deposit rates
-
SBI Chairman Dinesh Kumar Khara: డిపాజిట్ రేట్లు తగ్గుతాయ్
న్యూఢిల్లీ: డిపాజిట్ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, మధ్య కాలికంగా తగ్గే అవకాశం ఉందని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా విశ్లేషించారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం నుంచి ఆర్బీఐ కూడా తన వడ్డీ రేట్ల వ్యవస్థను వెనక్కు మళ్లించడం ప్రారంభించవచ్చని ఖారా అంచనావేశారు. స్విట్జర్లాండ్, స్వీడన్, కెనడా, యూరో ఏరి యా వంటి అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్ బ్యాంకులు 2024లో తమ రేటు సడలింపు ప్రక్రియ ను ప్రారంభించాయి. అయితే, ద్రవ్యోల్బణం నిలకడ నేపథ్యంలో అమెరికా సెంట్రర్ బ్యాంక్ –ఫెడ్ ఫండ్ రేటు తగ్గింపు ప్రణాళికలను వెనక్కి తీసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. కాగా, బుధవారం ఫెడ్ తన యథాతథ వడ్డీ రేటును (5.25%–5.5%) కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
చాలా కాలం తర్వాత ఎఫ్డీలకు కళ!
ముంబై: చాలా ఏళ్ల విరామం తర్వాత బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లు ఆకర్షణీయంగా మారుతున్నాయి. వడ్డీ రేట్లు 8 శాతాన్ని దాటాయి. ప్రభుత్వరంగంలోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అత్యధికంగా 8–8.5 శాతం వరకు రేట్లను ఆఫర్ చేస్తోంది. ద్రవ్యోల్బణం మించి రాబడిని బ్యాంక్‌లు 200–800 రోజుల డిపాజిట్లపై ఇస్తున్నాయి. ఆర్థిక రంగ కార్యకలాపాలు ఊపందుకోవంతో రుణాలకు డిమాండ్ నెలకొంది. రుణ డిమాండ్‌ను అందుకునేందుకు బ్యాంక్‌లు నిధుల కోసం వేట మొదలు పెట్టాయి. ఫలితంగా డిపాజిట్ రేట్లను సవరిస్తున్నాయి. జనవరి నెలకు ద్రవ్యోల్బణం 6.52 శాతంగా ఉండడం గమనించాలి. రుణాలకు డిమాండ్.. జనవరి 13తో ముగిసిన 15 రోజుల్లో బ్యాంకుల రుణ వృద్ధి 16.5 శాతంగా (వార్షికంగా చూస్తే) ఉంది. కానీ, అదే కాలంలో డిపాజిట్లలో వృద్ధి 10.6 శాతంగా ఉంది. ఇక గత ఏడాది కాలంలో డిపాజిట్లలో వృద్ధి 6 శాతం మించి లేదు. ఇటీవల వడ్డీ రేట్లు పెరగడంతో డిపాజిట్లలోనూ వృద్ధి మొదలైందని చెప్పుకోవాలి. ఏడాది కాల పోస్టాఫీసు డిపాజిట్‌పై రేటు 6.6 శాతంగా ఉంటే, రెండేళ్ల కాలానికి 6.8 శాతంగా ఉంది. పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీ ఈల్డ్ 7.35 శాతంగా ఉంది. వీటితో ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్లు పోటీపడుతున్నాయి. ఆర్బీఐ గతేడాది మే నుంచి రెపో రేటును 2.5 శాతం మేర పెంచింది. దీంతో బ్యాంకులు సైతం రుణాలపై ఇంతే మేర రేట్లు పెంచాయి. ఫలితంగా డిపాజిట్లపై మరింత రాబడిని ఆఫర్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. కానీ, రుణాలపై పెంచిన స్థాయిలో రేట్లను డిపాజిట్లపై ఆఫర్ చేయకపోవడాన్ని గమనించొచ్చు. బ్యాంకుల వారీ రేట్లు.. ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 200–800 రోజుల కాలానికి వడ్డీ రేట్లు 7–7.25శాతం స్థాయిలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 20వేల శాఖలతో అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ 400 రోజుల డిపాజిట్‌పై 7.10 శాతం రేటును ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు మరో అర శాతం అదనంగా ఇస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 444 రోజుల డిపాజిట్‌పై 7.35 శాతం రేటును ఇస్తోంది. యూనియన్ బ్యాంక్ 800 రోజుల డిపాజిట్‌పై 7.30 శాతం, పీఎన్బీ 666 రోజుల డిపాజిట్‌పై 7.25 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 444 రోజులు డిపాజిట్‌పై ఇంతే మేర ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 200 రోజుల డిపాజిట్‌పై 7 శాతం ఇస్తుంటే, కెనరా బ్యాంక్ 400 రోజుల డిపాజిట్‌పై 7.15 శాతం, యూకో బ్యాంక్ 666 రోజుల డిపాజిట్‌పై 7.15 శాతం చొప్పున ఆఫర్ చేస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ 7 శాతం చొప్పున ఇస్తున్నాయి. -
డిపాజిట్ రేట్ల షాక్: తగ్గనున్న బ్యాంకింగ్ మార్జిన్లు
ముంబై: డిపాజిట్ రేట్ల పెరుగుదల నేపథ్యంలో బ్యాంకులు వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) మార్జిన్ల ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని గ్లోబల్ రేటింగ్ దిగ్గజం-ఫిచ్ తన తాజా నివేదికలో పేర్కొంది. రానున్న మార్చితో ముగిసే 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటు నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 3.55 ఉంటే, 2023-24లో ఇది 3.45 శాతానికి తగ్గుతుందన్నది ఫిచ్ అంచనా. సుస్థిర అధిక రుణవృద్ధికి మద్దతు ఇవ్వడానికి పలు బ్యాంకులు భారీగా డిపాజిట్ల సేకరణకు మొగ్గుచూపుతుండడం తాజా ఫిచ్ నివేదిక నేపథ్యం. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరంలో సగటు నికర వడ్డీమార్జిన్ 3.1 శాతం అని పేర్కొన్న ఫిచ్, తాజా అంచనా గణాంకాలు అంతకుమించి ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. నివేదికలో మరిన్ని విశేషాలు చూస్తే.. ► మార్జిన్లో 10 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గుదల అంటే సమీప కాలంలో బ్యాంకుల లాభదాయకతను ప్రభావితం చేసే అవకాశం లేదు. అధిక రుణ వృద్ధి వల్ల అధిక ఫీజు ఆదాయం రూపంలో వస్తుంది. అలాగే ట్రజరీ బాండ్ల ద్వారా లాభాలూ ఒనగూరుతాయి. వెరసి ఆయా అంశాలు తగ్గనున్న మార్జిన్ల ఒత్తిళ్లను సమతూకం చేస్తాయి. అదే విధంగా బ్యాంకింగ్ మూలధన పటిష్టతకూ మద్దతునిస్తాయి. ► ఇక రిటైల్ అలాగే సూక్ష్మ, లఘు, చిన్న, మధ్య (ఎంఎస్ఎంఈ) తరహా పరిశ్రమలకు ఇచ్చే రుణాలపై వడ్డీరేటును నెమ్మదిగా పెంచినా, కార్పొరేట్ రుణ రేటును బ్యాంకులు క్రమంగా పెంచే వీలుంది. ఇది మార్జిన్ల ఒత్తిళ్లను తగ్గించే అంశం. ► 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రుణ వృద్ధి సగటును 17.5 శాతం ఉంటే, ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ రేటు 13 శాతంగా నమోదుకావచ్చు. రుణ డిమాండ్ క్రమంగా పుంజుకోవడం దీనికి నేపథ్యం. -
డిపాజిట్ రేట్లకు త్వరలో రెక్కలు
ముంబై: రుణాలకు పెరుగుతున్న డిమాండ్, వడ్డీ రేట్ల పెరుగుదల క్రమం నేపథ్యంలో రానున్న నెలల్లో బ్యాంకులు డిపాజిట్లపై రేట్లను పెంచక తప్పదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. డిపాజిట్ రేట్ల పెరుగుదలకు సంకేతంగా, బ్యాంకులు అధికంగా నిధులు సమీకరించే మార్గమైన సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ (సీడీలు) రేట్లు క్రమంగా పెరుగుతుండడం, ఇప్పటికే కొన్నేళ్ల గరిష్టానికి చేరుకోవడాన్ని ఇక్రా గుర్తు చేసింది. బ్యాంకుల మొత్తం డిపాజిట్లలో సీడీలు 2022 జూలై 1 నాటికి 1.5 శాతంగా ఉన్నాయి. అయితే, 2011 జూన్ నాటి గరిష్ట స్థాయి 8.3 శాతాన్ని చేరుకోవాల్సి ఉందని ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. రుణాలకు డిమాండ్ పెరుగుతుండడంతో బ్యాంకులు తాజా నిధుల కోసం సీడీలపై ఆధారపడడం పెరుగుతున్నట్టు వివరించింది. ఆర్బీఐ ఇప్పటికే రెండు విడతల్లో 0.90 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. దీంతో రుణాలపై, డిపాజిట్లపై తిరిగి రేట్ల పెరుగుదల ఆరంభమైంది. -
ఇక వడ్డీ రేట్లు పైపైకే..!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరెంతోకాలం సరళతర ద్రవ్య, పరపతి విధానాన్ని కొనసాగించలేదన్న సంకేతాలు అందుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వడ్డీరేట్ల పెంపు దిశగా తీసుకున్న నిర్ణయం ఇందుకు నిదర్శనం. మరికొన్ని బ్యాంకులూ దీనిని అనుసరించే అవకాశం ఉంది. ఎస్బీఐ విషయానికి వస్తే కొన్ని డిపాజిట్ రేట్లను– రుణరేట్లను పెంచుతూ బ్యాంకింగ్ దిగ్గజం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాను ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటుకు సంబంధించిన బేస్ రేటునూ 10 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెంచింది. దీనితో బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు లేదా బేస్ రేటు 7.55 శాతానికి చేరింది. ఎస్బీఐ వెబ్సైట్ ఈ విషయాన్ని తెలిపింది. బేస్ రేటు అంటే ఒక బ్యాంక్ అనుసరించే కనీస వడ్డీరేటు. బేస్ రేటుకు అనుసంధానమైన వడ్డీరేట్లు ఇంతకన్నా (బేస్ రేటు) తక్కువ ఉండవు. కొత్త రేటు డిసెంబర్ 15వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని కూడా బ్యాంక్ వెబ్సైట్ వివరించింది. గడచిన రెండేళ్లలో ఎస్బీఐ బేస్ రేటును పెంచడం ఇదే తొలిసారి. అయితే ఎస్బీఐ మొత్తం రుణాల్లో బేస్ రేటుకు అనుసంధానమై ఉన్నవి కేవలం 2.5% మాత్రమే కావడం గమనార్హం. 2019 జనవరి ముందు రుణాలకు వర్తింపు కాగా తాజా నిర్ణయం జనవరి 2019 నుండి రుణం తీసుకున్న వారికి వర్తించదు. అంతకుముందు రుణం తీసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. వడ్డీరేట్ల విధానంలో పారదర్శకతే లక్ష్యంగా 2019 జనవరి నుంచీ బేస్ రేటు విధానం నుంచి ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్) విధానానికి మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)కు ఈబీఎల్ఆర్ అనుసంధానమై ఉంటుంది. రెపో రేటు మార్పులకు అనుగుణంగా ఈబీఎల్ఆర్ ఉంటుంది. ద్రవ్యోల్బణం కట్టడి, రుణ, డిమాండ్, ఎకానమీ వృద్ధి లక్ష్యంగా గడచిన తొమ్మిది ద్వైమాసిక సమావేశాల్లో సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా కీలక రేటులో ఎటువంటి మార్పూ చేయలేదు. బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ కూడా... బేస్ రేటు విధానం ప్రారంభానికి (2010 జూలై 1) ముందు అమల్లో ఉన్న బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్)నూ 10 బేసిస్ పా యింట్లు అంటే 12.2% నుంచి 12.3 %కి పెంచింది. డిపాజిట్ రేటు పెంపు తీరు.. మరోవైపు రూ.2 కోట్లు పైబడి విలువ కలిగిన డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు (0.1 శాతం) పెరిగింది. దీనితో ఈ రేటు 7.55 శాతానికి చేరింది. డిసెంబర్ 15వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు... రెండు పెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ)– బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ ఐదు సంవత్సరాల వరకూ డిపాజిట్లపై ఈ నెలారంభంలో వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లు పెంచాయి. డిసెంబర్ 10 నుంచీ అమల్లోకి వచ్చే విధంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణ వడ్డీరేటును స్వల్పంగా 0.05 శాతం పెంచింది. దీనితో బ్యాంక్ గృహ రుణ రేటు 6.50 శాతం నుంచి 6.55 శాతానికి పెరిగింది. కీలక సమయం ఆసన్నం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు ప్రస్తుతం అన్ని సమస్యలకు ఒకేఒక్క ఔషధం కలిగి ఉన్నాయి. అది కరెన్సీ ముద్రణ. చౌక రుణ లభ్యత. వాతావరణ మార్పులాగా ఇది భవిష్యత్ తరానికి సంబంధించిన సమస్య. మనం దీనిని పరిష్కరించాలి. అయితే ఇక్కడ క్లిష్ట సమస్యలను ఎదుర్కొనవద్దని లేదా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం నుంచి వైదొలగాలని చెప్పడం ఉద్దేశ్యం కాదు. భవిష్యత్తు ప్రయోజనాలు ఇక్కడ ముడివడి ఉన్నాయి. ఇప్పుడు కీలక నిర్ణయాలకు సమయం ఆసన్నమైంది. ఉదయ్ కోటక్, కోటక్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎండీ మరెంతో కాలం సాగదు... మహమ్మారి నేపథ్యంలో మనం అతి తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థను చూశాం. అయితే ఇది ఎంతోకాలం సాగా పరిస్థితి లేదు. బ్యాంకులు తమ వద్ద ఉన్న అదనపు నిధులకు సంబంధించి ఆర్బీఐ రివర్స్ రెపో మార్గంలో పొందుతున్న వడ్డీరేట్లలో పెరుగుదలను ఇప్పటికే మనం చూస్తున్నాం. ఈ రేటు 3.35 శాతం నుంచి 3.5 శాతానికి పెరిగింది. ఈ స్థాయి నుంచి రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ జరిగే పాలసీ సమీక్ష నిర్ణయాలపై బ్యాంకింగ్ వేచి చూస్తోంది – అశిష్ పార్థసారథి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ట్రజరీ చీఫ్ ఒక శాతం పెరిగే అవకాశం భారత్ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022–23) సరళతర విధానాల నుంచి వెనక్కు మళ్లే అవకాశం ఉంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) ఒక శాతం పెరగవచ్చు. 2022ని భారతదేశం ‘సాధారణ పాలసీ సంవత్సరంగా’ పరిగణిస్తోంది. వినియోగం ద్వారా వృద్ధి రికవరీ పటిష్టం అవుతుందని భావిస్తున్నాం. 2–6 శాతం శ్రేణిలోనే ద్రవ్యోల్బణం ఉంటుంద్నది మా అభిప్రాయం. – బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక -
ఎఫ్‌డీల వడ్డీరేట్లను సవరించిన హెచ్డీఎఫ్సీ
సాక్షి, ముంబై: ప్రైవేటు రంగ రుణదాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) వడ్డీ రేట్లను మరోసారి సవరించింది. అలాగే సీనియర్ సిటిజెన్ కేర్ ఎఫ్డి పథకం కింది సాధారణ ప్రజల కంటే 75 బీపీఎస్ పాయింట్ల అధిక వడ్డీ రేటును సీనియర్ సిటిజన్లకు అందిస్తుంది. మే 21 నుంచి ఈ సవరించిన వడ్డీరేట్లు అమలు చేయనుంది. 7 నుండి 29 రోజుల కాల పరిమితి గల డిపాజిట్లపై 2.50 శాతం వడ్డీని, 30 నుండి 90 రోజుల డిపాజిట్లపై 3 శాతం వడ్డీని అందిస్తుంది. ఇక 91 రోజుల నుండి 6 నెలల వరకు 3.5 శాతం, 6 నెలల 1 రోజు నుండి 4.4 శాతం, ఒక సంవత్సరం ఎఫ్‌డిలపై 4.9 శాతం వడ్డీని అందిస్తుంది. 2 నుండి 3 సంవత్సరాల ఎఫ్‌డిలపై వడ్డీ 5.15 శాతం, 3 నుంచి 5 ఏళ్ల డిపాజిట్లపై 5.30 శాతం, 5 -10 సంవత్సరాల డిపాజిట్లు 5.50 శాతం వడ్డీని వర్తింప జేస్తుంది. మరోవైపు సీనియర్ సిటిజన్స్ ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్య ఉన్న డిపాజిట్లపై 75 బేసిస్ పాయింట్ల మేర అధిక వడ్డీ లభిస్తుంది. ఇతర డిపాజిట్లపై 3 శాతం నుంచి 6.25 శాతం వరకు వడ్డీ రేట్లను సీనియర్ సిటిజనులకు ఆఫర్ చేస్తోంది. -
ఎస్బీఐ సేవింగ్స్ డిపాజిట్ రేట్ల కోత
న్యూఢిల్లీ: ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల్లోని డిపాజిట్ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విడుదలైన ప్రకటనలో ముఖ్యాంశాలు... ♦ సేవింగ్స్ డిపాజిట్లపై ప్రస్తుతమున్న 3 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గించింది. అన్ని సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లకూ ఇది వర్తిస్తుంది. తగినంత ద్రవ్య లభ్యత ఉండడం దీనికి కారణం. ♦ ఏప్రిల్ 15 నుంచీ ఇది అమల్లోకి వస్తుంది. ♦ ఇక నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను కూడా అన్ని కాలపరిమితులకు 35 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది. ♦ ఎంసీఎల్ఆర్ తగ్గింపు రేట్లు ఈ నెల 10వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయి. ♦ గృహ, వ్యక్తిగత, కార్పొరేట్, వాహన రుణాలకు అనుసంధానమయ్యే ఏడాది నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు 7.75 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గుతుంది. ♦ దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమయ్యే గృహ రుణ చెల్లింపుల విషయంలో 30 సంవత్సరాలకు సంబంధించి లక్షకు ఈఎంఐ దాదాపు రూ.24 తగ్గుతుంది. -
ఐసీఐసీఐ డిపాజిట్ రేట్లు పావు శాతం పెంపు
ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పావు శాతం పెంచింది. ఆర్బీఐ రెండు సార్లు కీలక రేట్లను పెంచడం, ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం తర్వాత మార్కెట్లో నిధుల లభ్యత తగ్గడం వంటి పరిస్థితుల నేపథ్యంలో డిపాజిట్లను ఆకర్షించడానికి బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మార్కెట్లలో అధిక అస్థిరత నెలకొనడంతో ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయాలన్న ఆసక్తి కస్టమర్లలో తిరిగి ఆరంభమైందని ఐసీఐసీఐ రిటైల్ రుణాల విభాగం అధిపతి ప్రణవ్మిశ్రా చెప్పారు. రెండేళ్లకు పైగా, మూడేళ్లలోపు కాల వ్యవధి కలిగిన రూ.కోటి లోపు డిపాజిట్లపై బ్యాంకు ఇక నుంచి 7.5 శాతం వడ్డీ రేటు ఇస్తుంది. 46–60 రోజులు, 61–90 రోజులు, 91–120 రోజులు, 121–184 రోజుల డిపాజిట్లపైనా వడ్డీ రేట్లను పావుశాతం పెంచింది. ఏడాది నుంచి 389 రోజుల డిపాజిట్‌పై మాత్రం వడ్డీ రేటును 0.15 శాతం పెంచింది. అలాగే, 390 రోజుల నుంచి రెండేళ్ల వరకు కాల డిపాజిట్లపై వడ్డీ రేటును 0.10% పెంచింది. గురువారం నుంచి పెరిగిన రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. -
ఎస్బీఐ కంటే ఆ బ్యాంక్ రేట్లే ఎక్కువ!
న్యూఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. ఎంపిక చేసిన కాలాలకు వడ్డీరేట్లను ఒక శాతం (100 బేసిస్ పాయింట్లు) వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో ఎస్బీఐ ఆఫర్ చేస్తున్న వడ్డీరేట్ల కంటే కూడా హెచ్డీఎఫ్సీ ఎఫ్‌డీలపైనే ఎక్కువగా పొందవచ్చు. ఈ పెంపుదలతో రెండేళ్లకు పైన ఉన్న అన్ని మెచ్యూరిటీలపై 7 % వడ్డీని హెచ్డీఎఫ్సీ అందించనుంది. అంతేకాక ఏడాది కాలానికి వడ్డీరేట్లు 6.75 శాతం నుంచి 6.85 శాతానికి పెరిగాయి. ఏడాది 17 రోజుల నుంచి 2 ఏళ్ల డిపాజిట్లపై వడ్డీరేట్లు 6.25 శాతం నుంచి 7 శాతానికి పెంచుతున్నట్టు బ్యాంకు చెప్పింది. దీనివల్ల సీనియర్ సిటిజన్లు, మరెందరో డిపాజిటర్లు దాదాపు 7.5 శాతం లాభాలను ఆర్జించనున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 7.9 లక్షల కోట్ల డిపాజిట్లతో దేశీయ బ్యాంకు డిపాజిట్లలో 7 శాతం వాటాను కలిగి ఉంది. హెచ్డీఎఫ్సీ వడ్డీరేట్లు కేవలం ఎస్బీఐ కంటే ఎక్కువగా ఉండటమే కాకుండా.. ఇతర ప్రైవేట్, పబ్లిక్ రంగ బ్యాంకుల కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇతర బ్యాంకులు కూడా హెచ్డీఎఫ్సీ బాటలో పయనించే అవకాశం ఉంది. ఇది రుణ రేట్లమీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిపాజిట్ రేట్లు : -
డిపాజిట్ రేట్లు పెంచిన ఎస్బీఐ
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో ఇక నుంచి వడ్డీ రేట్ల పెరుగుదలకు సూచనగా.. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిపాజిట్ రేట్లను పెంచింది. వివిధ కాలావధులకు సంబంధించి రిటైల్, బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.75 శాతం దాకా పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. పెంచిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. గడిచిన నాలుగు నెలల్లో ఎస్బీఐ.. బల్క్ టర్మ్ డిపాజిట్ రేట్లు సవరించడం ఇది మూడోసారి. నవంబర్ ఆఖర్లో తొలిసారి రేటు సవరించిన ఎస్బీఐ ఆతర్వాత జనవరిలోనూ మార్చింది. తాజా పరిణామంతో రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిని నిర్ణయించడానికి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో డిపాజిట్ రేట్ల పెంపు సహా నిధుల సమీకరణ వ్యయాలు పెరిగిన పక్షంలో ఆ మేరకు ఆటోమేటిక్‌గా రుణాలపై వడ్డీ రేట్ల పెరుగుదలకు కూడా దారి తీస్తుంది. గత త్రైమాసికం నుంచి పలు బ్యాంకులు క్రమంగా డిపాజిట్, లోన్ రేట్లు పెంచుకుంటూ వస్తున్నాయి. పెరుగుదల ఇలా.. రెండేళ్ల నుంచి పదేళ్ల దాకా కాలవ్యవధి ఉండే రూ. 1 కోటి లోపు రిటైల్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 0.50 శాతం మేర పెంచుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది. దీంతో ఇప్పటిదాకా 6 శాతంగా ఉన్న రేటు 6.50 శాతానికి చేరుతుంది. అలాగే, ఒక్క సంవత్సరం పైబడి.. రెండేళ్ల కన్నా తక్కువ కాలవ్యవధి ఉండే డిపాజిట్స్‌పై రేటు 0.15 శాతం మేర పెరుగుతుంది. ఫలితంగా ఇప్పటిదాకా 6.25 శాతంగా ఉన్నది ఇకపై 6.40 శాతానికి చేరుతుంది. మరోవైపు, ఏడాది పైబడి.. రెండేళ్ల లోపు మెచ్యూరిటీ ఉండే రూ. 1 కోటి– రూ. 10 కోట్ల దాకా ఉండే బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేటు 0.50 శాతం పెరిగి.. 6.25 శాతం నుంచి 6.75 శాతానికి చేరుతుంది. రెండేళ్ల పైబడి.. మూడేళ్ల లోపు కాలవ్యవధి ఉండే బల్క్ డిపాజిట్స్‌పై పెరుగుదల 0.75 శాతంగా ఉంటుంది. -
వడ్డీరేట్లు ఇంతకన్నా తగ్గవా..?
• రెండున్నర ఏళ్లలో ఆర్బీఐ తగ్గించింది 1.75 శాతం • బ్యాంకులు తగ్గించింది కేవలం 0.8 శాతం లోపే • డిపాజిట్ రేట్లు తగ్గింపు 1.50 శాతం • ఇంతకంటే తగ్గే అవకాశం తక్కువే అంటున్న నిపుణులు సాక్షి, అమరావతి: వడ్డీరేట్ల తగ్గింపునకు ఇక బ్రేక్ పడనుందా? ఇంతకంటే వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు సన్నగిల్లుతున్నాయా? ఇప్పటికే డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గడం, ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి చేరుకోవడంతో ఇంతకంటే వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఆర్బీఐ తగ్గించిన వడ్డీరేట్లలో రుణ గ్రహీతలకు ఎంత మేరకు ప్రయోజనం లభించింది, డిపాజిట్ల రేట్లు ఇంకా తగ్గే అవకాశాలున్నాయా అన్న అంశాలను పరిశీలిస్తే... ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తున్నా ఆ మేరకు రుణాలకు చెల్లించే ఈఎంఐ భారం తగ్గడం లేదు. కానీ ఇదే సమయంలో డిపాజిట్ల రేట్లు మాత్రం భారీగా తగ్గిపోతున్నాయి. దీంతో రుణ భారం తగ్గకపోగా దాచుకుందామంటే సరైన వడ్డీ రాక రెండింటికీ చెడ్డ రేవడిలా మారింది సామాన్యుని పరిస్థితి. గడిచిన రెండున్నర ఏళ్లలో ఆర్బీఐ కీలకమైన రెపో రేటును 1.75 శాతం వరకు తగ్గించింది. దీంతో వడ్డీరేట్లు తగ్గి ఈఎంఐల భారం తగ్గుతుందనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. ఆర్బీఐ తగ్గించిన స్థాయిలో బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లును తగ్గించడం లేదు. ఇప్పటి వరకు కేవలం 0.65 శాతం నుంచి 0.80 శాతమే బ్యాంకులు బేస్ రేటును తగ్గించాయి. అంటే ఆర్బీఐ తగ్గించిన దాంట్లో కనీసం 50 శాతం కూడా బ్యాంకులు అందించలేదన్నమాట. కానీ ఇదే సమయంలో డిపాజిట్ల రేట్లను మాత్రం బ్యాంకులు తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు చాలా బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లను ఏడు శాతం మించి ఇవ్వడం లేదు. 2015లో మూడు నుంచి 10 ఏళ్ల కాలానికి డిపాజిట్ చేస్తే ఎస్బీఐ 8.5 శాతం వడ్డీరేటు ఇచ్చేది. కానీ ఇప్పుడు 7 శాతం మించి ఇవ్వడం లేదు. అంటే ఈ ఏడాదిన్నరలో డిపాజిట్లపై వడ్డీరేట్లు 1.50 శాతం తగ్గాయి. అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే 1.8 శాతం వరకు డిపాజిట్ రేట్లను తగ్గించింది. ఎంసీఎల్ఆర్తో ఆలస్యం.. ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించినా ఖాతాదారులకు ఆ ప్రయోజనం తక్షణం ఇవ్వలేమని బ్యాంకులు పేర్కొంటున్నాయి. కొత్త డిపాజిట్లపై రేట్లు తగ్గినా గతంలో అధిక వడ్డీరేట్లకు ఇచ్చిన డిపాజిట్ల వల్ల ఆర్బీఐ తగ్గింపు ప్రయోజనం వెంటనే అందించలేమంటున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) విధానంలో ఈ ప్రయోజనం పూర్తిస్థాయిలో బదలాయించడానికి కనీసం ఆరు నెలలు పడుతుందన్నది బ్యాంకుల వాదన. ఆర్బీఐ తగ్గించిన వడ్డీరేట్ల ప్రయోజనాన్ని ఖాతాదారులకు పూర్తిగా అందించకుండా ఎన్పీఏలను తగ్గించుకోవడానికి ఉపయోగించుకుంటున్నాయన్నది విశ్లేషకుల వాదన. పీఎస్‌యూ బ్యాంకుల స్థూల మొండి బకాయిలు ఏడాది కాలంలో 5.3 శాతం నుంచి 10.4 శాతానికి చేరడం, కేంద్రం తగినంత మూలధన నిధులు ఇవ్వకపోతుండటంతో ఆర్బీఐ తగ్గింపు ప్రయోజనాన్ని ఎన్పీఏలు తగ్గించుకోవడానికి వినియోగించుకుంటున్నాయని జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి పేర్కొన్నారు. అధిక వడ్డీ మార్జిన్‌తో పాటు, వడ్డీరేట్లు తగ్గడం వల్ల బాండ్స్ ఈల్డ్స్ పెరగడం ద్వారా క్యాపిటల్ గెయిన్ లాభాలను బ్యాంకులు పొందుతున్నాయన్నారు. ఇక తగ్గడం కష్టమే.. ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి చేరడం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో వడ్డీరేట్లు మరింతగా తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ద్రవ్యోల్బణం ఇంతకంటే దిగువకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని, దీంతో వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు కె.నరసింహమూర్తి తెలిపారు. వచ్చే 12 నెలల కాలంలో మహా అయితే పావు శాతం మించి తగ్గే అవకాశం లేదని సతీష్ కంతేటి అభిప్రాయపడ్డారు. కేవలం డిపాజిట్లనే ప్రధాన ఆదాయవనరుగా ఎంచుకునే పెన్షనర్స్ వంటి వారిని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రముఖ బ్యాంకరు కె.వి.కామత్ పేర్కొంటున్నారు. కానీ రానున్న కాలంలో డిపాజిట్ల రేట్లు మరింత తగ్గకపోయినా రుణాలపై ఈఎంఐ భారం మరింకొంత తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఆర్బీఐ తగ్గించిన మొత్తం ప్రయోజనాన్ని అందించలేకపోయినా ఇంకో 0.25 శాతం నుంచి 0.5 శాతం వరకు బ్యాంకులు క్రమేపీ తగ్గించే అవకాశాలున్నాయని సతీష్ అంచనా వేస్తున్నారు. యుద్ధ వాతావరణం వంటి అనుకోని సంఘటనలు వస్తే తప్ప వడ్డీరేట్లు పెరిగే అవకాశం లేదని, మరికొంత కాలం దిగువస్థాయిలోనే వడ్డీరేట్లు కొనసాగే అవకాశం ఉందంటున్నారు. -
