
లక్నో: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని ఎన్‌సీపీ నేత శరద్ పవార్ చెప్పారు. రామ మందిరాన్ని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుందో లేదో చెప్పడం కష్టమని ఆయన అన్నారు. ఎదైతేనేం.. రామాలయం ఏర్పడైనందుకు సంతోషిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో ఎంతో మంది సహకారం ఉందని అన్నారు.
అయోధ్యలో జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లతో సహా దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులకు ఆహ్వానాలు అందాయి. దాదాపు 6000 మందికిపైగా ఈ వేడుకకు హాజరుకానున్నారు. డిసెంబర్ 30న అయోధ్యలో ఎయిర్‌పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
ఇదీ చదవండి: ఇది ఇంగ్లాండ్ కాదు.. కన్నడ భాషా వివాదంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు