
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కోదాడ(నల్లగొండ): కారు ఆపి కత్తులతో, తుపాకులతో బెదిరించి రూ.3లక్షల నగదును దుండగులు దోపిడీ చేశారు ఈ ఘటన కోదాడ పట్టణ పరిధిలోని హైదరాబాద్ విజయవాడ రహదారిపై హుజూర్‌నగర్ ఫ్‌లైఓవర్ వద్ద శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సీఐ నర్సింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. హైరాబాద్‌లోని సబ్జీమండి పురాన్‌పూల్‌కు చెందిన జమాల్ పశువుల సంతలో బేరం చేసేందుకు శుక్రవారం రాత్రి కారులో డ్రైవర్‌తో కలిసి కోదాడకు బయలుదేరాడు.
కోదాడ సమీపంలోని హుజూర్‌నగర్ ఫ్‌లైఓవర్ వద్ద సర్వీస్‌రోడ్డు దిగుతుండగా వారిని ఫాలో అయిన గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు కారులో వచ్చి అడ్డగించారు. కత్తులు తీసి ఇద్దరి గొంతుపై పెట్టి చిలుకూరు శివారు వైపు తీసుకెళ్లి చంపుతామని బెదిరించారు. వారి వద్ద ఉన్న సుమారు రూ.3లక్షల నగదును తీసుకుని ఉడాయించారు. ఈ ఘటనపై బాధితుడు జమాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
చదవండి: రైటర్లు రాసిన స్కామ్!
Comments
Please login to add a commentAdd a comment