కర్ణాటకలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా అని ధీమాగా చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇటర్వ్యూలో మాట్లాడుతూ..కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసే గెలుస్తుందని నమ్మకంగా చెప్పారు. ఐతే ఈ ఎన్నికలను వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల కోణంలో చూడలేం. కానీ బీజేపీ మాత్రం ఎన్నికల ప్రచారంలో జాతీయ అంశాలను రాష్ట్ర సమస్యలతో ముడిపెట్టే యత్నం చేస్తోంది. నా అంచనా ప్రకారం కర్ణాటకలో రెండు రకాలు ఎన్నికలు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఇవి జాతీయ ఎన్నికలు కానీ రాష్ట్రాలకు సాధారణ ఎన్నికలే. ఐతే రాష్ట్ర ఎన్నికల్లో వేరే గేమ్ స్ట్రాటజీ ఉంటుంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో బీజేపీ ప్రభుత్వాలు కావు అందువల కర్ణాటకలో కచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే రాష్ట్రాలలో బీజేపీయేతర పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలుపొందాయో అందరికీ తెలుసు కాబట్టి రాష్ట్ర ఎన్నికల విషయానికి వస్తే వాస్తవ పరిస్థితులను విభిన్నంగా ఉంటాయి.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ఎమ్మెల్యేలు విడిపోయి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి అనేక రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలే అధికారంలో ఉన్నాయి. వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల గురించి ప్రతిపక్షాలు కలిసి ఏదో ఒకటి చేయాలని లేకుంటే బీజేపీని ఓడించడం కష్టం. అందరూ ఐక్యంగా ఉండి చేస్తే గానీ బీజేపీని మట్టికరిపించలేం అని పవార్ అన్నారు. కాగా, ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. 2008లో దేశంలో దక్షిణాది ప్రాంతంలో తొలిసారిగా అధికారంలోకి రావడంతో అదే రాష్ట్రంలో మరో దఫా విజయం సాధించాలని బీజేపీ గట్టిగా యత్నిస్తోంది.
(చదవండి: కర్ణాటక ఎన్నికల్లో పన్నీరు శిబిరం)
Comments
Please login to add a commentAdd a comment