sharadh pawar
-
'రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదు'
లక్నో: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని ఎన్సీపీ నేత శరద్ పవార్ చెప్పారు. రామ మందిరాన్ని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుందో లేదో చెప్పడం కష్టమని ఆయన అన్నారు. ఎదైతేనేం.. రామాలయం ఏర్పడైనందుకు సంతోషిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో ఎంతో మంది సహకారం ఉందని అన్నారు. అయోధ్యలో జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లతో సహా దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులకు ఆహ్వానాలు అందాయి. దాదాపు 6000 మందికిపైగా ఈ వేడుకకు హాజరుకానున్నారు. డిసెంబర్ 30న అయోధ్యలో ఎయిర్‌పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇదీ చదవండి: ఇది ఇంగ్లాండ్ కాదు.. కన్నడ భాషా వివాదంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు -
కర్ణాటకలో కాంగ్రెస్‌దే హవా! శరద్ పవార్
కర్ణాటకలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా అని ధీమాగా చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇటర్వ్యూలో మాట్లాడుతూ..కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసే గెలుస్తుందని నమ్మకంగా చెప్పారు. ఐతే ఈ ఎన్నికలను వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల కోణంలో చూడలేం. కానీ బీజేపీ మాత్రం ఎన్నికల ప్రచారంలో జాతీయ అంశాలను రాష్ట్ర సమస్యలతో ముడిపెట్టే యత్నం చేస్తోంది. నా అంచనా ప్రకారం కర్ణాటకలో రెండు రకాలు ఎన్నికలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఇవి జాతీయ ఎన్నికలు కానీ రాష్ట్రాలకు సాధారణ ఎన్నికలే. ఐతే రాష్ట్ర ఎన్నికల్లో వేరే గేమ్ స్ట్రాటజీ ఉంటుంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో బీజేపీ ప్రభుత్వాలు కావు అందువల కర్ణాటకలో కచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే రాష్ట్రాలలో బీజేపీయేతర పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలుపొందాయో అందరికీ తెలుసు కాబట్టి రాష్ట్ర ఎన్నికల విషయానికి వస్తే వాస్తవ పరిస్థితులను విభిన్నంగా ఉంటాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ఎమ్మెల్యేలు విడిపోయి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి అనేక రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలే అధికారంలో ఉన్నాయి. వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల గురించి ప్రతిపక్షాలు కలిసి ఏదో ఒకటి చేయాలని లేకుంటే బీజేపీని ఓడించడం కష్టం. అందరూ ఐక్యంగా ఉండి చేస్తే గానీ బీజేపీని మట్టికరిపించలేం అని పవార్ అన్నారు. కాగా, ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. 2008లో దేశంలో దక్షిణాది ప్రాంతంలో తొలిసారిగా అధికారంలోకి రావడంతో అదే రాష్ట్రంలో మరో దఫా విజయం సాధించాలని బీజేపీ గట్టిగా యత్నిస్తోంది. (చదవండి: కర్ణాటక ఎన్నికల్లో పన్నీరు శిబిరం) -
ప్రభుత్వాన్ని నడుపుతున్నదెవరు..?
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వాన్ని విచ్ఛినం చేసేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం కుట్రపన్నుతోందని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. మూడు పార్టీల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వ్యూహాలు రచిస్తోందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాజ్‌భవన్‌ను వేదికగా చేసుకుని రాజకీయాల చేస్తోందని మండిపడుతున్నారు. విద్యుత్ బిల్లుల వివాదం నేపథ్యంలో నవనిర్మాణ సేనపార్టీ (ఎమ్‌ఎన్‌ఎస్పీ) చీఫ్ రాజ్ రాక్రేను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు బదులుగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను కలవమని సలహా ఇవ్వడంపై శివసేన నేతలు భగ్గుమంటున్నారు. గవర్నర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ మధ్య విబేధాలు సృష్టించేందుకే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. పవర్ ఎవరి చేతిలో.. ఈ క్రమంలోనే విద్యుత్ బిల్లుల విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో కాకుండా శరద్ పవార్‌తో మాట్లాడమని గవర్నర్ కోశ్యారీ రాజ్ ఠాక్రేకి చెప్పడంతోనే రాష్ట్రంలో పవర్ ఎవరి చేతిలో ఉందో అర్థం అవుతోందని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఎద్దేవా చేశారు. శరద్ పవార్ రాష్ట్రాన్ని నడుపుతున్నారని, సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలవడం వల్ల ఉపయోగం లేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై బీజేపీ నాయకులు సైతం స్వరం అందుకున్నారు. ముఖ్యమంత్రి ఠాక్రే అయినప్పటికీ అధికారమంతా పవార్ చేతిలోనే ఉందంటున్నారు. (ఊర్మిళ ఆశలు అడియాశలేనా..?) బీజేపీ నేతల విమర్శలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గట్టిగా స్పందించారు. ఆఘాడీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మరో నెలరోజుల గడిస్తే తమ ప్రభుత్వం ఏర్పడి తొలి ఏడాది పూర్తి అవుతుందని, ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో 15 రోజుల్లోనే కుప్పకూలుతుందని బెట్టింగులు వేశారని గుర్తుచేశారు. బీజేపీ నేతలు ఇప్పటికే అదే పనిలో ఉన్నారని మండిపడ్డారు. రాజ్ ఠాక్రేను ముఖ్యమంత్రికి బదులుగా శరద్ పవార్‌ని కలవాలని గవర్నర్ సూచించి సీఎంను అవమానపరిచారని రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్సీపీ ప్రభుత్వం భాగం మాత్రమేనని, సీఎం మాత్రం ఠాక్రేనే అని స్పష్టం చేశారు. బాల్‌ఠాక్రే నమ్మకాన్ని బేఖాతరు చేశారు దివంగత బాల్ ఠాక్రే నమ్మకం, సిద్ధాంతాలను బేఖాతరు చేసిన పార్టీ తమకు పాఠాలు నేర్పక్కర్లేదని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ సీనియర్ నేత సందీప్ దేశ్‌పాండే శివసేనకు చురకలంటించారు. కరోనా కాలంలో పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ ఇటీవల గవర్నర్‌భగత్‌సింగ్ కొశ్యారీతో ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సరైందని కాదని, ప్రజాప్రతినిధులు, సంబంధిత మంత్రులు, ముఖ్యమంత్రి ఉండగా నేరుగా గవర్నర్‌తో భేటీ కావడమంటే రాష్ట్రాన్ని అవమానపర్చినట్లేనని శనివారం శివసేన ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్ రావుత్ రాజ్ ఠాక్రేను విమర్శించిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలకు ఎమ్మెన్నెస్ సమాధానమిచ్చింది. పరువు, ప్రతిష్ట, అవమానం అంటే ఏంటో రౌత్ నుంచి నేర్చుకోవల్సిన అవసరం తమకు లేదని దేశ్‌పాండే స్పష్టం చేశారు. ఒకప్పుడు ఉత్తర భారతీయులంటే గిట్టని శివసేన ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజల దినోత్సవం నిర్వహించింది. వారికిష్టమైన నానబెట్టిన శెనిగెల కార్యక్రమం నిర్వహించారు. ‘‘కొద్దిరోజుల కిందట రావుత్ కొశ్యారీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రౌత్ కొశ్యారీకి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న ఫోటోను చూపించారు. మరి మీరెందుకు భేటీ అయినట్లు, నృత్యం చేయడానికా...?’’ అని దేశ్‌పాండే ఎద్దేవా చేశారు. ముందు ఈ ఫోటో గురించి మాట్లాడాలని, ఆ తరువాత ఇతరుల గురించి వ్యాఖ్యలు చేయాలని విమర్శించారు. శివసేన నాయకులు తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారు. రాజ్ ఠాక్రేను పీడిం చారు. అప్పట్లో ఎమ్మెన్నెస్‌కు చెందిన ఆరుగురు కార్పొరేటర్లను ప్రలోభపెట్టి శివసేనలోకిలాక్కున్న సంఘటనలను ఎలా మర్చిపోతామని ఈ సందర్భంగా దేశ్‌పాండే గుర్తుచేశారు. -
ఠాక్రే-పవార్ మధ్య చిచ్చుపెట్టిన కంగనా!
సాక్షి, ముంబై : బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌కు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న ఎపిసోడ్ ఓ యుద్ధాన్నే తలపిస్తోంది. ఓ వైపు దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నా మరోవైపు సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు పాల్పడుతున్నా వాటిపై లేని చర్చ కంగనా, శివసేన వ్యవహారంపై విపరీతంగా నడుస్తోంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో ప్రారంభమైన ఈ ప్రకంపనలు ఏకంగా కంగనా ముంబైలో నిర్మించుకున్న కార్యాలయాన్ని కూల్చేవరకు తీసుకెళ్లాయి. బాలీవుడ్లో నెపోటిజం మూలంగానే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడాడంటూ తొలుత కామెంట్ చేసిన కంగనా.. ఆ తరువాత దేశ ఆర్థిక రాజధానిని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పోల్చుతూ వివాదంలోకి దిగారు. ఆమె వ్యాఖ్యలతో మొదలైన మాటల యుద్ధం ఇరువర్గాల (కంగనా-శివసేన) మధ్య తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే శివసేన నేతలు చేసిన వ్యాఖ్యలను సవాలుగా తీసుకున్న నటి.. ఏకంగా కేంద్ర ప్రభుత్వం చేత వై కేటగిరి సెక్యూరిటీని సైతం ఏర్పాటు చేసుకుని ముంబైలో అడుగుపెట్టింది. (కంగన ఆఫీస్ కూల్చివేత.. గవర్నర్ సీరియస్!) ఆ సమావేశంలో ఏం జరిగింది..? అయితే తమనే అవమానిస్తావా అంటూ కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహా ప్రభుత్వం కంగనా ముంబైలో అడుగుపెట్టే సమయానికి ఊహించని షాకే ఇచ్చింది. ఆమె నిర్మించుకున్న కార్యాలయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేతగా సిద్ధమైంది. అయితే కంగనా కార్యాలయం కూల్చివేతపై ప్రభుత్వంలో ముందే పెద్ద ఎత్తునే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం రోజున అక్రమ కట్టడాన్ని కూల్చివేయగా.. అంతకంటే ముందే అంటే మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన ఎంపీ సంజయ్ రైత్ మధ్య కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. కంగనా నిర్మాణాన్ని తొలగించి వివాదాన్ని మరింత పెద్దదిగా చేయవద్దని శరద్ పవార్.. సీఎం ఠాక్రేతో వారించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కంగనా వ్యవహారాన్ని వదిలేయాలని, చట్ట పరంగా ఏమైనా చర్యలు ఉంటే అది స్వతంత్ర హోదా కలిగిన బీఎంసీ అధికారులే చూసుకుంటారని చెప్పిన్నట్లు తెలిసింది. (శివసేన సర్కారు దూకుడు) ప్రభుత్వ తీరుపై పవార్ తీవ్ర అసంతృప్తి..! అయితే పవార్ వాదనతో ఏకీభవించని ఠాక్రే కంగనాను వదిలే ప్రసక్తే లేదని, అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని తేల్చి చెప్పినట్లు ముంబై వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దీనిలో ప్రభుత్వం తప్పిందం ఏదైనా ఉంటే ప్రతిపక్ష బీజేపీకి మరింత అవకాశం దొరుకుతుందనీ కూడా పవార్ చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కంగనా-శివసేన ఎపిసోడ్లో ప్రభుత్వ తీరుపై పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న శివసేన గతంలో ఎన్నోసార్లు దూకుడు ప్రదర్శించి వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వంవహిస్తూ ఇంత అసహనం, ఇంత తొందరపాటు ప్రదర్శించడం ఆ పార్టీకే కాదు... కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు కూడా రాజకీయంగా ఇబ్బందులు తెచ్చుకుంటోదని పలువరు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఓ నటికి వై కేటగిరి భద్రత కల్పించడంపై నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు. కంగనా తొలి నుంచీ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని, దానిని దృష్టిలో ఉంచుకునే ఆమెకు భద్రత కల్పించారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మహారాష్ట్రలో మహా వికాస్ ఆఘఢీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే బీజేపీ కంగనాకు మద్దతుగా నిలుస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆగుతుందా.. ముదురుతుందా ఇదిలావుండగా కంగనా కార్యాలయం కూల్చివేతపై మహారాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఈనెల 22 వరకు ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని బీఏంసీ అధికారులను ఆశ్రయించింది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 354 / ఎ కింద, బీఎంసీ సభ్యులు కంగనా కార్యాలయం కూల్చివేత పనులను షురూ చేశారు. కూల్చివేత పనులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే ఇచ్చింది. అనంతరం గురువారం మధ్యాహ్నాం తన కార్యాలయన్ని కంగనా పరిశీలించారు. అయితే ఈ వివాదం ఇప్పటితో ఆగుతుందా లేక మరింత ముదురుతుందా అనేది వేచిచూడాలి. -
'అజిత్, ఫడ్నవీస్ మైత్రి ముందే తెలుసు'
ముంబై: బీజేపీ నేత, మాజీ సీఎం ఫడ్నవీస్‌తో అజిత్ పవార్ సన్నిహితంగా మెలుగుతున్న విషయం నవంబర్ 23వ తేదీనాటి పరిణామాలకు ముందే తనకు తెలుసునని ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ వెల్లడించారు. కలిసి పనిచేద్దాం రమ్మంటూ ప్రధాని మోదీ ఆహ్వానించారని సోమవారం మీడియాకు వెల్లడించిన పవార్ మంగళవారం మరో సంచలన వ్యాఖ్య చేశారు. బీజేపీతో చేతులు కలిపి మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయకమునుపే వారిద్దరి మధ్య చర్చల వ్యవహారం తన దృష్టికి వచ్చిందన్నారు. అయితే, అజిత్ నడిపించిన తంతు అంతా తనకు తెలిసే జరిగిందంటూ వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. నవంబర్ 23వ తేదీనాటికే శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖరారైందని మీడియాకు ఇచ్చిన ఇంటర్వూ్యలో శరద్ పవార్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో చర్చలు జరపడం అజిత్‌కు ఇష్టం లేదు.. అయితే, అనంతరం అజిత్ అలా చేస్తాడని ఊహించలేదన్నారు. -
అప్పుడు బాబాయ్.. ఇప్పుడు అబ్బాయ్
న్యూఢిల్లీ: నాలుగు దశాబ్దాల క్రితం బాబాయ్ శరద్ పవార్ నడిచిన బాటలోనే అబ్బాయ్ అజిత్ పవార్ కూడా నడుస్తూ ఆనాటి మహా డ్రామాను గుర్తు చేస్తున్నారు. దేశంలో ఎమర్జెన్సీ ముగిశాక 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇందిరాగాంధీ వ్యతిరేక పవనాలు వీచాయి. అనంతర పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయింది. ఇందిర నేతృత్వంలో కాంగ్రెస్(ఇందిర), వ్యతిరేక వర్గం నేతృత్వంలో కాంగ్రెస్(ఎస్)లు ఏర్పడ్డాయి. తన రాజకీయ గురువు యశ్వంతరావు చవాన్‌తో కలిసి కాంగ్రెస్(ఎస్)లో ఉండిపోయారు. 1978లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించలేకపోయింది. కాంగ్రెస్(ఎస్)కు 69 సీట్లు, కాంగ్రెస్(ఐ)కు 65 సీట్లు రాగా.. జనతాపార్టీ 99 స్థానాల్లో గెలిచింది. జనతా పార్టీకి అధికారం దక్కనీయకుండా.. కాంగ్రెస్(ఎస్)కు చెందిన వసంత్‌దాదా పాటిల్ సీఎంగా, కాంగ్రెస్(ఐ)కు చెందిన నాసిక్‌రావ్ తిర్పుడే డిప్యూటీ సీఎంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే రెండు పార్టీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో.. ఒక దశలో ప్రభుత్వం నడపడం కష్టంగా మారింది. ఆ సమయంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న శరద్ పవార్ తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్(ఎస్) నుంచి బయటకొచ్చేశారు. జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రశేఖర్‌తో సత్సంబంధాల్ని ఉపయోగించుకుని ఆ పార్టీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్(ఎస్)కు చెందిన దాదాపు 38 మంది ఎమ్మెల్యేలు ఆయన మద్దతుగా నిలవగా జనతా పార్టీ అండతో 1978లో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే 1980లో కేంద్రంలో ఇందిరాగాంధీ అధికారంలోకి రావడంతో శరద్ పవార్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. -
‘ముందస్తు’పైనే చర్చ!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారంటూ జరుగుతున్న చర్చ ఒక్కసారిగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణంపై చర్చించటంతోపాటుగా అన్ని విపక్షపార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు తమ ప్రయత్నాలను ప్రారంభించాయి. ఇందుకోసం వచ్చేవారం 18 విపక్ష పార్టీలతో సమావేశం కావాలని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించారు. దీంట్లో భాగంగా కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ ఢిల్లీ నివాసంలో సోమవారం సాయంత్రం విపక్ష పార్టీల భేటీ జరిగింది. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత.. పార్లమెంటు సెంట్రల్ హాల్లో సోమవారం నాటి రాష్ట్రపతి ప్రసంగం తర్వాత సోనియా గాంధీతో శరద్ పవార్ ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం సీపీఐ నేత డి. రాజా కూడా వీరితో కలసి మాట్లాడారు. దీంట్లో విపక్షాలను ఏకం చేసే పనిని శరద్ పవార్ ప్రారంభించాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మలతో సహా పలువురు విపక్ష నేతలు సాయంత్రం పవార్ నివాసంలో సమావేశమయ్యారు. వచ్చేవారం సోనియా నేతృత్వంలో విపక్షపార్టీల భేటీ నిర్వహించనున్నారు. 2004 ఎన్నికలకు ముందు బీజేపీయేతర పక్షాలను ఏకం చేసి యూపీఏను ఏర్పాటుచేయటంలో సోనియా క్రియాశీలకంగా వ్యవహరించారు. పదేళ్లపాటు ఈ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని నడిపేలా అందరినీ ఒకతాటిపై నిలబెట్టిన సంగతి తెలిసిందే. బీజేపీ అసంతృప్త నేతల భేటీ గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు, రైతుల అసంతృప్తి వంటి అంశాలపై చర్చించేందుకు వివిధ వర్గాలు, నిపుణులతో ఏర్పాటైన ‘రాష్ట్రీయ మంచ్’ మంగళవారం ఢిల్లీలో భేటీ కానుంది. బీజేపీ అసంతృప్త నేతలైన యశ్వంత్‌సిన్హా, శతృఘ్న సిన్హా సహా పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలపై మోదీ దృష్టిపెట్టలేదని.. మూడున్నరేళ్లలో గ్రామాలు పూర్తిగా నిరాదరణకు గురయ్యాయనే అంశాలను ఈ భేటీ లో చర్చించనున్నారని సమాచారం. ఇటీవలి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ.. కాంగ్రెస్‌తో కాకుండా ఒంటరిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇది కొంతమేర కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోదీ వ్యూహమేంటో? అయితే ప్రధాని మోదీ ఎలా ముందుకెళ్తారనే అంశంపై ఎలాంటి స్పష్టత లేనప్పటికీ.. ఏకకాల ఎన్నికలను ముందస్తుగా నిర్వహించాలని ఆయన భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లటం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడకుండా జాగ్రత్తపడాలని, విపక్షపార్టీలన్నీ ఏకమయ్యేందుకు అవసరమైన సమయం ఇవ్వకూడదనేది మోదీ వ్యూహంగా భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చే 100 రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు మోదీ ఆలోచిస్తున్నారని.. ఇందుకోసం ఎన్నికల ప్రచార నిర్వహణ బృందంతో చర్చిస్తున్నారనే వార్తలూ వినబడుతున్నాయి. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగం కూడా ఇన్నాళ్లూ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను చెప్పటంతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలాగా ఉందని విశ్లేషకులంటున్నారు. ఇద్దరు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులను ఈ అంశంపై సాక్షి ప్రతినిధి సంప్రదించగా.. ఒకరు ‘ముందస్తు’పై స్పందించేందుకు నిరాకరించారు. మరొకరు ‘కొట్టిపారేయలే’మని.. రాజకీయాల్లో ఒక వారం కూడా కీలకం అని తెలిపారు. -
షిండేని గెలిపించండి: పవార్
షోలాపూర్: సుశీల్ కుమార్ షిండేను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో షోలాపూర్ స్థానం నుంచి మళ్లీ గెలిపించేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పార్టీ కార్యకర్తలను కోరారు. షిండే కేంద్ర హోంశాఖ మంత్రితో పాటు లోక్‌సభ సభాధ్యక్షుడిగా ఉన్నందుకు షోలాపూర్ ప్రజలు గర్వపడాలని ఆయన శనివారం పండరీపూర్‌లో మీడియాకు తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేందుకు ప్రజాస్వామ్య కూటమి ఎన్నికల కమిషన్ అనుమతి అడగనుందని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వారి అనుమతి తప్పనిసరి అని వివరించారు. ఇదిలావుండగా పవార్ ప్రధానమంత్రి అయితే సంతోషపడతానని ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు. -
పదిరోజుల్లో కొలిక్కి
కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై శరద్ పవార్ న్యూఢిల్లీ/కొల్హాపూర్: కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటు వివాదం పది రోజుల్లో పరిష్కారమవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరుపార్టీల మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశం వివాదాస్పదంగా మారిన సంగతి విదితమే. దీనిపై పవార్ పైవిధంగా స్పందించారు. ఇదే అంశంపై ఆ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సీట్ల సర్దుబాటు చర్చలను కాంగ్రెస్ ఆలస్యం చేస్తోందని, దీంతో తాము సహనం కోల్పోతున్నామని పటేల్ ఇటీవల అన్నారు. అంతేకాకుండా తమకు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నారు. అయితే పవార్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రఫుల్ ఎటువంటి అల్టిమేటం జారీ చేయలేదన్నారు. ‘మరో పది రోజుల్లో సీట్ల సర్దుబాటు అంశం ఓ కొలిక్కి వస్తుంది. చర్చలు సుహృద్భావ వాతావరణంలో కొనసాగుతున్నాయి. కాం గ్రెస్ పార్టీకి ప్రఫుల్ పటేల్ ఎటువంటి అల్టిమేటం జారీ చేయలేదు’ అని పవార్ ఆదివారం ట్విట ర్లో పేర్కొన్నారు. దేశానికి సుస్థిర ప్రభుత్వం అవసరమన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభావం ఉండబోదన్నారు. ఆచరణ సాధ్యం కాని డిమాండ్లతో నష్టం ఆచరణ సాధ్యం కాని డిమాండ్లు రాష్ట్రంలో చక్కెర పరిశ్రమకు హాని కలిగిస్తాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ హెచ్చరించారు. ఇలా అయితే ముంబైలో వస్త్ర పరిశ్రమలకు పట్టిన గతే వీటికి కూడా పడుతుందన్నారు. కొల్హాపూర్‌లో నిర్మించిన జాతీయ స్విమ్మర్ సాగర్ ప్రశాంత్‌పాటిల్ ప్రపంచశ్రేణి ఈతకొలనును ఆదివారం ప్రారంభిం చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డిమాండ్ చేయడం తప్పేమీకాదని, అతివాద నాయకత్వం ముంబైలో వస్త్ర పరిశ్రమలను నాశనం చేసిందన్నారు. ఇప్పుడు రాష్ర్టంలోని చక్కెర పరిశ్రమకు కూడా అదే జరిగితే మనమంతా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో చక్కె ర పరిశ్రమ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొం టోందన్నారు. ఉత్పత్తిదారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కాగా బీజేపీ, శివసేన నేతృత్వంలోని మహాకూటమిలో ఇటీవల చేరిన స్వాభిమాన్ శేత్కా ర సంఘటన్ సంస్థ చెరకును అత్యధిక ధరకు కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో భారీ ఉద్యమం నిర్వహించిన విషయం విదితమే. -
ఇక.. రాజ్యసభకే పోటీచేస్తా: పవార్
ముంబై: 2014 లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కేంద్ర వ్యవసాయ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్(73) వెల్లడించారు. అయితే, రాజ్యసభకు మాత్రం పోటీ చేస్తానన్నారు. రెండేళ్లకోసారి జరిగే ఎగువసభ ఎన్నికలు వచ్చే మార్చిలో జరగనున్న నేపథ్యంలో దానిలో పాల్గొని రాజ్యసభలో అడుగిడతానని చెప్పారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఎన్సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవలి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంత వ్యతిరేక ఫలితాన్ని చవిచూసినప్పటికీ భవిష్యత్తులో పుంజుకుంటుందని పవార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఇందిర హయాంలో కూడా కాం గ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీచాయి. అయినప్పటికీ రెండేళ్ల వ్యవధిలోనే తిరిగి అధికారం చేజిక్కించుకుంది’ అని కార్యకర్తలకు చెప్పారు. ‘కాంగ్రెస్ విషయంలో ఎలాంటి బాధా అక్కరలేదు. నమ్మకంతో ప్రజల్లోకి వెళ్లండి. నిర్ణయాలు తీసుకునే నేతలకు ప్రజలెప్పుడూ పట్టగడతారు’ అని హితబోధ చేశారు. -
బలహీన నాయకత్వం వల్లే ఓటమి
న్యూఢిల్లీ: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ కాంగ్రెస్ నాయకత్వంపై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నవ తరం ఓటర్లతో పాటు బలహీనులైన, నిర్ణయూలు తీసుకోలేని పాలకులు కూడా కారణమేనన్నారు. యువత తన ఆగ్రహాన్ని బ్యాలెట్ ద్వారా ప్రదర్శించిందన్నారు. ‘‘దివంగత ఇందిరాగాంధీ వంటి బలమైన నాయకులు, నిర్ణయూలు తీసుకోగలిన నేతలే యువతకు కావాలి. బ్యాంకుల జాతీయీకరణ వంటి సాహసోపేతమైన నిర్ణయూలెన్నో ఆమె తీసుకున్నారు. ప్రజలకు బలమైన, ఫలితాలు చూపించగలిగిన నేతలు కావాలి. పేదల కోసం విధానాలు, కార్యక్రమాలు రూపొందించి వాటిని దృఢచిత్తంతో అమలు చేయగలిగిన నేతల్ని వారు కోరుకుంటున్నారు. పాలకుల్లో విశ్వాసం లోపించినప్పుడే ఇతర అధికార కేంద్రాలు పుట్టుకొచ్చే అవకాశం ఉందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నేర్చుకోవాల్సిన పెద్ద గుణపాఠం ఇదే’’ అని పవార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతేగాక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోరుున కాంగ్రెస్‌తో పాటు తాము కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమయ్యూయంటూ నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు. వాస్తవాలతో సంబంధం లేని నకిలీ కార్యకర్తలు తలెత్తడానికి కూడా ఈ బలహీన నాయకత్వమే కారణమంటూ ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి అన్నారు. మీడియూతో పాటు ప్రభుత్వంలోని వారు కూడా వారి (ఆప్) ప్రభావానికి లోనయ్యూరన్నారు. ‘బలమైన, నిర్ణయూలు తీసుకోగలిగిన నాయకత్వం ఉన్నప్పుడు ఇలాంటి శక్తులు ఎన్నడూ ముందుకు రావు. ఇందిర హయూంలో ఎన్నడూ ఈ పరిస్థితి ఉత్పన్నం కాలేదు’ అన్నారు. ఇప్పట్లా ప్రతి విషయంలోనూ ఉచిత సలహాలిచ్చేందుకు సదా సిద్ధంగా ఉండే నేతలు అప్పుడు లేరంటూ కాంగ్రెస్ కోటరీకి చురకలు పెట్టారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యం తర్వాత నోరు విప్పిన తొలి యూపీఏ భాగస్వామ్య పక్ష నేత పవారే కావడం గమనార్హం. అయితే పవార్ విమర్శలను కాంగ్రెస్ తేలిగ్గా తీసుకుంది. తమ భాగస్వామ్య పక్షాల గురించి మీడియూ ముందు మాట్లాడబోమని, సరైన వేదికపైనే మాట్లాడతామని పార్టీ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ అన్నారు. కేజ్రీవాల్‌కు పవార్ సవాల్: ఆమ్ ఆద్మీ పార్టీపై కూడా పవార్ ధ్వజమెత్తారు. అధికారం చేపట్టి ధరలు తగ్గించాలని కేజ్రీవాల్‌కు సవాల్ విసిరారు. ‘‘అవినీతిరహిత ఢిల్లీ కోసం ఏఏపీ పిలుపుకు స్పందించి ఓట్లు వేస్తున్నవారే మరోవైపు తమ చట్టవిరుద్ధమైన కాలనీలను చట్టబద్ధం చేయూలని డిమాండ్ చేస్తున్నారు. అసలు పేదలకు, మధ్యతరగతికి అరవింద్ కేజ్రీవాల్ ఏం చెబుతున్నారో అర్థం కావడం లేదు’’ అన్నారు. పవార్ తృతీయ కూటమిలో చేరాలి: ఎస్పీ ప్రజలకు సమర్థవంతమైన నాయకత్వం కావాలంటూ పవార్ చేసిన వ్యాఖ్యలను సమాజ్‌వాదీ పార్టీ స్వాగతించింది. ఆయన తృతీయ కూటమిలో చేరితే.. అది కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం అవుతుందని వ్యాఖ్యానించింది. ‘‘శరద్‌జీ వ్యాఖ్యలను మేం స్వాగతిస్తున్నాం. ఆయన్ను తృతీయ కూటమిలో చేరాలని ఆహ్వానిస్తున్నాం. పవార్జీ మూడో కూటమిలో చేరితే నేతాజీ(ములాయంసింగ్ యాదవ్)తో కలిసి కాంగ్రెస్, బీజేపీలకు ఓ ప్రత్యామ్నాయాన్ని ఈ దేశానికి అందించే అవకాశం ఉంటుంది’’ అని ఎస్పీ నేత నరేష్ అగర్వాల్ పేర్కొన్నారు. -
రాజకీయాల్లో అస్పృశ్యులు ఉండరు
నాగ్‌పూర్: రాజకీయాల్లో ఎవరూ అస్పృశ్యులు కారని కేంద్ర మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. ‘రాజకీయాల్లో, సామాజిక సేవలో ఎవరినీ అస్పృశ్యులుగా చూడొద్దు’ అని అన్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ సరసన పవార్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గడ్కారీకి చెందిన వివాదాస్పద పూర్తి గ్రూపు కంపెనీ శనివారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పవార్ పాల్గొన్నారు. డొల్ల కంపెనీల పెట్టుబడుల వ్యవహారంలో పూర్తి గ్రూపు చిక్కుకోవడం, ఫలితంగా గడ్కారీ బీజేపీ సారథ్యం నుంచి తప్పుకోవడం తెలిసిందే. కాగా తమ కంపెనీ ఎస్సార్ గ్రూప్‌తో కలసి దేశవ్యాప్తంగా వంద పెట్రోల్ బంకులు ప్రారంభించనున్నట్లు గడ్కారీ తెలిపారు. ఈ బంకుల్లో ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని ప్రభుత్వ చమురు కంపెనీలు అమ్మే ధరకంటే రూ.2 తక్కువకే అమ్మనున్నట్లు వెల్లడించారు. పూర్తి కంపెనీ చెరకు పిప్పి, జీవ వ్యర్థ్యాలతో ఇథనాల్ ఉత్పత్తి చేస్తోంది. కాగా, గడ్కారీ చిన్న సాగునీటి ప్రాజెక్టులతో స్వల్పకాలంలోనే సత్ఫలితాలు సాధిస్తున్నారని పవార్ పొగిడారు. పెట్రోల్‌లో ఇథనాల్ కలిపితే విదేశీ మారక ద్రవ్యాన్ని మిగుల్చుకోవచ్చని, అయితే ప్రభుత్వ చమురు కంపెనీలు మాత్రం ఇందుకు విముఖంగా ఉన్నాయని పవార్, గడ్కారీలు విమర్శించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి ప్రఫుల్ పటేల్ కూడా పాల్గొన్నారు. -
పవార్‌తో జోషి మంతనాలు
సాక్షి, ముంబై: శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషి పార్టీ మారనున్నారా? జరుగుతున్న పరిణామాలను చూస్తే ఈ అనుమానం మరింత బలపడుతోంది. పార్టీ అధినేత ఉద్ధవ్‌ఠాక్రేతో చెప్పాపెట్టకుండా గురువారం ఆయన రాజధానికి పయనం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్కడ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశమైన జోషి ఆ తర్వాత కొందరు బీజేపీ సీనియర్ నేతలతో కూడా సమావేశమైనట్లు చెప్పుకుంటున్నారు. దాదర్ లేదా కల్యాణ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని జోషి భావించినా అందుకు అవకాశాలు సన్నగిల్లడంతో ఆయన మనసు మార్చుకున్నట్లు పార్టీలోని కొందరు నేతలే చెప్పుకుంటున్నారు. కనీసం రాజ్యసభ సీటునైనా దక్కించుకోవాలనే ఆలోచనతోనే ఆయన ఢిల్లీకి పయనమైనట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా జోషి ఢిల్లీకి వెళ్లినట్లు వార్తలు వెలువడ్డా స్వయంగా ఆయనే వాటిని ఖండించడంతో అప్పట్లో వివాదం సద్దుమణిగింది. అయితే గురువారం అకస్మాత్తుగా ఆయన ఢిల్లీకి పయనం కావడం చూస్తుంటే గతంలో వెలువడిన కథనాలే నిజమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవార్‌తో భేటీ ఎందుకు? ప్రస్తుతం నగరంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలతో వాతావరణం వేడిగా ఉంది. అసోసియేషన్ అధ్యక్ష పదవికి బీజేపీ నాయకుడు గోపినాథ్ ముండే కూడా పోటీ చేస్తున్నారు. దీంతో పవార్, ముండేల మధ్య పోటాపోటీగా సమరం సాగనుంది. కాగా ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు మనోహర్ జోషి మాజీ అధ్యక్షుడు కావడంతో స్వయంగా పవారే, జోషిని పిలిపించినట్లు చెప్పుకుంటున్నారు. ఎంసీఏ గద్దెనెక్కేందుకు పవార్, జోషి మద్దతు తీసుకుంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వీరిద్దరి భేటి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీకి రావడంతోనే రోజంతా ఓ హోటల్ గదికే పరిమితమైన జోషి సాయంత్రం బయటకు వచ్చి పవార్‌తో దాదాపు 40 నిమిషాలపాటు సమావేశమయ్యారు. అయితే ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఢిల్లీకి రాలేదని, అకస్మాత్తుగా రావాల్సి వచ్చిందని జోషి సన్నిహితులు మీడియాకు తెలిపారు. అయితే ఎందుకు వచ్చారన్న విషయాన్ని మాత్రం వారు వెల్లడించలేదు.