సుల్తానాబాద్, న్యూస్‌లైన్: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలలో మరో రెండు అవినీతి చేపలు చిక్కాయి. శుక్రవారం లంచం తీసుకుంటూ సుల్తానాబాద్ ఎస్టీ వో వీ.రమేశ్‌కుమార్, సీనియర్ అకౌంటెంట్ నక్క తిరుమలేశ్ పట్టుబడ్డారు. మండలకేంద్రానికి చెందిన మస్తాన్ నాగరాజు తండ్రి డెత్ రిలీ ఫ్‌ఫండ్, డీఏ, ఏరియర్స్ ఇచ్చేందుకు ఆయన వద్ద రూ.15వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ తాళ్లపెల్లి సుదర్శన్‌గౌడ్ రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. నాగరాజు తండ్రి బాలయ్య ఎస్సారెస్పీలో లస్కర్‌గా పని చేస్తూ 2005లో ఉద్యోగ విరమ ణ పొందాడు. ఈఏడాది జనవరిలో అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో ఆయనకు వచ్చే పింఛన్ కోసం ఆయన కొడుకు నాగరాజు ఎస్టీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నా డు. కుటుంబ సభ్యుల ధ్రువీకరణపత్రం, డెత్ సర్టిఫికెట్ సమర్పించారు.
బాలయ్య కు రావాల్సిన డెత్ రిలీఫ్ ఫండ్, డీఏ, ఏరి యర్స్ కలిపి రూ.1.9లక్షలు రావాల్సి ఉంది. ఈడబ్బుల కోసం నాగరాజు కాళ్లరిగేలా తిరిగా డు. అధికారులు రేపు మాపని తిప్పుకుంటున్నారు. సహ నం కోల్పోయిన బాధితుడు నిల దీయగా రూ. 30వేలు ఇస్తేనే రావాల్సిన డబ్బులు ఇస్తామన్నారు. ఉన్నత చదువులు చదువుతున్న తాను పేదరికంలో మగ్గుతున్నానని, తన తండ్రి పిం ఛన్ మంజూరు చేయాలని కళ్లావేళ్లాపడ్డా కనికరించలేదు. రాజకీయ నాయకులతో చెప్పిం చి నా ప్రయోజనం లేకపోయింది.
దీంతో బాధితుడు ముందుగా రూ.15వేలు ఇస్తానని, డబ్బు లు మంజూరైన తరువాత మిగితా రూ. 15వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నా డు. ఎస్టీవో రమేశ్‌కుమార్, అకౌంటెంట్ తిరుమలేశ్ చెప్పిన ప్రకారం శుక్రవారం రూ.15 వేలు తెచ్చి ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్, సీఐలు రమణమూర్తి, విజయభాస్క ర్, శ్రీనివాస్‌రాజు, హెచ్‌సీలు ఆనంద్, వెం కటస్వామి దాడి చేసి పట్టుకున్నారు. సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎస్టీవో, అకౌం టెంట్‌ను శనివారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్డులో హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు, రెవెన్యూ, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లంచం కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నట్లు చెప్పారు. విచారణ జరిపి పట్టుకుం టున్నామన్నారు.
లంచాల ఎస్టీవో
Published Sat, May 31 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 AM
Advertisement
Advertisement