
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు జీతం రూ. 10 వేలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెంచిన జీతం ఈ నెల నుంచే ఇవ్వాలని అందులో ఉంది. గతంలో వారికి మూడువేల రూపాయలే ఉండేది. ఇన్సెంటివ్‌గా రూ. 5600 వరకు చెల్లించే అవకాశం ఉన్నాచంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదు. కేవలం రూ.3వేలే ఇన్సెంటివ్‌గా చెల్లించేలా సీలింగ్ విధించారు. దీని వల్ల గరిష్టంగా నెలకు రూ. 6వేలు మాత్రమే ఆశ వర్కర్లు పొందారు. దీంతో పాదయాత్రలో వారి కష్టాలను స్వయంగా విని వారికి న్యాయం చేస్తానని వై.ఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే తమకిచ్చిన హామీని నెరవేర్చడం పట్ల ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment