హైదరాబాద్ : తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం ఉదయం గన్పార్క్ వద్దకు వెళ్లేందుకు యత్నించిన ఆశా వర్కర్లను పోలీసులు ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆశా వర్కర్లకు మధ్య తోపులాట జరిగింది.
దీంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ నుంచి తరలించారు. తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్(ఆశా)(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న వేలాదిమంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత
Published Fri, Oct 9 2015 12:02 PM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement
Advertisement