సుల్తానాబాద్ (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రేగడిమద్దికుంట గ్రామంలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2600ల లీటర్ల బెల్లం పానకం, 35 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సీఐ రాకేష్ తెలిపారు. ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గుడుంబా తయారీకి ఉపయోగించే డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు.