గుడిలోకి వచ్చిన ఎలుగుబంటి | Bear Enters Temple, Know how cops nab it | Sakshi
Sakshi News home page

గుడిలోకి వచ్చిన ఎలుగుబంటి

Published Sun, Aug 27 2017 11:15 AM | Last Updated on Tue, Sep 12 2017 1:07 AM

Bear Enters Temple, Know how cops nab it

సాక్షి, సుల్తానాబాద్‌: మండలంలోని కనుకుల గ్రామపంచాయతీ రాములపల్లె శ్రీ రామాలయంలో శనివారం రాత్రి 10 గంటలకు భల్లూకం దూసుకురావడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. గణపతి నవరాత్రులు కావడంతో భక్తులు పూజలు చేస్తుండగా సమీపంలోని గుట్టల నుంచి భల్లూకం గ్రామంలోకి వచ్చి ఆలయంలోని నవగ్రహాల మందిరంలోకి చొరబడింది.

దీంతో మొదట భయపడ్డప్పటికీ ధైర్యం చేసిన యువకులు తలుపులు గడియ పెట్టారు. అనంతరం పోలీసులు, అటవీ శాఖాధికారులకు సమాచారం అందించగా సుల్తానాబాద్‌ ఎస్సై రాజు, ఆటవీ శాఖాధికారులు వచ్చి చాకచక్యంగా ఎలుగుబంటిని పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement