![Deposit rates are at their peak says SBI Chairman Dinesh Kumar Khara](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/06/13/SBI.jpg.webp?itok=lK1S_mS7)
ఎస్‌బీఐ చీఫ్ దినేష్ కుమార్ ఖారా
న్యూఢిల్లీ: డిపాజిట్ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, మధ్య కాలికంగా తగ్గే అవకాశం ఉందని ఎస్‌బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా విశ్లేషించారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం నుంచి ఆర్‌బీఐ కూడా తన వడ్డీ రేట్ల వ్యవస్థను వెనక్కు మళ్లించడం ప్రారంభించవచ్చని ఖారా అంచనావేశారు.
స్విట్జర్లాండ్, స్వీడన్, కెనడా, యూరో ఏరి యా వంటి అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్ బ్యాంకులు 2024లో తమ రేటు సడలింపు ప్రక్రియ ను ప్రారంభించాయి. అయితే, ద్రవ్యోల్బణం నిలకడ నేపథ్యంలో అమెరికా సెంట్రర్ బ్యాంక్ –ఫెడ్ ఫండ్ రేటు తగ్గింపు ప్రణాళికలను వెనక్కి తీసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. కాగా, బుధవారం ఫెడ్ తన యథాతథ వడ్డీ రేటును (5.25%–5.5%) కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment