
సాక్షి, కాకినాడ : ఆశావర్కర్ల జీతాలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నిర్ణయం వల్ల జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న 4500 మందికి లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు సీఐటీయూ భవనంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆశా వర్కర్ల సంఘం గౌరవ అధ్యక్షురాలు బేబి రాణీ మాట్లాడుతూ.. తమ ఉద్యమాలను, పోరాటాలను గుర్తించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పారితోషికాలతో ముడి పెట్టకుండా రూ. 10 వేల గౌరవ వేతనంగా ఇవ్వాలని ఆమె కోరారు. చంద్రబాబు పాలనలో పనికి తగిన వేతనం ఇవ్వకపోగా.. తమపై రాజకీయ వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉద్యమాల సమయంలో ఆశా వర్కర్లపై చంద్రబాబు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సీఎం జగన్‌ను కోరారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
హమీ ఇచ్చారు అమలు చేశారు