దాచేపల్లి: వేగంగా వెళ్తున్న బస్సును పెట్రోల్ బంక్ నుంచి బయటకు వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గుంటూరు జిల్లా దాచెపల్లి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగింది.
నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సును పెట్రోల్ బంక్ నుంచి బయటకు వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వేపూరి కొండయ్య(35) అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
ఆర్టీసీ బస్సు- లారీ ఢీ: ప్రయాణికుడి మృతి
Published Tue, Nov 3 2015 8:02 AM | Last Updated on Sun, Apr 7 2019 3:23 PM
Advertisement
Advertisement