సారా ముడిసరుకు స్వాధీనం | Excise officials raid in Mancherial | Sakshi
Sakshi News home page

సారా ముడిసరుకు స్వాధీనం

Published Fri, Sep 11 2015 3:05 PM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

Excise officials raid in Mancherial

మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో సారా తయారీకి వినియోగించే ముడి సరుకును పెద్ద మొత్తంలో ఎక్సైజ్ సిబ్బంది శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని ఆంధ్రా కాలనీలో ఓ గోదాముపై అధికారులు సిబ్బందితో కలసి ఆకస్మిక దాడులు నిర్వహించారు.

గోదాములో నిల్వ ఉంచిన రూ.5.5 లక్షల విలువ జేసే 12 టన్నుల నల్ల బెల్లం, 15 టన్నుల పటిక, 3 టన్నుల అమ్మోనియాను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పలంచి ప్రతాప్ అనే వ్యక్తి వీటిని నిల్వ చేసినట్టు గుర్తించి అతడిపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ డి.శ్రీనివాస్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ కరంచంద్, సీఐలు, శ్రీనివాస్, యాకూబ్ అలీ, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement