బ్యాంక్ ఆఫ్ బరోడా డిపాజిట్ రేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) తాజాగా రూ. 1 కోటి దాకా డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.1% తగ్గించింది. దీని ప్రకారం 181-270 రోజుల దేశీ టర్మ్ డిపాజిట్లు, ఎన్‌ఆర్‌వో డిపాజిట్లపై వడ్డీ రేటు ఇకపై 7.75% నుంచి 7.65 శాతానికి తగ్గుతుంది. మిగతా డిపాజిట్లపై రేట్లు యథాతథంగా కొనసాగుతాయి. తాజా మార్పులు ఈ నెల 24 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. బీఎస్‌ఈలో సోమవారం బీవోబీ షేరు ధర 1.82 శాతం క్షీణించి రూ. 169.75 వద్ద ముగిసింది.