ఇండియన్ బ్యాంక్ డిపాజిట్ల రేట్లలో మార్పులు
చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఏడాది కాల వ్యవధి టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఇతర టర్మ్ డిపాజిట్లపై కాల వ్యవధిని బట్టి రేటును 25-50 బేసిస్ పాయింట్ల దాకా తగ్గించింది. ఇవి తక్షణం అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. -
ఇండియన్ బ్యాంక్ డిపాజిట్ రేట్లు తగ్గింపు
చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ డిపాజిట్ రేట్లను 25 - 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త రేట్లు సెప్టెంబర్ 11 నుంచి (నేటి నుంచి) అమల్లోకి వస్తాయని తెలిపింది. దీని ప్రకారం 181 రోజుల పైబడిన కాలవ్యవధికి సంబంధించి టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పావు నుంచి అరశాతం దాకా తగ్గించినట్లు బ్యాంక్ పేర్కొంది. -
వడ్డీరేట్లను నిర్ణయించిన బంధన్ బ్యాంక్
కోల్‌కతా: త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్న కొత్త బంధన్ బ్యాంక్- అకౌంట్ హోల్డర్ల కోసం పొదుపు, డిపాజిట్ రేట్లను నిర్ణయించింది. చైర్మన్ సీఎస్ ఘోష్ ఇక్కడ ఈ విషయాన్ని తెలిపారు. రూ. లక్షలోపు పొదుపుపై వడ్డీ రేటును 4.25 శాతంగా నిర్ణయించింది. రూ. లక్ష పైన ఈ రేటు 5 శాతంగా ఉంది. టర్మ్ డిపాజిట్ గరిష్ట రేటు (ఏడాది నుంచి మూడేళ్లకు) 8.5 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్ల విషయంలో ఈ రేటు అరశాతం అధికం. ఆగస్టు 23న కొత్త కోల్‌కతా కేంద్రంగా ఏర్పాటవుతున్న బ్యాంక్‌ను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రారంభించనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ )డిప్యూటీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్ కూడా కార్యక్రమానికి హాజరవుతారు. ఇంతక్రితం మైక్రో ఫైనాన్స్ సంస్థగా ఉన్న బంధన్‌కు బ్యాంక్ ఏర్పాటుకు గత ఏడాది ఆగస్టులో ఆర్బీఐ నుంచి ఆమోదం లభించింది. -
డిపాజిట్ రేట్లు తగ్గించిన బీఓబీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) డిపాజిట్ రేట్లు తగ్గాయి. పలు మెచ్యూరిటీలకు సంబంధించి ఈ రేట్లను 0.15-0.40 శాతం శ్రేణిలో తగ్గించినట్లు బ్యాంక్ శుక్రవారం తెలిపింది. ఏప్రిల్ 22 నుంచీ తాజా రేట్లు అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. త్వరలో బీఓఐ రుణ రేటు తగ్గింపు..: త్వరలో 10 నుంచి 25 బేసిస్ పాయింట్ల మేర బేస్‌రేటు (కనీస రుణ రేటు)ను తగ్గిస్తామని శుక్రవారం బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ విజయలక్ష్మీ అయ్యర్ ముంబైలో విలేకరులకు తెలిపారు. రుణ రేట్లు తగ్గింపుకు సంకేతంగా పలు దిగ్గజ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఇప్పటికే డిపాజిట్ రేట్లలో కోత పెట్టాయి. -
బ్యాంకుల రుణరేట్లు దిగొచ్చే సంకేతాలు!
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు.. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు కొన్ని మెచ్యూరిటీలపై బల్క్ (అధిక విలువ కలిగిన) డిపాజిట్ రేట్లను పావు శాతం వరకూ తగ్గించాయి. తద్వారా రుణ రేటు తగ్గింపు సంకేతాలను ఇచ్చాయి. రూ. కోటికిపైగా డిపాజిట్లపై వడ్డీ రేటును పావు శాతం మేర తగ్గించినట్లు ఐసీఐసీఐ ప్రకటించింది. తక్షణం ఈ తగ్గింపు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా తక్షణం అమల్లోకి వచ్చే విధంగా రూ. ఐదు కోట్లు ఆ పైబడిన డిపాజిట్ రేటును బ్యాంక్ పావు శాతం వరకూ తగ్గించింది. మరో ప్రైవేటు రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కూడా ఈ నెలారంభంలోనే వివిధ మెచ్యూరిటీలపై స్థిర డిపాజిట్ రేట్లను పావుశాతం వరకూ తగ్గించిన సంగతి తెలిసిందే. మొండిబకాయిల ప్రొవిజనింగ్ నిబంధనలు సరళతరం బ్యాంకుల మొండి బకాయిలకు సంబంధించి బ్యాంకింగ్ ప్రొవిజనింగ్ (ఒక నిర్దిష్ట సంవత్సరంలో మొండి బకాయిలకు లాభాల్లో కేటాయించాల్సిన పరిమాణం) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సోమవారం సడలించింది. ప్రొవిజినింగ్ జరిగిన ఎన్పీఏలు వసూలయినప్పుడు, అప్పటికే అందుకు కేటాయించిన మొత్తంలో(ప్రొవిజినింగ్ బఫర్‌లో) 50 శాతాన్ని తిరిగి మొండిబకాయిలకు, నిరర్థక ఆస్తులకు ప్రొవిజినింగ్ రూపంలో కేటాయింపులుగా చూపించుకోడానికి బ్యాంకులకు అనుమతినిచ్చింది. ఇప్పటి వరకూ ఈ రేటు 33%గా ఉంది. దీనివల్ల తదుపరి ఆర్థిక సంవత్సరాల్లో లాభాల్లో ప్రొవిజినింగ్కు కేటాయించాల్సిన పరిమాణం తగ్గి, సంబంధిత బ్యాంకులకు మరింత నిధుల లభ్యత(లిక్విడిటీ) సమకూరే అవకాశం ఏర్పడుతుంది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా డిపాజిట్ రేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తాజాగా రూ. 1 కోటి దాకా డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.1% తగ్గించింది. దీని ప్రకారం 181-270 రోజుల దేశీ టర్మ్ డిపాజిట్లు, ఎన్ఆర్వో డిపాజిట్లపై వడ్డీ రేటు ఇకపై 7.75% నుంచి 7.65 శాతానికి తగ్గుతుంది. మిగతా డిపాజిట్లపై రేట్లు యథాతథంగా కొనసాగుతాయి. తాజా మార్పులు ఈ నెల 24 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. బీఎస్ఈలో సోమవారం బీవోబీ షేరు ధర 1.82 శాతం క్షీణించి రూ. 169.75 వద్ద ముగిసింది. -
ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిపాజిట్ రేట్ల కోత
ముంబై: ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు డిపాజిట్ల రేట్లను అరశాతం వరకూ తగ్గించాయి. లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరిస్థితి మెరుగ్గా ఉండడం, రుణ వృద్ధి రేటు మందగమనం, ఇక రానున్నది తక్కువ రేటు వడ్డీ కాలమేనన్న అంచనాల నేపథ్యంలో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. తగ్గింపు ఇలా: ఐసీఐసీఐ బ్యాంక్ 390 రోజుల నుంచి రెండేళ్ల కాల పరిమితి డిపాజిట్ రేటు పావు శాతం తగ్గి 8.75 శాతానికి చేరింది. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విషయానికి వస్తే, 46 రోజుల నుంచి ఏడాది కాల పరిమితి డిపాజిట్ల రేట్లను పావు శాతం నుంచి అరశాతం వరకూ తగ్గించింది. తాజా రేట్లు ఐసీఐసీఐ విషయంలో నవంబర్ 28 నుంచీ అమల్లోకి వచ్చాయి. హెచ్డీఎఫ్సీ విషయంలో ఇవి డిసెంబర్ 1 నుంచీ అమల్లోకి వచ్చాయి. కాగా యస్ బ్యాంక్ కూడా ఇదే తీరులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి రజత్ మోర్గా తెలిపారు. -
డిపాజిట్ రేట్లను తగ్గించిన ఆంధ్రాబ్యాంక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిపాజిట్లపై వడ్డీరేట్లను స్వల్పంగా తగ్గిస్తూ ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గిన రేట్లు ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చాయి. సవరించిన తర్వాత 444 రోజుల డిపాజిట్ పథకంపై అత్యధికంగా 9.05% వడ్డీని (రూ. కోటి లోపు) ఆఫర్ చేస్తుండగా, ఏడాది నుంచి మూడేళ్లలోపు డిపాజిట్లపై 9% వడ్డీని ఇస్తోంది. అలాగే అధికాదాయ వర్గాల వారి కోసం ప్రత్యేకంగా 179 రోజుల ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ఆంధ్రాబ్యాంక్ ప్రవేశపెట్టింది. కనీసం కోటి రూపాయలు డిపాజిట్ చేయాల్సిన ఈ పథకంపై 7.8% వడ్డీ అందిస్తోంది. 7 రోజుల తర్వాత కాలపరిమితి కంటే ముందే డబ్బు వెనక్కి తీసుకున్నా ఎలాంటి పెనాల్టీలు లేకపోవడం ఈ పథకంలోని ప్రధానమైన ఆకర్షణ. -
అలహాబాద్ బ్యాంక్ డిపాజిట్ రేట్ల పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ అలహాబాద్ బ్యాంక్ డిపాజిట్ రేట్లను పెంచింది. కోటి రూపాయల లోపు డిపాజిట్లకు సంబంధించి రేటును పావుశాతం నుంచి 1.2 శాతం శ్రేణిలో పెంచింది. తక్షణం ఇవి అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ సోమవారం తెలిపింది. రేట్ల మార్పు ఇలా... 91 రోజుల నుంచి 179 రోజుల మధ్య డిపాజిట్లపై రేటు అత్యధికంగా 1.2 శాతం పెరిగింది. దీనితో ఈ రేటు 8.5 శాతం అయ్యింది. 30-45, 46-60, 61-90 రోజుల శ్రేణిలో డిపాజిట్ రేట్లు అరశాతం చొప్పున పెరిగాయి (వరుసగా 6.5 శాతం, 7.5 శాతం, 7.5 శాతానికి). 180-269 రోజుల మధ్య రేటు పావుశాతం పెరిగి 8.5 శాతానికి ఎగసింది. 3 నుంచి 5 ఏళ్ల మధ్య డిపాజిట్లపై రేటు 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) ఎగసి 9.05 శాతానికి చేరింది. వృద్ధులకు 0.50 శాతం అదనపు వడ్డీరేటు వర్తిస్తుంది. కాగా, రుణరేట్ల విషయంలో బ్యాంక్ ఎటువంటి మార్పూ ప్రకటించలేదు.