assessment
-
మీ ఇంటికీ వస్తారు!
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని భవనాల జీఐఎస్ మ్యాపింగ్ కోసం డోర్ టు డోర్ సర్వే త్వరలో ప్రారంభం కానుంది. ఇందుకుగాను జీహెచ్ఎంసీతోపాటు సర్వే చేసేందుకు ఎంపికైన కాంట్రాక్టు ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఓవైపు డ్రోన్ సర్వే ప్రారంభం కాగా.. మరోవైపు త్వరలోనే ఇంటింటి సర్వే ప్రారంభం కానుంది. ఇంటింటి సర్వే వల్ల జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను ఆదాయం రూ.వెయ్యి కోట్లకు పైగా పెరగవచ్చనే అంచనాలున్నాయి. జీహెచ్ఎంసీలో 20 లక్షలకు పైగా ఆస్తులు (భవనాలు) ఉన్నప్పటికీ, ఆస్తిపన్ను చెల్లింపు జాబితాలో మాత్రం దాదాపు 19 లక్షలున్నాయి. ఇంటింటి సర్వే ద్వారా సరైన లెక్కలతో పాటు భవనాల వాస్తవ విస్తీర్ణాలకనుగుణంగా ఆస్తిపన్ను విధించనున్నారు. ప్రస్తుతం చాలా భవనాల వాస్తవ విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణం నమోదై ఉండటంతో జీహెచ్ఎంసీకి రావాల్సినంత ఆస్తిపన్ను ఆదాయం రావడం లేదు. మరోవైపు అదనంగా పెరిగిన అంతస్తుల నుంచి కూడా ఆస్తిపన్ను రావడం లేదు. శాటిలైట్, డ్రోన్, డోర్ టు డోర్ సర్వేల ద్వారా మ్యాపింగ్‌తో కచి్చతమైన వివరాలతో పాటు ప్రతి ఇంటికీ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కేటాయించనున్నందున ఓవైపు జీహెచ్ఎంసీ ఆదాయం పెరగడంతో పాటు వివిధ అవసరాలకు ఉపయోగపడనుంది. ఏవైనా ప్రమాదాలు జరిగితే సంబంధిత యంత్రాంగం త్వరితంగా చేరుకునేందుకు కూడా ఉపకరిస్తుంది. రెండు సర్కిళ్లలో పూర్తయిన డ్రోన్ సర్వే ఇప్పటికే డ్రోన్ సర్వే ప్రారంభమైంది. పటాన్చెరు, కూకట్పల్లి సర్కిళ్లలో పూర్తయిందని జీహెచ్ఎంసీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం శేరిలింగంపల్లిలో సర్వే జరుగుతోంది. త్వరలోనే ఇంటింటి సర్వే కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రజలు సర్వేకు సహకరించేందుకు వీలుగా ముందస్తు ప్రచారం నిర్వహించనున్నారు. వివిధ ప్రచార, ప్రసార మాధ్యమాలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటారు. సోషల్‌మీడియా ద్వారానూ ప్రచారం నిర్వహించాలనే యోచనలో అధికారులున్నట్లు సమాచారం. యాప్‌లో నమోదు ఇంటింటి సర్వేలో భాగంగా ఇళ్లకు సంబంధించిన వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. ఇళ్ల యజమానుల ఫోన్ నెంబర్లను కూడా నమోదు చేయనున్నారు. ఇళ్ల నమోదులో భాగంగా నివాస భవనమా.. వాణిజ్య భవనమా.. అపార్ట్‌మెంటా.. ఇండిపెండెంట్ భవన మా? వంటి వివరాలతో పాటు భవనం విస్తీర్ణం, చిరునామా, పోస్టల్ కోడ్ తదితర వివరాలు నమోదు చేస్తారు. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న భవనాల వివరాలను సైతం సర్వే చేస్తారు. భవనం ఎత్తు, అక్కడున్న రోడ్ మెయిన్ రోడ్డా? సబ్ రోడ్డా? వంటి వివరాలు సైతం నమోదు చేస్తారు. భవనం ఫొటోలు తీస్తారు. భవనాల్లో ఇంకుడుగుంతలు, సివరేజి లైన్లు, సోలార్ ప్యానెల్ వంటివి ఉన్నదీ లేనిదీ నమోదు చేస్తారు. జియో ఫెన్సింగ్ వల్ల భవనం ఏ వార్డు పరిధిలో ఉన్నది ఆటోమేటిక్‌గా నమోదవుతుంది. ఎన్ని అంతస్తులు, భవన వినియోగం, వాటర్, విద్యుత్ కనెక్షన్ల వివరాలు తదితరాలను సైతం నమోదు చేస్తారు. వాణిజ్య భవనాలైతే జరుగుతున్న వ్యాపారం, ట్రేడ్‌లైసెన్స్ వంటి వివరాలు కూడా నమోదు చేస్తారు. వీటితో పాటు ఇంకా పలు వివరాలు యాప్‌లో నమోదు చేయనున్నారు. యాప్ పనితీరు పరిశీలన కోసం దాదాపు 15 ఇళ్ల వివరాలు యాప్‌లో నమోదు చేసినట్లు సమాచారం. -
2024–25 ఐటీఆర్‌ల నోటిఫై
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ 2024–25 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి దాఖలు చేయాల్సిన రిటర్నుల పత్రాలు.. ఐటీఆర్ 2, 3, 5ను నోటిఫై చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని సీబీడీటీ ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులు సులభంగా రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా రిటర్నుల పత్రాల్లో మార్పులు చేశారు. రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు ఐటీఆర్–1 దాఖలు చేయాల్సి ఉంటుంది. -
పాఠశాలల్లో లీడ్ ఏఐ ఆధారిత అసెస్మెంట్
