న్యూఢిల్లీ: ఎస్‌బీఐ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల్లోని డిపాజిట్ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విడుదలైన ప్రకటనలో ముఖ్యాంశాలు...
♦ సేవింగ్స్ డిపాజిట్లపై ప్రస్తుతమున్న 3 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గించింది. అన్ని సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లకూ ఇది వర్తిస్తుంది. తగినంత ద్రవ్య లభ్యత ఉండడం దీనికి కారణం.
♦ ఏప్రిల్ 15 నుంచీ ఇది అమల్లోకి వస్తుంది.
♦ ఇక నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను కూడా అన్ని కాలపరిమితులకు 35 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది.
♦ ఎంసీఎల్‌ఆర్ తగ్గింపు రేట్లు ఈ నెల 10వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయి.
♦ గృహ, వ్యక్తిగత, కార్పొరేట్, వాహన రుణాలకు అనుసంధానమయ్యే ఏడాది నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు 7.75 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గుతుంది.
♦ దీనితో ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమయ్యే గృహ రుణ చెల్లింపుల విషయంలో 30 సంవత్సరాలకు సంబంధించి లక్షకు ఈఎంఐ దాదాపు రూ.24 తగ్గుతుంది.
ఎస్‌బీఐ సేవింగ్స్ డిపాజిట్ రేట్ల కోత
Published Wed, Apr 8 2020 4:58 AM | Last Updated on Wed, Apr 8 2020 4:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment