
‘ఆశ’ల చలో బెజవాడపై పోలీసు ప్రతాపం
న్యాయమైన తమ డిమాండ్ల సాధన కోసం చలో విజయవాడ కార్యక్రమానికి విచ్చేసిన ఆశా వర్కర్లపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఏపీ వాలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్(ఆశా) (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వెయ్యిమందికి పైగా ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారికి మద్దతిచ్చిన సీఐటీయూ నాయకులను సైతం అదుపులోకి తీసుకుని నగర పరిధిలోని ఎనిమిది పోలీస్‌స్టేషన్‌లలో నిర్బంధించారు.దీనిపై ఆశా వర్కర్ల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసుల తీరును విమర్శించారు. -విజయవాడ