deduction
-
పన్ను భారం తగ్గేదెలా..?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి రిటర్నులు దాఖలు చేసే వారికి నూతన పన్ను విధానం డిఫాల్ట్‌గా ఎంపికై ఉంటుంది. పాత పన్ను వ్యవస్థతోనే కొనసాగాలనుకుంటే విధిగా దానిని ఎంపిక చేసుకోవాల్సిందే. లేదంటే కొత్త విధానం అమలవుతుంది. పాత వ్యవస్థతో పోలిస్తే కొత్త పన్ను విధానంలో పన్ను భారం తక్కువ. కానీ, పాత విధానంలో పన్ను మినహాయింపులు, తగ్గింపులు ఎక్కువ. వీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే కనుక కొత్త విధానంతో పోలిస్తే గణనీయమైన పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. దీంతో నికరంగా చెల్లించే పన్ను తగ్గిపోతుంది. మరి వీటిల్లో తమకు ఏది అనుకూలమో తేల్చుకోవాలంటే, ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. ఆదాయపన్ను భారాన్ని సాధ్యమైనంత తగ్గించుకోవాలని కోరుకునే వారికి.. పాత, కొత్త పన్ను విధానాల్లో ఎంపిక కీలకం అవుతుంది. చట్టప్రకారం మీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంటే, అప్పుడు విధిగా రిటర్నులు దాఖలు చేసి నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాలి. పాత, కొత్త పన్ను రేట్లను ఒకసారి పరిశీలిద్దాం. ఈ రెండు వ్యవస్థల్లోనూ కొంత పన్ను రాయితీ ఉంది. పాత విధానంలో నికరంగా రూ.5 లక్షలు, నూతన విధానంలో నికరంగా రూ.7 లక్షలు మించకుండా పన్ను వర్తించే ఆదాయం ఉంటే సెక్షన్ 87ఏ కింద ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల ప్రయోజనాన్ని కూడా కలిపి చూస్తే వేతన జీవులు పాత విధానంలో రూ.5.50,000 ఆదాయం, కొత్త విధానంలో రూ.7,50,000 మించని ఆదాయంపై రూపాయి పన్ను కట్టక్కర్లేదు. ఆదాయపన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వేర్వేరు సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోలేని వారికి నూతన విధానమే అనుకూలం. పాత విధానంలో సెక్షన్ 80సీ, 80డీ, 24 ఇలా పలు సెక్షన్ల కింద పన్ను తగ్గింపులు, మినహాయింపులను వినియోగించుకుంటే, రూ.5 లక్షలకు పైన ఆదాయం ఉన్నవారు సైతం గణనీయమైన ప్రయోజనాన్ని పొందొచ్చు. ఇంతకుమించి ఆదాయం కలిగిన వారు ఈ రెండింటిలో ఏది లాభదాయకమో తేల్చుకోవాలంటే కొంత కసరత్తు అవసరం. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి దీని కింద పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సరి్టఫికెట్, పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. జీవిత బీమా పాలసీకి చెల్లించే ప్రీమియం, పిల్లల ట్యూషన్ ఫీజులను కూడా ఈ సెక్షన్ కింద చూపించుకోవచ్చు. గృహ రుణం తీసుకుని, ఒక ఆర్థిక సంవత్సరంలో దీనికి చేల్లించే అసలును (ప్రతి ఈఎంఐలో అసలు, వడ్డీ భాగం ఉంటుంది) సెక్షన్ 80సీ కింద చూపించి, ఆ మొత్తంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను సెక్షన్ 80డీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. 60 ఏళ్లలోపు వయసున్న వారు రూ.25,000 వరకు, అంతకుమించిన వయసు వారికి రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. ఇదే సెక్షన్ కింద హెల్త్ చెకప్‌లకు చేసే వ్యయం రూ.5,000 వరకు పన్ను మినహాయింపు ఉంది. విరాళాలు ఇస్తే.. అర్హత కలిగిన సంస్థలకు విరాళాలు ఇస్తే, ఆ మొత్తంపై సెక్షన్ 80జీ కింద పన్ను భారం ఉండదు. ఇక సెక్షన్ 80టీటీఏ కింద సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై ఆర్జించే వడ్డీ రూ.10,000 మొత్తంపై పన్ను లేదు. అదే 60 ఏళ్లు నిండిన వారికి వడ్డీ ఆదాయం రూ.50,000పై పన్ను లేదు. ఇవన్నీ పాత పన్ను విధానంలో ఉన్న చక్కని పన్ను మినహాయింపు ప్రయోజనాలు. పన్ను ఆదా, పెట్టుబడులు పాత వ్యవస్థలో ఉన్న పన్ను ఆదా ప్రయోజనాలను ఉపయోగించుకుంటే, మరింతగా పన్ను ఆదా చేసుకోవచ్చని లాడర్7 ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సురేష్ శడగోపన్ పేర్కొన్నారు. వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒకవైపు పెట్టుబడులపై రాబడిని, మరోవైపు పన్ను ఆదా చేసుకోవడానికి వీలుంటుంది. కొత్త పన్ను విధానంలో పెట్టుబడులకు ఎలాంటి ప్రోత్సాహం లేదు. అంటే ఇది పెట్టుబడులను నిర్బంధం చేయదు. ఎన్పీఎస్ వేతన జీవులు, స్వయం ఉపాధిలోని వారు, ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఎన్పీఎస్పై పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. వేతన జీవులు అయితే తమ మూలవేతనం, డీఏలో 10 శాతం మేర ఎన్పీఎస్కు చందా జమ చేయడం ద్వారా ఆ మొత్తంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. స్వయం ఉపాధిలో ఉన్న వారు తమ మొత్తం ఆదాయంలో 20 శాతంపై ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. ఈ సెక్షన్ కింద ఈ రెండు వర్గాలకు గరిష్ట ప్రయోజనం రూ.1.5 లక్షలు. ఇక 80సీసీడీ (1బి) కింద వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు రూ.50,000 జమలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. పైన చెప్పుకున్న రూ.1.5 లక్షలకు ఇది అదనం. 80సీసీడీ(2) కింద వేతన జీవులకు అదనపు ప్రయోజనం ఉంది. ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాలో సంస్థ చేసే జమలు దీనికింద వస్తాయి. ప్రభుత్వరంగ ఉద్యోగులు అయితే తమ మూలవేతనం, డీఏలో 14 శాతం, ప్రైవేటు ఉద్యోగులు 10 శాతం మేర యాజమాన్యం జమలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక్కడ గరిష్ట పరిమితి రూ.7.5 లక్షలు. ఈపీఎఫ్ జమలు కూడా ఈ పరిమితిలో భాగమే. హెచ్ఆర్ఏ అద్దె ఇంట్లో ఉంటూ, పనిచేసే సంస్థ నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందుతుంటే అప్పుడు కూడా పన్ను ప్రయోజనాన్ని అందుకోవచ్చు. మెట్రోల్లో నివసించే వారు తమ మూల వేతనం, డీఏలో 50 శాతం మేర సెక్షన్ 10(13ఏ) కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. నాన్ మెట్రోల్లోని వారికి ఈ పరిమితి 40 శాతంగా ఉంది. అలాగే, హెచ్ఆర్ఏ రూపంలో ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న మొత్తం.. మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని వాస్తవంగా చెల్లించిన అద్దె నుంచి తీసివేయగా వచ్చే మొత్తం.. ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. పనిచేసే ప్రాంతంలో సొంత ఇంట్లో నివాసం ఉండే వారికి హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు రాదు. పనిచేసే చోట అద్దె ఇంట్లో ఉంటూ, వేరే ప్రాంతంలో సొంతిల్లును అద్దెకు ఇచి్చన వారు సైతం హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపును పొందొచ్చు. లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ) పన్ను పరిధిలోకి వస్తుంది. ప్రయాణాలకు చేసిన ఖర్చును చూపించి, పన్ను భారం తొలగించుకోవచ్చు. గృహ రుణం/విద్యా రుణం రుణంపై ఇంటిని కొనుగోలు చేసే ధోరణి పెరిగింది. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలోనే ఇప్పుడు యువత సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నారు. ఇలాంటి వారు కొంత డౌన్ పేమెంట్ చెల్లించి, మిగిలిన మొత్తానికి రుణం తీసుకుంటున్నారు. ఈ రుణానికి చేసే అసలు చెల్లింపులు ఒక ఏడాదిలో రూ.1.5 లక్షలను సెక్షన్ 80సీ కింద, వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల మేర సెక్షన్ 24(బి) కింద చూపించుకుని ఆ మొత్తంపై పన్ను కట్టక్కర్లేదు. సొంతగా నివాసం ఉన్నా లేదా అద్దెకు ఇచ్చినా సరే ఈ ప్రయోజనానికి అర్హులే. విద్యా రుణానికి ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే వడ్డీ చెల్లింపులు ఎంత ఉన్నా సరే ఆ మొత్తాన్ని రిటర్నుల్లో చూపించుకుని పన్ను లేకుండా మినహాయింపు పొందొచ్చు. మీకు ఏది అనుకూలం? పాత విధానంలో ఇక్కడ పేర్కొన్న మినహాయింపులను పూర్తిగా వినియోగించుకుంటే.. సెక్షన్ 80సీ కింద 1.50 లక్షలు, 80 సీసీడీ (1బి) కింద రూ.50,000 (ఎన్పీఎస్), స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, గృహ రుణం వడ్డీ రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.9.5 లక్షలపై పన్ను లేనట్టే. అలాగే, ప్రైవేటు ఉద్యోగులు పనిచేసే సంస్థ ద్వారా ఎన్పీఎస్ ఖాతాకు గరిష్టంగా రూ.7.5 లక్షల మేర జమ చేయించుకుంటే అప్పుడు మొత్తం రూ.17 లక్షలపై పన్ను లేనట్టు అవుతుంది. కొత్త విధానంలో రూ.7 లక్షల మొత్తంపై సెక్షన్ 87ఏ కింద పన్ను రాయితీ కలి్పంచారు. దీనికి రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ అదనం. అంటే రూ.7.5 లక్షలపై పన్ను లేదు. ఆదాయం రూ.7,50,001 ఉన్న వారికి 87ఏ రాయితీ వర్తించదు. వారు తమ ఆదాయంపై పూర్తి పన్ను చెల్లించాలి. మొదటి మూడు లక్షలపై పన్ను లేదు. 3–6 లక్షలపై 5 శాతం ప్రకారం రూ.15,000. రూ.6.–7.51 లక్షలపై 10 శాతం ప్రకారం రూ.15,000 కలిపి మొత్తం రూ.30,000, దీనికి సెస్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 7.51 లక్షల ఆదాయంపై పాత విధానంలో రిటర్నులు వేసుకునేట్టు అయితే.. 87ఏ రిబేటు, స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.5.5 లక్షల వరకు పన్ను లేదు. 80సీ సాధనంలో 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకుని, దీనికి అదనంగా ఎన్‌పీఎస్‌లో రూ.50,000 ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రూపాయి పన్ను లేకుండా చూసుకోవచ్చు. విధానాన్ని మార్చుకోవచ్చు.. పాత పన్ను నుంచి కొత్త పన్నుకు.. తిరిగి పాత పన్నుకు మారడంపై ఆంక్షలు ఉన్నాయి. వ్యాపారం లేదా వృత్తి రూపంలో ఆదాయం పొందని వారు ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ పాత, కొత్త పన్ను వ్యవస్థల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. వృత్తి లేదా వ్యాపారం నుంచి ఆదాయం పొందుతున్న వారు సెక్షన్ 115బీఏసీ కింద నూతన పన్ను విధానం నుంచి వైదొలిగే ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. అప్పుడు తిరిగి నూతన పన్ను విధానానికి ఒక్కసారి మాత్రమే మారే అవకాశం ఉంటుంది. ‘‘తక్కువ పన్ను శ్లాబుల పరిధిలో ఆదాయం కలిగిన వారికి నూతన పన్ను విధానమే మెరుగైనది. అధిక రేటు శ్లాబుల్లో ఉన్నవారు, అన్ని రకాల మినహాయింపులు వినియోగించుకుంటే వారికి పాత విధానం అనుకూలం’’అని రైట్ హారిజాన్స్ సీఈవో అనిల్ రెగో సూచించారు. -
‘తెలంగాణ ఇంక్రిమెంట్’ రికవరీ
సాక్షి, హైదరాబాద్: జలమండలిలో ‘తెలంగాణ ఇంక్రిమెంట్’రికవరీకి ఆ శాఖ పరిధిలోని ఆర్థిక విభాగం నుంచి తాజాగా ఆదేశాలు రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పదేళ్ల తర్వాత ఆ శాఖ పరిధిలో రెగ్యులరైజ్ అయిన 658 మంది ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని, ఉద్యోగుల సర్విస్ బుక్ లు పరిశీలించి చర్యలు చేపట్టాలని సూచించింది. ఇంక్రిమెంట్ ఇలా.. తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు పోషించిన పాత్రకు గుర్తుగా రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఉద్యోగులందరికీ ‘తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్‘మంజూరు చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు 2014 సెప్టెంబర్ 1న చెల్లించిన ఆగస్టు నెల వేతనం నుంచే ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను అమలు చేస్తూ వస్తోంది. ప్రతి నెలా వేతనంలో భాగంగా ఈ ఇంక్రిమెంట్ సర్విస్ ముగిసే వరకు వర్తింస్తుందని ఆ జీఓలో ప్రభుత్వం స్పష్టం చేసింది. జలమండలిలో వర్తింపు ఇలా జలమండలి పారిశుధ్య విభాగంలో 25 ఏళ్లుగా సేవలిందిస్తున్న సుమారు 658 మంది హెచ్ఆర్, ఎన్‌ఎంఆర్‌లను ప్రభుత్వం 2014 జూన్ 23న రెగ్యులరైజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అదే సంవత్సరం ఆగస్టు 13న జీఓ నెంబర్ 23 ఆర్డర్‌తో ప్రభుత్వ సర్విస్‌లో ఉన్న ఉద్యోగులందరికీ తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జలమండలిలోని పారిశుధ్య విభాగంలో రెగ్యులర్ అయి సర్వీస్‌లో ఉన్నవారికి కూడా ఈ ఇంక్రిమెంట్‌ను వర్తింపజేశారు. జీఓ తేదీని పరిగణనలోకి తీసుకోవాలి తెలంగాణ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ జీఓ జారీ చేసిన 2014 ఆగస్టు 13 తేదీని కటాఫ్ పరిగణనలోకి తీసుకోవాలని జలమండలి ఉద్యోగులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం రెగ్యులరైజ్ అయిన తాత్కాలిక ఉద్యోగులు కూడా ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నారని వారు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వు జారీ అయిన నాటికే ప్రభుత్వ సర్విస్‌లో ఉన్న కారణంగా తెలంగాణ ఇంక్రిమెంట్ తమకు కూడా వర్తిస్తుందని వారు పేర్కొంటున్నారు. నాలుగో తరగతి ఉద్యోగులైన తమ వేతనాలు ఉండడమే తక్కువని, అందులో నుంచి ఇంక్రిమెంట్ సొమ్ము మొత్తం రికవరీ చేస్తే ఆర్థికంగా భారమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రికవరీ ఎందుకంటే... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీ రోజైన జూన్ 2ను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం తెలంగాణ ఇంక్రిమెంట్ అమలుచేస్తోంది. అయితే జలమండలిలో ఉద్యోగుల రెగ్యులరైజ్ జూన్ 23న జరిగింది. దీంతో వారి వేతనాల నుంచి ఈ ఇంక్రిమెంట్ రికవరీకి ఆదేశాలు వచ్చాయి. అయితే ఈ ఉద్యోగులు మాత్రం ఇంక్రిమెంట్ జీఓ వచ్చిన ఆగస్టు 13వ తేదీన పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. -
ఓటేయకుంటే బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.350 కట్! నిజమేనా?
ఎన్నికల్లో ఓటు వేయనివారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350 పెనాల్టీ కింద భారత ఎన్నికల సంఘం (ECI) కట్ చేస్తుందంటూ ఇంటర్నెట్లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి హిందీ వార్తపత్రికలో ప్రచురితమైన ఓ వార్త క్లిప్పింగ్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. ఓటు వేయడాన్ని విస్మరించినవారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350 కట్ అవుతుందని, సదురు వ్యక్తికి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోతే మొబైల్ రీఛార్జ్ నుంచి ఆ మొత్తం కట్ చేస్తారని ఆ న్యూస్ క్లిప్పింగ్‌లో ఉంది. దీన్ని కొంత మంది విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఓటు వేయకపోతే డబ్బులు కట్ అవుతాయంటూ హెచ్చరిస్తున్నారు. (అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక అన్నింటికీ ఆ సర్టిఫికెటే ఆధారం!) దీనిపై ప్రభుత్వ వార్తాసంస్థ పీఐబీకి చెందిన ఫ్యాక్ట్‌చెక్ (pib fact check) విభాగం స్పందించింది. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ (fake news) అని తేల్చింది. గతంలోనే సర్కులేట్ అయిన ఈ ఫేక్ న్యూస్ మరోసారి ప్రచారంలోకి వచ్చిందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్’(ట్విటర్) ద్వారా పేర్కొంది. కాగా ఈ వార్త ఓ హిందీ వార్తాపత్రికలో 2019లో ప్రచురితమైంది. హోలీ ప్రాంక్‌గా దీన్ని ప్రచురించారు. అయితే ఇది అప్పటి నుంచి అసలైన వార్తగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ఎలక్షన్ కమిషన్ 2021లోనే క్లారిటీ ఇచ్చింది. क्या लोकसभा चुनाव में मतदान नहीं किए जाने पर बैंक अकाउंट से कटेंगे 350 रुपए❓ जानें वायरल ख़बर की सच्चाई❕#PIBFactCheck: 🔶 यह ख़बर #फ़र्ज़ी है। 🔶 @ECISVEEP ने ऐसा कोई निर्णय नहीं लिया है। 🔶 जिम्मेदार नागरिक बनें, मतदान अवश्य करें!! 🔗 https://t.co/8EwXdkIPlF pic.twitter.com/ikFLUndfCh — PIB Fact Check (@PIBFactCheck) September 15, 2023 -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! ఖాతాల నుంచి రూ.295 కట్! ఎందుకో తెలుసుకోండి..
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది బ్రాంచ్‌లు ఉన్న ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఖాతాదారులు ఉన్నారు. రకరకాల సేవల నిమిత్తం బ్యాంక్ పలు చార్జీల కింద కస్టమర్ల ఖాతాల నుంచి డబ్బులు కట్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి డబ్బులు ఎందుకు కట్ అవుతున్నాయో తెలియక చాలా మంది మథనపడుతుంటారు. స్టేట్ బ్యాంకు ఇటీవల తమ ఖాతాల నుంచి రూ.295 కట్ చేసిందని, అది తిరిగి జమ కాలేదని చాలా మంది కస్టమర్లు చెబుతున్నారు. ఆ మొత్తం ఎందుకు కట్ చేశారో తెలియక తికమకపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ డబ్బు కట్ అవడానికి గల కారణం ఇక్కడ తెలుసుకోండి... నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) సేవల కోసం కస్టమర్ల అకౌంట్ల నుంచి ఆ డబ్బు కట్ చేస్తున్నట్లు తెలిసింది. ఖాతాదారుల అకౌంట్ల నుంచి ఈఎంఐల ఆటోమేటిక్ చెల్లింపు కోసం ఎన్ఏసీహెచ్ ను ఉపయోగిస్తున్నారు. మీరు ఈఎంఐపై ఏదైనా కొనుగోలు చేసినా లేదా రుణం తీసుకున్నా నిర్ణీత తేదీలో మీ సేవింగ్ ఖాతా నుంచి ఈఎంఐ మొత్తం ఆటోమేటిక్‌గా కట్అవుతుంది. కాబట్టి గడువు తేదీకి ఒక రోజు ముందుగానే మీరు మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలి. ఉదాహరణకు ప్రతి నెల 5వ తేదీన కట్ అవుతుందనుకుంటే 4వ తేదీ నుంచి ఆ మొత్తం మీ ఖాతాలో ఉండాలి. ఇదీ చదవండి: ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్ పెళ్లి.. ఆహ్వానితుల్లో అత్యంత ప్రముఖులు! ఎవరెవరు వస్తున్నారో తెలుసా? ఒక వేళ ఈఎంఐ ఆటోమేటిక్‌గా కట్ కాకపోయినా, ఈఎంఐకి తగినంత మొత్తం మీ ఖాతాలో లేకపోయినా రూ.295 పెనాల్టీ కింద కట్ అవుతుంది. ఇది కొన్నిసార్లు ఒకే సారి కాకుండా కొన్ని నెలల పాటు పెనాల్టీని కూడబెట్టి ఆపై పూర్తిగా కట్ కావచ్చు. మీరు ఈఎంఐ మొత్తానికి తగినంత బ్యాలెన్స్ అకౌంట్లో ఉంచడంలో విఫలమైతే బ్యాంక్ రూ. 250 పెనాల్టీ విధిస్తుంది. దీనికి 18 శాతం జీఎస్టీ అంటే రూ.45 అదనం. మొత్తంగా రూ.295 మీ ఖాతా నుంచి కట్ అవుతుందన్నమాట. ఇలా కట్ కాకూడదంటే మీరు ఈఎంఐకి సరిపడా మొత్తాన్ని గడవు తేదీకి ఒక రోజు ముందుగానే మీ అకౌంట్లో ఉంచాలని గుర్తుంచుకోండి. ఇదీ చదవండి: Samsung Galaxy Z Fold 5: మడత అంటే ఇదీ.. పర్ఫెక్షన్ అంటే ఇదీ! -
ఇన్ కమ్ ట్యాక్స్ : ఈ సెక్షన్‌తో పిల్లల స్కూల్ ఫీజులు క్లెయిమ్ చేసుకోవచ్చు!
సెక్షన్ 80సి ప్రకారం ఎన్నో మినహాయింపులు ఉన్నాయి. కొన్ని ఇన్వెస్ట్మెంటుకు సంబంధించినవి.. కొన్ని ముందు జాగ్రత్త కోసం దాచుకునేవి .. కొన్ని చేసిన అప్పులు తీర్చేవి.. కొన్ని విధిగా ఖర్చులు పెట్టేవి.. ఉద్యోగస్తులకు పీఎఫ్ తప్పనిసరి. ఒక్కొక్కప్పుడు పీఎఫ్ మొత్తం గరిష్ట పరిమితి రూ. 1,50,000 దాటిపోతుంటుంది. పిల్లల స్కూలు ఫీజు విషయంలో ఇద్దరికి మినహాయింపు.. మూడో పిల్లలకు ఫీజు కడితే మినహాయింపు ఇవ్వరు. ఇలాగే అన్ని విషయాల్లో ఆంక్షలు. అయితే, కొన్ని కేసులు చదవండి. ♦వామనరావు పెద్ద జీతగాడు. కంపల్సరీ పీఎఫ్‌తో సెక్షన్ 80సి పరిమితి దాటిపోతుంది. అందుకని ఇతర సేవింగ్స్ తన పేరు మీద చేయడు. జీవిత బీమా తన తల్లిదండ్రుల అకౌంటులో చేశాడు. ఇల్లు మీద లోన్ తన భార్య సత్యవతి పేరిట తీసుకుని వాయిదా లు చెల్లిస్తాడు. తన భార్య ఇంట్లో తాను అద్దెకు ఉంటున్నట్లు క్లెయిమ్ చేస్తాడు. ఇంట్లో అందరూ 80సి కింద గరిష్ట పరిమితులు క్లెయిమ్ చేస్తున్నారు. సత్యవతి జీతం, ఇంట ద్దె అన్నీ కలిపినా 20 శాతం శ్లాబు దాటలే దు. వామనరావుగారు హమేషా 30 శాతం శ్లాబు తగ్గలేదు. కొంచం ఆలోచిస్తే 10 శాతం పన్ను సేవ్ చేసింది ఈ కుటుంబం. ♦ఇల్లరికం అని అనుకోకుండా.. ఇంట్లో పూర్తిగా సెటిల్ అయిపోయాడు అల్లుగారు అరవిందరావు. మామగారికి అద్దె ఇచ్చినట్లు రాస్తాడు. ఇస్తాడో .. ఇవ్వడో ఎవరికీ తెలీదు. మావగారు పెన్షనర్.. పన్ను పరిధిలోకి రారు. ఇటువంటి అల్లుళ్లు, కొడుకులు ఎంత మందో! కోడళ్లు .. కూతుర్లు ఎంత మందో! అరవిందరావు గారు చేసే ఇతర వ్యవహారాలు అన్నీ ఇన్నీ కావు. ఇవన్నీ చదువుకోని భార్య సరస్వతి పేరు మీద చేస్తారు. 80సి కింద అర్హత ఉన్న సేవింగ్స్ ఆవిడ పేరు మీదే. ♦కుటుంబరావుగారికి, సంతానలక్ష్మి గారికి ఇంటి ఆనవాయితీ ప్రకారం కాబోలు రెండుసార్లు కవలలు. మొత్తం నలుగురు పిల్లలు. నలుగురినీ చదివించారు. ఇద్దరూ కలిసి వ్యాపారంలో బాగా రాణించారు. నలుగురి పిల్లల విషయంలో చెల్లించిన స్కూలు ఫీజులు ఒక్కొక్కరు .. ఇద్దరి ఇద్దరి ఫీజులను క్లెయిమ్ చేసేవారు. ♦ఇద్దరు ఆడపిల్లల తర్వాత అబ్బాయి కోసం మూడో కాన్పుకి వెళ్లింది కాంతమ్మ. బాబు పుట్టాడు. ముగ్గుర్నీ చదివించింది ఆ జంట. ఎక్కువ ఆదాయం ఉన్న తండ్రి.. ఇద్దరు పిల్లల చదువుల ఫీజులను క్లెయిమ్ చేయగా.. మూడో సంతానం స్కూలు ఫీజుని కాంతమ్మగారు క్లెయిమ్ చేశారు. ♦ఇలా అవకాశం ఉన్నతవరకూ చట్టపరిధి దాటకుండా మీరు ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవచ్చు. చదవండి👉 ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! -
నోట్ల గుట్టల మాయగాడు.. కొత్త ట్విస్ట్
కాన్పూర్ అత్తరు వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో బయటపడ్డ నోట్ల గుట్టల సంగతి తెలిసిందే. మొత్తం రికవరీ 197 కోట్ల రూ. పైనే ఉండగా, ఆరు కోట్ల రూ. విలువైన బంగారం, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుంది డీజీజీఐ( Directorate General of GST Intelligence). అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఐటీ శాఖతో పీయూష్ ఒక ఒప్పందానికి వచ్చాడని, పన్నులు చెల్లింపు జరిగిపోయిందని, రేపో మాపో అతని విడుదలకు రంగం సిద్ధమైందంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. దాదాపు కోట్ల రూపాయలలో పన్నుల ఎగవేతకు సంబంధించిన నేరం కింద పీయూష్ జైన్‌పై కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పన్నుల బకాయిలకు సంబంధించి కొన్ని కోట్లను పీయూష్ చెల్లించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. సుమారు రూ. 52 కోట్ల రూపాయల్ని కోర్టులో డిపాజిట్ చేసినట్లు, ఇందుకు సంబంధించి ఒక అప్లికేషన్ సమర్పించినట్లు పీయూష్ తరపు న్యాయవాది వెల్లడించారు. దీంతో పీయూష్‌కు ఈ కేసు నుంచి ఉపశమనం లభించిందని, త్వరలో విడుదల కాబోతున్నట్లు నిన్నంతా ప్రచారం జరిగింది. అయితే తాజా కథనాలపై డీజీజీఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వివేక్ ప్రసాద్ స్పందించారు. ఆ చెల్లింపు కథనం, అతను బయటకు రాబోతున్నట్లు వస్తున్న కథనాల్లో అస్సలు నిజం లేదని తెలిపారు. అంతేకాదు ఆ రికవరీ సొమ్ము మొత్తం కూడా అతని బిజినెస్ టర్నోవర్ కాదని స్పష్టం చేశారు. ‘‘ఈ కథనాలు అన్నీ ఊహాగానాలే. ఎవరి ప్రమేయం వల్ల ఇలాంటి కథనాలు పుడుతున్నాయో తెలియదు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఎలాంటి దాపరికం ఉండదు. రికవరీ చేసిన సొమ్మునంతా ఎస్బీఐ సేఫ్ కస్టడీలో ఉంచాం’’ అని తెలిపారు. అలా అనలేదు.. మరోవైపు తాను అలా ప్రకటన ఇచ్చినట్లు వస్తున్న కథనాలపై జైన్ లాయర్ సుధీర్ మాలవియా స్పందించారు. తన క్లయింట్‌కు సంబంధించి పన్నుల ఎగవేతకు సంబంధించిన ఎమౌంట్ 32.5 కోట్ల రూ. దాకా ఉండొచ్చని ఒక అంచనా మాత్రమేనని, భవిష్యత్తులో అది మరింత పెరగవచ్చనే క్లారిటీ ఇచ్చారు. ఇక తన క్లయింట్ జీఎస్టీ అధికారులకు ప్రతిపాదన చేశాడనే (ట్యాక్స్, ఇతర ఖర్చులు మినహాయించుకుని తన డబ్బు ఇచ్చేయండంటూ పీయూష్ కోరాడని) కథనాల్ని సైతం లాయర్ ఖండించారు. పొలిటికల్ డ్రామా.. ఇదిలా ఉంటే పీయూష్ జైన్ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎస్పీ-బీజేపీ పరస్పర విమర్శలతో వివాదం రాజుకుంటోంది. అరెస్టయిన పీయూష్ జైన్ ఎస్పీ దగ్గరి నేత అని బీజేపీ ఆరోపిస్తుండగా.. ఎస్పీ నేత పీయూజ్‌రాజ్ జెయిన్కు బదులు పాపం బీజేపీ తమకు అనుకూలంగా ఉండే పీయూష్ జైన్‌పై పొరపాటున దాడులు నిర్వహించిందంటూ అఖిలేష్ యాదవ్ ప్రత్యారోపణలతో సెటైర్లు పేల్చారు. ఇక ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం పరోక్షంగా, నేరుగా అఖిలేష్‌పై ఈ వ్యవహారాన్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ఆదాయ శాఖ.. తాము సరిగ్గానే దాడులు చేశామని, తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రభావాలు లేవంటూ స్పష్టత ఇచ్చింది కూడా. ఇదిలా ఉంటే.. ఓ పాన్ మసాలా గోదాంపై దాడులు నిర్వహించిన ఐటీశాఖకు.. అక్కడ అత్తరు వ్యాపారి(పాన్ మసాలా బ్రాండ్లకు సైతం అత్తరు సరఫరా చేస్తాడు) పీయూష్ జైన్ తీగ దొరికింది. అది లాగడంతో మొత్తం డొంక కదిలింది. కన్నౌజ్‌లోని అత్తరువ్యాపారి పీయూష్ జైన్ ఇళ్లు, ఫ్యాక్టరీ, గోదాముల్లో సోదాలు నిర్వహించిన ఆదాయ శాఖ అధికారులు.. నోట్ల గుట్టల్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు వారం పాటు సాగిన తనిఖీల్లో కోట్ల రూపాయలు, బంగారు బిస్కెట్లు, కాస్ట్లీ సెంట్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫొటోలు బయటకు రావడంతో.. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆపై సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టం ఉల్లంఘన కింద డిసెంబర్ 26న అరెస్ట్‌చేయగా..ప్రస్తుతం పీయూష్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ సొమ్ము లెక్కలపై స్పష్టత కోసమే అతన్ని ప్రశ్నిస్తున్నాయి అధికార విభాగాలు. చదవండి: పీయూష్‌పై ఇంతకాలం అనుమానం ఎందుకు రాలేదంటే.. -
ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యుల వేతనంలో 30 శాతం కోత విధించే బిల్లును లోక్‌సభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. కోవిడ్-19తో తలెత్తిన అవసరాలను తీర్చే క్రమంలో ఎంపీల వేతనాల్లో రెండేళ్ల పాటు కోత విధిస్తూ పార్లమెంట్ సభ్యుల వేతనాలు, పెన్షన్ (సవరణ) బిల్లు, 2020కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇక నిత్యావసర వస్తువుల చట్టంలో సవరణలపై లోక్‌సభ చర్చిస్తోంది. బిల్లు సవరణలకు సభ ఆమోదం పొందేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరోవైపు డీజీసీఏ, ఏఏఐబీ, బీసీఏఎస్‌లకు చట్టపరమైన అధికారాలను కల్పించే ఎయిర్‌క్రాఫ్ట్ సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడం పట్ల పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి హర్షం వ్యక్తం చేశారు. చదవండి : ఎంపీలకు కరోనా పరీక్షలు ఈ బిల్లు ఆమోదంతో భారత పౌరవిమానయాన రంగంలో భద్రత మౌలికసదుపాయాలు మరింత బలోపేతమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఇక సరిహద్దు వివాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభలో ప్రకటన చేశారు. సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదని, భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత చల్లారలేదని పేర్కొన్నారు. చైనాతో సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నా సరిహద్దులను గుర్తించేందుకు చైనా నిరాకరిస్తోందని తెలిపారు. మన బలగాలు దేశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్నాయని, చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు భారత దళాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. చైనా మొండిగా వ్యవహరిస్తోందని, ఈ ఏడాది మే నుంచి సరిహద్దుల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించిందని వివరించారు. -
ఎస్బీఐ సేవింగ్స్ డిపాజిట్ రేట్ల కోత
న్యూఢిల్లీ: ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల్లోని డిపాజిట్ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విడుదలైన ప్రకటనలో ముఖ్యాంశాలు... ♦ సేవింగ్స్ డిపాజిట్లపై ప్రస్తుతమున్న 3 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గించింది. అన్ని సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లకూ ఇది వర్తిస్తుంది. తగినంత ద్రవ్య లభ్యత ఉండడం దీనికి కారణం. ♦ ఏప్రిల్ 15 నుంచీ ఇది అమల్లోకి వస్తుంది. ♦ ఇక నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను కూడా అన్ని కాలపరిమితులకు 35 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది. ♦ ఎంసీఎల్ఆర్ తగ్గింపు రేట్లు ఈ నెల 10వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయి. ♦ గృహ, వ్యక్తిగత, కార్పొరేట్, వాహన రుణాలకు అనుసంధానమయ్యే ఏడాది నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు 7.75 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గుతుంది. ♦ దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమయ్యే గృహ రుణ చెల్లింపుల విషయంలో 30 సంవత్సరాలకు సంబంధించి లక్షకు ఈఎంఐ దాదాపు రూ.24 తగ్గుతుంది. -
జగమొండి..!
వరంగల్ అర్బన్: ‘గ్రేటర్’ పరిధిలో ప్రజలందరూ పన్నులు కట్టాలి... మహా నగర అభివృద్ధికి తోడ్పడాలి.. అంటూ అధికారులు జోరుగా సందేశాలు ఇస్తున్నారు. అంతేకాదు.. సామాన్యుడి నుంచి మరీ ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్నారు. ఎవరైనా చెల్లించని పక్షంలో నల్లా కనెక్షన్ కట్..ఆస్తుల జప్తు.. వ్యాపార, వాణిజ్య సంస్థల సీజ్ అంటూ నడి రోడ్డుకు లాగి పరువు తీసిన ఘటనలు గతంలో కోకొల్లలు. ఇదే సమయంలో కొన్నేళ్లుగా రూ.కోట్లల్లో పన్ను బకాయిలు ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలపై మాత్రం ప్రేమ ఒలకబోస్తున్నారు. ఆర్థిక సంక్షోభం, నిర్వహణ ఖర్చుల భారం పేరిట ప్రజల్ని ఎడాపెడా బాదేస్తున్న మహా నగర పాలక సంస్థ.. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రావాల్సిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేయడంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి కేవలం 11 శాతం పన్నులు వసూలు కావడం గమనార్హం. దీనిపై గ్రేటర్ పాలకవర్గం సైతం స్పందించలేదు. ఈ నేపథ్యంలో గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బకాయిల రాక దేవుడికెరుక.. వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఆస్తులు 1,545 ఉన్నాయి. వీటి నుంచి జీడబ్ల్యూఎంసీకి ఆస్తి పన్ను కింద 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.99 కోట్లు.. కొన్నేళ్లుగా పేరుకుపోయిన బకాయిలు రూ.15.70 కోట్లు సమకూరాల్సి ఉంది. వడ్డీలు మినహాస్తే రూ.18.69 కోట్ల బకాయిలు ఉండగా.. గ్రేటర్ అధికారులు ఇప్పటివరకు రూ.2,15 కోట్లు మాత్రమే వసూలు చేశారు. ఇందులో సగానికి పైగా సొమ్ము ఆయా శాఖలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెల్లించినవే. నోటీసులతో సరి.. ఏళ్ల తరబడి బకాయిలు భారీగా పేరుకుపోతున్నా.. బల్దియా అధికారుల్లో కదలిక లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదో మొక్కుబడిగా అన్నట్లు.. ఏటా తాఖీదులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఏదైనా సమీక్ష సమావేశాల్లో ఉన్నతాధికారులు అడిగితే.. తాఖీదులు ఇచ్చామని సమాధానమిస్తున్నారే తప్ప.. బకాయిల అంశాన్ని తీవ్రంగా పరిగణించిన దాఖలాలు లేవు. అయితే.. ఈ ఏడాది బల్దియా పన్నుల విభాగం అధికారులు, సిబ్బంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పన్నులు చెల్లించాల్సిందేనంటూ ఏడాది పొడవునా ఒత్తిడి తీసుకొచ్చారు. నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ ఆయా ప్రభుత్వ శాఖల్లో చలనం లేకుండా పోయింది. ఇప్పటికైనా దృష్టి సారించాలి.. మరో 23 రోజులు గడిస్తే ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇప్పటికైనా మేయర్, కలెక్టర్, కమిషనర్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఆస్తి, నీటి పన్నుల వసూళ్లపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రతి శాఖ పన్ను చెల్లించే విధంగా ఒత్తిడి తేవాలి. పేరుకుపోయిన బకాయిలను రాబట్టగలిగితే ‘గ్రేటర్’ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి.. మహా నగర ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. బకాయిలు చెల్లించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు.. నిట్, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్, కేయూ, రైల్వే శాఖ, ప్రభుత్వ కాలేజీలు, రెవెన్యూ శాఖ, ఆర్అండ్బీ, పీడబ్ల్యూడీ, పంచాయతీ రాజ్, ప్రభుత్వ ఆస్పత్రులు, పోస్ట్ ఆఫీస్‌లు, హౌసింగ్ బోర్డు, ప్రభుత్వ స్కూళ్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, కోర్టు, టెలికాం, ఆల్ ఇండియా రేడియో, ట్రాన్స్‌కో, సీఆర్పీఎఫ్ పోలీస్, ఎఫ్‌సీఐ, ఇతర సర్కారు సంస్థల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. స్పెషల్ నోటీసులు ఇస్తాం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. కొన్ని శాఖల అధికారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ప్రత్యేక నోటీసులు జారీ చేసి వసూలు చేస్తాం. – శాంతికుమార్, టీఓ -
భారీగా తగ్గిన జీఎస్టీ ..!
18 శాతం: చూయింగ్ గమ్, చాకొలెట్లు, కాఫీ, మార్బుల్స్, గ్రానైట్లు, దంత సంబంధిత ఉత్పత్తులు, క్రీమ్‌లు, శానిటరీ ఉత్పత్తులు, లెదర్ వస్తువులు, కృత్రిమ ఉన్ని, విగ్గులు, కుక్కర్లు, స్టవ్‌లు, డిటర్జెంట్, వాషింగ్ పౌడర్, రేజర్లు, బ్లేడ్లు, కత్తులు, స్టోరేజ్ వాటర్ హీటర్లు, బ్యాటరీలు, చేతి వాచీలు, పరుపులు, వైర్లు, కేబుళ్లు, ఫర్నిచర్, షాంపూ, హెయిర్ క్రీమ్, హెయిర్ డై, మేకప్ వస్తువులు, ఫ్యాన్లు, ల్యాంపులు, రబ్బరు ట్యూబులు 28 నుంచి 18 శాతానికి చేరాయి. 12 శాతం: కండెన్స్డ్ మిల్క్, రిఫైన్డ్ చక్కెర, పాస్తా కర్రీ పేస్టు, మధుమేహ ఆహారం, మెడికల్ స్థాయి ఆక్సిజన్, ప్రింటింగ్ ఇంక్, హ్యాండ్ బ్యాగ్‌లు, టోపీలు, కళ్లద్దాల ఫ్రేమ్‌లు, వెదురు ఫర్నిచర్ మొదలైనవి 18 నుంచి 12 శాతానికి చేరాయి. 6 శాతం: ఆలూ పిండి, చట్నీ పౌడర్, పేలాల ఉండలు, చమురు వెలికితీతలో వెలువడే పొడి సల్ఫర్, ఫ్లై యాష్ 18 నుంచి 6 శాతానికి వచ్చాయి. 5 శాతం: ఇడ్లీ, దోశ తయారీ వస్తువులు, లెదర్, కొబ్బరి పీచు, చేపలు పట్టే వల, ఉన్ని దుస్తులు, కొబ్బరి తురుము 12 నుంచి 5 శాతానికి చేరాయి. గువార్ మీల్, హాప్కోన్, కొన్ని ఎండబెట్టిన కూరగాయలు, చేపలు, కొబ్బరి చిప్పలు, 5 శాతం నుంచి పన్ను రహిత పరిధిలోకి చేరాయి గువాహటి: వస్తు, సేవల పన్ను శ్లాబుల్లో జీఎస్టీ కౌన్సిల్ కీలక మార్పులు చేసింది. 28% పన్ను భారాన్ని తగ్గించింది. ఇప్పటివరకు 28% పన్ను పరిధిలో 228 వస్తువులుండగా వాటిని 50కి కుదించింది. అంటే 178 వస్తు, సేవలపై పన్నును 18% పరిధిలోకి మార్చింది. ఇప్పటివరకు ఏసీ రెస్టారెంట్లపై 18%, నాన్ ఏసీ రెస్టారెంట్లపై 12% జీఎస్టీ విధిస్తుండగా ఏసీ, నాన్ ఏసీ రెస్టారెంట్లపై పన్ను భారాన్ని 5% తగ్గించింది. ఈ మార్పులతో వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులు అందుబాటులోకి వస్తాయని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఈ మార్పులు తమ ఒత్తిడి కారణంగానే అని మాజీ కేంద్ర మంత్రి చిదంబరం పేర్కొనగా.. కేంద్రం అహంకారాన్ని తగ్గించుకుని వాస్తవ, సులభమైన పన్నును అందించాలని రాహుల్ సూచించారు. రెస్టారెంట్లకు భారీ లాభం ప్రస్తుతం నాన్–ఏసీ రెస్టారెంట్లలో భోజనంపై 12%, ఏసీ రెస్టారెంట్లలో 18% జీఎస్టీ అమలవుతోంది. వీటన్నింటికీ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ఉంటుంది. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను రెస్టారెంట్లు వినియోగదారులకు ఇవ్వట్లేదు. దీనిపై గువాహటి సమావేశంలో చర్చించిన మండలి ఏసీ, నాన్–ఏసీ రెస్టారెంట్లను 5% పరిధిలోకి తీసుకొచ్చి ఐటీసీని ఎత్తేసింది. 28 శాతంలో 50 వస్తువులే జీఎస్టీలో తాజా మార్పులకు ముందు 228 వస్తువులు 28% పన్ను పరిధిలో ఉండేవి. ఇందులో చాలావరకు నిత్యావసర వస్తువలున్నందున తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలో ఈ పన్ను పరిధిలోని మెజారిటీ వస్తువులను జీఎస్టీ మండలి 18% పరిధిలోకి తీసుకొచ్చింది. వెట్ గ్రైండర్లు, సాయుధ వాహనాలను 28 నుంచి 12%పరిధిలోకి తెస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటుగా.. ఆరు వస్తువులను 18 నుంచి ఐదు శాతానికి, ఎనిమిది వస్తువులను 12 నుంచి ఐదు శాతానికి మార్చిన మండలి.. ఆరు వస్తువులను ఐదు నుంచి పన్ను పరిధిలోనే లేకుండా నిర్ణయించింది. ప్రస్తుతం 28% పరిధిలో లగ్జరీ వస్తువులతోపాటు పాన్‌మసాలా, సిగరెట్లు, సిగార్లు, పొగాకు ఉత్పత్తులు, సిమెంట్, పెయింట్లు, పర్ఫ్యూమ్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలతోపాటుగా శీతల పానీయాలు మొదలైనవి మాత్రమే ఉన్నాయి. కొంతకాలంగా తగ్గించాలనుకుంటున్నాం జీఎస్టీ ద్వారా వ్యాపారులపై పడుతున్న భారం తగ్గించేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు జైట్లీ తెలిపారు. ‘జీఎస్టీ వ్యవస్థను స్థిరీకరించే ప్రయత్నాల్లో భాగంగా.. వివిధ వస్తువుల రేట్లను జీఎస్టీ మండలి సమీక్షిస్తూ వస్తోంది. చివరి మూడు సమావేశాల్లోనూ 28 శాతం పన్ను పరిధిపై చర్చ జరిగింది. ఇందులోని కొన్ని వస్తువులను 28 నుంచి 18 శాతానికి లేదా అంతకన్నా తక్కువకు మార్చాలని అనుకున్నాం’ అని జైట్లీ తెలిపారు. మార్చిన పన్ను పరిధి వల్ల ఏడాదికి రూ.20వేల కోట్ల నష్టం కలుగుతుందని బిహార్ ఉప ముఖ్య మంత్రి సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. పన్ను పరిధిలో లేని వారికి రిటర్న్స్ ఫైలింగ్ ఆలస్యమైతే ప్రస్తుతం రోజుకు రూ.200 జరిమానాను వసూలు చేస్తుండగా దీన్ని రూ.20 కు తగ్గిస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. జీఎస్టీ అమలు భారాన్ని తగ్గించేందుకు రిటర్న్‌ల ఫైలింగ్ విధానంలోనూ మార్పులు తీసుకొచ్చామన్నారు మిగిలిన వారికి ఈ జరిమానాను రోజుకు రూ.50కి మార్చామన్నారు. తయారీదారులు, వ్యాపారులపై ఒక్కోశాతం పన్ను రేటు కొనసాగుతుందని అధియా తెలిపారు. గతంలో రూ. 75 లక్షలున్న కాంపోజిట్ స్కీమ్ పరిమితిని రూ.1.5 కోట్లకు పెంచేలా చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. ఎమ్మార్పీపై అదనంగా జీఎస్టీ వసూలు చేయరాదన్నారు. విపక్షాలకు భయపడ్డారు: చిదంబరం న్యూఢిల్లీ: విపక్షాలు, ప్రజలనుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో భయపడిన కేంద్రం.. తప్పనిసరి పరిస్థితుల్లోనే జీఎస్టీలో మార్పులు చేసిందని కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శించారు. ‘నేటి జీఎస్టీ కౌన్సిల్ భేటీలో మార్పులుంటాయనేది ఊహించిందే ప్రభుత్వం భయపడింది. మా డిమాండ్లకు తలొగ్గింది’ అని అన్నారు. జీఎస్టీ కారణంగా మార్పు తీసుకొచ్చే మంచి అవకాశాన్ని దేశం కోల్పోయిందంటూ పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ బాదల్, కర్ణాటక మంత్రి కృష్ణగౌడ ఆరోపించారు. ‘మీ అసమర్థతను గుర్తించండి. పొగరును తగ్గించుకోండి. దేశ ప్రజల మాటను వినండి’ అని రాహుల్ విమర్శించారు. జీఎస్టీ విషయంలో కనీస ఆలోచన లేకుండా ఆర్థిక మంత్రి జైట్లీ నిర్ణయం తీసుకున్నారని యశ్వంత్ సిన్హా విమర్శించారు. -
వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీ కోత!
