ముంబై: పూణేలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లోక్ మాన్య తిలక్ జాతీయ అవార్డు ప్రదానం చేయనున్న కార్యక్రమానికి శరద్ పవార్ ముఖ్యఅతిధిగా హాజరు కానున్నారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. అయినా ఒకే వేదికపై నవ్వుకుంటూ ఎలా కూర్చుంటారంటూ ప్రశ్నించారు శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్. దీనికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీదే అంటూ నిలదీశారు .
పూణేలోని లోక్ మాన్య తిలక్ స్మారక మందిర్ వారు ప్రధానమంత్రి నరేద్ర మోదీకి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును బహూకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవర్ హాజరు కానున్నారు. ఇదే విషయాన్ని వేలెత్తి చూపుతూ శివసేన(యూబీటి) నాయకుడు సంజయ్ రౌత్ మీకసలు విజ్ఞత ఉందా? ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఒకే వేదికపై ఎలా కూర్చుంటారో వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు.
మీరు నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తారు. వాటికి కట్టుబడి మీ కార్యకర్తలు వాళ్లలో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు.. మీరేమో ఒకే వేదికపై స్నేహితుల్లా కలిసిపోతారంటూ ప్రధాని మోదీని, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను ఇద్దరినీ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.
ప్రధాని చూస్తే ఎన్సీపీ పార్టీ నిండా అవినీతిపరులే ఉన్నారంటారు. మీరేమో నేను మరాఠాల ముఖచిత్రాన్ని.. మేము బీజేపీకి వ్యతిరేకమంటూ మాటలు చెబుతారు. మరి ఈ రోజు అవన్నీ ఏమైపోయాయి. ప్రజలను వెర్రి వాళ్ళను చేస్తున్నారా? మీరు ప్రధాని అవార్డు కార్యక్రమానికి వెళ్తే మీ కార్యకర్తలను అనుమానించినట్లే.
అధికారం కోసమో మరో కారణంతోనో మీకు వెన్నుపోటు పొడిచిన వారంతా అక్కడికి వస్తారు. వారందరినీ నవ్వుతూ పలకరిస్తే మీరు వాళ్ళు చేసినదానికి ఆమోదం తెలిపినట్లు కదా? దేశమంతా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే మీరు వెళ్లి ఆయన పంచన చేరడం న్యాయమేనా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మరో ఎంపీ అరవింద్ సావంత్ మాట్లాడుతూ లోక్ మాన్య తిలక్ "స్వరాజ్యం మా జన్మహక్కు" అన్నారు. మీరు దాన్ని కాస్తా "సొంత రాజ్యం మా హక్కు"గా మార్చేశారని ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: హెచ్ఆర్ ఘరానా మోసం.. నిరుద్యోగియైన భార్యకు కంపెనీ జీతం..
Comments
Please login to add a commentAdd a comment