అర్వపల్లి: గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలని గ్రామపంచాయతీ కార్మికుల సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బోయపల్లి వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్వపల్లిలో జరుగుతున్న సమ్మె శిబిరంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీలు కార్మికులతో 24గంటలు వెట్టిచాకిరి చేయించుకొని నెలకు వేతనం రెండు, మూడు వేలకు మించి ఇవ్వడం లేదన్నారు.
ప్రభుత్వ జీవోల ప్రకారం కనీస వేతనం నెలకు రూ. 15వేలు చెల్లించాలని కోరారు. సమ్మెపై ప్రభుత్వం నోరు మెదపక పోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఊట్కూరి భీముడు, కుంభం రాంమ్మూర్తి, సాయిని యాగానందం, కుంభం నాగరాజు, జె. వెంకన్న, బి. జలేందర్, శ్రీరాములు, పి. సైదులు, సోమనర్సయ్య, వీరయ్య, శ్రీరాములు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.