాలు వచ్చేలా చూస్తానని విద్యాసాగర్ వారికి హామీ ఇచ్చారు. -
కదంతొక్కిన ఆశా వర్కర్లు
కోఠి చౌరస్తాలో ఆశా వర్కర్ల ధర్నా స్తంభించిన ట్రాఫిక్..బలవంతంగా అరెస్టులు.. తీవ్ర ఉద్రిక్తత.. తోపులాటలోపలువురికి గాయాలు హైదరాబాద్: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్(ఆశా)(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం కోఠిలోని డీఎంహెచ్‌ఎస్‌లోని ఏపీసాక్స్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వేలాది మంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఏపీసాక్స్ కమిషనర్ జ్యోతి బుద్ధప్రసాద్ ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. అధికారులు హామీలకే పరిమితమయ్యారని ఆగ్రహించిన ఆశా వర్కర్లు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. కోఠి ఉమెన్స్ కళాశాల చౌరస్తాలో బైఠాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆశా వర్కర్ల ఆందోళన సుమారు ఐదు గంటల పాటు కొనసాగడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ఊహించని పరిణామం కావడంతో పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కోఠి చౌరస్తాలో ఆశా వర్కర్ల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ రవీందర్, అడిషన ల్ డీసీపీ చంద్రశేఖర్, ట్రాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ కోటిరెడ్డి, సుల్తాన్‌బజార్ ఏసీపీ గిరిధర్, మలక్‌పేట్ ఏసీపీలతోపాటు ఈస్ట్, సెంట్రల్ జోన్ల పరిధిలోని పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది రం గంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను బలవంతంగా అరెస్ట్ చేసి ఫలక్‌నుమా, అఫ్జల్‌గంజ్, సుల్తాన్‌బజార్ తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు పి.జయలక్ష్మి, సీఐటీయూ నేతలు అబ్బాస్, తులసితో పాటు వందలాది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆశా వర్కర్లు గాయాల పాలయ్యారు. మరికొందరు సొమ్మసిల్లి పడిపోయారు. -
కదం తొక్కిన ఆశా వర్కర్లు
-
గళమెత్తిన ఆశా వర్కర్లు
కలెక్టరేట్ ముట్టడికి యత్నం అడ్డుకున్న పోలీసులు తోపులాటలో గాయపడిన ఆశావర్కర్ చిలకలపూడి (మచిలీపట్నం) : సమస్యల పరిష్కారం కోసం ఆశావర్కర్లు తమ గళాన్ని వినిపించారు. జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో తమ నిరసన తెలిపేందుకు ఆశావర్కర్లు సోమవారం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ధర్నాకు ఆశావర్కర్లు భారీగా తరలి రావడంతో పోలీసులు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద భారీ బందోబస్తు, రోప్ పార్టీని ఏర్పాటు చేశారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ ముట్టడికి ఆశావర్కర్లు యత్నించారు. కలెక్టరేట్ గేటు ఎక్కి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. తోపులాట జరిగింది. అరగంట పాటు పోలీసులకు, ఆశావర్కర్లకు మధ్య తోపులాట జరగటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లోనికి ఆశావర్కర్లు అందర్నీ అనుమతించాలని పోలీసు అధికారులను కోరగా కేవలం పది మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. దీంతో ఆశావర్కర్లను, ముఖ్యమైన నాయకులను మాత్రమే ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించేందుకు అనుమతించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీవీ కృష్ణ, ఏపీ వాలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. కమల మాట్లాడుతూ ఆశావర్కర్లకు కేంద్రం చెల్లిస్తున్న పారితోషికాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వేతనం నిర్ణయించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అమలయ్యే పారితోషికాలను పట్టణాలకూ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఆశావర్లకు ఏఎన్ఎం శిక్షణ ఇచ్చి రెండో ఏఎన్ఎంలుగా తీసుకోవాలని వారు కోరారు. తోపులాటలో ఆశావర్కర్కు గాయం ... ఆశావర్కర్ల ధర్నా అనంతరం పోలీసులకు, ఆశావర్కర్లకు మధ్య జరిగిన తోపులాటలో బందరు సర్కారుతోటకు చెందిన పరసా రాణి కిందపడిపోయారు. ఈ సమయంలో ఆమె చేతిని పలువురు తొక్కటంతో కుడిచేతికి తీవ్రగాయమైంది. ఆశావర్కర్ల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం వల్లే ఆమె కిందపడిపోయిందని, దీంతో తోపులాటలో ఆమె చేతిని తొక్కారని ప్రజావాణి కార్యక్రమంలో ఏజేసీ చెన్నకేశవరావుకు ఫిర్యాదు చేశారు. అనంతరం పరసా రాణిని వైద్యచికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీఐటీయు నాయకులు వీవీ రమణ, బూర సుబ్రమణ్యం, ఆశావర్కర్ల సంఘం నాయకులు వై.నాగలక్ష్మి, పి.ధనశ్రీ, జి.వెంకటలక్ష్మి, జి.చిట్టికుమారి, టి.నాంచారమ్మ, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆశావర్కర్లు పాల్గొన్నారు.