⇒ 50 శాతం నుంచి 33 శాతానికి తగ్గించాలని యోచన ⇒ దీనిపై నేడు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ యంత్రా లపై వివిధ వర్గాలకు ఇస్తున్న సబ్సిడీని తగ్గించేందుకు ప్రభుత్వం నడుం బిగిం చింది. ఇందులో భాగంగా బీసీ, ఓసీ, ఇతర వర్గాలకు ప్రస్తుతం ఇస్తున్న 50 శాతం సబ్సిడీని 33 శాతానికి తగ్గించాలని వ్యవ సాయశాఖ యోచిస్తోంది. దీనికి సంబం ధించి గతేడాదే ప్రతిపాదనలు సిద్ధమైనా అప్పట్లో విమర్శలు రావడంతో వెనకడుగు వేసింది. తాజాగా ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి మంగళవారం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, శాస్త్ర వేత్తలు సమావేశం కానున్నారు. ఈ సమా వేశంలో సబ్సిడీ తగ్గింపుపై నిర్ణయం తీసు కుంటామని వ్యవసాయశాఖ వర్గాలు తెలి పాయి. సబ్సిడీ తగ్గించాలని తాము ప్రభు త్వానికి ప్రతిపాదిస్తామని ఆ వర్గాలు చెబు తున్నాయి. అయితే ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే 95 శాతం సబ్సిడీని మాత్రం యథావిధిగా కొనసాగించాలని భావిస్తున్నారు. ఎక్కువ మందికి సబ్సిడీయే లక్ష్యం సబ్సిడీ తక్కువ ఇచ్చి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలనేదే తమ ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. 2017–18 బడ్జెట్లో వ్యవ సాయ యాంత్రీకరణకు ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించింది. కేంద్ర పథకాలు ఇతరత్రా మార్గాల ద్వారా మరికొన్ని నిధులు రానున్నాయి. ఆ ప్రకారం దాదాపు రూ. 450 కోట్ల వరకు వ్యవసాయ యాంత్రీకరణకు ఖర్చు చేసే అవకాశముంది. కాగా, నిధులు విడుదల చేయకుండా సబ్సిడీ తగ్గించి ఎక్కువ మందికి అందజేయాలన్న ఆలోచన ఏ మేరకు సబబంటూ పలువురు మండి పడుతున్నారు. రైతులకు భారం... ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తుం డటంతో రైతులు యాంత్రీకరణ వైపు వెళ్తు న్నారు. సబ్సిడీ తగ్గిస్తే పేద రైతులకు నష్టం తప్పదని అంటున్నారు. ఉదాహరణకు స్ప్రేయర్ల ధర మార్కెట్లో రూ.16 వేల వరకు ఉన్నాయి. దాన్ని ఇప్పటివరకు 50 శాతం సబ్సిడీతో రూ.8 వేలకు పొందే అవకాశం రైతులకు ఉంది. సబ్సిడీని 33 శాతానికి పరిమితం చేస్తే రైతుపై అదనపు భారం తప్పదు. ఇలా అనేక పరికరాలపై ఉన్న సబ్సిడీకి కోత వేయనున్నారని సమాచారం. -
రూ. 10,000 కోట్లు రాయితీల్లో కోత ఇదీ...
ఆహార సబ్సిడీ రూ.1.39 లక్షల కోట్ల నుంచి రూ.1.34 లక్షల కోట్లకు న్యూఢిల్లీ: ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై రాయితీలను వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో నాలుగు శాతానికి పైగా తగ్గించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సబ్సిడీ బిల్లు కింద 2,31,781.61 కోట్లు కేటాయించారు. 2015-16 సంవత్సరంలో సబ్సిడీ బిల్లు సవరించిన అంచనాల ప్రకారం 2,41,856.58 కోట్లుగా ఉండగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని దాదాపు 10 వేల కోట్ల రూపాయల మేర తగ్గించారు. 2015-16 లో ఆహార సబ్సిడీ బిల్లు రూ. 1,39,419 కోట్లుగా ఉండగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దానిని రూ. 1,34,834.61 కోట్లకు తగ్గించారు. అలాగే.. ఎరువుల సబ్సిడీని రూ. 72,437.58 కోట్ల నుంచి రూ. 70,000 కోట్లకు, పెట్రోలియం సబ్సిడీని రూ. 30,000 కోట్ల నుంచి వచ్చే ఏడాదిలో రూ. 26,947 కోట్లకు కుదించారు. ♦ వచ్చే ఏడాది ఎరువుల సబ్సిడీకి 70 వేల కోట్లు కేటాయింపులు జరిపారు. అందులో యూరియా సబ్సిడీకి రూ. 51,000 కోట్లు, అనియంత్రిత ఫాస్ఫరిక్, పొటాసిక్ ఎరువులకు రూ. 19,000 కోట్లు కేటాయించారు. ♦ యూరియా సబ్సిడీ రూ. 51 వేల కోట్లలో.. రూ. 40 వేల కోట్లను దేశీయ యూరియాకు, మిగతా మొత్తాన్ని దిగుమతి చేసుకునే యూరియాకు సబ్సిడీగా పేర్కొన్నారు. ♦ అనియంత్రిత పాస్ఫరిక్, పొటాసిక్ ఎరువులకుకేటాయించిన రూ. 19 వేల కోట్లలో దేశీయంగా ఉత్పత్తి చేసే ఎరువులకు రూ. 12 వేల కోట్లు, దిగుమతి చేసుకునే ఎరువులకు రూ. 6,999.99 కోట్లు కేటాయించారు. ఇందులోనే సిటీ కంపోస్ట్ ఉత్పత్తికి సాయంగా రూ. 1 లక్ష కేటాయించారు. ♦ పెట్రోలియం సబ్సిడీ కింద రూ. 26,947 కోట్లు కేటాయించగా.. అందులో రూ. 19,802.79 కోట్లు ఎల్పీజీ సబ్సిడీ కింద, మిగతా మొత్తాన్ని కిరోసిన్ సబ్సిడీ కింద కేటాయింపులు జరిపారు.