salarys
-
ఓ మంత్రిగారు.. చించినాడ పూతరేకులు..
సాక్షి, భీమవరం : ‘చంద్రబాబునాయుడుగారు, పవన్‌కళ్యాణ్‌గారు చెప్పారమ్మా.. మీ వలంటీరు జాబ్‌కు రూ.5 వేలు ఏ మూలకి సరిపోతాయి? ఖర్చులు బోలెడు పెరిగిపోయాయి కదా? మన ప్రభుత్వంలో వలంటీరు వ్యవస్థను కొనసాగిస్తాం. మీకు రూ.10 వేలు జీతం ఇస్తాం. రేపొద్దున్న మన ప్రభుత్వంలో అన్నయ్య ఇదిగో 10 వేలు అందుకున్నానని ఆనందంగా మన చించినాడ పూతరేకుల ప్యాకెట్ పట్టుకుని రావాలి’.. అంటూ పాలకొల్లు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు(Nimmala Rama Naidu)ఎక్కడ వలంటీరు కనిపించినా ఈ హామీ ఇచ్చేవారు.రూ.10 వేలు తీసుకున్నాక ఆనందంగా చించినాడ పూతరేకుల ప్యాకెట్ కానుకగా ఇవ్వాలని చెప్పి ఆకట్టుకునే ప్రయత్నం చేసేవారు. అప్పట్లో ఆయన పాలకొల్లు కళాకారులనే మించిపోయారు. ఇంటింటికీ వెళ్లి అమ్మ, అక్క, చెల్లి, బావ, తమ్ముడు.. అని అందరితో వరసలు కలుపుతూ సూపర్ సిక్స్‌లో ఎవరెవరికి ఎంత నగదు వస్తుందో తనదైన శైలిలో వివరించేవారు. ఆనక ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు చేయించుకునే వారు. ఇప్పుడదే ఆయన్ను వెంటాడుతోంది.పాలన పగ్గాలు చేపట్టి ఎనిమిది నెలలు కావస్తోంది. ఆర్థిక పరిస్థితి చూస్తుంటే హామీల అమలు సాధ్యంకాదంటూ సీఎం చంద్రబాబు చేతులెత్తేయ్యడంతో సూపర్‌సిక్స్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్, నిమ్మల ప్రసంగాలు, వాటి అమలుకు ఇప్పుడు చేతులెత్తేసిన దృశ్యాలతో రీల్స్ ద్వారా ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. మంత్రి నిమ్మలకు రీల్స్ సెగ.. ఇక పాలకొల్లులోని ఒక ఇంటి వద్ద ఉన్న చిన్నపిల్లలను చూపిస్తూ నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అంటూ నాడు నిమ్మల రామానాయుడు చెప్పిన వీడియో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. తలి్లకి వందనం ఇప్పట్లో రాదని తెలిసి ఆ వీడియోకు గోదావరి వెటకారం, యాసను జోడించి మరీ నెటిజన్లు రీల్స్ చేసి మంత్రి నిమ్మలకు వ్యతిరేకంగా పోస్టు చేస్తున్నారు. కొందరైతే తమ సెల్ఫోన్లకు ఈ ఆడియోను రింగ్టోన్లుగా పెట్టేసుకున్నారు.ఇలా గత రెండ్రోజులుగా నిమ్మల హామీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండవుతున్నాయి. అలాగే, మన ప్రభుత్వంలో మీకు రూ.10 వేలు వేతనం వచ్చిన ఆనందంతో కానుకగా తనకు చించినాడ పూతరేకులు తీసుకొచ్చి ఇవ్వాలంటూ వలంటీర్లతో చెప్పిన వీడియోలను జతచేసి సోషల్ మీడియాలో వేల సంఖ్యలో షేర్ అవుతున్నాయి. వలంటీర్లను కొందరు కూటమి నేతలు వంచించిన తీరును ఎండగడుతుండగా, మరికొందరు వాటికి మద్దతుగా కామెంట్లు పెడుతూ నిరసన తెలుపుతున్నారు. పూతరేకులు దొరక్క కలవలేకపోయారంటూ వంటి పోస్టులతో ఆడుకుంటున్నారు. అధికారం కోసం హామీలిచ్చేయ్యడం, గద్దెనెక్కాక వాటిని విస్మరించడం పూర్వపు రోజులని.. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి తప్పించుకోలేరంటూ సెటైర్లు వేస్తున్నారు. -
జీతాల కోతకు ఇంగ్లండ్ క్రికెటర్లు ఓకే
