నల్లగొండ (బీబీనగర్) : నల్లగొండ జిల్లా బీబీ నగర్ మండలంలోని రామాలయంలో చోరీ జరిగింది. మండలంలోని బుట్టాయగూడెం గ్రామంలో ఉన్న రామాలయంలోకి శనివారం అర్ధరాత్రి చొరబడిన దుండగులు మూడు వెండి కిరీటాలు, ఓ బంగారు పుస్తెను ఎత్తుకెళ్లారు.
ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగలెత్తుకెళ్లిన వస్తువుల విలువ రూ.లక్ష ఉంటుందని స్థానికులు తెలిపారు.
రామాలయంలో చోరీ
Published Sun, Jun 28 2015 11:11 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement