chalo vijayawada
-
‘చలో విజయవాడ’పై ఉక్కుపాదం.. వాలంటీర్ల గృహ నిర్బంధం
సాక్షి, విజయవాడ: వాలంటీర్ల ‘చలో విజయవాడ’(Chalo Vijayawada) కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల(Volunteers)ను హౌస్ అరెస్ట్ చేశారు. కేబినెట్లో వాలంటీర్ల అంశంపై ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సెక్రటేరియట్‌కు వెళ్లి సీఎంను కలుస్తామన్న వాలంటీర్లపై ప్రభుత్వం నిర్బంధం విధించింది. విజయవాడలోని దాసరి భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.చలో విజయవాడను అడ్డుకోవడంపై వాలంటీర్లు మండిపడ్డారు. గత ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం. వాలంటీర్లకు ఉద్యోగం కల్పించడంతో పాటు బకాయి పడ్డ ఎనిమిది నెలల వేతనం ఇవ్వాలి. పోలీసులతో అడ్డుకున్నంత మాత్రాన మా పోరాటం ఆగదు’’ అని గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుమాయున్ బాషా అన్నారు.‘‘ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చే వరకూ వదిలిపెట్టం. చంద్రబాబు అబద్ధాల ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నాడు. మమ్మల్ని మోసం చేసిన ఈ ప్రభుత్వం ఎప్పుడుపోతుందోనని వాలంటీర్లు ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట తప్పి మహిళలను మోసం చేశారు. పుట్టని బిడ్డకు పేరెలా పెడతామని మంత్రి డోలా బాలవీరాంజనేయులు మాట్లాడటం సిగ్గుచేటు’’ అని షేక్ హుమాయున్ బాషా మండిపడ్డారు.వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: చంద్రశేఖర్‌రెడ్డి 2.50 లక్షల మంది వాలంటీర్లను చంద్రబాబు మోసం చేశారని ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. చలో విజయవాడ పేరుతో నిరసనకి పిలుపు ఇస్తే వారిని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. వాలంటీర్లను అరెస్టు చేయటం హేయమైన చర్య. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు పది వేల జీతం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్, లోకేష్ కూడా వాలంటీర్లకు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎగ్గొట్టారు’’ అని ఆయన ధ్వజమెత్తారు.‘‘పది వేలకు జీతం పెంచకపోగా గత ఏడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వటం లేదు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు అమలు చేయాలి. ఇప్పుడేమో అసలు వాలంటీర్ల వ్యవస్థే ప్రభుత్వంలో లేదంటూ హేళన చేస్తున్నారు. వాలంటీర్లకు సంబంధించిన జీవో లేకపోతే ఈ ప్రభుత్వం తొలిరోజుల్లో వారిని ఎలా వాడుకుంది?. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి’’ అని చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ‘నాది రాజకీయ పాలన..’ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం -
వలంటీర్ల ఆందోళన బాట.. పోలీసుల అత్యుత్సాహం
ఎన్టీఆర్, సాక్షి: పింఛన్ల పంపిణీని సచివాలయ ఉద్యోగులతో చేయించడంతో వలంటీర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో తమకు జీతాలు పెంచుతామని చెప్పిన కూటమి నేతలు.. తీరా అధికారంలో వచ్చాక విధులకు తమను దూరం చేయడాన్ని ప్రతికూల సంకేతంగా భావిస్తున్నారు. వలంటీర్ వ్యవస్థకు భద్రత కల్పించాలని కోరుతూ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. వలంటీర్లు చలో విజయవాడకు పిలుపు ఇచ్చారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో విజయవాడలో హైఅలర్ట్ నెలకొంది. కలెక్టరేట్ వద్ద పోలీస్ సిబ్బంది భారీగా మోహరించారు. నగర వ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వలంటీర్లను అదుపులోకి తీసుకునేందుకు బస్టాండ్, రైల్వే స్టేషన్లలో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరినీ చెక్ చేయడంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. కేవలం వాట్సాప్ గ్రూపుల్లో జరిగిన ప్రచారంతో ఇంత హడావిడి చేయడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ర్యాలీ, ప్రదర్శనలకు వలంటీర్లు తమను ఎలాంటి అనుమతి కోరలేదని విజయవాడ పోలీసులు చెబుతున్నారు. శాంతి భద్రతల కట్టడి సెక్షన్లు అమలులో ఉన్నాయని వారు చెబుతున్నారు. మరోవైపు వలంటీర్ సేవల్ని ఎలా ఉపయోగించుకుంటారు?.. వాళ్ల ఉద్యోగ భద్రతపై ఇప్పటిదాకా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం. -
AP: ఉద్యోగుల ర్యాలీలో రాజకీయ సందడి
సాక్షి, అమరావతి: పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం పోలీసులు సంయమనం ప్రద ర్శించడంతో సాఫీగా జరిగిపోయింది. ఐదు వేల మందితో కార్యక్రమం నిర్వహణకు అనుమతి కోరిన ఉద్యోగ సంఘాల నేతలు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున తరలించినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇందులో సీపీఎం, సీపీఐ పార్టీల నేతలు పాల్గొనడమే కాకుండా కార్యక్రమాన్ని ఆసాంతం నడిపిం చారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరు కావడంతోపాటు జన సమీకరణ కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై రాజకీయ, వ్యక్తిగత విమర్శలకు దిగినట్లు స్పష్టమవుతోంది. టీడీపీ కార్యకర్త ఇప్పుడు గెజిటెడ్ అధికారి అయ్యాడంటూ చలో విజయవాడపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. రెండు రోజుల ముందే.. వివిధ ప్రాంతాల నుంచి చలో విజయవాడకు హాజరైన ఉద్యోగులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంఘాలవారీగా ఉద్యోగులు బ్యానర్లతో గాంధీనగర్ చేరుకుని అక్కడి నుంచి బీఆర్టీఎస్ రోడ్డు వైపు ర్యాలీలుగా వెళ్లారు. ఫుడ్ జంక్షన్ నుంచి భానునగర్ వంతెన వరకు నిలుచుని ప్రదర్శన చేపట్టారు. పీఆర్సీ సాధన సమితి నేతలు ఓ వాహనంపైకి ఎక్కి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేకపోయినా ప్రణాళిక ప్రకారం తరలి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఒక వ్యూహం ప్రకారం రెండు రోజుల ముందే ఉద్యోగులు నగరానికి చేరుకునే ఏర్పాట్లు చేశారు. ఉద్యోగులు బీఆర్టీఎస్ రోడ్డులోకి చేరుకున్నాక కూడా పీఆర్సీ సాధన సమితి నేతలు రాకపోవడంతో అయోమయం నెలకొంది. చివరికి అప్పటికప్పుడు ఒక వాహనంపైకి చేరుకుని పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రసంగించారు. ఒకవైపు పీఆర్సీ సాధన సమితి నేతలు తాము ప్రభుత్వంతో యుద్ధం చేయడం లేదని చెబుతుంటే మరోవైపు యుద్ధానికి సిద్ధమంటూ యూటీఎఫ్ నాయకులు ప్రకటించారు. సీఎంను ఇంటికి పంపుతామని, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని ఫ్యాప్టో అధ్యక్షుడు జోసెఫ్ సుధీర్‌బాబు హెచ్చరించారు. -
AP: సమ్మెకు ఆర్టీసీ దూరం
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమ్మెకు ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు దూరంగా ఉంటున్నట్లు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవి, కొవూరు ఎజ్రాశాస్త్రిలు ప్రకటించారు. ఈమేరకు తమ సంఘం నిర్ణయాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి బుధవారం లిఖితపూర్వకంగా తెలియచేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయంతోపాటు కరోనా కష్ట కాలంలో 55 వేల కుటుంబాలకు ప్రతి నెల జీతాలిచ్చి ఆదుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయడం అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లేనని చెప్పారు. ఉద్యోగులు ఎవరూ సమ్మెలో పాల్గొనరాదని సంఘం సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. ప్రభుత్వంపై విశ్వాసం ఉంది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం వైఎస్ జగన్‌పై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని ప్రజా రవాణా విభాగం(ఆర్టీసీ) ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్(32/2021) పేర్కొంది. తాము సమ్మెలో పాల్గొనబోమని స్పష్టం చేసింది. సంప్రదింపుల ద్వారానే సమస్యలను పరిష్కరించుకుంటామని స్పష్టం చేస్తూ ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్(32/2021) రాష్ట్ర అధ్యక్షుడు ప్రత్తిపాటి కిరణ్ బుజ్జి, ప్రధాన కార్యదర్శి బీవీఎస్ఎస్ సత్యనారాయణ తదితరులు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సంక్షేమ వ్యవహారాలు) చంద్రశేఖరరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. – పీటీడీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ సమ్మెలో పాల్గొనం చలో విజయవాడ, సమ్మెకు తాము మద్దతు ఇవ్వడం లేదని ఆర్టీసీ డ్రైవర్ల సంక్షేమ సంఘం స్పష్టం చేసింది. తాము సమ్మెలో పాల్గొనడం లేదని ఆర్టీసీ ఎండీ సిహెచ్. ద్వారకా తిరుమలరావుకు సంఘం బుధవారం లిఖితపూర్వకంగా తెలిపింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎంపై తమకు పూర్తి భరోసా ఉందని తెలిపింది. ఆర్టీసీ ఎండీని కలిసినవారిలో డ్రైవర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి డీఎస్ కుమార్, కోశాధికారి డీఎస్ వాసు తదితరులున్నారు. – ఆర్టీసీ డ్రైవర్ల సంక్షేమ సంఘం -
చర్చలతోనే పరిష్కారం
సాక్షి, అమరావతి: సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుదామని ఉద్యోగ సంఘాలను ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ఆహ్వానించారు. గురువారం తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని విరమించుకోవాలని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి్త చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ విద్రోహ శక్తులు చొరబడి సమస్యను పక్కదారి పట్టించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉద్యోగులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. పీఆర్సీ వల్ల ఏ ఒక్క ఉద్యోగి వేతనమూ తగ్గలేదన్నారు. ఉద్యమాలతో ఉద్యోగులకు నష్టం చేయవద్దని కోరారు. ఇప్పటికే ఉద్యోగుల ఖాతాల్లో జమ అయిన జీతాలను పరిశీలించుకుంటే తగ్గాయో పెరిగాయో వారికే అర్థమవుతుందన్నారు. మిగతావాటిపై ముందుకు రావాలి.. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ మంగళవారం సాయంత్రం, బుధవారం ఉదయం చర్చించినట్లు సజ్జల తెలిపారు. మూడు డిమాండ్లపైనే పట్టుబట్టడం సరి కాదని, మిగతా అంశాల పరిష్కారానికి ముందుకు రావాలని కోరారు. ఆ 3 డిమాండ్లకు కాలం చెల్లిందన్నారు. ఇప్పటికే ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేశామని, మిగతా రెండు డిమాండ్లు నెరవేర్చడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమయ్యే అవకాశం లేదన్నారు. పీఆర్సీ నివేదికను ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. వైషమ్యాలతో సాధించేదేముంది? అసలు సమస్యలపై చర్చించేందుకు రావాలని, ఉద్యోగ సంఘాల కార్యాచరణ వాయిదా వేసుకోవాలని కోరితే ఇప్పటివరకూ ఎలాంటి లేదని సజ్జల పేర్కొన్నారు. సమ్మెకు దిగక ముందే చలో విజయవాడ పేరుతో రోడ్డెక్కడం సరి కాదన్నారు. ఆ పేరుతో చేసేది బలప్రదర్శనే మినహా మరొకటి కాదన్నారు. సామరస్యంగా పరిష్కరించుకుందామని, ఉద్యమాల ద్వారా సమస్యను జఠిలం చేసుకోవద్దని హితవు పలికారు. సీపీఎస్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఒక పట్టాన తెగేవి కాదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులపై అభిమానంతోనే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశామని సజ్జల తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను సమ్మెలోకి దించి బస్సులు ఆపి బల ప్రదర్శన చేయాలని చూస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడటం ప్రభుత్వం బాధ్యతని, కరోనా నేపథ్యంలో ఆందోళనలకు అనుమతి లేదన్నారు. ఉద్యోగులపై చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవదన్నారు. కరోనా వల్ల ఆదాయం తగ్గి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని పలుదఫాలు చెప్పామని, ఇది ఉద్యోగ సంఘాలకు తెలియంది కాదన్నారు. రాజధానిపై... ఇప్పుడు వెలగపూడి నుంచే పరిపాలన సాగుతోందని, సాంకేతికంగా పాలన ఎక్కడినుంచి జరుగుతుందో అదే ప్రస్తుత రాజధాని అవుతుందని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలనను వికేంద్రీకరించాలని నిర్ణయించామని, అందులో భాగంగానే 3 రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆ నిర్ణయం మేరకు భవిష్యత్తులో రాజధాని మార్పు ఉంటుందన్నారు. బడ్జెట్లో కేంద్రం ఏటా రాష్ట్రానికి అన్యాయమే చేస్తోందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ వల్లే ప్రత్యేక హోదా ఇప్పటికీ సజీవంగా ఉందన్నారు. -
‘చలో’కి అనుమతి లేదు
సాక్షి ప్రతినిధి, విజయవాడ, సాక్షి, అమరావతి: కోవిడ్ నిబంధనలు, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. మెరుగైన పీఆర్సీ, కొత్త జీవో ఉపసంహరణ డిమాండ్‌తో ఉద్యోగ సంఘాలు 5 వేల మందితో గురువారం చలో విజయవాడ కార్యక్రమ నిర్వహణకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. విజయవాడలో నేడు బీఆర్టీఎస్ రోడ్డులో వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాకపోకలకు అనుమతి లేదని, వాహనదారులు మళ్లింపు మార్గాల్లోనే ప్రయాణించాలని సూచించారు. బీఆర్టీఎస్ వైపు వాహనాల రాకపోకల్ని నివారిస్తూ ప్రత్యామ్నాయంగా ఆరు ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను ఏర్పాటు చేశారు. బీఆర్టీఎస్ రోడ్డులో వందకుపైగా కెమెరాలతో నిఘా ఉంచారు. డ్రోన్లు, ఫాల్కన్ వాహనాలతో పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్య కూడళ్లలో తనిఖీ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు, 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఉద్యోగులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్టీరింగ్ కమిటీ నేతల ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయినా సరే.. ఆగేది లేదు: తమపై చర్యలు తీసుకున్నా సరే చలో విజయవాడ నిర్వహిస్తామని పోలీసు కమిషనర్‌కు తెలియచేసినట్లు పీఆర్సీ సాధన సమితి నేతలు మీడియాతో పేర్కొన్నారు. కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో స్టీరింగ్ కమిటీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ బుధవారం రాత్రి సీపీని కలిశారు. తమ ఉద్యమ కార్యాచరణ నోటీసును గతంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చామని, అందులో భాగంగానే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనుమతి లేదు.. సహకరించండి చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తున్నాం. ఉద్యోగులు 5 వేల మంది తరలి రావాలని పిలుపునిచ్చారు. కోవిడ్ నిబంధనల ప్రకారం అవుట్ డోర్ లోకేషన్లలో 200, ఇండోర్‌లో వంద మందికి మించరాదు. అసాంఘిక శక్తులు చొరబడి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశముంది. నగరంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, 144 సీఆర్పీసీ ప్రొసీడింగ్స్ అమలులో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కార్యక్రమానికి అనుమతి ఇవ్వటం లేదు. ఉద్యోగులు సహకరించాలి. –టి.కె.రాణా,విజయవాడ పోలీస్ కమిషనర్ -
పోలీసుల వద్ద కొడుకు.. ఆగిన అమ్మ గుండె!
