⇒ 50 శాతం నుంచి 33 శాతానికి తగ్గించాలని యోచన
⇒ దీనిపై నేడు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ యంత్రా లపై వివిధ వర్గాలకు ఇస్తున్న సబ్సిడీని తగ్గించేందుకు ప్రభుత్వం నడుం బిగిం చింది. ఇందులో భాగంగా బీసీ, ఓసీ, ఇతర వర్గాలకు ప్రస్తుతం ఇస్తున్న 50 శాతం సబ్సిడీని 33 శాతానికి తగ్గించాలని వ్యవ సాయశాఖ యోచిస్తోంది. దీనికి సంబం ధించి గతేడాదే ప్రతిపాదనలు సిద్ధమైనా అప్పట్లో విమర్శలు రావడంతో వెనకడుగు వేసింది. తాజాగా ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి మంగళవారం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, శాస్త్ర వేత్తలు సమావేశం కానున్నారు. ఈ సమా వేశంలో సబ్సిడీ తగ్గింపుపై నిర్ణయం తీసు కుంటామని వ్యవసాయశాఖ వర్గాలు తెలి పాయి. సబ్సిడీ తగ్గించాలని తాము ప్రభు త్వానికి ప్రతిపాదిస్తామని ఆ వర్గాలు చెబు తున్నాయి. అయితే ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే 95 శాతం సబ్సిడీని మాత్రం యథావిధిగా కొనసాగించాలని భావిస్తున్నారు.
ఎక్కువ మందికి సబ్సిడీయే లక్ష్యం
సబ్సిడీ తక్కువ ఇచ్చి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలనేదే తమ ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. 2017–18 బడ్జెట్లో వ్యవ సాయ యాంత్రీకరణకు ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించింది. కేంద్ర పథకాలు ఇతరత్రా మార్గాల ద్వారా మరికొన్ని నిధులు రానున్నాయి. ఆ ప్రకారం దాదాపు రూ. 450 కోట్ల వరకు వ్యవసాయ యాంత్రీకరణకు ఖర్చు చేసే అవకాశముంది. కాగా, నిధులు విడుదల చేయకుండా సబ్సిడీ తగ్గించి ఎక్కువ మందికి అందజేయాలన్న ఆలోచన ఏ మేరకు సబబంటూ పలువురు మండి పడుతున్నారు.
రైతులకు భారం...
ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తుం డటంతో రైతులు యాంత్రీకరణ వైపు వెళ్తు న్నారు. సబ్సిడీ తగ్గిస్తే పేద రైతులకు నష్టం తప్పదని అంటున్నారు. ఉదాహరణకు స్ప్రేయర్ల ధర మార్కెట్లో రూ.16 వేల వరకు ఉన్నాయి. దాన్ని ఇప్పటివరకు 50 శాతం సబ్సిడీతో రూ.8 వేలకు పొందే అవకాశం రైతులకు ఉంది. సబ్సిడీని 33 శాతానికి పరిమితం చేస్తే రైతుపై అదనపు భారం తప్పదు. ఇలా అనేక పరికరాలపై ఉన్న సబ్సిడీకి కోత వేయనున్నారని సమాచారం.
వ్యవసాయ యంత్రాలపై సబ్సిడీ కోత!
Published Tue, Apr 4 2017 2:12 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement