sultanabad
-
కేటీఆర్: 55 ఏళ్ల ఏమీ చేయని వారు ఇప్పుడు ఏం చేస్తారు?
-
అన్నా.. నేను రాఖీ ఎవరికి కట్టాల్నే..
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): ‘అన్నా.. నువు నన్ను వదిలి వెళ్లిపోయావు.. నేను రాఖీ ఎవరికి కట్టాల్నే.. ఈ రోజే రాఖీ కొని తీసుకువచ్చాను.. ఒక్కగానొక్క అన్నవు.. నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోతే ఎలా.. అన్నా..’ అంటూ మృతుడి సోదరి ఉపాసన రోదించిన తీరు కంటతడి పెట్టిచ్చింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎస్సై ఉపేందర్‌రావు వివరాల ప్రకారం.. సుల్తానాబాద్‌లో పని ఉండడంతో.. కరీంనగర్ నగరంలోని మధీరనగర్(బొమ్మకల్)కు చెందిన నగపూరి ప్రదీప్‌కుమార్–స్వాత్విక దంపతులకు కుమారుడు సంకీర్త్(16), ఉపాసన సంతానం. సంకీర్త్, హౌసింగ్‌బోర్డుకు చెందిన చీయజ్ ఓం, మల్యాల శివమణి ముగ్గురూ మంచి స్నేహితులు. చీయజ్ ఓంకు సుల్తానాబాద్‌లో పని ఉండటంతో ముగ్గురూ కలిసి గురువారం ద్విచక్రవాహనంపై బయలుదేరారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామశివారులో రాజీవ్‌రహదారిపై వీరి బైక్‌ను ట్రాలీవ్యాన్ ఢీకొనడంతో సంకీర్త్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఓం, శివమణిలకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయింది. చదవండి: (వాట్సాప్‌లో న్యూడ్ కాల్.. బ్లాక్మెయిల్) గాయపడినవారిని పోలీసులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. రాఖీ పండుగకు ఒకరోజు ముందుగానే సోదరుడు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో మృతుడి చెల్లి గుండలవిసేలా రోదించింది. సంకీర్త్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మానవత్వం చాటిన పోలీసులు రోడ్డు ప్రమాద సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న కానిస్టేబుళ్లు తిరుపతినాయక్, అశోక్, రమేశ్, రాజు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఓం, శివమణిలను పోలీసువాహనంలోనే కరీంనగర్‌కు తీసుకెళ్లి ఆస్పత్రి లోపలికి ఎత్తుకొని తీసుకెళ్లారు. సంకీర్త్ మృతదేహాన్ని మోసుకొచ్చి పోస్టుమార్టం రూంలో పెట్టడంతో వారిని పలువురు అభినందించారు. -
దారుణం: కుల బహిష్కరణ.. మాట్లాడితే రూ.50వేల జరిమానా
సాక్షి, పెద్దపల్లి: సాంకేతికకాలంలోనూ కుల బహిష్కరణ సంస్కృతి కొనసాగుతోంది. తమ మాట వినడం లేదంటూ మూడు కుటుంబాలను కుల పెద్దలు వెలివేసిన సంఘటన సుల్తానాబాద్ మండలం గట్టెపల్లెలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బహిష్కరణకు గురైన వారిలో ఇద్దరు దివ్యాంగులు కావడం విశేషం. బాధితుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లిలో నల్లవెల్లి సమ్మయ్య, నల్లవెల్లి మల్లయ్య, నల్లవెల్లి రాజయ్య అన్నదమ్ములు. అదే గ్రామానికి చెందిన అబ్దుల్ అలీ వద్ద గతంలోనే గంపగుత్తగా ఆరు గుంటల భూమిని సాదాబైనామాపై కొనుగోలు చేశారు. సదరు స్థలాన్ని కుల సంఘానికి కావాలని వారి కులానికే చెందిన పెద్దలు కోరడంతో ముగ్గురు అన్నదమ్ములు అంగీకరించారు. సదరు స్థలాన్ని అబ్దుల్ అలీతో 2008లో రిజిస్ట్రేషన్ చేయించారు. కొన్నాళ్లక్రితం అబ్దుల్‌అలీ చనిపోయాడు. ఈనేపథ్యంలో సదరు భూమికి కొలతలు వేయగా.. తక్కువగా ఉంది. దీనికి సమ్మయ్య కుటుంబమే కారణమని, కొనుగోలు చేసిన సమయంలోనే భూమికి హద్దులు వేయిస్తే సమస్య ఉండేది కాదని, దీనికి బాధ్యత వహించి మొత్తం స్థలం చూపించాలని కుల పెద్దలు పంచాయితీ పెట్టారు. అయితే తాము కొనుగోలు చేసిన భూమిని అలాగే కుల సంఘానికి విక్రయించామని, ఇందులో తాము తప్పు చేయలేదని ముగ్గురు అన్నదమ్ములు అంటున్నారు. ఈ విషయమై కొద్దిరోజులుగా పంచాయితీ నడుస్తోంది. చదవండి: (సాగర్ కాల్వలో ముగ్గురి గల్లంతు.. వీరంతా కేరళ ఆయుర్వేదిక్ సిబ్బంది) సమస్య పరిష్కారం చూపే వరకూ ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలను కులం నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. వారితో మాట్లాడిన వారికి రూ.50వేల జరిమానా విధిస్తామని హెచ్చరించడంతో అప్పటినుంచి వీరితో కులానికి చెందిన వారెవరూ మాట్లాడడం లేదు. ఈనెల ఒకటో తేదీన బాధితుల పినతల్లి నల్లవెల్లి మల్లమ్మ (75) అనారోగ్యంతో చనిపోయింది. ఆమెను చివరిచూపు చూసేందుకు సమ్మయ్య, మల్లయ్య, రాజయ్య వెళ్తే కుల పెద్దలు అడ్డుచెప్పారు. గత్యంతరం లేక బాధితులు అక్కడి నుంచి వచ్చాక అంత్యక్రియలు పూర్తిచేశారు. తమను కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పేర్కొంటూ సమ్మయ్య మూడు రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన సోదరులు మల్లయ్య, రాజయ్య దివ్యాంగులు అని, కుల సభ్యులు ఎవరూ కనీసం పాలు పోయడం లేదని, సుల్తానాబాద్ నుంచి తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులుగా న్యాయం కోసం స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై పోలీసుల వివరణ కోరగా.. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని, కుల సంఘానికి విక్రయించిన భూమి ప్రస్తుతం లేదని కుల సంఘం పెద్దలు, ప్రతినిధులు చెబుతున్నారని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపడుతామని పేర్కొన్నారు. -
20 లక్షలు ఖర్చు: వారం వ్యవధిలో భార్యాభర్తలు మృతి
సాక్షి, పెద్దపల్లి: ‘పిల్లలూ త్వరలోనే ఆరోగ్యంగా ఇంటికి వస్తా.. భయపడొద్దు’.. అంటూ ధైర్యం చెప్పిన తల్లిని కరోనా కాటేసింది. కరోనాతో నాన్న చనిపోయిన విషయం అమ్మకు తెలియనివ్వలేదని, చికిత్సకు రూ.20లక్షలు పెట్టినా అమ్మానాన్న తమకు దక్కలేదని ఇద్దరు కూతుళ్లు బోరున విలపించారు. వారం వ్యవధిలో కరోనా భార్యాభర్తలను బలి తీసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామానికి చెందిన అయిల సాంబమూర్తి (48) హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడికి కరోనా సోకడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత నెల 27న మృతిచెందాడు. ఈక్రమంలో అతడి భార్య మహిమలత (46) కూడా వైరస్ బారినపడింది. కూతుళ్లు సుశ్మిత, హర్షిత కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటూ మందులు వాడింది. పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతిచెందింది. వీరి ఇద్దరు కూతుళ్లు సుశ్మిత, హర్షిత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వైద్య ఖర్చులకు తోటి ఉద్యోగులు, హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న కాలనీ వాసులు డబ్బులు సమకూర్చారని, దంపతులిద్దరికీ దాదాపు రూ.20లక్షలు ఖర్చు పెట్టినా బతకలేదని బంధువులు తెలిపారు. అనాథలైన ఇద్దరు పిల్లలను ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా గత మార్చి 14న సాంబమూర్తి–మహిమలత వివాహ వార్షికోత్సవాన్ని ఓదెల మండలం కొలనూర్ హైస్కూల్లో క్లాస్‌మెట్స్ ఘనంగా జరిపారు. దీనిని స్మరించుకుంటూ క్లాస్మెంట్స్ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోవిడ్‌కు మరో ముగ్గురు బలి రామగిరి మండలం సెంటినరికాలనీకి చెందిన చిరు వ్యాపారి మంచాల శ్రీనివాస్ కరోనాతో బుధవారం మృతిచెందాడు. గోదావరిఖని ప్రశాంత్‌నగర్‌కు చెందిన యాదగిరి గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో, సంజయ్‌నగర్‌కు చెందిన కృష్ణ కరీంనగర్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. చదవండి: Lockdown: కష్టాలు.. ట్రక్ డ్రైవర్‌గా మారిన నటి -
పరిచయం: మహిళ వేధింపులతో యువకుడి ఆత్మహత్య
సాక్షి, పెద్దపల్లి : ఒక పరిచయం నిండు ప్రాణాన్ని తీసింది. మహిళ వేధింపుల కారణంగా గోదావరిఖని కేకేనగర్‌కు చెందిన కొయ్యాడ రమేశ్(33) సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల మానేరు సమీపంలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఉపేందర్‌రావు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గోదావరిఖని కేకేనగర్‌కు చెందిన కొయ్యాడ రమేశ్ ఫొటోగ్రాఫర్. ఏడాదిక్రితం ఓ వివాహ వేడుకలో పెద్దపల్లికి చెందిన చింతల రమాదేవితో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి ఇద్దరిమధ్య ఫోన్లు, సందేశాలు నడిచాయి. ఈ క్రమంలో రమేశ్ నుంచి రమాదేవి రూ.6లక్షలు, రెండు తులాల బంగారం తీసుకుంది. కొద్దిరోజుల క్రితం రమేశ్ బంగారం, నగదు తిరిగి ఇమ్మని అడిగాడు. దీంతో రమాదేవి ఫోన్‌కాల్స్, చాటింగ్ సందేశాలు బయటపెడతానని బ్లాక్మెయిల్ చేసింది. మార్చి 28న పెద్దపల్లి పోలీసుస్టేషన్లో రమేశ్‌పై కేసు పెట్టింది. తాను నివాసం ఉంటున్న చోట పరువుపోయిందని, వేరే ప్రాంతంలో అద్దెకు ఇళ్లు చూస్తానని భార్యకు చెప్పి మార్చి 30న రమేశ్ బయటకు వెళ్లాడు. సాయంత్రంవరకు రాకపోవడంతో అతడి భార్య లావణ్య ఫోన్ చేసింది. రమాదేవి వేధింపులు భరించలేక చనిపోతున్నానని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. వెంటనే లావణ్య తన భర్త కనిపించడం లేదని గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల తరువాత శుక్రవారం సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామ సమీపంలోని మానేరువాగు వద్ద రమేశ్ మృతదేహం కనిపించింది. లావణ్య ఫిర్యాదుతో రమాదేవిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చదవండి: ప్రేమ పేరుతో మోసం; యువతిని లైంగికంగా వాడుకొని.. -
అస్తమించిన క్రీడా దిగ్గజం..
సాక్షి, కరీంనగర్ : దివ్యాంగ క్రీడాకారులకు ఆయన ఓ స్ఫూర్తి.. ఆదర్శం. దివ్యాంగుడైనా పట్టుదల.. సడలని ఆత్మవిశ్వాసం.. మనోధైర్యంతో ప్రపంచ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచాడు. ఆటే శ్వాసగా ప్రతీ పోటీలో పతకాలు సాధిస్తూ జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాడు. ఆయన క్రీడా ప్రతిభ ముందు వైకల్యం తలవంచింది. చివరికి క్యాన్సర్‌తో ఆయన సాగించిన పోరాటంలో పరాజితుడై తుది శ్వాస విడిచాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన అర్జున అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాస్‌రావు(67) హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో మృతిచెందారు. కార్సినోమా క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ కొంతకాలంగా కోమాలో ఉన్న ఆయన బుధవారం రాత్రి తుదిశ్వాస వదిలారు. స్వగ్రామంలో అంత్యక్రియలు.. శ్రీనివాసరావు స్వగ్రామం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో క్రీడాభిమానుల అశ్రునయనాల మధ్య గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీనివాస్‌రావు మృతదేహం వద్ద సర్పంచ్ వీరగోని సుజాత, ఎంపీటీసీ పులి అనూష నివాళులర్పించారు. ఆయనకు భార్య రమాదేవి, ఇద్దరు కుమారులు, రోహిత్, రోహన్, కూతురు ధృవి ఉన్నారు. మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన శ్రీనివాస్‌రావు వృత్తి రీత్యా ఆర్టీసీలో మెకానిక్‌గా చేరారు. ఉత్తమ దివ్యాంగ ఉద్యోగిగా 1994లో జాతీయ స్థాయి అవార్డును అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాల్ శర్మ చేతుల మీదుగా అందుకున్నారు. దివ్యాంగుల జాతీయ క్రీడా సంఘానికి అనుబంధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ సంఘం ఏర్పాటు చేశారు. 2003లో అర్జున అవార్డు.. 1996లో లండన్‌లో జరిగిన దివ్యాంగుల ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించారు. 2002లో బెంగళూరులో జరిగిన వరల్డ్ పారా బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించారు. దీంతో భారత ప్రభుత్వం 2003లో అర్జున అవార్డు ప్రకటించింది. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పారా అథ్లెట్ల విభాగంలో అర్జున పురస్కారాన్ని పొందిన తొలి శ్రీడాకారుడిగా రికార్డ్ సాధించారు. 2010లో చైనాలోని గ్వాంగ్ జూలో జరిగిన ఏసియన్ పారా ఫెన్సింగ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2004లో మలేసియాలో జరిగిన మెన్స్ డబుల్స్ ఏసియన్ పారా బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం, 2006లో ఇజ్రాయిల్‌లో జరిగిన సింగిల్స్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో కాంస్యం, 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాటన్ రిలేలో ప్రతిభ కనబరిచారు. 2006 నుంచి ముంబయి మారథాన్ రన్లో వరుసగా పాల్గొన్నారు. చివరగా 2018లో బెంగళూర్ జరిగిన రన్లో పాల్గొని కాంస్య పతకం సాధించారు. వైఎస్సార్ పాదయాత్రలో.. దివంగత సీఎం వైఎస్సార్ జిల్లాలో చేపట్టిన పాదయాత్రలో ఆయనతో కలిసి అడుగులు వేశారు. జమ్మికుంట నుంచి పరకాల వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. అర్జున అవార్డు అందుకున్న మాదాసు కు అప్పటి ఏపీ సీఎం వైఎస్సార్ రూ.లక్ష నజరానా అందించారు. 2017లో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం దివ్యాంగ స్ఫూర్తి అవార్డు ప్రదానం చేసింది. ఇంటి స్థలం కోసం.. అర్జున అవార్డు గ్రహీతలకు ప్రభుత్వాలు ఇంటి స్థలాలివ్వడం పరిపాటి. తిమ్మాపూర్ సమీపంలో తనకు 3 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించాలని ప్రభుత్యాలను విన్నవించినా నేటికీ కేటాయింపులు జరగలేదు. పద్మశ్రీ పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయడం గమనార్హం. 2004లో జిల్లా కేంద్రంలో మాదాసు శ్రీనివాస్‌రావు కాలనీని ఏర్పాటు చేసింది. తన అంతర్జాతీయ ప్రతిభతో ఎంతోమంది దివ్యాంగులు క్రీడల్లో భాగస్వాములను చేస్తూ వారికి స్ఫూర్తినిచ్చారు. దీంతో అంజనారెడ్డి, రఘురాం వంటి దివ్యాంగ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. శ్రీనివాస్‌రావు మృతదేహానికి నివాళులరి్పస్తున్న సర్పంచ్ సుజాత -
రెప్పపాటులో ఘోరం
సాక్షి, సుల్తానాబాద్/మంథని : రెప్పపాటులో ఘోరం జరిగింది. అతివేగం, నిర్లక్ష్యం నలుగురిని బలిగొంది. రామగుండం– హైదరాబాద్ రాజీవ్ రహదారి మరోసారి రక్తమోడింది. కాసింత ఏమరపాటు కుటుంబాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని కారు వెనకనుంచి ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. దీంతో మంథని, సుల్తానాబాద్‌లో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సుల్తానాబాద్ మండల కేంద్రానికి చెందిన చదువాల అరుణ్‌కుమార్(37) మంథని పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఆరేళ్లుగా ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు.భార్య సౌమ్య(30), కొడుకు అఖిలేశ్(9), కూతురు శాన్వి(5)తో కలిసి మంథనిలోనే నివాసం ఉంటున్నాడు. తన సోదరుడు సాయికుమార్, బావమరిది ఓం ప్రకాశ్‌ను హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలతో చేర్పించేందుకు కారులో భార్య, పిల్లలతో కలిసి గురువారం వెళ్లారు. వారిని అక్కడ దింపేసి, ఓ శుభకార్యానికి హాజరయ్యారు. రాత్రి 9గంటలకు మంథనికి బయల్దేరారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత వీరు ప్రయాణిస్తున్న కారు సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఆగిఉన్న లారీని వెనకనుంచి ఢీకొట్టింది. ఘటనలో అరుణ్, సౌమ్య, శాన్వీ అక్కడికక్కడే మృతిచెందారు. అఖిలేష్ కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. నాలుగు గంటల శ్రమ.. రోడ్డుపై భారీ శబ్ధం వినిపించడంతో చుట్టుపక్కల వారు తరలివచ్చారు. ప్రమాదాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.పెద్దపల్లి డీసీపీ తాళ్లపల్లి సుదర్శన్‌గౌడ్, ఏసీపీలు హబీబ్‌ఖాన్, వెంకటరమణ, సీఐ రాములు, ఎస్ఐ రాజేశ్ అక్కడికి చేరుకున్నారు. లారీని కారు వేగంగా ఢీకొట్టడంతో నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలన్నీ ఇరుక్కుపోయాయి. వాటిని తీసేందుకు పోలీసులు, స్థానికులు సుమారు నాలుగు గంటలు శ్రమించారు. గ్యాస్‌కట్టర్ తెప్పించి, కారు భాగాలు విడదీసి బయటకు తీశారు. లారీ డ్రైవర్ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ను వద్దని.. కారులో ప్రయాణం చేసిన ప్రతి సమయంలో అరుణ్‌కుమార్ డ్రైవర్‌ను వెంట తీసుకెళ్లేవాడని కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపారు. గురువారం హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలోనూ డ్రైవర్ అందుబాటులో ఉన్నప్పటికి కారులో ఎక్కు వ మంది వెళ్తున్నామని, డ్రైవర్ అవసరం లేదని తానే స్వయంగా కారు నడిపినట్లు తెలిపారు. డ్రైవర్ ఉంటే ప్రాణాలు దక్కేవని రోదించారు. మళ్లొస్తానని.. హైదరాబాద్‌కు వెళ్లే ముందు అరుణ్‌కుమార్ రామగుండంలో నివాసముంటున్న తల్లిదండ్రులు లక్ష్మినారాయణ, రాజేశ్వరీ వద్దకు వెళ్లాడు. నాన్న ఆరోగ్యం బాగా లేక పోవడంతో రూ. 20వేలు, బియ్యం అప్పజెప్పాడు. హైదరాబాద్ వెళ్లి మళ్లొస్తానని చెప్పిన కొడుకు తెల్లవారేసరికి అనంతాలకు వెళ్లాడని తల్లి రోదిస్తూ తెలిపింది. పలువురి పరామర్శ.. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిరుదు రాజమల్లు, చింతకుంట విజయరమణారావు, కాంగ్రెస్ నాయకులు గొట్టిముక్కుల సురేశ్‌రెడ్డి, మున్నూరు కాపు సంఘం నాయకులు రౌతు కనకయ్య, ఆకుల నర్సయ్య, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు అన్నయ్యగౌడ్, ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి, కార్యదర్శి బుచ్చిరెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్, రమణారావు, ప్రసాద్ సుల్తానాబాద్ ప్రభుత్వాస్పత్రి వద్ద మృతదేహాలను పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. అతివేగమే కారణమా..? ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కారు ప్రమాద సమయంలో 130 స్పీడ్‌తో వెళ్లడంతోపాటు అలసటతో నిద్రమత్తు ఉండడం కూడా మరో కారణమవుతుందని ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం పేర్కొన్నారు. ఘటనపై పరిశీలన చేసేందుకు రోడ్లు భవనాల శాఖ అధికారి, తహసీల్దార్, ఎస్ఐ, గ్రామసర్పంచ్లతో ప్రత్యేక టీమ్ ఏర్పాటుచేశామని డీసీపీ తాళ్లపల్లి సుదర్శన్‌గౌడ్ తెలిపారు. పెను విషాదం అరుణ్‌కుమార్ కుటుంబం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో సుల్తానాబాద్, మంథనిలో పెను విషాదం అలుముకుంది. సుల్తానాబాద్ ట్యాంకువీధికి చెందిన అరుణ్‌కుమార్ మొదట గోదావరిఖని 8వకాలనీలో కష్ణవేణి హైస్కూల్లో పనిచేశారు. తరువాత ప్రిన్సిపల్ హోదాలో అదే పాఠశాల మంథనిశాఖకు వచ్చారు. అప్పటి నుంచి పాఠశాలను ఎంతో అభివృద్ధి చేశారు. ఎవరైనా ఆపదలో ఉంటే ఆపన్నఅస్తం అందించేవారు. అరుణ్ భార్య సౌమ్య బోధనారంగంలో స్థిరపడాలని బీఈడీ రెండో సంవత్సరం చదువుతోంది. కొడుకు నాలుగు, కూతురు యూకేజీ చదువుతున్నారు. వీరి మరణవార్త తెలుసుకున్న మంథని, సుల్తానాబాద్‌లోని స్నేహితులు, బంధువులు సుల్తానాబాద్‌లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. -
జాతర మిగిల్చిన విషాదం
సుల్తానాబాద్(పెద్దపల్లి) : పండుగపూట పెద్దపల్లి జిల్లాలో విషాదం అలుముకుంది. సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట గ్రామంలోని సబ్‌స్టేషన్ సమీపంలో జాతరకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ మ హిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో 12 మంది గాయపడ్డారు. సీఐ రాములు వివరాల ప్రకారం.. ఓదెల మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కనుకుంట్ల నారాయణ, స్వామి కుటుంబసభ్యులు గురువారం ట్రాక్టర్లో ఓదెల మండలం కొలనూర్ సమ్మక్క, సారలమ్మ జాతరకు బయల్దేరారు. సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంటకు చేరుకోగానే అతివేగంగా వెళ్తూ ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడింది.ట్రాలీలో కూర్చున్న వారిలో చిలుక అరుణ(38) అక్కడికక్కడే మృతి చెందింది. కనుకుంట్ల స్వరూప, కనుకుంట్ల లచ్చమ్మ, కనుకుంట్ల అక్షిత, కనుకుంట్ల మల్లమ్మ, కస్తూరి, కంకటి శ్రీలత, రాజమ్మ, లలిత, పుష్ప, తిరుమల, లక్ష్మి, సాత్విక, శివకుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గొట్టె ముక్కుల సురేష్‌రెడ్డి తనవాహనంలో సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమచికిత్స అందించి కరీంనగర్ తరలించారు. ఘటనాస్థలాన్ని సీఐ రాములు పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబంలో విషాదం చిలుక అరుణ మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. అరుణకు భర్త వెంకటస్వామి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.కాగా మృతురాలి కుటుంబానికి రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రకటించారు. -
గుడిలోకి వచ్చిన ఎలుగుబంటి
సాక్షి, సుల్తానాబాద్: మండలంలోని కనుకుల గ్రామపంచాయతీ రాములపల్లె శ్రీ రామాలయంలో శనివారం రాత్రి 10 గంటలకు భల్లూకం దూసుకురావడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. గణపతి నవరాత్రులు కావడంతో భక్తులు పూజలు చేస్తుండగా సమీపంలోని గుట్టల నుంచి భల్లూకం గ్రామంలోకి వచ్చి ఆలయంలోని నవగ్రహాల మందిరంలోకి చొరబడింది. దీంతో మొదట భయపడ్డప్పటికీ ధైర్యం చేసిన యువకులు తలుపులు గడియ పెట్టారు. అనంతరం పోలీసులు, అటవీ శాఖాధికారులకు సమాచారం అందించగా సుల్తానాబాద్ ఎస్సై రాజు, ఆటవీ శాఖాధికారులు వచ్చి చాకచక్యంగా ఎలుగుబంటిని పట్టుకున్నారు. -
రామక్కా... మజాకా..!
గొలుసు దొంగను తన్ని తరిమిన వృద్ధురాలు సుల్తానాబాద్ రూరల్: మెడలోని బంగారు గొలుసు ను చోరీ చేసేందుకు యత్నించిన దొంగను ఓ వృద్ధు రాలు ప్రతిఘటించి తన్ని తరిమిన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్‌లో గురువారం చోటుచేసుకుంది. సుల్తానాబాద్‌లోని గాంధీనగర్ కు చెందిన గోలి రామక్క(80) భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఈమెకు నలుగురు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రామ క్క ఒంటరిగా ఇంట్లో ఉంటోంది. ఎప్పటిమాదిరిగానే వేకువజామున 5.30 గంటలకే నిద్రలేచి తలుపులు తెరిచింది. ఇదే అదనుగా పొంచి ఉన్న ఓ దొంగ ఆమెపై దాడి చేశాడు. మంచంపై ఉన్న దుప్పటిని ఆమె ముఖంపై కప్పి పిడిగుద్దులు గుద్దాడు. పక్కనే ఉన్న బకెట్‌లోని నీళ్లు పోశాడు. నోటిని అదిమిపట్టా డు. తలను గోడకు కొట్టగా ఆమె కిందపడిపోయింది. మెడలోని 3 తులాల బంగారు గొలుసును లాగగా తెగి కిందపడింది. వెంటనే తేరుకున్న రామక్క కాళ్లతో దొంగను తన్ని గట్టిగా అరిచింది. కంగుతిన్న దొంగ ఖాళీ చేతులతో పరారయ్యాడు. స్థానికులు, కుటుంబసభ్యులు రామక్కను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె ధైర్యాన్ని పలువురు మెచ్చుకున్నారు. -
కరెన్సీ గణేషుడు
రూ.9,99,999లతో అలంకరణ సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని స్వప్నకాలనీలోని వినాయకుడిని రూ.9,99,999 కరెన్సీతో ఉత్సవ కమిటీ సభ్యులు అలంకరించారు. కరెన్సీ నోట్లతో దండలు పేర్చి గణేషునితోపాటు మండపాన్ని చూడముచ్చటగా ముస్తాబు చేశారు. సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నగునూరి అశోక్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మాడూరి ప్రసాద్, మండల రైస్‌మిల్లర్స్ ప్రతినిధులు చకిలం మారుతి పలువురు పాల్గొన్నారు. -
సుల్తానాబాద్‌లో ఉద్రిక్తత
సుల్తానాబాద్: కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో ఎస్సారెస్సీ నీళ్ల కోసం టీడీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. టీడీపీ జిల్లా అధ్యక్షులు విజయరమణారావు ఆధ్వర్యంలో రైతులు, తెలుగు తమ్ముళ్లు రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎండిపోతున్న పంటలను కాపాడటానికి కాలువకు నీటిని విడుదల చేయాలని రెండు గంటలపాటు రాస్తారోకో చేయడంతో అధికారుల నుంచి స్పందన కనిపంచక పోవడంతో ఆగ్రహానికి గురైన తెలుగు తమ్ముళ్లు ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పాటు ఎస్సారెస్సీ సీఈ కార్యాలయం పై దాడి చేసి ఫర్నీచర్ ధ్వసం చేశారు. -
ప్రేమికుడి ఆత్మహత్య
సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండల కేంద్రంలోని పాత జెండాకు చెందిన కోటగిరి నాగరాజు (28) ఆదివారం మృతి చెందినట్లు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం వరంగల్‌కు చెందిన యువకునితో నిశ్చితార్థం ఉండగా మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చనిపోయే ముందు నాలుగు పేజీల లేఖను రాసి మంచం పక్కన పెట్టినట్లు వారు తెలిపారు. నాగరాజు ఐదేళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన యువతిని తాను ప్రేమించానని.. మూడేళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తుండగా ప్రేమికులిద్దరు కుటుంబసభ్యులకు పెళ్లి విషయం చెప్పినట్లు లేఖలో పేర్కొన్నాడు. యువతి కుటుంబసభ్యులు తనపై దాడి చేశారని మృతుడు తెలిపాడు. సోదరుడు వినోద్ సైతం పోలీసులకు తన అన్న నాగరాజు చనిపోయేందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. -
ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి
టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు సుల్తానాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి డీ–86, డీ–83 కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలంటూ సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు మాట్లాడుతూ ఎస్సారెస్పీ ప్రస్తుతం 20 టీఎంసీల నీరు నిలువ ఉందన్నారు. కాలువల ద్వారా నీటిని విడుదల చేసి గ్రామాల్లో చెరువులు, కుంటలను నింపాలని కోరారు. నీటి విడుదలలో జాప్యం చేస్తే తమ ఆందోళను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. రైతులకు రుణమాఫీ వర్తించడం లేదని.. ప్రభుత్వం హరితహారం పేరిట కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో మహేందర్, ప్రకాశ్‌రావు, డీసీఎంస్ జిల్లా డైరెక్టర్ కల్లెపల్లి జాని, మండల నాయకులు అబ్బయ్యగౌడ్, కిశోర్, చిలుక సతీష్, తిరుపతి, రాజలింగం, మహేష్, మల్లయ్య. రామన్న, తాహేర్, మ«ధు, గణేష్, శంకర్‌గౌడ్, నిరంజన్ పాల్గొన్నారు. -
పాపం.. పసిగుడ్డు
♦ పుట్టుకతోనే క్యాన్సర్ ♦ ఏడు నెలలుగా మృత్యువుతో పోరాటం ♦ ఆపన్నహస్తం కోసం తల్లిదండ్రుల వేడుకోలు సుల్తానాబాద్: చూడముచ్చటగా ఉన్న ఈ చిన్నారికి క్యాన్సర్ వ్యాధిసోకి మృత్యువుకు చేరువలో ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబం గడవడమే కష్టం కావడంతో పెద్ద రోగానికి చికిత్స చేరుుంచేందుకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. దాతల కోసం ఎదురుచూస్తున్నారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంటకు చెందిన ఏరుకొండ వేణు-ఉమాదేవి దంపతుల కుమార్తె విరోనిత. అమ్మారుు పుట్టినప్పటి నుంచి తరచూ అస్వస్థతకు గురవుతుండటంతో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రులు తిరిగారు. పాప పట్టుకతోనే క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. కూలీ చేసుకొని బతికే వేణు దంపతులు ఇప్పటికే సుమారుగా రూ. మూడు లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. చికిత్సకు మరో ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని వైద్యులు పేర్కొన్నారు. రెండు రోజుల నుంచి పాప పరిస్థితి విషమించడంతో శనివారం మీడియా ముందుకు వచ్చారు. ప్రభుత్వం గాని, దాతలు గాని స్పందించి తమ బిడ్డను బతికించాలని వేడుకున్నారు. అనంతరం పాపను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక సహాయం చేయదల్చినవారు వేణును 9000448052, 9701671365 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. లేదా ఏరుకొండ వేణు, ఎస్బీఐ అకౌంట్ నంబరు 20168418439, ఐఎఫ్ఎస్ఐ కోడ్ 0012904లో డబ్బులు వేయూలని కోరుతున్నారు. -
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్: నలుగురికి తీవ్రగాయాలు
సుల్తానాబాద్ (కరీంనగర్) : ఆగివున్న లారీని ఆర్టీసీ బస్ ఢీకొనడంతో నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో ఆదివారం ఉదయం జరిగింది. సుల్తానాబాద్‌లోని సంగ్లంపల్లి వద్ద ఆగి ఉన్న లారీని కరీంనగర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన చుక్కల భూలక్ష్మీ (40), భూపతిపూర్‌కు చెందిన చంద్రయ్య(70), ఆయన భార్య సాయమ్మ(65)తో పాటు మరో మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. -
పది లక్షల కోసం ప్రాణం తీశారు
హత్య కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితుల అరెస్టు మరో ముగ్గురి కోసం గాలింపు ధర్మపురి : ధర్మపురి శివారులోని రామయ్యపల్లెలో గత నెల 25న జరిగిన హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. రూ.10 లక్షల కోసం ఇద్దరు వ్యక్తులు సుల్తానాబాద్‌కు చెందిన పాలాజి రామయ్య(59)ను కిరాతకంగా హత్య చేశారు. అనంతరం అనుమానం రాకుండా మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేసినట్లు నిర్ధారించారు. నిందితులు గర్రెపెల్లి శ్రీనివాస్, పరశురాములును ధర్మపురి సీఐ వెంకటరమణ గురువారం అరెస్ట్ చూపారు. ఆయన కథనం ప్రకారం.. సుల్తానాబాద్‌కు చెందిన రామయ్య గ్రామంలో వడ్రంగి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతడికి రాజీవ్ రహదారిని అనుకుని ఉన్న స్థలాన్ని పెట్రోల్ బంక్ కోసం గర్రెపెల్లి శ్రీనివాస్‌కు లీజుకు ఇచ్చాడు. సుమారు రూ.10 లక్షల లీజు డబ్బులు బకాయి పడడంతో ఈ విషయమై రామయ్య, శ్రీనివాస్‌కు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం శ్రీనివాస్ రూ.10 లక్షల చెక్కును రామయ్యకు ఇచ్చాడు. అది బౌన్స కావడంతో మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో విసుగు చెందిన శ్రీనివాస్ రామయ్యను హత్య చేయాలని పథకం పన్నాడు. ఈ మేరకు ఇద్దరు కిరాయి రౌడీలను మాట్లాడి వారికి రూ.25 వేల చొప్పున రూ.50 వేలు ముట్టజెప్పాడు. అయితే ఈ ప్లాన్ బెడిసికొట్టింది. డబ్బులు తీసుకున్నవారు హత్య చేయకపోగా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో శ్రీనివాస్ రంగంలోకి దిగాడు. గత నెల 25న డబ్బులు ఇస్తానని రామయ్యకు చెప్పాడు. అదే రోజు కరీంనగర్ మండలం చింతకుంటకు చెందిన పరశురాములుతో కారులో ఇంటికి వచ్చి రామయ్యను తీసుకెళ్లాడు. కారు కరీంనగర్ శివారుకు రాగానే పరశురామ్ రామయ్యకు క్లోరోఫాం ఉన్న చేతిరుమాలు వాసనచూపడంతో స్పృహ కోల్పోయాడు. అనంతరం స్థానిక చల్మెడ ఆనందరావు ఆస్పత్రి సమీపంలో పరశురాములు వెంటతెచ్చుకున్న కత్తితో రామయ్య గొంతుకోశాడు. మృతదేహాన్ని ధర్మపురి శివారులోని రామయ్యపల్లెకు తీసుకెళ్లి ముళ్లపొదల్లో పడేసి పెట్రోల్‌పోసి దహనం చేశారు. 29వ తేదీన గుర్తించి గుర్తుతెలియని వ్యక్తి హత్యగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గూడెంగుట్ట వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన శ్రీనివాస్, పరశురాములును అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా రామయ్యను హత్య చేసినట్లు అంగీకరించారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. రామయ్యను హత్యచేసేందుకు డబ్బులు తీసుకున్న అనిల్, సమ్మయ, అమర్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. హత్య కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితుల అరెస్టు మరో ముగ్గురి కోసం గాలింపు ధర్మపురి : ధర్మపురి శివారులోని రామయ్యపల్లెలో గత నెల 25న జరిగిన హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. రూ.10 లక్షల కోసం ఇద్దరు వ్యక్తులు సుల్తానాబాద్‌కు చెందిన పాలాజి రామయ్య(59)ను కిరాతకంగా హత్య చేశారు. అనంతరం అనుమానం రాకుండా మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేసినట్లు నిర్ధారించారు. నిందితులు గర్రెపెల్లి శ్రీనివాస్, పరశురాములును ధర్మపురి సీఐ వెంకటరమణ గురువారం అరెస్ట్ చూపారు. ఆయన కథనం ప్రకారం.. సుల్తానాబాద్‌కు చెందిన రామయ్య గ్రామంలో వడ్రంగి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతడికి రాజీవ్ రహదారిని అనుకుని ఉన్న స్థలాన్ని పెట్రోల్ బంక్ కోసం గర్రెపెల్లి శ్రీనివాస్‌కు లీజుకు ఇచ్చాడు. సుమారు రూ.10 లక్షల లీజు డబ్బులు బకాయి పడడంతో ఈ విషయమై రామయ్య, శ్రీనివాస్‌కు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం శ్రీనివాస్ రూ.10 లక్షల చెక్కును రామయ్యకు ఇచ్చాడు. అది బౌన్స కావడంతో మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో విసుగు చెందిన శ్రీనివాస్ రామయ్యను హత్య చేయాలని పథకం పన్నాడు. ఈ మేరకు ఇద్దరు కిరాయి రౌడీలను మాట్లాడి వారికి రూ.25 వేల చొప్పున రూ.50 వేలు ముట్టజెప్పాడు. అయితే ఈ ప్లాన్ బెడిసికొట్టింది. డబ్బులు తీసుకున్నవారు హత్య చేయకపోగా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో శ్రీనివాస్ రంగంలోకి దిగాడు. గత నెల 25న డబ్బులు ఇస్తానని రామయ్యకు చెప్పాడు. అదే రోజు కరీంనగర్ మండలం చింతకుంటకు చెందిన పరశురాములుతో కారులో ఇంటికి వచ్చి రామయ్యను తీసుకెళ్లాడు. కారు కరీంనగర్ శివారుకు రాగానే పరశురామ్ రామయ్యకు క్లోరోఫాం ఉన్న చేతిరుమాలు వాసనచూపడంతో స్పృహ కోల్పోయాడు. అనంతరం స్థానిక చల్మెడ ఆనందరావు ఆస్పత్రి సమీపంలో పరశురాములు వెంటతెచ్చుకున్న కత్తితో రామయ్య గొంతుకోశాడు. మృతదేహాన్ని ధర్మపురి శివారులోని రామయ్యపల్లెకు తీసుకెళ్లి ముళ్లపొదల్లో పడేసి పెట్రోల్‌పోసి దహనం చేశారు. 29వ తేదీన గుర్తించి గుర్తుతెలియని వ్యక్తి హత్యగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గూడెంగుట్ట వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన శ్రీనివాస్, పరశురాములును అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా రామయ్యను హత్య చేసినట్లు అంగీకరించారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. రామయ్యను హత్యచేసేందుకు డబ్బులు తీసుకున్న అనిల్, సమ్మయ, అమర్ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. -
