వీఆర్‌ఏలను విస్మరించడం తగదు | vra s call deeksha in karimnagar distirict | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఏలను విస్మరించడం తగదు

Published Mon, Mar 23 2015 2:13 PM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

vra s call deeksha in karimnagar distirict

కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం అందరి వేతనాలు పెంచి వీఆర్‌ఏలను విస్మరించడం తగదని కరీంనగర్ జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్ అన్నారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం తహశీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏల రిలే నిరాహార దీక్షలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వారధిగా పని చేస్తున్న వీఆర్‌ఏలను సర్కారు గుర్తించకపోవడం బాధాకరమన్నారు. 010 పద్దుతో జీతాలు ఇవ్వడంతో పాటు ప్రమోషన్‌ల జాబితాను అసెంబ్లీ సమావేశాల్లోపే పూర్తి చేయాలని కోరారు.
(సుల్తానాబాద్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement