Ramalayam Temple
-
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సైంటిస్ట్ సతీష్ రెడ్డికి ఆహ్వానం!
ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు నేరవేరుతోంది. కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం దశాబ్దాల పోరాటం. ఇవాళ అది సాకారం కానుంది. ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఆ ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రుముఖ శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన బలరాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంబోత్సవ కార్యక్రమంలో యావత్త్ దేశం ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఇదిలా ఉండగా ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పలువు ప్రముఖులు, సెలబ్రెటీలకు ఆహ్వానాలు అందాయి. తాజాగా రక్షణశాఖ శాస్త్రీయ సలహాదారు సైంటిస్ట్ సతీష్ రెడ్డిగారికి కూడా ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరగనున్న రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫు నుంచి ఆయనకు ఆహ్వానం అందడం విశేషం. కాగా, ఆయన రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా ఉండటమేగాక రక్షణ వ్యవస్థల, సాంకేతికతలలో భారతదేశ అభివృద్ధికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన క్షిపణులు, యుద్ధ విమానాలు, మానవ రహిత వైమానికి రక్షణ వ్యవస్థలు, రాడార్ వంటి వ్యవస్థల అభివృద్ధికి కృషి చేశారు. అంతేగాక ఆయన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ గవర్నింగ్ బాడీ చైర్మన్‌గా కూడా సేవలందించారు. (చదవండి: అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!) -
'రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదు'
లక్నో: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని ఎన్సీపీ నేత శరద్ పవార్ చెప్పారు. రామ మందిరాన్ని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుందో లేదో చెప్పడం కష్టమని ఆయన అన్నారు. ఎదైతేనేం.. రామాలయం ఏర్పడైనందుకు సంతోషిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో ఎంతో మంది సహకారం ఉందని అన్నారు. అయోధ్యలో జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లతో సహా దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులకు ఆహ్వానాలు అందాయి. దాదాపు 6000 మందికిపైగా ఈ వేడుకకు హాజరుకానున్నారు. డిసెంబర్ 30న అయోధ్యలో ఎయిర్‌పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇదీ చదవండి: ఇది ఇంగ్లాండ్ కాదు.. కన్నడ భాషా వివాదంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు -
మహబూబాబాద్: మైక్ సెట్ రిపేర్ చేస్తుండగా షాక్.. ముగ్గురి మృతి
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని డోర్నకల్ మండలం అందనాలపాడులో విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి కురిసిన గాలివానకు గ్రామంలోని రామాలయం గుడిపై ఉన్న మైక్ సెట్ దెబ్బతింది. దెబ్బతిన్న మైక్ సెట్ సరి చేస్తుండగా.. కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతుల్ని సుబ్బారావు, మస్తాన్ రావు, వెంకయ్యలుగా నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. -
పల్నాడులో దొంగలు హల్ చల్..!!
-
‘ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను’
మహానంది: ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్న చందంగా ..ఓ పిల్లి కూన మహానందిలోని రామాలయం హుండీలోకి దూరింది. అందులో నుంచి బయటికి రాలేకపోయింది. శుక్రవారం ఉదయం విధులకు వచ్చిన అర్చకులు గుర్తించి విషయాన్ని ఈఓ మల్లికార్జున ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. దేవదాయశాఖ నిబంధనల ప్రకారం హుండీల తాళాలు ఒకసెట్ దేవస్థానం వారి వద్ద, మరో సెట్ కర్నూలులోని ఏసీ కార్యాలయంలో ఉంటాయి. దీంతో ఈఓ విషయాన్ని ఏసీ దృష్టికి తీసుకెళ్లడంతో దేవదాయశాఖ నంద్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి కర్నూలుకు వెళ్లి తాళాలు తీసుకొచ్చారు. అనంతరం ఈఓ సమక్షంలో సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో హుండీ తాళాలు తెరచి పిల్లిపిల్లను బయటికి తీశారు. బయటికి వచ్చి వెంటనే అది తల్లి వద్దకు పరుగుపెట్టుకుంటూ వెళ్లింది. చదవండి: మాయమాటలతో బాలికను లొంగదీసుకుని.. విషాదం: కన్నీరే మిగిలిందిక నేస్తం! -
రామయ్య పెళ్లికి రండి
సాక్షి, లింగాలఘణపురం(వరంగల్) : భద్రాచల రామాలయం రాముడి ప్రేమకు గుర్తయితే జీడికల్ వీరాచలం ఆయన వీరత్వానికి ప్రతీతిగా భక్తులు చెప్పుకుంటారు. కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి జీడికల్ పున్నమిగా పేరు ప్రఖ్యాతులు గడించిం దంటే ఎంత ప్రాశస్త్యం కలిగిన జాతరో అర్థమౌతుంది. త్రేతాయుగంలో స్వయంభువుగా వెలసిన వీరాచల రామచంద్రస్వామి ఖమ్మం జిల్లా భద్రాచలం తర్వాత రెండో భద్రాద్రిగా పేరు ప్రఖ్యాతులు పొందింది. కార్తీక మాసంలో ప్రారంభమైన జాతర నెల రోజుల పాటు జరుగుతుంది. ప్రతి ఏటా శ్రీరామనవమితో పాటు, కార్తీకమాస పునర్వసు నక్షత్రంలో సీతారాముల కల్యాణోత్సవం జరుపడం ఇక్కడి విశేషం. ఈ జాతరకు రాష్ట్రంలోని అన్ని ప్రాం తాలతో పాటు మహరాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తుం టారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జీడికల్ రామచంద్రస్వామి పేరుతో 11 ఎకరాల భూమి ఉండడం జాతర ప్రాముఖ్యతకు నిదర్శనం. విద్యుత్ వెలుగుల్లో ఆలయం జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయం విద్యుత్ వెలుగులతో జిగేల్‌మంటోంది. ఈ నెల 11న ప్రారంభమైన జాతరలో 17న సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుంది. ఆలయం చుట్టూ చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ లైట్లతో సీతారామలక్ష్మణుల ప్రతిమలు వెలుగొందుతున్నాయి. గోపురంతో పాటు ఆలయం చుట్టూ విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవ వేదిక వద్ద చలువ పందిళ్లు వేశారు. ఆలయ సిబ్బంది అంతా భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లలో మునిగిపోయారు. దాతల విరాళాలతో ఆలయం, సత్రాలు, కల్యాణ వేదిక ముందు రేకులతో షెడ్లు వేశారు. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి సీజీఎఫ్ నిధులు సుమారుగా రూ.25లక్షలతో షెడ్లు, నీటి వసతి కల్పించారు. శశాంక అనే ఎన్ఆర్ఐ కల్యాణ వేదిక వద్ద షెడ్ వేశారు. జీడిగుండం, పాలగుండం జీడిగుండం, పాలగుండాలు.. ఆలయంపైన జీడిగుండం, పాలగుండం రెండు ఉంటాయి. పూర్వకాలంలో భీమసేనుడు, చంద్రసేనుడు అనే ఇద్దరు రాజుల యుద్ధంలో చంద్రసేనుడు వీరమరణం పొందుతాడు. అతడి కవల పిల్లలైన బాలచంద్రుడు, బాలచంద్రికలు వేర్వేరుగా ఇతర ప్రాంతాల్లో పెరిగిపెద్దవుతారు. స్వయంవరంలో వీరిద్దరు అన్నచెల్లెల్లు అని తెలియక వివాహం చేసుకోవడంతో ఒక్కసారిగా వీరి శరీరాలు నల్లబడిపోయాయి. వెంటనే ఆకాశగంగ పలుకుతూ 101 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని చెప్పడంతో వీరిద్దరు పాప విమోచనానికి ఆలయాలన్ని దర్శించుకొని చివరిగా జీడికల్‌లోని జీడిగుండం, పాలగుండాలలో స్నానాలు చేయగా శరీరాలు యథావిధిగా మారుతాయి. ఇలా ఇక్కడే పాప విమోచనం జరిగిందని ప్రతీతి. భక్తులు ఈ గుండాల్లో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని నమ్మకం. ఆలయ చరిత్ర.. త్రేతాయుగంలో వీరుడు, భద్రుడు ఇద్దరు మునీశ్వరుల తపోనిష్టతో భద్రాచలంలో భద్రాచల రామయ్య, జీడికల్లో వీరాచల రామచంద్రుడిగా వెలిసినట్లు ప్రతీతి. అందుకే రెండో భద్రాద్రిగా పేరు పొందింది. రాముడు వనవాసం చేసే సమయంలో పర్ణశాలలో ఉన్న సీతమ్మకు మాయ లేడి కనిపించడంతో ఆ లేడి సంహారానికి రాముడు అక్కడి నుంచి బయలు దేరి వెంటాడుతూ వేటాడుతూ జీడికల్ సమీపంలోని లేడిబండ వద్ద సంహరించినట్లుగా చెబుతారు. ఇప్పటికీ అక్కడ శ్రీరామచంద్రుడు లేడీ సంహార అనంతరం సంధ్యావందనం కోసం తన బొటన వేలిని నొక్కగా బండపై ఏర్పడిన గుంతలో నీరు వచ్చిందని ప్రతీతి. ఇప్పటివరకు దాన్ని లేడి బండగా పిలుస్తారు. సంధ్యావందనం అనంతరం వీరుడి ఘోర తపస్సుతో రామనామ జపం వినిపించడంతో అటుగా అడుగులు వేస్తూ రాగా కొద్ది దూరంలో వీరుడి తపస్సును చూసి మెచ్చుకొని ఏం కావాలని కోరుకోమనగా సూర్యచంద్రాదులు ఉన్నంతవరకు నీ సేవ చేసుకొనే భాగ్యం కల్పించాలని వేడుకోగా అక్కడే స్వయంభువుగా వెలిసినట్లు చెబుతారు. కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి ఈ నెల 17న జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన వసతులు ఏర్పాట్లు చేశాం. కల్యాణంలో పాల్గొనే దంపతులు రూ.1516 చెల్లించి రశీదు తీసుకొని కల్యాణం జరిపించే అవకాశం పొందవచ్చు. – శేషుభారతి, ఈఓ జీడికల్ -
విగ్రహాల తొలగింపు.. ఏలూరులో ఉద్రిక్తత
-
విగ్రహాల తొలగింపు.. ఏలూరులో ఉద్రిక్తత
సాక్షి, ఏలూరు : అర్ధరాత్రి సమయంలో ఆలయంలో విగ్రహాలను తొలగించడంతో పగోజిల్లా ఏలూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏలూరులోని అంబికా థియేటర్ పక్కన ఓ సంస్థ యజమానులు మల్టిఫ్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారు. పక్కనే ఉన్న వంద సంవత్సరాల చరిత్ర కలిగిన రామాలయంలో విగ్రహాలను ఆదివారం అర్ధరాత్రి తొలగించి, గుడి కూలగొట్టే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుడిలో విగ్రహాలను సైతం జేసీబీతో చిందరవందర చేసి రోడ్డుపైనే పడేయడంతో విశ్వహిందూపరిషత్, భజరంగ్ దళ్ నాయకులు, స్దానికులు ఆగ్రహించారు. ఈ ఘటనపై స్థానికులు లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీబీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఏలూరు రూరల్ సీఐ నాయుడు, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. -
రాబడి తగ్గింది..!
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆదాయం గతంతో పోల్చుకుంటే గణనీయంగా తగ్గింది. ఆలయానికి రెగ్యులర్ ఈఓ ఉన్నప్పుడు.. ప్రముఖ భక్తులు ఎవరైనా వస్తే.. వారితో మాట్లాడడం, సరైన వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రత్యేక పూజలు చేయించేవారు. అప్పుడు వారు హుండీలో వేసే కానుకలు కూడా భారీగానే ఉండేవి. ఇప్పుడు రెగ్యులర్ ఈఓ లేకపోవడమే ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో నెల రోజులకు ఒకసారి హుండీ లెక్కించేవారు. సుమారు రూ.75 లక్షల మేర ఆదాయం లభించేంది. రోజువారీగా స్వామివారికి అన్ని కార్యక్రమాలకు సంబంధించి రోజుకు సుమారు రూ.2 లక్షల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీనికి కారణం అధికారుల అలసత్వం, సరైన పర్యవేక్షణ లోపం, స్వామివారి కార్యక్రమాలపై సరైన ప్రచారం లేకపోవడం కారణమని భక్తులు అంటున్నారు. 102 రోజులకు రూ. 1.28 కోట్లు.. స్వామివారి హుండీలను సోమవారం ఆలయంలోని చిత్రకూట మండపంలో లెక్కించగా.. 102 రోజులకు గానూ రూ.1.28,45,721 లభించినట్లు ఆలయ ఈఓ పమెల సత్పథి తెలిపారు. ఈ ఆదాయంతో పాటు 513 యూఎస్ డాలర్లు, 50 యూఏఈ దినార్లు, 6 కువైట్ దినార్లు, 4సౌదీ రియాల్స్, 60 ఆస్ట్రేలియా డాలర్లు, 2 ఖతార్ రియాల్స్, 2 చైనా యాన్స్ లభించినట్లు తెలిపారు. స్వీపర్ చేతివాటం.. చర్యలకు రంగం సిద్ధం.. స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమంలో స్వీపర్ వెంకన్న చేతివాటం ప్రదర్శించి, రూ.3 వేలు తస్కరించాడు. మధ్యలో బయటకు వెళుతుండగా అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది సోదా చేయగా అతని వద్ద రూ.3 వేలు దొరికాయి. వెంటనే ఈ విషయాన్ని ïఆలయ ఈఓ పమెల సత్పథికి, ఆలయ అధికారులకు తెలిపారు. గతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ ఈఓలు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటు దగ్గర ఉండి హుండీల లెక్కింపు కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. ఇటీవల కాలంలో అధికారులు, సిబ్బంది కట్టుదిట్టమైన చర్యలు చేపట్టక పోవడంతో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి హుండీ లెక్కింపు కార్యక్రమం, ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించి పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. -
అయ్యో రామా!
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామాలయంపై టీఆర్ఎస్ ప్రభుత్వం శీతకన్ను వేసింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆలయ అభివృద్ధిపై తీవ్రమైన కసరత్తులు జరుగుతున్నాయి. కానీ కార్యరూపం దాల్చడంలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలను సందర్శిస్తూ మొక్కులు తీర్చుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రగిరి వైపు కన్నెత్తి చూడకపోవటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆలయ పునర్ నిర్మాణ పనులకు రూ. 100 కోట్లు కేటాయిస్తామని, ఎంత ఖర్చు చేసైనా సుందర భద్రాద్రిగా తీర్చిదిద్దుతామని పాలకులు ప్రకటించి రెండేళ్లు దాటింది. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. డిజైన్ల పరిశీలన, మార్పులు చేర్పులతోనే సరిపుచ్చుతున్నారు. రానున్నది ఎన్నికల సీజన్ కావటంతో భద్రాద్రి ఆలయాభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇప్పట్లో జరిగేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతా హంగామే.. రూ.100కోట్ల ప్రకటన, రెండేళ్లుగా రూపొందిస్తున్న డిజైన్ల హంగామా చూస్తుంటే ఆలయాభివృద్ధి పనులు ఆచరణలో సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ దుర్గమ్మ వారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా తరలివెళ్లి మొక్కులు సమర్పించటం చర్చకుదారితీసింది. ఆధ్యాత్మిక చింతన గల సీఎం భద్రాచలం రాములోరి విషయంలో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ గళాన్ని ఎక్కుపెడుతున్నారు. రాములోరి క్షేత్రం అభివృద్ధిపై ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకిస్తున్నారు. భక్తుల కానుకలతోనే.. భక్తులు ఇచ్చిన కానుకులతోనే ఆలయ అభివృద్ధి పనులు చేయాల్సి వస్తోంది. ఏడాదికి అన్ని రకాలుగా సుమారు రూ.35 కోట్ల మేర ఆలయానికి ఆదాయం వస్తోంది. గతంలో ఏడాదికి రూ.30 కోట్లు లోపే ఆదాయం ఉండేది. కానీ ఇటీవల కాలంలో హుండీల ఆదాయం పెరిగింది. వచ్చిన ఆదాయంలో సింహభాగం వైదిక, సిబ్బంది జీతభత్యాలకే సరిపోతోంది. మిగిలిన కొద్దిపాటి మొత్తాన్ని ఫిక్సిడ్ డిపాజిట్లు చేస్తున్నారు. ప్రతీ ఏటా జరిగే శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాల నిర్వహణ ఆలయానికి అదనపు భారమే అవుతోంది. రాష్ట్ర ఉత్సవాలైనప్పటికీ ప్రభుత్వం నుంచి నిధులు రావటం లేదు. నిర్వహణ ఖర్చులను దేవస్థానమే భరించాల్సివస్తోంది. దీంతో ఆలయ కార్యకలపాల నిర్వహణకే తప్ప భక్తుల వసతుల కోసం శాశ్వత నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులకు డబ్బుల్లేని పరిస్థితి నెలకొంది. తిరుమల తిరుపతి దేవస్థానం, కొందరు దాతలు సత్రాలు నిర్మిస్తున్నా.. పెద్దగా పురోగతి లేదు. దేవస్థానం ద్వారా గత నాలుగేళ్ల కాలంలో మౌలిక వసతులపై దృష్టి సారించలేదు. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పటం లేదు. చిల్లిగవ్వ లేదు భద్రాద్రి ఆలయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్క నయాపైసా కూడా విడుదల చేయలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో రూ. 9.50 కోట్లు మంజూరు చేశారు. వాటితో మాడవీధుల విస్తరణ, కల్యాణ మండపం అభివృద్ధి వంటి పనులు చేశారు. మాడవీధుల విస్తరణ సమయంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించే విషయంలో తలెత్తిన కోర్టు కేసుల వివాదంతో ఆ పనులను ఇప్పటి వరకూ కూడా పూర్తి చేయలేదు. స్వరాష్ట్రంలో కూడా భద్రాద్రి ఆలయాభివృద్ధికి ఇప్పటి వరకూ ఎటువంటి నిధులు విడుదల చేయకపోవటంపై ఈ ప్రాంత వాసుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాలక మండలి ఊసేది.? రాష్ట్రంలో కీలక ఆలయాలకు పాలక మండళ్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి రామాలయానికి, పాలక మండలిని ఏర్పాటు చేయలేదు. ఆలయాభివృద్ధికి వందల కోట్లు మంజూరు చేస్తున్నందున ట్రస్టు బోర్డు స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తారనే ప్రచారం కూడా సాగింది. కానీ అది కూడా ఆచరణకు నోచుకులేదు. ట్రస్టు బోర్డు ఉంటే ఆలయాభివృద్ధికి నిధుల సమీకరణపై దృష్టిసారించే అవకాశం ఉండేది. ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకొచ్చే వారు. భద్రాద్రి విషయంలో ప్రభుత్వం కాలయాపనే చేస్తుంది తప్ప, చిత్తశుద్ధి చూపించటం లేదనే అనుమానాలకు బలం చేకూర్చే విధంగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉండటంపై ఈ ప్రాంతంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వచ్చేది ఎన్నికల సీజన్ కావటంతో అభివృద్ధి పనులకు శిలాఫలకం పడుతుందా..? లేదా డిజైన్లతో సరిపుచ్చుతారా..? లేక భద్రాద్రి విషయంలో ఇక్కడి ప్రజానీకం ఊహించనిదేమైనా జరుగుతుందా అనేదానిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
మీ'కోదండం' బాబూ..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కోరిన కోరికలు తీర్చే కోదండ రాముడికే నిలువ నీడ కరువైంది. కోట్లాది రూపాయల విలువైన భూములున్నా.. అవి అన్యాక్రాంతమై.. ఆలయం శిథిలమైంది. వీటిని భూసేకరణలో అమ్ముకోవడానికి ఆక్రమణదారులు యత్నిస్తున్నారు. సుమారు పది కోట్ల విలువైన ఈ ఆస్తులను కాపాడుకునేందుకు గ్రామస్తులు, దేవాదాయ శాఖ నడుం బిగించింది. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ పరిధిలోని చల్లావారిగూడెంలో శ్రీకోదండ రామాలయం దీనస్థితిలో ఉంది. ఇక్కడ ఆక్రమణదారులకు టీడీపీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి భూములను కాజేశారు. భూసేకరణలో కట్టబెట్టేందుకు యత్నం! అంతేకాక పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఈ భూములను కట్టబెట్టి పరిహారం హరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ భూముల వ్యవహారంపై దేవాదాయ శాఖ స్పందించి కోర్టులో కేసు వేసింది. ప్రస్తుతం కోర్టులో ఉన్నా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ భూములను సేకరిస్తున్నట్లు అధికారులు పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. అయితే అవార్డు విచారణలో గ్రామస్తుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పాస్ కాలేదు. 1942లో ప్రతిష్ఠ చల్లావారిగూడెంలో 1942లో గ్రామపెద్ద, భూస్వామి పెండ్యాల వెంకట రామారావు ఒక పెంకిటింట్లో పంచలోహ విగ్రహాలతో శ్రీ కోదండ రామాలయం ప్రతిష్ఠించారు. ఆలయ నిర్వహణ కోసం గ్రామంలో ఉన్న తన భూమిలో 42.71 ఎకరాలను ఆలయానికి రాశారు. చాలాకాలం అయనే ఆ భూమిని సేద్యం చేసి వచ్చిన ఆదాయాన్ని ఆలయ నిర్వహణకు ఖర్చు చేశారు. అయితే 1977లో ఆ భూమిని సేద్యం చేసేందుకు తాడువాయికి చెందిన ఒకరికి కౌలుకు ఇచ్చారు. ఇది అవకాశంగా తీసుకుని ఆ భూమిని తమ కుటుంబంలోని వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి భూమి వారి స్వాధీనంలోకి వెళ్లింది. పెండ్యాల వెంకట రామారావుకు వారసులు లేకపోవడంతో పురుషోత్తంను దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం పురుషోత్తం ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని వేడుకుంటున్నారు. అయితే 2010లో ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ గుర్తించి సింగిల్ ట్రస్టీగా, కార్యనిర్వహణాధికారిగా పెన్మెత్స విశ్వనాథరాజును నియమించింది. దీంతో ఆలయ ఆస్తులు గుర్తించి భూముల కోసం కోర్టులో కేసు వేశారు. తాజాగా చల్లావారిగూడెంలో ఉన్న 42.71 ఎకరాల భూమిని చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సుమారు 10 ఎకరాలు, పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి 32 ఎకరాలు సేకరిస్తున్నట్లు ప్రకటన రావడంతో దేవాదాయ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. చింతలపూడి పథకంలో సేకరించిన భూమికి నష్టపరిహారం దేవాదాయ శాఖకు చెల్లించాలని ట్రస్టీ విశ్వనాథరాజు భూసేకరణ అధికారులను కోరారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో సేకరించిన భూమికి కూడా చెల్లించే నష్టపరిహారం దేవాదాయ శాఖకు చెల్లించాలని కోరారు. ఇదిలా ఉంటే అవార్డు విచారణలో కూడా గ్రామస్తులు 42.71 ఎకరాల భూమి శ్రీకోదండ రామాలయానికి చెందినదని, నష్టపరిహారం ఆలయానికే చెల్లించాలంటూ తమ వాదన వినిపించారు. ఆలయానికి వందల ఎకరాలు చల్లావారిగూడెం శ్రీకోదండ రామాలయానికి వందల ఎకరాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ అన్యాక్రాంతం అయిపోయాయి. చల్లావారిగూడెం, జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం, టి.నరసాపురం మండంలం బొర్రంపాలెంలో ఇంకా ఇతర ప్రాంతాల్లోనూ సుమారు 500 ఎకరాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ భూములన్నీ వెలికితీస్తే శ్రీకోదండరాముడు అపర కోటీశ్వరుడే..! -
గుడిలోకి వచ్చిన ఎలుగుబంటి
సాక్షి, సుల్తానాబాద్: మండలంలోని కనుకుల గ్రామపంచాయతీ రాములపల్లె శ్రీ రామాలయంలో శనివారం రాత్రి 10 గంటలకు భల్లూకం దూసుకురావడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. గణపతి నవరాత్రులు కావడంతో భక్తులు పూజలు చేస్తుండగా సమీపంలోని గుట్టల నుంచి భల్లూకం గ్రామంలోకి వచ్చి ఆలయంలోని నవగ్రహాల మందిరంలోకి చొరబడింది. దీంతో మొదట భయపడ్డప్పటికీ ధైర్యం చేసిన యువకులు తలుపులు గడియ పెట్టారు. అనంతరం పోలీసులు, అటవీ శాఖాధికారులకు సమాచారం అందించగా సుల్తానాబాద్ ఎస్సై రాజు, ఆటవీ శాఖాధికారులు వచ్చి చాకచక్యంగా ఎలుగుబంటిని పట్టుకున్నారు. -
రామాలయంలో చోరీ
నల్లగొండ (బీబీనగర్) : నల్లగొండ జిల్లా బీబీ నగర్ మండలంలోని రామాలయంలో చోరీ జరిగింది. మండలంలోని బుట్టాయగూడెం గ్రామంలో ఉన్న రామాలయంలోకి శనివారం అర్ధరాత్రి చొరబడిన దుండగులు మూడు వెండి కిరీటాలు, ఓ బంగారు పుస్తెను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగలెత్తుకెళ్లిన వస్తువుల విలువ రూ.లక్ష ఉంటుందని స్థానికులు తెలిపారు.