ఆటో, అంబులెన్స్ ఢీ: 8 మందికి గాయాలు
సుల్తానాబాద్ (కరీంనగర్) : సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి స్టేజీ వద్ద ఆగి ఉన్న ఆటోను పెద్దపల్లి వైపు వెళ్తున్న ఓ అంబులెన్స్ ఢీకొట్టింది. మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 8 మందికి తీవ్రగాయాలయ్యాయి.స్థానికులు గమనించి 108 అంబులెన్స్‌కు సమాచారాన్ని అందించారు. హుటాహుటిన క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
యువతి ఆత్మహత్య
సుల్తానాబాద్ (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామపంచాయతీ పరిధిలోని దేవునిపల్లికి చెందిన కొండపాక రమ్య(20) అనే యువతి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. రమ్య కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నప్పటికీ నయం కాలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు గమనించి కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందినట్లు ఆయన తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి లక్ష్మణాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఆలయంలో చోరీ
సుల్తానాబాద్ (కరీంనగర్) : మండలంలోని కాట్నపల్లి రామలింగేశ్వరాలయంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు హుండీని ఎత్తుకెళ్లారు. కొంతదూరం తీసుకువెళ్లి హుండీని పగులగొట్టి అందులోని సొమ్ముతో ఉడాయించారు. స్థానిక ఆలయ కమిటీ చైర్మన్ చీటి కేశవరావు మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై ఇంద్రసేనారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
'ప్రకటన సరే.. ఆచరణలో పెట్టండి'
సుల్తానాబాద్ (కరీంనగర్) : రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6 లక్షలు ఇస్తామని ప్రకటన చేయడం బాగానే ఉన్నప్పటికీ.. దాన్ని వెంటనే ఆచరణలో పెట్టాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల సూర్యప్రకాశ్ ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత నేత వైఎస్సార్ మరణించారనే సమాచారం విని తట్టుకోలేక మృతిచెందినవారి కుటుంబసభ్యులను పరామర్శించడం కోసం జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పరామర్శ యాత్రను జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. -
వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
కరీంనగర్ (సుల్తానాబాద్) : సుల్తానాబాద్ కూరగాయల మార్కెట్ వద్ద కాసర్ల మల్లమ్మ(80) అనే వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. వృద్ధురాలు గట్టిగా అరిచినా దగ్గర ఎవరూ లేకపోవడంతో లాభం లేకపోయింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
11క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
సుల్తానాబాద్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు నుంచి రెండు ట్రాలీలలో అక్రమంగా తరలిస్తున్న 11 క్వింటాళ్ల పీడీఎస్(రేషన్) బియ్యాన్ని మంగళవారం పట్టుకున్నట్లు డీటీసీఎస్ మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. రేషన్‌బియ్యాన్ని తరలిస్తున్న చింతల కనకయ్య, తూర్పాటి నరేష్, చింతల సత్యనారాయణలపై 6ఎ కేసు నమోదు చేసి ఆటోలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బియ్యాన్ని ఎంఎల్ఎస్ గోదాము పాయింట్‌కు తరలించినట్లు వివరించారు. -
గుడుంబా స్థావరాలపై దాడులు
సుల్తానాబాద్ (కరీంనగర్) : గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్, పోలీసుశాఖ దృష్టిసారించింది. సర్కార్ ఆదేశాలతో స్పీడును పెంచాయి. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎక్సైజ్ కమీషనర్ అతుల్ సబర్వాల్ దాడులు చేయాలని వీడియో కాన్ఫరెన్స్‌లో ఎక్సైజ్ అధికారులను ఆదేశించడంతో.. రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులు సోమవారం చిన్నరాతుపల్లి, పెద్దరాతుపల్లి, పందిల్ల, ముప్పిరితోట గ్రామాలతో పాటు నర్సాపూర్, కొదురుపాక, పూసాల, గర్రెపల్లి, రేగడిమద్దికుంట, తొగర్రాయి, మంచరామి గ్రామాల్లో స్థావరాలపై దాడులు చేసి వందలాది లీటర్ల గుడుంబా, నాటుసారాను ధ్వంసం చేసి 20 మందికిపైగా కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. -
'పర్యావరణాన్ని పరిరక్షిద్దాం'
సుల్తానాబాద్ (కరీంనగర్) : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సమిష్టిగా గణేషుని మట్టి ప్రతిమలనే ఏర్పాటు చేసుకోవాలని సీఐ తులా శ్రీనివాస్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో శనివారం పీస్‌కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నందున మైక్సెట్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని కోరారు. మతసామరస్యాన్ని పాటించాలని సూచించారు. రాత్రి వేళల్లో మండపాల వద్ద మద్యం, అశ్లీలతకు తావివ్వరాదని సూచించారు.