సుల్తానాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి డీ–86, డీ–83 కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలంటూ సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు మాట్లాడుతూ ఎస్సారెస్పీ ప్రస్తుతం 20 టీఎంసీల నీరు నిలువ ఉందన్నారు.
-
టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు
సుల్తానాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి డీ–86, డీ–83 కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలంటూ సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు మాట్లాడుతూ ఎస్సారెస్పీ ప్రస్తుతం 20 టీఎంసీల నీరు నిలువ ఉందన్నారు. కాలువల ద్వారా నీటిని విడుదల చేసి గ్రామాల్లో చెరువులు, కుంటలను నింపాలని కోరారు. నీటి విడుదలలో జాప్యం చేస్తే తమ ఆందోళను తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
రైతులకు రుణమాఫీ వర్తించడం లేదని.. ప్రభుత్వం హరితహారం పేరిట కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో మహేందర్, ప్రకాశ్‌రావు, డీసీఎంస్ జిల్లా డైరెక్టర్ కల్లెపల్లి జాని, మండల నాయకులు అబ్బయ్యగౌడ్, కిశోర్, చిలుక సతీష్, తిరుపతి, రాజలింగం, మహేష్, మల్లయ్య. రామన్న, తాహేర్, మ«ధు, గణేష్, శంకర్‌గౌడ్, నిరంజన్ పాల్గొన్నారు.