లండన్: కరోనా మహమ్మారి వల్ల టోర్నీలు, సిరీస్‌లు జరగక... పర్యటనలు లేక చాలా క్రికెట్ బోర్డులు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయి. దీంతో పలు బోర్డులు జీతాల కోత విధిస్తున్నాయి. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రతిపాదనకు ఆ దేశ క్రికెటర్లు సమ్మతించారు. కోవిడ్ వల్ల ఇప్పటికే ఈసీబీ 100 మిలియన్ యూరోల (రూ. 874 కోట్లు) నష్టాన్ని చవిచూసింది. ఈ నష్టం వచ్చే ఏడాదికి రెట్టింపు (రూ. 1,748 కోట్లు) కానుందని ఈసీబీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణ అనివార్యమని భావించిన బోర్డు ఇప్పటికే 62 మంది ఉద్యోగులకు బైబై చెప్పింది. అలాగే ఆటగాళ్ల కాంట్రాక్టు, మ్యాచ్ ఫీజుల కోతకు సిద్ధపడింది. ఈ మేరకు ఆటగాళ్ల సంఘం ముందు ప్రతిపాదన పెట్టగా తాజాగా ఆటగాళ్లు 15 శాతం కోతకు అంగీకరించారు. దీంతో ఈసీబీ డైరెక్టర్ ఆష్లే గైల్స్ తమ టీమ్ ఇంగ్లండ్ ప్లేయర్ల పార్ట్నర్షిప్ (టీఈపీపీ–ఇది ప్లేయర్ల అసోసియేషన్)కు అభినందనలు తెలిపారు. ‘ఆటగాళ్లతో బోర్డు బంధం ఎంతో ధృడమైనది. మా ఆటగాళ్ల సేవలకు గుర్తింపు ఇస్తాం. ఈ కష్టకాలంలో ఆటగాళ్లు కనబరిచిన పరిణతికి మా అభినందనలు, టెస్టు, వన్డే కెప్టెన్లు రూట్, మోర్గాన్, ఆటగాళ్లు అందరూ సవాళ్లను స్వీకరిస్తూనే బాధ్యతల్ని పంచుకుంటున్నారు’ అని గైల్స్ కొనియాడారు. టీఈపీపీ చైర్మన్ రిచర్డ్ బెవాన్ మాట్లాడుతూ క్లిష్ట సమయంలో ఆటగాళ్లంతా బోర్డుకు అండగా నిలవాలనుకోవడం గొప్ప విషయమని అన్నారు. -
కాంట్రాక్టు జగన్నాథునికెరుక!
అనంతపురం న్యూసిటీ : సర్వజనాస్పత్రిలో అవినీతి, అక్రమాలు తారస్థాయికి చేరాయి. డబ్బు ముట్టజెబితే చాలు.. ఇక్కడ ఎలాంటి పని చేసేందుకైనా వెనుకాడని పరిస్థితి. మెడికల్ రికార్డు, ఓపీ, ఐపీ నిర్వహణ బాధ్యతను పరిశీలిస్తే అధికారులు ఏ స్థాయికి దిగజారినారో అర్థమవుతోంది. ఏడాదిన్నరగా కర్నూలుకు చెందిన ఓ ప్రయివేట్ సంస్థకు ఓపీ, ఐపీ, రికార్డుల నిర్వహణ బాధ్యతను అనధికారికంగా కట్టబెట్టారు. ఇందుకోసం ప్రతినెలా రూ.3.25లక్షలు చెల్లిస్తున్నారు. ఇందులో ఆసుపత్రిలోని కీలక అధికారికి భారీగా ముడుపులు ముడుతున్నట్లు చర్చ జరుగుతోంది. అదేవిధంగా ఏడాదికి పైగా అదే కంపెనీని కొనసాగిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ప్రతి నెలా కలెక్టర్‌కు ఫైల్ పంపి కాంట్రాక్టును కొనసాగిస్తున్నట్లుగా తెలిసింది. ఇదీ సంగతి 2017లో ఎంసీఐ సర్వజనాస్పత్రిని తనిఖీ చేసి మెడికల్ రికార్డ్స్ నిర్వహణ సరిగా లేదని, డిజిటలైజేషన్ పక్కాగా ఉండాలని స్పష్టం చేసింది. దీన్ని ఆసరాగా చేసుకొని ఆస్పత్రిలోని కీలక అధికారి ఎలాంటి టెండర్ లేకుండానే ఓ కంపెనీకి ఐపీ, ఓపీ, రికార్డ్స్ నిర్వహణ బాధ్యతను కట్టబెట్టారు. అప్పట్లో ఈ విషయమై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కానీ అధికార పార్టీ నాయకల అండతో కాంట్రాక్ట్‌ను కొనసాగిస్తూ వచ్చారు. కంపెనీ నిర్వాహకులు ఆస్పత్రిలో పూర్తి స్థాయి సామగ్రిని కూడా సమకూర్చుకోలేదు. ఓపీ, ఐపీ, మెడికల్ రికార్డ్ రూంలో తూతూమంత్రంగా కంప్యూటర్లు ఏర్పాటు చేసుకున్నారు. వీటిలోనూ సర్వజనాస్పత్రికి చెందిన కంప్యూటర్లే ఉన్నాయి. ప్రతి నెలా కరెంటు బిల్లు చెల్లించాల్సి ఉన్నా.. ఆస్పత్రిపైనే భారం వేస్తున్నారు. రూ.1.50లక్షకు పైనే లబ్ధి కంపెనీకి ప్రతి నెలా రూ.3.25 లక్షలు చెల్లించేలా ఆస్పత్రి యాజమాన్యం కాంట్రాక్ట్‌ను అప్పగించింది. ఇక్కడ 10 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వారికి ప్రతి నెలా రూ.6వేలు చొప్పున చెల్లిస్తున్నారు. ఈ లెక్కన రూ.60వేలు సిబ్బందికి ఖర్చవుతుంది. ఇక మెడికల్ రికార్డ్స్ పేపర్లకు రూ.లక్ష కూడా ఖర్చు కాదని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. అంటే.. కంపెనీ ప్రతి నెలా రూ.1.50లక్షకు పైగానే లబ్ధి పొందుతోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులతో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిబ్బందికి అందని వేతనాలు ఐపీ, ఓపీ, మెడికల్ రికార్డ్ సెక్షన్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి గత నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. కంపెనీకి ప్రతి నెలా రూ.3.25 లక్షలు వస్తున్నా వేతనాలు ఇవ్వకపోవడం పట్ల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం విధులకు హాజరైనట్లు వ్యాట్సాప్‌లో ఫొటోలు ఉంచడం మినహా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వేతనాల విషయమై కంపెనీ నిర్వాహకులను ఆరా తీస్తే ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నట్లుగా సమాచారం. నిబంధనలకు పాతర సర్వజనాస్పత్రిలో ఓ కీలక అధికారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనిలోనూ కమీషన్ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా పని జరగాలంటే ఆ అధికారిని కలిస్తే చాలని ఆసుపత్రిలోనే బహిరంగ చర్చ జరుగుతోంది. రూ.వెయ్యి మొదలు రూ.లక్షల వరకు ఆయన దేన్నీ వదలడం లేదని తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఆ హోంగార్డుల సంగతేంటి?
సాక్షి, హైదరాబాద్: పలు విభాగాల్లో డిప్యుటేషన్‌పై పనిచేసి మాతృ విభాగంలో రిపోర్టు చేసిన 400మంది హోంగార్డులకు దిక్కూమొక్కూ లేకుండా పోయింది. అంబర్పేట్ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన హోంగార్డులు ఎఫ్‌సీఐ, దూరదర్శన్‌తో పాటు పలు కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో డిప్యుటేషన్‌పై మూడేళ్లు పనిచేసి మళ్లీ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేశారు. వీరు రిపోర్టు చేసి 2నెలలు గడిచినా.. వాళ్లకి మళ్లీ పోస్టింగ్స్ కల్పించకపోవడం తో ఆ కుటుంబాలు ఆందోళనలో పడ్డాయి. 2 నెలల నుంచి జీతభత్యాలు లేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటివరకు వీరంతా రూ.12 వేల జీతభత్యాల మీద పలు విభాగాల్లో డిప్యుటేషన్‌పై పనిచేశారు. ఇటీవలే జీతభత్యాల పెంపు రూ.20 వేలకు వెళ్లడంతో డిప్యుటేషన్‌పై హోం గార్డులను వినియోగించుకుంటున్న విభాగాలు ఈస్థాయిలో జీతాలు చెల్లించలేమని వీరందరినీ హెడ్‌క్వార్టర్స్‌కు పంపాయి. ప్రస్తుతం పోలీస్ విభాగాల్లో పనిచేస్తున్న హోంగార్డులకే రూ.20 వేలు వర్తిస్తుందని, వారి వరకే బడ్జెట్లో ప్రభు త్వం కేటాయింపులు చేసిందని చెప్పడంతో వెయింటింగ్‌లో ఉన్న హోంగార్డులు మరింత ఆందోళనలో పడ్డారు. దీనిపై తాము ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల దృష్ట్యా ఆదేశాలకు ఆలస్యమైందని ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారని బాధిత హోంగార్డులు తెలిపారు. ఇప్పటికైనా వెయింటింగ్‌లో ఉన్న తమకు పోస్టింగ్స్ కల్పించి జీతభత్యాల పెంపు వర్తింపుతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఇలా పెంచారు..