ముంబై: ఎడ్టెక్ సంస్థ లీడ్ తాజాగా పాఠశాలల్లో కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత మూల్యాంకన విధానాన్ని అందుబాటులోకి తెచి్చంది. నిర్దిష్ట తరగతుల విద్యార్థుల స్థాయులను బట్టి మెరుగైన ప్రశ్నలను రూపొందించేందుకు ఇది ఉపయోగపడతుందని సంస్థ సీఈవో సుమీత్ మెహతా తెలిపారు. టీచర్లు అవసరమైతే వీటిని సమీక్షించి, తగు మార్పులు, చేర్పులు కూడా చేసేందుకు వెసులుబాటు ఉంటుందని వివరించారు. బోధనాంశాలను నేర్చుకోవడంలో విద్యార్థులకు ఎదురవుతున్న సవాళ్లను గుర్తించేందుకు, తగు పరిష్కార మార్గాలను అమలు చేసేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని మెహతా పేర్కొన్నారు. అలాగే ఎగ్జామ్ పేపర్ల లీకేజీ సమస్యకు కూడా అడ్డుకట్ట పడుతుందన్నారు. విద్యార్థుల స్థాయిని బట్టి అసెస్మెంట్ విధానాన్ని ఎంచుకునే వీలు కలి్పంచే ఈ విధానం .. తమ నెట్‌వర్క్‌లోని 9,000 పైచిలుకు పాఠశాలల్లో, 50,000 మంది పైచిలుకు ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుందని మెహతా చెప్పారు. -
క్యూ1 జీడీపీ గణాంకాలు పూర్తి పారదర్శకం
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి గణాంకాల మదింపు తగిన విధంగా జరగలేదని వస్తున్న విమర్శల్లో ఎటువంటి వాస్తవం లేదని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ స్పష్టం చేశారు. ఏప్రిల్–జూన్‌లో భారత్ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదయినట్లు గత నెల చివర్లో అధికారిక గణాంకాలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ‘‘ఇండియాస్ ఫేక్ గ్రోత్ స్టోరీ’’ పేరుతో ప్రాజెక్ట్ సిండికేట్ పోస్ట్ చేసిన ఒక కథనంలో ఆర్థికవేత్త, ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అశోక మోడీ తీవ్ర విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత అధికారులు ప్రతికూల స్థూల ఆర్థిక వాస్తవాలను తక్కువ చేసి చూపుతున్నారు. తద్వారా వారు జీ20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ముందు పొగడ్తలతో కూడిన హెడ్లైన్ గణాంకాలను విడుదల చేసి ఉండవచ్చు. కానీ, అత్యధిక మంది భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను కప్పిపుచ్చుతూ వారు ప్రమాదకరమైన గేమ్ ఆడుతున్నారు. వాస్తవ జీడీపీ గణాంకాలు చాలా తక్కువ స్థాయిలోనే ఉంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో అసమతౌల్యత పెరుగుతోందని. ఉపాధి కల్పనలో లోటు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ విమర్శలను నాగేశ్వరన్ త్రోసిపుచ్చారు. ఇండియన్ కార్పొరేట్, ఫైనాన్షియల్ రంగాలు గత దశాబ్ద కాలంగా ఎదుర్కొంటున్న బ్యాలెన్స్ షీట్ ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోయాయని అన్నారు. బ్యాంకుల్లో రెండంకెల రుణ వృద్ధి నమోదవుతోందని, కంపెనీల పెట్టుబడులు ప్రారంభమయ్యాయని ఒక ఆర్టికల్‌లో పేర్కొన్నారు. -
మూడు నెలలకోసారి సైబర్ రిస్క్ మదింపు
న్యూఢిల్లీ: టెక్నాలజీ అత్యంత వేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో కంపెనీలు తమ సైబర్ రిస్కులను ఏడాదికోసారి కాకుండా మూడు నెలలకోసారి మదింపు చేసుకోవాల్సిన అవసరం ఉందని డెలాయిట్ ఇండియా రిస్క్ అడ్వైజరీ పార్ట్నర్ దిగ్విజయసింహ చుదసమా తెలిపారు. కంపెనీలే కాకుండా ప్రజలు కూడా సైబర్ రక్షణ కోసం స్వీయ–మార్గదర్శకాలను రూపొందించుకోవాలని, కీలకమైన డేటాను షేర్ చేయడం వల్ల తలెత్తే సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. హ్యాకర్లు మరింత అధునాతనమైన పద్ధతుల్లో సైబర్ దాడులకు దిగుతున్నందున ఈ తరహా రక్షణాత్మక చర్యలు అవసరమని చుదసమా వివరించారు. తమ ప్రయోజనాలను, తమ డేటాను పరిరక్షించుకునేందుకు ఉపయోగపడే విధానాలను రూపొందించుకోవడంపై కంపెనీలు కసరత్తు ప్రారంభించాలని ఆయన సూచించారు. -
రేపటి నుంచి క్లాస్ బేస్డ్ అసెస్మెంట్
సాక్షి, అమరావతి: 1–10 తరగతి విద్యార్థులకు ఆగస్ట్ 1–4వ తేదీ వరకు క్లాస్ బేస్డ్ అసెస్మెంట్ (సీబీఏ–1) పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. మంగళ, బుధ, గురువారాల్లో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం తెలుగు, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఓఎస్ఎస్సీ (మూడు నుంచి ఐదు తరగతులకు), మధ్యాహ్నం గణితం, ఇంగ్లిష్ పార్ట్–ఏ, మూడు, నాలుగు, ఐదు తరగతులకు పార్ట్–బి అసెస్మెంట్ నిర్వహించనున్నారు. 6,7,8 తరగతులకు మంగళవారం మధ్యాహ్నం సెషన్లో తెలుగు, గణితం, బుధవారం హిందీ, జనరల్ సైన్స్, గురువారం సోషల్ స్టడీస్, ఇంగ్లిష్ పార్ట్–ఎ, పార్ట్–బి, శుక్రవారం ఓఎస్ఎస్సీ–1, 2 పేపర్లు ఉంటాయి. 9,10 తరగతులకు మంగళవారం ఉదయం తెలుగు, మ్యాథ్స్, బుధవారం ఉదయం హిందీ, జనరల్ సైన్స్, గురువారం సోషల్ స్టడీస్, ఇంగ్లి‹Ù, ఇంగ్లిష్ పార్ట్–బి (తొమ్మిదో తరగతికి), శుక్రవారం ఓఎస్ఎస్సీ–1, 2 ఉంటాయని పేర్కొంది. -
కర్ణాటకలో కాంగ్రెస్‌దే హవా! శరద్ పవార్
కర్ణాటకలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా అని ధీమాగా చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇటర్వ్యూలో మాట్లాడుతూ..కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసే గెలుస్తుందని నమ్మకంగా చెప్పారు. ఐతే ఈ ఎన్నికలను వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల కోణంలో చూడలేం. కానీ బీజేపీ మాత్రం ఎన్నికల ప్రచారంలో జాతీయ అంశాలను రాష్ట్ర సమస్యలతో ముడిపెట్టే యత్నం చేస్తోంది. నా అంచనా ప్రకారం కర్ణాటకలో రెండు రకాలు ఎన్నికలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఇవి జాతీయ ఎన్నికలు కానీ రాష్ట్రాలకు సాధారణ ఎన్నికలే. ఐతే రాష్ట్ర ఎన్నికల్లో వేరే గేమ్ స్ట్రాటజీ ఉంటుంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో బీజేపీ ప్రభుత్వాలు కావు అందువల కర్ణాటకలో కచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే రాష్ట్రాలలో బీజేపీయేతర పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలుపొందాయో అందరికీ తెలుసు కాబట్టి రాష్ట్ర ఎన్నికల విషయానికి వస్తే వాస్తవ పరిస్థితులను విభిన్నంగా ఉంటాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ఎమ్మెల్యేలు విడిపోయి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి అనేక రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలే అధికారంలో ఉన్నాయి. వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల గురించి ప్రతిపక్షాలు కలిసి ఏదో ఒకటి చేయాలని లేకుంటే బీజేపీని ఓడించడం కష్టం. అందరూ ఐక్యంగా ఉండి చేస్తే గానీ బీజేపీని మట్టికరిపించలేం అని పవార్ అన్నారు. కాగా, ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. 2008లో దేశంలో దక్షిణాది ప్రాంతంలో తొలిసారిగా అధికారంలోకి రావడంతో అదే రాష్ట్రంలో మరో దఫా విజయం సాధించాలని బీజేపీ గట్టిగా యత్నిస్తోంది. (చదవండి: కర్ణాటక ఎన్నికల్లో పన్నీరు శిబిరం) -
ఐటీ రిటర్న్స్ @ 6.85 కోట్లు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్స్ 2021–22 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్) సంబంధించి ఇప్పటి వరకూ 6.85 కోట్లు దాఖలయినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. డిసెంబర్ 31 వరకూ తుది గడువు ఉండడంతో రిటర్న్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. 2021–22కిగాను ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్‌లు) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం ఉన్న కార్పొరేట్లు, ఇతరులకు తుది గడువు నవంబర్ 7. గడువు తప్పినట్లయితే, పన్ను చెల్లింపుదారులు జరిమానా చెల్లించడం ద్వారా ఆలస్యంగా కూడా రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. దీనికి చివరి తేదీ డిసెంబర్ 31. 2020–21 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించి 2021–22లో ఇప్పటి వరకూ అత్యధికంగా 7.14 కోట్ల రిటర్న్స్ దాఖలయ్యాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2019–20 అసెస్ మెంట్ ఇయర్‌కు సంబంధించి 2020–21లో దాఖలైన) ఈ సంఖ్య 6.97 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ రిఫండ్స్ విలువ (31 శాతం వృద్ధితో రూ. 2లక్షల కోట్లు. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.10.54 లక్షల కోట్లుకాగా, రిఫండ్‌స పోను మిగిలిన మొత్తం రూ.8.54 లక్షల కోట్లు. వార్షిక బడ్జెట్ అంచనాల్లో ఈ విలువ 61.31 శాతానికి చేరింది. మార్చినాటికి నికర వసూళ్లు లక్ష్యం రూ.14.20 లక్షలకు మించి 30 శాతం మేర పెరగవచ్చని అంచనా. -
బాబోయ్.. నల్లధనంపై రూ.14,820 కోట్ల పన్ను డిమాండ్!
న్యూఢిల్లీ: నల్లధనం చట్టం కింద వెల్లడించని విదేశీ ఆదాయానికి సంబంధించి 368 కేసుల్లో (అసెస్మెంట్ పూర్తయిన తర్వాత) రూ.14,820 కోట్ల పన్ను డిమాండ్ నోటీసుల జారీ అయినట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. నల్లధనంపై పన్ను వసూళ్లకు సంబంధించి 2022 మే 31వ తేదీ వరకూ డేటాపై లోక్‌సభలో ఆమె ఒక లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. హెచ్ఎస్బీసీలో రిపోర్టు (పేర్కొనని) చేయని విదేశీ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లకు సంబంధించిన కేసుల్లో రూ.8,468 కోట్లకు పైగా వెల్లడించని ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చిందని తెలిపారు. దీనికి సంబంధించి రూ.1,294 కోట్లకు పైగా జరిమానా విధించడం జరిగిందని వివరించారు. 30 సెప్టెంబర్ 2015తో ముగిసిన బ్లాక్ మనీ (బహిర్గతం కాని విదేశీ ఆదాయం, ఆస్తులు) ఇంపోజిషన్ ఆఫ్ టాక్స్ యాక్ట్, 2015 కింద ఒన్ టైమ్ సెటిల్మెంట్గా (మూడు నెలల పరిమితితో) 648 కేసులకు సంబంధించి రూ.4,164 కోట్ల విలువైన వెల్లడించని ఆస్తులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుల్లో రూ.2,476 కోట్లకుపైగా మొత్తాన్ని పన్నులు, పెనాలిటీ రూపంలో వసూలయినట్లు ఆమె తెలిపారు. భారతీయులు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బుపై అడిగిన ప్రశ్నలకు సీతారామన్ సమాధానం చెబుతూ, ‘‘భారత పౌరులు, కంపెనీలు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బుపై అధికారిక అంచనా లేదు’’ అని ఆర్థికమంత్రి అన్నారు. భారతదేశ నివాసితులు స్విట్జర్లాండ్‌లో కలిగి ఉన్న డిపాజిట్లను విశ్లేషించడానికి స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) వార్షిక బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్ సోర్స్‌ను ఉపయోగించరాదని స్విస్ అధికారులు తెలియజేసినట్లు మంత్రి తెలిపారు. స్విట్జర్లాండ్‌లో ఉన్న భారతీయ నివాసితుల డిపాజిట్లను విశ్లేషించడానికి బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్‌కు సెటిల్మెంట్ (బీఐఎస్)కు చెందిన ‘‘లొకేషనల్ బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్’’ అని పిలిచే మరొక డేటా సోర్స్‌ను వినియోగించుకోవచ్చని కూడా వారు వెల్లడించినట్లు తెలిపారు. లొకేషనల్ బ్యాంకింగ్ స్టాటిస్టిక్స్ ప్రకారం, 2021లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లలో 8.3 శాతం క్షీణత నమోదయినట్లు మీడియా నివేదికలు తెలుపుతున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. వెల్లడించని విదేశీ ఆస్తులు, ఆదాయాలపై పన్ను విధించేందుకు ప్రభుత్వం ఇటీవలి కాలంలో చేపట్టిన పలు చర్యలను కూడా ఆమె ఈ సందర్భంగా సభకు వివరించారు. -
National Education Policy–2020: సీబీఎస్ఈ పరీక్షల తీరులో సంస్కరణలు
న్యూఢిల్లీ: విద్యార్థుల్లోని అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేసే పద్ధతిలో నూతన సంస్కరణలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమల్లోకి తీసుకురావాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్ణయించింది. విద్యార్థులు ఆర్జించిన నైపుణ్యాలు, సామర్థ్యాల ఆధారంగా వారి ప్రతిభను పూర్తిస్థాయిలో మదింపు(అసెస్మెంట్) చేసేలా కొత్త మార్పులు తీసుకొస్తున్నట్లు సీబీఎస్ఈ ఇప్పటికే ప్రకటించింది. జాతీయ విద్యా విధానం–2020ను ప్రాతిపదికగా తీసుకొని ఈ మార్పులు ఉంటాయని పేర్కొంది. విద్యార్థుల ప్రతిభను మదింపు చేసే సంస్కరణలను కొన్ని స్కూళ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. మంచి ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. అందుకే అన్ని స్కూళ్లలో అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి చెప్పారు. కొత్త మార్పులు ఏమిటంటే.. విద్యార్థుల నైపుణ్యాలను సమగ్రంగా అంచనా వేయడానికి వీలుగా ప్రాక్టికల్ పరీక్షలు లేని సబ్జెక్టులకు కూడా ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్ల అభిప్రాయాల ఆధారంగా 20 శాతం మార్కులు కేటాయిస్తారు. అంటే అన్ని సబ్జెక్టుల్లో ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. క్వశ్చన్ పేపర్లో ప్రశ్నల సంఖ్యను మరో 33 శాతం పెంచుతారు. వాటిలో తగిన ప్రశ్నలను ఎంచుకొని, సమాధానాలు రాసే అవకాశాన్ని కల్పిస్తారు. సమర్థత, నైపుణ్యాలను నిశితంగా పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. పుస్తకాల్లో లేని ప్రశ్నలు అడిగేందుకు ఆస్కారం ఉంది. విద్యార్థులు విశ్లేషణాత్మకంగా ఆలోచించి, సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 3, 5, 8 తరగతుల పిల్లలకు సామర్థ్య సర్వే పరీక్షలు నిర్వహిస్తారు. ఇవి మార్కుల ఆధారంగా ఉండవు. విద్యార్థుల అభ్యసన స్థాయి, గతంలో పోలిస్తే ప్రతిభను ఎంతవరకు మెరుగుపర్చుకున్నారో వీటిద్వారా తెలుస్తుంది. విద్యార్థుల టాలెంట్‌ను అన్ని కోణాల్లో అంచనా వేసేలా ప్రత్యేక ప్రోగ్రెస్ కార్డ్‌ను సీబీఎస్ఈ జారీ చేస్తుంది. -
రిస్కలను సరిగ్గా అంచనావేయకపోతే ఇబ్బందులు
కోల్‌కతా: వ్యవస్థలో నగదు లభ్యత సమృద్ధిగా ఉన్నందున సమస్యలను (రిస్కలను) సరిగ్గా అంచనా వేయకపోతే ఆందోళనకు దారితీస్తుందన్నారు ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా. ‘‘బ్యాంకింగ్ వ్యవస్థలోకి డిపాజిట్లు వచి్చపడుతున్నాయి. కానీ, రుణాల వృద్ధి పుంజుకోవాల్సి ఉంది. దీంతో బ్యాంకులు ప్రత్యామ్నాయ పెట్టుబడి వేదికలైన టీ బిల్లులవైపు చూడాల్సి వస్తుంది. కానీ, ఈ ప్రత్యామ్నాయ మార్కెట్ పరిధి తక్కువ. దీంతో రిస్‌్కలను సరిగ్గా అంచనా వేయలేకపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ, బ్యాంకింగ్ వ్యవస్థ నిరర్థక ఆస్తుల (ఎన్పీఏలు) రూపంలో తగినంత అనుభవాలు నేర్చుకున్నందున.. అండర్‌రైటింగ్ ప్రమాణాల విషయంలో రాజీ ఉంటుందని నేను అనుకోవడం లేదు’’ అని ఖారా బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇం డస్ట్రీ నిర్వహించిన వెబినార్‌లో భాగంగా చెప్పారు, -
హోమ్‌వర్క్ చెయ్యండి .. మాస్టారు!
‘‘మేము ఉద్యోగం చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, సక్రమంగా పన్నులు కట్టి రిటర్నులు వేస్తున్నాం, మాకు ఇంకా హోమ్‌వర్క్ ఏమిటండీ’’ అని తీసిపారేయకండి. నిజంగా నూటికి నూరు పాళ్లు స్వయంగా హోమ్‌వర్క్ చేసి మీ పన్నుభారాన్ని మీరే లెక్కించుకోండి. ఎవరితోనూ పోల్చుకోవద్దు. పోటీ పడొద్దు. మీ యజమాని లెక్కించిన పన్నుభారాన్ని కూడా నమ్మవద్దు. 2021 మార్చి 31తో పూర్తయ్యే సంవత్సరం ప్రతి అసెస్సీ రెండు విధానాలుగా, రకాలుగా పన్నుభారాన్ని లెక్కించుకోవచ్చు. పాత పద్ధతి ప్రకారం అ న్ని మినహాయింపులు పరిగణిస్తూ పాత శ్లాబుల ప్ర కారం, పాత రేట్ల ప్రకారం పన్నుభారం లెక్కించ డం ఒక విధానం. ఇక రెండోది, కొత్తది సెక్షన్ 115 BAC ప్రకారం ఎటువంటి మినహాయింపులు, తగ్గింపులు తీసుకోకుండా కొత్త శ్లాబుల ప్రకారం కొత్త రేట్ల ప్ర కారం పన్నుభారం లెక్కించాలి. 115 BAC ప్రకారం .. కొత్త పద్ధతిలో 60 సంవత్సరాలు లోపు ఉన్నా, 60–80 ఏళ్ల సీనియర్ అయినా, 80 దాటిన సూపర్ సీనియర్ అయినా ఇవే రేట్లు. ఈ నేపథ్యంలో ఒక కేసు చూద్దాం. 80 సంవత్సరాలు దాటి పెన్షన్ పొందుతున్న శర్మగారు యజమానికి ఏమీ చెప్పకపోవడం వల్ల పాత పద్ధతిలో పన్ను కోశారు. వారి పెన్షను రూ. 11,20,000 కాగా స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000 తీసివేసి, పాత రేట్ల ప్రకారం పన్ను భారం రూ. 1,25,840గా ఉంటుంది. కానీ కొత్త రేట్ల ప్రకారం పన్ను భారం రూ. 1,02,960గా ఉంటుంది. శర్మగారికి వారి యజమాని రూ. 22,880 ఎక్కువగా కోశారు. ఫారం 16,ఫారం 26 అ లో ఉన్న సమాచారం కూ డా చెక్ చేసుకోండి. శర్మగారు కొత్త పద్ధతి ప్రకారం వేసుకుంటే రూ. 22,880 రిఫండు వస్తుంది. ఒక ప్రభుత్వ సంస్థ ఉద్యోగి ఫారం 26 అ లో రూ. 55 కోట్ల జీఎస్టీ టర్నోవరు పడింది. నిజానికి ఆ ఉద్యోగికి ఎటువంటి వ్యాపారం లేదు. కానీ ఆయన పాన్ నంబరును ఒక సంస్థ వారు తస్కరించి, వాడుకోవడం వల్ల ఇలా జరిగింది. మరో ఉద్యోగి రావుగారు రిటైర్ అయ్యారు. వయస్సు 70 ఏళ్లు. పెన్షన్ రూ. 3,00,000, ఇంటి మీద ఆదాయం (నికరంగా) రూ. 3,20,000, 80సి సేవింగ్స్ రూ. 1,50,000, 80డి కింద రూ. 30,000, వృత్తి పన్ను రూ. 2,400 కాగా వీరికి టీడీఎస్ రూ. 12,000 అనుకుందాం. పాత పద్ధతి ప్రకారం నికర ఆదాయం రూ. 5,00,000 లోపల ఉంది కావున పన్నుభారం లేదు. టీడీఎస్ మొత్తం రిఫండు వస్తుంది. కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే మొత్తం పన్నుభారం రూ. 25,480, టీడీఎస్ పోను అదనంగా కట్టాలి. అంటే వీరికి పాత పద్ధతే బెస్ట్. మీ కేసు, మీ కేసే! శర్మగారితో, రావుగారితో పక్కింటి పరంధామయ్యగారితో, వెనకింటి వెంకట్రావుగారితో పోలిక లేదు. నికర ఆదాయం రూ. 5,00,000 లోపల పాత పద్ధతి ప్రకారం పైసా కూడా పన్ను అవసరం లేదు. కొత్త పద్ధతి అనుసరిస్తే నికర ఆదాయం రూ. 2,50,000 వరకూ పన్ను లేదు. పాత పద్ధతిలో అన్ని మినహాయింపులు పొందవచ్చు. కొత్త పద్ధతిలో సర్వసంగపరిత్యాగిలాగా ఏ మినహాయింపు, తగ్గింపు, ప్రయోజనం పొందడానికి ఉండదు. అందుకే కాస్త ఓపికగా హోమ్‌వర్క్ చేసి పన్నుభారాన్ని లెక్కించండి. ఎంపిక చేసుకున్నప్పుడు ఏ తప్పులూ చేయకుండా అంకెలు వేసుకోండి. ఎంపిక చేసుకోండి. ఈ లోపలే స్టేట్మెంట్లు రెండు పద్ధతుల్లోనూ చేసుకుని రెడీగా ఉంచుకుని, కావాల్సినది ఎంచుకోండి. -
జీ మ్యాట్ ఆన్లైన్ పరీక్షలో మరో విభాగం
న్యూఢిల్లీ: గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్) ఆన్లైన్ పరీక్షా విధానంలో గతంలో తొలగించిన అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్(ఏడబ్ల్యూఏ) విభాగాన్ని తిరిగి చేర్చారు. పరీక్షార్థులకు అదనపు సౌలభ్యాన్ని అందించడంతోపాటు, వాస్తవ పరీక్షా కేంద్రం అనుభూతినిచ్చేందుకు చేపట్టిన పలు చర్యల్లో ఇది కూడా ఒకటని జీమ్యాట్‌ను నిర్వహించే గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్(జీమ్యాక్) తెలిపింది. వేగంగా మారుతున్న మార్కెటింగ్ అవసరాలకు అనుగుణంగా ఏడబ్ల్యూఏ వంటి జీమ్యాట్లోని కొన్ని అంశాలను ప్రారంభ ఆన్లైన్ పరీక్షలో తొలగించినట్లు జీమ్యాక్ అధికారులు తెలిపారు. కోవిడ్–19 మహమ్మారి కారణంగా జీమ్యాట్‌ను ఆన్లైన్ ద్వారా జీమ్యాక్ చేపడుతోంది. ఇప్పటి వరకు 150 దేశాలు, ప్రాంతాల్లో 45 వేలకుపైగా పరీక్షలు చేపట్టినట్లు జీమ్యాక్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2,300 బిజినెస్ స్కూళ్లలో ప్రవేశాలకు జీమ్యాట్‌నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎంబీఏ ప్రవేశాలు ప్రతి పదింటిలో తొమ్మిదింటికి జీమ్యాట్ స్కోరే ఆధారం. జీమ్యాక్ అనే లాభాపేక్ష లేని సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 223 గ్రాడ్యుయేట్ బిజినెస్ స్కూళ్లున్నాయి. చదవండి: పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే! ఆపిల్ కంప్యూటర్ ఖరీదు రూ.11కోట్లు? -
పర్యావరణ రక్షణకు కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ/గాంధీనగర్: పర్యావరణానికి హాని కలగని రీతిలో సుస్థిర, సంతులిత అభివృద్ధి సాధించడం భారత్ అవలంబిస్తున్న విధానమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఉష్ణోగ్రతలో పెరుగుదల 2 డిగ్రీల సెల్సియల్ లోపే ఉండాలన్న పారిస్ పర్యావరణ ఒప్పందాన్ని అమలు చేస్తున్న అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటని గుర్తు చేశారు. వన్య వలస జాతుల పరిరక్షణపై గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న 13వ ‘‘కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీస్(సీఓపీ–13) ఆఫ్ ద కన్వెన్షన్ ఆన్ ది కన్సర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్(సీఎంఎస్)’’ని ఉద్దేశించి ప్రధాని మోదీ సోమవారం వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ, సమతుల్య జీవన విధానం, గ్రీన్ డెవలప్మెంట్.. తదితర విలువలతో కూడిన కార్యాచరణతో వాతావరణ మార్పుపై భారత్ పోరాడుతోందని మోదీ తెలిపారు. ‘సంతులిత అభివృద్ధిని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుంది. పర్యావరణానికి హాని చేయకుండానే అభివృద్ధి సాధ్యమని మేం నిరూపిస్తున్నాం’ అన్నారు. ‘వలస జాతులు ఈ భూగ్రహాన్ని అనుసంధానిస్తాయి. మనం ఉమ్మడిగా వాటికి ఆహ్వానం పలుకుదాం’ అని సీఓపీ–13కి స్లోగన్ థీమ్‌గా పెట్టారు. కన్వెన్షన్ అధ్యక్ష బాధ్యతలను వచ్చే మూడేళ్లు భారత్ నిర్వహించనుందని ప్రధాని వెల్లడించారు. వలస పక్షుల పరిరక్షణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. పర్యావరణ, జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పర్యావరణ మంత్రి జవదేకర్ అన్నారు. జనాభా తగ్గుతోంది అంతరించే ప్రమాదంలో ఉన్న వన్య వలస జాతుల్లో అత్యధిక శాతం జాతుల జనాభా గణనీయంగా తగ్గుతోందని ‘13వ సీఎంఎస్ సీఓపీ’ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ప్రాథమిక అంచనాయేనని, పూర్తిగా నిర్ధారణ చేసేందుకు సహకారంఅవసరమని సీఎంఎస్ కార్యనిర్వాహక కార్యదర్శి అమీ ఫ్రేంకెల్ పేర్కొన్నారు. -
ఈ ఏడాది ఐటీఆర్ ఫామ్స్ నోటిఫై...
న్యూఢిల్లీ: అసెస్మెంట్ ఇయర్ 2019–20కి సంబంధించి వ్యక్తులు, కంపెనీలకు ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్ ఫామ్స్‌ను ఆదాయపు పన్ను శాఖ నోటిఫై చేసింది. వేతన వర్గం ఫైల్ చేసే ఐటీఆర్–1 లేదా సహజ్‌ల్లో ఎటువంటి మార్పులూ లేవు. అయితే ఐటీఆర్ 2,3,5,6,7ల్లో కొన్ని సెక్షన్లను హేతుబద్ధీకరించడం జరిగింది. 2018–19లో సంపాదించిన ఆదాయానికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, కంపెనీలు రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు తుది గడువు జూలై 31. తమ అకౌంట్లకు ఆడిట్లు అవసరం లేని వారికి ఈ గడువు వర్తిస్తుంది. -
జనం మదిలో ఏముంది?
► రెండున్నరేళ్ల పాలనపై ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యేలను ఆరా తీస్తున్న సీఎం కేసీఆర్ ► ఒక్కో జిల్లాకు చెందిన శాసనసభ్యులతో ప్రత్యేక భేటీలు ► ఇప్పటికే మూడు జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశం ► అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వాకబు.. ప్రతిపక్ష పార్టీల పరిస్థితిపైనా చర్చ ► ప్రజలతో కలసి పనిచేయాలని సూచనలు సాక్షి, హైదరాబాద్ రెండున్నరేళ్ల పాలనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వీయ సమీక్ష చేసుకుంటున్నారా? ఇందుకు ఆయనే స్వయంగా రంగంలోకి దిగారా? క్షేత్రస్థాయి వాస్తవాలపై ఎమ్మెల్యేలను ఆరా తీస్తున్నారా? అధికార పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఇందుకు అవుననే సమాధానం వస్తోంది! ‘ప్రజలు ఏమనుకుంటున్నారు’ అన్న ప్రశ్న చుట్టూ సమాధానాలు రాబట్టే పనిలో సీఎం తలమునకలయ్యారు. ఇందుకు ఆయన ఒక్కో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూడు జిల్లాల ఎమ్మెల్యేలతో ఈ భేటీలు ముగిశాయి. ‘‘మీ జిల్లా పరిస్థితి ఏంటి? మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? క్షేత్ర స్థాయిలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా?’’ అంటూ సీఎం కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకుంటున్నారు. రెండున్నరేళ్ల పాలన తీరుపై నేరుగా సమాచారం సేకరిస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై ఆరా.. గడచిన రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న అంశంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా డబుల్ బెడ్రూం ఇళ్లపై నియోజకవర్గాల్లో ప్రజల మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరీపై కొంత అసంతృప్తి ఉందని చెప్పారు. రూ.వెయ్యి చొప్పున ఇస్తున్న పెన్షన్లపై ఎలాంటి అభిప్రాయం ఉందని కూడా సీఎం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నామని, కానీ కాంగ్రెస్ పార్టీ కేసులతో ప్రభుత్వం కాళ్లలో కట్టెలు పెడుతోందని ఎమ్మెల్యేలతో సీఎం అన్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. దీనిపై ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాల్లో ఏం చేశారని కూడా అడిగినట్లు తెలిసింది. సీఎంవోకు చెందిన ఒకర్దిదరు అధికారులు మినహా ఇతర అధికారులెవరూ లేకుండానే ఎమ్మెల్యేలతో ఈ భేటీలు జరుగుతున్నాయి. నియోజకవర్గాల్లో అధికారుల పనితీరు ఎలా ఉంది? వారు సహకరిస్తున్నారా.. లేదా? అన్న విషయాలు అడిగి తెలుసుకుంటున్నారని వినికిడి. మరో రెండున్నరేళ్లలోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పట్నుంచే నియోజకవర్గాల పరిస్థితిపై సీఎం ఓ అంచనాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఓడిన అభ్యర్థి ఎవరు? ఏం చేస్తున్నారు? నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీల పరిస్థితిపైనా సీఎం వివరాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటిదాకా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశాల్లో పూర్తిస్థాయిలో ఈ వివరాలు తెలుసుకున్నారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి ఎవరు? ఏ పార్టీ? వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా ఆందోళనలు చేశారా? వాటిలో ప్రజలు ఏ స్థాయిలో పాల్గొంటున్నారు.. వంటి సమచారాన్ని కూడా అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఒక్కో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను పిలిపించి అందరి ఎదుటే జిల్లాతోపాటు నియోజకవర్గం పరిస్థితిపైనా చర్చిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలతో మాత్రం ప్రత్యేకంగా ముఖాముఖి మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్‌కు వచ్చే ప్రతి ఎమ్మెల్యే విధిగా క్యాంపు కార్యాలయంలో తనను కలిసేలా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. సమస్యలేంటి? పరిష్కారం ఎలా? సమావేశాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యేలతో వారి నియోజకవర్గాల్లోని సమస్యలపైనా సీఎం చర్చిస్తున్నారు. ఏం పనులు కావాలి? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? వాటిని ఎలా పరిష్కరించాలి? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకే అందుతున్నాయా? మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇంకా ఏమైనా కొత్త పథకాలు చేపట్టాలా? అన్న అంశంపైనా సీఎం ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ పనితీరును తెలుసుకుంటూనే ఎమ్మెల్యేల పనితీరును కూడా బేరీజు వేస్తున్నారని సమాచారం. హైదరాబాద్‌లో, నియోజకవర్గ కేంద్రాల్లోనో ఉంటున్నారా? నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గాల్లో తమ పరిస్థితి బాగానే ఉందని కొందరు ఎమ్మెల్యేలు జవాబు ఇవ్వగా.. తన వద్ద ఉన్న రిపోర్టు అలా లేదని, జాగ్రత్తగా చూసుకోండని వారికి సీఎం సలహా ఇచ్చారని తెలిసింది. ప్రజలతో కలిసి పనిచేసేందుకు ఎమ్మెల్యేలకు సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. మొత్తంగా చాలా ముందుగానే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని తెలుసుకోవడం, తమను పిలిచి మాట్లాడడంపై ఎమ్మెల్యేల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇదంతా భవిష్యత్ ఎన్నికల ప్రణాళికను పకడ్బందీగా తయారు చేసుకునేందుకు జరుగుతున్న కసరత్తులో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
అమితాబ్ కు మళ్లీ ‘ఐటీ’ చిక్కులు!
♦ పాత అసెస్మెంట్ను తిరగదోడేందుకు ♦ ఐటీ శాఖకు సుప్రీం అనుమతి న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను(ఐటీ) చెల్లింపు వివాదానికి సంబంధించి బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు మళ్లీ చిక్కులు మొదలయ్యాయి. 2001-02 అసెస్మెంట్ ఏడాదికిగాను అమితాబ్ ఆదాయ వివరాల వెల్లడి విషయంలో తాము వేసిన కేసును మళ్లీ తిరగదోడేందుకు ఐటీ శాఖను సుప్రీం కోర్టు బుధవారం అనుమతించింది. జస్టిస్ రంజన్ గొగోయ్, పీసీ పంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది. అమితాబ్ ఐటీ చెల్లింపునకు సంబంధించి మళ్లీ మదింపు(అసెస్మెంట్) చేయాలంటూ ముంబై ఐటీ కమిషర్ ఇచ్చిన ఆదేశాలను బెంచ్ సమర్థించింది. ఐటీ శాఖ దాఖలు చేసిన రెండు ప్రత్యేక అభ్యర్ధనలకు అంగీకరించడంతోపాటు అంతక్రితం ఈ కేసులో బాంబే హైకోర్టు, ఐటీ అప్పీలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ) ఇచ్చిన తీర్పులను పక్కనబెడుతున్నట్లు కూడా ధర్మాసనం పేర్కొంది. 2001-02లో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ క్విజ్ ప్రోగామ్ నిర్వహణకు గాను అమితాబ్‌కు భారీమొత్తంలో పారితోషకం లభించిందని.. అయితే, ఆయన మాత్రం తమకు రూ.కోట్లలో పన్నును చెల్లించాల్సి ఉన్నప్పటికీ, చెల్లించకుండా తప్పించుకున్నారనేది ఐటీ శాఖ వాదన.