సుల్తానాబాద్ (కరీంనగర్) : ఆగివున్న లారీని ఆర్టీసీ బస్ ఢీకొనడంతో నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో ఆదివారం ఉదయం జరిగింది. సుల్తానాబాద్‌లోని సంగ్లంపల్లి వద్ద ఆగి ఉన్న లారీని కరీంనగర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన చుక్కల భూలక్ష్మీ (40), భూపతిపూర్‌కు చెందిన చంద్రయ్య(70), ఆయన భార్య సాయమ్మ(65)తో పాటు మరో మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.