అలా తగ్గించేశారు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రకటించిన మేరకు తమకూ 30% వేతనం పెరిగిందన్న సంతోషం.. ఆ ఉద్యోగులకు మూడునాళ్ల ముచ్చటే అయింది. 2 నెలల పాటు వేతనాన్ని పెంచినట్లే పెంచిన ఉన్నతాధికారులు.. కొత్త సంవత్సరం రోజున గతంలో పెంచిన మొత్తాన్ని కూడా ఈ నెల వేతనం నుంచి మినహాయిం చడం వారికి ఎంతమాత్రం మింగుడు పడటం లేదు. వేతన బకాయిలు రాక, ఈ నెల వేతనంలో భారీగా కోత పెట్టడంతో ఉద్యోగుల కుటుం బాలు పస్తులుండా ల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలోని ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ (ఐడబ్ల్యూఎంపీ)లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న ప్రాజెక్ట్ ఆఫీసర్ల దుస్థితి ఇది. మూడేళ్లుగా ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని (ఐటీడీఏ)గిరిజన ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పద్ధతిన ప్రాజెక్ట్ అధికారులుగా సేవలందిస్తున్న వీరిని నిబంధనల ప్రకారం రెండేళ్ల అనంతరం హెచ్ఆర్ పాలసీలోకి తీసుకోవాల్సి ఉంది. ఆ మేరకు వీరంద రికి ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్ (ఎఫ్టీఈస్)గా గ్రామీణాభివృద్ధి శాఖ గుర్తింపు లభించాల్సి ఉంది. పీవోలను ఎఫ్టీఈస్గా మార్చడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిం చడంతో ప్రభుత్వం వేతనాలను పెంచినా, వీరికి అందు కునే యోగ్యత లేకుండా పోయింది. గత అక్టోబర్ నెలలో గ్రామీణా భివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), ఉపాధిహామీ పథకాలలో పనిచేస్తున్న 8 వేల మంది ఉద్యోగులకు 30% మేర వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు ఇతర ఉద్యోగులతో పాటుగా ఐడబ్ల్యూఎంపీలో ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న పీవోలకు కూడా 30% చొప్పున వేతనాన్ని (రూ.20 వేల నుంచి రూ.26 వేలకు) పెంచిన ఉన్నతాధి కారులు.. రెండు నెలల తర్వాత ప్రభుత్వమిచ్చిన వేతన పెంపు మీకు వర్తించ దంటూ రెండు నెలల్లో అదనంగా వచ్చిన రూ.12 వేల మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు. పాత బకాయిలను పట్టించుకోరాయె.. ఐడబ్ల్యూఎంపీ ప్రాజెక్ట్‌కు నిధుల కొరత ఉందంటూ గతేడాది మే, జూన్ నెలల్లో పీవోలకు వేతనాన్ని ఇవ్వని ఉన్నతాధికారులు, ఆరు నెలలు దాటినా బకాయిల గురించి పట్టించుకోవడం లేదని కాంట్రాక్ట్ ఉద్యోగులు వాపోతున్నారు.. ఓ వైపు వేతన బకాయిలు ఇవ్వకుండా, మరోవైపు పెంచిన వేతనాన్ని ఈ నెల వేతనం నుంచి కట్ చేయడంతో నెలరోజుల పాటు తమ కుటుంబాలు ఎలా గడవాలని వారంతా ప్రశ్నిస్తున్నారు. వాటర్ షెడ్ ప్రాజెక్ట్‌ను కూడా ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రభుత్వం చేపట్టినందున తమకు వెంటనే వేతన పెంపును వర్తింప జేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
నగదు రూపంలో వేతనాలివ్వాలని..
- మున్సిపల్ కార్మికుల ఆందోళన -కూకట్ పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ హైదరాబాద్: తమ వేతనాలను నగదు రూపంలో ఇవ్వాలంటూ మున్సిపల్ కార్మికులు ఆందోళకు దిగారు. కూకట్పల్లి వివేకానంద నగర్‌లోని ఎస్బీహెచ్ శాఖ వద్దకు మంగళవారం ఉదయం భారీగా చేరుకున్న కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన కారులను శాంతింపజేసేందుకు యత్నిస్తున్నారు. -
ఆర్డీవో కార్యాలయం ఎదుట వీఆర్ఏల ఆందోళన
పార్వతీపురం: ఎన్నికల హామీలను టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపిస్తూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ) ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం వందలాది మంది వీఆర్ఏలు ధర్నాకు పూనుకున్నారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. కనీసం రూ.18వేల వేతనం చెల్లించాలని, మెడికల్ ఇన్వాలిడేషన్‌లో వారసుల వయో పరిమితిని సడలించాలని కోరారు. తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా పరిగణించవద్దని పేర్కొన్నారు. కార్యాలయం గేట్లు మూసేసి వారు నినాదాలు చేశారు. -
అంగన్వాడీల కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
-
అంగన్వాడీల కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
హైదరాబాద్: వేతన పెంపుపై ప్రభుత్వ హామీలు నమ్మేదీ లేదని, జీఓ జారీ చేసేంత వరకు ఉద్యమం ఆపేదిలేదంటూ అంగన్ వాడీలు శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. పెంచిన జీతాలను సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని అంగన్ వాడీలు ముట్టడి కార్యక్రమం తలపెట్టారు. ఈ సందర్భంగా పలు జిల్లాలలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులకు , అంగన్ వాడీలకు మధ్య తోపులాటలు, వాగ్వాదాలు తలెత్తాయి. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతపురం: అనంతపురం జిల్లాలో అంగన్ వాడీలు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. పెంచిన జీతాలకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేసి దాని ప్రకారం జీతాలు అందించాలని డిమాండ్ చేస్తూ వారు చేసిన కార్యక్రమంలో పోలీసులకు అంగన్ వాడీలకు మధ్య తోపులాట జరిగింది. శుక్రవారం ఉదయం నుంచే అనంత కలెక్టరేట్ ఎదుటకు చేరిన వేలాది కార్యకర్తలు గేట్లు తోసుకొని కలెక్టర్ కార్యాలయం లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో భారీగా మొహరించిన పోలీసులకు అంగన్వాడీలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. కాకినాడ : అంగన్వాడీలు తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ, హెల్ఫర్స్ యూనియర్స్ శుక్రవారం కలెక్టరేట్ ను ముట్టడించారు. గేట్లు ఎక్కి కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు అంగన్వాడీలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి
అర్వపల్లి: గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలని గ్రామపంచాయతీ కార్మికుల సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బోయపల్లి వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్వపల్లిలో జరుగుతున్న సమ్మె శిబిరంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీలు కార్మికులతో 24గంటలు వెట్టిచాకిరి చేయించుకొని నెలకు వేతనం రెండు, మూడు వేలకు మించి ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ జీవోల ప్రకారం కనీస వేతనం నెలకు రూ. 15వేలు చెల్లించాలని కోరారు. సమ్మెపై ప్రభుత్వం నోరు మెదపక పోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఊట్కూరి భీముడు, కుంభం రాంమ్మూర్తి, సాయిని యాగానందం, కుంభం నాగరాజు, జె. వెంకన్న, బి. జలేందర్, శ్రీరాములు, పి. సైదులు, సోమనర్సయ్య, వీరయ్య, శ్రీరాములు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
