కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామపంచాయతీ పరిధిలోని దేవునిపల్లికి చెందిన కొండపాక రమ్య(20) అనే యువతి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఇంద్రసేనారెడ్డి తెలిపారు.
సుల్తానాబాద్ (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామపంచాయతీ పరిధిలోని దేవునిపల్లికి చెందిన కొండపాక రమ్య(20) అనే యువతి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. రమ్య కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నప్పటికీ నయం కాలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బెడ్‌రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కుటుంబసభ్యులు గమనించి కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందినట్లు ఆయన తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి లక్ష్మణాచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.