
మల్కన్‌గిరి: జిల్లాలోని మల్కన్‌గిరి సమితి సీక్‌పల్లి పంచాయతీ ఎంవీ 17 గ్రామం వద్ద మంగళవారం రాత్రి అంగన్‌వాడీ కేంద్రం వద్దనున్న ట్రాన్స్‌ఫార్మర్ వైరు తగిలి ఒక ఎలుగుబంటి మృతి చెందింది. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన రైతులు చూసి మల్కన్‌గిరి అటవీ శాఖ వారికి సమాచారం ఇవ్వగా, వారు వెళ్లి చూసేసరికి మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని అటవీ శాఖ అడవిలో పూడ్చివేశారు.