కనీస వేతనాల పెంపు కోరుతూ కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలో బుధవారం ఆశావర్కర్లు ధర్నాకు దిగారు.
సుల్తానాబాద్: కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలో బుధవారం ఆశావర్కర్లు ధర్నాకు దిగారు. ఆశావర్కర్లకు కనీసం వేతనం రూ.15 వేలు, 39 నెలల బకాయి గౌరవవేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
అర్హులైన వారిని సెకండ్ ఏఎన్‌ఎంలుగా తీసుకోవాలని, పెన్షన్, గ్రాట్యుటీ, ప్రసూతి సెలవులు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. పీహెచ్‌సీకి వెళ్లిన ప్రతిసారి టీఏ, డీఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు.