నల్గొండ : నల్గొండ జిల్లా తిరుమలగిరిలో దాదాపు 200 మంది ఆశా వర్కర్లను శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆ క్రమంలో పోలీసులు.. ఆశా వర్కర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ఆశా వర్కర్లు దీక్ష చేపట్టనున్నారు.
అందుకోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ఆశా వర్కర్లు హైదరాబాద్ తరలిపోతున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఆశావర్కర్లను అడ్డుకుని... అరెస్ట్ చేస్తున్నారు. అలాగే కరీంనగర్లో కూడా భారీ సంఖ్యలో ఆశవర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు.