
లారీ, ఆర్టీసీ బస్సు ఢీ, ఇద్దరు మృతి
జగిత్యాల: జిల్లాలోని మేడిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీ, ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో లారీ డ్రైవర్, క్లీనర్‌లు మృతి చెందారు. కాగా, బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది గాయాలపాలైయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.