
సాక్షి, అమరావతి: 1–10 తరగతి విద్యార్థులకు ఆగస్ట్ 1–4వ తేదీ వరకు క్లాస్ బేస్డ్ అసెస్‌మెంట్ (సీబీఏ–1) పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. మంగళ, బుధ, గురువారాల్లో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం తెలుగు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఓఎస్‌ఎస్‌సీ (మూడు నుంచి ఐదు తరగతులకు), మధ్యాహ్నం గణితం, ఇంగ్లిష్ పార్ట్–ఏ, మూడు, నాలుగు, ఐదు తరగతులకు పార్ట్–బి అసెస్‌మెంట్ నిర్వహించనున్నారు.
6,7,8 తరగతులకు మంగళవారం మధ్యాహ్నం సెషన్‌లో తెలుగు, గణితం, బుధవారం హిందీ, జనరల్ సైన్స్, గురువారం సోషల్ స్టడీస్, ఇంగ్లిష్ పార్ట్–ఎ, పార్ట్–బి, శుక్రవారం ఓఎస్‌ఎస్‌సీ–1, 2 పేపర్లు ఉంటాయి. 9,10 తరగతులకు మంగళవారం ఉదయం తెలుగు, మ్యాథ్స్, బుధవారం ఉదయం హిందీ, జనరల్ సైన్స్, గురువారం సోషల్ స్టడీస్, ఇంగ్లి‹Ù, ఇంగ్లిష్ పార్ట్–బి (తొమ్మిదో తరగతికి), శుక్రవారం ఓఎస్‌ఎస్‌సీ–1, 2 ఉంటాయని పేర్కొంది.