బుచ్చిరెడ్డిపాళెం: తన కుమారుడిని పోలీసులు తీసుకెళ్లడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆ తల్లి గుండె ఆగిపోయింది. ఈ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెనుబల్లికి చెందిన నన్నెం మాధవ్ డీవైðఎఫ్ఐ మండల కార్యదర్శిగా ఉన్నారు. కాగా, నిరుద్యోగ సమస్యలపై బుధవారం ‘ఛలో విజయవాడ’ పేరిట డీవైఎఫ్ఐ కార్యక్రమం తలపెట్టింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇద్దరు కానిస్టేబుళ్లు మాధవ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. తాను విజయవాడకు వెళ్లడం లేదని, పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన అవసరం ఏముందని ఆయన వారిని ప్రశ్నించారు. అంతేకాకుండా తన తల్లి అనారోగ్యంతో ఉందని వారితో చెప్పడంతో కానిస్టేబుళ్లు ఎస్సైకు విషయాన్ని వివరించారు. దీంతో ఎస్సై ప్రసాద్‌రెడ్డి మంగళవారం రాత్రి పెనుబల్లికి వెళ్లి మాధవ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి బైండోవర్ చేశారు. కాగా, మాధవ్ తల్లి చిన్నమ్మ (60) ఏడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. మాధవ్ ఆర్ఎంపీ వైద్యుడు కావడంతో తన తల్లికి స్వయంగా వైద్యసేవలు అందిస్తున్నారు. తన కళ్లముందే కుమారుడ్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. వైద్యసేవలు కూడా అందకపోవడంతో చిన్నమ్మ గుండెపోటుతో మరణించింది. బుధవారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి మాధవ్‌కు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు ఆయనను వదిలిపెట్టారు. ఇంటికెళ్లిన మాధవ్ విగతజీవిగా మారిన తన తల్లిని చూసి విలపించారు. సీపీఎం నేతలతో కలసి తన తల్లి మృతదేహంతో పెనుబల్లి రోడ్డుపై ధర్నాకు దిగారు. పోలీసులు ప్రవర్తించిన తీరుపై సీపీఎం నేతలు మండిపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ మాట్లాడుతూ ‘ఛలో విజయవాడ’కు వెళ్లడం లేదని చెప్పినా ఎస్సై ప్రసాద్‌రెడ్డి బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించడం దారుణమన్నారు. తల్లి కళ్ల ముందు మాధవ్‌ను కొట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. మాధవ్‌తో అమానుషంగా వ్యహరించడంతోపాటు ఆయన తల్లి మృతికి కారకుడైన ఎస్సైను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సీపీఎం నేతలు జొన్నలగడ్డ వెంకమరాజు, ముత్యాల గురునాధం, గండవరపు శ్రీనివాసులు, తాళ్ల వెంకయ్య, మన్నూరు భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు. -
19న అంగన్వాడీల చలో విజయవాడ
ఒంగోలు టౌన్: అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 19వ తేదీ చలో విజయవాడ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి అంగన్వాడీలు చలో విజయవాడలో పాల్గొనేందుకుగాను ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాళ్లు గురువారం సాయంత్రం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సరోజినిని కలిసి ఒకరోజు సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ మాట్లాడుతూ అంగన్వాడీలకు రూ.18 వేల చొప్పున వేతనం ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యం కల్పించాలన్నారు. ఉద్యోగ విరమణ చేసిన అంగన్వాడీ కార్యకర్తకు రూ.2 లక్షలు, ఆయాకు లక్ష రూపాయల చొప్పున గ్రాట్యుటీ ఇవ్వాలని కోరారు. ఉద్యోగ విరమణ చేసే సమయంలో అంగన్వాడీలు అందుకున్న చివరి నెల వేతనాన్ని పెన్షన్‌గా నిర్ణయించి ప్రతినెలా ఇవ్వాలన్నారు. అంగన్వాడీలకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు సంబంధించిన బయోమెట్రిక్ హాజరు విధానాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. అంగన్వాడీలకు ఐసీడీఎస్‌తో సంబంధంలేని బీఎల్ఓ, పలకరింపు, స్మార్ట్ పల్స్ సర్వే వంటి విధులు అప్పగించరాదన్నారు. పీడీని కలిసి సమ్మె నోటీసు అందజేసిన వారిలో యూనియన్ నాయకురాళ్లు కేవీ సుబ్బమ్మ, ఉమాదేవి, ధనలక్ష్మి తదితరులు ఉన్నారు. -
‘ఆశ’ల చలో బెజవాడపై పోలీసు ప్రతాపం
న్యాయమైన తమ డిమాండ్ల సాధన కోసం చలో విజయవాడ కార్యక్రమానికి విచ్చేసిన ఆశా వర్కర్లపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఏపీ వాలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్(ఆశా) (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వెయ్యిమందికి పైగా ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారికి మద్దతిచ్చిన సీఐటీయూ నాయకులను సైతం అదుపులోకి తీసుకుని నగర పరిధిలోని ఎనిమిది పోలీస్స్టేషన్లలో నిర్బంధించారు.దీనిపై ఆశా వర్కర్ల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసుల తీరును విమర్శించారు. -విజయవాడ -
300 మంది ఆశా వర్కర్లు అరెస్టు
ఇంద్రకీలాద్రి: ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చలో విజయవాడ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. భారీగా కార్యకర్తలు తరలివస్తుండటంతో.. అప్రమత్తమైన పోలీసులు వారిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. విజయవాడలోనితుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి శుక్రవారం తెల్లవారుజామున 300 మంది ఆశా వర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండటంతో.. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్బంధించారు.