జీతాల కోసం ఆశావర్కర్ల ధర్నా
పెద్దాపురం : జీతాలు వెంటనే చెల్లించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఆరు నెలల నుంచి తమకు జీతాలు చెల్లించలేదని, సుమారు రూ.8 లక్షలు బకాయిలు చెల్లించాలని ఆశావర్కర్లు తెలిపారు. ఆర్డీఓ లేకపోవడంతో కార్యాలయంలో ఉన్న ఏఓ విద్యాసాగర్‌కు వినతిపత్రం సమర్పించి వెనుదిరిగారు. కలెక్టర్‌తో మాట్లాడి జీతాలు వచ్చేలా చూస్తానని విద్యాసాగర్ వారికి హామీ ఇచ్చారు. -
వీఆర్ఏలను విస్మరించడం తగదు
కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం అందరి వేతనాలు పెంచి వీఆర్ఏలను విస్మరించడం తగదని కరీంనగర్ జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్ అన్నారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వారధిగా పని చేస్తున్న వీఆర్ఏలను సర్కారు గుర్తించకపోవడం బాధాకరమన్నారు. 010 పద్దుతో జీతాలు ఇవ్వడంతో పాటు ప్రమోషన్ల జాబితాను అసెంబ్లీ సమావేశాల్లోపే పూర్తి చేయాలని కోరారు. (సుల్తానాబాద్) -
జీతాల కోసం ట్యాంక్ ఎక్కారు
వైఎస్సార్ జిల్లా : ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రి ఔట్సోర్సింగ్ సిబ్బంది వినూత్న నిరసనకు దిగారు. జీతాలు ఇవ్వలేదని వారంతా సోమవారం ట్యాంక్ పైకి ఎక్కి ఆందోళన చేశారు. వివరాలు...స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఏడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఈ క్రమంలో 23 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆస్పత్రిలోని ట్యాంక్ పైకి ఎక్కి తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి సూరింటెండెంట్ బుచ్చిరెడ్డి, ఆర్ఎంఓ డేవిడ్ సంఘటన స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా వారు వినలేదు. విషయం తెలుసుకున్న డీఎస్పీ పూజిత ఆస్పత్రి వద్దకు చేరుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అధికారులు సమస్య పరిష్కరిస్తామని చాలా సార్లు హామీ ఇచ్చారని, అయినా ఇంతవరకు జీతాలు చెల్లించలేదని వారు చెప్పారు. దీంతో వైద్యవిధాన పరిషత్ కమిషనర్ కనకమ్మతో డీఎస్పీ ఫోన్లో మాట్లాడారు. ఇది రాష్ట్రవాప్త సమస్య అని, త్వరలో వారికి జీతాలు అందేలా చర్యలు తీసుకుంటామని కమీషనర్ హామీ ఇచ్చారు. వారం రోజుల్లో మీ సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ చెప్పడంతో ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆందోళన విరమించారు. (ప్రొద్దుటూరు) -
పండుగకు పస్తులే..!
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలోని 866 గ్రామపంచాయతీల్లో సాక్షర భారత్ కేంద్రాలు ఉన్నాయి. వీటి నిర్వహణకు 1732 గ్రామ కో ఆర్డినేటర్లు, 52 మంది మండల కో ఆర్డినేటర్లను నియమించారు. వేతనం నెలకు గ్రామ కో ఆర్డినేటర్‌కు రూ.2 వేలు, మండల కో ఆర్డినేటర్‌కు రూ.6 వేలు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆయా నిధుల నుంచి కో ఆర్డినేటర్ల వేతనాలు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో 14 నెలలుగా వేతనాలు అందక కో ఆర్డినేటర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కో ఆర్డినేటర్లకు 2012 అక్టోబర్ వరకు, గ్రామ కో ఆర్డినేటర్లకు 2012 నవంబర్ వరకు జీతాలు అందారుు. మండల కో ఆర్డినేటర్లకు 14 నెలలు, గ్రామ కోఆర్డినేటర్లకు 13 నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగానైనా వేతనాలు విడుదల చేస్తారని ఆశించిన కో ఆర్డినేటర్లకు నిరాశే ఎదురైంది. దీంతో పండుగ వేళ పచ్చడి మెతుకులే గతి అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేబులోంచి .. ప్రతి నెలలో రెండుసార్లు మండల కేంద్రంలో నిర్వహించే శిక్షణకు గ్రామ కోఆర్డినేటర్లు వారి సొంత డబ్బులతో హాజరవుతున్నారు. సాక్షర భారత్ కేంద్రంలో రోజూ రెండు దినపత్రికలు, ఇతరత్ర పుస్తకాలనూ వారి డబ్బులతోనే కొంటున్నారు. వేతనం పెండింగ్‌లో ఉండడంతో కొందరు కో ఆర్డినేటర్లు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చి కేంద్రాల నిర్వహణ కొనసాగిస్తున్నారు. మరికొందరు ప్రభుత్వ వైఖరితో విసిగిపోరుు నిరక్షరాస్యులైన వయోజనులకు అక్షరాలు నేర్పేందుకు ఆసక్తి చూపడంలేదు. మండల కో ఆర్డినేటర్లు ప్రతీ సాక్షర భారత్ కేంద్రాన్ని తనిఖీ చేయాల్సి ఉన్నా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో పర్యవేక్షణపై శ్రద్ధ చూపడంలేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోందనే విమర్శలున్నారుు. ఎస్బీఐలోనే ఖాతా.. గతంలో కో ఆర్డినేటర్లకు ఏ బ్యాంకులో ఖాతా ఉంటే వారికి అందులోనే వేతనం జమచేసేవా రు. ఈ క్రమంలో ప్రభుత్వం వేతనాల నిధు లు విడుదల చేయనుందని, కోఆర్డినేటర్లు ఎస్బీఐలో ఖాతా తెరవాలని అధికారులు గత నెలలో హుకుం జారీ చేశారు. దీంతో కో ఆర్డినేటర్లు ఎస్బీఐలో ఖాతా తెరిచే పనిలో నిమగ్నమయ్యూరు. దీనికితోడు వేతనం పొందేం దుకు గ్రామపంచాయతీ నుంచి డ్యూటీ సర్టిఫికెట్ సమర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇన్నాళ్లు వేతనం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కో ఆర్డినేటర్లకు బ్యాంకు ఖాతా తెరిచేందుకు రూ.500 అదనపు భారంగా మారింది. కొన్నిచోట్ల డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వడానికి పంచాయతీ సిబ్బంది మామూళ్లు అడుగుతుండడంతో కో ఆర్డినేటర్ల బాధలు వర్ణనాతీతం. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని, పేపర్, ఇతరత్రా బిల్లులు చెల్లించాలని కో ఆర్డినేటర్లు కోరుతున్నారు. ఖర్చులు మేమే భరిస్తున్నం మాకు 2012 అక్టోబర్‌లో వేతనాలు అందించాక ఇప్పటి వర కు వేతనం చెల్లించలేదు. మా జేబులో నుంచే డబ్బులు ఖర్చుపెట్టి మండల కేంద్రంలో సమావేశాలు నిర్వహిస్తున్నం. సాక్షర భారత్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నం. వేతనాలు వస్తాయనే ఆశతో ప్రతినెలా అప్పులు చేస్తూ పోతున్నం. సంక్రాంతి పండుగకైనా వేతనాలు చెల్లిస్తారనుకుంటే ఉత్తదే అరుుంది. ఇలాగైతే పండుగ ఎలా జరుపుకోవాలి. - ఎం.ప్రకాశ్, మండల కో ఆర్డినేటర్, మంచిర్యాల అప్పులు చేస్తున్నం 13 నెలలుగా మాకు వేతనాలు చెల్లించడంలేదు. ఇప్పటికే ప్రతి నెలా అప్పులు చేసి బతుకుతున్నం. ఇప్పుడేమో వేతనం కా వాలంటే ఎస్బీఐలో ఖాతా తె రవాలంటున్నారు. తప్పనిసరి కావడంతో రూ.500 అప్పు చేసి ఖాతా తెరిచా. వేతనాలు సంక్రాంతికి ముందే ఇస్తామన్నారు. డ్యూటీ సర్టిఫికెట్ కావాలంటే అది కూడా సమర్పించిన. కానీ వేతనం మాత్రం చెల్లించలేదు. - ఎం.అపర్ణ, గ్రామ కోఆర్డినేటర్, తీగల్‌పహాడ్ డ్యూటీ సర్టిఫికెట్లు ఇస్తే జీతం 14 నెలలుగా సాక్షర భారత్ కో ఆర్డినేటర్లకు వేతనాలు చెల్లించలేదు. ఇటీవలే ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. కో ఆర్డినేటర్లు వారు పనిచేసిన నెలలకు సంబంధించి ఆయా పంచాయతీల నుంచి డ్యూటీ సర్టిఫికెట్లు సమర్పించాలని 15 రోజుల క్రితం చెప్పాం. ఆయా సర్టిఫికెట్లు మాకు అందగానే వాటిని పరిశీలించి 12 నెలల వేతనాలు వారి ఖాతాల్లో జమచేస్తాం. - రామానుజరావు, వయోజన విద్యా డెప్యూటీ డెరైక్టర్