జీతాలు వెంటనే చెల్లించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నాకు దిగారు.
పెద్దాపురం : జీతాలు వెంటనే చెల్లించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఆరు నెలల నుంచి తమకు జీతాలు చెల్లించలేదని, సుమారు రూ.8 లక్షలు బకాయిలు చెల్లించాలని ఆశావర్కర్లు తెలిపారు. ఆర్డీఓ లేకపోవడంతో కార్యాలయంలో ఉన్న ఏఓ విద్యాసాగర్‌కు వినతిపత్రం సమర్పించి వెనుదిరిగారు. కలెక్టర్‌తో మాట్లాడి జీతాలు వచ్చేలా చూస్తానని విద్యాసాగర్ వారికి హామీ ఇచ్చారు.