
కోల్‌కతా: వ్యవస్థలో నగదు లభ్యత సమృద్ధిగా ఉన్నందున సమస్యలను (రిస్కలను) సరిగ్గా అంచనా వేయకపోతే ఆందోళనకు దారితీస్తుందన్నారు ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ ఖారా. ‘‘బ్యాంకింగ్ వ్యవస్థలోకి డిపాజిట్లు వచి్చపడుతున్నాయి. కానీ, రుణాల వృద్ధి పుంజుకోవాల్సి ఉంది. దీంతో బ్యాంకులు ప్రత్యామ్నాయ పెట్టుబడి వేదికలైన టీ బిల్లులవైపు చూడాల్సి వస్తుంది. కానీ, ఈ ప్రత్యామ్నాయ మార్కెట్ పరిధి తక్కువ. దీంతో రిస్‌్కలను సరిగ్గా అంచనా వేయలేకపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ, బ్యాంకింగ్ వ్యవస్థ నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏలు) రూపంలో తగినంత అనుభవాలు నేర్చుకున్నందున.. అండర్‌రైటింగ్ ప్రమాణాల విషయంలో రాజీ ఉంటుందని నేను అనుకోవడం లేదు’’ అని ఖారా బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇం డస్ట్రీ నిర్వహించిన వెబినార్‌లో భాగంగా చెప్పారు,