మంత్రి రాక సందర్భంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బెల్లంపల్లి (ఆదిలాబాద్) : మంత్రి రాక సందర్భంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగే వివిధ కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొనాల్సి ఉంది.
అయితే గత కొన్ని రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన ఆశా సిబ్బంది మంత్రి రాకను పురస్కరించుకుని ఆందోళన చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సాయంత్రం 5 గంటల సమయంలో సుమారు 100 మంది ఆశా వర్కర్లు మార్కెట్ కమిటీ కార్యాలయం వైపు తరలి వెళ్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.